విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ట్వీట్‌.. భార్యతో విడాకులు? | Raj Kundra Sensational Tweet That We are separated | Sakshi
Sakshi News home page

Raj Kundra: మేము విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ట్వీట్‌.. నెట్టింట వైరల్‌

Published Fri, Oct 20 2023 11:01 AM | Last Updated on Fri, Oct 20 2023 11:28 AM

Raj Kundra Sensational Tweet That We are separated - Sakshi

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా ట్విటర్‌లో పెట్టిన పోస్ట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. 'మేము విడిపోయాం.. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి' అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు. దీనికి గుండె ముక్కలైన ఎమోజీతో పాటు చేతులు జోడిస్తున్న గుర్తును జత చేశాడు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన ఈ ట్వీట్‌ చేశాడు.

సడన్‌గా ఏమైంది?
ఇది చూసిన జనాలు శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా విడాకులు తీసుకుంటున్నారా? మొన్నటివరకు బాగానే ఉన్నారుగా, ఇంతలోనే ఏమైంది? అని షాకవుతున్నారు. మరికొందరు మాత్రం ఆయన విడిపోతుంది తన భార్యతో కాదు మాస్క్‌తో అని అభిప్రాయపడుతున్నారు. కాగా 2021లో నీలిచిత్రాల కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా కొంతకాలంపాటు జైలు జీవితం గడిపాడు. బెయిల్‌ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియాకు తన ముఖం చూపేందుకు కూడా ఇష్టపడలేదు. ఎప్పుడు బయటకు వచ్చినా ఏదో ఒక మాస్క్‌తోనే కనిపించేవాడు.

ప్రమోషన్‌ స్టంట్‌?
ఇటీవలే అతడు తన జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. యూటీ 69 అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీలో రాజ్‌కుంద్రాయే ప్రధాన పాత్రలో నటించాడు. కాగా చాలాకాలంగా మాస్క్‌ చాటున ముఖం దాచుకుంటున్న అతడు యూటీ 69 ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మాస్క్‌ తీసేసి మీడియా ముందు నిలబడ్డాడు. బహుశా మాస్క్‌తో ఇక సంబంధం లేదని ఈ ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ నవంబర్‌ 3న విడుదల కానుంది. కాగా రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి వియాన్‌, సమీషా అని ఇద్దరు సంతానం.

చదవండి: అజిత్‌తో షూటింగ్‌ డుమ్మా కొట్టి మరీ లియో మూవీ చూసిన త్రిష.. థియేటర్‌లో విజయ్‌ అభిమాని ఎంగేజ్‌మెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement