గత సీజన్లలో వచ్చిన నామినేషన్ టాస్క్‌నే ఈ సీజన్‌లోనూ బిగ్‌బాస్ మక్కీకి మక్కీ దించాడు. ఇక ఇంటిసభ్యులందరూ ఎలిమినేషన్ నుంచి గట్టెక్కడానికి అరక్షణమైనా ఆలోచించకుండా ఒకరికోసం ఒకరు త్యాగాలకు సిద్ధపడిపోతున్నారు. ఒక్కరోజులో పూర్తయ్యే నామినేషన్ ప్రక్రియ ఈసారి పొడిగించి రెండోరోజుకు చేరుకుంది. రోజులు దగ్గరపడుతున్న కొద్దీ ఆటలో ఎవరికి వారే స్వతంత్రంగా పోటీచేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ చూస్తే కావాలనే అందరినీ ఎమోషనల్‌గా మరింత దగ్గర చేసి విడదీయనున్నాడా అనే సందేహం రాకమానదు. కాగా హిమజ త్యాగం చేయటంలో చిన్న చిన్న తప్పిదాలు చేయడం వల్ల మహేశ్ నామినేట్ అయ్యాడు. ఇక నామినేషన్ రౌండ్‌లో వితిక, రవి, రాహుల్ మాత్రమే మిగిలారు. వీరిచేత ఎలాంటి త్యాగాలకు ఒప్పించనున్నాడో అని అందరూ ఆస్తిగా ఎదురుచూస్తున్నారు.
పునర్నవి-రాహుల్‌కు బిగ్‌బాస్ ట్విస్ట్
Published Tue, Sep 17 2019 11:23 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement