Rahul Sipligunj
-
హైదరాబాద్ : ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో అదరహో (ఫొటోలు)
-
రజనీకాంత్ ఫోటో షేర్ చేసి పెద్ద తప్పు చేశా: రాహుల్ సిప్లిగంజ్
‘నాటు నాటు’సాంగ్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఆ ఒక్క పాటతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గుణం రాహుల్‌లో ఉంది. ఆస్కార్ అవార్డు సాధించినా.. ఆ గర్వాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో చేసిన పెద్ద తప్పు గురించి చెప్పాడు. నాకు రజకాంత్ అంటే చాలా ఇష్టం. రంగమార్తాండ సినిమా షూటింగ్ సమయంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ గార్లతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ మూవీ షూట్లో ఉన్నప్పుడు.. నేను రజనీ ఫ్యాన్ అని ప్రకాశ్ రాజ్‌కు చెప్పాను. దీంతో ఓ సారి ప్రకాశ్ రాజ్ నన్ను పిలిచి రజనికాంత్ మూవీ షూటింగ్‌కి వెళ్తున్నా రమ్మని చెప్పారు. నేను వెంటనే వెళ్లిపోయాను. అప్పుడు అన్నాత్తే షూటింగ్ జరుగుతోంది. విరామం సమయంలో రజనీకాంత్ సర్కి నన్ను పరిచయం చేశారు. అయితే అప్పుడు ఆయన ఆ మూవీ కాస్ట్యూమ్స్‌లో ఉన్నారు. అయినా కూడా నాకు ఫోటో దిగే అవకాశం ఇచ్చారు. అప్పటికీ ఆ సినిమాకు సంబంధించి తన లుక్ ఇంకా విడుదల కాలేదు. ఈ విషయం నాకు చెప్పి సినిమా రిలీజ్ వరకు ఆ ఫొటో షేర్ చేయొద్దని చెప్పారు. ఓ పది రోజుల తర్వాత ఆనందం తట్టుకోలేక ఒకరోజు దాన్ని సోషల్ మీడియాలో పెట్టేశా. అది వైరల్‌గా మారింది. హీరో లుక్ బయటకు రావడం వల్ల నిర్మాణ సంస్థ కంగారు పడింది. నాకు తెలిసి జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. ఒక అభిమానిగా ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ తర్వాత దానిని డిలీట్ కూడా చేసేశాను. -
ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలివే!
ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికో బిగ్‌బాస్ షోకు వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు! అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ అంతో ఇంతో డబ్బు వెనకేసుకుంటారేమో కానీ మంచి పేరు రావడం కష్టం. ఇక్కడ అడుగుపెట్టినవాళ్లలో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వెళ్లినవాళ్లే ఎక్కువ. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని విజేతలుగా నిలిచి ప్రేక్షకుల మనసులు గెలిచారు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్లలో గెలిచినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేద్దాం..బిగ్‌బాస్ 1బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్లో సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లనే ఎక్కువగా తీసుకొచ్చారు. నవదీప్, హరితేజ, ఆదర్శ్ అందరినీ వెనక్కు నెట్టి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో తన కెరీర్ ఏమైనా మారిందా? అంటే లేదనే చెప్పాలి. 2017లో బిగ్‌బాస్ 1 సీజన్ జరగ్గా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2022లో మళ్లీ బిగ్స్క్రీన్పై కనిపించాడు. ఒకప్పటి అంత స్పీడుగా సినిమాలు చేయకపోయినా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నాడు.బిగ్‌బాస్ 2బిగ్‌బాస్ రెండో సీజన్లో కౌశల్ మండా విజయం సాధించాడు. ఇతడి కోసం జనాలు ర్యాలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకునే అతడు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్, షోలలోనే కనిపిస్తున్నాడు తప్ప సినిమాల ఊసే లేదు.బిగ్‌బాస్ 3శ్రీముఖిని వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇతడికి ఉన్న టాలెంట్‌తో పెద్ద సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్సులు అందుకున్నాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు..'ను కాలభైరవతో కలిసి ఆలపించాడు. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక స్టార్ స్టేటస్ అందుకున్న ఏకైక విన్నర్ బహుశా ఇతడే కావచ్చు.బిగ్‌బాస్ 4కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం అని నిరూపించాడు అభిజిత్. ఎక్కువగా టాస్కులు గెలవకపోయినా మైండ్ గేమ్ ఆడి, తన ప్రవర్తనతో టైటిల్ గెలిచేశాడు. బిగ్‌బాస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్‌లో తళుక్కున మెరిశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉన్నట్లున్నాడు.బిగ్‌బాస్ 5బిగ్‌బాస్ ఐదో సీజన్లో వీజే సన్నీ విన్నర్‌గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్‌లోనే కనిపించిన అతడిని వెండితెరకు పరిచయం చేయడానికి ఈ షో మంచి ప్లాట్‌ఫామ్ అని భావించాడు. బిగ్‌బాస్ విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు. కానీ మంచి హిట్టు అందుకోలేకపోయాడు.'బిగ్‌బాస్ 6ఈ సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ మంచి టాలెంటెడ్. అప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. ఈ షో తర్వాత కూడా తన జీవితం అలాగే కొనసాగిందే తప్ప ఊహించని మలుపులు అయితే ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే కాస్త ఆఫర్లు తగ్గాయి.బిగ్‌బాస్ 7రైతుబిడ్డ.. ఈ ఒకే ఒక్క పదం అతడిని బిగ్‌బాస్ విన్నర్‌ను చేసింది. గెలిస్తే రైతులకు సాయం చేస్తానంటూ ఆర్భాటాలు పోయిన ఇతడు ఆ తర్వాత ఒకరిద్దరికి సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ బిగ్‌బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజూ పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు.బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ)హీరోయిన్ బిందుమాధవి.. లేడీ ఫైటర్‌గా పోరాడి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ తెలుగమ్మాయికి బిగ్‌బాస్ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్‌లలో కనిపించింది. అయితే ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది తప్ప టాలీవుడ్లో మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలు ఇలా ఉన్నాయి. మరి ఈసారి ఇంట్లో అడుగుపెట్టిన పద్నాలుగో మందిలో ఎవరు గెలుస్తారో? తర్వాత వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి! -
ఫుడ్ డెలివరీ బాయ్ టాలెంట్‌కు మెచ్చి సాయం చేసిన రాహుల్ సిప్లిగంజ్
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" స్టార్ మాలో మళ్ళీ ప్రారంభం ప్రారంభమైంది. టాలెంట్ ఉంటే చాలు ఎవరైనా అనుకున్న స్థానానికి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు.. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్‌లతో వడపోసిన స్వరాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి కూడా వచ్చి ఈ పోటీలలో పాల్గొన్నారు. సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్లో వెంకటేష్ అనే ఓ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ను మెప్పించాడు. కృష్ణార్జున యుద్దం సినిమాలోని 'దారి చూడు మామ దుమ్ము చూడు మామ' అనే పాటతో అక్కడ జడ్జీలను మెప్పించాడు. ఆ పాట పాడిన వెంకటేష్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లు స్టేజీ మీద తన కష్టాలను చెప్పుకున్నాడు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆ యువకుడి కష్టాన్ని మెచ్చుకున్నాడు. గతంలో తాను కూడా ఒక బార్బర్ షాప్‌లో పని చేస్తూనే పాటలు పాడటం నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు.కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటిని తట్టుకుని ఇలా ముందుకు రావడం అంత సులభం కాదని రాహుల్ చెప్పాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ సంగీతం కోసం కష్టపడుతున్న వెంకటేష్‌కు లక్ష రూపాయలు సాయం చేశాడు రాహుల్.వాస్తవంగా ఆ యువకుడిలో కూడ మంచి టాలెంట్ ఉంది.అతను పాడిన పాట కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా 'రామ్' చిత్రం నుంచి పాట విడుదల
యదార్థ ఘటనల ఆధారంగా రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం రాబోతోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం సిద్దంగా ఉంది. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కాబోతున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్గా రాహుల్ సిప్లిగంజ్ పాడిన దేశ భక్తి గీతం అందరిలోనూ ఉత్తేజాన్ని నింపింది. ఇక ఇప్పుడు కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న పాటను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ పాటను రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 'మనతోని కాదురా భై' అంటూ సాగే ఈ పాటకు.. రాము కుమార్ ఏఎస్కే సాహిత్యం, ధనుంజయ్ గాత్రం, ఆశ్రిత్ అయ్యంగార్ బాణీ ఇలా అన్నీ కలిసి వినసొంపుగా మార్చాయి. కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతోన్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. -
సూపర్ సింగర్.. ఆరోజే ప్రారంభం!
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" ఇప్పుడు స్టార్ మాలో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోంది. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్‌లతో సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి వచ్చి పాటల మీద, సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో కంటెస్టెంట్స్ పాల్గొనేందుకు రావడం ఈ షో ప్రత్యేకత. ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా నలుగురు ప్రతిభావంతులు న్యాయమూర్తులుగా కంటెస్టెంట్స్‌ని తీర్చిదిద్దడంతో పాటు పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. ఇంతకీ ఆ నలుగురు మరెవరో కాదు.. గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్. వీరే ఈ సారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. 20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కాబోతున్న ఈ షోలో 16 మందితో అసలైన పోటీ మొదలవుతుంది. ఈ నెల 23 నుంచి.. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు "సూపర్ సింగర్" సంగీతాభిమానుల్నే కాదు.. ప్రతి “స్టార్ మా” ప్రేక్షకుల్ని అలరించనుంది. షో నిర్వహణలో ఈ సారి స్టార్ మా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కంటెస్టెంట్స్, వాళ్ళని తీర్చిదిద్దే జడ్జెస్, మార్కులు.. ఇవి మాత్రమే కాకుండా షో ని ఇంకా ఆసక్తిగా మలచబోతున్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే 'స్టార్ మా'లో సూపర్ సింగర్ చూడాల్సిందే. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత!: రైతుబిడ్డ -
'మెమొరీస్' సాంగ్.. హీరో సుధాకర్.. మరి హీరోయిన్?
నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ నటుడు సుధాకర్ కోమాకుల 'మెమొరీస్' అనే బహుభాషా మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పాటను సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్‌తో కలిపి చిత్రీకరించారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నివ్రితి వైబ్స్ వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ సొంతం చేసుకోవడం విశేషం. 'మెమొరీస్' వీడియో సాంగ్‌ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నివ్రితి వైబ్స్ యూట్యూబ్ వేదికపై హీరో అడివి శేష్ రిలీజ్ చేశారు. అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్.. సైమా అవార్డ్స్‌లో నామినేట్ అయిన 'చోటు' అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్‌గా, సోని మ్యూజిక్‌లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం 'మనోహరం'కి రైటర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడనేదే ఈ సాంగ్. ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుంది. సుధాకర్ కోమాకుల నేతృత్వంలో నిర్మించబడిన ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేలా ఉంది. చదవండి: శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్.. అందుకే టాస్క్‌లు.. -
రతికతో బ్రేకప్‌పై రాహుల్ సిప్లిగంజ్ ఫస్ట్ రియాక్షన్
రతిక రోజ్.. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రారంభంలో అందరినీ ఆకట్టుకుంది. సూటిగా, ధైర్యంగా.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ బిగ్‌బాస్ ప్రియులకు బాగా కనెక్ట్ అయింది. తర్వాత ప్రశాంత్‌తో పులిహోర కలపడం.. అందరిముందు మాత్రం మొత్తం నువ్వే చేశావ్ అంటూ అతడిని దోషిగా నిలబెట్టడం.. తనను చులకన చేసి మాట్లాడటం.. పదేపదే తన మాజీ ప్రియుడి ప్రస్తావన తేవడం.. ముందు ఒకలా, వెనక ఒకలా ప్రవర్తించడం.. ఇలా వరుస తప్పులు చేస్తూ పోవడంతో తన గ్రాఫ్ అమాంతం పాతాళంలోకి పడిపోయింది. ఫలితంగా షో నుంచి ఎలిమినేట్ అయింది. కానీ బిగ్‌బాస్ టీమ్ ఆమెకు రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చింది. దాన్ని కూడా సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతోంది రతిక. రతిక గురించి తొలిసారి మీడియాతో.. ఇక ఆమె హౌస్‌లో ఉండగా రతిక తన మాజీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్‌తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకవగా పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై రాహుల్ సైతం పరోక్షంగా రతికను ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ప్రోగ్రామ్‌కు హాజరైన రాహుల్.. రతికతో బ్రేకప్‌పై తొలిసారి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'ప్రతి ఒక్కరికీ గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. రతికకు ఆల్‌ద బెస్ట్ చెప్పిన రాహుల్ ఆమెతో పాటు హౌస్‌లో ఉన్న ప్రతి కంటెస్టెంట్‌కు నేను ఆల్‌ద బెస్ట్ చెప్తున్నాను. బాగా ఆడి కప్పుతో బయటకు రావాలని కోరుకుంటున్నాను. విన్నర్ ఎవరనేది ఇప్పుడే మనం నిర్ణయించలేము. ప్రస్తుతానికైతే భోలె షావళి మంచి వినోదాన్ని అందిస్తున్నారు. శివాజీ ఇంట్లో పెద్ద వ్యక్తిలా ఉన్నారు. పల్లెటూరు నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఒకప్పుడు బిగ్‌బాస్ షోను ప్రేక్షకుడిలా చూశాడు. ఇప్పుడు ప్రేక్షకులు ఆయనను బిగ్‌బాస్ హౌస్‌లో చూస్తున్నారు' అని మాట్లాడాడు రాహుల్ సిప్లిగంజ్. చదవండి: 10 ఏళ్లకే ఫుల్ క్రేజ్.. 17 ఏళ్లకే తల్లయిన స్టార్ హీరోయిన్.. అర్ధాంతరంగా ముగిసిన కెరీర్.. -
రాహుల్ సిప్లిగంజే ఆ పర్సనల్ ఫోటోలు లీక్ చేశాడు: రతిక సోదరి
బిగ్‌బాస్ 7లో బాగా ట్రోల్ అయిన కంటెస్టెంట్ రతికా రోజ్.. హౌస్‌లో పదేపదే తన మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రస్తావిస్తూ.. రైతుబిడ్డను చులకన చేసి మాట్లాడుతూ నెగెటివిటీ పోగొట్టుకుంది. దీంతో జనాలు వెంటనే ఆమె మాకొద్దు బాబోయ్ అని ఎలిమినేట్ చేశారు. కట్ చేస్తే బిగ్‌బాస్ ఆమెకు రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే రతిక బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో ఆమె రాహుల్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. దీనిపై అటు రాహుల్ సైతం గరమయ్యాడు. రాహులే ఫోటోలు లీక్ చేశాడు! రతిక పీఆర్ చీప్‌గా ప్రవర్తిస్తుందంటూ ఫైర్ అయ్యాడు. తాజాగా రతిక సోదరి ఈ ఫోటోలు లీక్ అవడంపై స్పందించింది. రతికకు ఎవరి పేరూ వాడుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఆ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో మాకే అర్థం కావడం లేదు. రతిక షోలో ఉంది.. తన ఫోన్ కూడా ఆమె దగ్గర లేదు. రాహుల్ దగ్గరి నుంచే ఫోటోలు లీకయ్యాయి అనుకున్నాం. ఎందుకంటే వారి పర్సనల్ ఫోటోలు ఇంకెవరి దగ్గరుంటాయి? ఒక అమ్మాయి తన ఫోటోలు లీక్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది? పెళ్లికి ముందే కండీషన్స్ నిజానికి రాహుల్-రతిక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి. రతిక ఇంట్లో కూడా చెప్పేసింది. తను సంతోషంగా ఉంటే అంతే చాలని నాన్న కూడా వారి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇంతలో రాహుల్ కొన్ని షరతులు పెట్టాడు. నన్ను పెళ్లి చేసుకున్నాక సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లకూడదు, అక్కడ పని చేయకూడదు అని చెప్పాడు. ఆ కండీషన్స్ రతికకు నచ్చలేదు. ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చాకే బ్రేకప్ చెప్పుకున్నారు. ఎవరి జీవితంలో వారు సంతోషంగానే ఉన్నారు. కానీ ఆ రోజు ఫోటోలు లీక్ అవడం గురించి రాహుల్ ఎందుకలా సీరియస్ కామెంట్స్ చేశాడో నాకూ అర్థం కాలేదు అని చెప్పుకొచ్చింది. చదవండి: ఓ పక్క ట్రోలింగ్.. మరోపక్క ఓటీటీలో ట్రెండ్ అవుతున్న తెలుగు సినిమా -
రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్.. రతికా పేరేంట్స్ ఏమన్నారంటే?
రతికా రోజ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో రీ ఎంట్రీ ఇచ్చి అలరిస్తోంది. అయితే బిగ్ బాస్‌తో ఎంత ఫేమ్ తెచ్చుకుందో.. ఆమె వ్యక్తిగత విషయాలతోనూ అంతేస్థాయిలో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమ వ్యవహారంతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆమెది వికారాబాద్ జిల్లా జనగామ గ్రామం కాగా.. ప్రస్తుతం వీరు తాండూరులో నివాసముంటున్నారు. రతికా రోజ్.. రాములు, అనితలకు రెండో సంతానం కాగా.. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రతికా రోజ్ తల్లిదండ్రులు ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (ఇది చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు) రతికా నాన్న రాములు మట్లాడుతూ.. 'మాది చాలా చిన్న ఊరు. కేవలం 2 వేల జనాభా ఉంది. మొదట మా అమ్మాయికి పటాస్ షో అవకాశం వచ్చింది. అందులో ఏదో నాలుగు ఉంటుందని అనుకున్నా. ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. ఒకసారి రతికా ఇంటర్ సెకండియర్‌లో విజయ నిర్మలమ్మ తీసిన ఈ జన్మ నీకే అనే సినిమాలో సెకండ్ హీరోయిన్గా కావాలని ఫోన్ వచ్చింది. కానీ సినిమాల గురించి మాకు పెద్దగా తెలియదు. మహేశ్ బాబు వాళ్ల అమ్మనే ఫోన్ చేసి అడిగింది. మా అమ్మాయి నాకు సినిమా ఛాన్స్ వచ్చింది.. నేను పోతా పట్టు పట్టింది. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. మాకు ముగ్గురు కుమార్తెలు సంతానం. రతిక రెండో అమ్మాయి. మిగిలిన ఇద్దరికీ పెళ్లి చేశాం. ఇప్పుడు మాకు కొడుకు రూపంలో ఉన్నది రతికనే.' అంటూ చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: బిగ్ బాస్ విన్నర్‌కు బిగ్ షాక్!) రతికా నాన్న మాట్లాడుతూ..' రాహుల్ సిప్లిగంజ్ వాళ్ల ఇంటికి కూడా పోయినా. మా అమ్మాయితో రెండు, మూడు పాటలు చేసిండు. యూట్యూబ్‌లో పెడితే పైసలు వస్తాయి కదా అని అనుకున్నాం. మా చిన్నపాప పెళ్లికి కూడా రాహుల్ వచ్చిండు. మా వరకైతే పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. అయితే మా పాపకు పెళ్లి కావాలే.. మా అమ్మాయితో ఇలా సినిమా పాటలు తీస్తే ఎలా? అని ఒకసారి రాహుల్‌ను బెదిరించా. మా ఊర్లో వాళ్లయితే వాడితోనే డ్యాన్స్ చేసి.. వాడితోనే పోతుంది అనేవారు. మేం వాటిని పట్టించుకోలేదు. రాహుల్ కూడా అందరిలాగే పెళ్లికి వచ్చిండు.. కానీ ఇలా జరుతుందని మేం కూడా అనుకోలేదు. రతికా అందరినీ ఫ్రెండ్‌లాగే భావిస్తుంది. బిగ్ బాస్‌లో పల్లవి ప్రశాంత్‌తో ఒక స్నేహితుడిలాగే మాట్లాడింది. బయట కావాలనే కొందరు రూమర్స్ తెచ్చారు.' అని అన్నారు. అనంతరం రతికా తల్లి అనితా మాట్లాడుతూ..' రతికా నాతో కలిసి ఇంట్లో వంటలు కూడా చేస్తుంది. మటన్, పాయసం అంటే ఇష్టం. నాకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటుంది.' అని చెప్పుకొచ్చింది. -
రాహుల్ గురించి రతికనే చెప్పింది.. బిగ్ బాస్ విన్నర్ అతనే గ్యారెంటీ: దామిని
బిగ్‌బాస్ సీజన్-7లో సింగర్స్ వెళ్లడం సహజం అలాగే ఈసారి కూడా దామిని భట్ల వెళ్లారు. గతంలో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ అయితే.. గీతా మాధురి టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. కానీ ఈ సీజన్లో సింగర్ దామిని భట్ల కేవలం మూడు వారాలు మాత్రమే హౌస్‌లో ఉన్నారు. ఉన్న కొద్దిరోజులే అయినా ఆటలో తన ప్రత్యేకతను చాటుకుంది. అందరిలా కాకుండా తనదైన స్టైల్లో గేమ్ ప్లే చేసింది. ఓట్ల కోసం నటించకుండా తనకు ఏదైతే నచ్చిందో ఆ పని మాత్రమే హౌస్‌లో చేసేది.. బహుశా ఇది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. ఆమెలోని నెగటివ్‌ను మాత్రమే ప్రేక్షకులకు చూపించిన బిగ్ బాస్.. దామినిలోని పాజిటివ్‌ను మాత్రం తెరపైకి చూపించలేదనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యలో బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్‌లో నిలబడాలంటే కంటెంట్ ఇవ్వాలి. అప్పుడప్పుడు ఇతరులపైన సీరియస్ అవ్వాలి. హౌస్‌లో వారికి చాలామందికి పీఆర్ టీమ్ ఉంది. అలాగే నేను కూడా పీఆర్ టీమ్‌ను ఏర్పాటు చేసుకునే బిగ్ బాస్‌లోకి వెళ్లాను. కానీ... నేను హౌస్‌లోకి వెళ్లే ముందు వారికి ఒక సూచన ఇచ్చా... నన్ను మాత్రమే హైప్ చేయండి. అందుకోసం ఎదుటివారిని కించపరిచేలా ఎలాంటి ప్రమోషన్ చేయకండి అని గట్టిగా చెప్పాను. అందులో తేడా వస్తే సహించనని కూడా చెప్పాను. కానీ నా లక్ బాగాలేదు.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాను.' అని దామిని చెప్పింది. రాహుల్‌తో ప్రేమ గురించి రతికనే చెప్పింది: దామిని బిగ్ బాస్ నుంచి నేను బయటికి రాగానే రాహుల్ సిప్లిగంజ్- రతికా రోజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిని తెలిసింది. అప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. అదే సమయంలో నాకు రాహుల్ కాల్ చేసి ఎక్కడున్నావ్ అని ప్రశ్నించాడు... ఇంటి వద్దనే ఉన్నానని చెప్పి లోకేషన్ షేర్ చేస్తే ఇంటికి వచ్చేశాడు. అప్పుడు ఇద్దరం రతిక టాపిక్ గురించి చర్చించాము. ఆమె గురించి వాడు చెప్పాల్సిన మాటలు చెప్పాడు. ఒకసైడ్ మాత్రమే విన్న నేను తప్పు ఎవరిదని జడ్జ్ చేయలేను. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన మొదటి మూడు రోజుల్లోనే నా వద్ద రాహుల్ టాపిక్ రతక తెచ్చింది. తనకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనే అర్థం వచ్చేలా ఆ సమయంలో క్లియర్‌గా చెప్పింది. ఇద్దరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా నిజమే ఉంటుందిలే అని నేను కూడా పెద్దగా సాగతీయలేదు. అని దామిని తెలిపింది. బిగ్ బాస్ విన్నర్ అతనే రతికా రోజ్‌ను రీ ఎంట్రీ ద్వారా తీసుకోవాలని బిగ్ బాస్ అనుకున్నాడు.. అందుకే ఉల్టాపుల్టా పేరుతో ఎక్కువ ఓట్లు వచ్చిన తమను పక్కన పెట్టి రతికను తీసుకున్నారని దామిని తెలిపింది. తనకు నయని పావని, పూజా, శోభ, ప్రియాంక, అమర్, సందీప్ ఓట్లు వేశారని చెప్పుకొచ్చింది. కానీ ఉల్టాపుల్టా పేరుతో ఆ అవకాశం దక్కలేదని చెప్పింది. శివాజీ వయసు రిత్యా చాలా అనుభం వుంది. ఆయన మైండ్‌తో ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు. కానీ బిగ్ బాస్ సీజన్ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ కావడం గ్యారెంటీ అని ఆమె తెలిపింది. అతనొక కామన్ మ్యాన్‌గా గుర్తింపు ఉంది. అతను చాలా మంచి వ్యక్తి నామినేషన్లో మాత్రమే అలా రెచ్చిపోతాడు... ఆ ఒక్క విషయంలో ప్రశాంత్ అంటే తనకు ఇష్టం లేదని దామిని చెప్పింది. ప్రశాంత్‌ను ఎప్పుడూ ఎవరూ చులకనగా చూడలేదు. వాడు పూర్తిగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మొదట్లో అడ్జెస్ట్ కావడానికి సమయం పట్టింది. వాడికి ఫస్ట్ వారంలో ఏసీ కూడా సెట్ కాలేదు. దాంతో జ్వరం కూడా వచ్చింది. ఆ సమయంలో వాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం అని ఆమె చెప్పింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్, వారి కుటుంబ సభ్యల గురించి కొందరు పీఆర్ టీమ్ వారు బూతులతో కామెంట్లు చేస్తున్నారు. ఇదీ ఏ మాత్రం మంచిది కాదని దామిని తెలిపింది. -
రతిక మాజీ బాయ్‌ఫ్రెండ్ టాపిక్.. నాగ్ అలాంటి కామెంట్స్!
'బిగ్‌బాస్' షో.. అప్పుడే మూడో వారం చివరకొచ్చేసింది. తొలి రెండు వారాలు ఓ మాదిరిగా సాగినప్పటికీ.. హౌసులో కొన్ని గొడవలు మినహా చెప్పుకోదగ్గవి అయితే ఏం జరగలేదు. గత రెండు వీకెండ్స్‌లో హోస్ట్ నాగార్జున.. ఎవరినీ పెద్దగా ఏం అనలేదు. ఇప్పుడు మాత్రం మొహమాటం లేకుండా స్మూత్ కౌంటర్స్ వేశాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది ఇప్పుడు Day-20 హైలైట్స్‌లో చూద్దాం. మూడో హౌస్‌మేట్ శనివారం ఎపిసోడ్ కోసం వచ్చిన నాగ్.. శుక్రవారం ఏం జరిగిందనేది స్క్రీన్‌పై చూపించాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చేశాడు. డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వచ్చేశాడు. ఈ క్రమంలోనే సంచాలక్ సందీప్‌కి నాగ్ అక్షింతలు వేశాడు. ఎవరు గెలుచుంటారని అతడిని అడిగాడు. మరోవైపు జుత్తు తీయకుండా బయటకొచ్చేసిన అమరదీప్‌ని కూడా అడిగితే అతడు కూడా ప్రియాంక పేరు చెప్పాడు. కానీ శోభాశెట్టి.. ఎద్దు పోటీలో 12 సెకన్ల తేడాతో గెలిచింది. మూడో హౌస్‌మేట్ అయిపోయింది. కొత్త గేమ్ పెట్టారు కానీ ఇక నామినేషన్స్‌లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పిన నాగార్జున.. తన ముందే ఒక్కో వ్యక్తి వాళ్లకు అనిపించిన గేమ్ ఛేంజర్ ఎవరు? సేఫ్ గేమర్ ఎవరో? చెప్పాలని, వాళ్లకు ఆయా బ్యాడ్జి అతికించాలని చెప్పాడు. ఇప్పటికే హౌస్మేట్స్ అయిన శివాజీ, సందీప్ తప్ప అందరూ తమకు అనిపించిన వారి పేర్లు చెప్పారు. ఆ లిస్ట్ దిగువన ఉంది. చూసేయండి. కంటెస్టెంట్.. గేమ్ ఛేంజర్, సేఫ్ గేమర్ ప్రియాంక - శోభాశెట్టి, శుభశ్రీ శుభశ్రీ - యవర్, తేజ ప్రశాంత్ - యవర్, తేజ గౌతమ్ - ప్రియాంక, తేజ దామిని - యవర్, అమరదీప్ తేజ - ప్రియాంక, అమరదీప్ శోభాశెట్టి - ప్రియాంక, ప్రశాంత్ యవర్ - ప్రశాంత్, దామిని అమరదీప్ - దామిని, రతిక రతిక - యవర్, తేజ ఇందులో భాగంగా నాలుగు బ్యాడ్జిలు సొంతం చేసుకున్న యవర్ గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు. నాలుగు బ్యాడ్జిలతో సేఫ్ ప్లేయర్ అయిన తేజకి మాత్రం నాగ్ పనిష్మెంట్ ఇచ్చాడు. రాబోయే వారంపాటు ఇంట్లోని పాత్రలన్నీ క్లీన్ చేయాలని ఆర్డర్ వేశాడు. దీంతో తేజ అవాక్కయ్యాడు. సంచాలక్‌గా సందీప్ ఫెయిల్ సంచాలక్‌గా వ్యవహరించిన సందీప్.. చికెన్ ముక్కలు తిన్న టాస్క్, ఇతర టాస్కుల్లో భాగంగా కంటెడర్స్కి లేనిపోని సలహాలు ఇచ్చాడు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తుచేసిన నాగార్జున.. గాలి మొత్తం తీసేశాడు. అతడు సంచాలక్‌గా ఫెయిలయ్యాడు అనుకున్నవాళ్లు చేతులు పైకెత్తండి అని నాగ్ చెప్పడంతో రతిక, ప్రశాంత్, శుభశ్రీ, గౌతమ్, తేజ చేతులు పైకెత్తారు. అంతకు ముందు శివాజీ కూడా సందీప్ చేసింది తప్పని అన్నాడు. ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలోనే.. 'నువ్వేమైనా పిస్తా అనుకుంటున్నావా?' అని సందీప్‌కి నాగ్ కౌంటర్ వేశాడు. తప్పు చేసినందుకుగానూ సందీప్ బ్యాటరీ డౌన్ చేస్తున్నా అని చెప్పాడు. దీంతో బ్యాటరీ కాస్త.. గ్రీన్(పచ్చ) నుంచి ఎల్లోకి(పసుపు) పడిపోయింది. అమర్‌కి అరటిపండు సామెత ఇక మిగిలిన వాళ్లలో గౌతమ్‌తో మాట్లాడిన నాగ్.. శోభాతో గొడవ విషయంలో నువ్వు చేసిన దానికి కారణం ఏదైనా అయ్యిండొచ్చు కానీ అందరికీ అది షో హాఫ్లానే అనిపించందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. మరోవైపు అమరదీప్.. ఈ వారం ఆటలో ఎక్కడా కనిపించలేదని చెప్పిన నాగ్.. ఆటలో అరటిపండు సామెత చెప్పి మరీ పరువు తీసినంత పనిచేశాడు. ప్రశాంత్‌తో మాట్లాడుతూ.. నువ్వెందుకు ఏడుస్తున్నావ్? ఓపిక లేదా మరోసారి ఆడలేవా? కన్నీళ్లతో పనిజరగలేదు. బిగ్ బాస్ కరుణించడు అని నాగ్ కాస్త గట్టిగానే సీరియస్ అయ్యాడు. రతిక మాజీ ప్రియుడు టాపిక్ గత వారం పప్పులో రెండు గ్లాసులు అయినా నీరు అయినా వేశావ్, ఈ వారం అది కూడా చేయలేదు, ఆడు నీకు ఆ శక్తి ఉందని అని చెప్పిన నాగ్.. ఆమెని కాస్త ఎంకరేజ్ చేశాడు. 'మాజీ బాయ్‌ఫ్రెండ్ అంటే గతమే కదా! గతాన్ని ఇక్కడ బుర్రలో పెట్టుకున్నావ్ అనుకో ప్రస్తుతంలో ఉండవు, భవిష్యత్తుకి కూడా వెళ్లవ్. ఎక్స్ అంటే ఎక్సే వదిలేసేయ్.. లెట్స్ లివ్ ఇట్' అని నాగార్జున సుతిమెత్తగా రతికకు సలహా ఇచ్చాడు. అయితే ఈ వారం గేమ్ ఆడకుండా బాయ్‌ఫ్రెండ్ పేరు చెప్పి రతిక సింపతీ కొట్టేస్తుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అలానే నామినేషన్స్‌లో సిల్లీ రీజన్స్ చెబుతున్నారని, ఏదో చెప్పాలని చెప్పేస్తున్నారు తప్ప ఓ స్టాండ్ లేదని కంటెస్టెంట్స్‌కి చురకలు అంటించాడు. ఇక నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురిలో యవర్ సేఫ్ అయ్యాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. -
నా పేరు ఎందుకు వాడుకుంటున్నావు..
-
6 ఏళ్ల తర్వాత పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి?: రాహుల్
బిగ్‌బాస్ హౌస్‌లో అతి చేస్తున్న కంటెస్టెంట్లు ఎవరైనా ఉన్నారా? అంటే చాలామంది పేర్లు వినిపిస్తాయి. అయితే అంతుచిక్కని ప్రవర్తనతో అపరిచితురాలిగా మారుతూ అందరినీ చిరాకు పెట్టే కంటెస్టెంట్లలో తొలిస్థానంలో ఉంటుంది రతిక. మొదట్లో అమ్మాయి బాగుంది, ఆటాడితే ఇంకా బాగుంటుంది అనుకున్నారంతా! తను కూడా అదే చేసింది.. కానీ బిగ్‌బాస్ ఇచ్చిన గేమ్ ఆడకుండా హౌస్‌మేట్స్‌తో ఆడింది. వారి సహనానికి పరీక్ష పెడుతూ మొండిగా ప్రవర్తిస్తూ ముప్పతిప్పలు పెట్టింది. ఈ ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ఇప్పుడేమో హౌస్‌లో లవ్ ట్రాక్‌లు నడుపుతూ, వెనకాల వెన్నుపోటు పొడుస్తూ డబుల్ గేమ్ మొదలుపెట్టింది. ఇదంతా పక్కనపెడితే రతిక ఆ మధ్య తన మాజీ బాయ్‌ఫ్రెండ్ గుర్తొస్తున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పదే పదే అతడి గురించే ప్రస్తావిస్తోంది. అతడు గుర్తొస్తే తన మైండ్ పని చేయడమే ఆగిపోతోందని చెప్పుకొచ్చింది. అతడు సింగర్ అని కూడా హింటిచ్చింది. చివరకు ఆ సింగర్ మరెవరో కాదు, రాహుల్ సిప్లిగంజ్ అంటూ నెట్టింట ఫోటోలు కూడా లీకయ్యాయి. తాజాగా దీనిపై రాహుల్ స్పందించిన సంగతి తెలిసిందే! ఈ ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? కొందరు పక్కనోళ్ల పేరు, ఫేమ్ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. వారి గుర్తింపు కోసం నా పేరును అవసరానికి మించి వాడుకుంటున్నారు అని మండిపడ్డాడు. ముందే ప్లాన్ చేసుకున్నారా? తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫోటోలు లీక్ అవడంపైనా అనుమానం వ్యక్తం చేశాడు. 'నాకో డౌట్.. ఆరేళ్ల తర్వాత సడన్‌గా వారి పర్సనల్ ఫోన్లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లోకి ఎలా వచ్చాయి? అంటే.. లోపలికి వెళ్లడానికి ముందే ఇదంతా ప్లాన్ చేసుకున్నారా? సమాధానమేంటో మీకే అర్థమవుతుందనుకుంటా! అక్కడున్నది అబ్బాయైనా, అమ్మాయైనా వారి జీవితాలతో నాకెటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది! అలాంటిది.. ఇలా ఫోటోలు లీక్ చేసి ఇబ్బంది పెట్టేముందు క్షణం ఆలోచించాల్సింది. ఎదుటివ్యక్తి కుటుంబం, స్నేహితులు దీని వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారని ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రతి ఒక్కరికి గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. అసలేం జరిగిందో తెలియకుండా ఎవరిది తప్పు? ఒప్పు? అని డిసైడ్ చేయకండి. ఇది అర్థం చేసుకున్నవారికి థాంక్యూ.. లేదు, విషాన్ని చిమ్ముతామనుకునేవారికి ఆల్ ద బెస్ట్' అని రాసుకొచ్చాడు. చదవండి: పేరు చెప్పకుండా సీరియస్ అయిన సింగర్ రాహుల్ -
రతిక బండారం బయటపెట్టిన మాజీ బాయ్‌ఫ్రెండ్!
తెలుగు 'బిగ్‌బాస్'.. మరీ కాకపోయినా సరే ఓ మాదిరిగా అలరిస్తుంది. తొలి రెండు వారాలు చాలావరకు సైలెంట్‌గా ఉన్న కంటెస్టెంట్స్.. ఇప్పుడు అంటే మూడో వారం రెచ్చిపోయి మరీ ఫెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. గొడవలే టార్గెట్ అన్నట్లు మాటలతో కొట్లాడుకుంటున్నారు. అయితే హౌసులోని ఓ కంటెస్టెంట్‌పై.. బిగ్‌బాస్ విజేత అయిన రాహుల్ సిప్లిగంజ్.. ఓ సీరియస్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది వైరల్‌గా మారింది. ఏం జరిగింది? తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్నాడు. అద్భుతమైన ఆటతీరుతో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం సీజన్లో నటి రతిక.. ఓ కంటెస్టెంట్‌గా వచ్చింది. పర్లేదు అనిపించేలా ఆడుతోంది. ఈమె-రాహుల్ గతంలో ప్రేమించుకున్నారని, పెళ్లికి రెడీ అయిన వీళ్లు కొన్ని కారణాలతో విడిపోయారని సమాచారం. (ఇదీ చదవండి: ప్రిన్స్ ముఖంపై పేడ.. బక్వాస్ రీజన్ అని శోభా సీరియస్) తొలివారం హౌసులో బాయ్ ఫ్రెండ్ ని తలుచుకుని కాస్త బాధపడ్డ రతిక.. మంగళవారం ఎపిసోడ్‌లోనూ తన మాజీ ప్రియుడు పేరు ఎత్తకుండా అతడి గురించి మాట్లాడుకుంటున్నారని శివాజీ దగ్గరకొచ్చి కాస్త బాధపడింది. అయితే రతిక ఇలా చేయడంపై.. ఆమె పేరు ఎత్తకుండా రాహుల్.. ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టాడు. అదంతా పరోక్షంగా రతిక గురించే అని డౌట్ వస్తుంది. స్టోరీలో ఏముంది? 'ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ఎప్పుడూ అందరూ సొంత టాలెంట్‌తోనే పైకి రావాలనుకుంటారు. కొందరు మాత్రం పక్కనోళ్ల పేరు, ఫేమ్ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. గుర్తింపు రావడం కోసం నా పేరు అవసరం కంటే ఎక్కువ వాడుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్ టూ ఇన్నర్ పర్సన్. కంగ్రాచ్యూలేషన్స్ టూ వాళ్ల పైసల్ తీసుకున్న టీమ్' అని రాహుల్ ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో ఈ స్టోరీ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవి పెళ్లి రూమర్స్.. అసలేం జరిగింది?) -
రతిక-రాహుల్ సిప్లిగంజ్ బ్రేకప్ అవ్వడానికి కారణమిదే..
-
రతిక మాజీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్.. బ్రేకప్‌కు కారణమిదే!
రతిక రోస్.. హౌస్‌లో చలాకీగా కనిపిస్తున్న ఈ బ్యూటీ గుండెలో ఎంతో బాధను మోస్తోందని నిన్నటి ఎపిసోడ్ చూస్తేనే అర్థమైపోతుంది. సీజన్ మొదలైన తొలిరోజే తన బ్రేకప్ గురించి ఆరా తీశాడు నాగ్. హార్ట్ బ్రేక్ నుంచి బయటకు వచ్చావా? అని అడిగితే హా అంటూ నవ్వుతూనే 'చేసిందంతా చేసి ఎంత బాగా నవ్వుతూ అడుగుతున్నారో?' అని నాగ్‌నే నిలదీసింది. మధ్యలో నేనేం చేశానని నాగ్ అంటే.. 'మొత్తం మీరే చేశారు. ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు హార్ట్ బ్రేక్ అయింది కదా, ఎలా ఉందని అడుగుతున్నారు' అంది. అప్పుడు పునర్నవి కోసం.. ఇప్పుడు రతిక కోసం.. సరే, నేనేం చేశానో చెప్పు అని అడిగితే మాత్రం హౌస్‌లోకి వెళ్లాక తెలుస్తుందని మాట దాటవేసింది రతిక రోస్. సరే, నీ హార్ట్ బ్రేక్ చేసినవాడిని ఇమిటేట్ చేయు అని అడిగితే.. ఇప్పుడు పాట పాడాలా? అన్నది. అంటే తన మనసు ముక్కలు చేసిన వ్యక్తి సింగర్ అని అర్థమైంది. నిన్నటి ప్రోమో, ఎపిసోడ్‌తో ఆ సింగర్ మరెవరో కాదు రాహుల్ సిప్లిగంజ్ అని తేలిపోయింది. పిల్లా.. పిల్లా.. భూలోకం దాదాపు కన్నూమూయు వేళా.. అనే పాటను ప్రోమోలో వదిలి హింటిచ్చాడు బిగ్‌బాస్. అప్పుడే పరిచయం, ప్రేమ అప్పట్లో పునర్నవి భూపాలం కోసం ఈ పాట పాడాడు రాహుల్. ఇప్పుడు రతిక కోసం మరోసారి ఈ పాట ప్లే చేసినట్లు కనిపిస్తోంది. కానీ ఎపిసోడ్లో మాత్రం ఈ సాంగే వేయలేదు. అయితే రాహుల్-రతికల రిలేషన్ నిజమేనంటూ సోషల్ మీడియాలో బోలెడన్ని ఫోటోలు దర్శనమిస్తున్నాయి. రాహుల్ గతంలో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేవాడు. హే పిల్ల ఆల్బమ్ షూటింగ్ సమయంలో రాహుల్, రతికల మధ్య పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ షో వల్లే బ్రేకప్ అయితే రాహుల్.. బిగ్‌బాస్‌కు వెళ్లాక పునర్నవితో లవ్ ట్రాక్ నడపడంతో వీరి మధ్య పొరపచ్చాలు వచ్చినట్లు కనిపిస్తోంది. చివరకు వీళ్ల బంధం బ్రేకప్‌తో ముగిసిందట! బిగ్‌బాస్ మూడో సీజన్లో రాహుల్- పునర్నవిల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు చెప్పింది నాగార్జునే! పదేపదే వీరి మధ్య ఏదో ఉందన్నట్లుగా కామెంట్లు చేశాడు. అందుకే ఈ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్లో చేసిందంతా చేసి ఇప్పుడిలా అడుగుతున్నారా? అని ముఖం మీదే అనేసింది. చదవండి: ఈ హీరోల మల్టీ టాలెంట్ గురించి తెలుసా? -
ఎమ్మెల్యేగా పోటీ అంటూ ఊహాగానాలు.. రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ
ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ గతకొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై రాహుల్ స్పందించాడు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు. నేను ఆర్టిస్ట్‌ను.. రాజకీయాలకు నో 'నా మీద చాలా పుకార్లు, ఆరోపణలు వస్తున్నాయి.. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు. రాజకీయ రంగప్రవేశం అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అన్ని పార్టీలలో ఉన్న అందరు నాయకులను నేను గౌరవిస్తాను. నేను ఒక ఆర్టిస్ట్‌ను.. అందరికీ వినోదం పంచడమే నా పని.. నా జీవితమంతా దానికే ధార పోస్తాను. అసలు నేను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదు. ఇది మరీ టూమచ్.. నేను సంగీతాన్నే నా కెరీర్‌గా ఎంచుకున్నాను. ఇందులో చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఏ పార్టీ నాకు ఆహ్వానాలు పంపలేదు. నేను కూడా ఎవరినీ ప్రత్యేకంగా కలవలేదు. దయచేసి ఈ రూమర్స్‌ను ఇక్కడితో ఆపేయండి..' అని నోట్ షేర్ చేశాడు. 'పుకార్లు రావడం సాధారణమే.. కానీ ఈ పుకారు మాత్రం మరీ టూమచ్‌గా ఉంది' క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. దీంతో అతడి రాజకీయ అరంగేట్రం అంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) చదవండి: సిగరెట్, గంజాయి.. ఊహించనన్ని చెడు అలవాట్లు, నాన్న జేబులో డబ్బులు కొట్టేసేవాడిని.. కొట్టడం.. -
కాంగ్రెస్ నుంచి రాహుల్ సిప్లిగంజ్ దరఖాస్తుతో మరింత ఉత్కంఠ
హైదరాబాద్: బీఆర్ఎస్ సీట్ల కేటాయింపులో నగరంలోని రెండు నియోజకవర్గాలను.. అందులోనూ గోషామహల్‌ను ఎందుకు పెండింగ్‌లో ఉంచారన్నది నగరంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగింటినే పెండింగ్‌లో ఉంచారు. ఇందులో రెండు సీట్లు నగరంలోని నాంపల్లి, గోషామహల్‌వే కావడం తెలిసిందే. ఈసారి గోషామహల్‌ను ఎలాగైనా దక్కించుకోవాలనే తలంపుతోనే బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ► గోషామహల్ ఏర్పాటుకు ముందు అది మహరాజ్‌గంజ్ నియోజకవర్గంగా ఉండేది. గోషామహల్‌గా ఏర్పాటయ్యాక వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ గెలుపొందారు. 2018 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క నియోజకవర్గం అదే. బీజేపీకి కంచుకోటగా మారిన ఆ నియోజకవర్గంలో ఎలాగైనా బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలనే తలంపుతోనే ఆ నియోజకవర్గాన్ని పెండింగ్‌లో ఉంచినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ► దాదాపు ఏడాది క్రితం రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ.. ఇంతవరకు సస్పెన్షన్ ఎత్తివేయలేదు. ఈసారి బీజేపీ మరో అభ్యర్థిని రంగంలోకి దింపుతుందా.. లేక రాజాసింగే వస్తారా అన్నది వెల్లడి కావాల్సి ఉంది. బీఆర్ఎస్ తొలి జాబితా వెల్లడి కాగానే రాజాసింగ్ స్పందిస్తూ.. గోషామహల్ పెండింగ్‌లో ఉంచడానికి కారణం ఎంఐఎం అని, ఆ పార్టీ సూచించిన వారికే టికెట్ ఇస్తారని ఆరోపించడంతో పాటు రానున్న ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేసేది తానేనని, ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని బహిరంగంగా ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కన్ను ► కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి గోషామహల్ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే యోచనలో ఉంది. మహరాజ్‌గంజ్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1989, 2004లలో రెండు పర్యాయాలు, గోషామహల్‌గా రూపాంతరం చెందాక 2009లో కాంగ్రెస్ నుంచి ముఖేశ్‌గౌడ్ గెలుపొందారు. కాంగ్రెస్ ఓట్లు గణనీయంగా ఉన్న ఆ నియోజకవర్గాన్ని తిరిగి తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ దృష్టి సారించింది. ఈ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం రాహుల్ సిప్లిగంజ్ దరఖాస్తు చేసుకోవడంతో ఆయనకు టికెట్ ఇస్తే యూత్ ఓట్లు గణనీయంగా పడటమే కాకుండా ప్రచారం తిరుగులేని విధంగా ఉండి గెలుపు ఈజీ కానుందని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ► యూత్‌లో ఎంతో క్రేజ్ ఉన్న రాహుల్ సిప్లిగంజ్ ఒక సీజన్లో బిగ్‌బాస్ విన్నర్‌గా గెలుపొందడంతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పాటతో ఆస్కార్ దాకా వెళ్లడం తెలిసిందే. పార్టీయే ఆయనను ఆహ్వానించి ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. మంగళ్‌హాట్‌కు చెందిన రాహుల్ తన నివాసాన్ని అక్కడి నుంచి మార్చినప్పటికీ అక్కడి బస్తీల్లో అభిమానించేవారు భారీగా ఉన్నారు. అటు మాస్.. ఇటు క్లాస్ రెండు వర్గాల్లో ఎంతో గుర్తింపు ఉన్న సిప్లిగంజ్‌కు టిక్కెట్ ఇస్తే గత వైభవం తిరిగి పొందవచ్చునని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేచి చూసే ధోరణిలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ తొలుత గోషామహల్ టిక్కెట్‌ను నందు బిలాల్‌కు కేటాయిస్తుందని భావించినప్పటికీ, అంతకంటే బలమైన అభ్యర్థి కోసమే వేచి చూస్తున్నట్లు సమాచారం. ఈసారి ఎలాగైనా గోషామహల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు చివరి దాకా వేచి చూసి.. మిగతా పార్టీలకంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలనేది బీఆర్ఎస్ యోచనగా తెలుస్తోంది. అందుకు తగిన అభ్యర్థిని అన్వేషిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు ఖరారయ్యాకే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘గోషామహల్’ కోసం రాహుల్ సిప్లిగంజ్ దరఖాస్తు!
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద ఇవాళ కోలాహలం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇవాళ చివరిరోజు కాగా.. దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. గోషామహాల్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీంతో రాహుల్ రాజకీయ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఇక దరఖాస్తుల పరిశీలన తర్వాత.. ఆయా స్థానాలకు అభ్యర్థుల్ని పీసీసీ ఎంపిక చేస్తుంది. ఇప్పటి వరకు 900 దరఖాస్తులు దాటినట్లు తెలుస్తోంది. చివరి రోజు కావడంతో సాయంత్రం వరకు దరఖాస్తుల సంఖ్య వేయి దాటుతుందని గాంధీభవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూట్యూబర్‌గా లోకల్ సాంగ్స్‌తో పాపులర్ అయిన రాహుల్ సిప్లిగంజ్, ఆపై టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్‌గా అలరిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 50కిపైగా చిత్రాల్లో పాడారు. రాహుల్ సిప్లిగంజ్ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-3 విజేతగానూ నిలిచారు. రాజమౌళి ట్రిపుల్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కుగానూ ఆస్కార్ దక్కగా.. ఆ సాంగ్ సింగర్ అయిన రాహుల్‌కు ఆస్కార్ ఆ వేదికపైనా పాడి అలరించే అవకాశం దక్కింది కూడా. -
నేను చాలా అదృష్టవంతుడిని అక్క
-
అనసూయ అందాలు.. ఫరియా చిందులు
► థాయ్‌లాండ్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తుంది అనసూయ. అక్కడ సముద్రం ఒడ్డున దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ►తమ్ముడి వివాహ వేడుకలో ఫ్యామిలీతో కలిసి ఉన్న దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేశాడు రాహుల్ సిప్లిగంజ్ ►రామ్‌తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ►పింక్ జాకెట్లో దీపికా పిల్లి పరువాల విందు View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. (ఫొటోలు)
-
రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి..
-
రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్‌బాస్ విన్నర్ నుంచి ఆర్ఆర్ఆర్ నాటునాటు సాంగ్‌తో స్టార్ అయిపోయాడు. హైదరాబాద్‌లోని బస్తీ నుంచి ప్రపంచం మెచ్చేస్థాయికి ఎదిగాడు. అంతలా పేరు సంపాదించుకున్నారు మన తెలుగు కుర్రాడు. సింగర్‌గానే కాకుండా పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. (ఇది చదవండి: కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్) తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి నెలకొంది. తన తమ్ముడు నిఖిల్ సిప్లిగంజ్ వివాహా వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ రాజకీయ నాయకులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. రాహుల్ దగ్గరుండి తమ్ముడి పెళ్లి పనులు చూసుకున్నారు. తమ్ముడి పెళ్లిలో దిగిన ఫోటోలను రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ పెళ్లికి తెలంగాణ మంత్రులు, భాజపా నాయకులు హాజరయ్యారు. (ఇది చదవండి: బస్తీ కుర్రోడి నుంచి ఆస్కార్ వరకు.. రాహుల్ కెరీర్ సాగిందిలా) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul)