
బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై తాజాగా కేసు నమోదు అయింది. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు బోగస్ బంగారం పథకంతో తనను మోసగించారని ఓ వ్యాపారి కొన్నేళ్ల క్రితం ఫిర్యాదు ఫిర్యాదు చేశాడు. వారు స్థాపించిన సత్‌యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వార తాము మోసపోయినట్లు వారు పేర్కొన్నారు. శిల్పా శెట్టి దంపతులపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టుకు కూడా వెళ్లారు.

శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేయాలని ముంబై అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్.పి. మెహతా ఆదేశించారు. వారు స్థాపించిన సత్‌యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మోసం జరిగినట్లు అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి వెళ్లడించారు. ఆ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు జడ్జి ధ్రువీకరించారు.
2014లో సత్‌యుగ్ గోల్డ్ సంస్థ కొత్తగా గోల్డ్ స్కీమ్‌ను ప్రకటించింది. మేరా గోల్డ్ ప్లాన్‌లో నెల నెలా అత్యంత తక్కువగా రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా కస్టమర్లు కట్టే మొత్తానికి సంబంధించి వారి అకౌంట్లో అప్పటి బంగారం రేటును బట్టి అంత మొత్తం పసిడిని (నాలుగు దశాంశ స్థానాల దాకా) కంపెనీ జమ చేస్తుందని అప్పట్లో వారు ఊదరగొట్టారు. దానిని నమ్మిన చాలామంది అందులో చేరారు.

2014లో సచిన్ జోషి అనే ఎన్నారై శిల్పా శెట్టి దంపతులకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ స్కీమ్‌లో చేరాడు. ఐదేళ్ల సమయంలో రూ.18.58 లక్షలతో కిలో బంగారం కొన్నట్లు సచిన్ జోషి తెలిపాడు. కాలపరిమితి తర్వాత 2019లో దానిని రిడీమ్ చేసుకునేందుకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న సత్యయుగ్ కంపెనీ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ క్లోజ్డ్ బోర్డు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కంపెనీ గురించి విచారిస్తే శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కంపెనీ డైరెక్టర్లుగా 2017లో రాజీనామా చేసినట్లు తెలుసుకున్నాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న ఆయన కోర్డు మెట్లు ఎక్కాడు. ఇప్పుడు పూర్తి ఆధారాలతో శిల్పా శెట్టిపై మోసం కేసు నమోదు అయింది.
Comments
Please login to add a commentAdd a comment