Bigg Boss Fame Himaja About Her Difficulties - Sakshi
Sakshi News home page

Himaja: ముగ్గురు పిల్లలను చదివించాల్సిన బాధ్యత నాపై ఉంది..

Published Sat, Mar 18 2023 10:59 AM | Last Updated on Sat, Mar 18 2023 11:34 AM

Bigg Boss Fame Himaja About Her Difficulties - Sakshi

అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సందడి చేసే సెలబ్రిటీలలో హిమజ ఒకరు. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆమె సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుందీ నటి. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది.

'నేను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా కళ్లు బాలేదు, నడక కూడా బాగోలేదన్నారు. డిప్రెషన్‌కు లోనయ్యాను. బాధపడ్డాను, ఘోరంగా ఏడ్చాను. డైరెక్టర్స్‌ కూడా.. నీ కళ్లు చిన్నగా ఉన్నాయి. క్యారెక్టర్‌కు సూటవుతావో లేదో అని ముఖం మీదే అనేవాళ్లు. కానీ మేకప్‌ వేశాక కళ్లే హైలైట్‌ అయ్యేవి. నా కళ్లు చాలా బాగుంటాయన్న ప్రశంసలూ లభించాయి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతిసారి సొసైటీ గురించి ఆలోచించకుండా మనకు ఏది కరెక్ట్‌ అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకెళ్లిపోవాలంతే! మా డ్రైవర్‌కు ముగ్గురమ్మాయిలు. వారిని చదివించాల్సిన బాధ్యత నాపై ఉంది. ముందు వారికి వీలైనంత సాయం చేసి తర్వాత మిగతావాళ్లకోసం ఆలోచిస్తాను' అని చెప్పింది హిమజ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement