బహిరంగ ముద్దు కేసు నుంచి బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి భారీ ఊరట లభించింది. పదిహేనేళ్ల క్రితం నమోదైన ఈ కేసును తాజాగా విచారించిన న్యాయస్థానం శిల్పా శెట్టి బాధితురాలని పేర్కొంది. 2007లో రాజస్తాన్‌లోని ఓ కార్యక్రమానికి హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి హాజరయ్యారు.
ఈ క్రమంలో వేదికపై ఉన్న రిచర్డ్ శిల్పా అందానికి ముగ్ధులై ఆమె చేతులు పట్టుకుంటూ ఎదురుగా వెళ్లి ముద్దుల వర్షం కురిపించాడు. దీన్ని శిల్పాశెట్టి అడ్డుకోలేదన్నది ప్రధాన ఆరోపణ. దీంతో అందరూ చూస్తుండగా బహిరంగంగానే ముద్దులు పెట్టుకుంటూ అనుచితంగా ప్రవర్తించారంటూ వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయి. తొలుత రాజస్థాన్‌లో నమోదైన కేసులను శిల్పా శెట్టి అభ్యర్థనపై ముంబై మెట్రోపాలిటన్ కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. తాజాగా మరోమారు ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం అసలు శిల్పా నిందితురాలు కాదని ఆమె బాధితురాలని పేర్కొంటూ ఆరోపణలను కొట్టిపారేసింది.
Comments
Please login to add a commentAdd a comment