Shilpa Shetty
-
అశ్లీల చిత్రాల కేసు.. శిల్పాశెట్టి భర్తకు ‘ఈడీ’ నోటీసులు
ముంబయి:వ్యాపారవేత్త,బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. సంచలనం సృష్టించిన అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ రాజ్‌కుంద్రాకు నోటీసులిచ్చింది.కాగా,ఇటీవలే రాజ్‌కుంద్రాకు సంబంధించిన పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు పిలవడం గమనార్హం. -
ఈ కేసులో శిల్పాశెట్టి ఫోటోలు ఉపయోగిస్తే చర్యలే: లాయర్
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన ఆఫీసులు, నివాసాల్లో ఈడీ దాడులు జరుగుతున్నాయని వచ్చిన వార్తల్లో నిజంలేదని శిల్పాశెట్టి లాయర్ ప్రకటించారు. అశ్లీల చిత్రాల నిర్మాణ, ప్రసారానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో లాయర్ వివరణ ఇచ్చారు. ఎలాంటి కేసులో ఆమెకు సంబంధంలేదని లాయర్ క్లారిటీ ఇచ్చారు. తప్పడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.రాజ్ కుంద్రా ఆఫీసులపై ఈడీ దాడులు అంటూ మీడియాలో వచ్చిన కథనాలకు ఆయన సతీమణి శిల్పాశెట్టి లాయర్ ఇలా స్పందించారు. ' నా క్లయింట్ ఇంట్లో ,ఆఫీసులలో ఎలాంటి ఈడీ సోదాలు జరగలేదు. రాజ్ కుంద్రాకు సంబంధించిన కేసు కోర్టులో విచారణ జరుగుతుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రాజ్ కుంద్రా కూడా విచారణకు సహకరిస్తున్నారు. రాజ్ కుంద్రా ఇంట్లో ఈడీ సోదాలు అంటూ ప్రచారం చేస్తూ.. నా క్లయింట్ శిల్పాశెట్టి ఫోటోలు, వీడియోలను మీడియాలో ఉపయోగించకండి. ఈ కేసులతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. భవిష్యత్‌లో ఎవరైనాసరే ఈ కేసులో శిల్పాశెట్టి పోటోలు ఉపయోగిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.' అని లాయర్ హెచ్చరించారు.వ్యాపారవేత్త రాజ్ కుంద్రా 2021లో నీలి చిత్రాల కేసులో కొంతకాలం పాటు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడని ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు. సినిమాలలో ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి కొందరి యువతులను టార్గెట్ చేసి వారి ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
అశ్లీల చిత్రాల కేసు.. రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ సోదాలు
ఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన ఆఫీసులు, నివాసాల్లో ఈడీ దాడులు జరుగుతున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మాణ, ప్రసారానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాజ్ కుంద్రా అనుచరుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు.ఇకపోతే.. అశ్లీల చిత్రాలు నిర్మించి వాటిని ప్రసారం చేశారనే ఆరోపణలపై రాజ్ కుంద్రాను 2021 అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో కుంద్రా రెండు నెలల పాటు జైలు జీవితం గడిపారు. 2021 సెప్టెంబర్‌లో కుంద్రాకు బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక, ఈ కేసులో రాజ్ కుంద్రానే కుట్రదారుడు అంటూ ముంబై పోలీసు అధికారులు ఆరోపించారు.మరోవైపు.. పోలీసుల చార్జ్ షీట్ ప్రకారం.. సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చిన యువతలతో కుంద్రా అశ్లీల చిత్రాలు నిర్మించినట్టు తెలిపారు. దీంతో, పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణ నేపథ్యంలో తాజాగా ఈడీ అధికారుల.. ముంబై సహా యూపీలోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. -
50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్ వర్కౌట్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ...ఈ పేరు వినగానే శిల్వం లాంటి ఆమె శరీర ఆకృతి గుర్తు వస్తుంది. శిల్పాశెట్టి పెద్ద ఫిట్నెస్ ఫ్రీక్. అందుకే యాభైయ్యవ పడి దగ్గరపడుతున్నా టోన్డ్, ఫిట్ బాడీతో 90వ దశకంలో ఎంత ఫిట్‌గా, అందంగా ఉందో ఇప్పటికీ అదే సౌష్టవాన్ని మెయింటైన్ చేస్తోంది. మరోవిధంగా చెప్పాలంటే అంతకు మించి. చక్కని ఆహార అలవాట్లు, చక్కటి వ్యాయామమే ఆమె సౌందర్య రహస్యం. ఇప్పటికీ యోగాసనాలతో అభిమానులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. తాజా మండే మోటివేషన్ అంటూ ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. స్విస్ బాల్లో ప్రోన్ రివర్స్ హైపర్ల గురించి ఈ వీడియోలో తెలిపింది శిల్పా శెట్టి.. ఇది చాలా సింపుల్. వెన్నుముక, పిరుదులకు చాలా బలమైన వ్యాయామం ఇది. అదే సమయంలో బాలెన్స్‌ను కాపాడుకోవడానికి కూడా మంచిది. జీవితంలో, వృత్తిలో, రెండింటిలో బలాన్ని పెంపొందించడానికి, సమన్వయాన్ని మెరుగుపరచడాని, స్టెబిలిటీకి చాలా మంచిది అంటూ ఈ వ్యాయామం గురించి చెప్పుకొచ్చింది. మీ రొటీన్లో ఎక్స్‌ర్‌సైజ్‌లో 15-20 సార్లు మధ్యలో 45 సెకన్లపాటు విరామం తీసుకుని మూడుసార్లు చేయాలని వివరించింది. చిన్ని చిన్న అడుగులతోనే పురోగతి మొదలవుతుంది అనే సందేశాన్ని కూడా ఫ్యాన్స్‌కు ఇచ్చేసింది. అంతేకాదు కార్తీక సోమవారం సందర్బంగా ఉజ్జయినిలోని మహాకాల్ నగరంలో పరమశివుణ్ణి దర్శించుకుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన బాబా మహాకాల్ జ్యోతిర్లింగం వద్ద భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. ఈ విషయాలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. (గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్ చెబితే ‘ఏప్రిల్ పూల్’ అనుకుంది..చివరికి! ) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
స్టార్ హీరోయిన్ హోటల్లో చోరి.. ఫైర్ అయిన కస్టమర్
బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్లో భారీ చోరీ జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ముంబైలోని పలు ప్రాంతాల్లో బాస్టియన్ పేరుతో ఆమె రెస్టారెంట్స్ నిర్వహిస్తున్నారు. దాదర్‌లోని కోహినూర్ స్క్వేర్ బేస్మెంట్ పార్కింగ్‌లో ఉన్న కారు చోరీకి గురైంది. ఒక నివేదిక ప్రకారం.. బాంద్రాకు చెందిన రుహాన్ ఖాన్ అనే వ్యాపారవేత్త తన స్నేహితులతో బాస్టియన్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో తన కారును అక్కడే వ్యాలెట్ పార్క్ చేశాడు. స్నేహితులతో కలిసి డిన్నర్ పూర్తి అయిన తర్వాత వాలెట్ నుంచి తన కారును తీసుకురావాలని ఖాన్ కోరాడు. అయితే, పార్కింగ్ చేసిన ప్రదేశంలో కారు లేదు. దీంతో దొంగతనం జరిగిందని వారు గుర్తించారు. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది CCTV ఫుటేజీని పరిశీలించారు.ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు జీప్ కంపాస్ వాహనంలో తెల్లవారుజామున 2 గంటలకు బేస్మెంట్లోకి ప్రవేశించినట్లు వెల్లడైంది. వారిలో ఒకరు ఖాన్‌కు సంబంధించిన BMW Z4 కన్వర్టిబుల్ కారును చోరి చేశారని తేలింది. కారును అన్‌లాక్ చేయడానికి అధునాతన హ్యాకింగ్ పద్ధతులను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆ కారు ధర సుమారు రూ. 90 లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం.కారు ఓనర్ CCTV ఫుటేజీ ఆధారంగా శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్ భద్రతా చర్యలపై ఖాన్ ఫైర్ అయ్యాడు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరాడు. ఇంత సంఘటన జరిగినప్పటికీ, శిల్పా శెట్టి ఈ విషయంపై మౌనంగా ఉన్నారని ఆయన తప్పుపట్టారు. -
కార్వా చౌత్ వేడుకల్లో మెరిసిన బాలీవుడ్ సినీతారలు.. ఫోటోలు
-
భర్త క్షేమం కోసం...
డిజైనర్ చీరలు, చుడీదార్లు, గౌనులు, నగలు, నుదుట ఎర్రని సింధూరం, చేతులకు మెహిందీతో కొందరు బాలీవుడ్ తారలు చాలా అందంగా ముస్తాబయ్యారు. కర్వా చౌత్ పండగ సందర్భంగా ఈ తారలు ఇలా కళకళలాడారు. ఈ పండగకు భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడు కనిపించాక, భర్త ముఖాన్ని జల్లెడలోంచి చూసిన తర్వాతే భోజనం చేస్తారు. ఉత్తరాదినపాటించే ఆచారం ఇది. ఈ కర్వా చౌత్‌కి బాలీవుడ్లో ఇలా భర్త క్షేమం కోసం ఉపవాసం ఆచరించి, పూజ చేశారు కొందరు తారలు. ఆ విశేషాల్లోకి...‘‘నీ ఆయురారోగ్యాల కోసం ఈరోజు మాత్రమే కాదు.. ప్రతి రోజూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను... కర్వా చౌత్ శుభాకాంక్షలు. మన శాశ్వతమైన ప్రేమకు, మన బలమైన బంధానికి చిహ్నంగా ఈ మంగళసూత్రం ఓ గుర్తు’’ అంటూ భర్త జహీర్ ఇక్బాల్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు సోనాక్షీ సిన్హా. నటుడు జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షీ వివాహం ఈ ఏడాది జూన్‌లో జరిగింది. తొలి కర్వా చౌత్‌ను ఇష్టంగా జరుపుకున్నారు సోనాక్షి. ఇక ఈ ఏడాది తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో రకుల్ ప్రీత్‌సింగ్ ఉన్నారు. నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది.కాగా ఇటీవల వర్కౌట్ చేస్తుండగా రకుల్‌కి గాయమైంది. వెన్నెముకకు గాయం కావడంతో ఆమె బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. అయితే కర్వా చౌత్ సందర్భంగా చేతికి భర్త పేరులోని ‘జె’ అక్షరం, ఒక పువ్వు డిజైన్‌తో మెహిందీ పెట్టించుకుని, ‘బెడ్ రెస్ట్వాలా ఫస్ట్ కర్వా చౌత్’ అంటూ ఆ ఫొటోను షేర్ చేశారు రకుల్. అలాగే అదితీ రావ్ హైదరీకి కూడా ఇది తొలి కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ తో అదితి వివాహం ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగింది. ఇంకా తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో కృతీ కర్భందా ఉన్నారు. నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో ఆమె పెళ్లి ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఇక కియారా అద్వానీకి ఇది రెండో కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె వివాహం జరిగింది.రెండో కర్వా చౌత్‌కి భర్త పేరులోని ‘ఎస్ఎమ్’ అక్షరాలను మెహిందీ డిజైన్‌గా పెట్టించుకుని, ఆ ఫొటోను, జల్లెడలోంచి భర్త ముఖాన్ని చూస్తున్న ఫొటోలను షేర్ చేశారు కియారా. పరిణీతీ చో్ర΄ాకి కూడా ఇది రెండో కర్వా చౌత్. గత ఏడాది సెప్టెంబర్‌లో రాఘవ్ చద్దాతో ఆమె వివాహం జరిగింది. చేతి వెనకాల రెండు హార్ట్ సింబల్స్‌తో మెహిందీ పెట్టించుకున్న ఫొటోను షేర్ చేశారు పరిణీతి. మరోవైపు సోనమ్ కపూర్ కూడా భర్త ఆనంద్, కుమారుడు వాయు పేర్లను మెహిందీ డిజైన్‌గా పెట్టించుకుని, ఆ ఫొటోను షేర్ చేశారు. 2018లో ఆనంద్, సోనమ్‌ల వివాహం జరిగింది.అయితే ఫాస్టింగ్ ఉండనని, ఈ పండగ సందర్భంగా మెహిందీ పెట్టించుకోవడం, రుచికరమైన వంటకాలు తినడం ఇష్టం అని పేర్కొన్నారు సోనమ్. కాగా నటుడు అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ ప్రతి ఏడాదీ ఘనంగా కర్వా చౌత్ జరుపుకుంటారు. అందర్నీ ఆహ్వానిస్తుంటారు కూడా. ఈ ఏడాది శిల్పా శెట్టి, రవీనా టాండన్ వంటివారు సునీతతో కలిసి ఆమె ఇంట్లో పండగ చేసుకున్నారు. ఇలా కర్వా చౌత్ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖుల సందడి జోరుగా కనిపించింది. -
శిల్పాశెట్టి దంపతులకు భారీ ఊరట కల్పించిన కోర్టు
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ కేసు విషయంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి , రాజ్‌కుంద్రా దంపతులకు కాస్త ఊరట లభించింది. మనీలాండరింగ్ మోసాలకు పాల్పడ్డారని వారి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా, ఫామ్‌హౌస్‌ను అక్టోబర్ 13వ తేదీలోపు ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో వాటిని సవాలు చేస్తూ.. కొద్దిరోజుల క్రితం ఈ జంట ముంబై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా వారి పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. దీంతో శిల్పాశెట్టి దంపతులకు కాస్త ఊరట లభించింది.ఈ కేసు గురించి తాజాగా శిల్పాశెట్టి దంపతుల తరఫు న్యాయవాది ఇలా వివరణ ఇచ్చారు. 2017లో జరిగిన 'గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్'తో తన క్లయింట్స్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. శిల్పాశెట్టి దంపతుల ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. అయినా ఈడీ పరిధిలో ఈ కేసు లేదని చెప్పారు. అయినప్పటికీ తమ క్లయింట్స్ ఈ కేసు విషయంలో ఈడీ అధికారులకు సహకరిస్తారని పేర్కొన్నారు.బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్‌కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా 285 బిట్కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం వాటి విలువ రూ. 150 కోట్లు పైమాటేనని అంచనా ఉంది. ఈ క్రమంలోనే వారి ఆస్తులను ఈడీ జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేసింది. -
పాలనురుగు చీరలో పాలరాతి శిల్పం!..మూత్యాల బ్లౌజ్ ధర ఏకంగా..!
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి ఒకప్పటి యూత్ కలల దేవత. టాలీవుడ్లో సాగరకన్యలా మెరిసి తెలుగు అభిమానుల మన్నలను పొందిన శిల్పా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదుపదుల వయసులో కూడా యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామర్‌గా పేరుకు తగ్గట్టు శిల్పంలా ఉంటుంది. ఏ ఉలి ఈమెను ఇంత అందంగా చెక్కాడో అన్నట్లు ఉంటుంది ఆమె శరీరాకృతి. ఫ్యాషన్‌పరంగా కూడా ఆమె తనదైన శైలిలో ఉంటుంది. ఆమె ధరించే ప్రతి డిజైనర్ వేర్ అద్భుతం అన్నంతగా క్రేజీగా ఉంటాయి. వాటి ధర కూడా కళ్లబైర్లు కమ్మే రేంజ్లో పలుకుతాయి. తాజాగా శిల్పా "సౌదీ సెలబ్రేటింగ్ ది హార్ట్ ఆఫ్ అరేబియా" ఈవెంట్లో పాలరాతి శిల్పంలా మెరిసింది. పాల నురుగు షిఫాన్ చీరలో దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య మాదిరిగా ఆమె ఆహార్యం ఉంది. ఆ తెల్లటి చీరకు తగ్గట్టు ముత్యాలతో డిజైన్ చేసిన చీర శిల్ప లుక్‌ని మరింత ప్రకాశవంతంగా కనిపించేలా చేసింది. ఈ డిజైనర్ వేర్ ఆమె ఫ్యాషన్ శైలి ఏంటన్నది చెబుతోంది. శిల్ప ధరించిన ముత్యాల బ్లౌజ్ ధర ఏకంగా రూ.139,000 పలుకుతోంది. ఈ ఖరీదు బ్లౌజ్ డిజైనింగ్‌లోని క్లిష్టమైన హస్తకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది. అందుకు తగ్గట్టు మంచలాంటి మేకప్, ముత్యాల బ్రాస్లెట్, పాపిడి బొట్టుతో ఫ్యాషనికి ఐకాన్‌గా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.(చదవండి: 'స్లీప్‌మాక్సింగ్': నిద్రను కూడా కొనుక్కునే దుస్థితా..?) -
‘‘గన్నూ రాజాకు బై..బై..!’’ ముద్దుల తనయతో శిల్పాశెట్టి డ్యాన్స్ అదుర్స్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ప్రతీ ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే ఈ సారి తన ముద్దుల తనయతో కలిసి చేసిన నృత్యం హృద్యంగా నిలిచింది. భర్త రాజ్ కుంద్రా, పిల్లలతో కలిసి గణపతి విసర్జన ఆచారాలను నిర్వహించి, ధోల్ దరువులకు ఆనందంగా నృత్యం చేశారు.దీనికి సంబంధించిన వీడియో గణపతి భక్తులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కుమార్తె సమీషాతో కలిసి విసర్జన్ పూజ కోసం ట్విన్నింగ్ లెహంగా-చోలీలో ఉత్సాహంతా డ్యాన్స్ చేసి అలరించారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)అంతకుముందు గణపతి బప్పాకు ఇంటికి సాదరంగా ఆహ్వానించి, భక్తిశ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించారు శిల్పాశెట్టి దంపతులు. ఆ తరువాత అందమైన సాంప్రదాయ దుస్తుల్లో గణపతికి వీడ్కోలు పలికారు. భర్త రాజ్ కుంద్రా, పిల్లలు వియాన్, సమీషా, సోదరి షమితా శెట్టి, తల్లి సునందతో కలిసి ఇష్టదైవం హారతి ఇచ్చి, గణపతిబప్పా మోరియా అంటూ ఆనందోత్సాహాల మధ్య వీడ్కోలు పలికారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) "మా గన్ను రాజాకు వీడ్కోలు చెప్పడం అంత సులభం కాదు, అత్యంతభక్తి, ప్రేమతో నిండి ఉన్నాం. కానీ భారమైన హృదయాలతో వీడ్కోలుపలుకుతున్నాం, వచ్చే ఏడాది మిమ్మల్ని స్వాగతించేందుకు ఎదురు చూస్తూ..’’ అంటూ శిల్పా ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్శిల్పాశెట్టి ఘనంగా నిర్వహించిన గణపతి వేడుకలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్,ఆమె భర్త జాకీ భగ్నానీ సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. -
గోల్డ్ స్కీమ్ పేరుతో మోసం..శిల్పా శెట్టిపై కేసు నమోదు
బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై తాజాగా కేసు నమోదు అయింది. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు బోగస్ బంగారం పథకంతో తనను మోసగించారని ఓ వ్యాపారి కొన్నేళ్ల క్రితం ఫిర్యాదు ఫిర్యాదు చేశాడు. వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వార తాము మోసపోయినట్లు వారు పేర్కొన్నారు. శిల్పా శెట్టి దంపతులపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టుకు కూడా వెళ్లారు.శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేయాలని ముంబై అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్.పి. మెహతా ఆదేశించారు. వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మోసం జరిగినట్లు అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి వెళ్లడించారు. ఆ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు జడ్జి ధ్రువీకరించారు.2014లో సత్యుగ్ గోల్డ్ సంస్థ కొత్తగా గోల్డ్ స్కీమ్‌ను ప్రకటించింది. మేరా గోల్డ్ ప్లాన్‌లో నెల నెలా అత్యంత తక్కువగా రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా కస్టమర్లు కట్టే మొత్తానికి సంబంధించి వారి అకౌంట్లో అప్పటి బంగారం రేటును బట్టి అంత మొత్తం పసిడిని (నాలుగు దశాంశ స్థానాల దాకా) కంపెనీ జమ చేస్తుందని అప్పట్లో వారు ఊదరగొట్టారు. దానిని నమ్మిన చాలామంది అందులో చేరారు.2014లో సచిన్ జోషి అనే ఎన్నారై శిల్పా శెట్టి దంపతులకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ స్కీమ్‌లో చేరాడు. ఐదేళ్ల సమయంలో రూ.18.58 లక్షలతో కిలో బంగారం కొన్నట్లు సచిన్ జోషి తెలిపాడు. కాలపరిమితి తర్వాత 2019లో దానిని రిడీమ్ చేసుకునేందుకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న సత్యయుగ్ కంపెనీ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ క్లోజ్డ్ బోర్డు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కంపెనీ గురించి విచారిస్తే శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కంపెనీ డైరెక్టర్లుగా 2017లో రాజీనామా చేసినట్లు తెలుసుకున్నాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న ఆయన కోర్డు మెట్లు ఎక్కాడు. ఇప్పుడు పూర్తి ఆధారాలతో శిల్పా శెట్టిపై మోసం కేసు నమోదు అయింది. -
ఓటేసేందుకు మూడు కోట్ల కారులో వచ్చిన హీరోయిన్!
సెలబ్రిటీలు అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఇక వాళ్ల లైఫ్ అంతా లగ్జరీ స్టైలే. సినీతారలు ఎక్కడికెళ్లినా కెమెరాల కళ్లన్నీ వారిపైనే ఉంటాయి. దీంతో వారు బయటికి వచ్చారంటే ఆ రేంజ్ వేరే లెవల్లో ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఇవాళ దేశవ్యాప్తంగా ఐదో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్ర, యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయిలోని బాలీవుడ్ ప్రముఖులు అంతా ఓటు వేసేందుకు క్యూ కట్టారు. పలువురు అగ్రతారలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే బాలీవుడ్ భామ శిల్పాశెట్టి సైతం తన ఓటును వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చింది. తన తల్లి సునంద, సోదరి షమితతో కలిసి ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్ కారులో ఓటు వేసేందుకు వచ్చారు. ఆమె ఇటీవలే ఆ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.కాగా.. శిల్పా చివరిగా రోహిత్ శెట్టి తొలి వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్‌లో కనిపించింది, ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా మరియు వివేక్ ఒబెరాయ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
శిల్పాశెట్టి దంపతుల ఆస్తులు జప్తు.. ఆ మోసం వల్లే!
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాకు చెందిన రూ.97 కోట్ల స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది. ఇందులో శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా కూడా ఉంది. అలాగే రాజ్‌కుంద్రాకు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్ చేసినట్లు వెల్లడించింది. అమాయక జనాలను మోసం చేసి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్‌కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ తనవద్దే బిట్కాయిన్లు ఈ ముగ్గురూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ మోసం వెనక ఉన్న మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్(ఈయన 2022లోనే చనిపోయారు) గతంలో రాజ్‌కుంద్రాకు 285 బిట్కాయిన్లు ఇచ్చాడు. దీనితో రాజ్‌కుంద్రా ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేయాలని భావించాడు. ఇప్పటికీ ఆ కాయిన్లు తనవద్దే ఉన్నాయని, దాని విలువ రూ.150 కోట్లుగా ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడి ఆస్తులను జప్తు చేసింది. చదవండి: కొత్తింట్లోకి బుల్లితెర జంట గృహప్రవేశం -
నాజూగ్గా ఉండే శిల్పా శెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..!
బాలీవుడ్ భామ శిల్పా శెట్టి పేరుకి తగ్గట్టుగానే శిల్పంలా ఉంటుంది. ఐదు పదుల వయసుకు చేరవవ్వుతున్నా నేటీ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామరస్‌గా కనిపిస్తోంది. శిల్పి చెక్కినట్లుగా ఉన్న శరీర సౌష్టవం, చెక్కు చెదరని అందం ఆమె సొంతం. మంచి యోగాసనాలతో ఇప్పటికీ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడూ కొత్త యోగాసనాలతో శరీరాన్ని ఎలా ఫిట్నెస్గా ఉంచొచ్చో చెబుతుంది. అలాంటి శిల్పా డైట్ పరంగా పెద్దగా ఏం తీసుకోదేమో అనుకుంటారు. గానీ శిల్పా మంచి భోజనప్రియురాలు. తినాలనుకున్నవన్నీ శుభ్రంగా లాగించేస్తుందట. కాంప్రమైజ్ కాదట. ఆమె తింటున్న విధానం చూసి కచ్చితంగా శిల్పా శెట్టేనే ఇలా తినేదని షాకవ్వుతారు. అందుకు నిదర్శనమే ఆమె లంచ్ టైంలో తిన్న ఫుడ్ సీన్. చెప్పాలంటే ఓ సాధారణ మహిళ మల్లే భలే తింటుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో శిల్పా..లంచ్ సిద్ధం అని చెప్పగానే శిల్పా.. నాకు బోండా, వడ ఉండాలి.. నా దగ్గర రవ్వ దోసె ఉండాలి. నాకు సాంబారు కావాలి. నా దగ్గర పెరుగు అన్నం ఉండాలి, కరకరలాడే ఇడ్లీ ఉండాలి, ఇంకా పనియారం కూడా ఉండాలంటూ తనకు ఇష్టమైన ఫుడ్స్ జాబితా మొత్తం చెబుతుంటం వీడియోలో కనిపిస్తుంది. ఇక అక్కడితో ఆగని శిల్పా కుల్ఫీ కూడా కావాలని చెబుతూ.. పాన్ గురించి గుర్తుచేస్తూ..అది బోజనం చివరన తప్పనిసరని చెబుతుండటం విశేషం. అయితే తనను ఎవరో వీడియో తీస్తున్నారని తెలిసి బిగ్గరగా నవ్వుతుంది. ఇక శిల్పా పక్కనే నిలుచున్న యువతి ఓ లంచ్ అయిన తర్వాత ఇది..ఇప్పటికే ఒకసారి లంచ్, రెండుసార్లు బ్రేక్‌ఫాస్ట్ అయిందని చెప్పడం గమనార్హం. ఇక ఆ తర్వాత వీడియోలో శిల్ప ముందు ఆమె ఆర్డర్ చేసిన డిష్‌లు కొద్దిగా తినిఉండటం కనిపిస్తుంది. ఇక చివరిగా వీడియోలో కుల్ఫీని ఎంజాయ్ చేయడమే గాక పాన్ని కూడా ఆస్వాదించడం కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) (చదవండి: డౌన్ సిండ్రోమ్‌తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!) -
డబ్బు కోసమే అతడితో పెళ్లి? హీరోయిన్ ఏమందంటే..
'సాహసవీరుడు సాగరకన్య' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్ శిల్పా శెట్టి. వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బాసూ వంటి చిత్రాలతో అలరించింది. కానీ బాలీవుడ్లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ రావడంతో అక్కడే సెటిలైంది. పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య తగ్గించేసిన ఈ బ్యూటీ కొంతకాలంగా సినిమాలు, సిరీస్‌లపై మరింత ఫోకస్ చేసింది. డబ్బు కోసమే పెళ్లి? తర్వాత 2009లో బిజినెస్మెన్ రాజ్‌కుంద్రాను పెళ్లాడింది. వీరికి ఒక బాబు పుట్టగా సరోగసి ద్వారా కూతురికి జన్మనిచ్చారు. డబ్బు కోసమే రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుందని శిల్పా శెట్టిపై ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆ ట్రోలింగ్‌పై హీరోయిన్ స్పందించింది. రాజ్‌కుంద్రా కంటే ధనవంతులు సైతం నన్ను పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డారు. కానీ నేనే పట్టించుకోలేదు. మంచితనం చూశా.. అప్పుడు, ఇప్పుడు నేను ధనవంతురాలినే! నేను పెట్టిన బాస్టియన్ రెస్టారెంట్ వల్ల నేను మరింత ధనికురాలినయ్యాను. జనాలు ఏది పడితే అది వాగేముందు గూగుల్‌లో నా గురించి సెర్చ్ చేస్తే బాగుండేది. సక్సెస్ఫుల్ ఉమెన్‌గా నాకంటూ తోడు నిలబడే వ్యక్తి కావాలనుకున్నాను. డబ్బులు చూడలేదు, మంచితనాన్ని చూశాను. తను మంచి మనిషి కాకపోయుంటే ఆయన్ని పెళ్లి చేసుకునేదాన్నే కాదు అని చెప్పుకొచ్చింది శిల్పాశెట్టి. చదవండి: నా పరుపు దులిపితే లక్షలకు లక్షలు దొరికాయి.. ఆ రోజు చిరంజీవి నాపై సీరియస్..: బాబూ మోహన్ -
శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి వయసు 50కి దగ్గర పడ్డ వన్నెతగ్గని సోయగంతో పేరుకు తగ్గట్టు శిల్పంలా ఉంటుంది. అంతేగాక ఆమె మంచి ఫిట్నెస్ ఔత్సాహికురాలు కూడా. ఇక ఫిట్నెస్కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడూ నెటిజన్లతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాల్లో చురుగ్గా ఉంటారు. అలానే ఈసారి కూడా ఫిట్నెస్కి సంబంధించిన ఓ సరికొత్త విషయాన్ని షేర్ చేశారు శిల్పా. ఆమె పలు యోగాసనాలు వేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ సారి ఆమె సరికొత్త వ్యాయామ భంగిమ, దాని ప్రయోజనాల గురించి చాలా ఆసక్తికర విషయాలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. రాజస్తాన్ పర్యటనలో ఉన్న ఆమె 'చక్కి చలసానా' భంగిమ విశేషాల గురించి చెప్పుకొచ్చారు. ఏంటీ 'చక్కీ చలసానా' అనుకుంటున్నారా..? అదేనండి తిరగలి తిప్పుతున్నట్లు చేసే ఆసనం. అంతేకాదండోయ్ మన పూర్వకాలం బామ్మలు తిరగలితో బియ్యం, గోధుమలు పిండిగా విసిరేవారు. అలా చేయడం వల్ల వాళ్ల నడుములు, పిక్కలకు మంచి వ్యాయామం చేకూరి ఆరోగ్యంగా ఉండేవారిని నిపుణులు గుర్తించారు. ఆ విషయాన్ని శిల్పాశెట్టి కూడా చెబుతున్నారు. ఆ భంగిమ ప్రయోజనాలు వివరిస్తూ తిరగలి విసిరి మరీ చూపించారు. ఇలా చేస్తే నడుము, తొడలు, పిక్కల వద్ద ఉండే కొవ్వు కరిగి ఎలా ఫిట్‌గా ఉంటారో వెల్లడించారు నటి శిల్పా. ఈ భంగిమని యోగా ఆననాల్లో గ్రైండింగ్ పోజ్ అని పిలుస్తారని అన్నారు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరానికి, మనస్సుకి మంచి ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. ఈ ఆసనాన్ని రెగ్యూలర్‌గా వేస్తే చేకూరే ప్రయోజనాలేంటో సవివరంగా వెల్లడించారు కూడా. అవేంటంటే. బలాన్ని వృద్ధి చేస్తుంది: ఈ చక్కి చలసానా(తిరగిలి తిప్పే ఆసనం) ఉదరకండరాలను బలోపేతం చేయడంలో సహయపడుతుంది. వదులుగా బాన పొట్టలా కానివ్వకుండా కాపాడుతుంది. ఇందులో వృత్తాకార కదలికలో కేవలం మొండెం మాత్రమే కదలడంతో ఉదరం చుట్టూ ఉండే కండరాలు సక్రియం అవుతాయి. దీంతో శరీరాన్ని సరైన విధంగా బ్యాలెన్స్ చేయగలిగే శక్తి ఆటోమెటిక్‌గా వస్తుంది. ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది ఈ యోగా భంగిమలో ఎగువ శరీరం మాత్రమే వృత్తాకార కదలికలో పాల్గొంటుంది కాబట్టి వెన్నెముక, భుజాలు తుంటిల ఆరోగ్యాన్ని బలోపేతం చేసేందుకు మంచి ఉపయుక్తమైన ఆసనం. ఈ ఆసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల ఆయా భాగాలు త్వరితగతిన గాయాల బారిన పడకుండా దృఢంగా ఉండేలా చేస్తుంది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఈ చక్కి చలాసానాలో వృత్తాకార కదలిక కారణంగా ఉదర అవయవాల్లో ముఖ్యంగా జీర్ణ అవయవాలకు మంచి అవసరమైన వ్యాయామం అనే చెప్పాలి. దీంతో ఇది జీర్ణక్రియను ప్రేరేపించి అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మనసు ఆహ్లదంగా ఉండేలా చేస్తుంది చక్కి చలసానాలో ఏకాగ్రతతో చేసే ఆసనం కాబట్టి మనస్సుపై ప్రభావం ఏర్పడి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ భంగిమ ధ్యానానికి సంబంధించిన నియంత్రిత శ్వాసపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. అందువల్ల ఈ ఆసనం వేయడం అనేది మనస్సుకు ప్రశాంతనిచ్చే ధ్యానం చేసినట్లుగా మంచి సత్ఫలితాలనిస్తుంది. ఈ వ్యాయమాన్ని క్రమం తప్పకుండా చేసి మంచి ప్రయోజనాలను పొందడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడని చెబుతోంది నటి శిల్పాశెట్టి. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ఆసనాన్ని వెంటనే మొదలు పెట్టేయండి మరీ. (చదవండి: 'గోబీ మంచూరియా'ని ఆ నగరం పూర్తిగా బ్యాన్ చేసిందట! ఎందుకో తెలుసా?) -
శ్రియ గ్లామర్ ట్రీట్.. అలా రెచ్చగొట్టేస్తున్న తెలుగు హీరోయిన్!
రెచ్చిపోయిన శ్రియ.. చూస్తే మెల్డ్ అయిపోవడం పక్కా వెరైటీ ముక్కుపుడకతో డిఫరెంట్‌గా కనిపిస్తున్న అనుపమ నాభి చూపిస్తూ టెంప్ట్ అయ్యేలా చేస్తున్న మాళవిక మోహనన్ అక్కతో కలిసి క్యూట్ పోజులిచ్చిన బ్యూటీ ఆలియా భట్ అలాంటి డ్రస్‌లో కనిపించిన తెలుగమ్మాయి శ్రియ ధన్వంతరి నడుము మడతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డింపుల్ హయతి ఊటీలో చిల్ అవుతున్న తెలుగు హీరోయిన్ పూజిత పొన్నాడ బ్లాక్ అండ్ వైట్ పోజుల్లో 'మీర్జాపుర్' బ్యూటీ శ్రియ పిల్గొంకర్ View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Shriya Pilgaonkar (@shriya.pilgaonkar) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ కావాలంటూ డిమాండ్
బాలీవుడ్లో పోలీస్ కథలతో సినిమా తెరకెక్కించడంలో దర్శకుడు రోహిత్ శెట్టికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ క్రమంలో వచ్చినవే సింగం సీరిస్, సింబా, సూర్యవంశీ ఈ మూడు సినిమాలో బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి అవన్నీ మంచి వినోదాన్ని పంచాయి. తాజాగా ఇదే కాన్సెప్ట్‌తో ఆయన తొలిసారిగా 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా సిద్ధమైన ఈ సిరీస్ జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానుందని వారు ప్రకటించారు. దేశ ప్రజలను సంరక్షించడం కోసం నిరంతరం శ్రమిస్తున్న భారతీయ పోలీసు అధికారుల నిస్వార్థ సేవలకు అద్దం పట్టేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. 'ఈ పోరాటం ప్రాణాలు కోల్పోయిన భారతీయులందరి కోసం.. ఈ వార్‌లో మన కుటుంబ సభ్యుల రక్తం చిందినా యుద్ధం ఆగదు' అంటూ కబీర్ పాత్రలో సిద్ధార్థ్ చెప్పిన డైలాగులు హైలెట్‌గా నిలుస్తున్నాయి. దాదాపు ఏడు ఎపిపోడ్స్‌తో సిద్ధమైన ఈ సిరీస్‌కు రోహిత్‌శెట్టితోపాటు సుశ్వంత్ ప్రకాష్ దర్శకుడిగా వ్యవహరించారు. కానీ ఈ సిరీస్ హీందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది. దీంతో రీజనల్ లాగ్వేజ్ల నుంచి కూడా మేకర్స్‌కు ఒత్తిడి పెరుగుతుంది. అన్నీ భాషల్లో విడుదల చేయాలంటూ పలువురు నెటిజన్లు ఇప్పటికే పోస్ట్‌లు చేయడం గమనర్హం. హిందీలో అయితే జనవరి 19 నుంచి 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్‌ను అమెజాన్‌లో చూడొచ్చు. -
దుస్తులిప్పి అందరి ముందు నగ్నంగా నిలబెట్టారు: శిల్పాశెట్టి భర్త
ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా జీవితంలో నీలి చిత్రాల కేసు చెరగని మచ్చగా నిలిచిపోయింది. వ్యాపారవేత్తగా ఎంతో పేరు సంపాదించినా.. 2021లో నమోదైన నీలిచిత్రాల కేసుతో అతని జీవితం వివాదాల్లో కూరుకుపోయింది. జైలు నుంచి బయటకు వచ్చాక చాలా కాలంపాటు మీడియాకు దూరంగా ఉన్నాడు. బిజినెస్ వ్యవహారాల్లోనూ అంతగా జోక్యం చేసుకోలేదట. కానీ ఇటీవల ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. మళ్లీ బిజినెస్ పనుల్లో బిజీ అయ్యారు. మరోవైపు తన జీవితంలో జరిగిన కీలక ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న యూటీ 69 అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో రాజ్‌కుంద్రా చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జైలు జీవితం గురించి, అక్కడ పడిన ఇబ్బందుల గురించి వివరించాడు. ‘జైలులో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. జైలుకు వెళ్లిన తొలి రోజే నా దుస్తులన్ని విడిపించి..అందరి ముందు నగ్నంగా నిలబెట్టారు. ఏవైనా నిషేధిత పదార్థాలు తీసుకోచ్చావా? అంటూ వంగోబెట్టి వెనుకభాగం వైపు చెక్ చేశారు. అలాంటి ట్రీట్మెంట్ చూసిన తర్వాత బతికున్న చచ్చినట్టే అనే భావన కలిగింది. ఇన్నాళ్లు సంపాదించుకున్న పరువు, ప్రతిష్టలు మట్టిలో కలిసిపోయాయని బాధపడ్డాను. జైలులో నా పరిస్థితి అలా ఉంటే.. బయట మీడియా కూడా నా గురించి ఏవోవో తప్పుడు కథనాలు రాసి..దుస్తులు విడిపించినంత పని చేసింది. అవమాన భారంతో కుంగిపోయాను. ఒకానొక దశలో జైలులోనే చనిపోవాలనుకున్నాను. కానీ ఏదో ఒక రోజు అసలు నిజం బయటకు వస్తుందంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను’ అని రాజ్‌కుంద్రా చెప్పుకొచ్చారు. -
నీలిచిత్రాల కేసు.. దేశం వదిలి వెళ్లిపోదామనుకున్న శిల్పా శెట్టి!
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 2021లో నీలి చిత్రాల కేసులో కొంతకాలం పాటు జైలు శిక్ష అనుభవించిన అతడు తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మీడియాకు తన ముఖం చూపించడానికి కూడా ఇష్టపడలేదు. ఇటీవలే తన జీవిత కథ ఆధారంగా యూటీ 69 అనే బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించాడు. ఇందులో రాజ్ కుంద్రాయే ప్రధాన పాత్రలో నటించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన జైలు జీవితం గురించి చెప్పుకొచ్చాడు. వారానికి ఒకసారి ఫోన్ కాల్.. రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'జైల్లో ఉన్నప్పుడు వారానికి ఒకసారే ఫోన్ మాట్లాడనిచ్చేవాళ్లు. అది కూడా కొద్ది నిమిషాలే! అందుకే శిల్పా, నేను ఒకరికి ఒకరం ఉత్తరాలు రాసుకునేవాళ్లం. ఆమె రాసే ఉత్తరాలు చదువుకుని బయట ఏం జరుగుతుందో తెలుసుకునేవాడిని. శిల్పాకు నా గురించి బాగా తెలుసు. నేను నా బిజినెస్‌లో, నా జీవితంలో ఎంత నిజాయితీగా ఉండేవాడిని, ఎలాంటి విధివిధానాలు పాటిస్తానో అన్నీ తెలుసు. అందుకే, నాకెంతో సపోర్ట్ చేసింది. జైల్లో ఉన్న సమయంలో తను మొదటి సారి ఫోన్ చేసి ఏమందంటే.. రాజ్.. ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాలి. నా మీద నమ్మకముంచు అని చెప్పింది. ఆమె మాటలు విన్నాకే జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను. అవమానభారంతో కుంగిపోయా.. నిజానికి నేను కుంగిపోయి ఉన్నాను. జైలు లోపలే నా జీవితం ముగించేయాలనుకున్నాను. ఎందుకంటే అప్పటికే నా పేరుప్రతిష్టలు దెబ్బతిన్నాయి. ఎంతో అవమానంగా ఉంది. నా వల్ల మీడియా నా భార్యాపిల్లలు, తల్లిదండ్రుల వెంటపడుతూనే ఉంటుంది. అదంతా ఆలోచిస్తేనే చాలా భయమేసింది, బాధేసింది. బయట ఏం జరుగుతుందనేది నేను అంచనా వేయగలను. కానీ అంతకు మించి ఏమీ చేయలేను. జీవితంలో ఇది నాకు సంక్లిష్ట సమయం. నిజమేంటనేది నాకు తెలుసు, అది ఏదో ఒక రోజు బయటకు రాక తప్పదు అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. దేశం వదిలేసి వెళ్లిపోదామంది నా భార్య అయితే దేశం వదిలేసి వెళ్లిపోదామంది. నువ్వు లండన్‌లో పుట్టి పెరిగావు. అక్కడంతా వదిలేసి నాకోసం ఇండియా వచ్చావు, ఇక్కడే సెటిలయ్యావు. విదేశాల్లో ఉండాలనుందంటే చెప్పు.. అక్కడికే వెళ్లిపోదాం అని అడిగింది. కానీ నాకు భారత్ అంటే ఇష్టమని, ఈ దేశాన్ని వదిలేయలేనని చెప్పాను. వేలకోట్ల స్కామ్‌లు చేసి తప్పు చేసిన వారు దేశం విడిచి వెళ్తారు. నేనే తప్పూ చేయలేదు, నేను ఎక్కడికీ వెళ్లనని చెప్పాను' అని తెలిపాడు రాజ్ కుంద్రా. చదవండి: ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. తర్వాత భిక్షగత్తెగా మారి.. -
విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ట్వీట్.. భార్యతో విడాకులు?
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా ట్విటర్లో పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 'మేము విడిపోయాం.. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. దీనికి గుండె ముక్కలైన ఎమోజీతో పాటు చేతులు జోడిస్తున్న గుర్తును జత చేశాడు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన ఈ ట్వీట్ చేశాడు. సడన్‌గా ఏమైంది? ఇది చూసిన జనాలు శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా విడాకులు తీసుకుంటున్నారా? మొన్నటివరకు బాగానే ఉన్నారుగా, ఇంతలోనే ఏమైంది? అని షాకవుతున్నారు. మరికొందరు మాత్రం ఆయన విడిపోతుంది తన భార్యతో కాదు మాస్క్‌తో అని అభిప్రాయపడుతున్నారు. కాగా 2021లో నీలిచిత్రాల కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా కొంతకాలంపాటు జైలు జీవితం గడిపాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియాకు తన ముఖం చూపేందుకు కూడా ఇష్టపడలేదు. ఎప్పుడు బయటకు వచ్చినా ఏదో ఒక మాస్క్‌తోనే కనిపించేవాడు. ప్రమోషన్ స్టంట్? ఇటీవలే అతడు తన జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. యూటీ 69 అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీలో రాజ్‌కుంద్రాయే ప్రధాన పాత్రలో నటించాడు. కాగా చాలాకాలంగా మాస్క్ చాటున ముఖం దాచుకుంటున్న అతడు యూటీ 69 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాస్క్ తీసేసి మీడియా ముందు నిలబడ్డాడు. బహుశా మాస్క్‌తో ఇక సంబంధం లేదని ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది. కాగా రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి వియాన్, సమీషా అని ఇద్దరు సంతానం. We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔 — Raj Kundra (@onlyrajkundra) October 19, 2023 చదవండి: అజిత్‌తో షూటింగ్ డుమ్మా కొట్టి మరీ లియో మూవీ చూసిన త్రిష.. థియేటర్లో విజయ్ అభిమాని ఎంగేజ్మెంట్ -
అలా చెప్పగానే నా భార్య నాపైకి చెప్పు విసిరింది: శిల్పా శెట్టి భర్త
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చాలాకాలంగా తన ముఖాన్ని జనాలకు చూపించకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక మాస్క్‌తోనే కనిపిస్తూ వస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత బుధవారం జరిగిన ఓ వేడుకలో తన మాస్క్ తీసేసి కనిపించాడు. ఇంతకీ ఆ వేడుక ఏంటనుకుంటున్నారా? తనకు సంబంధించినదే! రాజ్ కుంద్రా.. తన జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటనల సమాహారాన్ని సినిమాగా తీసుకువస్తున్నాడు. ఇందులో అతడే హీరోగా నటించాడు. దీనికి యూటీ 69 అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనే తన ముఖాన్ని చూపించాడు. ఈ సందర్భంగా రాజ్‌కుంద్రా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'నా జీవితకథను బయోపిక్‌గా తీయాలనుకున్నాను. ఈ విషయాన్ని నా భార్యకు చెప్పినప్పుడు తను నాకు కొంత దూరంలో నిలబడి ఉంది. సినిమా చేస్తానని చెప్పానో లేదో.. తను నా మీదకు చెప్పు విసిరింది. నేను సినిమా తీయాలన్న ఆలోచన తనకు నచ్చలేదు. మొదట్లో ఇష్టపడలేదు కానీ తర్వాత తన మనసు మార్చుకుని నాకు అండగా నిలబడింది' అని చెప్పుకొచ్చాడు. కాగా నీలిచిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు 2021లో అరెస్ట్ చేశారు. కొంతకాలంపాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. తన సినిమాలో జైలు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను కూడా చూపించనున్నాడు రాజ్ కుంద్రా. షహ్నావజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది. చదవండి: నామినేషన్స్.. మా రక్తం ఉడికిపోయింది.. థూ అనేంత తప్పు ఏం చేశాడంటూ భోలె చెల్లి ఫైర్ -
ఇండియాలో అమ్ముడయ్యేది ఆ రెండే.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చాలా రోజుల తర్వాత తన మొహాన్ని ప్రేక్షకులను చూపించారు. ఆయన నటించిన తాజా చిత్రం యూటీ69. తన జీవితం ఆధారంగానే ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా యూటీ69 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రాజ్ కుంద్రా మాట్లాడారు. వారికి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముంబయిలో జరిగిన ఈవెంట్‌కు హాజరైన రాజ్‌కుంద్రా మీడియా ప్రతినిధులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండియాలో రెండు మాత్రమే ప్రధానంగా అమ్ముడవుతాయి.. అందులో ఒకటి షారుక్ ఖాన్ అయితే.. మరొకటి శృంగారం అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత నా మొహాన్ని మీడియాకు చూపించారు. ఇన్ని రోజులు ఎక్కడ చూసినా మాస్క్ లేదా హెల్మెట్ ధరించి కనిపించారు. అంతే కాకుండా పోర్న్ కేసు తన కుటుంబంపై చాలా ప్రభావం చూపిందని తెలిపారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా రాజ్ కుంద్రా ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తాను జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని అన్నారు. రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'ఇది నాకు కేవలం సినిమా మాత్రమే కాదు. నా జీవితం ఎంతో అయోమయంగా మారింది. అందులోని ఒక భాగాన్ని ఈ సినిమా ద్వారా మీతో పంచుకుంటున్నా.' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. 2021లో పోర్న్ కేసులో రాజ్ కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలపాటు జైలులో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. -
నువ్వు నా డ్రెస్ గురించి మాట్లాడతావా?.. శిల్పాశెట్టి భర్తపై బిగ్‌బాస్ బ్యూటీ ఫైర్!
తన విచిత్రమైన వేషధారణతో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. సినిమాల కంటే తన డ్రెస్సులతోనే పాపులారిటీ దక్కించుకుంది. ప్రతి రోజు ఏదో ఒక వెరైటీ దుస్తులతో వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. అయితే ఈ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ డ్రెస్సింగ్ సెన్స్‌పై శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అతను చేసిన కామెంట్స్‌పై ఉర్ఫీ జావెద్ తీవ్రస్థాయిలో మండిపడింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల రాజ్ కుంద్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో ఉర్ఫీ జావెద్ గురించి ప్రస్తావించారు. రాజ్ కుంద్రా ఏం ధరిస్తాడు.. అలాగే ఉర్ఫీ జావెద్ ఏం ధరించదు? అనే విషయాన్ని మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని కామెంట్స్ చేశారు. అయితే అతను తన డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ ఉర్ఫీకి ఆగ్రహం తెప్పించాయి. 'ఇతరుల శరీరంతో వ్యాపారం చేసిన వ్యక్తి.. నా దుస్తులపై మాట్లాడతాడా అంటూ.. క్షమించండి పోర్న్ కింగ్' అంటూ ఘాటుగానే స్పందించింది. కాగా.. ఉర్ఫీ పంచ్ బీట్ సీజన్- 2, బడే భయ్యా కి దుల్హనియా, మేరీ దుర్గా, బేపన్నా వంటి షోలలో కనిపించింది. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో పాల్గొంది. రాజ్‌కుంద్రాపై కేసు శిల్పాశెట్టి భర్త, రాజ్‌కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా అశ్లీల వీడియోలను పంపిణీ చేయడం వంటి ఆరోపణలపై వ్యాపారవేత్తను జూలై 2021లో రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల తర్వాత అతనికి బెయిల్ మంజూరైంది. View this post on Instagram A post shared by Raj Kundra (@onlyrajkundra) -
'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ భామ శిల్పాశెట్టి పరిచయం అక్కర్లేని పేరు. బాజీఘర్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ హిందీతో పాటు తెలుగు, తమిళం సినిమాల్లోనూ నటించింది. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రాను పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె సుఖీ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. (ఇది చదవండి: మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్: టాప్ హీరోయిన్) అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిల్పా శెట్టి తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్ చిత్ర నిర్మాత అయిన తన తల్లి సునందశెట్టి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. మా అమ్మకు నేను కడుపులో ఉండగా.. గర్భస్రావం అవుతుందని వైద్యులు చెప్పారని శిల్పాశెట్టి వెల్లడించారు. ఈ విషయాన్ని అమ్మ తనకు చెప్పిందని తెలిపింది. శిల్పా మాట్లాడుతూ.. 'మా అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. తాను నన్ను కోల్పోతుందని వైద్యులు చెప్పారట. తాను గర్భంలో ఉన్నప్పుజే అమ్మ పరిస్థితి చాలా కష్టంగా ఉన్నందున అబార్షన్ చేయాలని వైద్యులు సూచించారట. ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో మిస్ క్యారేజ్ అవుతుందని అమ్మ భయపడింది. తరచుగా అలా జరగడంతో అబార్షన్ తప్పదనుకున్నారు. కానీ నేను పుట్టాను. ఇది ఒక విధంగా నాకు పునర్జన్మే. అందుకే నేను ఏదో చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక కారణంతో పుట్టానని అనిపిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో జీవితంలో ప్రేరణ ఇచ్చే మేసేజ్‌లు చేస్తుంటా. లైఫ్ అనేది ఎవరికీ కూడా అంతా ఈజీ కాదు. " అంటూ చెప్పుకొచ్చింది. సుఖీ చిత్రం ద్వారా సోనాల్ జోషి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అమిత్ సాధ్, కుషా కపిల, పావ్లీన్ గుజ్రాల్, దిల్నాజ్ ఇరానీ, చైతన్య చౌదరి, జ్యోతి కపూర్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, శిఖా శర్మలు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. (ఇది చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీకి యాక్సిడెంట్.. జరిగింది ఇదే!)