richard gere
-
వేధిస్తాడు.. మొరటోడు
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విధానాలను ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల స్పెయిన్‌లో ‘గోయా’అవార్డ్‌ల ప్రదానోత్సవంలో రిచర్డ్‌కు జీవితకాల సాఫల్యత పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా రిచర్డ్ మాట్లాడుతూ ట్రంప్ విధాన నిర్ణయాలు, ట్రంప్ చుట్టూ ఉన్న నేతాగణాన్ని ప్రస్తావించారు. గిరిజనులు అడవుల్లో గిరిజనేతరుల ఆధిపత్యాన్ని కోరుకోరు అనే అర్థంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడో అనాలోచిత ట్రైబలిజం అమెరికాలో మొదలవుతోంది. ఇతరులతో పోలిస్తే మేం ప్రత్యేకం అన్న ధోరణి పెరుగుతోంది. అలాంటి ఆలోచనలను తుంచేయాల్సిన ప్రజాప్రతినిధులే ఈ ఆలోచనలకు అంటుకట్టడం విషాదకరం. ఇప్పుడు అమెరికాలో చీకటిరోజులు మొదలయ్యాయి. అందర్నీ అవహేళన చేస్తూ వేధించే మొరటు మనిషి ట్రంప్ ఏలుబడిలో ఉన్నాం. ఈయన విషయంలో ఒక్క అమెరికాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచదేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. అధికారం, పెట్టుబడిదారుల సంకర వివాహమిది. బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వ ఖజానానే దోచేసే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు కొలువైన ప్రభుత్వమిది. ఇది మానవళికే ప్రమాదకరం. ఇతరుల పట్ల దయ లేని పరిణతి సాధించని సంపన్న మూకలు ట్రంప్ చుట్టూ చేరారు. ఇలాంటి వ్యక్తుల కలయిక ఎంతో వినాశకరం’’అని రిచర్డ్ ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాలో ఉండే రిచర్డ్ ఇటీవలే తన భార్య అలెజాండ్రా సిల్వాతో కలిసి స్పెయిన్‌కు మకాం మార్చారు. -
భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడి ప్రశంసలు
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా భారీస్థాయిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన భారత ప్రధాని పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి నిలువెత్తు రూపమన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన హాలీవుడ్ సూపర్ స్టార్ రిచర్డ్ గేర్ భారత ప్రధానితో కొద్దిసేపు మాటామంతీ జరిపిన తర్వాత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయనను ఓ మీడియా ప్రతినిధి కార్యక్రమం గురించి స్పందించమని కోరగా.. "ఇదొక ప్రేమ పూర్వకమైన సందేశమని.. ఆయన అసలైన సంస్కృతికి పుట్టినిల్లయిన భారత్ నుండి వచ్చారు. ఆయన భారతీయ సాంప్రదాయానికి ప్రతిబింబం. ప్రపంచవ్యాప్తంగా సోదరభావాన్ని పెంచే విధంగా ఉన్న ఆయన సందేశం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోందని అన్నారు. #WATCH | It is a lovely message. He (PM Modi) is a product of Indian culture and comes from a vast place like Indian culture does. This message of universal brotherhood and sisterhood is the one we want to hear again and again, says Richard Gere after Yoga Day event in New York pic.twitter.com/9fKXLpCYyh — ANI (@ANI) June 21, 2023 భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరీ తో పాటు మొత్తం 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ "వసుదైక కుటుంబం" పేరుకు తగ్గట్టుగానే ప్రపంచ ప్రతినిధులంతా ఒకేచోట చేరి కుటుంబ వేడుకను తలపించారు. ఇది కూడా చదవండి: ఉగ్రవాదులకు కొమ్ము కాస్తున్న చైనా.. భారత్ ఆగ్రహం.. -
ఎట్టకేలకు 'ముద్దు కేసు' నుంచి శిల్పా శెట్టికి ఊరట
బహిరంగ ముద్దు కేసు నుంచి బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి భారీ ఊరట లభించింది. పదిహేనేళ్ల క్రితం నమోదైన ఈ కేసును తాజాగా విచారించిన న్యాయస్థానం శిల్పా శెట్టి బాధితురాలని పేర్కొంది. 2007లో రాజస్తాన్‌లోని ఓ కార్యక్రమానికి హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి హాజరయ్యారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న రిచర్డ్ శిల్పా అందానికి ముగ్ధులై ఆమె చేతులు పట్టుకుంటూ ఎదురుగా వెళ్లి ముద్దుల వర్షం కురిపించాడు. దీన్ని శిల్పాశెట్టి అడ్డుకోలేదన్నది ప్రధాన ఆరోపణ. దీంతో అందరూ చూస్తుండగా బహిరంగంగానే ముద్దులు పెట్టుకుంటూ అనుచితంగా ప్రవర్తించారంటూ వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయి. తొలుత రాజస్థాన్‌లో నమోదైన కేసులను శిల్పా శెట్టి అభ్యర్థనపై ముంబై మెట్రోపాలిటన్ కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. తాజాగా మరోమారు ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం అసలు శిల్పా నిందితురాలు కాదని ఆమె బాధితురాలని పేర్కొంటూ ఆరోపణలను కొట్టిపారేసింది. -
పాత పెళ్లికి నై... కొత్త ప్రేమకు సై...
ప్రముఖ హాలీవుడ్ నటుడు, సామాజిక కార్యకర్త రిచర్డ్ గేర్, భారతీయ సంతతి మోడల్ - నటి అయిన పద్మా లక్ష్మితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారట. వారిద్దరూ రహస్యంగా డేటింగ్ జరుపుతున్నట్లు అమెరికన్ పత్రికల కథనం. భార్య కేరీ లోవెల్ నుంచి రిచర్డ్ గేర్ విడిపోయినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. భార్యతో విడాకులకు సిద్ధమైన ఈ అరవై నాలుగేళ్ళ హాలీవుడ్ స్టార్, ‘టాప్ చెఫ్’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పద్మా లక్ష్మితో ప్రేమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ‘న్యూయార్క్ పోస్ట్’ పత్రిక పేర్కొంది. ‘‘గుట్టుచప్పుడు కాకుండా వారిద్దరూ కలసి కాలక్షేపం చేస్తున్నారు. తాజాగా న్యూయార్క్‌లో ‘టైమ్ అవుట్ ఆఫ్ మైండ్’ చిత్ర షూటింగ్లో రిచర్డ్ గేర్ ఉండగా ఈ వ్యవహారం నడిచింది’’ అని సన్నిహిత వర్గాలు, ‘న్యూయార్క్ పోస్ట్’కు తెలిపాయి. దీంతో, రిచర్డ్ గేర్కూ, యాభై రెండేళ్ళ లోవెల్కూ మధ్య నెలకొన్న పదకొండేళ్ళ వైవాహిక బంధం విచ్ఛిన్నమైనట్లే. ఆ దంపతులకు హోమెర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. నిజానికి, వివాహాలు, విడాకులు ఇటు రిచర్డ్ గేర్‌కు కానీ, అటు ఆయన తాజా ప్రేయసి పద్మా లక్ష్మికి కానీ కొత్త కాదు. లోవెల్ కన్నా ముందు నటి సిండీ క్రాఫర్డ్తో రిచర్డ్ గేర్ వైవాహిక జీవితం గడిపారు. నలభై మూడేళ్ళ లక్ష్మి విషయానికి వస్తే ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీని ఆమె గతంలో పెళ్ళి చేసుకున్నారు. మూడేళ్ళ ముచ్చటగా ఆ బంధం 2007లో ముగిసింది. అటుపైన లక్ష్మి, కోటీశ్వరుడైన టెడ్డీ ఫార్స్ట్మన్తో డేటింగ్ జరిపారు. 2011లో ఆయన బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణించారు. కంప్యూటర్ రంగ దిగ్గజం మైకేల్ డెల్ సోదరుడైన ఆడమ్ డెల్‌తో అనుబంధం కారణంగా ఆమెకు కృష్ణా థీ లక్ష్మి - డెల్ అనే మూడేళ్ళ కుమార్తె కూడా ఉంది. ఎయిడ్స్ పట్ల చైతన్యం పెంచే కార్యక్రమంలో పాల్గొనేందుకు 2007లో భారత పర్యటనకు వచ్చిన రిచర్డ్ గేర్, బాల్ రూమ్ డ్యాన్స్ చేస్తూ, నటి శిల్పాశెట్టిని పదే పదే గాఢంగా ముద్దుపెట్టుకున్న వ్యవహారం అప్పట్లో పెద్ద సంచలనమైన సంగతి తెలిసిందే. తాజాగా పద్మా లక్ష్మి వ్యవహారంతో మరో మారు ఆయన భారతీయ పత్రికల్లో వార్తల్లో నిలిచారు.