ఆలోచింపజేసే 14 | Rahul Sipligunj release for 14 movie motion poster | Sakshi
Sakshi News home page

ఆలోచింపజేసే 14

Published Mon, Feb 17 2020 5:52 AM | Last Updated on Mon, Feb 17 2020 5:52 AM

Rahul Sipligunj release for 14 movie motion poster - Sakshi

14 మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌లో నోయల్, రాహుల్‌ సిప్లిగంజ్‌...

‘కుమారి 21 ఎఫ్‌’ నోయల్‌ ప్రధాన పాత్రలో రతన్, విశాఖ జంటగా నటించిన చిత్రం ‘14’. లక్ష్మి శ్రీనివాస్‌ దర్శకత్వంలో రాయల్‌ పిక్చర్స్‌ పతాకంపై సుబ్బారావ్‌ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని ‘బిగ్‌ బాస్‌’ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ మోషన్‌ పోస్టర్‌ చాలా కొత్తగా, ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్‌లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. నోయల్‌కి ‘కుమారి 21ఎఫ్‌’ సినిమాకన్నా ‘14’ చిత్రంతో ఎక్కువ పేరు రావాలి’’ అన్నారు. ‘‘వైవిద్యభరితమైన కథతో రూపొందిన చిత్రమిది. కొత్త పాయింట్‌ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు లక్ష్మి శ్రీనివాస్‌.  ఈ చిత్రానికి కెమెరా: సాయినాథ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కామిరెడ్డి బాబురెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement