ఏజ్‌బార్‌ అయ్యావంటూ ట్రోల్‌.. ఏదీ శాశ్వతం కాదన్న నటి | Shamitha Shetty Savage Reply To Troll Questioning Her Single Life At 47, Says Why Do Such Men Follow Single Women | Sakshi
Sakshi News home page

'ముసలిదానివైపోతున్నావ్‌.. ఈపాటికి పెళ్లయ్యుంటే..' ట్రోల్స్‌కు నటి కౌంటర్‌

May 28 2026 9:26 AM | Updated on May 28 2026 11:04 AM

Shamitha Shetty Savage reply to Toll Questioning her Single Life at 47

పెళ్లి కచ్చితంగా చేసుకోవాలా? అంటే ఎవరిష్టం వారిది! అందులోనూ కొందరు సెలబ్రిటీలు వయసు దాటిపోతున్నా లెక్క చేయకుండా తమకు నచ్చినప్పుడే మ్యారేజ్‌ లైఫ్‌లో అడుగుపెడుతుంటారు. మరికొందరేమో పెళ్లి చేసుకోకపోతే జరిగే నష్టమేం లేదంటూ సింగిల్‌గానే బతికేస్తుంటారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పా శెట్టి చెల్లెలు, నటి షమితా శెట్టి కూడా 47 ఏళ్లొచ్చినా సింగిల్‌ లైఫ్‌యే బిందాస్‌ అంటూ బతికేస్తోంది.

ఏజ్‌ షేమింగ్‌
వారి మానాన వాళ్లు బతుకుంటే కొందరు అనవసరంగా ట్రోల్‌ చేస్తూ ఉంటారు. అలా ఓ వ్యక్తి షమిత వయసును ఉద్దేశిస్తూ కించపరిచేలా మాట్లాడాడు. నువ్వు ముసలిదానివైపోతున్నావ్‌.. ఒకప్పటిలా లేవని హేళన చేశాడు. ఆ కామెంట్‌కు సోషల్‌ మీడియా వేదికగా కౌంటరిచ్చింది షమిత. అవును, కాలంతో పాటు అన్నీ మారుతుంటాయి. అందుకు నేను కూడా అతీతురాలిని కాదు. 

పెళ్లయ్యుంటే ఈపాటికి..
జీవితంలో వయసు పెరిగేకొద్దీ మార్పులు జరగడం అనేది చాలా సహజసిద్ధమైన ప్రక్రియ. అందంతోపాటు ఏదీ శాశ్వతంగా ఉండదు. కానీ ఈ వయసులోనూ నేను చాలా ఫిట్‌గా, సంతోషంగా ఉన్నాను. అది ఆ దేవుడు ఇచ్చిన వరం.. నాకదే చాలు అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. మరో నెటిజన్‌ ఆమె పెళ్లి గురించి ట్రోల్‌ చేశాడు. నువ్వు సరైన సమయంలో పెళ్లి చేసుకుని ఉండుంటే ఈపాటికి నీకు పిల్లలు పుట్టి నీ అంత అయ్యేవారు అని సెటైర్‌ వేశాడు. 

అన్‌ఫాలో చేయ్‌
అందుకు షమిత స్పందిస్తూ.. అసలు మీరు పెళ్లి చేసుకుని ఏం సాధించారు? అయినా మీలాంటివారు మాలాంటి ఒంటరి మహిళల్ని ఎందుకు ఫాలో అవుతారు? మీ పురుషాధిక్య ఆలోచనల్ని మాపై రుద్దడానికా? మమ్మల్ని అవమానించడానికా? దయచేసి నాకో సాయం చేయు.. వెంటనే నన్ను అన్‌ఫాలో చేయు అని కోరింది. షమితా శెట్టి.. మొహబ్బతే, క్యాష్‌ వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో 'పిలిస్తే పలుకుతా' మూవీలో కథానాయికగా నటించింది. హిందీ బిగ్‌బాస్‌ 3, 15వ సీజన్లలో పాల్గొంది. ద టెనంట్‌ (2023) సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది.

చదవండి: ఆ ఆరు సినిమాల్లో పెద్ది ఫస్ట్‌ ప్లేస్‌: జగపతిబాబు

Advertisement
 
Advertisement
Advertisement