Shamita Shetty
-
టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా
తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసిన ఓ బ్యూటీ.. అరుదైన వ్యాధి బారిన పడింది. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాధ భరించలేకపోతున్నానని అని చెబుతూ అసలు తనకు ఏమైంది? ఈ వ్యాధి సంగతేంటి? అనే విషయాల్ని చెప్పుకొచ్చింది. అలానే మహిళలకు ఇలాంటివి సాధారణంగా వస్తుంటాయని కూడా చెప్పింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? అసలేమైంది?(ఇదీ చదవండి: హీరోతో వివాదం.. ఫేస్ బుక్ లో సినిమా పెట్టేసిన డైరెక్టర్!)హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లి షమితా శెట్టి తెలుగులోనూ 'పిలిస్తే పలుకుతా' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. కాకపోతే అక్కలా పెద్దగా పేరు అయితే తెచ్చుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు బయటపెట్టింది. దీని గురించి హాస్పిటల్ బెడ్‌పై ఉంటూనే వివరంగా చెప్పుకొచ్చింది.'మహిళలకు వచ్చే సమస్యలో ఇది సర్వ సాధారణమైనది. గర్భాశయంలో చాలా నొప్పిగా అనిపిస్తుంది. అలాంటిదే నాకు ఇప్పుడు వచ్చింది. దాదాపు 40 శాతం మంది మహిళలు ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. కాకపోతే మనలో చాలామందికి దీని గురించి తెలియదు. గత కొన్నాళ్ల నుంచి నేను దీని వల్ల నొప్పితో ఇబ్బంది పడ్డాను. కానీ డాక్టర్లు ఈ సమస్యకు మూలం ఏంటో గుర్తించారు. గర్భాశయంలో వచ్చిన ఈ సమస్యకు సర్జరీ ద్వారా పరిష్కారం దొరికింది' అని షమితా శెట్టి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్‌కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!)Did you know that almost 40 % of women suffer from Endometriosis.. and most of us are unaware of this disease!!! I want to thank both my dr s my gynac dr Neeta Warty and my Gp dr Sunita Banerjee for not stopping til they found out the root cause of my pain!🧿❤️ pic.twitter.com/T7dmTC2Cv4— Shamita Shetty 🦋 (@ShamitaShetty) May 14, 2024 -
'ఇంకా పెళ్లి చేసుకోలేదే'.. నోరు మూసుకో.. ఇంకోసారి!
నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా.. అని చెప్పేవాళ్లు సినిమాలోనే కనిపిస్తారు. నిజ జీవితంలో చాలా అరుదుగా ఉంటారు. అప్పుడే పెళ్లేంటి? కొన్నాళ్లు స్వేచ్ఛగా బతకనివ్వొచ్చుగా.. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం, ఆసక్తి ఎంతమాత్రమూ లేదని తేల్చి చెప్తుంటారు. సెలబ్రిటీలైతే కెరీర్ వెనక పరిగెడుతూ పెళ్లి విషయాన్నే మర్చిపోతుంటారు. ఈ క్రమంలో ఎంతోమంది తారలు చాలా ఆలస్యంగా వివాహం చేసుకోగా కొందరు మాత్రం లేటైపోయిందని పెళ్లినే లైట్ తీసుకుంటారు. నీ జీవితంలో ఇంతవరకు.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోదరి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ షమితా శెట్టికి 45 ఏళ్లు. ఇప్పటికీ సింగిల్‌గా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తనను చూసి కుళ్లుకుందో ఏమో కానీ ఓ మహిళ నోటిదూలతో సోషల్ మీడియాలో నటిపై సెటైర్లు వేసింది. 'నీకు 50 ఏళ్లు వచ్చేస్తున్నాయ్.. ఇంతవరకు నీ జీవితంలో మగాడే లేడు' అంటూ పరోక్షంగా పెళ్లి చేసుకోలేదని దెప్పిపొడిచింది. ఈ కామెంట్ చూసి చిరాకొచ్చిన షమిత దాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. నా జీవితానికి పెళ్లి.. 'ఇక్కడో దయామయురాలైన ఓ మహిళ నేను పెళ్లి చేసుకోలేదని, నన్ను చులకన చేయాలని ప్రయత్నిస్తోంది. ఆమెకోసం కాస్త సమయం కేటాయించైనా రిప్లై ఇవ్వాలనుకున్నాను.. అందుకోసమే ఇది! ముందుగా నీకు అభినందనలు. నువ్వు అనుకుంది సాధించావ్.. ఇక నువ్వు అన్న మాటలకు నా సమాధానమేంటంటే.. నా జీవితానికి పెళ్లి ఒక్కటే అర్థం, పరమార్థం కాదు. సంతోషంగా, తృప్తిగా, స్వతంత్రంగా నా కాళ్లపై నేను నిలబడి జీవిస్తున్నాను. నోరు మూసుకో.. నీ జీవితంలో కొంతైనా పాజిటివిటీతో బతుకు. ఇంకోసారి ఏ అమ్మాయిని ఇలా కిందకు లాగేందుకు ప్రయత్నించవని కోరుకుంటున్నాను. నీకు మంచి చెప్పడానికి మాటలు రాకపోతే నోరు మూసుకుని నిశ్శబ్దంగా ఉండటమే మేలు' అని ఘాటుగా కౌంటిచ్చింది. కాగా గతంలో షమితా శెట్టి.. రాకేశ్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరూ బిగ్‌బాస్ షోలో లవ్‌లో పడ్డారు. కానీ షో అయిపోయిన కొంతకాలానికే విడిపోయారు. చదవండి: ఐశ్వర్యపై నోరు జారేసుకున్న హీరో.. అక్కడున్నవాళ్లంతా షాక్.. -
'భార్య నిద్రపోగానే ఆమె చెల్లితో పార్టీకి వెళ్తా, తనకు పెళ్లి కాకూడదు'
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఆ మధ్య పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే! అప్పటినుంచి ఆయనపై వ్యతిరేకత బీభత్సంగా పెరిగిపోయింది. అటు రాజ్‌కుంద్రా కూడా మీడియాకు ముఖం చూపించడం ఇష్టం లేక మాస్కు ధరించే తిరుగుతున్నాడు. ఎప్పుడు బయట కనిపించినా ఏదో ఒక కొత్తరకం మాస్కుతోనే బయట దర్శనమిస్తున్నాడు. అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె చెల్లితో కలిసి పార్టీలకు తిరుగుతున్నానని గతంలో ఓ షోలో వెల్లడించాడు. భార్య పడుకోగానే మరదలితో పార్టీ తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రాజ్ కుంద్రా తన భార్య శిల్పా శెట్టి, మరదలు షమితా శెట్టితో కలిసి ఓ షోకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'శిల్పా శెట్టిని చేసుకోవడం వల్ల నాకు చాలా కలిసొచ్చింది. పెళ్లైన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేది. పార్టీలు గట్రా నచ్చేవి కావు. రాత్రి 9 అవగానే నిద్రపోయేది. నాకు ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలనిపిస్తే ఆమె చెల్లెలిని పిలిచేవాడిని. తను నో చెప్పకుండా తోడు వచ్చేది. ఆమెకు త్వరగా పెళ్లి కాకూడదు అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్లాలంటే నా మైండ్లోకి ముందు షమిత పేరే వస్తుంది. అదే ఇంట్లో ఉండాలి, పుస్తకాలతో కాలక్షేపం చేయాలనుకున్నప్పుడు శిల్ప మదిలో మెదులుతుంది. అందుకే షమితాకు త్వరగా పెళ్లవాలని నేను కోరుకోను' అని చెప్పుకొచ్చాడు. కాగా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల నిశ్చితార్థం 2009 ఫిబ్రవరిలో జరిగింది. అదే ఏడాది నవంబర్ 22న పెళ్లి చేసుకున్నారు. శిల్పా శెట్టి వెండితెర ప్రయాణం బాజీఘర్ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసిన శిల్పా శెట్టి 'సాహస వీరుడు సాగర కన్య' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బాసు అనే తెలుగు చిత్రాలు చేసింది. ఎక్కువగా హిందీ సినిమాలు చేస్తూ అక్కడే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుండగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించనుంది. View this post on Instagram A post shared by Laughter Club 💠 (@laughterclubdelhi) చదవండి: పాలబుగ్గల పసివాడిని గుర్తుపట్టారా? మెగాస్టార్ వారసుడు.. దుబాయ్‌లో ఉద్యోగం వదిలి హీరోగా.. తెలుగులో సూపర్ క్రేజ్! -
స్టార్ హీరోయిన్ చెల్లెలితో డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పరిచయం అక్కర్లేని పేరు. కానీ ఆమె చెల్లెలు షమితా శెట్టి కొద్దిమందికే తెలుసు. బాలీవుడ్లో మొహబత్తీన్ మూవీ ఎంట్రీ ఇచ్చిన భామ తెలుగులోనూ పిలిస్తే పలుకుతా చిత్రంలో నటించింది. అంతే కాకుండా హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొన్న సందడి చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ చిత్రంలో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మపై బీ టౌన్లో డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని గాసిప్స్ గుప్పమంటున్నాయి. ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్లో కనిపించడంతో ఈ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే తాజాగా ఈ వార్తలపై అమీర్ అలీ స్పందించారు. (ఇది చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్) అమీర్ అలీ మాట్లాడుతూ..' నేను ఒంటరిగా ఉన్నానంటే డేటింగ్లో ఉన్నట్లు కాదు.. నేను ఎవరితోనైనా బయటకు వెళ్లినప్పుడు ఇలాంటి వార్తలొస్తున్నాయి. నేను నా స్నేహితులతో కలిసి డిన్నర్ కోసం బయటకు వెళ్తాం. అంతే కాదు నా ఫ్రెండ్ బర్త్‌డే వేడుకల కోసం రెస్టారెంట్‌కు వెళ్లాం. అదే సమయంలో నా స్నేహితురాలు షమితాశెట్టి కూడా వచ్చింది. అదే సమయంలో నేను ఆమెను డ్రాప్ చేయడానికి వెళ్లా. అంతే మరుసటి రోజే నా ఫ్రెండ్ ఫోన్ మీరు ఆమెతో డేటింగ్లో ఉన్నట్లు విన్నానంటూ చెప్పాడు. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. మేము ఇప్పటికీ మంచి స్నేహితులం. నేను ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోను. నేను వాటి గురించి ఆలోచిస్తే జీవితంలో ముందుకెళ్లలేను.' అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ జంటపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు అమీర్ అలీ. కాగా.. అమీర్ అలీ 'ఎఫ్ఐఆర్', 'ఢిల్లీ వలీ ఠాకూర్ గర్ల్స్', 'సరోజినీ-ఏక్ నయీ పెహల్' వంటి షోలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా నాచ్ బలియే, 'జరా నచ్కే దిఖా 2' లాంటి రియాలిటీ షోలలో పాల్గొన్నాడు. అతను తన మొదటి భార్య సంజీదా షేక్‌తో విడాకులు తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే అమీర్ షమితా శెట్టితో కనిపించడంతో డేటింగ్ పుకార్లు వ్యాపించాయి. తాజాగా కామెంట్స్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టాడు. (ఇది చదవండి: ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది) View this post on Instagram A post shared by Shamita Shetty (@shamitashetty_official) -
బాలీవుడ్ నటుడితో శిల్పా శెట్టి సోదరి డేటింగ్. నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్
బాలీవుడ్ నటి షమితా శెట్టి అంటే చాలామందికి తెలియదు. శిల్పా శెట్టి సోదరి అంటే చాలామందికి వెంటనే గుర్తుకొస్తుంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి 'పిలిస్తే పలుకుతా' చిత్ర౦తో తెలుగు సినిమారంగంలో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి. ఆమె బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేశాయి. అయితే వీటిపై తాజాగా ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేం లేదంటూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తాను సింగిల్‌గానే చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. నా అభిప్రాయాలను పంచుకునేందుకు ఇదే సరైన సమయమని చెప్పుకొచ్చింది. ఏదైనా చెప్పే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇటీవల అమీర్ అలీతో షమితా శెట్టి ఓ వీడియో ముద్దులు పెట్టుకోవడంతో అది కాస్తా వైరలైంది. షమితా శెట్టి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'సమాజంలో ఇలాంటి మనస్తత్వంతో నేను అయోమయంలో ఉన్నాను. రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా ఎలా చెప్తారు. ఇది నెటిజన్ల భావనలకు నిదర్శనం. అందుకే నేను నోరు విప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం సింగిల్‌గానే హ్యాపీగా ఉన్నా. వీటిపై కాకుండా ఈ దేశంలోని మరిన్ని ముఖ్యమైన సమస్యలపై దృష్టి పెట్టండి.' కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది బాలీవుడ్ భామ. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
‘బిగ్‌బాస్’లో ప్రేమ..ఏడాదికే బ్రేకప్
బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్కటైన వారిలో షిమితా శెట్టి, రాకేశ్ బాపత్ జంట ఒకటి. హిందీ బిగ్‌బాస్ ఓటీటీకి కంటెస్టెంట్ వెళ్లిన వీరిద్దరు జంటగా బయటకు వచ్చారు. హౌజ్‌లో ప్రేమలో పడ్డ షమితా-రాకేశ్ మధ్య కెమిస్ట్రి చూసి వారి ప్యాన్స్ తెగ ముచ్చటపడ్డారు. హౌజ్‌ను నుంచి బయటకు వచ్చిన అనంతరం కూడా వీరు వారి రిలేషన్ కొనసాగించారు. జంటగ పార్టీలకు, డిన్నర్లకు వెళ్లెవారు. అయితే ఏమైందో ఏమో కానీ కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. కలిసిన ఏడాదికే ఈ జంట బ్రేకప్ చెప్పుకుందంటూ బాలీవుడ్ మీడియాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై వారెప్పుడు స్పందించలేదు. చదవండి: మరి మహిళల నగ్న చిత్రాల సంగతేంటి?: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ దీంతో ఇవి వట్టి పుకార్లనేనని ఈ జంట ఫ్యాన్స్ అభిప్రాయం పడ్డారు. తాజాగా ఇదే వార్తలను నిజం చేస్తూ ఫ్యాన్స్‌కి షాకిచ్చారు ఈ లవ్‌బర్డ్స్. ఇకపై తమ దారులు వేరంటూ బ్రేకప్‌పై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ మేరకు షమితా-రాకేశ్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ‘ఇది మీతో క్లియర్ చేసుకోవడగం ముఖ్యం అనుకుంటున్నాను. నేను రాకేశ్ కొంతకాలంగా కలిసి ఉండటం లేదు. ఇకపై కూడా ఉండబోం. మా దారులు వేరు. మాపై చూపించిన మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞురాలిని. ఇకపై కూడా ఇలాగే వేరువేరుగా మాపై ప్రేమ చూపిస్తారని ఆశిస్తున్నా’ అంటూ షమితా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నోట్ షేర్ చేసింది. అలాగే రాకేశ్ బాపత్ సైతం పోస్ట్ చేస్తూ ఇకపై తమ దారులు వేరంటూ బ్రేకప్‌పై ప్రకటన ఇచ్చాడు. కాగా నటి శిల్పాశెట్టి సోదరి అయిన షమితా శెట్టి ‘పిలిస్తే పలుకుతా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చదవండి: ధనుష్‌తో గొడవలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
ఎవరు లవ్‌లో ఉన్నారు? ఎవరెలాంటి డ్రెస్‌లు వేసుకున్నారు? ఎప్పుడూ ఇదేనా?
హిందీ బిగ్‌బాస్ షోలో లవ్ జర్నీ మొదలుపెట్టారు శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి- రాకేశ్ బాపత్. ఈ ప్రేమజంటను చూసి ముచ్చటపడిపోయారు ఫ్యాన్స్. షో ముగిసిన తర్వాత కూడా తరచూ కలిసి పార్టీలకు, డిన్నర్లకు వెళ్లేవారు. అయితే వీరి ప్రేమను చూసి ఎవరికి కన్ను కుట్టిందో, ఏమో కానీ, కొన్నాళ్లకే వీరు విడిపోయారు. ఈ విషయాన్ని వాళ్లు అధికారికంగా ప్రకటించలేదు గానీ పలు సందర్భాల్లో పరోక్షంగా విడిపోయామని సమాధానమిచ్చారు. అయితే ఈ బ్రేకప్‌కు రాకేశ్ కారణమని పలువురు అతడిని తిట్టిపోశారు. తాజాగా తనను ట్రోల్ చేసినవారి నోరు మూయించాడీ బిగ్‌బాస్ కంటెస్టెంట్. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ అండ్ వైట్ ఫొటో అప్లోడ్ చేసిన ఆయన ఓ పెద్ద నోట్ వదిలాడు. 'ఎవరు డేటింగ్ చేస్తున్నారు? ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు? ఎవరి కుటుంబం ఉన్నతమైనది, లేదంటే ఎవరి ఫ్యామిలీ చెత్తగా ఉంది? ఎవరికోసం ఎవరు నిలబడుతున్నారు? అన్న విషయాలను పక్కన పెట్టి.. నా లక్ష్యం ఏంటి? నేను సమాజానికి ఏమివ్వాలి? నా కుటుంబానికి నేనేం చేయగలను, జనాలు ఎలా సాయపడాలి? నా దగ్గరున్న డబ్బును ఎలా కాపాడుకోవాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇంకా నేను ఎలాంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి? నన్ను నేను ఉన్నతంగా మలుచుకోవాలి? వంటి అంశాలపైన ఫోకస్ చేయండి. ఇదేమీ అంత కష్టం కాదు. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే తప్పకుండా దీన్ని అనుసరించేందుకు ఇష్టపడతారు' అని రాసుకొచ్చాడు రాకేశ్. పక్కనోడి జీవితం గురించి ఆలోచించడం మానేసి ముందు నీకోసం నువ్వు ఆలోచించుకోమని గట్టిగానే చెప్పాడీ నటుడు. ఇకపోతే కొన్ని వారాల క్రితం షమిత శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మంచి బంధం కూడా ముగిసిపోయింది అంటూ వీరి బ్రేకప్ గురించి హింట్ ఇచ్చింది. మొత్తానికి కలిసి ఉంటారనుకున్న ఈ జంట విడివిడిగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వారి అభిమానులు. ఇదిలా ఉంటే రాకేశ్ ఈ మధ్యే సర్సేనాపతి హంబిరావు అనే మరాఠీ సినిమాతో అలరించాడు. View this post on Instagram A post shared by Raqesh Bapat (@raqeshbapat) చదవండి: ‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా! 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా' -
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో బ్రేకప్ వార్తలపై స్పందించిన షమితా శెట్టి
బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఎంతోమంది కపుల్స్‌గా ఫేమస్ అయిన వాళ్లు ఉన్నారు. బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాక్‌లు కామనే. ఆ తర్వాత ఎవరిదారులు ఎవరు చూసుకునే జంటల్ని కూడా చూస్తుంటాం. అయితే చాలా కొద్ది మంది మాత్రమే బిగ్‌బాస్ తర్వాత కూడా తమ బంధాన్ని కొనసాగిస్తారు. అలాంటి జోడీనే షమితా శెట్టి- రాకేశ్ బాపత్. బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి చెల్లెలిగానే పరిచయం ఉన్న షమితా బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్బాస్లోషమితా-రాకేశ్‌ల ప్రేమాయణం షో మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. బిగ్‌బాస్ అనంతరం కూడా వీరు రిలేషన్లో ఉన్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు బీటౌన్‌లో ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి తరుణంగా అనూహ్యంగా షమితా-రాకేశ్‌లు విడిపోయారంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పుమన్నాయి. మనస్పర్థల కారణంగా బ్రేకప్ చెప్పేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై స్పందించిన షమితా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఎటువంటి నిజం లేలు. పుకార్లను నమ్మవద్దని కోరుకుంటున్నాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. అనంతరం రాకేశ్ కూడా ఇదే పోస్ట్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో షమితా-రాకేశ్‌ల బ్రేకప్ న్యూస్‌కి తెరపడినట్లయ్యింది. -
శిల్పాశెట్టి, ఆమె సోదరి షమిత శెట్టిలకు కోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే భర్త రాజ్‌కుంద్రా అశ్లీల వీడియో కేసుతో ఆమె కఠిన పరిస్థితులను చూస్తున్న తరుణంలో కోర్టు కేసులు, చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తాజాగా శిల్పా శెట్టికి కోర్టు సమన్లు జారీ చేసింది. తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునంద, సోదరి షమితా శెట్టికి కోర్టు నోటీసులు ఇచ్చింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఆరోపిస్తూ ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని ముంబైలోని అంధేరీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో అతడి ఫిర్యాదు మేరకు ఈ నెల 28న కోర్టులో హాజరు కావాలంటూ శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితాశెట్టి, తల్లి సునందశెట్టిని కోర్టు ఆదేశించింది. చదవండి: నేను ఆ టైప్ కాదు, నటినని నా బాయ్‌ఫ్రెండ్ వదిలేశాడు: హీరోయిన్ కేసు వివరాల్లోకి వెళితే.. శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని నుంచి 2015లో రూ.21 లక్షల రుణం తీసుకున్నారు. రుణం తిరిగి 2017 జనవరి నాటికి చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నారు. అయితే, సురేంద్ర శెట్టి 2016, అక్టోబర్ 11న మృతి చెందారు. ఈ విషయం శిల్పాశెట్టితో పాటు ఆమె తల్లికి తెలుసని, అయినా డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారని ముంబైకి చెందిన వ్యాపారవేత్త పర్హద్ అమ్రా ఆరోపించారు. ఈ మేరకు గత శుక్రవారం జుహూ పోలీస్ స్టేషన్లో శిల్పా కుటుంబంపై ఫిర్యాదు చేయగా.. శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితాశెట్టి, తల్లిపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ నెల 28న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. -
బిగ్‌బాస్ 15 టైటిల్ విన్నర్ సస్పెన్స్‌కు తెర.. ఎంత డబ్బు గెలుచుకున్నారంటే
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవమరించిన హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 ముగిసింది. 24మంది సెలబ్రిటీలతో సుమారు 120 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. విన్నర్‌గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠకు తెరపడింది. ప్రతీక్ సెహజ్ పాల్- తేజస్విని మధ్య సాగిన టైటిల్ రేసులో చివరికి సీరియల్ నటి తేజస్విని ప్రకాశ్ విజయం సాధించింది. బిగ్‌బాస్ సీజన్-15 ట్రోఫీతో పాటు రూ.40 లక్షల నగదు బహుమతిని అందుకుంది. అంతేకాకుండా పాపులర్ నాగిని సీరియల్ తర్వాతి సీక్వెల్ (నాగిని-6)లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కాగా 2015లో వచ్చిన 'స్వరాగిణి' సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన తేజస్విని ఆ సీరియల్‌తో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఇప్పుడు మరింత పాపులర్ అయ్యింది. ఇక ఈ సీజన్లో ప్రతీక్ రన్నరప్‌గా నిలవగా, కరణ్ కుంద్రా, షమితా శెట్టి మూడు, నాలుగో స్థానంలో నిలిచారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
BIGG BOSS 15: విశాల్ ఒక బెస్ట్ బిట్చింగ్ పర్సన్: షమిత శెట్టి తల్లి
హిందీ బిగ్ బాస్ 15 వివిధ కారణాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. అందుకు గల కారణాల్లో విశాల్ కోటియన్, షమితా శెట్టి మధ్య ఉన్న అన్నా- చెల్లెలి సంబంధం. అయితే ఇప్పటివరకు ఆ బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన సెలబ్రిటీ గెస్ట్‌లందరూ విశాల్ వెన్నుపోటు పొడుస్తున్నాడని చెప్పారు. రీసెంట్గా నటుడు రాకేష్ బాపట్, షమితా శెట్టికి ఉన్న లవ్ ఎఫైర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశాడు. రాకేష్ పేరును విశాల్ ఎగతాలి చేస్తున్న వీడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాకేష్, షమితా శెట్టి రిలేషన్‌షిప్‌ను ఎగతాళి చేస్తున్నాడు విశాల్. షమితను తనతో ప్రేమలో పడేయటం వల్ల రాకేష్ మంచి జాక్‌పాట్ కొట్టాడని విశాల్ అన్నాడు. అందువల్లే రాకేష్‌కు ఒకదాని తర్వాత ఒకటి షో ఆఫర్స్ వస్తున్నాయని కూడా చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై షమితా తల్లి సునంద శెట్టి తీవ్రంగా స్పందించింది. అతని కామెంట్స్‌పై మండిపడింది. షమితా శెట్టి, రాకేష్‌కు మద్దతుగా నిలిచారు సునంద శెట్టి. విశాల్ చేసిన కామెంట్స్ వీడియోను పోస్టు చేస్తూ ఆమె ఇలా రాసుకొచ్చింది. 'షమితను విశాల్ అక్కా అని పిలుస్తాడు. మళ్లీ తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడతాడు. విశాల్ నమ్మదగినవాడు కాదు. అతను ఒక బెస్ట్ బిట్చింగ్ పర్సన్.' https://t.co/TFebohcN5z 🐍Vishal Kotian usual best bitching at Shamita - he calls Akka (sister)& drags her family most untrustworthy 😡simply not done #ShamitaShetty #ShaRa #BeingSalmanKhan @TheShilpaShetty #OrmaxMedia #Colors15 #QueenShamita #EndemolShine #ShamitalsTheBoss — Sunanda Shetty (@SunandaShetty5) November 10, 2021 బిగ్ బాస్ 15లోకి ప్రవేశించిన రాకేష్ నవంబర్ 8న నొప్పితో బాధపడ్డాడు. నవంబర్ 9న ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఉన్న హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం రాకేష్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో అబ్జర్వేషన్లో ఉన్నాడు. అతను కోలుకున్నాక మళ్లీ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెడతడాని అందరూ భావిస్తున్నారు. -
'నా మాజీ భార్య ఎవరినైనా ఇష్టపడ్డా నేను సంతోషిస్తా'
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ టాప్5 కంటెస్టెంట్లు రాకేత్ బాపత్, షమితా శెట్టి ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నారు. హౌస్‌లో ఇద్దరి మధ్యా నడిచిన ప్రేమాయణం షో మొత్తానికే హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఈ సీజన్ గ్రాండ్‌గా ముగిసింది. అయితే షో అయిపోయిన తర్వాత కూడా వీరు ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఇటీవలె ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్‌కు సైతం వెళ్లారు. ఈ సందర్భంగా యూ అండ్ ఐ అంటూ ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసుకున్నారు. చదవండి : ఖరీదైన కారును వదిలి ఆటోలో ప్రయాణించిన హీరోయిన్ ఇదిలా ఉండగా బిగ్‌బాస్ షో అనంతరం తన మాజీ భార్య రిధితో మాట్లాడానని, షమితాతో నా రిలేషన్‌ని ఆమె స్వాగతించిందని తెలిపాడు. 'నా బిగ్‌బాస్ జర్నీ పట్ల రిధికి కూడా నచ్చింది. అంతేకాకుండా నేనే షమితాతో ఉండటం చూసి ఆమె సంతోషించింది. అంతేకాకుండా ఒకవేళ రిధి ఎవరినైనా ఇష్టపడ్డా నేను సంతోషిస్తా. ఎవరి నిర్ణయాలు వాళ్లవి. మేం ఇద్దరం ఎంతో మెచ్యూర్‌గా ఆలోచిస్తాం. భార్యభర్తలుగా విడిపోయినా ఇప్పటికీ మేం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాం' అని పేర్కొన్నారు. కాగా ఏడేళ్ల వివాహ బంధం అనంతరం రాకేశ్ రిధి దంపతులు విడాకులు తీసుకున్నారు. చదవండి :సారికతో కపిల్‌దేవ్ బ్రేకప్ లవ్‌స్టోరీ -
బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్‌గా దివ్య, ఎంత గెలుచుకుందంటే?
బిగ్‌బాస్ ఓటీటీ షో గ్రాండ్‌గా ముగిసింది. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో బుల్లితెర నటి దివ్య అగర్వాల్ విజేతగా అవతరించింది. శనివారం(సెప్టెంబర్ 18)న జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో దివ్య బిగ్‌బాస్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో పాటు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. నిషాంత్ భట్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. షమితా శెట్టి, రాకేశ్ బాపత్, ప్రతీక్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నారు. బిగ్‌బాస్ ఓటీటీ స్పెషాలిటీ ఏంటంటే? హిందీలో బిగ్‌బాస్ 14 సీజన్లు పూర్తయ్యాయి. త్వరలో 15వ సీజన్ ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సీజన్ రావడానికి ముందే ప్రయోగాత్మకంగా బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. దీనికి స్టే కనెక్టెడ్ అన్న ట్యాగ్‌లైన్ ఇచ్చారు. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో కేవలం ఓటీటీ ప్లాట్‌ఫామ్ వూట్లోనే ప్రసారమైంది. ఏడు వారాలపాటు ప్రసారమైన ఈ షోను మినీ బిగ్‌బాస్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో బిగ్‌బాస్ ఓటీటీ టైటిల్ గెలుచుకున్న దివ్య బిగ్‌బాస్ 15వ సీజన్లో ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం ఉందా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. అదే సమయంలో ప్రతీక్.. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 15వ సీజన్లో పాల్గొననున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎవరీ దివ్య అగర్వాల్ దివ్య అగర్వాల్ విషయానికొస్తే ఆమె నటి, డ్యాన్సర్. MTV స్ప్లిట్స్‌విల్లా 10వ సీజన్లో పాల్గొన్నప్పుడు ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అంతేకాదు, ఈ సీజన్లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. MTV ఏస్ ఆఫ్ స్పేస్ 1లో పాల్గొని విజేతగా అవతరించింది. రియాలిటీ షోస్ క్వీన్ దివ్య ద ఫైనల్ ఎగ్జిట్ అనే సినిమాలోనూ నటించింది. గతంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక శర్మతో పీకల్లోతు ప్రేమ వ్యవహారంతో ఆమె మరింత హైలైట్ అయింది. ప్రస్తుతం ఆమె ఖత్రోన్ కీ ఖిలాడీ 11వ సీజన్ ఫేమ్ వరుణ్ సూద్‌తో డేటింగ్ చేస్తున్నట్లు భోగట్టా! View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
బిగ్‌బాస్ :‘ శిల్పా నిన్ను చాలా మిస్ అవుతోంది’
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అమెరికన్ టీవీ సిరీస్ బిగ్ బ్రదర్ నుంచి ప్రేరణ పొందిన ఈ రియాలిటీ షో ప్రారంభించిన అన్ని భాషల్లోనూ ఎంతో ప్రాచుర్యం పొందింది. కాగా హిందీలో ప్రస్తుతం బిగ్‌బాస్ 15వ సీజన్ నడుస్తోంది. ప్రతి సీజన్లోనూ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను హౌస్‌లోకి తీసుకురావడం పరిపాటిగా మారింది. కాగా, తాజాగా జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్, శిల్పా సోదరి షమితా శెట్టి తల్లి షోలోకి ప్రవేశించింది. ఎంతో ధైర్యంగా మాట్లాడి, కూతురిని ప్రోత్సహించింది. ఆ సమయంలో షమితా శిల్పా ఎలా ఉందని అడగగా.. ‘ఆమె బావుంది. నిన్ను ఎంతో మిస్ అవుతోంది. ఎంత బిజీగా ఉన్న నీ గురించి ఎప్పటికప్పుడూ అడిగి తెలుసుకుంటోంది. మన ఇంట్లోని మహిళమైన శిల్పా, నువ్వు, నేను ఎంతో ధైర్యవంతులం. కాబట్టి ఏమి ఆలోచించకుండా సంతోషంగా ఉండు. నీ ఆట నువ్వు ఆడు’ అంటూ సునంద కూతురిని ఉత్సాహపరిచింది. అంతేకాకుండా, సునంద హౌస్మేట్స్ అందరూ బాగా గేమ్ ఆడుతున్నారని పొగిడింది. మొదట షమితా స్నేహితుడు రాకేష్‌తో మాట్లాడిన ఆమె వారిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారని తెలిపింది. ప్రతి విషయంలోనూ కూతురికి సపోర్టుగా ఉంటున్నందుకు నేహకి ధన్యవాదాలు తెలిపింది. View this post on Instagram A post shared by Shamita Shetty FC (@shamitafc) -
ప్రియుడిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే హిందీతో పాటు ఇతర భాషల్లోనూ ఆ షో విజయవంతంగా నడుస్తోంది. మరోవైపు కేవలం ఓటీటీ వేదికగా టెలికాస్ట్ అవుతున్న కరణ్ జోహార్ బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్‌లో ఒకరైన షమితా శెట్టి మొదటి సారి తన వ్యక్తిగత విషయాలను మరో కంటెస్టెంట్‌తో పంచుకొని ఎమోషనల్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోదరి అనే విషయం తెలిసిందే. నా మొదటి ప్రేమ అలా.. తన తోటి కంటెస్టెంట్ నేహాతో జరిగిన సంభాషణలో.. తన మొదటి బాయ్‌ఫ్రెండ్ కారు ప్రమాదంలో మరణించాడని తెలిపింది. ఆ సమయంలో అతనితో తన అనుబంధాన్ని, అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనైంది. అయితే వ్యక్తిగత విషయాల్లో ఎంతో గోప్యంగా ఉండే ఆమె ఇలాంటి విషయాలు పంచుకోవడం విశేషం. అనంతరం షమితా రాకేష్ బాపత్‌తో మాట్లాడుతూ.. ‘ఆమె ఒంటరిగా ఉన్నా ఎంతో స్ట్రాంగ్‌గా ఉండేదని, కానీ కోవిడ్ వల్ల విధించిన లాక్డౌన్ సమయంలో మాత్రం ఒంటరితనంగా ఫీల్ అయినట్లు’ తెలిపింది. అలాగే తన తండ్రి మరణానంతరం తన భుజాలపై పడిన బాధ్యతల గురించి కూడా ఆ బ్యూటీ వివరించింది. ఇంకా శిల్పా సోదరిగానే.. ‘నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పైనే గడిచిపోయాయి. ఇప్పటి వరకు అందరూ నన్ను శిల్పాశెట్టి సోదరిగానే గుర్తిస్తున్నారు. ఆమె నాకు నీడలా ఉంది. అది నాకు సంతోషంగానే ఉన్నప్పటికి నా గురించి నిజం జనాలకు తెలీదు’ అని షోలో షమితా శెట్టి తెలిపింది. ఆ నీడ నుంచి బయటపడి తను ప్రత్యేక గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కాగా షో చూసిన వారికి ఎవరికైనా షమితా శెట్టి, రాకేష్ బాపత్కి మధ్య మంచి బంధం ఉందనే విషయం అర్థమవుతుంది. రాకేష్ అంటే తనకి ఇష్టమని, కానీ అవసరమైన సమయంలో తనని డిఫెండ్ చేసేవాడు తనకి కావాలని ఆమె షోలో చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: Bigg Boss 5 Telugu: మా అమ్మతో రవికి గట్టిగానే ఉంటుంది: మానస్ -
హీరోయిన్‌కు చేదు అనుభవం..!
సాక్షి, క్రైమ్ : ప్రముఖ నటి షమితా శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. షమితా వెళ్తున్న వాహనాన్ని బైక్‌పై వెళ్తున్న ఓ ముగ్గురు వ్యక్తులు డీకొట్టారు. అంతటితో ఆగకుండా.. షమితను దూషించారు. అడ్డుతగిలిన కారు డ్రైవర్‌ను కొట్టారు. దీంతో షమితా ఆ ముగ్గురిపై థానేలోని రబోడీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై కూడా దాడి చేశారని కారు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు.. ఆ బైక్‌ను కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఆ ముగ్గురిని పట్టుకుంటామన్నారు. ‘పిలిస్తే పలుకుతా’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన షమితా.. ఆ చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. షమితా షెట్టి బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి సోదరి. -
అలాంటి తప్పులు మళ్లీ చేయను: నటి
ముంబై: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీగా దూరమైన నటి షమితా శెట్టి తన మనసులో మాటను బయటపెట్టింది. సువర్ణ్ వర్మ డైరెక్షన్లో వెబ్ సిరీస్‌తో మళ్లీ మన ముందుకు రానున్నట్లు చెప్పింది. ఇండియా రన్ వే వీక్ 2017లో పాల్గొన్న సందర్భంగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. 'సినిమాలే జీవితంగా బతికిన ఆర్టిస్ట్.. ఒక్కసారిగా రంగుల ప్రపంచానికి దూరమైతే చాలా కోల్పోయినట్లు ఉంటుంది. అయితే ఈ విషయాన్ని చాలాకాలం తర్వాత గ్రహించాను. ఒక విషయం మీరు గమనించాలి. ఒకసారి యాక్టర్ అయితే ఎప్పుడైనా యాక్టర్‌గానే ఉంటారు. గతంలో చేసిన తప్పుల్ని మళ్లీ చేసేందుకు సిద్ధంగా లేను. ప్రస్తుతం చేస్తున్న వెబ్ సిరీస్‌తో చాలా హ్యాపీగా ఉన్నాను. అంతా సక్రమంగా జరిగితే నె రోజుల్లోనే మీరు వెబ్ సిరీస్‌లో నన్ను చూస్తారు. ఇంతకు మించి ఈ ప్రాజెక్టు గురించి ఏ వివరాలు వెల్లడించలేను' అంటోంది. డిజైనర్ రిటాంభారా పాలియా కలెక్షన్లను ర్యాంపుపై ప్రదర్శించి ఇటీవల ఓ ఈవెంట్లో విన్నర్‌గా నిలిచింది ఈ బ్యూటీ. ఇంటీరియర్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన షమితా.. మోడల్‌గా రాణించి ఆపై బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మేకప్ వేసుకోనున్నట్లు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. -
బాలీవుడ్ తార శిల్పాశెట్టి నేత్రదానం!
అన్ని దానాల్లో నేత్రదానం గొప్పదని బాలీవుడ్ తార శిల్పాశెట్టి తెలియ చెప్పారు. తాజాగా శిల్పాశెట్టి నేత్రదానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. యశ్వంత్ సమాజిక్ ప్రతిస్థాన్ సామాజిక సంస్థకు తన నేత్రాలను శిల్పాశెట్టి దానం చేశారు. తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్న తర్వాత ఆహ్వద్ నగర్ లోని సోనాయ్ గ్రామంలోని శని శింగనపూర్ ఆలయంలో శిల్పాశెట్టి పూజలు నిర్వహించారు. నా మరణం తర్వాత నా కళ్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మరొకరి దృష్టిని ప్రసాదిస్తుందనే విషయం తనకు సంతృప్తిని కలిగిస్తోందని శిల్పాశెట్టి అన్నారు. ఐపీఎల్ తన జట్టు రాజస్థాన్ రాయల్స్ ఐదవ స్థానంలో నిలవడాన్ని ఎప్పుడో మరిచిపోయాను.. ఓటమిని ఎక్కువగా గుర్తుంచుకోనని ఆమె అన్నారు. ఓటముల నుంచి తన జట్టు పాఠాలు నేర్చుకుంటుందన్నారు. శిల్ప సోదరి షమితా శెట్టి కూడా తన నేత్రాలను దానం చేయడం విశేషం. -
లాక్మే గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ తారలు