Rathan
-
Sanam Ratansi: 'సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్'గా పాపులర్..
సోనాక్షీ సిన్హా తన పెళ్లితో టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా అయింది. అంతకుముందు నుంచే సనమ్ రతన్సీ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయింది సోనాక్షీ సిన్హా వెన్నంటే ఉంటూ! ఎందుకంటే సనమ్.. సోనాక్షీ పర్సనల్ స్టయిలిస్ట్! అంతేకాదు ఆమెకు సోనాక్షీతో మరో పర్సనల్ రిలేషన్ కూడా ఉంది. ఆమె.. సోనాక్షీ సిన్హా ఆడపడచు! ఇక్కడ మాత్రం సనమ్ పరిచయం స్టార్ స్టయిలిస్ట్గానే!ఎడిటోరియల్ స్టయిలింగ్, సెలబ్రిటీ స్టయిలింగ్ రెండూ వేటికవే ప్రత్యేకం. అయితే ఎడిటోరియల్ స్టయిలింగ్ కొంచెం కూల్. సెలబ్రిటీ స్టయిలింగ్ కాస్త స్ట్రెస్ఫుల్! కానీ చాలెంజింగ్‌గా ఉంటుంది. కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో నాకు అదితీ రావ్ హైదరీ అంటే ఇష్టం. నా పని మీద ఆమెకు నమ్మకం ఎక్కువ.నేనేది చెప్పినా ఆమె లుక్స్‌ని ఎన్హాన్స్ చేయడానికే చెబుతానని ఆమెకు తెలుసు. అందుకే నేను ఏ కాస్ట్యూమ్ తెచ్చినా ట్రై చేస్తుంది. స్టయిలింగ్ రంగంలోకి రావాలనుకునే వారికి ఒకటే సలహా.. కొత్త కొత్త ట్రెండ్స్‌ని గమనిస్తూండాలి. మంచి స్టయిలిస్ట్‌ల దగ్గర ట్రైన్ అవ్వాలి. వాళ్ల వర్క్‌తో ఇన్స్పైర్ అవ్వాలి. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ప్రయోగాలకు వెనుకాడకూడదు! – సనమ్ రతన్సీసనమ్.. క్రియేటివ్ జీన్‌తో సంపన్న కుంటుంబంలో పుట్టిపెరిగింది. ఆమె తండ్రి.. ఇక్బాల్ రతన్సీ స్వర్ణకారుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి. క్రియేటివ్ జీన్‌ని తండ్రి నుంచే పొంది ఉంటుంది సనమ్. ఆమెకు ఊహ తెలిసేనాటికే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్‌కి వెళ్లే వయసులోనే నిశ్చయించుకుంది పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని! అనుకున్నట్టుగానే ఫ్యాషన్ రంగంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక ఫ్యాషన్ మ్యాగజైన్స్‌లో పనిచేసింది.ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయిన అనాయితా ష్రాఫ్‌ని కలసింది. ఆమెతో సంభాషణ సనమ్‌లో స్టయిలింగ్ పట్ల ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది. అప్పుడు అనాయితా ఒక బ్రాండ్ అడ్వర్టయిజ్మెంట్ కోసం దీపికా పదుకోణ్‌కి స్టయిలింగ్ చేస్తోంది. ఆ షూటింగ్ విరామంలోనే అనాయితాను సనమ్ కలసింది. స్టయిలింగ్ పట్ల సనమ్ చూపిస్తున్న ఉత్సుకతను గుర్తించిన అనాయితా ఆ షూటింగ్లో తన పనిని గమనించమని సనమ్‌కి చెప్పింది.షూటింగ్ పూర్తయ్యాక అడిగింది ‘స్టిల్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టయిలింగ్?’ అని! ‘ఎస్.. వెరీమచ్!’ అని బదులిచ్చింది సనమ్. ‘అయితే నా దగ్గర జాయినై పో.. రేపటి నుంచే వచ్చేసెయ్’ అంటూ తన కంపెనీ ‘స్టయిల్ సెల్’లో సనమ్‌కి జాబ్ కన్ఫర్మ్ చేసింది అనాయితా. తెల్లవారి నుంచే ‘రా–వన్’ షూటింగ్‌కి బయలుదేరింది సనమ్.. అనాయితాకు అసిస్టెంట్‌గా! ఆ సినిమా హీరో షారుఖ్ ఖాన్‌కి అనాయితా స్టయిలింగ్ చేస్తోందప్పుడు.ఆ ప్రాజెక్ట్ తర్వాత అవకాశాల కోసం వెదుక్కోవలసిన అవసరం లేకపోయింది సనమ్‌కి. ఇంకెవరి రికమండేషన్ పనీ పడలేదు. సెలబ్రిటీ ఇండివిడ్యువల్ పర్సనాలిటీని హైలైట్ చేసే ఆమె వర్క్ స్టయిల్ ఎంతోమంది స్టార్స్‌కి నచ్చింది. సైఫ్ అలీ ఖాన్, అదితీ రావ్ హైదరీ, హుమా ఖురేషీ, రాజ్‌కుమార్ రావు, మనీషా కోయిరాలా, జహీర్ ఇక్బాల్, అలయా ఎఫ్, రియా చక్రవర్తి, కత్రినా కైఫ్‌లాంటి వాళ్లెందరో కోరి మరీ సనమ్‌ను తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. ఫితూర్, ద గర్ల్ ఆన్ ద ట్రైన్, మలాల్ వంటి సినిమాలకూ పనిచేసింది. తన కీర్తిని పెంచుకుంది. -
'అర్జున్ రెడ్డి' మాదిరే ఈ సినిమాను కూడా ఇబ్బంది పెట్టిన సంగీత దర్శకుడు
సంగీత దర్శకుడు రథన్‌పై నూతన దర్శకుడు వి. యశస్వి ఫైర్ అయ్యాడు. తాను తెరకెక్కించిన 'సిద్ధార్థ్ రాయ్' సినిమా ఫిబ్రవరి 23న విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్‌పై యశస్వి పలు ఆరోపణలు చేశాడు. ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తి అయ్యాయి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల విడుదల విషయంలో చాలా ఆలస్యమైంది. దీనికి ప్రధాన కారణం సంగీత దర్శకుడు రథన్ అని యశస్వి ఫైర్ అయ్యాడు. ఈ సినిమాకి సంగీతం అందించిన రథన్.. అవుట్ పుట్ విషయంలో తనని బాగా ఇబ్బంది పెట్టాడని యశస్వి వాపోయాడు. అతను మంచి టెక్నీషియనే కావచ్చు కానీ అతని వల్ల సినిమా నలిగిపోతుంది. ఆయన గొడవ పడేందుకే మాట్లాడుతాడు. సినిమా గురించి ఏదైనా సమస్య వచ్చి అతనితో మాట్లాడితే చాలా ఎక్కువగా గొడవ పడుతాడు. రథన్ అనే వ్యక్తి ఒక సినిమాను పూర్తి వరకు తీసుకొచ్చి చివరి క్షణంలో వదిలేస్తాడు. రీరికార్డింగ్ విషయంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు రథన్ చెన్నైలో ఉండి బతికిపోయాడు.. అదే హైదరాబాద్‌లో ఉంటే చాలా గొడవలు జరిగేవి. అని చెప్పారు. గతంలో రథన్ తీరుపై దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. 'అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో కూడా రథన్ వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సందీప్ రెడ్డి వంగా గతంలో తెలిపిన విషయం తెలిసిందే. అతను టెక్నీషియన్ అంటూనే దర్శక,నిర్మాతలను బాగా ఇబ్బందులకు గురిచేస్తాడని ఆయన తెలిపారు. రథన్ ఇప్పటి వరకు తెలుగులో అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం, హుషారు, పాగల్, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. 'సిద్ధార్థ్ రాయ్' చిత్రం ఫిబ్రవరి 23న విడుదలకు రెడీగా ఉంది. ట్రైలర్ కూడా అర్జున్ రెడ్డి సినిమాను గుర్తుకు తెస్తుంది. అతడు సినిమాలో బాల నటుడిగా అలరించిన దీపక్ సరోజ్ ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. -
రియల్ స్టోరీగా ‘నేను c/o నువ్వు'.. రిలీజ్ ఎప్పుడంటే..
రతన్ కిషోర్, సన్య సిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నేను c/o నువ్వు'. ఆగాపే అకాడమీ పతాకంపై అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్‌లు సంయుక్తంగా నిర్మించారు..ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 16 న గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత సాగారెడ్డి తుమ్మ చిత్ర విశేషాల గురించి మీడియాతో మాట్లాడుతూ.. 1980 లో జరిగిన కథ ఇది. పల్లెటూరు లో పేదింటి అబ్బాయి. ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ప్రేమ మనిషిని జయిస్తుందని ఈ సినిమాలో చెప్పడం జరిగింది. మా సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి, ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎన్.ఆర్.రఘునందన్ గారు అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది’ అన్నారు. -
నటుడు రతన్ చోప్రా మృతి
సినిమా అంటే గ్లామర్ ప్రపంచం. అందుకే ఇక్కడ ఉన్నవారి జీవితం కలర్ఫుల్గా ఉంటుందని చాలామంది అనుకుంటారు. అయితే కొందరి నటీనటుల జీవితాలు కనీసం వైద్యానికి నోచుకోని స్థితిలో ముగుస్తున్నాయంటే నమ్మశక్యం కాదు. తాజాగా బాలీవుడ్ నటుడు రతన్ చోప్రా (70) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారాయన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రతన్ చోప్రా సరైన వైద్యం చేయించుకోలేకపోయారు. శుక్రవారం ఆయన మృతి చెందిన విషయాన్ని ఆయన దత్త పుత్రిక అనిత అధికారికంగా ప్రకటించారు. మోహన్ కుమార్ దర్శకత్వంలో 1972లో వచ్చిన ‘మామ్ కీ గుడియా‘ చిత్రంలో ప్రధాన పోత్ర పోషించారు రతన్ చోప్రా. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న రతన్ పటియాలాలో పీజీ విద్య అభ్యసించారు. సినిమాలపై ఆసక్తితో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించారు. అయితే తన నానమ్మకు నటనా రంగంపై ఇష్టం లేకపోవడంతో రతన్ చోప్రా ఇండస్ట్రీకి దూరమై పలు స్కూళ్లలో టీచర్‌గా పనిచేశారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో పంజాబ్‌లోని మాలర్‌కోట్లలో తుదిశ్వాస విడిచారు. ఆర్థిక సమస్యలతో హర్యానాలోని పాంచ్‌కులలో అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన భోజనానికీ ఇబ్బందులు పడ్డారట. సమీపంలోని ఆలయాల వారే భోజనం పెట్టేవారని వార్తలు చెబుతున్నాయి. వివాహం చేసుకోని రతన్.. అనిత అనే యువతిని కూతురిగా దత్తత తీసుకున్నారు. ఇటీవల బాలీవుడ్ నటులు ధర్మేంద్ర, అక్షయ్ కుమార్, సోనూ సూద్‌లను రతన్ చోప్రా ఆర్థిక సాయం కోరారట. అయితే వారి నుంచి సమాధానం రాలేదని అనిత, రతన్ చోప్రా బంధువులు అంటున్నారు. -
ఆలోచింపజేసే 14
‘కుమారి 21 ఎఫ్’ నోయల్ ప్రధాన పాత్రలో రతన్, విశాఖ జంటగా నటించిన చిత్రం ‘14’. లక్ష్మి శ్రీనివాస్ దర్శకత్వంలో రాయల్ పిక్చర్స్ పతాకంపై సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని ‘బిగ్ బాస్’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా, ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్‌లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. నోయల్‌కి ‘కుమారి 21ఎఫ్’ సినిమాకన్నా ‘14’ చిత్రంతో ఎక్కువ పేరు రావాలి’’ అన్నారు. ‘‘వైవిద్యభరితమైన కథతో రూపొందిన చిత్రమిది. కొత్త పాయింట్‌ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు లక్ష్మి శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: సాయినాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కామిరెడ్డి బాబురెడ్డి. -
మరో నలుగురు కమిషనర్లకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకంపై తలెత్తిన వివాదంతో ఇప్పటికే నలుగురిపై వేటు వేసిన హైకోర్టు, మరో నలుగురు కమిషనర్లు మధుకర్‌రాజ్, ప్రభాకర్‌రెడ్డి, రతన్, విజయబాబులకు కూడా శుక్రవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అశుతోష్ మొహంతా, జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార కమిషనర్లుగా పైన పేర్కొన్న వారి నియామకం రాజ్యాంగానికి, సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని, వారి నియామకాన్ని కొట్టివేయాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు సి.జె.కరీరా, భార్గవి తదితరులు వేర్వేరుగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కమిషనర్ల నియామకంలో పారదర్శకత లోపించిందని, రాజకీయ కారణాలతోనే వీరి నియామకాలు జరిగాయని పిటిషనర్లు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.