Bigg Boss Himaja Latest Instagram Reel On Arabic Kuthu Song Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss Himaja: కల్లు తాగుతూ హిమజ ఎంజాయ్‌.. వీడియో వైరల్‌

Published Wed, Mar 16 2022 1:27 PM | Last Updated on Wed, Mar 16 2022 3:04 PM

Bigg Boss Fame Himaja Latest Instagram Reel Goes Viral - Sakshi

బిగ్‌బాస్‌ ఫేం, నటి హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మోడలింగ్‌తో కెరీర్‌ ప్రారంభించిన హిమజ ఆ సీరియల్స్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత బుల్లితెరకు గుడ్‌బై చెప్పి వెండితెరపై అవకాశాలు దక్కించుకుంది. సినిమాల్లో హీరోయిన్స్‌ పక్కన ఫ్రెండ్‌ పాత్రల్లో కనిపించిన నటి హిమజకు బిగ్‌బాస్‌ తర్వాత మరింత పాపులర్‌ అయ్యింది.  

షోలో ఉన్నప్పుడు కొంత నెగెటివిటీ మూటగట్టుకున్నప్పటికీ బయటకు వచ్చాక మాత్రం టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హిమజ తనకు సంబంధించిన విషయాల్ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా కల్లు తాగుతూ ఎంజాయ్‌ చేసింది. దీనికి ఫేమస్‌ అరబిక్‌ కుతు సాంగ్‌ని జతచేసి రీల్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement