దుస్తులిప్పి అందరి ముందు నగ్నంగా నిలబెట్టారు: శిల్పాశెట్టి భర్త | Raj Kundra Opens Up On His Jail Time | Sakshi
Sakshi News home page

దుస్తులిప్పి నగ్నంగా నిలబెట్టారు.. బతికున్న చచ్చినట్టే అనిపించింది: రాజ్‌ కుంద్రా

Published Sat, Oct 28 2023 2:17 PM | Last Updated on Sat, Oct 28 2023 3:04 PM

Raj Kundra Opens Up On His Jail Time - Sakshi

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా జీవితంలో నీలి చిత్రాల కేసు చెరగని మచ్చగా నిలిచిపోయింది. వ్యాపారవేత్తగా ఎంతో పేరు సంపాదించినా.. 2021లో నమోదైన నీలిచిత్రాల కేసుతో అతని జీవితం వివాదాల్లో కూరుకుపోయింది. జైలు నుంచి బయటకు వచ్చాక చాలా కాలంపాటు మీడియాకు దూరంగా ఉన్నాడు. బిజినెస్‌ వ్యవహారాల్లోనూ అంతగా జోక్యం చేసుకోలేదట. కానీ ఇటీవల ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. మళ్లీ బిజినెస్‌ పనుల్లో బిజీ అయ్యారు.

మరోవైపు తన జీవితంలో జరిగిన కీలక ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న యూటీ 69 అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో రాజ్‌కుంద్రా చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జైలు జీవితం గురించి, అక్కడ పడిన ఇబ్బందుల గురించి వివరించాడు. 

‘జైలులో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. జైలుకు వెళ్లిన తొలి రోజే నా దుస్తులన్ని విడిపించి..అందరి ముందు నగ్నంగా నిలబెట్టారు. ఏవైనా నిషేధిత పదార్థాలు తీసుకోచ్చావా? అంటూ వంగోబెట్టి వెనుకభాగం వైపు చెక్‌ చేశారు. అలాంటి ట్రీట్‌మెంట్‌ చూసిన తర్వాత బతికున్న చచ్చినట్టే అనే భావన కలిగింది. ఇన్నాళ్లు సంపాదించుకున్న పరువు, ప్రతిష్టలు మట్టిలో కలిసిపోయాయని బాధపడ్డాను.

జైలులో నా పరిస్థితి అలా ఉంటే.. బయట మీడియా కూడా నా గురించి ఏవోవో తప్పుడు కథనాలు రాసి..దుస్తులు విడిపించినంత పని చేసింది. అవమాన భారంతో కుంగిపోయాను. ఒకానొక దశలో జైలులోనే చనిపోవాలనుకున్నాను. కానీ ఏదో ఒక రోజు అసలు నిజం బయటకు వస్తుందంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను’ అని రాజ్‌కుంద్రా చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement