బిగ్‌బాస్ తెలుగు సీజన్-3లో భాగంగా పదకొండో వారం పునర్నవి భూపాలం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అందరూ ఊహించినట్టే పునర్నవికి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్ బాస్ హౌజ్ వీడాల్సి వచ్చింది. ఇక పునర్నవి ఎలిమినేట్ కావడంతో రాహుల్ సిప్లిగంజ్ వెక్కివెక్కి ఏడ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ఎంత సన్నిహిత్యం ఉందో మరోసారి బయటపడింది. కాగా, పునర్నవి ఎలిమినేట్ కావడంతో హిమజ తెగ ఆనంద పడుతోంది. పునర్నవి కంటే రెండు వారాల ముందే ఎలిమినేట్ అయినప్పటికీ.. తాజాగా పునర్నవి ఎలిమినేట్ కావడంతో ఎగిరిగంతేసింది. పునర్నవి ఎలిమినేట్ అయిందని నాగార్జున ప్రకటించడంతోనే హిమజ టీవీ ముందుకు వచ్చి స్టెప్పులేసింది.