పాత పెళ్లికి నై... కొత్త ప్రేమకు సై... | No to old marriage.... Yes to new love.... | Sakshi
Sakshi News home page

పాత పెళ్లికి నై... కొత్త ప్రేమకు సై...

Published Tue, Apr 22 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

పాత పెళ్లికి నై... కొత్త ప్రేమకు సై...

పాత పెళ్లికి నై... కొత్త ప్రేమకు సై...

ప్రముఖ హాలీవుడ్ నటుడు, సామాజిక కార్యకర్త రిచర్డ్ గేర్, భారతీయ సంతతి మోడల్ - నటి అయిన పద్మా లక్ష్మితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారట. వారిద్దరూ రహస్యంగా డేటింగ్ జరుపుతున్నట్లు అమెరికన్ పత్రికల కథనం. భార్య కేరీ లోవెల్ నుంచి రిచర్డ్ గేర్ విడిపోయినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. భార్యతో విడాకులకు సిద్ధమైన ఈ అరవై నాలుగేళ్ళ హాలీవుడ్ స్టార్, ‘టాప్ చెఫ్’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పద్మా లక్ష్మితో ప్రేమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ‘న్యూయార్క్ పోస్ట్’ పత్రిక పేర్కొంది. ‘‘గుట్టుచప్పుడు కాకుండా వారిద్దరూ కలసి కాలక్షేపం చేస్తున్నారు. తాజాగా న్యూయార్క్‌లో ‘టైమ్ అవుట్ ఆఫ్ మైండ్’ చిత్ర షూటింగ్‌లో రిచర్డ్ గేర్ ఉండగా ఈ వ్యవహారం నడిచింది’’ అని సన్నిహిత వర్గాలు, ‘న్యూయార్క్ పోస్ట్’కు తెలిపాయి.
 
 దీంతో, రిచర్డ్ గేర్‌కూ, యాభై రెండేళ్ళ లోవెల్‌కూ మధ్య నెలకొన్న పదకొండేళ్ళ వైవాహిక బంధం విచ్ఛిన్నమైనట్లే. ఆ దంపతులకు హోమెర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. నిజానికి, వివాహాలు, విడాకులు ఇటు రిచర్డ్ గేర్‌కు కానీ, అటు ఆయన తాజా ప్రేయసి పద్మా లక్ష్మికి కానీ కొత్త కాదు. లోవెల్ కన్నా ముందు నటి సిండీ క్రాఫర్డ్‌తో రిచర్డ్ గేర్ వైవాహిక జీవితం గడిపారు. నలభై మూడేళ్ళ లక్ష్మి విషయానికి వస్తే ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీని ఆమె గతంలో పెళ్ళి చేసుకున్నారు. మూడేళ్ళ ముచ్చటగా ఆ బంధం 2007లో ముగిసింది. అటుపైన లక్ష్మి, కోటీశ్వరుడైన టెడ్డీ ఫార్స్ట్‌మన్‌తో డేటింగ్ జరిపారు. 2011లో ఆయన బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణించారు. కంప్యూటర్ రంగ దిగ్గజం మైకేల్ డెల్ సోదరుడైన ఆడమ్ డెల్‌తో అనుబంధం కారణంగా ఆమెకు కృష్ణా థీ లక్ష్మి - డెల్ అనే మూడేళ్ళ కుమార్తె కూడా ఉంది. ఎయిడ్స్ పట్ల చైతన్యం పెంచే కార్యక్రమంలో పాల్గొనేందుకు 2007లో భారత పర్యటనకు వచ్చిన రిచర్డ్ గేర్, బాల్ రూమ్ డ్యాన్స్ చేస్తూ, నటి శిల్పాశెట్టిని పదే పదే గాఢంగా ముద్దుపెట్టుకున్న వ్యవహారం అప్పట్లో పెద్ద సంచలనమైన సంగతి తెలిసిందే. తాజాగా పద్మా లక్ష్మి వ్యవహారంతో మరో మారు ఆయన భారతీయ పత్రికల్లో వార్తల్లో నిలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement