Himaja's dream came true, the actress landed in a new house - Sakshi
Sakshi News home page

Himaja: డ్రీమ్‌ హౌస్‌ పూర్తి.. నాలుగంతస్తుల ఇంట్లోకి అడుగుపెట్టిన హిమజ

Published Sun, Jun 11 2023 3:24 PM | Last Updated on Sun, Jun 11 2023 3:49 PM

Bigg Boss Himaja Enters into Her Dream House - Sakshi

సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తను ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇంటి నిర్మాణం పూర్తవడంతో మంచి ముహూర్తం పెట్టుకుని గృహప్రవేశం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఇంట్లో కుడికాలు పెట్టి లోనికి వస్తున్న ఫోటోను షేర్‌ చేసింది. ఇందులో లంగా ఓణీ ధరించిన హిమజ చేతిలో లక్ష్మీదేవి ఫోటో ఉంది. 'నా కల నెరవేరింది. ఈ కొత్తిల్లు మరెన్నో జ్ఞాపకాలకు భాండాగారంగా నిలిచిపోనుంది. ఈ మైలురాయిని చేరుకున్నందుకు నాకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ జర్నీలో నాతో పాటు ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లవ్‌ యూ ఆల్‌' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది.

డ్రీమ్‌ హౌస్‌ స్పెషాలిటీ ఏంటంటే
ఈ డ్రీమ్‌ హౌస్‌ స్పెషాలిటీ విషయానికి వస్తే.. ఇది నాలుగంతస్తుల భవనం. ఇందులో మోడ్రన్‌ లిఫ్ట్‌ కూడా ఉంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పేరెంట్స్‌ కోసం బెడ్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. ఫస్ట్‌ ఫ్లోర్‌ మొత్తం హిమజదే కాగా ఇందులో ప్రత్యేకంగా మేకప్‌ రూమ్‌ కూడా నిర్మించింది. మూడో ఫ్లోర్‌లో జిమ్‌, నాలుగో అంతస్తులో థియేటర్‌ కట్టించింది. ఈ నాలుగంతస్తులు కట్టడానికి, ఇంటీరియర్‌ డిజైన్‌కు దాదాపు ఏడాదిన్నర సమయం పట్టింది.

అలా మొదలైంది
తెనాలి సమీపంలోని వీర్లపాలెం హిమజ స్వస్థలం. తెనాలిలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్లి ప్రైవేట్‌ సోషల్‌ టీచరుగా పిల్లలకు పాఠాలు చెప్తూనే మోడలింగ్‌ వైపు అడుగులు వేసింది. ఫ్యాషన్‌, బ్యూటీ ఈవెంట్స్‌లో పాల్గొంటూ మోడల్‌, టీవీ యాంకర్‌గా రాణించింది. సీరియల్స్‌తో పాపులర్‌ అయిన ఆమె ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్‌ 3 రియాలిటీ షోలోనూ మెరిసింది.

చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement