బిగ్‌బాస్ హౌస్‌లో లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న పునర్నవి గత వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే! అయితే బయటకు వచ్చీరాగానే తన టీమ్ పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్, వితిక, రాహుల్) ఫ్యాన్స్ అందరూ వరుణ్, రాహుల్‌కు ఓట్లు వేయాలని ప్రచారం చేపట్టింది. రాహుల్, నేను క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ నొక్కి చెప్పింది. ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా మేం మంచి మిత్రులమే అని స్పష్టం చేసింది. రాహుల్ టాప్ 5లో ఉండాలి అని తన కోరికను బయటపెట్టింది. అందరూ అనుకుంటున్నట్టుగా బిగ్‌బాస్ స్క్రిప్టెడ్ కాదని వెల్లడించింది. ఇక్కడివి అక్కడ.. అక్కడివి ఇక్కడ చెప్తూ.. మనుషులు ఇలా కూడా ఉంటారా? అనేలా ప్రవర్తిస్తున్నాడంటూ పరోక్షంగా మహేశ్‌కు పంచ్ విసిరింది.
కాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు మానసికంగా ధృడంగా ఉండి వంద రోజులు నెట్టుకొస్తారో వారే విజేత అని ప్రకటించింది. పీవీవీఆర్ బ్యాచ్ గురించి పునర్నవి మాట్లాడుతూ ‘రాహుల్ వాళ్ల మమ్మీపై బెంగ పెట్టుకున్నాడు. రాహుల్‌ను రియల్ గేమర్ అని బాగా ఆటపట్టించేదాన్ని. ఓవర్ థింక్ చేస్తాడు.. పాపం వాడు మళ్లీ నామినేషన్‌లో ఉన్నాడు. వితిక.. బంగారం, చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంది. కానీ టాస్క్‌లో మాత్రం గట్టి పోటీనిస్తుంది. వరుణ్ నాకు మరో బ్రదర్. వాళ్లందరినీ చాలా మిస్ అవుతున్నా’ అని తెగ బాధపడిపోయింది. ఇక బిగ్‌బాస్‌ను వీడి నాలుగు రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఎవరో తనను గమనిస్తున్నారన్న ఆలోచన ఇంకా పోవట్లేదంది. ఎలిమినేట్ అయిన సభ్యులను తప్పకుండా కలుస్తానంది.