Sanam Ratansi: 'సెంటర్‌ ఆఫ్‌ ద అట్రాక్షన్‌'గా పాపులర్‌.. | Sanam Ratansi Success Story Popular As Center Of The Attraction | Sakshi
Sakshi News home page

Sanam Ratansi: 'సెంటర్‌ ఆఫ్‌ ద అట్రాక్షన్‌'గా పాపులర్‌..

Jul 7 2024 1:55 AM | Updated on Jul 7 2024 1:55 AM

Sanam Ratansi Success Story Popular As Center Of The Attraction

సోనాక్షీ సిన్హా తన పెళ్లితో టాక్‌ ఆఫ్‌ ద సోషల్‌ మీడియా అయింది. అంతకుముందు నుంచే సనమ్‌ రతన్సీ సెంటర్‌ ఆఫ్‌ ద అట్రాక్షన్‌ అయింది సోనాక్షీ సిన్హా వెన్నంటే ఉంటూ! ఎందుకంటే సనమ్‌.. సోనాక్షీ పర్సనల్‌ స్టయిలిస్ట్‌! అంతేకాదు ఆమెకు సోనాక్షీతో మరో పర్సనల్‌ రిలేషన్‌ కూడా ఉంది. ఆమె.. సోనాక్షీ సిన్హా ఆడపడచు! ఇక్కడ మాత్రం సనమ్‌ పరిచయం స్టార్‌ స్టయిలిస్ట్‌గానే!

ఎడిటోరియల్‌ స్టయిలింగ్, సెలబ్రిటీ  స్టయిలింగ్‌ రెండూ వేటికవే ప్రత్యేకం. అయితే ఎడిటోరియల్‌ స్టయిలింగ్‌ కొంచెం కూల్‌. సెలబ్రిటీ స్టయిలింగ్‌ కాస్త స్ట్రెస్‌ఫుల్‌! కానీ చాలెంజింగ్‌గా ఉంటుంది. కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. నేను స్టయిలింగ్‌ చేసే సెలబ్రిటీల్లో నాకు అదితీ రావ్‌ హైదరీ అంటే ఇష్టం. నా పని మీద ఆమెకు నమ్మకం ఎక్కువ.

నేనేది చెప్పినా ఆమె లుక్స్‌ని ఎన్‌హాన్స్‌ చేయడానికే చెబుతానని ఆమెకు తెలుసు. అందుకే నేను ఏ కాస్ట్యూమ్‌ తెచ్చినా ట్రై చేస్తుంది. స్టయిలింగ్‌ రంగంలోకి రావాలనుకునే వారికి ఒకటే సలహా..  కొత్త కొత్త ట్రెండ్స్‌ని గమనిస్తూండాలి. మంచి స్టయిలిస్ట్‌ల దగ్గర ట్రైన్‌ అవ్వాలి. వాళ్ల వర్క్‌తో ఇన్‌స్పైర్‌ అవ్వాలి. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ప్రయోగాలకు వెనుకాడకూడదు! – సనమ్‌ రతన్సీ

సనమ్‌.. క్రియేటివ్‌ జీన్‌తో సంపన్న కుంటుంబంలో పుట్టిపెరిగింది. ఆమె తండ్రి.. ఇక్బాల్‌ రతన్‌సీ స్వర్ణకారుడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. క్రియేటివ్‌ జీన్‌ని తండ్రి నుంచే పొంది ఉంటుంది సనమ్‌. ఆమెకు ఊహ తెలిసేనాటికే ఫ్యాషన్‌ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్‌కి వెళ్లే వయసులోనే నిశ్చయించుకుంది పెద్దయ్యాక తను ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని! అనుకున్నట్టుగానే ఫ్యాషన్‌ రంగంలోనే గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. చదువయ్యాక ఫ్యాషన్‌ మ్యాగజైన్స్‌లో పనిచేసింది.

ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్‌ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్‌గా పాపులర్‌ అయిన అనాయితా ష్రాఫ్‌ని కలసింది. ఆమెతో సంభాషణ సనమ్‌లో స్టయిలింగ్‌ పట్ల ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేసింది. అప్పుడు అనాయితా ఒక బ్రాండ్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌ కోసం దీపికా పదుకోణ్‌కి స్టయిలింగ్‌ చేస్తోంది. ఆ షూటింగ్‌ విరామంలోనే అనాయితాను సనమ్‌ కలసింది. స్టయిలింగ్‌ పట్ల సనమ్‌ చూపిస్తున్న ఉత్సుకతను గుర్తించిన అనాయితా ఆ షూటింగ్‌లో తన పనిని గమనించమని సనమ్‌కి చెప్పింది.

షూటింగ్‌ పూర్తయ్యాక అడిగింది ‘స్టిల్‌ ఆర్‌ యూ ఇంట్రెస్టెడ్‌ ఇన్‌ స్టయిలింగ్‌?’ అని! ‘ఎస్‌.. వెరీమచ్‌!’ అని బదులిచ్చింది సనమ్‌. ‘అయితే నా దగ్గర జాయినై పో.. రేపటి నుంచే వచ్చేసెయ్‌’ అంటూ తన కంపెనీ ‘స్టయిల్‌ సెల్‌’లో సనమ్‌కి జాబ్‌ కన్‌ఫర్మ్‌ చేసింది అనాయితా. తెల్లవారి నుంచే ‘రా–వన్‌’ షూటింగ్‌కి బయలుదేరింది సనమ్‌.. అనాయితాకు అసిస్టెంట్‌గా! ఆ సినిమా హీరో షారుఖ్‌ ఖాన్‌కి అనాయితా స్టయిలింగ్‌ చేస్తోందప్పుడు.

ఆ ప్రాజెక్ట్‌ తర్వాత అవకాశాల కోసం వెదుక్కోవలసిన అవసరం లేకపోయింది సనమ్‌కి. ఇంకెవరి రికమండేషన్‌ పనీ పడలేదు. సెలబ్రిటీ ఇండివిడ్యువల్‌ పర్సనాలిటీని హైలైట్‌ చేసే ఆమె వర్క్‌ స్టయిల్‌ ఎంతోమంది స్టార్స్‌కి నచ్చింది. సైఫ్‌ అలీ ఖాన్, అదితీ రావ్‌ హైదరీ, హుమా ఖురేషీ, రాజ్‌కుమార్‌ రావు, మనీషా కోయిరాలా, జహీర్‌ ఇక్బాల్, అలయా ఎఫ్, రియా చక్రవర్తి, కత్రినా కైఫ్‌లాంటి వాళ్లెందరో కోరి మరీ సనమ్‌ను తమ పర్సనల్‌ స్టయిలిస్ట్‌గా అపాయింట్‌ చేసుకున్నారు. ఫితూర్, ద గర్ల్‌ ఆన్‌ ద ట్రైన్, మలాల్‌ వంటి సినిమాలకూ పనిచేసింది. తన కీర్తిని పెంచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement