బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఆ మధ్య పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే! అప్పటినుంచి ఆయనపై వ్యతిరేకత బీభత్సంగా పెరిగిపోయింది. అటు రాజ్‌కుంద్రా కూడా మీడియాకు ముఖం చూపించడం ఇష్టం లేక మాస్కు ధరించే తిరుగుతున్నాడు. ఎప్పుడు బయట కనిపించినా ఏదో ఒక కొత్తరకం మాస్కుతోనే బయట దర్శనమిస్తున్నాడు. అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె చెల్లితో కలిసి పార్టీలకు తిరుగుతున్నానని గతంలో ఓ షోలో వెల్లడించాడు.
భార్య పడుకోగానే మరదలితో పార్టీ
తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రాజ్ కుంద్రా తన భార్య శిల్పా శెట్టి, మరదలు షమితా శెట్టితో కలిసి ఓ షోకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'శిల్పా శెట్టిని చేసుకోవడం వల్ల నాకు చాలా కలిసొచ్చింది. పెళ్లైన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేది. పార్టీలు గట్రా నచ్చేవి కావు. రాత్రి 9 అవగానే నిద్రపోయేది. నాకు ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలనిపిస్తే ఆమె చెల్లెలిని పిలిచేవాడిని. తను నో చెప్పకుండా తోడు వచ్చేది.
ఆమెకు త్వరగా పెళ్లి కాకూడదు
అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్లాలంటే నా మైండ్‌లోకి ముందు షమిత పేరే వస్తుంది. అదే ఇంట్లో ఉండాలి, పుస్తకాలతో కాలక్షేపం చేయాలనుకున్నప్పుడు శిల్ప మదిలో మెదులుతుంది. అందుకే షమితాకు త్వరగా పెళ్లవాలని నేను కోరుకోను' అని చెప్పుకొచ్చాడు. కాగా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల నిశ్చితార్థం 2009 ఫిబ్రవరిలో జరిగింది. అదే ఏడాది నవంబర్ 22న పెళ్లి చేసుకున్నారు.
శిల్పా శెట్టి వెండితెర ప్రయాణం
బాజీఘర్ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసిన శిల్పా శెట్టి 'సాహస వీరుడు సాగర కన్య' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బాసు అనే తెలుగు చిత్రాలు చేసింది. ఎక్కువగా హిందీ సినిమాలు చేస్తూ అక్కడే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుండగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment