సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బిగ్‌బాస్ బ్యూటీ హిమజ సినిమా ఛాన్సుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుమారు పదేళ్ల క్రితం సీరియల్లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హిమజ 2013లో రామ్ నటించిన శివమ్ సినిమాలో ఛాన్సు దక్కించుకుంది. ఆ తర్వాత నేను శైలజ, శతమానంభవతి, వరుడు కావలెనుతో పాటు తెలుగులో పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది హిమజ. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కొంచెం ఇష్టం కొంచెం కష్టం తో పాటు మరికొన్ని సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. బిగ్ బాస్ 3 సీజన్‌లో కంటెస్టెంట్‌గా మెప్పించిన హిమజ తెలుగు పరిశ్రమలో మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు వస్తున్నప్పటికీ సెలెక్టెడ్ ప్రాజెక్ట్‌లు చేస్తూ కొనసాగుతుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమజకు ఓ ప్రశ్న ఎదురైంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు చాలా తక్కువ వస్తున్నాయి.. దానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురైంది. అందుకు హిమజ ఇలా చెప్పుకొచ్చారు. 'తెలుగు అమ్మాయిలు ఒకప్పుడు రిజర్వ్‌డ్‌గా ఉండేవారు. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ ఇస్తేనే ఛాన్సులు వస్తాయి అనుకోవడం తప్పు.. విషయం ఏమిటంటే కమిట్‌మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ కూడా ఆఫర్స్ రావడం లేదు. అలా అని అవకాశాలు అందుకున్న వారందరూ కమిట్‌మెంట్ ఇచ్చినవాళ్లు కాదు.
ముంబై నుంచి వచ్చిన వాళ్లకు మాత్రం ఇక్కడ ఆఫర్స్ ఇస్తారు.. వారిలో ఏం నచ్చిందో తెలియదు. ఒక్కోసారి తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్ అయితేనే చేస్తాను అనే వారు కూడా ఉన్నారు. అది చాలా తప్పు. ఫస్ట్ అవకాశం వస్తే తీసుకొని సద్వినియోగం చేసుకుంటే ఏదోరోజు మంచి భవిష్యత్ ఉంటుంది. నా వరకు అయితే హీరోయిన్ మాత్రమే కావాలని రాలేదు. నాకు ఏ అవకాశం వచ్చినా చేస్తాను. నాకు మొదట పనిమనిషి పాత్ర వచ్చింది చేశాను. ఆ తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం నేను హ్యాపీగానే ఉన్నాను.
తెలుగు అమ్మాయి అయిన హిమజ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆమెను చూసిన వారు ఎవరైనా సరే హీరోయిన్ మెటీరియల్ అనాల్సిందే. కానీ ఆమెకు ఛాన్సులు అయితే దక్కాయి కానీ హీరోయిన్‌ను చేయలేకపోయాయి. ఈ క్రమంలో నేను శైలజ, జనతా గ్యారేజ్, వరుడు కావలెను, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌తో మెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment