హిందీ బిగ్ బాస్ 15 వివిధ కారణాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. అందుకు గల కారణాల్లో విశాల్ కోటియన్, షమితా శెట్టి మధ్య ఉన్న అన్నా- చెల్లెలి సంబంధం. అయితే ఇప్పటివరకు ఆ బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన సెలబ్రిటీ గెస్ట్‌లందరూ విశాల్ వెన్నుపోటు పొడుస్తున్నాడని చెప్పారు. రీసెంట్‌గా నటుడు రాకేష్ బాపట్, షమితా శెట్టికి ఉన్న లవ్ ఎఫైర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశాడు. రాకేష్ పేరును విశాల్ ఎగతాలి చేస‍్తున్న వీడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో రాకేష్, షమితా శెట్టి రిలేషన్‌షిప్‌ను ఎగతాళి చేస్తున్నాడు విశాల్. షమితను తనతో ప్రేమలో పడేయటం వల్ల రాకేష్ మంచి జాక్‌పాట్ కొట్టాడని విశాల్ అన్నాడు. అందువల్లే రాకేష్‌కు ఒకదాని తర్వాత ఒకటి షో ఆఫర్స్ వస్తున్నాయని కూడా చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై షమితా తల్లి సునంద శెట్టి తీవ‍్రంగా స్పందించింది. అతని కామెంట్స్‌పై మండిపడింది. షమితా శెట్టి, రాకేష్‌కు మద్దతుగా నిలిచారు సునంద శెట్టి. విశాల్ చేసిన కామెంట్స్ వీడియోను పోస్టు చేస్తూ ఆమె ఇలా రాసుకొచ్చింది. 'షమితను విశాల్ అక్కా అని పిలుస్తాడు. మళ్లీ తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడతాడు. విశాల్ నమ్మదగినవాడు కాదు. అతను ఒక బెస్ట్ బిట్చింగ్ పర్సన్.'
https://t.co/TFebohcN5z
— Sunanda Shetty (@SunandaShetty5) November 10, 2021
🐍Vishal Kotian usual best bitching at Shamita - he calls Akka (sister)& drags her family most untrustworthy 😡simply not done #ShamitaShetty #ShaRa #BeingSalmanKhan @TheShilpaShetty #OrmaxMedia #Colors15 #QueenShamita #EndemolShine #ShamitalsTheBoss
బిగ్ బాస్ 15లోకి ప్రవేశించిన రాకేష్ నవంబర్ 8న నొప్పితో బాధపడ్డాడు. నవంబర్ 9న ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఉన్న హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం రాకేష్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉన్నాడు. అతను కోలుకున్నాక మళ్లీ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెడతడాని అందరూ భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment