Shamita Shetty and Raqesh Bapat Clarity on Break Up Rumors - Sakshi
Sakshi News home page

Shamita Shetty- Raqesh Bapat: త్వరలోనే పెళ్లి, ఈలోపే బ్రేకప్‌ అంటూ వార్తలు

Published Thu, Mar 10 2022 3:14 PM | Last Updated on Thu, Mar 10 2022 7:23 PM

Shamita Shetty and Raqesh Bapat Clarity on Break Up Rumors - Sakshi

బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ఎంతోమంది కపుల్స్‌గా ఫేమస్‌ అయిన వాళ్లు ఉన్నారు. బిగ్‌బాస్‌ షోలో లవ్‌ ట్రాక్‌లు కామనే. ఆ తర్వాత ఎవరిదారులు ఎవరు చూసుకునే జంటల్ని కూడా చూస్తుంటాం. అయితే చాలా కొద్ది మంది మాత్రమే బిగ్‌బాస్‌ తర్వాత కూడా తమ బంధాన్ని కొనసాగిస్తారు. అలాంటి జోడీనే షమితా శెట్టి- రాకేశ్‌ బాపత్‌. బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టి చెల్లెలిగానే పరిచయం ఉన్న షమితా బిగ్‌బాస్‌ ఓటీటీలో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

ఇక బిగ్‌బాస్‌లోషమితా-రాకేశ్‌ల ప్రేమాయణం షో మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. బిగ్‌బాస్‌ అనంతరం కూడా వీరు రిలేషన్‌లో ఉన్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు బీటౌన్‌లో ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి తరుణంగా అనూహ్యంగా షమితా-రాకేశ్‌లు విడిపోయారంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పుమన్నాయి. మనస్పర్థల కారణంగా బ్రేకప్‌ చెప్పేసుకున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

దీనిపై స్పందించిన షమితా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఎటువంటి నిజం లేలు. పుకార్లను నమ్మవద్దని కోరుకుంటున్నాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. అనంతరం రాకేశ్‌ కూడా ఇదే పోస్ట్‌ను తన ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. దీంతో షమితా-రాకేశ్‌ల బ్రేకప్‌ న్యూస్‌కి తెరపడినట్లయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement