
ముంబయి:వ్యాపారవేత్త,బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. సంచలనం సృష్టించిన అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ రాజ్‌కుంద్రాకు నోటీసులిచ్చింది.
కాగా,ఇటీవలే రాజ్‌కుంద్రాకు సంబంధించిన పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు పిలవడం గమనార్హం.