నేను తప్పు చేశాను, మరేం పర్లేదు: శిల్పాశెట్టి | Shilpa Shetty Shared New Post About Made a Mistake | Sakshi
Sakshi News home page

Shilpa Shetty: కొత్త తప్పులు చేస్తానంటున్న శిల్పాశెట్టి!

Published Fri, Aug 27 2021 3:42 PM | Last Updated on Fri, Aug 27 2021 6:36 PM

Shilpa Shetty Shared New Post About Made a Mistake - Sakshi

Shilpa Shetty Admitted to Making a Mistake: పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా అరెస్టు అయిన తర్వాత ఆయన భార్య, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. తన ఇమేజ్‌ డ్యామేజ్‌ అవడంతో మీడియా ముందుకు కూడా రావడానికి ఇష్టపడటం లేదు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ మధ్య ఇన్‌స్పిరేషనల్‌ కోట్స్‌ షేర్‌ చేస్తోంది. తాజాగా ఆమె ఓ పుస్తకంలో మిస్టేక్స్‌ అని రాసున్న అధ్యాయంలోని పేజీని షేర్‌ చేసింది.

"చేసిన తప్పులకు జీవితాంతం మూల్యం చెల్లించాల్సిందే- సోఫియా లారెన్‌. చిన్నపాటి తప్పులు కూడా చేయకుండా మన జీవితాన్ని ఆసక్తికరంగా మలుచుకోలేం. అయితే ఆ తప్పులు భయంకరంగా, ఇతరులను బాధించేలా ఉండకూడదు. మిస్టేక్స్‌ ఎప్పుడూ ఉంటాయి. అవి మనకి సవాలు విసిరేలాగా, ఉత్తేజపరిచే అనుభవాలుగా, ఆసక్తికరంగా, లేదా వాటిని మర్చిపోయేదిగా ఉండాలి. చేసిన తప్పుల నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి.

'కాబట్టి.. నేను తప్పులు చేయబోతున్నా.. అయితే ఆ తప్పుల నుంచి నన్ను నేను క్షమించుకుని, వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాను" అని రాసున్న పేజీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో యాడ్‌ చేసింది. నేను తప్పు చేశాను. అయినా ఏం పర్లేదు అని ఈ పోస్టుపై రాసుకొచ్చింది. మిస్టేక్స్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన శిల్పాశెట్టి తను చేసిన తప్పేంటి? అన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement