
Breakup Rumors On Bigg Boss Fame Himaja Reddy: గ్లామర్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇటీవలి కాలంలో బాలీవుడ్, కోలీవుడ్ సహా టాలీవుడ్‌లోనూ ఈ ధోరణి పెరిగిపోయింది. ఇప్పటివరకు నాగ చైతన్య-సమంత, అమీర్ ఖాన్-కిరణ్ రావు, ధనుష్-ఐశ్వర్యల విడాకులు ఇండస్ట్రీని ఊపేసాయి. తాజాగా మరో నటి కూడా భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
బిగ్‌బాస్ రియాలిటీ షోతో పాపులర్ అయిన నటి హిమజ భర్త నుంచి త్వరలోనే విడిపోనుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి అసలు హిమజకు పెళ్లి అయ్యిందా లేదా అన్న విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఎందుకంటే తన వివాహం, భర్త గురించి హిమజ బయట ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కానీ ఆమెకు 2012లోనే రాజేష్ ఆనంద్ అనే వ్యాపారవేత్తతో పెళ్లయిందని గూగుల్‌లో సమాచారం ఉంది.
అయితే కొన్ని కారణాల వల్ల అతనితో విడిపోయిందని ఆ తర్వాత చల్లా విజయ్ రెడ్డి అనే వ్యక్తిని హిమజ పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు అతనితో కూడా హిమజ తెగదెంపులు చేసుకుంటున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందన్నదానిపై హిమజ స్పందించాల్సి ఉంది. అంతేకాకుండా తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.