ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన ఆఫీసులు, నివాసాల్లో ఈడీ దాడులు జరుగుతున్నాయని వచ్చిన వార్తల్లో నిజంలేదని శిల్పాశెట్టి లాయర్ ప్రకటించారు. అశ్లీల చిత్రాల నిర్మాణ, ప్రసారానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో లాయర్ వివరణ ఇచ్చారు. ఎలాంటి కేసులో ఆమెకు సంబంధంలేదని లాయర్ క్లారిటీ ఇచ్చారు. తప్పడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
రాజ్ కుంద్రా ఆఫీసులపై ఈడీ దాడులు అంటూ మీడియాలో వచ్చిన కథనాలకు ఆయన సతీమణి శిల్పాశెట్టి లాయర్ ఇలా స్పందించారు. ' నా క్లయింట్ ఇంట్లో ,ఆఫీసులలో ఎలాంటి ఈడీ సోదాలు జరగలేదు. రాజ్ కుంద్రాకు సంబంధించిన కేసు కోర్టులో విచారణ జరుగుతుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రాజ్ కుంద్రా కూడా విచారణకు సహకరిస్తున్నారు. రాజ్ కుంద్రా ఇంట్లో ఈడీ సోదాలు అంటూ ప్రచారం చేస్తూ.. నా క్లయింట్ శిల్పాశెట్టి ఫోటోలు, వీడియోలను మీడియాలో ఉపయోగించకండి. ఈ కేసులతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. భవిష్యత్‌లో ఎవరైనాసరే ఈ కేసులో శిల్పాశెట్టి పోటోలు ఉపయోగిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.' అని లాయర్ హెచ్చరించారు.
వ్యాపారవేత్త రాజ్ కుంద్రా 2021లో నీలి చిత్రాల కేసులో కొంతకాలం పాటు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడని ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు. సినిమాలలో ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి కొందరి యువతులను టార్గెట్ చేసి వారి ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment