Himaja
-
కమిట్మెంట్ ఇచ్చినా ఛాన్స్‌లు రావడం లేదు: హిమజ
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బిగ్‌బాస్ బ్యూటీ హిమజ సినిమా ఛాన్సుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుమారు పదేళ్ల క్రితం సీరియల్లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హిమజ 2013లో రామ్ నటించిన శివమ్ సినిమాలో ఛాన్సు దక్కించుకుంది. ఆ తర్వాత నేను శైలజ, శతమానంభవతి, వరుడు కావలెనుతో పాటు తెలుగులో పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది హిమజ. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కొంచెం ఇష్టం కొంచెం కష్టం తో పాటు మరికొన్ని సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. బిగ్ బాస్ 3 సీజన్లో కంటెస్టెంట్‌గా మెప్పించిన హిమజ తెలుగు పరిశ్రమలో మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు వస్తున్నప్పటికీ సెలెక్టెడ్ ప్రాజెక్ట్‌లు చేస్తూ కొనసాగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమజకు ఓ ప్రశ్న ఎదురైంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు చాలా తక్కువ వస్తున్నాయి.. దానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురైంది. అందుకు హిమజ ఇలా చెప్పుకొచ్చారు. 'తెలుగు అమ్మాయిలు ఒకప్పుడు రిజర్వ్డ్గా ఉండేవారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సులు వస్తాయి అనుకోవడం తప్పు.. విషయం ఏమిటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ కూడా ఆఫర్స్ రావడం లేదు. అలా అని అవకాశాలు అందుకున్న వారందరూ కమిట్మెంట్ ఇచ్చినవాళ్లు కాదు. ముంబై నుంచి వచ్చిన వాళ్లకు మాత్రం ఇక్కడ ఆఫర్స్ ఇస్తారు.. వారిలో ఏం నచ్చిందో తెలియదు. ఒక్కోసారి తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్ అయితేనే చేస్తాను అనే వారు కూడా ఉన్నారు. అది చాలా తప్పు. ఫస్ట్ అవకాశం వస్తే తీసుకొని సద్వినియోగం చేసుకుంటే ఏదోరోజు మంచి భవిష్యత్ ఉంటుంది. నా వరకు అయితే హీరోయిన్ మాత్రమే కావాలని రాలేదు. నాకు ఏ అవకాశం వచ్చినా చేస్తాను. నాకు మొదట పనిమనిషి పాత్ర వచ్చింది చేశాను. ఆ తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం నేను హ్యాపీగానే ఉన్నాను. తెలుగు అమ్మాయి అయిన హిమజ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆమెను చూసిన వారు ఎవరైనా సరే హీరోయిన్ మెటీరియల్ అనాల్సిందే. కానీ ఆమెకు ఛాన్సులు అయితే దక్కాయి కానీ హీరోయిన్ను చేయలేకపోయాయి. ఈ క్రమంలో నేను శైలజ, జనతా గ్యారేజ్, వరుడు కావలెను, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌తో మెప్పించింది. -
మొబైల్ ప్రారంభోత్సవంలో బిగ్‌బాస్ ఫేమ్ హిమజా’ సందడి (ఫొటోలు)
-
ఆ వార్తలపై హిమజ రియాక్షన్
-
హిమజ ఆధ్వర్యంలో రేవ్ పార్టీ? నటి ఏమందంటే?
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారంటూ ఓ వార్త వైరలవుతోంది. బిగ్‌బాస్ ఫేమ్, నటి హిమజ ఆధ్వర్యంలో ఈ రేవ్ పార్టీ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హిమజ సహా 11 మంది సినీతారలు, బిగ్‌బాస్ సెలబ్రిటీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై హిమజ స్పందించింది. 'నిన్న నా కొత్తింట్లో తొలిసారి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్టీ చేసుకున్నాను. ఎవరో.. ఏదో అనుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి మా ఇంటిని సోదా చేశారు.. అందుకు మేము కూడా సహకరించాం. వాళ్ల విధిని వాళ్లు నిర్వర్తించారు. అయితే కొందరు దీన్ని రేవ్ పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఇంట్లోనే ఉన్నాను. సంతోషంగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటుంటే నేను అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. దయచేసి దాన్ని ఎవరూ నమ్మవద్దు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోతో క్లారిటీ ఇచ్చింది. చదవండి: చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్న చంద్రమోహన్ -
Himaja Reddy: అల్వాల్‌లో షాప్ ఓపెనింగ్ చేసిన హిమజ (ఫోటోలు)
-
కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్
సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే బిగ్‌బాస్ బ్యూటీ హిమజ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తను ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇంటి నిర్మాణం పూర్తవడంతో మంచి ముహూర్తం పెట్టుకుని గృహప్రవేశం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఇంట్లో కుడికాలు పెట్టి లోనికి వస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఇందులో లంగా ఓణీ ధరించిన హిమజ చేతిలో లక్ష్మీదేవి ఫోటో ఉంది. 'నా కల నెరవేరింది. ఈ కొత్తిల్లు మరెన్నో జ్ఞాపకాలకు భాండాగారంగా నిలిచిపోనుంది. ఈ మైలురాయిని చేరుకున్నందుకు నాకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ జర్నీలో నాతో పాటు ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లవ్ యూ ఆల్' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. డ్రీమ్ హౌస్ స్పెషాలిటీ ఏంటంటే ఈ డ్రీమ్ హౌస్ స్పెషాలిటీ విషయానికి వస్తే.. ఇది నాలుగంతస్తుల భవనం. ఇందులో మోడ్రన్ లిఫ్ట్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో పేరెంట్స్ కోసం బెడ్ రూమ్ ఏర్పాటు చేసింది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం హిమజదే కాగా ఇందులో ప్రత్యేకంగా మేకప్ రూమ్ కూడా నిర్మించింది. మూడో ఫ్లోర్లో జిమ్, నాలుగో అంతస్తులో థియేటర్ కట్టించింది. ఈ నాలుగంతస్తులు కట్టడానికి, ఇంటీరియర్ డిజైన్‌కు దాదాపు ఏడాదిన్నర సమయం పట్టింది. అలా మొదలైంది తెనాలి సమీపంలోని వీర్లపాలెం హిమజ స్వస్థలం. తెనాలిలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లి ప్రైవేట్ సోషల్ టీచరుగా పిల్లలకు పాఠాలు చెప్తూనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఫ్యాషన్, బ్యూటీ ఈవెంట్స్‌లో పాల్గొంటూ మోడల్, టీవీ యాంకర్‌గా రాణించింది. సీరియల్స్‌తో పాపులర్ అయిన ఆమె ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ 3 రియాలిటీ షోలోనూ మెరిసింది. View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) చదవండి: -
ఆనకొండతో ఆడుకుంటున్న డేర్ అండ్ డాషింగ్ గర్ల్ హిమజ! (ఫొటోలు)
-
అలాంటి కామెంట్లు చేశారు, ఘోరంగా ఏడ్చాను: హిమజ
అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సందడి చేసే సెలబ్రిటీలలో హిమజ ఒకరు. బిగ్‌బాస్ మూడో సీజన్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆమె సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుందీ నటి. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. 'నేను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా కళ్లు బాలేదు, నడక కూడా బాగోలేదన్నారు. డిప్రెషన్‌కు లోనయ్యాను. బాధపడ్డాను, ఘోరంగా ఏడ్చాను. డైరెక్టర్స్ కూడా.. నీ కళ్లు చిన్నగా ఉన్నాయి. క్యారెక్టర్‌కు సూటవుతావో లేదో అని ముఖం మీదే అనేవాళ్లు. కానీ మేకప్ వేశాక కళ్లే హైలైట్ అయ్యేవి. నా కళ్లు చాలా బాగుంటాయన్న ప్రశంసలూ లభించాయి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతిసారి సొసైటీ గురించి ఆలోచించకుండా మనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకెళ్లిపోవాలంతే! మా డ్రైవర్‌కు ముగ్గురమ్మాయిలు. వారిని చదివించాల్సిన బాధ్యత నాపై ఉంది. ముందు వారికి వీలైనంత సాయం చేసి తర్వాత మిగతావాళ్లకోసం ఆలోచిస్తాను' అని చెప్పింది హిమజ. -
ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటోలు వైరల్
-
కొత్త కారు కొనుగోలు చేసిన హిమజ..వీడియో వైరల్
బిగ్‌బాస్ షోతో హిమజ కెరీర్ మారిపోయింది. అంతకు ముందు పలు సినిమాల్లో, సీరియళ్లలో నటించినప్పటికీ.. హిమజకు అంత గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ రియాల్టీ షో మూడో సీజన్లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. బిగ్‌బాస్ తర్వాత వరుసగా సినిమాలతో పాటు బుల్లితెరపై యాంకర్‌గానూ రాణించింది. ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త కారుని కొనుగోలు చేసింది. సంక్రాంతి సందర్భంగా తన ఫ్యామిలీ కోసం ఈ కారును కొనుగోలు చేసినట్టు హిమజ పేర్కొంది. హ్యాపీ సంక్రాంతి.. ఈ సంక్రాంతికి నా ఫ్యామిలీని ఇలా సర్ ప్రైజ్ చేశాను.. వారి సౌలభ్యమే నాకు ముఖ్యం.. మీ అందరి ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైందంటూ తన అభిమానుల మీద ప్రేమను కురిపించింది హిమజ. View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) -
Himaja Apparascheruvu: మల్టిపుల్ వర్క్స్‌తో సక్సెస్.. ఇంగ్లీషు ఎంత ముఖ్యమో..
కెరీర్లో విజయం సాధించిన మహిళలు కుటుంబంపై దృష్టి పెట్టలేరని చాలామంది అనుకుంటారు. అలాగే, మహిళలు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నా, తమ కోసం తాము టైమ్‌ను కేటాయించుకోరు అనీ అంటుంటారు. అయితే ఈ ఊహలన్నీ తప్పని హిమజ అప్పరాశ్చెరువు రుజువు చేస్తోంది. మన శక్తి ఏంటో మనకే తెలుసు అని తన పనుల ద్వారా చూపుతోంది. అనంతపురం వాసి అయిన హిమజ అప్పరాశ్చెరువు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా, మారథా రన్నర్‌గా సత్తా చాటుతోంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా కుటుంబ బాధ్యతలతోనూ మల్టిపుల్ వర్క్స్‌తో రాణిస్తోంది. చిన్న పట్టణంలో పెరిగిన హిమజ పెద్ద కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకుంటోంది. తన కెరీర్‌తో పాటు ఇద్దరు పిల్లల బాధ్యతనూ నిర్వహిస్తోంది. దీనితోపాటు, తన స్వంత అభిరుచినీ నెరవేర్చుకుంటోంది. సున్నా నుంచి మొదలు ‘నా జీవన ప్రయాణం సున్నాతో మొదలుపెట్టి ఈ రోజు చేరుకున్న చోటికి రావడం అంత తేలిక కాలేదు. ఐఐటీ రూర్కీలో ఇంజనీరింగ్ చేశాను. కాలేజీలో చేరేసరికి నాకు ఇంగ్లీషు సరిగా రాదు, హిందీలోనూ సరిగా మాట్లాడలేను. కానీ సంకల్పంతో, నేను ప్రతి సవాల్‌ను అధిగమిస్తూ, జీవితంలో చాలా నేర్చుకుంటూ విజయం వైపు పయనిస్తూనే ఉన్నాను. రానిదంటూ లేదని.. ఇంజినీరింగ్ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబిఏ పూర్తి చేశాను. ఆస్ట్రేలియన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి బిఎఎమ్ పట్టా అందుకున్నాను. 2017లో అమెజాన్ కంపెనీలో సప్లై చైన్ ఎగ్జిక్యూషన్ టీమ్ పోస్ట్‌పై సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరాను. నేటి కాలంలో విద్యార్థులైనా, పనిచేసే వృత్తి నిపుణులైనా వారికి ఇంగ్లీషు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో నాకు కూడా అర్థమైంది. ఈ అవసరాన్ని స్వయంగా గ్రహించి, నేను అమెజాన్ అలెక్సాలో ఇంటరాక్టివ్ సెషన్స్ చేర్చాను. ఈ నైపుణ్యంతో ఏ వయసు వారైనా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవచ్చు. కుటుంబంపై పూర్తి శ్రద్ధ నా కెరీర్‌తో పాటు కుటుంబంపై పూర్తి శ్రద్ధ పెట్టాను. నా కెరీర్లో ముందుకు వెళుతున్న సమయంలోనే రెండుసార్లు తల్లిని అయ్యాను. ఈ సమయంలో కొత్తగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ నా భర్త ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచాడు. కెరీర్ మాత్రమే ముఖ్యం కాదు, నా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడమూ ముఖ్యమే. అందుకే, హోమ్‌వర్క్ చేయించడం, వారితో ఆడుకోవడం, వారిని పరీక్షలకు సిద్ధం చేయడం, వారితో సరదాగా గడపడం వంటి ప్రతి అవసరాన్ని తీరుస్తాను. సమతుల్యత అవసరం.. నా దినచర్యలో అడుగడుగునా నా భర్త సపోర్ట్ ఉంది. తన తల్లిదండ్రుల పూర్తి బాధ్యతనూ తీసుకుంటాడు. మేము మా పిల్లలను వ్యక్తిగతంగా చూసుకోవడం, వారితో సమయం గడపడం మంచిదని నమ్ముతాము. బయటి పని, ఇంటి పని ఈ రెండింటి మధ్య సమానమైన సమతుల్యతను పాటిస్తాను. నా పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడం, కొత్త పనులు చేయడం నాకు ఇష్టం. మల్టిపుల్ టాస్కింగ్ మనల్ని మరింత ఉత్సాహవంతులను చేస్తుంది. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా మారాను. ఆన్లైన్–ఆఫ్‌లైన్ క్లాసులతోనూ సేవలు అందిస్తుంటాను. మారథాన్ రన్నర్‌గానూ, నా ఇతర అభిరుచుల వైపుగా సాగుతుంటాను’ అని వివరిస్తారు ఈ మల్టీ టాలెంటెడ్ ఉమన్. (క్లిక్ చేయండి: రేణు ది గ్రేట్.. స్త్రీ హక్కుల గొంతుక) -
కొత్త కారు కొన్న హిమజ! వీడియో వైరల్
బిగ్‌బాస్ కంటెస్టెంట్ హిమజ కొత్త కారు కొందా? అంటే అవుననే అంటున్నారు కొందరు అభిమానులు. మిగతా వారు మాత్రం అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే.. అని పాట పాడుకుంటున్నారు. అదేంటి? అంత కన్ఫ్యూజన్ ఎందుకంటారా? మరేం లేదు.. ఈ బ్యూటీ ఈరోజు కొత్త కారు కొన్నానోచ్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. అయితే వీడియో చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకీ వీడియోలో ఏముందుంటే.. తన కొత్త బీఎమ్‌డబ్ల్యూ కారును చూపిస్తూ అందులో ఎక్కి కూర్చున్న హిమజ కాసేపటికే నిద్రలో నుంచి తేరుకున్నట్లు ఉంది. అంటే కేవలం ఇది కల మాత్రమే అన్నట్లుగా ఉంది. కానీ క్యాప్షన్‌లో మాత్రం ఈ దీపావళికి నాకు నేనే గిఫ్ట్ ఇచ్చుకున్నాను. నా కల నెరవేరింది అని రాసుకొచ్చింది. ఇంతకీ ఇది కలా? నిజమా? అని కొందరు తల గోక్కుంటుంటే మరికొందరు మాత్రం కంగ్రాట్స్ చెప్తున్నారు. కాగా బిగ్‌బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన హిమజ నటిగా రాణిస్తూనే పలు బ్రాండ్లకు ప్రమోషన్లు చేస్తోంది. View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) చదవండి: -
కొత్త ఇంటికి మారిన హిమజ, హోంటూర్ వీడియో వైరల్
ఈ మధ్య టీవీ, సినీ సెలబ్రెటీలు సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టుకుని దాని ద్వారా వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారు. వారి ఇల్లు నుంచి రోజు లేవగానే ఏం చేస్తారు, ఏం తింటారు, వారి చీరలు, నగలకు సంబంధించిన ఆసక్తికర వీడియోను పంచుకుంటున్నారు. ఇందులో హోంటూర్కు సంబంధించిన వీడియోలపై నెటిజన్లు అమితమైన ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో వారి ఇంటికి సంబంధించిన విశేషాలను వివరిస్తూ ప్రతి సెలబ్రెటీ హోం టూర్ చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ ఫేం, నటి హిమజ తన కొత్త ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అయితే ఇది తన సొంత ఇల్లు కాదనీ, ఇటీవలె మరో ఇంటికి రెంట్‌కు దిగినట్లు తెలిపింది. చదవండి: మీ టూ నిందితులు వేధిస్తున్నారు: తనుశ్రీ దత్త షాకింగ్ పోస్ట్ ప్రస్తుతం తాను ఉంటున్న ఇంటిని రెనోవేట్ చేయిస్తున్నందున్న కొత్త ఇంటికి మారినట్లు చెప్పింది. తాజాగా ఈ ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేసి తన ఫాలోవర్స్‌ను పలకరించింది. ఈ సందర్భంగా ఈ కొత్త ఇంటికి సంబంధించిన విశేషాలు, ఇంట్లోని ఫర్నిచర్‌కు వంటి పలు ఆసక్తికర విషయాలను పంచుకుందామె. మరి హిమజ కొత్త ఇల్లు ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఇదిలా ఉంటే గతంలో తన డ్రీమ్ హౌజ్‌ను నిర్మించుకుంటున్నానంటూ హిమజా ఓ వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తన సొంత డబ్బులతో నాలుగంతస్తులుగా నిర్మించుకుంటున్న ఆ ఇల్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉందని, ఇందులో మోడ్రన్ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నానట్లు ఆమె వెల్లడించింది. చదవండి: విషాదం.. క్యాన్సర్‌తో టీవీ నటి మృతి -
కల్లు తాగుతూ ఎంజాయ్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ హిమజ
బిగ్‌బాస్ ఫేం, నటి హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన హిమజ ఆ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత బుల్లితెరకు గుడ్‌బై చెప్పి వెండితెరపై అవకాశాలు దక్కించుకుంది. సినిమాల్లో హీరోయిన్స్ పక్కన ఫ్రెండ్ పాత్రల్లో కనిపించిన నటి హిమజకు బిగ్‌బాస్ తర్వాత మరింత పాపులర్ అయ్యింది. షోలో ఉన్నప్పుడు కొంత నెగెటివిటీ మూటగట్టుకున్నప్పటికీ బయటకు వచ్చాక మాత్రం టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హిమజ తనకు సంబంధించిన విషయాల్ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా కల్లు తాగుతూ ఎంజాయ్ చేసింది. దీనికి ఫేమస్ అరబిక్ కుతు సాంగ్‌ని జతచేసి రీల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) -
పెళ్లిళ్లు నాకు సెట్ కావు : విడాకుల రూమర్స్‌పై హిమజ క్లారిటీ
Himaja Clarity on Her Marriage and Divorce: బిగ్‌బాస్ బ్యూటీ హిమజ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను అన్‌ఫాలో చేసిందని, దీంతో త్వరలోనే విడాకులు ఇవ్వనుందంటూ రూమర్స్ వస్తున్నాయి. అసలు హిమజకు పెళ్లయిందనే విషయంపైనే ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. అలాంటిది పెళ్లి, భర్తకు విడాకులేంటన్నది తెలియక నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. తాజాగా తన విడాకులపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై హిమజ స్పందించింది. చదవండి: ఇండస్ట్రీలో మరో బ్రేకప్!.. హిమజకు పెళ్లయిందా? 'ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, విడాకులు చేసేస్తున్నారు. సాధారణంగా ఇలాంటివి నేను పట్టించుకోను. కానీ మా పేరెంట్స్ కాస్త సున్నితంగా ఉంటారు. ఇలాంటి వదంతుల వల్ల వాళ్లు ఎక్కువ బాధపడతారు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేయకండి. అలాగే నా పెళ్లి, విడాకులకు నన్ను కూడా పిలవండి' అంటూ వ్యంగంగా స్పందించింది. 3-4ఏళ్లలో తప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని, ఒకవేళ చేసుకుంటే చాలా గ్రాండ్‌గా అందరికి చెప్పి చేసుకుంటానని తెలిపింది. 'పెళిళ్లు నాకు సెట్ కావు ప్రస్తుతం సింగిల్‌గా హ్యాపీగా ఉంటూ మా ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నా. సింగిల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. గత కొన్ని రోజులుగా నా వీడియోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో కొందరు కుట్ర పన్ని ఇలాంటి ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేస్తున్నారు' అంటూ తనపై వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టేసింది. చదవండి: పబ్‌లో నటికి ముద్దుపెట్టిన ఆర్జీవీ.. వీడియోలు వైరల్ View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) -
విడాకులకు సిద్ధమైన బిగ్‌బాస్ నటి హిమజ అంటూ పుకార్లు
Breakup Rumors On Bigg Boss Fame Himaja Reddy: గ్లామర్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇటీవలి కాలంలో బాలీవుడ్, కోలీవుడ్ సహా టాలీవుడ్‌లోనూ ఈ ధోరణి పెరిగిపోయింది. ఇప్పటివరకు నాగ చైతన్య-సమంత, అమీర్ ఖాన్-కిరణ్ రావు, ధనుష్-ఐశ్వర్యల విడాకులు ఇండస్ట్రీని ఊపేసాయి. తాజాగా మరో నటి కూడా భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ రియాలిటీ షోతో పాపులర్ అయిన నటి హిమజ భర్త నుంచి త్వరలోనే విడిపోనుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి అసలు హిమజకు పెళ్లి అయ్యిందా లేదా అన్న విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఎందుకంటే తన వివాహం, భర్త గురించి హిమజ బయట ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కానీ ఆమెకు 2012లోనే రాజేష్ ఆనంద్ అనే వ్యాపారవేత్తతో పెళ్లయిందని గూగుల్‌లో సమాచారం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల అతనితో విడిపోయిందని ఆ తర్వాత చల్లా విజయ్ రెడ్డి అనే వ్యక్తిని హిమజ పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు అతనితో కూడా హిమజ తెగదెంపులు చేసుకుంటున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందన్నదానిపై హిమజ స్పందించాల్సి ఉంది. అంతేకాకుండా తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ట్రెండింగ్‌లో హిమజ డ్రీమ్ హౌస్, నాలుగంతస్తుల్లో థియేటర్ కూడా!
'ఇల్లు కట్టి చూడు - పెళ్లి చేసి చూడు' అని ఊరికే అనలేదు పెద్దలు. ఈ రెండింటిలో ఏది మొదలుపెట్టినా అనుకున్నదానికన్నా ఎక్కువే ఖర్చవుతుంది. అయినా సరే తగ్గేదే లే అంటూ ఎంతోమంది తారలు ఇల్లు కట్టుకుని సొంతింటి కలను సాకారం చేసుకున్నారు. బిగ్‌బాస్ బ్యూటీ హిమజ కూడా గతంలోనే ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. కాకపోతే తన తల్లి సహకారంతో దాన్ని సొంతం చేసుకున్నానని, ఎప్పటికైనా తన సొంత డబ్బులతో ఒక డ్రీమ్ హౌస్‌ను కట్టుకుంటానని చెప్పింది. అన్నట్లుగానే ఇన్నాళ్లకు ఆ కలను నెరవేర్చుకుంటోంది కూడా! తాజాగా నిర్మాణంలో ఉన్న తన డ్రీమ్ హౌస్‌ను వీడియో తీసి అభిమానులతో పంచుకుంది హిమజ. నాలుగంతస్తుల ఇంటిని నిర్మిస్తున్నానని, ఇందులో మోడ్రన్ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నానని వెల్లడించింది. ఆ మధ్య భూమి పూజ చేపట్టిన దృశ్యాలను సైతం చూపించింది. ఆ సమయంలో ఇంటి కోసం పారపట్టి మత్తి ఎట్టింది హిమజ. అంతేకాకుండా అక్కడ పని చేస్తున్న కూలీలకు భోజనం కూడా వడ్డించింది. చదవండి: Mansi Srivastava Wedding: గ్రాండ్‌గా నటి పెళ్లి, ఫొటోలు వైరల్ తన పేరెంట్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే బెడ్రూమ్ ఏర్పాటు చేశానంది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం తనదేనన్న ఆమె ప్రత్యేకంగా మేకప్ రూమ్ కూడా నిర్మిస్తున్నానని చెప్పింది. దానిపై ఫ్లోర్లో జిమ్, ఆపై దాంట్లో థియేటర్ ఉండేలా ఏర్పాటు చేస్తున్నానంది. నాలుగంతస్తులు కట్టడానికి, అందులో ఇంటీరియర్ డిజైన్‌కు మొత్తంగా ఒక ఏడాది పడుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. -
ఖరీదైన డైమండ్ నెక్లెస్‌లు కొనుగోలు చేసిన హిమజ
బిగ్‌బాస్ తర్వాత క్రేజ్ రెట్టింపైనవారిలో హిమజ ఒకరు. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొన్న ఆమె షోలో ఉన్నప్పుడు కొంత నెగెటివిటీ మూటగట్టుకున్నప్పటికీ బయటకు వచ్చాక మాత్రం షాప్ లాంఛింగ్లకు, ఈవెంట్లకు వెళ్తూ బాగానే సంపాదించింది. సినిమాలు, షోలు, ఫొటోషూట్లతో అభిమానులకు టచ్‌లో ఉంటున్న ఈ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తాజాగా తన తల్లికి ఖరీదైన బహుమతినిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించిన ఆమె దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలో మొదటిసారి అమ్మకు డైమండ్ నెక్లెస్ తీసుకుంటున్నానంటూ తెగ ఎగ్జయిట్ అయింది హిమజ. అమ్మకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా కానీ ఆమెకు నచ్చింది తీసుకుంటే బాగుంటుందని తనను కూడా షాప్‌కు తీసుకొచ్చానని తెలిపింది. తల్లికి డైమండ్ నెక్లెస్ కొన్న ఈ నటి తన కోసం కూడా నగలు కొనుక్కుంది. వజ్రాల ఆభరణంతో పాటు రెండు బంగారు నెక్లెస్‌ల సెట్‌ను, ఒక బంగారు వడ్డాణాన్ని సైతం కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. -
హిమజ బర్త్‌డే సెలబ్రేషన్స్.. గ్రాండ్ పార్టీ ఫోటోలు
-
బిగ్‌బాస్ బ్యూటీ హిమజ ఫోటోలు
-
భయపెట్టిస్తున్న ‘జ’ ట్రైలర్
బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో జై దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ‘జ’. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. కాగా ఈరోజు జ మూవీ ట్రైలర్‌ను యంగ్ హీరో సుధీర్‌బాబు విడుదలచేసి యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సాగే ఈ ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచింది. ఈ సందర్భంగా నటి హిమజ మాట్లాడుతూ.. ‘‘ఫుల్ లెంగ్త్ ఫెర్ఫామెన్స్కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాను అంగీకరించాను. నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించే మూవీ ఇది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గోవర్ధన్ రెడ్డి గారికి, దర్శకుడు సైదిరెడ్డి గారికి కృతజ్ఞతలు" అన్నారు. దర్శకుడు సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ..‘జ’అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మంచి కథా బలం ఉన్న మూవీ. మా ప్రొడ్యూసర్ గోవర్ధన్ రెడ్డి నా మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉపేందర్ సహకారం మరువలేనిది’ అన్నారు. -
సోషల్ హల్చల్ : అనన్య ఆట.. అలీరెజా తిప్పలు
మల్లెశం మెమోరీస్ అంటూ.. గచ్చకాయలు ఆడుతున్న వీడియోని పంచుకుంది హీరోయిన్ అనన్య నాగళ్ల అప్పుడప్పుడు గిల్లు కోవడం అంటూ.. బుల్లితెర నటి, యాంకర్ సమీర చిందులేస్తుంది చాటుగా స్నాక్స్ తినేసిన అలీ రేజా.. అవే స్నాక్స్‌ను తన భార్య తీసుకెళ్లి కుక్కపిల్లకు పెట్టడంతో కక్కలేక మింగలేక అవస్థపడ్డాడు బ్యాడ్ సెల్ఫీ అంటూ సిమ్రాత్ కౌర్ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. తుమ్మడం కరోనా లక్షణం అని కుక్క పిల్లకు కూడా తెలిపోనట్లుందంటూ ఓ ఫన్నీ వీడియోని షేర్ చేసింది బిగ్‌బాస్ ఫేమ్ హిమజ View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) \ View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
మరో కొత్త కారు కొన్న బిగ్‌బాస్ భామ, ధర ఎంతంటే!
బిగ్‌బాస్ బాస్ తర్వాత దానిలో పాల్గొన్న వారికి ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేస్తుంది. అప్పటి వరకు ఎవరికి తెలియని వారంతా బిగ్‌బాస్ షోతో అందరి దృష్టి ఆకర్షించి బయటకు రాగానే వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంటారు. అంతేగాక పలు ప్రొడక్ట్స్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అంటు ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోతారు. బిగ్‌బాస్‌కు ముందు సీరియల్స్‌లో నటిస్తూ.. సినిమాల్లో హీరోయిన్స్ పక్కన ఫ్రెండ్ పాత్రల్లో కనిపించిన నటి హిమజకు బిగ్‌బాస్ తర్వాత చాలా గుర్తింపు వచ్చిందని చెప్పుకొవచ్చు. దీంతో ఆమె దీనిని క్యాష్ చేసుకుంటోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను హిమజ చాలా బాగా ఫాలో అవుతుంది. తనకు వచ్చిన స్టార్డమ్తో ఇటీవల యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో సెలబ్రెటీలకు, వంటలకు సంబంధించిన వీడియోలను వరుసగా పోస్టు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు రాగానే కొత్త బంగ్లా కొనుగోలు చేసిన హిమజ ఇటీవల బెంజ్ కారు కూడా కొనుక్కుంది. తాజాగా ఆమె మరో కొత్త కారును కూడా కొనుగోలు చేసినట్లు తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మహీంద్ర థార్ వాహనాన్ని ఖరీదు చేసిన హిమజ దీనికి సంబంధించిన వీడియోను.. ‘మీట్ మై తారా’ అంటు షేర్ చేసింది. దీంతో ఆమె సహనటీనటులు, అభిమానులు, ఫాలోవర్స్ హిమజకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ కారు ధర దాదాపు 13 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) -
సోషల్ హల్చల్: వేడెక్కిస్తున్న సారా, కాలం ఆగిపోవాలంటున్న రాశీ
► ఈ క్షణం ఇలానే ఆగిపోతే బాగుండు అంటున్న హీరోయిన్ రాశీ ఖన్నా. ► బీచ్ తీరాన వేడివేడిగా విటమిన్ సీ తీసుకుంటూ ఫొటోలు షేర్ చేసిన బాలీవుడ్ భామ సారా అలీఖాన్. ► మనం ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో చూడకపోవడం వెనక ఓ కారణం ఉంది అని చెబుతున్న హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. ► మీ పరిధిని విస్తరించండి అంటూ భరత నాట్య భంగిమను షేర్ చేసిన సీనియర్ నటి శోభన. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
బిగ్‌బాస్ బ్యూటీ హిమజకు పవన్ కళ్యాణ్ లేఖ
అభిమాన హీరో సినిమాలో నటించే చాన్స్ వస్తేనే ఆనందంలో మునిగిపోతారు. అలాంటిది ఆ హీరో దగ్గరనుంచి బహుమతి అందితే? ఆ ఆనందాన్ని మాటల్లో వివరించలేము. బిగ్‌బాస్ బ్యూటీ హిమజ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే ఉంది. తానెంతో ఆరాధించే హీరో పవన్‌కళ్యాణ్ నుంచి హిమజకు ఓ లెటర్ వచ్చింది. అందులో ‘నటి హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నతస్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని పవన్ బెస్ట్ విషెస్ అందజేస్తూ లేఖ రాశారు. ఇది స్వయంగా పవన్ కళ్యాణే రాయడం విశేషం. దీంతో హిమజ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ రాసిన లేఖను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన హిమజ..తన ఆనందాన్ని మాటలు,ఎమోజీల్లో చెప్పలేకపోతున్నానని పేర్కొంది. గతంలోనూ తన సినిమాల్లో పనిచేసిన పలువురు నటులకు పవన్ కళ్యాణ్ బెస్ట్ విషెస్ ను అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న ఓ పీరియాడికల్ చిత్రంలో హిమజ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పవన్‌తో తీసుకున్న సెల్ఫీని ఇటీవలె ఆమె షేర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా పవన్-క్రిష్‌ల సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజ్ చేయనున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది.ఈ చిత్రంలో ఆయన వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు సమాచారం. పవన్ సరసన శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తున్నారుసంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా పప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి : (షాకింగ్ లుక్‌లో జయసుధ.. ఆందోళనలో ఫ్యాన్స్!) (స్క్రీన్‌పై అలా నటించడానికి మీనా ఒప్పుకోలేదు) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) -
'ఓ మై గాడ్', హిమజ కల నెరవేరింది
అభిమాన హీరోతో ఒక్క సెల్ఫీ దిగాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ చాలామందికి అది కలగానే మిగిలిపోతుంది. ఒకవేళ నిజంగానే అభిమాన హీరో మన కళ్ల ముందు ప్రత్యక్షమైతే, అతడితో సెల్ఫీ దిగే చాన్స్ వస్తే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. బిగ్‌బాస్ బ్యూటీ హిమజ కూడా ఇప్పుడదే ఆనందంలో మునిగి తేలుతోంది. తను ఎంతగానో ఆరాధించే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను నేరుగా కలిసింది. అంతేనా, అతడితో కలిసి సెల్ఫీ కూడా దిగింది. ఈ ఫొటోను బుధవారం నాడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "ఓ మై గాడ్.. నేడు నా కల నెరవేరింది. తొలి ప్రేమ సినిమాలో పవన్ కల్యాణ్ గారిని చూసినప్పుడు ఆయన్ను కనీసం డైరెక్ట్‌గా చూస్తానా అనుకున్నా. కానీ ఇప్పుడు ఏకంగా ఆయన 27వ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఇంత మంచి చాన్స్ ఇచ్చిన దర్శకుడు క్రిష్‌కు కృతజ్క్షతలు" అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఏదేమైనా హిమజ పవర్ స్టార్‌ను కలవడమే కాక ఆయనతో కలిసి నటిస్తున్నందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా పవన్-క్రిష్‌ల సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజ్ చేయనున్నామని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే హిమజ అటు బుల్లితెరలో ప్రసారమయ్యే షోలలో స్పెషల్ గెస్ట్‌గా కనిపిస్తూనే మరోవైపు సినిమాలు చేస్తూ వెండితెర మీద బిజీగా ఉంది. బిగ్‌బాస్ తర్వాత మరింత ప్రజాదరణను చూరగొన్న ఆమె ప్రస్తుతం పవన్ కల్యాణ్ 27వ సినిమాతో పాటు నాగశౌర్య 'వరుడు కావలెను', సునీల్ 'కనబడుట లేదు' సినిమాల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) చదవండి: కుస్తీ వీరులతో పవన్ కల్యాణ్ ఫైటింగ్ హోప్ అంటే హిమజ: 4 వేల మంది పైగా పిల్లలకు చదువు -
తల్లిదండ్రులున్నా అనాథగా పెరిగా: హిమజ
తాను పడిన కష్టం మరెవరూ పడకూడదని ఆలోచించే వారు అరుదుగా కనిపిస్తారు. సరిగ్గా ఇటువంటి అరుదైన వారి కోవకే చెందుతారు హైదరాబాద్‌కు చెందిన హిమజారెడ్డి. విద్య ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని బలంగా నమ్మే హిమజ .. చదువుకోలేని పరిస్థితిలో ఉన్న అట్టడుగు, అణగారిన వర్గాల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ‘హోప్ ఫర్ లైఫ్’ అనే ఎన్జీవోని స్థాపించి ఇప్పటిదాకా రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాలుగువేల మందికి పైగా పిల్లలకు చదువు చెబుతున్నారు. ‘‘విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు... జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలకు చదువే సమాధానం చెబుతుంది. అయితే అందరూ బోలెడంత డబ్బు వెచ్చించి చదువుకోవడం కష్టం. అందుకే ఎవరైతే చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారో వారందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో ఈ ఎన్జీవోను స్థాపించా’’నని హిమజ చెప్పారు. ఇప్పటి వరకు నాలుగు వేలమంది పిల్లలకు ఉచిత విద్యాబోధన చేశామని ఆమె పేర్కొన్నారు. చిన్నతనంలో అనాథాశ్రమంలో పెరిగిన తనకు విద్య విలువ బాగా తెలుసునని, అందుకే పిల్లలకు విద్య ఎంత ముఖ్యమో గ్రహించానన్నారు. ‘‘తల్లిదండ్రులు ఉన్నప్పటికీ మూడేళ్ల వయసు నుంచే నేను అనాథాశ్రమంలో అనాథగా పెరిగాను. అణగారిన వర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, అనాథ పిల్లలకు విద్య ఎంత అవసరమో ప్రత్యక్షంగా చూశాను. అందుకే నాలాగా ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఎన్జీవోని స్థాపించానని ఆమె చెప్పారు. ముగ్గురి నుంచి 4 వేలకు పైగా హిమజ డిగ్రీ చదివేటప్పుడు ముగ్గురు అమ్మాయిలను దత్తత తీసుకుంది. అలా మొదలైన తన ప్రయాణం ఇప్పుడు నాలుగువేల పైకి చేరింది. తన డిగ్రీ పూర్తయిన తరువాత ముగ్గురు టీమ్ మెంబర్స్‌తో కలిసి 2015లో ‘హోప్ ఫర్ లైఫ్’ అనే ఎన్జీవోని స్థాపించారు. 2017లో ఈ సంస్థ అధికారికంగా రిజిస్టరైంది. ప్రస్తుతం ఈ సంస్థ పిల్లలకు చదువు చెప్పడమేగాక దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని అనేక సమస్యలపై పనిచేస్తున్నారు. పిల్లలకు విద్యతోపాటు ఆరోగ్యంపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా హెల్త్ క్యాంప్‌లు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇవేగాక రుతుక్రమ సమయంలో అమ్మాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. చదవండి: ట్విన్ సిస్టర్స్ కొత్త ఆలోచన: ‘నెక్సెస్ పవర్’ -
బిగ్‌బాస్: అతడికే ఓటు వేసిన హిమజ
సాక్షి, పంజగుట్ట: బిగ్‌బాస్‌లో ఓటింగ్ చూస్తుంటే అభిజిత్ గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుందని బిగ్‌బాస్ 3 ఫేం హిమజ అన్నారు. కాని ఒక మహిళగా అరియానా లేదా హారిక గెలవాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. మాజిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ప్రముఖ నటి హిమజ సందడి చేసింది. షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జువెల్లరీ షోను ఆమె శనివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా షోరూం మొత్తం కలియ తిరిగి ఆభరణాలను పరిశీలించింది. బరువు తక్కువగా ఉండి, ఎక్కువ డిజైన్లు ఉండే నగలంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె తెలిపింది. ప్రదర్శన ఈ నెల 19 నుండి 27 వరకు కొనసాగుతుందని షోరూం ప్రతినిధి హర్షవర్థన్ రెడ్డి తెలిపారు. చదవండి: నటనంటే నాకెంతో మజా: హిమజ మయూరం.. చూడ చక్కని దృశ్యం బంజారాహిల్స్: సందర్శకులను ఆకర్షించేందుకు బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌పార్కు ప్రధాన ద్వారంపై ఎదురెదురుగా రెండు నెమలి బొమ్మలు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం పార్కు లోపల నుంచి ఓ నెమలి వచ్చి ఈ బొమ్మపై వాలి చూపరులను ఆకట్టుకుంది. వాకర్లు, సందర్శకులు ఈ సుందర, అరుదైన దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించుకున్నారు. -
నటనంటే నాకెంతో మజా: హిమజ
కళల కాణాచి నుంచి కెమెరా ముందు తలుక్కున మెరిసింది. నటనానుభవం లేకపోయినా.. మోడలింగ్‌లో రాణిస్తూ బుల్లితెరపై ప్రత్యక్షమైంది. ఆకట్టుకునే అందం.. అభినయంతో ఉత్తమ నటి అయ్యింది. అందివచ్చిన అవకాశాలతో వెండితెరకు పరిచయమై క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ తానేంటో నిరూపిస్తోంది. నటన అంటే తనకు ఎంతో ‘మజ’ అంటోంది యువ నటి హిమజ. – తెనాలి తెనాలి సమీపంలోని వీర్లపాలెం హిమజ స్వస్థలం. తండ్రి మలిరెడ్డి చంద్రశేఖరరెడ్డి, తల్లి రాజ్యలక్ష్మి. ఊరిలోని అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే పెరిగారు. నూతక్కిలో స్కూలు విద్య, తెనాలి కాలేజీ నుంచి దూరవిద్యలో బీఏ చేశారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లి ప్రైవేట్ సోషల్ టీచరుగా పిల్లలకు పాఠాలు చెబుతూనే మోడలింగ్ కెరీర్ వైపు అడుగులు వేశారు. ఫ్యాషన్, బ్యూటీ ఈవెంట్స్‌లో పాల్గొంటూ మోడల్‌గా, టీవీ యాంకర్‌గా కొత్త జీవితంలో స్థిరపడుతున్న తరుణంలో బుల్లితెర ఆహ్వానం ఆమె జీవితాన్నే మార్చేసింది. తొలి సీరియల్ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘స్వయం వరం’ సీరియల్స్‌లో బాగా పాపులరయ్యారు. రెండేళ్లు వరుసగా ఉత్తమ సీరియల్ హీరోయిన్గా అవార్డులు దక్కించుకున్నారు. వరసు ఆఫర్లు.. టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలతో బిజీగా ఉంటూనే వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తొలి సినిమా శివం. హీరోయిన్ రాశిఖన్నా స్నేహితురాలిగా మంచి క్యారక్టర్ దక్కించుకున్నారు. అదే ఏడాది నేను శైలజ, చుట్టాలబ్బాయ్ సినిమాల్లోనూ చేశారు. జనతా గ్యారేజ్‌తో అవకాశాలు వరుసకట్టాయి. ధృవ నుంచి చిత్రలహరి వరకు దాదాపు 15కుపైగా సినిమాల్లో నటించారు. లాక్డౌన్ తర్వాత తాజాగా ఎఫ్–3, వరుడు కావలెను సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మధ్యలోనే బిగ్‌బాస్–3లో కంటెస్టెంట్‌గా చేశారు. సెలవుల్లో సొంతూరుకు.. సొంతూరంటే ఎంతో ఆపేక్ష కలిగిన హిమజ ఏమాత్రం ఆటవిడుపు దొరికినా ‘చలో వీర్లపాలెం’ అనేస్తారు. చిన్న భద్రాచలంగా పిలుచుకునే వీర్లపాలెంలోని ప్రసిద్ధ రామాలయాన్ని తప్పక దర్శించుకుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ‘ఇట్స్ హిమజ’ అనే సొంత చానల్లోనూ ఆలోచనాత్మక వీడియోలతో అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. ‘‘పాత్ర ఏదైనా.. క్యారెక్టర్‌ను అంతిమంగా గెలిపించడమే తన బాధ్యతని హిమజ ‘సాక్షి’కి చెప్పారు. తొలినాళ్లలో ‘నీకు మేకప్ అంటదు...ఎన్ని చెప్పినా ఇంతే...నటన మెరుగపడదు’ అని ముఖం మీదే అన్నవారే.. ఇప్పుడు ‘ఏ క్యారక్టర్‌లోనైనా అతికినట్టు సరిపోతుంది’ అంటూ ప్రశంసిస్తుంటే చాలా సంతోషంగా ఉందంటున్నారు’’. -
8వ తరగతిలోనే లవ్‌స్టోరీ: హిమజ
బిగ్‌బాస్ తర్వాత చాలామంది కెరీర్ శూన్యంగా మారితే హిమజ మాత్రం ఎన్నో ఆఫర్లు అందుకుంటూ బిజీబిజీగా మారింది. సొంతంగా లిటిల్ లేడీస్ బాస్కెట్ అని కంపెనీ కూడా ప్రారంభించింది. బిజినెస్ స్టార్ట్ చేయడమే కాక అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్‌లు, మరోవైపు రిబ్బన్ కటింగ్‌లు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. పనిలో పనిగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు కొందరితోనే కలిసినట్లు అనిపించినా, బయటకు వచ్చాక మాత్రం అందరితో కలిసిపోయింది. ముఖ్యంగా రవికృష్ణ, శివజ్యోతిలతో కనిపిస్తూ సోషల్ మీడియాలో మరింత సందడి చేస్తోంది. నిన్న(నవంబర్ 3) హిమజ బర్త్‌డే. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన బాల్యం, యవ్వనం, వర్తమానం గురించి చెప్పుకొచ్చింది. (మాస్టర్ సంచలన నిర్ణయం.. భోరుమన్న మెహబూబ్) చిన్నతనంలో బాగా అల్లరి చేసేదాన్నని, అప్పుడు ఇంట్లోవాళ్లు బడితెపూజ చేసేవాళ్లని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. చాలామంది లవ్ చేశారు. నేనూ చేశాను. చాలామంది హృదయంలో ఉన్నారు, కొందరు అలానే మనసులో ఉండిపోతారు అని చెప్పుకొచ్చింది. కానీ ఎవరి లైఫ్ వాళ్లదేనని స్పష్టం చేసింది. కానీ 8వ తరగతిలోనే ఓ లవ్ స్టోరీ ఉందని తెలిపింది. అయితే ఓ యూట్యూబ్ ఛానల్ 'కొంతమంది గురించి చెప్తే కాపురాలు కూలిపోతాయి' అని హెడ్డింగ్ పెట్టుకోవడంపై అసహనం వ్యక్తం చేసింది. "చిన్నప్పుడు ఎవరినైనా లవ్ చేశావా? పేరు చెప్పు అని ఇంటర్వ్యూలో అడిగారు. వాళ్లు ఎక్కడో పెళ్లి చేసుకుని ఉంటారు. మళ్లీ వాళ్ల పేర్లు చెప్పి అనవసరంగా ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్న ఉద్దేశ్యంలో మాట్లాడాను. కానీ దానికి కాపురాలు కూలిపోతాయ్ అంటూ భీభత్సమైన హెడ్డింగ్ పెట్టి వ్యూస్ సంపాదించుకున్నారు" అని హిమజ చెప్పుకొచ్చింది. (బిగ్‌బాస్ : నోయల్ రీఎంట్రీ.. సర్ప్రైజ్ వీడియో) -
హిమజ
బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘జ’. జై దుర్గా ఆర్ట్స్ పతాకంపై సైదిరెడ్డి చిట్టెపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మించారు. హిమజ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా హాజరై ‘జ’ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను విడుదల చేశారు. సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ – ‘‘జ’ అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి’’ అన్నారు. ‘‘నేను డాక్టర్ని. దర్శకుడు సైదిరెడ్డి చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాను’’ అన్నారు ఉపేందర్. ‘‘సైదిరెడ్డి నాలుగేళ్లు కష్టపడి మంచి సబ్జెక్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు గోవర్థన్ రెడ్డి. ‘‘ఇందులో నాది నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్ర. నటిగా మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుంది’’ అన్నారు హిమజ. ‘‘ఈ చిత్రంలో నాలుగు డిఫరెంట్ పాటలు ఉన్నాయి’’ అన్నారు సంగీత దర్శకుడు వెంగీ. -
పునర్నవి ఔట్.. స్టెప్పులేసిన హిమజ
బిగ్‌బాస్ తెలుగు సీజన్-3లో భాగంగా పదకొండో వారం పునర్నవి భూపాలం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అందరూ ఊహించినట్టే పునర్నవికి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్ బాస్ హౌజ్ వీడాల్సి వచ్చింది. ఇక పునర్నవి ఎలిమినేట్ కావడంతో రాహుల్ సిప్లిగంజ్ వెక్కివెక్కి ఏడ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో మరోసారి బయటపడింది. కాగా, పునర్నవి ఎలిమినేట్ కావడంతో హిమజ తెగ ఆనంద పడుతోంది. పునర్నవి కంటే రెండు వారాల ముందే ఎలిమినేట్ అయిన హిమజ.. తాజాగా పునర్నవి ఎలిమినేట్ కావడంతో ఎగిరిగంతేసింది. పునర్నవి ఎలిమినేట్ అయిందని నాగార్జున ప్రకటించడంతో హిమజ టీవీ ముందుకు వచ్చి స్టెప్పులేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియోను హిమజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాకుండా పునర్నవి యాక్షన్‌కు తన రియాక్షన్ ఇదే నంటూ కామెంట్ జతచేసింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. చిల్లర వేశాలంటూ పునర్నవి అభిమానులు హిమజపై మండిపడుతున్నారు. అంతేకాకుండా షోలో భాగంగా నాగార్జున షూ పాలీష్ చేసినప్పుడు, ఇంటి సభ్యుల బంధువులు హౌజ్‌లోకి వచ్చినప్పుడు కూడా హిమజ ఇలాగే ఓవరాక్షన్ చేసిందని గుర్తుచేస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం హిమజకు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా, బిగ్ బాస్ హౌజ్‌లో హిమజ-పునర్నవిల మధ్య ఎప్పుడూ ముఖ్యంగా నామినేషన్ సమయంలో యుద్ధ వాతావరణం ఉండే విషయం తెలిసిందే. ఇక హిమజ బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకి వచ్చాక ఇంటి సభ్యుల గురించి, హౌజ్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. అంతేకాకుండా తను పాల్గొన్న పలు కార్యక్రమాల్లో కూడా ఇంటి సభ్యులపై ఆసిక్తికర కామెంట్స్ చేస్తూ అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. -
పునర్నవి ఔట్.. స్టెప్పులేసిన హిమజ
-
అనగనగా ఓ హిమజ
నా జీవితంలోని మధురమైన ఘట్టం.. డిగ్రీ ఫస్టియర్ లో ఉన్నప్పుడు వెళ్లిన ఎన్ఎస్ఎస్ క్యాంపు లోని పది రోజుల కాలం.. ఆ మధురానుభూతుల్ని తలచుకుని నా మనసు ఇప్పటికీ తుళ్ళి పడుతుంది. ఆ అనుభవాలు తలచుకుని ప్రతిక్షణం ఆనంద పారవశ్యంలో మునిగితేలుతుంది. ఆ పది రోజులు ఎంత తొందరగా అయిపోయాయా అనిపిస్తోంది తలుచుకున్నప్పుడు.. నిజ జీవితంలో సినిమా సంఘటనలు ఎదురైతే ఎంత థ్రిల్ ఫీల్ అవుతామో నిరూపించిన క్యాంపు అది.. హిమజ అని మా క్లాస్ మేట్. కొంచెం అందంగా ఉంటుంది. తానే అందగత్తెనని కొంచెం ఫీలింగ్ కూడా. తనను ఎవరైనా అదే పనిగా చూస్తే ప్రేమలో పడతారని ఆమె భయం. అలాంటి అమ్మాయి మా గ్రూప్‌లోనే ఉంది. (ఎన్నెస్సెస్ క్యాంపు వెళ్లిన మేము ఐదు గ్రూపులుగా విడిపోయి.. ఊళ్లో తలో భాగాన్ని పంచుకొని శ్రమదానం పనులు చేసేవాళ్లం.) మంచి అమ్మాయే కానీ అనుమానాలు ఎక్కువ. కొంచెం ఫ్రీగా ఉంటే అందరితో బాగానే మాట్లాడుతుంది. క్లాస్మేట్ కాబట్టి నాతో ఫ్రీగానే ఉంది. అట్లాగే తన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను నాతో షేర్ చేసుకుంది. ఆమెతో నేను కొంచెం కామెడీగా ఉండేవాణ్ని. ఆమె మావయ్య అని ఒకతన్ని పిలిచేది. అతను నాతో కూడా ఫ్రెండ్లీగా ఉండేవాడు. నేను అతన్ని బాబాయి అని పిలువడం మొదలెట్టాను. ఇలా పిలవడంలో ఎలాంటి దురుద్దేశమూ లేదు... అలా కొన్నిసార్లు పిలిచినా తను ఏం ఫీల్ కాలేదు. నా మంచితనం తెలుసు కాబట్టి. కానీ ఒక రోజు ఊరికి కొంచె దగ్గరగా చెలుకలో మట్టి తవ్వుతున్నప్పుడు.. తనను తేనేటీగ కరిచింది. తను బాగా ఏడుస్తుంటే నా మనస్సుకు చాలా బాధేసింది. వెంటనే ఊళ్లోకి పరిగెత్తుకెళ్లి ఓ పెద్దమ్మను అడిగాను. తేనేటీగ కుడితే మందు ఏం పెట్టాలని. ఆమె ఒక చెట్టు ఆకు పసురును పెడితే వెంటనే నొప్పి తగ్గిపోతుందని చెప్పింది. నేను వెంటనే ఆ ఆకు పసురును తీసుకొని తన దగ్గరకు పరిగెత్తుకు వెళ్లాను. తనను అప్పటికీ ఊర్లోని క్లినిక్‌కు తీసుకెళ్లారు. నేను పసురును తీసుకొని క్లినిక్‌కు వెళ్లాను. డాక్టర్ అన్నాడు మందు ఇచ్చాను పసురు లాంటివి అవసరం లేదని. నేను పసురు తీసుకెళ్లి ఇది పెట్టుకుంటే త్వరగా తగ్గుతుందని చెప్పాను. తన వెంట ఉన్న తోటి క్లాస్మేట్స్ (గర్ల్స్) నవ్వారు. పసురులాంటివి వొద్దు బాబు.. అయినా డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాం కదా.. నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేమందరం ఉన్నాం కదా. నీ ఒక్కడికే అంత టెన్షన్ ఎందుకు అన్నట్టు చూశారు. తను నన్ను కోపంగా చూసింది. నొప్పి ఎలా ఉంది అని అడిగినా సమాధానం ఇవ్వలేదు. ఈ పసరు పెట్టుకుంటే తగ్గిపోతుందంట అని చెప్పినా వినిపించుకోలేదు. అమ్మాయిలతో కలిసి కోపంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత కనిపించినా మొఖం తిప్పుకోవడం మొదలుపెట్టింది. మాట లేదు. ముచ్చట లేదు. ఎందుకు మాట్లాడటం లేదని అడిగాను. నాతో నేరుగా మాట్లాడకుండా పక్కకు ఉన్నవారికి చెప్తున్నట్టుగా `ఓవరాక్షన్ చేసేవారితో నేను మాట్లాడాను` అని అంది. అందులోని ద్వంద్వార్థాన్ని గ్రహించాను. నేను తనతో ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నట్టు తను భావించేదేమో. కామెడీగా ఉంటూ సరదాగా మాట్లాడాను. తనకు తేనేటీగ కుడితే తను ఏడ్వడం చూడలేక ఒక మనిషిగా పరిగెత్తుకెళ్లి ఆకు పసరు తీసుకొచ్చాను. కానీ, నేను తను పట్ల స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు తను భావించింది. నేను తనను ప్రేమిస్తున్నానని అనుకుందేమో. తను దూరం పెట్టడం మొదలెట్టింది. నేనూ తనతో మాట్లాడటం మానేశాను. ఊరిలో శ్రమదానం పనులు ముగించుకొని ఓ రోజు పంపు ట్యాంక్ వద్దకు వచ్చాము. అప్పటి వరకు తన సబ్బుతోనే నేను మొఖం, కాళ్లు చేతులు కడుక్కొనే వాణ్ని. ఆ రోజు మాత్రం తన ఫేస్ వాష్ ఐపోగానే తన సబ్బు తీసుకొంది. నేను యథాలాపంగా సోప్ అడిగాను. ఇవ్వలేదు. పక్కన ఉన్న సీనియర్ అమ్మాయి.. అక్కడ బట్టలుతికే సబ్బు ఉంది కదా.. దానితో కడుక్కో అని టీజింగ్ చేస్తున్నట్టు అంది. హిమజ మీద కోపంతో ఆ సోపుతోనే మొఖం, కాళ్లు చేతులు కడుక్కున్నాను. తను మాత్రం పిల్లడ ఆ సబ్బుతో కడుక్కోకు. నా సోప్ ఇస్తా తీస్కో అంది. నేను కోపంతో తీసుకోలేదు. తను ఏమనుకుందో మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది. నేను మాట్లాడకపోయినా మాట్లాడేది. నాకు కోపం వచ్చింది. `నువ్వు ఓవరాక్షన్ చేసేవారితో మాట్లాడవు కదా` అని అడిగేశాను. `నువ్విప్పుడు ఓవరాక్షన్ చేస్తలేవు కదా` అని అంది. అంటే తనతో మాట్లాడకపోతే..తనను అవాయిడ్ చేస్తేనే మాట్లాడుతదా? తనతో మాట్లాడటం ఇష్టం అనిపించలేదు. అయినా.. కన్నా.. చిన్నా అంటూ పిలువడం మొదలుపెట్టింది. అవాయిడ్ చేసినకొద్ది మాట్లాడేది. ఓ రోజు నేను చాలా చిరాగ్గా కూచున్నాను. మా గ్రూప్‌లోనే నేను ఎంతో ఇంట్రస్ట్‌గా, శ్రద్ధగా శ్రమదానం పనులు చేసేవాడిని. ఊరికి మనవల్ల ఎంతోకొంత మేలు జరగాలి. మనం స్టూడెంట్స్ వచ్చి చేసిన పనిని ఊళ్లోవాళ్లు.. ఒక్కసారన్న జ్ఞాపకం చేసుకోవాలి అన్నట్టుగా ఉండేది నా ధోరణి. కానీ, ఆ రోజు నాకు పనిచేయబుద్ధి కాలేదు. చాలా చిరాగ్గా ఉంది. ఏం పని చేయకుండా ఓ ఇంటి అరుగు మీద ముభావంగా కూచున్నా. అప్పటివరకు పిచ్చి గడ్డిమొక్కల్ని పీకి.. నా పక్కన కొంచెం దూరంగా కూచుంది హిమజ. నేను ముభావంగా ఉండటం గమనించిందో లేదో తెలియదు. కానీ ఉన్నట్టుండి `పిల్లోడా` అని ఒకింత ప్రేమగా పిలిచింది. నేను కోపంగా ముఖం తిప్పుకున్నాను. ఈసారి కొంత గోముగా, కొంత కోపంగా `ఓ పిల్లగా ఇటు చూడు` అంది. నాకు చుర్రుమంది. `ఏంటి.. ఏంటి అన్నావు` అని కోపంగా అడిగాను. తను బెదిరిపోయి.. అటూఇటూ బిత్తరచూపులు చూసి.. `తమ్ముడా` అని పిలిచానని మాట మార్చింది. లేదు నువ్వు తమ్ముడా అనలేదు అని నేను అడిగితే.. అంతే అన్నానని బుకాయించింది. నేను షాక్ తిన్నాను. నా గురించి తను చెండాలంగా ఊహించికున్నట్టు అనిపించింది. ఓ స్నేహితురాలిగా అభిమానించానేమో. ఓ క్లాస్మేట్గా స్నేహంగా ఉండాలనుకున్నా. తమ్ముడా అని ఎలా పిలుస్తుంది. ఒక్క క్లాస్‌లోని వాళ్లు స్నేహంగా ఉండకూడదా. స్నేహంగా ఉంటే కూడా అది ప్రేమ అవుతుందా? ప్రేమ అనేవాటికి తప్పించుకునేందుకు ఇలాంటి తమ్ముడా అనే ముసుగులు ధరించాలా? నాకు చాలా బాధేసింది. ఏదో దు:ఖం కూడా కమ్ముకున్నట్టు అనిపించింది. ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది. కొంచెం చనువుగా మసిలితే.. స్నేహంగా ఉంటే అది ఐ లవ్యూ వరకు వెళుతుందా? నేను చదువుతున్నప్పటి రోజులు అలా ఉన్నాయేమో.. తన అనుభవాల ప్రభావమో. ఎదుటివాణ్ని అలా హఠాత్తుగా తమ్ముడా అని అనడం తనకు తప్పు అనిపించలేదేమో. ఎదుటివారి హృదయంలో ఏ దురుద్దేశమూ లేకపోయినా.. అతన్ని తమ్ముడా అని ఒక భావానికి కుదించేసి.. మన మధ్య ఉన్న కనీస స్నేహ, మావన సంబంధాలకు కూడా అర్థం లేకుండా చేసింది తను అనిపించింది. తను నన్ను తమ్ముడా అన్నా ఫ్రెండ్ అన్నా మామూలు క్లాస్మేట్గా పరిగణించినా నేను ప్రత్యేకంగా ఏమీ బాధపడేవాణ్ని కాదు. కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కొంత స్నేహం ఏర్పడిన తర్వాత అపార్థాలతో, అనుమానాలతో నన్ను తమ్ముడా అని పిలువడం బాధగా అనిపించింది. ఒక వ్యక్తిగా నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అనిపించింది. నేనే సరిగ్గా కమ్యూనికేట్ కాలేదేమోనని ఆత్మపరిశీలన చేసుకున్నా. కానీ నా మనస్సులో ఎలాంటి దురుద్దేశం లేదు. ఆ విషయం తనెప్పుడు తెలుసుకోలేకపోవచ్చు. ఆ తర్వాత మేం పెద్దగా మాట్లాడుకోలేదు. తన అపార్థాల నుంచి బయటపడే అవకాశం కూడా తనకు లేదేమో అనిపించింది. ఆ తర్వాత మరో రెండేళ్లు మేం కాలేజీ లైఫ్‌లో కలిసి చదివినప్పటికీ పెద్దగా మాట్లాడుకున్నది లేదు. కానీ ఓ రోజు హఠాత్తుగా తను నాతో మాట్లాడింది. క్లాస్ అయిపోయాక ఇద్దరం కలిసి బేకరీకి వెళ్లాం. తను రెండు ఎగ్పాప్స్ తిన్నది. నేను కూల్‌డ్రింక్ తాగాను. నా స్వభావం తనకు అర్థమైనా కాకపోయినా.. బుద్ధిపూర్వకంగానే నేను తనకు బాగా దూరంగా ఉండిపోయినట్టు అనిపిస్తుంది. - శ్రీకాంత్ కాంటేకర్ -
సంచలన నిజాలు బయటపెట్టిన హిమజ
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండే కంటెస్టెంట్లు.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు.ఇరవై నాలుగు గంటలు వారితో వారే పోట్లాడుకుంటూ.. మాట్లాడుకుంటూ.. ఉంటారు. బిగ్‌బాస్ చూసే ప్రేక్షకులకంటే.. వారితో ఉండే తోటి కంటెస్టెంట్లకే ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు చూపించే పుటేజ్కేవలం గంట మాత్రమే.. బిగ్‌బాస్ నిర్వాహకులు రోజంతా జరిగింది చూపించలేరు. వారికి ఉపయోగపడేది, టీఆర్పీలు పెంచుకునే విధంగా ఉండేట్టు గంట వ్యవధికి సరిపోయే అంతగా కట్ చేసి వేస్తారు. వాటిని చూసి మనం డిసైడ్ చేసేస్తుంటాం. అయితే మనకు చూపించే వాటిలో గొడవలుంటాయి. కానీ వాటికి సంబంధించిన కారణాలు అంత స్పష్టంగా ఉండకపోవచ్చు.. మళ్లీ వారంతా ఇట్టే కలిసిపోతుంటారు. కానీ మనకు వాటన్నంటిని విపులంగా చూపించడం కుదరదు. ఇలా ఒక కంటెస్టెంట్‌ను వారు హీరోను చేయగలరు..జీరోను చేయగలరు. అయితే శ్రీముఖికి బిగ్‌బాస్ డైరెక్టర్స్ టీమ్‌లో అభిషేక్, శ్యామ్ అనే ఇద్దరు స్నేహితులున్నట్లు హిమజ బయటపెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ విషయం శ్రీముఖే తనకు చెప్పినట్లు వెల్లడించింది. ఆమె తరుచు కెమెరాల వద్దకు వెళ్లి సలహాలు, సూచనలు ఇచ్చేదని.. ఈ టాస్క్ బాగా లేదని, ఇంకోటి ఇవ్వమని ఇలా ఏదోకటి కెమెరా దగ్గరకు వెళ్లి చెప్పుకునేదని హిమజ తెలిపింది. అందుకే మొదటి నుంచి శ్రీముఖికి అనుకూలంగా షోను కట్ చేస్తున్నారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాబట్టే.. శ్రీముఖిపైనే ఫోకస్ పెట్టి, ఆమె కామెడీ చేసినా, ఖాళీగా కూర్చున్న ఆమెకు సంబంధించిన పుటేజ్ ప్లే చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మరి ఈ వార్తలను శ్రీముఖి ఫాలోవర్స్ ఖండిస్తున్నా.. బిగ్‌బాస్ డైరెక్టర్లు శ్రీముఖి ఫ్రెండ్స్ అనే న్యూస్ పెద్ద మొత్తంలో ట్రెండ్ అవుతోంది. -
స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ
ఆటపాటలతో ఇంటి సభ్యులను ఆట ఆడించిన నాగార్జున.. బిగ్‌బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. రిథమ్ ఆఫ్ లైఫ్ అంటూ డిఫరెంట్ పాటలు ప్లే చేస్తూ.. హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు చేయించాడు. వరుణ్ ఎంట్రీ ఇవ్వడం.. గద్దలకొండ గణేష్ మూవీ ప్రమోషన్లో భాగంగా బిగ్‌బాస్ స్టేజ్‌పై దర్శనమివ్వడం.. హౌస్‌మేట్స్‌తో కలిసి సందడి చేయడం... చివరకు హిమజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడం.. బయటకు వచ్చిన ఆమె హౌస్మేట్స్ గురించి చెప్పడం హైలెట్‌గా నిలిచింది. హౌస్‌మేట్స్‌ను రెండు గ్రూపులుగా విభజించిన నాగ్ వారితో డ్యాన్సులు వేయించాడు. మెడ్లీ పాటలు అంటూ డిఫరెంట్ పాటలనుప్లే చేస్తూ.. ఒక్కోటీమ్ నుంచి ఒక మెంబర్‌ను పిలిచి డ్యాన్స్చేయమన్నాడు. దీనికి మహేస్ జడ్జ్‌గా వ్యవహరిస్తాడని పేర్కొన్నాడు. వరుణ్, పున్ను, బాబా, హిమజలు ఒక టీమ్‌లో ఉండగా మిగతా వారంతా మరో టీమ్‌లో ఉన్నారు. దీంట్లో భాగంగా పున్ను, హిమజ, రవి, బాబాలు బాగా డ్యాన్స్ చేశారని తెలిపాడు. బాబా భాస్కర్-శ్రీముఖి డ్యాన్స్‌లో శ్రీముఖి ఎక్స్‌ప్రెషన్స్‌లో భాగుందని, డ్యాన్సులో బాబా బాస్కర్ బాగా చేశాడని తెలిపాడు. ఈ టాస్క్ తరువాత.. గద్దలకొండ గణేష్‌ను స్టేజ్‌పైకి ఆహ్వానించాడు. దీంతో హౌస్మేట్స్ అంతాఆశ్చర్యానికి గురయ్యారు. వారికి వాల్మీకి ట్రైలర్‌నే ప్లే చేసి చూపించారు. శివజ్యోతి, హిమజ, పున్ను, వితికా, శ్రీముఖిలు వరుణ్‌కు ప్రపోజ్ చేయాలంటూ ఓ టాస్క్‌ను ఇచ్చాడు. అయితే ఈ టాస్క్‌లో శివజ్యోతి తెలంగాణ యాసలో ప్రపోజ్ చేసి విన్నర్‌గా నిలిచింది. చివరగా.. హిమజ ఎలిమినేట్ అయినట్టు వరుణ్ ప్రకటించాడు. బయటకు వచ్చిన హిమజ.. బిగ్‌బాస్ హౌస్‌లో తన జర్నీకి సంబంధించిన వీడియోను చూపి ఎమోషనల్ అయింది. బయట తనకు ఎదురైన పరిస్థితులను బట్టి.. ఎవ్వరితోనూ అంత ఈజీగా కలవలేనని చెప్పుకొచ్చింది. హౌస్‌లో తాను అలా ఉండే సరికి తనకెప్పుడు ఎవరూ సపోర్ట్ చేయలేదంటూ కన్నీరు పెట్టుకుంది. గుడ్, బ్యాడ్, అగ్లీ అంటూ హిమజతో ఆట ఆడించాడు. ఆమె గుడ్, బ్యాడ్, అగ్లీ అంటూ హౌస్మేట్స్ గురించి చెప్పాల్సి ఉంటుందని.. ఆ సమయంలో వారంతా ఐస్‌పై నిలిచి ఉంటారని టాస్క్ ఇచ్చాడు. శ్రీముఖి, రవి, వరుణ్, శివజ్యోతి గుడ్ అని.. వితికా, పున్ను, మహేష్ బ్యాడ్ అని.. బాబా భాస్కర్‌కు అగ్లీ అని పేర్కొంది. లివింగ్ ఏరియాలోంచి గార్డెన్ ఏరియాలోకి ఎవరు వెళ్లినా.. ఆ సమయంలో డోర్ తీస్తూ ఉండాలనే బిగ్‌బాంబ్‌ను మహేష్‌పై వేసింది. -
హిమజ అవుట్.. అసలేం జరుగుతోందంటే?
బిగ్‌బాస్ తొమ్మిదో వారాంతానికి భలే ట్విస్ట్‌ఇచ్చాడు. లీకు వీరులు సైతం నోరు మెదపలేని విధంగా ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి బిగ్‌బాస్ అంటే ఏంటో నిరూపించాడు. నామినేషన్లో ఉన్నదే ముగ్గురు అయితే అందులో డబుల్ ఎలిమినేషన్ అంటూ పెద్ద బాంబు పేల్చాడు. పైగా దీనికి తగ్గట్టు రిలీజ్ చేసిన ప్రోమోలో కొన్ని వివరాలు వెల్లడయ్యేలా దాన్ని కట్ చేశాడు. (డబుల్ ఎలిమినేషన్.. రాహుల్ అవుట్!) అయితే వాటిని అంచనా వేసుకుంటూ.. కొంతమంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. ప్రోమో చూసిన వారెవరికైనా.. రాహుల్ ఎలిమినేట్ అయినట్టు ఇట్టే తెలిసిపోతుంది. అయితే అంత ఈజీగా తెలిసిపోయేలా ప్రోమోను విడుదల చేశాడంటే.. అందులో ఏదో తిరకాసు ఉందంటున్నారు నెటిజన్లు. రాహుల్‌ను ఎలిమినేట్ చేయలేదు.. సీక్రెట్ రూమ్‌లోకి పంపించారంటూ ఓ ప్రచారం జరుగుతోంది. మరోవైపు హిమజ ఎలిమినేట్ అయిపోందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్న హిమజ ఫాలోవర్స్.. బిగ్‌బాస్‌పై మండిపడుతున్నారు. ఇక రేపటి నుంచి బిగ్‌బాస్ షోను చూడమంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. పనికి రానివాళ్లంతా షోలో ఉన్నారు.. హిమజ లేకపోతే టీఆర్పీలు కూడా రావంటూ.. ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా హిమజ ఎలిమినేట్ అయిందా? రాహుల్‌ను ఎక్కడికి పంపించారు? అనే విషయాలు తెలియాలంటే.. ఇంకొద్ది సమయం ఆగాలి. -
హిమజ వ్యవహారంపై నెటిజన్లు ఫైర్
ముందునుంచీ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంటూ హౌస్‌లో నిలదొక్కుకుంటోన్న కంటెస్టెంట్ హిమజ. అరవై రోజులు కలసి ఉన్నా.. ఇంటా బయటా ఆమెను ఓ అంచనా వేయలేకపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం హిమజకు గట్టి ఫాలోయింగే ఉంది. తొమ్మిదో వారంలో నామినేషన్ వ్యవహారంలో హిమజ చర్య.. అందరూ ముక్కున వేలేసుకునేట్టు చేసింది. మహేష్ సేవ్ అవ్వాలంటే.. హిమజ తన బట్టలను, మేకప్ సామాన్లను అన్నింటిని స్టోర్‌రూమ్‌లో పెట్టేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ తెలిపాడు. ఇదే విషయాన్ని హిమజకు కూడా చెప్పాడు. అందుకు ఒప్పుకున్న హిమజ.. తన బట్టలను, మేకప్ సామాన్లను స్టోర్‌రూమ్‌లో పెట్టేసింది. అయితే కెప్టెన్ అయిన వితికాను బిగ్‌బాస్ ఆదేశిస్తూ.. ఇంట్లో ఇంకా ఏమైనా వస్తువులు ఉన్నాయో లేదో చూడమన్నాడు. దీంతో కొన్ని బట్టలు, మేకప్ సామాన్లు దర్శనమిచ్చాయి. దీంతో మహేష్ నామినేట్ కావాల్సి వచ్చింది. అయితే ఇదే విషయంపై గాసిపాలజీ క్లాస్‌లో వితికా అడగ్గా.. తాను కావాలనే చేయలేదని హిమజ చెప్పుకొచ్చింది. అన్‌సీన్ ఎపిసోడ్స్‌లో హిమజ ఈ ఎపిసోడ్‌పై స్పందించినట్టు తెలుస్తోంది. తనకు మహేష్ కోసం త్యాగం చేయడం ఇష్టం లేదంటూ.. మొహంపైనే చెప్పలేకపోయానని రవి, శివజ్యోతిలతో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోతో నెటిజన్లు ఆమెను ఆడేసుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ మూలంగా ఆమెపై కొంచెం నెగెటివిటీ పెరిగింది. దీని కారణంగా ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటూ.. కొందరు అభిప్రాయపడుతున్నారు. -
బిగ్‌బాస్.. హిమజ కావాలనే చేసిందా?
తొమ్మిదో వారానికిగానూ బిగ్‌బాస్ చేపట్టిన నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. గత సీజన్లో మాదిరిగానే నిర్వహించిన బిగ్‌బాస్ కొన్ని మార్పులు మాత్రమే చేశాడు. అప్పుడు కూడా టెలిఫోన్ బూత్‌ను ఏర్పాటు చేసి ఒక్కో హౌస్‌మేట్స్‌ను పిలిచి నేరుగా నామినేట్ చేశాడు. అయితే నామినేషన్లోంచి తప్పించుకోవడానికి ఓ అవకాశమిస్తున్నట్లు చెప్పి.. మిగతా హౌస్మేట్లోంచి ఒకరి చేత తాను చెప్పిన పనిని చేయించాల్సి ఉంటుందని షరతును విధించాడు. దీనిలో భాగంగా రెండో సీజన్లో గీత మాధురి బిగ్‌బాస్ ట్యాటూ వేయించుకోగా.. ఈసారి శ్రీముఖి వేయించుకుంది. తనీష్ తనకు ఇష్టమైన జాకెట్‌ను పెయింట్‌లో ముంచగా.. ఈసారి రవి తనకిష్టమైన షూలను పెయింట్‌లో ముంచాడు. తేజస్వీ కోసం సామ్రాట్ క్లీన్ షేవ్ చేయించుకోగా.. శ్రీముఖి కోసం బాబా భాస్కర్ క్లీన్ షేవ్ చేసుకున్నాడు. అయితే మహేష్ నామినేషన్ విషయానికొచ్చేసరికి మాత్రం తేడా కొట్టేసింది. గతంలో కూడా ఇలాంటిది ఇచ్చిన బిగ్‌బాస్.. మరోసారి చెక్ చేయమని చెప్పలేదు. ఈసారి కెప్టెన్ అయిన వితికాను.. హిమజకు సంబంధించిన వస్తువులు, బట్టలు ఏమైనా ఉంటే చూసి చెప్పండని ఆదేశించాడు. దీంతో హిమజకు సంబంధించిన మేకప్ వస్తువులు, కొన్ని బట్టలు మిగలడంతో ఆ విషయాన్ని బిగ్‌బాస్‌కు తెలిపింది. దీంతో మహేష్ నామినేట్ అయినట్లు తేల్చేశాడు. అయితే హిమజ కావాలనే ఇలా చేసిందని కొందరు అంటుండగా.. కాదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా హిమజ చేసిన ఈ పనితో మహేష్ నామినేషన్లోకి వచ్చేశాడు. దీంతో హిమజపై ప్రస్తుతం ఫుల్ నెగెటివిటీ పెరుగుతోంది. -
బిగ్‌బాస్‌ను వేడుకుంటున్న హిమజ
-
బిగ్‌బాస్‌ను వేడుకుంటున్న హిమజ
బిగ్‌బాస్ హౌస్‌లో తొమ్మిదో వారానికి గానూ చేపట్టే నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వారంలో ఎవరు నామినేషన్స్‌లోకి వస్తారన్నది చూడాలి. ఎందుకంటే ఈ వారంలో నామినేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. ఎదుటి కంటెస్టెంట్ బిగ్‌బాస్ చెప్పిన టాస్క్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హిమజ కోసం వరుణ్ సందేశ్ చాలానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. హిమజ నామినేషన్స్ నుంచి తప్పించుకోవాలంటే.. వరుణ్ సందేశ్ ఓ టాస్క్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించినట్లు తెలుస్తోంది. బురదలో కూర్చొవాలనే టాస్క్‌ను వరుణ్ అతి కష్టం మీద చేస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో వితికా భోరున ఏడ్చినట్లు తెలుస్తోంది. అయితే వరుణ్ అంతగా బాధపడటం చూసిన హిమజ.. తాను నేరుగా నామినేట్ అవుతానని బిగ్‌బాస్‌కు చెప్పుకొచ్చింది. ఇక మరి హిమజ నేరుగా నామినేట్ అయ్యిందా? మధ్యలోనే వరుణ్ టాస్క్‌ను వదిలేయాల్సి వచ్చిందా? అన్నది తెలియాలి. -
బిగ్‌బాస్.. కన్ఫెషన్ రూమ్‌లో కష్టాలు
-
బిగ్‌బాస్.. కన్ఫెషన్ రూమ్‌లో కష్టపడుతున్నారేంటి?
బిగ్‌బాస్ హౌస్‌లో అన్నింటికంటే కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లడం కష్టమైంది. ఇంటిసభ్యులకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలన్నా.. సీక్రెట్ టాస్క్ ఇవ్వాలన్నా.. అలాంటి వాటికి కన్ఫెషర్ రూమ్ అడ్డాగా మారుతుంది. అందుకే ఆ రూమ్ అంటే అందరికీ దడగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం ఫుడ్ ఐటమ్స్ కూడా ఇస్తుంటాడు బిగ్‌బాస్. గత సీజన్లో తనీష్, రోల్ రైడా కన్ఫెషన్ రూమ్‌లో చాక్లెట్లు ఆరగించిన విషయం గుర్తుండే ఉంటుంది. నేటి ఎపిసోడ్లో కూడా అలాంటిదే జరగనున్నట్లు కనిపిస్తోంది. నేటి ఎపిసోడ్లో ఇంటి సభ్యులందర్నీ కన్ఫెషన్ రూమ్‌కు రావాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వెళ్లిన బాబా భాస్కర్ అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతూ కనిపిస్తున్నాడు. ఇంగ్లీష్ రైమ్స్ చెప్పలేక పునర్నవి తడబాటు పడటం, రాహుల్ గుంజీలు తీయడం.. రవి-హిమజలకు తినే పదార్థాలను ఇవ్వడం.. వాటిని హిమజ దాచుకోవడం.. మీకు చెప్పింది తినమని.. దాచుకోమని కాదని బిగ్‌బాస్ అనడం హైలెట్‌గా నిలిచింది. ఇంతకీ ఇంటి సభ్యులందరు కన్ఫెషనరూమ్కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాలి. -
బిగ్‌బాస్ 3: తెరపైకి కొత్త వివాదం!
బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాస్తోందని ప్రముఖ ఆంగ్ల దినపత్రికపై శ్రీముఖి బంధువులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీముఖిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఆమెకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం నిర్వహిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ట్విటర్ నకిలీ అకౌంట్లను పరిగణలోకి తీసుకొని ఆ పత్రిక వార్తలు రాస్తూ శ్రీముఖిపై దుష్ప్రచారం చేస్తోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత రెండు వారాల నుంచి ఈ వార్తలు మరింత ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించక తప్పలేదని వారు పేర్కొన్నారు. రాహుల్‌ను ఎగతాళి చేస్తూ... ఇక బిగ్‌బాస్ ఇంట్లో ....రాహుల్, శ్రీముఖిలు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. గత ఎపిసోడ్లో శ్రీముఖి రాహుల్‌ను బ్లాక్ షీప్ అని కామెంట్ చేసింది. రాహుల్‌ను ఎగతాళి చేస్తూ అన్న మాటలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఇది వర్ణ వివక్ష చూపించడమే అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఓ టాస్క్‌లో అనవసరంగా మధ్యలో జోక్యం చేసుకుని మరీ రాహుల్‌ను దూషించిన హిమజను కూడా అభిమానులు కడిగిపారేస్తున్నారు. వీరిద్దరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నాగార్జునను కోరుతున్నారు. ఇక రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన శ్రీముఖిని షో నుంచి తప్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. గతంలో శ్రీముఖి, హిమజల పట్ల దురుసుగా ప్రవర్తించిన రాహుల్, అలీలకు నాగ్ చురకలు అంటించిన విషయం తెలిసిందే. కానీ శ్రీముఖి, హిమజలు చేస్తున్న తప్పులను మాత్రం నాగ్ అసలు పరిగణలోకే తీసుకోవట్లేదని కొందరు అభిమానులు గుర్రుగా ఉన్నారు. కాగా గత ఎపిసోడ్లో ఇంటి సభ్యుల్లో ఎవరికైనా కోపం తెప్పించాలనే టాస్క్‌ను రాహుల్ ఎంచుకున్నాడు. టాస్క్ ఆడుతున్న సమయంలో హిమజ రాహుల్ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించింది. చెప్పు తెగుతుంది అంటూ ఏకంగా కొట్టడానికే వెళ్లింది. మరి ఆడవారిని ఏమైనా అంటే ఊరుకోని నాగార్జున ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. ఇంగ్లీష్ బిగ్‌బాస్ షోలో శిల్పాశెట్టి కూడా ఇలాంటి వర్ణ వివక్షను ఎదుర్కొంది. కాగా అలాంటి విద్వేషపూరిత మాటలు అన్న జేడ్గుడిని షో నుంచి అర్ధాంతరంగా బయటకు పంపించేశారు. మరి ఇక్కడ శ్రీముఖిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి! A reputed media being involved in wrong/paid article publication based on tweets made by fake accounts. @toitv TIMES OF INDIA . #TeamSreeMukhi #sreemukhi #timesofindia #BiggBoss3Telugu #toi pic.twitter.com/Yn59Etk8Qi — SreeMukhi (@MukhiSree) August 29, 2019 -
సీక్రెట్ టాస్క్‌లో ఓడిన హిమజ
బిగ్‌బాస్ ట్రిక్స్‌ను ప్రేక్షకులు ముందుగానే పసిగట్టేశారు. హిమజ గొడవ చేయడం.. కిచెన్‌లో ఎగ్స్ పగలగొట్టడంతో ప్రోమో విపరీతంగా వైరల్ అయింది. అయితే అది సీక్రెట్ టాస్క్ అయి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అందరూ అనుకున్నట్లే అది సీక్రెట్ టాస్కే అని తేలిపోయింది. ఈ టాస్క్‌లో భాగంగా.. ఇంట్లోని కొన్ని వస్తువులను దొంగతనం చేయడం.. కిచెన్‌లో గొడవలు సృష్టించడం.. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను పూర్తి కానివ్వకుండా అడ్డుకోవడం లాంటివి చేయాలని ఆదేశించాడు. (బిగ్‌బాస్.. అది సీక్రెట్ టాస్కా?) శుక్రవారం నాటి ఎపిసోడ్లో వీడియోలు ప్లే చేయించి హౌస్మేట్స్ మధ్య చిచ్చు పెట్టాలని బిగ్‌బాస్ చూశాడు. దీనిలో భాగంగా తన గురించి వితికా, రాహుల్ మాట్లాడిన వీడియోలను పునర్నవికి ప్లే చేసి చూపించాడు. దీంతో పునర్నవి వితికా, రాహుల్‌పై అలిగింది. తన గురించి అలా మాట్లాడినందుకు పునర్నవి బాధపడుతూ ఉంటే.. అది సీక్రెట్ టాస్క్ అని వితికా అనుకుంటూ ఉంది. ఇక శ్రీముఖికి కూడా తన గురించి మాట్లాడిన వీడియోలను చూపించాడు. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లో వితికా, పునర్నవి, రాహుల్, వరుణ్ మాట్లాడిన వీడియోలను ప్లే చేసి చూపించగా.. వరుణ్ సందేశ్ కూడా అలా మాట్లాడటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలీరెజా గురించి మాట్లాడిన వీడియోలను కూడా చూపించాడు. హిమజ, శ్రీముఖి తన గురించి మాట్లాడిన వీడియోను, బాబా భాస్కర్ ఏడ్చిన వీడియోను ప్లే చేశాడు. దీంతో బయటకు వచ్చిన అలీ.. బాబాను క్షమించమని అడిగాడు. తనవల్ల బాబా మాష్టర్ ఏడ్చాడని అలీ తెగ బాధపడ్డాడు. వీరందరిని తమ గురించి వెనకాల మాట్లాడిన వీడియోలను ప్లే చేసి చూపించడానికి పిలవగా.. హిమజకు మాత్రం సీక్రెట్ టాస్క్ ఇచ్చేందుకు పిలిచాడు. ఇంటి సభ్యుల వస్తువులను దొంగిలించడం.. అలీరెజాకు సంబంధించిన ప్రోటీన్ పౌడర్‌ను దాచిపెట్టడం.. హౌస్మేట్స్ బట్టలను స్విమ్మింగ్‌పూల్‌లో పడేయడం.. కిచెన్ హౌస్‌లో గొడవలు సృష్టించడం, లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను నాశనం చేయడం.. సీక్రెట్ టాస్క్ చేయాల్సిన పనులని హిమజను ఆదేశించాడు. అయితే అన్నీ కరెక్ట్‌గానే చేసుకుంటూ వచ్చిన హిమజ.. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌కు వచ్చేసరికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. హౌస్మేట్స్ అందరూ తన చర్యలను పసిగట్టి లగ్జరీ బడ్జెట్ టాస్క్‌కు దూరంగా ఉంచేలా చేశారు. దీంతో హిమజ ఈ సీక్రెట్ టాస్క్‌లో విఫలమైనట్లు ప్రకటించాడు. ఇమ్యూనిటీ పవర్‌ను దక్కించుకోలేకపోయిందని బిగ్‌బాస్ తెలిపాడు. రాహుల్ బర్త్ డే సందర్భంగా బిగ్‌బాస్ కేక్‌ను పంపించాడు. హౌస్మేట్స్ అందరూ కలిసి రాహుల్ పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. ఇక వీకెండ్ వచ్చేసింది. ఐదో వ్యక్తి ఇంటి నుంచి వెళ్లేందుకు సమయం వచ్చేసింది. మరి ఈ సారి రాహుల్ సిప్లిగంజ్, హిమజ, అషూ రెడ్డి, మహేష్ విట్టా, పునర్నవి భూపాలం, శివజ్యోతి, బాబా భాస్కర్లోంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూడాలి. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
బిగ్‌బాస్.. అది సీక్రెట్ టాస్కా?
ప్రోమోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్‌బాస్ షో.. నెట్టింట చర్చకు దారితీస్తోంది. తినే విషయంలో బాబా భాస్కర్ హిమజను ఏదో అన్నట్లు, దానికి ఫీలైన హిమజ.. ఇంట్లో ఉన్న ఎగ్స్‌ను పగలగొట్టినట్లు చూపిస్తున్న ప్రోమోపై అందరూ చర్చించుకుంటున్నారు. ఇదేమైనా సీక్రెట్ టాస్కా? లేదా నిజంగానే గొడవ జరిగిందా? అని తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే అది సీక్రెట్ టాస్క్ కావాలని? హిమజ ఫాలోవర్స్ కోరుకుంటున్నారు. లేదా ఈ సంఘటనతో హిమజ ఎలిమినేట్ కావడం గ్యారంటీ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హిమజకు కాస్త నెగెటివిటీ కూడా పెరుగుతోంది. ఎవరితోనూ సరిగా కలవకపోవడం, తన ధోరణిలోనే వెళ్లడం లాంటివి వీక్షకులకు చికాకుపుట్టించేలా ఉన్నాయి. ఈ వారంలో ఎలిమినేషన్ అయ్యేందుకు చాన్స్ఉన్న కంటెస్టెంట్‌గా హిమజ లిస్ట్‌లోకి వచ్చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఉన్నది నిజమైతే.. ఈ వారం కచ్చితంగా హిమజనే ఎలిమినేట్ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గొడవ నిజంగా జరిగిందా? లేదా బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కా? అన్నది తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
బిగ్‌బాస్.. అలీ రెజాపై నాగ్ ఫైర్
బిగ్‌బాస్ ఇచ్చిన ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టాస్క్ రక్తపాతాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌లో అలీ రెజా, హిమజ మధ్య జరిగిన గొడవ కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంలో తలదూర్చిన తమన్నాపై కూడా అలీ రెజా విరుచుకుపడ్డాడు. ఈ టాస్క్ పెట్టిన చిచ్చు అంత తొందరగా చల్లారలేదు. చివరకు హిమజ.. అలీ రెజా కాళ్లు పట్టుకుని ఏడ్చే వరకు వెళ్లింది. తన నుంచి సారీ మాత్రమే ఆశించానని, కాళ్లు పట్టుకోమని అడగలేదని అలీ రెజా వివరించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ గొడవలో హిమజ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కొడతాను అని బెదిరించినట్లు పదేపదే వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇదే వ్యవహారాన్ని వీకెండ్లో నాగ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలీ రెజాపై నాగ్ విరుచుకుపడ్డట్లు ఓ ప్రోమోను విడుదల చేశారు. తనకు డ్రెస్సింగ్ ఉంది కానీ కామన్సెన్స్ లేదంటూ అలీపై ఫైర్ అయ్యాడు. ఇంతవరకు హౌస్మేట్స్ చేసిన తప్పులను నవ్వుతూ సరిచేసేందుకు ప్రయత్నించిన నాగ్.. మొదటిసారిగా ఫైర్ అయినట్లు కనబడుతోంది. మరి ఈ వ్యవహారంలో నాగ్ ఇచ్చిన తీర్పు ఏంటో? రవికృష్ణకు గాయం కావడం, అతన్ని ప్రోత్సహించిన శ్రీముఖి, ఐడియా ఇచ్చిన మహేష్‌ను నాగ్ ఏవిధంగా మందలించాడో చూడాలి. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లే మూడో వ్యక్తి ఎవరో రేపు తెలిసిపోనుంది. అయితే సోషల్ మీడియా ట్రెండింగ్ ప్రకారం తమన్నా సింహాద్రి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. మరి ఇది నిజం అవుతుందో కాదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాలి. -
బిగ్‌బాస్.. శ్రీముఖికి షాక్!
ఇప్పటివరకు చిన్నపాటి గొడవలు, మాటల యుద్ధం వరకే సాగిన ఆట హింసాత్మకంగా మారింది. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లో రవికృష్ణ చేతికి గాయం అయి రక్తం కారింది. దీంతో అంతా శ్రీముఖి వల్లే జరిగింది అంటూ అందరూ తనని విమర్శించారు. ఈ విషయాన్ని బిగ్‌బాస్ కూడా సీరియస్‌గా తీసుకుని శ్రీముఖికి శిక్ష విధించాడు. ఇక అంతకు ముందేమో హిమజ, అలీకి మధ్య గొడవ జరగగా..హిమజ.. అలీ కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో బిగ్‌బాస్ హౌస్ మరింత హీటెక్కింది. కాళ్లపై పడి క్షమాపణ.. కనికరించని అలీ టాస్క్‌లో భాగంగా ఇంట్లో దొంగలకు పట్టపగలే చుక్కలు చూపించారు తికమకపురం గ్రామస్తులు. దొంగలు, పోలీసులు, లాయర్.. ఎవరైనా సరే ఎంతో కొంత ముట్టు చెబితేనే గ్రామస్తులు వారికి కనీస సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో హిమజ కిచెన్‌లో దూరి నీళ్లు కావాలంది. అలీ రెజా వచ్చి.. ముందు డబ్బులు ఇచ్చి తాగు అన్నాడు. అయితే హిమజ అవేవీ వినిపించుకోకుండా వెళ్లి నీళ్లు తాగేసి ఎంచక్కా వెళ్లిపోసాగింది. తను డబ్బులు ఇచ్చేలా లేదు అని భావించిన అలీ డబ్బు తీసుకోడానికి హిమజ ప్యాంటు జేబులో చేయి పెట్టాడు. దీంతో ఇబ్బందికి గురైన హిమజ సోఫాలో పడిపోయి.. అలీ ముఖాన్ని రెండుసార్లు తన్నింది. దీంతో నన్ను తంతావా అంటూ అలీ.. అక్కడ చేయి ఎలా పెడతావంటూ హిమజ చాలాసేపు గొడవ పడ్డారు. ఎంత వాదించిన లాభం లేదనుకున్న హిమజ ‘నన్ను నేను రక్షించే క్రమంలో అలా తన్నానే తప్ప కావాలని కాదు. సారీ..’ అంటూ అలీ కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరింది. అయినప్పటికీ అలీ శాంతించలేదు. ‘నిన్ను కాళ్లు పట్టుకోమని నేను అడిగానా..? ఒక సారీ చెప్తే సరిపోయేది కదా’ అని విసుగుచెందాడు. ‘ఇప్పటికీ నన్ను నువ్వు అర్థం చేసుకోవట్లేదు’ అంటూ హిమజ కన్నీటి పర్యంతం అయింది. ఈ గొడవలో దూరి పెద్దమనిషిలా సర్ది చెప్పాలనుకున్న తమన్నాపై అలీ విరుచుకుపడ్డాడు. మధ్యలోకి రాకు, డబుల్ గేమ్ ఆడొద్దు.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక వారిద్దరూ కాసేపు చర్చించుకుని కూల్ అయిపోగా.. దొంగలు మాత్రం దోచుకోడానికి ఎప్పుడు సందు దొరుకుతుందా అన్నట్టు దొంగ చూపులు చూస్తున్నారు. వస్తువులను కొట్టేసినంత సులువుగా నిధిని సాధించలేకపోతున్నారు. ఇదిలా ఉండగా జైల్లో పడిన శ్రీముఖి పోలీసులతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని బయటికి వచ్చింది. వచ్చీ రాగానే వరుణ్ సందేశ్‌ను మాటలతో బుట్టలో పడేసి చాకచక్యంగా అతడి జేబులో ఉన్న మొత్తం డబ్బుని కొట్టేసి ట్రంకు పెట్టెలో పడేసింది. దీంతో షాక్ అవటం ఇంటిసభ్యుల వంతయింది. ఎలిమినేషన్లో శ్రీముఖి దాచి దాచి దొంగలపాలు అవడం ఇష్టం లేని గ్రామస్తులు నిధి చుట్టూ కాపలా పెంచారు. ఏదిఏమైనా నిధిని సంపాదించాల్సిందే అని నిర్ణయించుకన్న దొంగల ముఠా అందుకు స్కెచ్ వేసుకుంది. ప్లాన్‌లో భాగంగా శ్రీముఖి డంబెల్‌తో నిధి ఉన్న గాజు గ్లాస్‌ను పగలగొట్టి సాహసం చేసింది. అయితే శ్రీముఖిని మిగతా సభ్యులు పక్కకు లాగేయటంతో గ్లాస్ పగలగొట్టి డబ్బులు తీయమంటూ రవికి ఆదేశాలిచ్చింది. వెంటనే రవి ఏదీ ఆలోచించకుండా చేతితో గ్లాసు పగులగొట్టాడు. దీంతో అతని చేయికి దెబ్బ తగిలి రక్తం కారటాన్ని గుర్తించిన బిగ్‌బాస్ డాక్టర్‌ను పంపి రవికి వైద్యం అందించారు. అయితే ఇదంతా శ్రీముఖి వల్లే జరిగిందంటూ రాహుల్, వరుణ్, వితికా మాటల దాడి చేయగా శ్రీముఖి పక్కకు వెళ్లి ఏడ్చింది. గాయంతో బాధపడుతున్న రవికి బిగ్‌బాస్.. టాస్క్‌ల నుంచి తనకు ఉపశమనం తీసుకోవచ్చు అని ఆఫర్ చేసినప్పటికీ అతను సుతిమెత్తంగా తిరస్కరించాడు. ఇంటిలో వస్తువులను కదల్చకూడదన్న నిబంధనను ఇంటిసభ్యులు ఉల్లంఘించినందుకు, ఇంటిలో హింస చోటు చేసుకున్నందుకు టాస్క్‌ను బిగ్‌బాస్ రద్దు చేశారు. హింసకు కారణమైన శ్రీముఖిని తర్వాతి వారం నేరుగా ఎలిమినేషన్స్‌కు పంపిస్తున్నట్లుగా బిగ్‌బాస్ ప్రకటించారు. మరోవైపు అలీ రెజా, పునర్నవిలకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తే తర్వాతి వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవుతారని బిగ్‌బాస్ పేర్కొన్నాడు. ఈ టాస్క్‌లో భాగంగా అలీ రెజా రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో చడీచప్పుడు చేయకుండా సీక్రెట్ గదిలోకి వెళ్లగా, పునర్నవి ఉదయంపూట సీక్రెట్ గదిలోకి ప్రవేశించింది. అలీరెజా ఆ గదిలో ఏం చేయాలో తోచక కాసేపు కెమెరా ముందు కుప్పిగంతులు వేశాడు. ఇక 18వ రోజు అలీ రెజా, పునర్నవి కనిపించకపోవటంతో ఇంటి సభ్యులు కాస్తంత కంగారు పడ్డా తర్వాత లైట్ తీసుకున్నారు. పైగా వారిద్దరూ తిరిగి ఇంట్లోకి రావాలంటే ఇంటిసభ్యులు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ తెలిపాడు. ఇందుకు హిమజ, బాబా భాస్కర్లు వ్యతిరేకించారు. త్యాగాల విషయానికొస్తే.. ఇంటి సభ్యులు వారం రోజులపాటు పాదరక్షలు లేకుండా తిరగాలి. మరో వారం రోజులు పెరుగును తీసుకోకూడదు. మరి ఇందుకు ఇంటి సభ్యులు ఏ విధంగా స్పందిస్తారు.. అలీ, పునర్నవి మళ్లీ ఇంటికి తిరిగొస్తారా అనేది చూడాలి..! -
బిగ్‌బాస్.. నామినేషన్లో ఉన్నది ఎవరంటే?
నామినేషన్స్ ప్రక్రియతో ఇంట్లో అంతా ఒక రకమైన వాతావరణం నెలకొంది. బాబా భాస్కర్ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొనను అని అనడం.. అనంతరం బిగ్‌బాస్ ఆదేశాల మేరకు తప్పనిసరై ఇద్దరి సభ్యులను నామినేట్ చేయడం.. ఇంట్లో సభ్యులెవరైనా నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడితే నామినేట్ అవుతారని తెలపడం.. వరుణ్ సందేశ్-వితికాలు తమన్నా సింహాద్రి గురించి మాట్లాడుకుంటూ ఉంటే బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియ అనుకుని వితికాను ఈ వారం నామినేషన్ ప్రక్రియ నుంచి మినహాయించడం.. తనకంటూ ఓ గ్రూప్‌ను క్రియేట్ చేసుకుందామని ప్రయత్నిస్తున్నట్లు తమన్నా కనపడటం.. సోమవారం ఎపిసోడ్లో హైలెట్‌గా నిలిచాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన తమన్నా ఇంట్లో కొందర్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. వచ్చీ రావడంతోనే తమన్నా.. న్యాయనిర్ణేతగా మారినట్టు అనిపిస్తోంది. మహేష్-వరుణ్ సందేశ్ వ్యవహారం గురించి హౌస్‌లో ముచ్చటించింది. మహేష్ అలా సారీ చెప్పడం తనకు నచ్చలేదని.. ఆ సమయంలో ఇంట్లో ఉండి ఉంటే.. మహేష్‌కు సపోర్ట్ ఇచ్చేదాన్ని, మహేష్‌ను అలా చీప్ మెంటాల్టీ అనడం తనకు నచ్చలేదని బాబా భాస్కర్, జాఫర్, మహేష్, అలీ రెజా, శ్రీముఖిలతో చెప్పుకొచ్చింది. ఇక నామినేషన్ ప్రక్రియలో కూడా తమన్నా వరుణ్-వితికాల పేర్లు చెప్పడం చూస్తే ముందుగానే ఓ ప్లాన్‌తో వచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరూ కలిసి ఒకే గేమ్ ఆడుతున్నారని, వారిద్దరిలో ఒకర్ని ఎలిమినేట్ చేసేందుకే ఇద్దర్నీ నామినేట్ చేస్తున్నానని తెలిపింది. అయితే తనకు, మహేష్‌కు గొడవ పెట్టాలని తమన్నా చూస్తోందని రాహుల్‌తో వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. ఇక హౌస్‌లో రెండో వారానికి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక హిమజ- పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్.. వరుణ్ సందేశ్- జాఫర్, శ్రీముఖి.. అషూ-శ్రీముఖి, రాహుల్.. రాహుల్-హిమజ,శ్రీముఖి.. సావిత్రి- శ్రీముఖి,జాఫర్.. అలీ-హిమజ,వరుణ్ సందేశ్.. రవికృష్ణ-హిమజ, జాఫర్.. జాఫర్-వితికా, మహేష్.. రోహిణి-పునర్నవి, మహేష్.. మహేష్- వితికా, వరుణ్.. శ్రీముఖి-హిమజ, మహేష్.. పునర్నవి-హిమజ, శ్రీముఖి.. తమన్నా-వరుణ్ సందేశ్, వితికాలను నామినేట్ చేశారు. ఇక వీరిలో శ్రీముఖి,హిమజ ఐదు ఓట్లతో.. జాఫర్, మహేష్ విట్టా, వితికా, వరుణ్‌సందేశ్ మూడు ఓట్లతో.. పునర్నవి, రాహుల్ రెండు ఓట్లతో నామినేట్ అయ్యారు. రెండో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఇప్పటివరకు ఎనిమిది మంది నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ తెలిపాడు. ఈ నామినేషన్ ప్రక్రియలో బాబా భాస్కర్ ఎవర్నీ నామినేట్ చేయలేనని.. కావాలంటే తనను నామినేట్ చేసుకోండని బిగ్‌బాస్‌కు తెలిపాడు. అయితే నియమాల ప్రకారం ప్రతీ ఇంటి సభ్యుడు ఓ ఇద్దరి పేర్లను నామినేట్ చేయాల్సిందేనని బిగ్‌బాస్ సూచించాడు. అయినా సరే బాబా భాస్కర్ వినకపోవడంతో ఆలోచించుకోవడానికి కొంత సమయాన్ని ఇచ్చారు. మళ్లీ చివర్లో కన్ఫెషన్ రూమ్‌కు రావాలని కోరాడు. ఇక అందరూ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని తమకు నచ్చని ఇద్దరు కంటెస్టెంట్ల పేర్లను బిగ్‌బాస్‌కు తెలిపారు. అయితే రెండో సారి కూడా బాబా భాస్కర్ ఎవర్నీ కూడా నామినేట్ చేయలేదు. ఈసారి బిగ్‌బాస్ రెండు అవకాశాలు ఇచ్చారు. ఇద్దరు పేర్లు చెప్పి నామినేషన్ ప్రక్రియను ముగించడం.. లేదా.. ఇంటిసభ్యులందరితో చర్చించడం ఇంకొకటి. బాబా భాస్కర్ నామినేషన్స్‌లో ఎవరి పేరు చెప్పనందుకు.. ఇంటి సభ్యులందరూ నామినేషన్స్‌లో ఉండటం ఒక దారి లేదంటే అందరూ కలిసి బాబా భాస్కర్‌ను నామినేట్ చేయడం ఇంకోదారి అని బిగ్‌బాస్ సెలవిచ్చాడు. అయితే బాబా భాస్కర్‌ను తామెవ్వరమూ నామినేట్ చేయలేమని ముక్తకంఠంతో తెలిపారు. కావాలంటే.. అందరం నామినేషన్స్‌లో ఉంటామని ఏకతాటిపైకి వచ్చారు. అలా వద్దని.. కావాలంటే తానే ఓ ఇద్దరిని నామినేట్ చేస్తానని బాబా భాస్కర్ ముందుకు వచ్చాడు. అనంతరం కన్ఫెషన్ రూమ్‌కు వెళ్లిన బాబా భాస్కర్.. వితికా, రాహుల్‌ను నామినేట్ చేశాడు. ఇక అంతటితో నామినేషన్ ప్రక్రియ ముగిసిందని ప్రకటించి.. శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితికా షెరు, పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్‌లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారని తెలిపాడు. ఈ వారం ఇంటి సభ్యులు ఎవరు ఎలా ఆడతారు? వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఈ ఎనిమిది మంది సభ్యుల్లోంచి ఎవరు నిష్క్రమిస్తారో తెలియాలంటే బిగ్‌బాస్ చూస్తూ ఉండాల్సిందే. -
బిగ్‌బాస్.. అందుకే హిమజ సేఫ్!
బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన తరువాత కన్నీరు పెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ హిమజ. సున్నితమైన మనస్తత్వం గల హిమజకు సోషల్‌మీడియాలో ఫుల్ క్రేజ్ నెలకొంది. శ్రీముఖి-హేమ-హిమజ గొడవలో హిమజ కంటతడి పెట్టడం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మానిటర్‌గా ఉన్న హేమ.. శ్రీముఖిని సేవ్ చేసి హిమజను నామినేట్ చేసింది. శ్రీముఖి చెప్పిన కారణాలు సైతం సరైనవి కాకపోయినా.. హిమజను కావాలనే టార్గెట్ చేశారని చాలా మంది నెటిజన్లు భావించారు. హిమజకు ముందు నుంచీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉండటం.. ఇంకా పలువురు సెలబ్రెటీలు హిమజకు మద్దతు పలకడంతో ఎలిమినేషన్ నుంచి ఈజీగా బయటపడింది. ఈసారి పదిహేను మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి వచ్చే ముందే అంతా సెట్ చేసుకుని వచ్చారు. వారికి సంబంధించిన పీఆర్ టీమ్‌లు బయట ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. హౌస్‌లో వారు చేసే యాక్టివిటీస్‌ను సోషల్ మీడియాలో వదులుతూ ఓట్లు వేయాలని కోరుతున్నారు. వీటికి తోడు ఆర్మీల గోల ఎక్కువైంది. ప్రతీ కంటెస్టెంట్‌కు ఓ ఆర్మీ తోడైంది. దీంతో ఎవరి డప్పు వారు కొట్టుకున్నట్లు అవుతోంది. అయితే అందరి కంటే భిన్నంగా హిమజకు మాత్రం.. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, శ్రద్దా దాస్, స్నేహ, శివబాలాజీ సతీమణి మధుమితలాంటి వారు బహిరంగంగా మద్దతు పలికారు. జబర్దస్త్ వేదిక మీద ఆదితో కలిసి హిమజ నవ్వులు పూయించడంతో అతను మద్దతు పలికాడు. ఇటీవలె వచ్చిన వినయవిధేయరామ చిత్రంలో రామ్ చరణ్‌కు వదినగా హిమజ నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన స్నేహంతో నటి స్నేహ హిమజకు మద్దతుగా నిలిచింది. తనకు బిగ్‌బాస్ హౌస్‌లో నచ్చిన కంటెస్టెంట్ హిమజ అని శ్రద్దాదాస్ పేర్కొనడం.. హిమజకు ఓటు వేయాలని మధుమిత కోరడంతో ఓట్ల విషయంలో భారీగా మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన ఐదుగురి కంటే కంటే హిమజకే ఎక్కువ ఓట్లు పోల్ అయినట్లు సమాచారం. తనకు ఏర్పడిన ఈ ఫాలోయింగ్‌ను చివరి వరకు నిలుపుకునేలా హౌస్‌లో హిమజ ఎలాంటి గేమ్ ఆడుతుందో చూడాలి. చదవండి : బిగ్‌బాస్.. హేమ అవుట్! బిగ్‌బాస్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తమన్నా? -
బిగ్‌బాస్‌లో.. హీరోయిన్స్ ఫ్రెండ్
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఐదో కంటెస్టెంట్‌గా హిమజ ఎంట్రీ ఇచ్చారు. అందం, అభినయం ఉన్న హిమజ పలు సీరయల్స్‌లో నటిస్తూ.. సినిమాల్లోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. శివం, నేను శైలజ, ధృవ, శతమానం భవతి, స్పైడర్, మహానుభావుడు, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలతో నటించి మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరుచకున్నారు. సీరియల్స్, సినిమాల్లో వచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్‌బాస్ షోతోనూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. బిగ్‌బాస్‌లో గెలిచేందుకు ఇప్పటికే తన తరుపున సోషల్ మీడియాలో ఓ టీమ్ కూడా నిరంతరం శ్రమిస్తుండగా.. హౌస్‌లో తన ప్రవర్తనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుని, ఇతర కంటెస్టెంట్లకు పోటీ ఇస్తారో లేదో చూడాలి. -
బిగ్‌బాస్.. ఎలిమినేషన్లో ఉన్నది ఎవరంటే?
నామినేషన్లో ప్రక్రియలో మొదటి కంటెస్టెంట్‌గా ఎంటరైన రాహుల్‌కు.. నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు మొదట అవకాశం వచ్చింది. ఫస్ట్‌బెల్ మోగగానే.. శివజ్యోతి(తీన్మార్ సావిత్రి)ని తనకు బదులుగా రీప్లేస్ చేయాలనుకుంటున్నాని రాహుల్ తెలిపాడు. అయితే దానికి గల కారణాలు సరైనవి కావంటూ మళ్లీ రాహుల్‌నే నామినేట్ చేసింది హేమ. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఆ ముగ్గురు చర్చించుకుని నామినేట్ చేశారని, వాళ్లకిచ్చిన టాస్క్‌ను వారు న్యాయంగా చేశారని అందుకోసం శివజ్యోతిని సేవ్ చేసి రాహుల్‌నే మళ్లీ నామినేట్ చేయాల్సిందిగా బిగ్‌బాస్‌ను కోరింది. రెండో బెల్ మెగాక వరుణ్ సందేశ్ వచ్చి.. పునర్నవిని నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఆమె కొంచెం ఒంటరిగా ఉంటుందని, పనుల్లో కూడా సరిగా ఇన్వాల్వ్ కావడం లేదని, ఏదో తన ప్రపంచంలో తాను ఉంటోందని కారణాలను వివరించాడు. తాను అందరితో కలుస్తున్నానని, పనులు కూడా చేస్తున్నాని పునర్నవి వివరంచినా.. హేమ మాత్రం వరుణ్ సందేశ్‌ను సేవ్ చేసి, పునర్నవిని నామినేట్ చేసింది. మూడో బెల్కు వితికా షెరు వచ్చి.. అషూ రెడ్డిని తనకు బదులు రీప్లేస్ చేయాలనుకుంటున్నాని తెలిపింది. తను అందరితో సరిగా కలవడం లేదని, కొంచెం వేరుగా ఉంటుందని కారణాలను వివరించింది. అయితే తాను అంత తొందరగా కలవలేనని, అయినా అన్ని పనులను చేస్తున్నానని అందరితో కలవడానికి కాస్త సమయం పడుతుందని, తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలని అనుకుంటున్నానని అషూ వివరించింది. అయితే అషూ రెడ్డి ఇచ్చిన వివరణ సరిగా ఉందని ఆమెను సేవ్ చేసి వితికా షెరునే నామినేట్చేసింది హేమ. కన్నీరు పెట్టిన హిమజ నాల్గో బెల్ మోగాక వచ్చిన శ్రీముఖి.. తనకు బదులుగా హిమజను రీప్లేస్ చేయాలనుకుంటున్నానని తెలిపారు. తనకు ఒక రెడ్ మార్క్ ఉందని, మానిటర్(హేమ) వేసిన ఆ రెడ్ మార్క్ వల్లే తనను రీప్లేస్ చేయాలనుకుంటున్నానని తెలిపింది. ఉదయాన్నే తాను పని హేమకు చెప్పిందని, తనతో కలసి సినిమాను కూడా చేశానని, తన గురించి తెలుసని హిమజ తన లైఫ్‌లో అన్నీ లైట్‌గా తీసుకుంటుందని శ్రీముఖి వివరించింది. తన గురించి శ్రీముఖికి ఏం తెలుసని అన్నీ లైట్‌గా తీసుకుంటానని చెప్పిందంటూ కన్నీరు పెట్టుకుంది. శ్రీముఖికి తాను కెరీర్పరంగానే తెలుసని, వ్యక్తిగతంగా తన గురించి ఆమెకు ఏం తెలుసని ప్రశ్నించింది. తానేదీ లైట్‌గా తీసుకోనని.. అందుకే తనపై ఉన్న రెడ్ మార్క్‌ను తొలగించుకునేందుకు ఉదయాన్నే లేచి పని చేశానని, ఆ సమయానికి ఎవరూ నిద్రలేవలేదని.. ఆ విషయం వేరే ఎవరూ చెప్పలేరని, అందుకే తానే హేమతో చెప్పానని, ఆ విషయంలో తప్పేముందంటూ ప్రశ్నించింది. ఇక ఈ వ్యవహారంలో హేమ తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. హిమజను నామినేట్ చేసి శ్రీముఖిని సేవ్ చేసింది. చివరగా జాఫర్.. తనకు బదులుగా మహేష్ విట్టాను రీప్లేస్ చేయాలనుకుంటున్నానని, ఆయన కంటే తాను బెటర్ పర్ఫామెన్స్ ఇస్తాననే కారణాన్ని తెలిపాడు. తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటే ఫిజికట్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటానని, అందరితో బాగుంటానని ఇలా తన కారణాలను మహేష్ వివరించుకున్నాడు. అయితే ఈ విషయంలో జాఫర్‌ను నామినేట్ చేస్తూ.. మహేష్‌ను సేవ్ చేసింది హేమ. ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉండగా.. ఐదుసార్లు మాత్రమే బెల్ మోగుతుందని బిగబాస్ తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో బాబా భాస్కర్‌కు అవకాశం రాక మిగిలిపోయాడు. అయితే బిగ్‌బాస్ అతనికి కూడా ఓ అవకాశాన్ని ఇచ్చాడు. మానిటర్(హేమ)- బాబా భాస్కర్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని సేవ్‌చేసి, మరొకరిని నామినేట్ చేయాలని ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఆదేశించాడు. అయితే అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒకరి పేరును తెలపాలని సూచించాడు. అయితే వారంతా కలసి ఓ నిర్ణయానికి వచ్చి.. బాబా భాస్కర్‌ను సేవ్ చేసి, హేమను నామినేట్ చేశారు. సో.. మొత్తంగా ఈ వారం రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమ నామినేట్ కాగా.. వీరందరిలో ఎవరోకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారు. -
బిగ్‌బాస్.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్!
అడుగుపెట్టిన మొదటిరోజే నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టిన బిగ్‌బాస్.. కంటెస్టెంట్స్ మధ్య చిచ్చును పెట్టాడు. మొదటగా ఇంట్లోకి ప్రవేశించిన శివజ్యోతి, రవికృష్ణ, అషూ రెడ్డిలు మిగతా ఇంటి సభ్యులను ఎంట్రీలోనే ప్రశ్నలు అడగటం, దాంట్లోంచి సరైన సమాధానాలు చెప్పని ఆరుగురు సభ్యుల పేర్లను చెప్పమని బిగ్‌బాస్ ఆదేశించడం, దాంతో రాహుల్, వరుణ్ సందేశ్, వితికా షెరు, శ్రీముఖి, బాబా భాస్కర్, జాఫర్లు ఈ వారం నామినేట్ అవ్వడం తెలిసిందే. వారంతా నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చిన బిగ్‌బాస్ అందుకు ఓ మెలిక పెట్టాడు. తనకు బదులుగా ఇంకో ఇంటిసభ్యుడిని నామినేట్ చేయాల్సిందిగా సూచించాడు. సరైన కారణాలను వివరిస్తూ సదరు ఇంటి సభ్యుడిని నామినేట్ చేయాలని, అటువైపు ఉన్న కంటెస్టెంట్ నామినేషన్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి కూడా అవకాశమిచ్చాడు. అయితే ఈ వ్యవహారంలో ఆరుగురు సభ్యులు చర్చించుకుని హేమను న్యాయనిర్ణేతగా(మానిటర్) ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్లో హేమకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కాసేపటి క్రితం విడుదల చేసిన ప్రోమోనే తెలియజేస్తోంది. ఆ ఆరుగురు కంటెస్టెంట్లలో.. బెల్ మోగిన ప్రతీసారి మిగతా ఇంటి సభ్యుల్లోంచి ఒకరిని తమకు బదులుగా నామినేట్ చేయవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఎవరి వాదనను వారు వినిపించవచ్చు. కానీ చివరకు హేమదే తుది నిర్ణయమని తెలిసిందే. ఈ వ్యవహారంలోనే హేమ-హిమజల మధ్య వార్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఎవరి పనులను వారు చేయాలని, హౌస్‌లో రూల్స్‌ను పాటించడం లేదని హేమ ఇంటి సభ్యులతో అనడం, వంటగదిలో తనకు పనేంటని? హిమజపై ఫైర్ అయింది. తనపై నిందలు వేస్తే ఊరుకోనని హిమజ కూడా ఘాటుగానే స్పందించింది. మరి వీరి గొడవ ఎక్కడి వరకు వెళ్లింది. చివరకు నామినేట్ అయిన ఆరుగురిలో వేరే ఇంటి సభ్యులు ఎవరైనా రీప్లేస్ అయ్యారా? లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే. -
బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్స్ వీరే..!
సాక్షి, హైదరాబాద్ : కింగ్ నాగార్జున హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఛానల్లో ప్రసారం కానున్న రియాలిటీ షో బిగ్‌బాస్-3 కంటెస్టెంట్ లిస్టు ఖరారైనట్లు సమాచారం. వంద రోజుల పాటు సాగనున్న ఈ షోలో హౌజ్‌లో ఉండబోతున్న సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. బిగ్‌బాస్ సీజన్ 3లో న్యూస్ యాంకర్ తీన్మార్ సావిత్రి, జర్నలిస్టు జాఫర్, యాంకర్ శ్రీముఖి, నటీమణులు హేమ, హిమజ, ఉయ్యాల జంపాల ఫేం పునర్ణవి భూపాలం, వరుణ్ సందేశ్, అతడి భార్య వితికా షేరు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, భరణి, దుర్గ, అషూరెడ్డి(డబ్స్మాష్ స్టార్), రఘు మాస్టర్, ఫన్ బకెట్ మహేష్ విట్టా, తమన్నా సింహాద్రిలు పాల్గొననున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే కంటెస్టెంట్ల విషయంలో స్పష్టత రానుంది. కాగా ఆదివారం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షో ఆది నుంచి వివాదాస్పదం అవుతోంది. షో నిర్వాహకులు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించి.. లైంగికంగా వేధించారని జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు విద్యార్థి సంఘాలు షోను నిలిపి వేయలంటూ ధర్నా చేస్తుండగా.. బిగ్‌బాస్ ప్రసారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం విదితమే.