
అభిమాన హీరోతో ఒక్క సెల్ఫీ దిగాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ చాలామందికి అది కలగానే మిగిలిపోతుంది. ఒకవేళ నిజంగానే అభిమాన హీరో మన కళ్ల ముందు ప్రత్యక్షమైతే, అతడితో సెల్ఫీ దిగే చాన్స్ వస్తే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. బిగ్‌బాస్ బ్యూటీ హిమజ కూడా ఇప్పుడదే ఆనందంలో మునిగి తేలుతోంది. తను ఎంతగానో ఆరాధించే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను నేరుగా కలిసింది. అంతేనా, అతడితో కలిసి సెల్ఫీ కూడా దిగింది.
ఈ ఫొటోను బుధవారం నాడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "ఓ మై గాడ్.. నేడు నా కల నెరవేరింది. తొలి ప్రేమ సినిమాలో పవన్ కల్యాణ్ గారిని చూసినప్పుడు ఆయన్ను కనీసం డైరెక్ట్‌గా చూస్తానా అనుకున్నా. కానీ ఇప్పుడు ఏకంగా ఆయన 27వ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఇంత మంచి చాన్స్ ఇచ్చిన దర్శకుడు క్రిష్‌కు కృతజ‍్క్షతలు" అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఏదేమైనా హిమజ పవర్ స్టార్‌ను కలవడమే కాక ఆయనతో కలిసి నటిస్తున్నందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా పవన్-క్రిష్‌ల సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజ్ చేయనున్నామని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే హిమజ అటు బుల్లితెరలో ప్రసారమయ్యే షోలలో స్పెషల్ గెస్ట్‌గా కనిపిస్తూనే మరోవైపు సినిమాలు చేస్తూ వెండితెర మీద బిజీగా ఉంది. బిగ్‌బాస్ తర్వాత మరింత ప్రజాదరణను చూరగొన్న ఆమె ప్రస్తుతం పవన్ కల్యాణ్ 27వ సినిమాతో పాటు నాగశౌర్య 'వరుడు కావలెను', సునీల్ 'కనబడుట లేదు' సినిమాల్లో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment