Bigg Boss Himaja Buys Expensive BMW Car On Occasion Of Diwali, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Himaja: దీపావళికి కొత్త కారు తెచ్చేసుకున్న హిమజ, కలా? నిజమా?

Published Sun, Oct 23 2022 5:28 PM | Last Updated on Sun, Oct 23 2022 7:03 PM

Bigg Boss Beauty Himaja Shares Post That Diwali Gift To Myself - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ హిమజ కొత్త కారు కొందా? అంటే అవుననే అంటున్నారు కొందరు అభిమానులు. మిగతా వారు మాత్రం అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే.. అని పాట పాడుకుంటున్నారు. అదేంటి? అంత కన్ఫ్యూజన్‌ ఎందుకంటారా? మరేం లేదు.. ఈ బ్యూటీ ఈరోజు కొత్త కారు కొన్నానోచ్‌ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది. అయితే వీడియో చివర్లో ఓ ట్విస్ట్‌ ఇచ్చింది.

ఇంతకీ వీడియోలో ఏముందుంటే.. తన కొత్త బీఎమ్‌డబ్ల్యూ కారును చూపిస్తూ అందులో ఎక్కి కూర్చున్న హిమజ కాసేపటికే నిద్రలో నుంచి తేరుకున్నట్లు ఉంది. అంటే కేవలం ఇది కల మాత్రమే అన్నట్లుగా ఉంది. కానీ క్యాప్షన్‌లో మాత్రం ఈ దీపావళికి నాకు నేనే గిఫ్ట్‌ ఇచ్చుకున్నాను. నా కల నెరవేరింది అని రాసుకొచ్చింది. ఇంతకీ ఇది కలా? నిజమా? అని కొందరు తల గోక్కుంటుంటే మరికొందరు మాత్రం కంగ్రాట్స్‌ చెప్తున్నారు. కాగా బిగ్‌బాస్‌ షోతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన హిమజ నటిగా రాణిస్తూనే పలు బ్రాండ్లకు ప్రమోషన్లు చేస్తోంది.

చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement