ప్రధాన వార్తలు

మన వాణిని బలంగా వినిపిద్దాం... ప్రజలను చైతన్యపరుద్దాం: సజ్జల
తాడేపల్లి: బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమానికి జిల్లా, నియోజవర్గ, మండల స్థాయి నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో కూడా సక్సెస్ చేద్దామని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు(ఆదివారం, జూలై 27) వైఎస్సార్సీపీ నగర, మున్సిపల్ క్లస్టర్, మండల పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల,. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆగష్టు నెలాఖరికల్లా గ్రామస్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తిచేయాలి. మండల స్ధాయి నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలి. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పనిచేసి వైఎస్సార్సీపీని బలోపేతం చేద్దాం’ అని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. సజ్జల ఏమన్నారంటే..బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం మండల స్ధాయిలో కూడా గ్రాండ్ సక్సెస్ అయింది, ఇప్పుడు గ్రామాల్లోకి వెళుతున్నాం. మన నాయకుడు జగన్ తన పాలనలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలుచేసి, చక్కటి పాలన అందించారు, కానీ కూటమి ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సాగిస్తుంది. మనం ప్రజల పక్షాన నిలుచున్నాం, ప్రజల్లో వైఎస్సార్సీపీ అంటే ఒక నమ్మకం, భరోసా కల్పించాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది, జగన్ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ క్షేత్రస్ధాయిలోకి వెళుతున్నారు. వారి ఫేక్ న్యూస్‌ను బలంగా తిప్పికొడదాంమండల స్ధాయి నుంచి గ్రామస్ధాయిలోకి మనం వెళుతున్నాం కాబట్టి మనం క్రియాశీలకంగా ఉండాలి. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలి, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ మన వాణిని బలంగా వినిపిద్దాం. ప్రజలను చైతన్యపరుద్దాం. కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ఫేక్‌న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. దానిని బలంగా తిప్పికొడదాం.మండల స్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణంలో అవసరమైతే మరింత మందిని నియమించుకునే వెసులుబాటు కల్పించాం, మండల పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలి. నిర్ణీత కాలపరిమితిలోగా గ్రామాల్లో కూడా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పూర్తికావాలి. మన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. నియోజకవర్గ సమన్వయకర్తలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మండల, గ్రామ స్ధాయిలో ఉన్న సీనియర్ నాయకులను పరిశీలకులుగా నియమించుకుని గ్రామ కమిటీల నియామకం చేపట్టాలి. టాస్క్‌ఫోర్స్‌లాగా పనిచేసి పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాలి. మండల స్ధాయిలో 22 అనుబంధ విభాగాలు ఉంటాయి, ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ నుంచి మండల స్ధాయి కమిటీలలో ప్రాతినిద్యం ఉండాలి. ఈ కార్యక్రమం ప్రతీ గడపకూ వెళ్లాలి..గ్రామస్దాయిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ప్రతి గడపకూ వెళ్ళాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం ఉంటుంది. గ్రామమంతా ప్రజల్లో చైతన్యం వచ్చేలా మన కార్యక్రమం ఉండాలి. ఆగష్టు నెలాఖరికల్లా గ్రామ కమిటీల నియామకాలు పూర్తవ్వాలని జగన్ చెప్పారు. కాబట్టి మనం దీనిపై సీరియస్‌గా దృష్టిపెడదాం. అంకితభావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ నియమావళికి లోబడి పార్టీ నిర్మాణంలో కష్టపడి పనిచేసేవారిని గుర్తించి తగిన విధంగా పదవులు ఇవ్వడం జరుగుతుంది. బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలిియోజకవర్గ ఇంఛార్జ్ బలోపేతం అయినప్పుడే పార్టీ బలపడుతుంది. గ్రామ స్ధాయి నుంచి మండల స్ధాయి తర్వాత నియోజకవర్గ స్ధాయిలో వేలాదిమంది వైఎస్సార్సీపీ సైన్యం సిద్దమవుతారు. అప్పుడు ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా వేలాదిమందితో మన గొంతు వినిపించినవారు మవుతాం. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇచ్చే సమాచారం ప్రతి ఒక్కరికీ చేరాలి, సాంకేతికతపై అవగాహాన ఉన్న ఉత్సాహవంతులైన యువతీ యువకులను వినియోగించుకుని మన నెట్వర్క్ పెంచుకుందాం. డేటా బిల్డింగ్, ప్రొఫైలింగ్ చేయగలిగితే లక్షలాదిమందికి మన సందేశం, సమాచారం క్షణాల్లో చేరుకుంటుంది. బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలి. పరిశీలకులు దీనిపై దృష్టిపెట్టాలి.మన నాయకుడు జగన్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువద్దాంకూటమి ప్రభుత్వ తప్పుడు కేసులకు ఎవరూ ఆందోళన చెందవద్దు, పార్టీ అండగా ఉంటుంది. అత్యంత కీలకమైన దశలో ఉన్నాం, మనం కమిటీలను పటిష్టంగా నియమించుకుంటే నియోజకవర్గంలో మన పార్టీ అంత బలపడుతుంది. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పార్టీ నిర్మాణం కోసం పనిచేసి మన నాయకుడు జగన్ , మన వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకువద్దాం’ అని సజ్జల స్పష్టం చేశారు.

టీసీఎస్.. భారీగా లే ఆఫ్స్.. ఎవరిపై ప్రభావమంటే..!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) భారీ లే ఆఫ్స్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు కారణంగా భారీ తొలగింపునకు టీసీఎస్ సన్నద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా టీసీఎస్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగాల్లో 2 శాతం లే ఆఫ్స్ కు సిద్ధమైన విషయాన్ని కంపెనీ ఆదివారం స్పష్టం చేసింది. అంటే 12వేలకు పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోనన్నారు. ఇది మధ్యస్థంగా ఉన్న ఉద్యోగులతో పాటు సీనియర్ స్థాయిల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కె కృతివాసన్ స్పష్టం చేశారు. అయితే ఉద్యోగుల్ని తొలగించడం తమకు కూడా బాధగానే ఉందని, కాకపోతే మారిన టెక్నాలజీతో తొలగింపులు తప్పడం లేదన్నారు.కొత్త టెక్నాలజీల పరంగా చూస్తే ముఖ్యంగా ఏఐ ఆపరేటింగ్ మోడల్ మార్పులను గుర్తిస్తున్నాం. పని చేసే విధానాలూ మారుతున్నాయి. అందుకే భవిష్యత్తుకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము ఏఐని ఉపయోగిస్తూ కావాల్సిన నైపుణ్యాలను మెరుగుపరిచే పనిలో ఉన్నాం. మా కంపెనీ విస్తరణ అవకాశాలను మెరుగుపరిచేందుకు ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టాం. కానీ, పలు విభాగాల్లో వృద్ధి కనిపించడం లేదు. దాంతో లే ఆఫ్స్ తప్పడం లేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మా ఉద్యోగుల్లో సుమారు 2 శాతం మందిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మధ్యస్థ, సీనియర్ స్థాయుల్లో ఉండే ఉద్యోగులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నిర్ణయం అనుకున్నంత ఈజీ కాదు. సీఈఓగా నేను తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో ఇదొకటి’ అని కృతివాసన్ తెలిపారు.

‘సృష్టి’ మాయ.. 90వేలకు కొనుగోలు చేసి.. 40లక్షలకు శిశువు అమ్మకం
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐవీఎఫ్ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆదివారం(జులై 27) మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగోతాలను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ డీసీపీ రష్మీ పెరుమాళ్ బయట పెట్టారు. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై కేసు నమోదైంది. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతాను సోనియా దంపతులు కలిశారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను విశాఖకు పంపారు. ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదు.. సరోగసితో అవుతుందని చెప్పారు.సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని చెప్పారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రత రూ.30లక్షలు డిమాండ్ చేశారు. రూ.15లక్షల చెక్కు,రూ.15లక్షలు బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్. మెడికల్ టెస్టుల కోసం రూ.66వేలు తీసుకున్నారు. విజయవాడ వెళ్లి శాంపిల్స్ ఇచ్చారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారు.ఢిల్లీకి చెందిన గర్భిణీని విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారు. ఢిల్లీలో డీఎన్ఏ టెస్ట్ చేయించారు. మరొకరి డీఎన్ఏ అని తేలింది. డాక్టర నమ్రత జాబితాలో చాలామంది డేటా ఉంది. బిడ్డను ఇచ్చినందుకు ఢిల్లీ మహిళకు రూ.90వేలు ఇచ్చారు. దంపతుల వద్ద మొత్తం రూ.40లక్షలు వసూలు చేశారు. బాధిత కుటుంబం మమ్మల్ని కలిశారు. వెంటనే మేము సోదాలు చేశాము. నమ్రత కొడుకు జయంత్ కృష్ణ అడ్వకేట్‌గా పని చేస్తూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై ఏదైనా కేసులు వస్తే తనే వాదించేవారు. వైజాగ్‌లోనూ సరోగసి ద్వారా అనేక గర్భధారణలు చేశారు నమ్రత.హైద్రాబాద్‌లో ఉన్న ఒక మహిళకు రూ.89వేలు ఇచ్చి ఫ్లైట్‌లో వైజాగ్ తీసుకెళ్లి అక్కడ సర్జరీ అయ్యాక పాపని వాళ్లకు అప్పగించి మళ్ళీ హైదరాబాద్‌కు పంపించారు. పేదలకు డబ్బు ఆశ చూపించి సరోగసీకి ఒప్పిస్తున్నారు నమ్రత. నమ్రతకు సంబంధించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లైసెన్సులు కాన్సిల్ చేశాం.ఆమె లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశాం. డాక్టర్ నమ్రతపై ఆంధ్రప్రదేశ్,తెలంగాణలలో 10కి పైగా కేసులు నమోదయ్యాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కథాకమామిషు ఏంటంటే?పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాలుడి ఆరోగ్యంపై అనుమానంతో దంపతులు డీఎన్ఏ టెస్టు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారు రెజిమెంటల్ బజార్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ వెంకటితో పాటు క్లూస్ టీం, వైద్య బృందాలు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టాడు. అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డీఎన్ఏ టెస్టులు చేయించగా.. ఆ దంపతుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా.. డాక్టర్ నమ్రత హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్‌బీలోని టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైంది.

వీరోచితంగా పోరాడుతున్న సుందర్, జడేజా.. దిగ్గజాల సరసన చేరిన వెటరన్ ఆల్‌రౌండర్
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడుతున్నాడు. జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు అజేయమైన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. తద్వారా బ్యాటింగ్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి సరసన చేరాడు.ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లుసచిన్ టెండూల్కర్ - 30 ఇన్నింగ్స్‌లలో 1575 పరుగులురాహుల్ ద్రవిడ్ - 23 ఇన్నింగ్స్‌లలో 1376 పరుగులుసునీల్ గవాస్కర్ - 28 ఇన్నింగ్స్‌లలో 1152 పరుగులుకేఎల్ రాహుల్ - 26 ఇన్నింగ్స్‌లలో 1125 పరుగులువిరాట్ కోహ్లీ - 33 ఇన్నింగ్స్‌లలో 1096 పరుగులురిషబ్ పంత్ - 24 ఇన్నింగ్స్‌లలో 1035 పరుగులురవీంద్ర జడేజా - 31 ఇన్నింగ్స్‌లలో 1016* పరుగులుమ్యాచ్ విషయానికొస్తే.. ఆట చివరి రోజు టీమిండియా ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడుతున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయమైన 100 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. సుందర్ 58, జడ్డూ 53 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.టీ విరామం సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్ స్కోర్ 322/4గా ఉంది. ప్రస్తుతం భారత్ 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించాలంటే భారత్ మరో రెండున్నర గంటల్లోపు ఆలౌట్ కాకుండా చూసుకోవాలి.311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్.. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గిల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించారు. అనంతరం రాహుల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ అద్భుతమైన బంతితో రాహుల్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు.రాహుల్ ఔటయ్యాక చాలా జాగ్రత్తగా ఆడిన గిల్ ఈ సిరీస్‌లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా (222 పరుగుల వద్ద) వెనుదిరిగాడు. ఇవాళ భారత్ తొలి సెషన్లోనే ఓవర్‌నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో సుందర్, జడేజా భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. స్కోర్ వివరాలు..భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143)

మీకు దండం పెడతా.. దయచేసి కూర్చోండి..!
ముంబై: అది ఇండిగో విమానం.. ముంబై నుంచి వారణాసి వెళ్లాల్సిన ప్రయాణికులంతా తమ తమ సీట్లలో కూర్చొని ఉన్నారు. అయితే టేకాఫ్‌కు ముందు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ విమానం రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. ఈ మధ్యలో చోటు చేసుకున్న రభస అంతా ఇంతా కాదు. సీట్లలో కూర్చొన్న ప్రయాణికలు ఒక్కొక్కరిగా తమ నిరసనను ఉధృతం చేశారు. తొలుత కొంత ఓపిక పట్టిన ప్రయాణికులు.. ఆపై తమ సహనం కోల్పోయారు. విమానం ఎప్పుడు బయల్దేరుతుందో చెప్పాలంటూ విమాన సిబ్బందిపై ప్రశ్నలు వర్షం కురిపించారు. అయితే విమానం లోపల ఉన్న ఎయిర్ హోస్టస్ వద్ద కచ్చితమైన సమాధానం లేకపోవడంతో ప్రయాణికుల్ని బ్రతిమాలుకున్నారు. ప్లీజ్.. మీకు చేతులెత్తి దండం పెడతా.. దయచేసి ఎవరి సీట్లలో వారు కూర్చోండి’ అంటూ ఒక ఎయిర్ హోస్టెస్ ఓ ప్రయాణికుడ్ని బ్రతిమాలుతున్న వీడియో వైరల్‌గా మారింది. విమానంలోని ఈ రగడ జరిగే సమయంలో ఎవరో వీడియో తీసి పోస్ట్ చేస్తే అది వైరల్‌గా మారింది. ఇదంతా శనివారం(జూలై 26) రాత్రి ముంబై నుంచి వారణాసి బయల్దేరే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి గం. 9. 45 ని.లకు బయల్దేరాల్సిన విమానం.. టేకాఫ్ కావడానికి సుమారు రెండు గంటలు ఆలస్యమైంది. ఆ విమానం రాత్రి గం. 11.40 ని.లకు టేకాఫ్ అయ్యింది.

మన్సాదేవీ ఆలయంలో తొక్కిసలాట.. ఫేక్ వార్త ప్రచారమే కారణం!
Manasa Devi Temple Stampede.. డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. హరిద్వార్ మన్సాదేవీ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదం కారణంగా ఆరుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల ప్రకారం.. హరిద్వార్‌లోని మన్సాదేవి ఆలయం వద్ద ఆదివారం ఉదయం అపశ్రుతి చోటు చేసుకుంది. శ్రావణమాసం, ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జులై 23వ తేదీన మాస శివరాత్రి జలాభిషేకం తర్వాత, లక్షలాది మంది కన్వర్ యాత్రికులు, సామాన్య ప్రజలు ఇప్పటికే హరిద్వార్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో అక్కడి చేరుకోవడంతో.. ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. हरिद्वार के मनसा देवी मंदिर में भगदड़, 6 लोगों की मौत◆ भगदड़ में 25 से 30 लोग घायल◆ बताया जा रहा है कि ये हादसा सीढ़ियों में करंट उतरने की वजह से हुआ #MansaDeviMandir | Mansa Devi Mandir | #MansaDeviTemple pic.twitter.com/V1pLALBwJC— News24 (@news24tvchannel) July 27, 2025 తొక్కిసలాట ఘటనపై డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (డీఎం) మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ "విద్యుత్ తీగ తెగిపోయిందనే పుకారును ఎవరో వ్యాప్తి చేశారని ఫోటోలు, వీడియోల ద్వారా తెలిసింది. గాయపడిన వారు, మృతులు విద్యుత్ షాక్‌కు గురైనట్టు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ పుకారును ఎవరు వ్యాప్తి చేశారనే దానిపై దర్యాప్తు చేస్తాం. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాం. సీసీటీవీ కెమెరాలు, ఇతర మార్గాలను పరిశీలిస్తాం. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు" అని తెలిపారు.మరోవైపు.. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రగాఢ సానుభూతి తెలిపారు. "హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయ మార్గంలో జరిగిన తొక్కిసలాట బాధాకరం. స్థానిక పోలీసులు, ఇతర సహాయక బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక యంత్రాంగంతో నిరంతరం సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నాను. భక్తుల భద్రత కోసం మాతృదేవతను ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.ఇక, శివాలిక్ కొండలపై 500 అడుగుల ఎత్తులో ఉన్న మానసాదేవి ఆలయం, హరిద్వార్‌లోని పంచ తీర్థాలలో ఒకటి. ఇది పాముల దేవత మా మానసా దేవి ఆలయం, పురాతన సిద్ధపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.#WATCH | Haridwar, Uttarakhand | The injured are being rushed to the hospital following a stampede at the Mansa Devi temple. 6 people died and several others got injured in the stampede. pic.twitter.com/ScUaYyq2Z3— ANI (@ANI) July 27, 2025

కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక మన కష్టాలు తీరుతాయి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక కష్టాలు పోతాయని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ మాట్లాడారు. ‘తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక మన కష్టాలు తీరుతాయి. పలు పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్.. బీజేపీలో కలుస్తుందని ఏదోదో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎక్కడికి పోదు.. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటది. ఎవ్వరితో కలిసే కర్మ మనకు లేదు. ప్రభుత్వాన్ని నడపడానికి లంకెబిందేలు, గళ్ల పెట్టెలో పైసలు కాదు..దమ్ముండాలి. ప్రభుత్వాన్ని నడిపెటోడు మొగోడైతే.. నడిపేటోనికి దమ్ముంటే పనైతది.కరోనా సమయంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు నడిపిన మొగోడు కేసీఆర్’ అని అన్నారు.

కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్
ఆ రంగు, లుక్స్ చూసి ఫ్యూచర్ హీరో అనుకున్నారు. కొన్ని సినిమాలతోనే చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. అంతలోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి విలనిజం కూడా చేయగలనని హింటిచ్చాడు. సినిమాలకే ఎందుకు పరిమితం కావాలనుకున్నాడో ఏమో కానీ బుల్లితెరపైనా తళుక్కుమని మెరిశాడు. రెండుచోట్లా గుర్తింపు సంపాదించుకున్న ఆయన 25 ఏళ్లుగా కనిపించకుండా పోయాడు. అతడే బాలీవుడ్ నటుడు రాజ్ కిరణ్..అగ్రతారగా ఎదుగుతాడనుకునేలోపే..రాజ్ కిరణ్ (Actor Raj Kiran).. 1975లో 'కాగజ్ కీ నవో' చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు. రిషి కపూర్, గోవింద, అనిల్ కపూర్, శ్రీదేవి, రేఖ, హేమమాలిని వంటి పలువురు అగ్రతారలతో కలిసి పనిచేశాడు. బషీర, కర్జ్, అర్థ్, తేరి మెహర్బనియన్, మజ్దూర్, ఘర్ ఏక్ మందిర్.. వంటి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు! వాకిట్లో ఎప్పుడూ విజయాలే సిద్ధంగా ఉంటాయా? మొదట్లో ఎంతో సక్సెస్ చూసిన రాజ్‌కిరణ్ తర్వాత ఫ్లాపుల్ని కూడా చూశాడు. కొన్ని సినిమాలైతే అర్ధాంతరంగా ఆగిపోయేవి. అంతా ఓకే అయ్యాక, షూటింగ్ కూడా మొదలుపెట్టాక అటకెక్కేవి. ఇలా తన కెరీర్ కిందకుపడిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. డిప్రెషన్‌కు వెళ్లిపోయాడు. 25 ఏళ్లుగా మిస్సింగ్దీంతో 2000వ సంవత్సరంలో మానసిక ఆరోగ్య కేంద్రంలో చేరినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేశ్ భట్ కూడా అతడిని చూసేందుకు పలుమార్లు వెళ్లొచ్చాడంటుంటారు. కానీ తర్వాత రాజ్‌కిరణ్ కనిపించకుండా పోయాడు. అతడి గురించి ఇంటిసభ్యులు వెతకని చోటంటూ లేదు. రిషికపూర్, దీప్తి నావల్.. సిటీ అంతా జల్లెడ పట్టారు. రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలయయ్యాయి. అయినా అతడి జాడలేదు. 25 ఏళ్లుగా అతడు కనిపించకపోవడం అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.పిచ్చి ఆస్పత్రి నుంచి..నటుడి మిస్సింగ్ గురించి ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ముంబైలోని బైకుల్లా పిచ్చి ఆస్పత్రిలో రాజ్‌కిరణ్ ఉండేవాడని, అక్కడినుంచి సడన్‌గా మాయమైపోడని అంటుంటారు. కొందరేమో అట్లాంటాలోని పిచ్చాసుపత్రిలో ఉన్నాడంటారు. మరికొందరేమో న్యూయార్క్‌లో టాక్సీ డ్రైవ్ చేస్తూ కనిపించాడని చెప్తుంటారు. 2000వ సంవత్సరంలో రాజ్ కిరణ్ అదృశ్యమయ్యేనాటికి అతడి భార్య రూప, కూతురు రిషిక ఉన్నారు.ఎప్పటికైనా తిరిగొస్తాడని..తండ్రి ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండుంటాడని, ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది కూతురు రిషిక మహతని. తన తండ్రి అట్లాంటాలో పిచ్చాసుపత్రిలో ఉన్నాడన్న ప్రచారాన్ని సైతం ఖండించింది. పోలీసులు, డిటెక్టివ్‌ల సాయంతో తండ్రిని వెతికిస్తున్నామంది. అయినా ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. ఏళ్లు గడుస్తున్నా భర్త తిరిగిరాకపోవడంతో రూప రెండో పెళ్లి చేసుకుందని సమచారం.మాట నిలబెట్టుకోలేకపోయిన నటిరాజ్కిరణ్ కోసం సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, నటి సోమి అలీ కూడా తెగ వెతికింది. నీ క్లోజ్ ఫ్రెండ్ ఎక్కడుతన్నా వెతికి తీసుకొస్తాను అని రిషి కపూర్‌కు మాటిచ్చింది. 20 ఏళ్లపాటు వెతికినా ఫలితం లేకపోయింది. అసలు రాజ్ కిరణ్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకు కనిపించకుండా పోయాడు? ప్రస్తుతం బతికే ఉన్నాడా? లేదా? అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.చదవండి: శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్

అందుకే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామన్నారు: బండి సంజయ్
కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీని నడిపే స్థితిలో లేరని, ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ను నడిపే స్థితిలో లేకే బీజేపీలో విలీనం చేస్తామన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 27) కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం రమేశ్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.‘సిరిసిల్ల టికెట్‌ను మొదట కేటీఆర్‌కు ఇవ్వకపోతే, టికెట్ ఇప్పించాలని సీఎం రమేశ్‌ని కలిశారు. కేటీఆర్‌కు సీఎం రమేశ్ టికెట్ ఇప్పించారు.. ఆర్థికసాయం కూడా చేశారు. సీఎం రమేశ్ సవాల్‌పై కేటీఆర్ చర్చకు సిద్ధమా?’ అని ప్రశ్నించారు బండి సంజయ్. విలీనం, వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. కాగా, దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిదికి రూ. 1,137 కోట్ల అమృత కాంట్రాక్ట్ ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. . రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం..దౌర్భాగ్యపు దందా మరొకటి ఉండదు. ఎక్కడా లేని ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం రూ.1,660 కోట్ల కాంట్రాక్టు విడ్డూరం’అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్.. సీఎం రమేశ్ సవాల్‌కు కేటీఆర్ సిద్ధంగా ఉంటే, తాను తీసుకు వస్తానన్నారు. అదంతా అవాస్తవం: సీఎం రమేశ్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో తాను కుమ్మకై కాంట్రాక్ట్ పొందాననేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ ప్రశ్నించిన అంశాలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే సీఎం రమేశ్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేటీఆర్‌కు తన సోదరితో ఉన్న ఇంటిపోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కేటీఆర్ మాట్లాడింది గుర్తుందా అని ప్రశ్నించారు. కావాలంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీని మీడియాకు పంపిస్తానన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి బయటపడకుండా, తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలోకి బీఆర్ఎస్ను కలపడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పిన మాటలు గుర్తులేవా అని నిలదీశారు.

శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్
శ్రావణమాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అంటూ ఎక్కువగా దైవారాధానలోనే మునిగిపోతారు. ఆధ్యాత్మికబాటలో నడుస్తున్నానని చెప్పిన హీరోయిన్ తనుశ్రీ దత్తా (Tanushree Dutta) కూడా శ్రావణ ఉపవాసం చేస్తోంది. కానీ మాంసాహారం తింటోంది. అదేంటో మీరే చదివేయండి..చంపడానికి ప్రయత్నాలుసినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తనుశ్రీ దత్తా ఇటీవల కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో షేర్ చేసింది. నటుడు నానాపటేకర్.. తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడంది. తన మనుషులతో రాత్రిపూట ఇంటి బయట శబ్దాలు చేస్తూ భయపెడుతున్నారంది. బాలీవుడ్ మాఫియా చాలా పెద్దదని, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లాగే తననూ చంపడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఇంటర్వ్యూల కోసం ఆమెను చాలామంది సంప్రదించారు. రోజంతా ఉపవాసం.. రాత్రవగానే..దానికామె కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక జీవనశైలికి అలవాటు పడ్డానని, అందుకే మీడియా ముందుకు రావడం లేదని పేర్కొంది. కట్ చేస్తే.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రావణమాసం సందర్భంగా మటన్ తింటున్నట్లు తెలిపింది. కొట్టు నుంచి తెచ్చుకున్న మటన్‌ను చూపిస్తూ.. రోజంతా తినకుండా ఉన్నానని, రాత్రి 7 గంటలకు మటన్ తిని ఉపవాసం పూర్తి చేశానంది. "ఎవరైనా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా టార్చర్ చేస్తుంటే మీరు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. మటన్ వండుకుని తిన్నాఎందుకంటే ఆహారమే అసలైన మెడిసిన్. శ్రావణమాసం కావడంతో రాత్రి ఏడు గంటల వరకు ఉపవాసమున్నాను. ఆ తర్వాత అధిక పోషకాలున్న పప్పు, మటన్ వండుకుని డిన్నర్ చేశాను. ఉపవాసాలు మరీ కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్లుగా వారు దాన్ని మార్చుకోవచ్చు. నాకైతే ఇలాంటి ఉపవాసమే బాగా పనిచేస్తుంది" అని చెప్పుఒకచ్చింది. అందుకే లావైపోతున్నావ్శ్రావణంలో మటన్ తినడమేమో కానీ ఏకంగా ఉపవాసం రోజు మటన్ తినడమేంటని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఓ వ్యక్తి అయితే నువ్వు కొవ్వు ఎక్కువగా తింటున్నావు, అందుకే లావవుతున్నావు అని కామెంట్ చేశాడు. దానికి తనుశ్రీ స్పందిస్తూ.. ముందుగా నా శరీరం గురించి కామెంట్ చేసేందుకు నీకు ఎటువంటి అర్హత లేదు. రెండోది.. బక్కపల్చగా లేనేమోకానీ ఫిట్‌గానే ఉన్నాను. ఎటువంటి డ్రెస్ వేసుకున్నా అందంగానే కనిపిస్తాను. కాబట్టి బొద్దుగా, అందంగా ఉండేవాళ్లను బాడీషేమింగ్ చేయడం ఆపండి. కొవ్వు మంచిదే!ప్రతి ఒక్కరూ సన్నగా ఉండాలని కోరుకోరు. అయినా కాస్త కొవ్వు పదార్థాలు తిన్నంతమాత్రాన శరీరంలో కొవ్వు చేరదు. ఆరోగ్యకరమైన కొవ్వు తీసుకోవడం వల్ల సన్నగా కూడా అవుతారు. మన శరీరం బాగా పనిచేయడానికి హెల్తీ ఫ్యాట్స్ అవసరం అని చెప్పుకొచ్చింది. హిందీలో అనేక సినిమాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో వీరభద్ర మూవీలో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) చదవండి: పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య
చిక్కుల్లో టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి
మన వాణిని బలంగా వినిపిద్దాం... ప్రజలను చైతన్యపరుద్దాం: సజ్జల
క్రైమ్ థ్రిల్లర్‌గా వరుణ్ సందేశ్ మూవీ.. గ్రాండ్‌గా ప్రారంభం!
ఇన్‌స్టా ప్రియుడి కోసం..బిడ్డను బస్‌స్టాండ్‌లో వదిలేసిన తల్లి.. ఆపై
ఓటీటీలోకి తెలంగాణ ప్రేమకథ.. ట్రైలర్ రిలీజ్
డివిలియర్స్ మహోగ్రరూపం.. మరో విధ్వంకసర శతకం.. ఈసారి 39 బంతుల్లోనే..!
టీసీఎస్.. భారీగా లే ఆఫ్స్.. ఎవరిపై ప్రభావమంటే..!
నిహారిక నైట్ పార్టీ.. ఆవుల శాలలో 'కల్కి' హీరోయిన్
మీకు దండం పెడతా.. దయచేసి కూర్చోండి..!
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. నిలబడిందా అద్భుతమే..!
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్‌కాట్ దెబ్బ
'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ
బేబీ బంప్‌తో తొలిసారి కనిపించిన మెగా కోడలు
విశ్వంభరకు బై బై
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్‌తో పార్టీ!
త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్..
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
పుట్టబోయే బిడ్డ కోసం మెగా జంట షాపింగ్
సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
వేలాది లేఆఫ్‌లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో
విస్కీ ధరలు తగ్గింపు..?
భార్య భర్తలనగానే కలసి తినాలా? నువ్ కాసేపు ఆగి తినొచ్చుగా!!
పాడైన కాలేయానికి.. పునరుజ్జీవం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
చిక్కుల్లో టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి
మన వాణిని బలంగా వినిపిద్దాం... ప్రజలను చైతన్యపరుద్దాం: సజ్జల
క్రైమ్ థ్రిల్లర్‌గా వరుణ్ సందేశ్ మూవీ.. గ్రాండ్‌గా ప్రారంభం!
ఇన్‌స్టా ప్రియుడి కోసం..బిడ్డను బస్‌స్టాండ్‌లో వదిలేసిన తల్లి.. ఆపై
ఓటీటీలోకి తెలంగాణ ప్రేమకథ.. ట్రైలర్ రిలీజ్
డివిలియర్స్ మహోగ్రరూపం.. మరో విధ్వంకసర శతకం.. ఈసారి 39 బంతుల్లోనే..!
టీసీఎస్.. భారీగా లే ఆఫ్స్.. ఎవరిపై ప్రభావమంటే..!
నిహారిక నైట్ పార్టీ.. ఆవుల శాలలో 'కల్కి' హీరోయిన్
మీకు దండం పెడతా.. దయచేసి కూర్చోండి..!
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. నిలబడిందా అద్భుతమే..!
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్‌కాట్ దెబ్బ
'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ
బేబీ బంప్‌తో తొలిసారి కనిపించిన మెగా కోడలు
విశ్వంభరకు బై బై
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్‌తో పార్టీ!
'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్..
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
పుట్టబోయే బిడ్డ కోసం మెగా జంట షాపింగ్
సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
వేలాది లేఆఫ్‌లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో
విస్కీ ధరలు తగ్గింపు..?
'నేను చేసిన తప్పు మీరు చేయకండి.. నాలుగేళ్లలో 750 ఇంజెక్షన్లు'
భార్య భర్తలనగానే కలసి తినాలా? నువ్ కాసేపు ఆగి తినొచ్చుగా!!
పాడైన కాలేయానికి.. పునరుజ్జీవం
సినిమా

'కింగ్డమ్' కోసం కొత్త విలన్.. ఇతడెవరో తెలుసా?
గత కొన్నేళ్ల నుంచి పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అంటే ఒక భాషలో తీసిన సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇతర భాషలకు చెందిన నటీనటులు.. తెలుగు ఇండస్ట్రీలోకి బోలెడంత మంది వస్తూనే ఉన్నారు. తాజాగా 'కింగ్డమ్' మూవీతో మలయాళం నుంచి మరో యువ నటుడు టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్లో హైలైట్ అవ్వడంతోనే ఈ డిస్కషన్ వచ్చింది. ఇంతకీ ఎవరితడు?'కింగ్డమ్' మూవీ అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్లో శ్రీలంకలో జరిగే స్టోరీతో తెరకెక్కుతోంది. ట్రైలర్‌తోనే కథేంటి అనేది ఓ క్లారిటీ ఇచ్చేశారు. అయితే విజయ్ దేవరకొండ, సత్యదేవ్‌తో పాటు విలన్‌గా కనిపించిన ఓ నటుడు కూడా హైలైట్ అయ్యాడు. అతడి పేరు వెంకటేశ్ వీపీ. ట్రైలర్లో రెండు షాట్స్‌లోనే కనిపించాడు. ఇతడెవరా అని చూస్తే మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు అని తెలిసింది. 2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు.(ఇదీ చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మధుప్రియ)వెంకటేశ్.. మలయాళంలో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేశాడు. ఒడియన్, వెలిపాడింటే పుస్తకం, తట్టుంపురత్ అచ్యుతన్ తదితర మూవీస్‌లో కనిపించాడు. తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన 'రెబల్' చిత్రంలో విలన్‌గా చేశాడు. ఈ మూవీతోనే 'కింగ్డమ్' ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే టాలీవుడ్‌కి మరో కొత్త విలన్ దొరికాడేమో అనిపిస్తుంది.మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. అనిరుధ్ సంగీతమందించగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉందని ఇదివరకే ప్రకటించారు. కాకపోతే తొలి భాగం ఫలితం బట్టి అది ఆధారపడి ఉంటుందేమో?(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీ సినిమా రివ్యూ)

కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్
ఆ రంగు, లుక్స్ చూసి ఫ్యూచర్ హీరో అనుకున్నారు. కొన్ని సినిమాలతోనే చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. అంతలోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి విలనిజం కూడా చేయగలనని హింటిచ్చాడు. సినిమాలకే ఎందుకు పరిమితం కావాలనుకున్నాడో ఏమో కానీ బుల్లితెరపైనా తళుక్కుమని మెరిశాడు. రెండుచోట్లా గుర్తింపు సంపాదించుకున్న ఆయన 25 ఏళ్లుగా కనిపించకుండా పోయాడు. అతడే బాలీవుడ్ నటుడు రాజ్ కిరణ్..అగ్రతారగా ఎదుగుతాడనుకునేలోపే..రాజ్ కిరణ్ (Actor Raj Kiran).. 1975లో 'కాగజ్ కీ నవో' చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు. రిషి కపూర్, గోవింద, అనిల్ కపూర్, శ్రీదేవి, రేఖ, హేమమాలిని వంటి పలువురు అగ్రతారలతో కలిసి పనిచేశాడు. బషీర, కర్జ్, అర్థ్, తేరి మెహర్బనియన్, మజ్దూర్, ఘర్ ఏక్ మందిర్.. వంటి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు! వాకిట్లో ఎప్పుడూ విజయాలే సిద్ధంగా ఉంటాయా? మొదట్లో ఎంతో సక్సెస్ చూసిన రాజ్‌కిరణ్ తర్వాత ఫ్లాపుల్ని కూడా చూశాడు. కొన్ని సినిమాలైతే అర్ధాంతరంగా ఆగిపోయేవి. అంతా ఓకే అయ్యాక, షూటింగ్ కూడా మొదలుపెట్టాక అటకెక్కేవి. ఇలా తన కెరీర్ కిందకుపడిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. డిప్రెషన్‌కు వెళ్లిపోయాడు. 25 ఏళ్లుగా మిస్సింగ్దీంతో 2000వ సంవత్సరంలో మానసిక ఆరోగ్య కేంద్రంలో చేరినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేశ్ భట్ కూడా అతడిని చూసేందుకు పలుమార్లు వెళ్లొచ్చాడంటుంటారు. కానీ తర్వాత రాజ్‌కిరణ్ కనిపించకుండా పోయాడు. అతడి గురించి ఇంటిసభ్యులు వెతకని చోటంటూ లేదు. రిషికపూర్, దీప్తి నావల్.. సిటీ అంతా జల్లెడ పట్టారు. రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలయయ్యాయి. అయినా అతడి జాడలేదు. 25 ఏళ్లుగా అతడు కనిపించకపోవడం అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.పిచ్చి ఆస్పత్రి నుంచి..నటుడి మిస్సింగ్ గురించి ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ముంబైలోని బైకుల్లా పిచ్చి ఆస్పత్రిలో రాజ్‌కిరణ్ ఉండేవాడని, అక్కడినుంచి సడన్‌గా మాయమైపోడని అంటుంటారు. కొందరేమో అట్లాంటాలోని పిచ్చాసుపత్రిలో ఉన్నాడంటారు. మరికొందరేమో న్యూయార్క్‌లో టాక్సీ డ్రైవ్ చేస్తూ కనిపించాడని చెప్తుంటారు. 2000వ సంవత్సరంలో రాజ్ కిరణ్ అదృశ్యమయ్యేనాటికి అతడి భార్య రూప, కూతురు రిషిక ఉన్నారు.ఎప్పటికైనా తిరిగొస్తాడని..తండ్రి ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండుంటాడని, ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది కూతురు రిషిక మహతని. తన తండ్రి అట్లాంటాలో పిచ్చాసుపత్రిలో ఉన్నాడన్న ప్రచారాన్ని సైతం ఖండించింది. పోలీసులు, డిటెక్టివ్‌ల సాయంతో తండ్రిని వెతికిస్తున్నామంది. అయినా ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. ఏళ్లు గడుస్తున్నా భర్త తిరిగిరాకపోవడంతో రూప రెండో పెళ్లి చేసుకుందని సమచారం.మాట నిలబెట్టుకోలేకపోయిన నటిరాజ్కిరణ్ కోసం సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, నటి సోమి అలీ కూడా తెగ వెతికింది. నీ క్లోజ్ ఫ్రెండ్ ఎక్కడుతన్నా వెతికి తీసుకొస్తాను అని రిషి కపూర్‌కు మాటిచ్చింది. 20 ఏళ్లపాటు వెతికినా ఫలితం లేకపోయింది. అసలు రాజ్ కిరణ్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకు కనిపించకుండా పోయాడు? ప్రస్తుతం బతికే ఉన్నాడా? లేదా? అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.చదవండి: శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్

OTT: 2025లో ఎక్కువ మంది చూసిన హిందీ వెబ్ సిరీస్, షోస్ లివే..!
2025లో ఇప్పటివరకు బాలీవుడ్ బాక్సాఫీస్ పెద్దగా సందడి చేయలేకపోయింది. అయితే ఇంటింటి థియేటర్‌గా అవతరించిన ఓటీటీ రంగం మాత్రం వరుస హిట్లు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న సిరీస్‌లతో జోరుగా సాగుతోంది. విశేషం ఏమిటంటే గొప్ప హైప్ ఉత్సాహంతో దూసుకొచ్చిన అనేక సిరీస్‌లు విఫలమైతే, తక్కువ మధ్యస్థపు అంచనాలతో వచ్చిన పలు షోలు వాటి ఆకర్షణీయమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకర్షించాయి. అటువంటివాటిలో కొన్ని...బ్లాక్ వారెంట్... వావ్ కంటెంట్...ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన్ బ్లాక్ వారెంట్ ఈ సంవత్సరం ఇప్పటివరకు విడుదలైన అత్యంత ఉత్కంఠభరితమైన షోలలో ఒకటిగా నిలిచింది. ఈ క్రై మ్ థ్రిల్లర్ ఇప్పటివరకు లైమ్‌లైట్‌లోనే ఉంది. ఈ సిరీస్‌లో జహాన్ కపూర్, రాహుల్ భట్ తదితరులు తమ అద్భుతమైన నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు.పాతాళ్‌లోక్...సూపర్ క్లిక్జైదీప్, అహ్లవత్ ప్రముఖ పాత్రల్లో నటించిన పాతాల్ లోక్ సీజన్ 2 కూడా మంచి విజయం సాధించింది. ప్రైమ్ వీడియో అందిస్తున్న ఈ సంవత్సరపు మరో హిట్ థ్రిల్లర్ గా నిలిచింది. హై ప్రొఫైల్ హత్య కేసు దర్యాప్తు అనుకోని రీతిలో అనేక ఇతర రహస్యాలను వెలుగులోకి తీసుకురావడాన్ని ఈ సిరీస్ ప్రదర్శిస్తుంది.రియలిస్టిక్ షేడ్స్‌తో...బ్లాక్ వైట్ అండ్ గ్రే.. లవ్కిల్స్నిజజీవిత సంఘటనల ఆధారంగా అంటూ నమ్మించేలా రూపొందిన బ్లాక్, వైట్ గ్రే కూడా ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సోనీలివ్ లో అందుబాటులో ఉన్న ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ప్రతీ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. హై–ప్రొఫైల్ వ్యక్తుల వరుస హత్యల నేపధ్యంలో ఇది నిజమైన సంఘటనల ఆధారంగా దీనిని పుష్కర్ సునీల్ మహాబల్, హేమల్ ఎ ఠక్కర్ లు రూపొందించారు.సైకలాజికల్ థ్రిల్...ఖాఫ్...ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఖాఫ్ కూడా సక్సెస్ జోరు కొనసాగిస్తోంది. గత ఏప్రిల్ నెలలో విడుదలైన ఈ సిరీస్‌లో... మోనికా పన్వర్, రజత్ కపూర్ ప్రముఖ పాత్రల్లో నటించిన ఖౌఫ్ భయానక శైలి కారణంగా చాలా సంచలనం సృష్టించింది, ప్రేక్షకులపై భారీ ప్రభావాన్ని చూపింది.ఈ ఓటీటీ షోలను అసాధారణంగా చేసింది దీర్ఘకాలం పాటు కొనసాగే ట్విస్టులతో కథ చెప్పడం, ఏదేమైనా భారతీయ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థ్రిల్లర్ల వైపు పూర్తిగా మొగ్గుతున్నారు మరోవైపు ఈ షోలు 2025లో బాలీవుడ్ బాక్సాఫీస్ కంటే ఓటీటీని రంగాన్ని సక్సెస్‌ఫుల్‌గా మార్చాయి ఈ ఏడాదిలో ఇదే విధంగా తన పైచేయిని కొనసాగిస్తుందా?చూడాలి.

కింగ్డమ్పై రష్మిక ట్వీట్.. ముద్దు పేరేంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ!
గతేడాది పుష్ప-2తో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఈ ఏడాది కూడా ఛావా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసింది. వరుస సినిమాలతో రష్మిక దూసుకెళ్తోంది. ఇటీవలే కుబేరా మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే ఆమె నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీలో కనిపించనుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే శ్రీవల్లికి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్‌పై చాలాసార్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్‌తో జంటగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మరోసారి ఈ జంట డేటింగ్ గురించి చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలోనే రష్మిక.. విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కింగ్డమ్ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ పోస్ట్ చేయగా.. ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ఆ రోజు విజయ్ దేవరకొండ ఫైర్ చూడాలని ఉందంటూ పోస్ట్ చేసింది. గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్, విజయ్ దేవరకొండతో పాటు ముగ్గురు జీనియస్‌లు కలిసి సృష్టించిన చిత్రం కోసం ఎంతో ఆసక్తిగదా ఎదురు చూస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన విజయ్ దేవరకొండ సైతం రష్మికకు రిప్లై ఇచ్చాడు. రస్సీలు అంటూ లవ్ సింబల్‌తో పాటు ఎంజాయ్ ది కింగ్డమ్ అని ట్వీట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.Rushhielu ❤️Enjoy this one - #Kingdom 🤗— Vijay Deverakonda (@TheDeverakonda) July 27, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

శుభ్‌మన్ గిల్ వీరోచిత శతకం.. దిగ్గజాల సరసన చోటు
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వీరోచితంగా పోరాడుతున్నాడు. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్.. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోగా.. గిల్.. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించాక, రాహుల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.రాహుల్ ఔటైనా ఏమాత్రం ఒత్తిడికి లోను కాని గిల్.. వాషింగ్టన్ సుందర్ (7) సాయంతో భారత్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో గిల్‌కు ఇది నాలుగో సెంచరీ. ఈ సెంచరీతో అతను దిగ్గజాల సరసన చేరాడు. ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీ చేసిన భారత ఆటగాడిగా, ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా డాన్ బ్రాడ్‌మన్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లితో కలిసి రికార్డును షేర్ చేసుకున్నాడు.ఓ టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు4 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1971 (విదేశాల్లో)4 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (స్వదేశంలో)4 - విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియా, 2014/15 (విదేశాల్లో)4 - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లండ్, 2025 (విదేశాల్లో)**కెప్టెన్‌గా ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు4 - సర్ డాన్ బ్రాడ్‌మన్ vs ఇండియా, 1947/48 (విదేశాల్లో)4 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (స్వదేశంలో)4 - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లాండ్, 2025 (విదేశాల్లో)**అలాగే ఓ టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున మూడో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా.. ఇంగ్లండ్‌లో, ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా, ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌గా పలు రికార్డులు సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్లు🏏శుభ్‌మన్ గిల్ (ఇండియా)- 720*- 2025లో- అత్యుత్తమ స్కోరు 269🏏మొహమ్మద్ యూసఫ్ (పాకిస్తాన్)- 631- 2006లో- అత్యుత్తమ స్కోరు 202🏏రాహుల్ ద్రవిడ్ (ఇండియా)- 602- 2002లో- అత్యుత్తమ స్కోరు 217🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593- 2018లో- అత్యుత్తమ స్కోరు 149🏏సునిల్ గావస్కర్ (ఇండియా)- 542- 1979లో- అత్యుత్తమ స్కోరు 221.ఓ టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు774 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1971 (బయట)732 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (హోం)720* - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లండ్, 2025 (బయట)712 - యశస్వి జైస్వాల్ vs ఇంగ్లండ్, 2024 (హోం)ఈ సెంచరీతో గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. వీరిద్దరు డబ్ల్యూటీసీ చరిత్రలో తలో 9 సెంచరీలు చేశారు.25 ఏళ్ల వయసులో గిల్‌కు ఇది 18వ సెంచరీ. టెస్ట్‌ల్లో 9, వన్డేల్లో 8, టీ20ల్లో ఓ సెంచరీ చేశాడు. ఈ వయసులో సచిన్ 40, విరాట్ 26 సెంచరీలు చేశారు.మాంచెస్టర్‌లో 35 ఏళ్ల తర్వాత సెంచరీ చేసిన భారత ఆటగాడిగా గిల్ రికార్డు నెలకొల్పాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ సెంచరీ పూర్తి చేసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 105 పరుగులు వెనుకపడి ఉంది. గిల్‌కు జతగా వాషింగ్టన్ సుందర్ (7) క్రీజ్‌లోకి వచ్చాడు.స్కోర్ వివరాలు..భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143)

చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో 700 పరుగుల మార్కును తాకిన తొలి ఆసియా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో గిల్ ఈ ఫీట్‌ను సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ ఈ సిరీస్‌లో 700 పరుగులు పూర్తి చేసుకున్నాడు.గతంలో ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో 700 పరుగుల మైలురాయిని ఏ ఆసియా బ్యాటర్ తాకలేదు. గిల్‌కు ముందు పాకిస్తాన్ బ్యాటర్ మొహమ్మద్ యూసఫ్ అత్యధికంగా 631 పరుగులు (2006 పర్యటనలో) సాధించాడు.ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్లు🏏శుభ్‌మన్ గిల్ (ఇండియా)- 700*- 2025లో- అత్యుత్తమ స్కోరు 269🏏మొహమ్మద్ యూసఫ్ (పాకిస్తాన్)- 631- 2006లో- అత్యుత్తమ స్కోరు 202🏏రాహుల్ ద్రవిడ్ (ఇండియా)- 602- 2002లో- అత్యుత్తమ స్కోరు 217🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593- 2018లో- అత్యుత్తమ స్కోరు 149🏏సునిల్ గావస్కర్ (ఇండియా)- 542- 1979లో- అత్యుత్తమ స్కోరు 221.ఓవరాల్‌గా ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. బ్రాడ్‌మన్ 1930 ఇంగ్లండ్ పర్యటనలో 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 974 పరుగులు చేశాడు. బ్రాడ్‌మన్ తర్వాత ఇంగ్లండ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు (విదేశీ ఆటగాళ్లు) మార్క్ టేలర్ (839), వివ్ రిచర్డ్స్ (829), స్టీవ్ స్మిత్ (774), బ్రియాన్ లారా (765) పేరిట ఉంది.నాలుగో బ్యాటర్ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో 700 పరుగుల మార్కును తాకిన గిల్ భారత్ తరఫున ఓ టెస్ట్ సిరీస్‌లో ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.భారత్ తరఫున ఓ టెస్ట్ సిరీస్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లు774 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1971 (బయట)732 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (హోం)712 - యశస్వి జైస్వాల్ vs ఇంగ్లండ్, 2024 (హోం)701* - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లండ్, 2025 (బయట)మ్యాచ్ విషయానికొస్తే.. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా పోరాడుతోంది. తొలి ఓవర్లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయి భారత్‌ను శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 188 పరుగులు జోడించారు.ఆదిలోనే షాక్ అయితే చివరి రోజు భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ 90, వాషింగ్టన్ సుందర్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ స్కోర్ 193/3గా ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 118 పరుగులు వెనుకపడి ఉంది.స్కోర్ వివరాలు..భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143)

కౌంటీ క్రికెట్లో భీకర ఫామ్.. కెప్టెన్‌గా ఎంపికైన తిలక్ వర్మ
టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ దులీప్ ట్రోఫీ-2025 కోసం సౌత్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కేరళకు చెందిన మహ్మద్ అజహారుద్దీన్ నియమితుడయ్యాడు. దులీప్ ట్రోఫీ కోసం 16 మంది రెగ్యులర్ సభ్యులు, ఆరుగురు స్టాండ్ బై ప్లేయర్లతో కూడిన జట్టును నిన్న ఎంపిక చేశారు. ఈ జట్టులో తిలక్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ లాంటి ఐపీఎల్ స్టార్లు చోటు దక్కించుకున్నారు.ఈ సీజన్ దులీప్ ట్రోఫీ గతంలో జరిగిన జోనల్ విధానంలోనే (ఆరు జట్లు) జరుగనుంది. గత సీజన్లో ఈ టోర్నీని నాలుగు జట్లతో (ఇండియా ఏ, బి, సి, డి) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ దులీప్ ట్రోఫీ ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరుగనుంది.భీకర ఫామ్‌లో తిలక్సౌత్ జోన్ కెప్టెన్‌గా ఎంపికైన తిలక్ వర్మ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ మ్యాచ్‌ల్లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌తోనే హ్యాంప్‌షైర్ తరఫున కౌంటీ అరంగేట్రం చేసిన తిలక్.. తన తొలి మ్యాచ్‌లోనే అద్బుతమైన సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం వరుసగా 56, 47 పరుగులు చేసి, ఆతర్వాత మరో సెంచరీతో మెరిశాడు.అంతర్జాతీయ కమిట్మెంట్స్ కారణంగా గత రంజీ సీజన్లో హైదరాబాద్ జట్టుకు అందుబాటులో లేని తిలక్ ఈ దేశవాలీ సీజన్ ప్రారంభంలోనే సౌత్‌జోన్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ 2025 జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్) (హైదరాబాద్), మహ్మద్ అజహారుద్దీన్ (వైస్ కెప్టెన్) (కేరళ), తన్మయ్ అగర్వాల్ (హైదరాబాద్), దేవదత్ పడిక్కల్ (కర్ణాటక), మోహిత్ కాలే (పాండిచ్చేరి), సల్మాన్ నిజర్ (కేరళ), నారాయణ్ జగదీసన్ (తమిళనాడు), త్రిపురణ విజయ్ (ఆంధ్ర), ఆర్ సాయి కిషోర్ (తమిళనాడు), తనయ్ త్యాగరాజన్ (హైదరాబాద్), విజయ్‌కుమార్ వైషాక్ (కర్ణాటక), నిధీష్ ఎండి (కేరళ), రికీ భుయ్ (ఆంధ్ర), బాసిల్ ఎన్‌పి (కేరళ), గుర్జప్నీత్ సింగ్ (తమిళనాడు), స్నేహల్ కౌతాంకర్ (గోవా)స్టాండ్ బై ప్లేయర్లు: మోహిత్ రెడ్కర్ (గోవా), ఆర్ స్మరణ్ (కర్ణాటక), అంకిత్ శర్మ (పాండిచ్చేరి), ఈడెన్ యాపిల్ టామ్ (కేరళ), ఆండ్రీ సిద్దార్థ్ (తమిళనాడు), షేక్ రషీద్ (ఆంధ్ర).

కమ్రాన్ ఆక్మల్ సూపర్ సెంచరీ.. పాక్ వరుసగా మూడో విజయం
ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం లీడ్స్ వేదికగా వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ కమ్రాన్ ఆక్మల్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 43 ఏళ్ల ఆక్మల్ విండీస్ బౌలర్లను ఊతికారేశాడు.లీడ్స్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. 62 బంతులు ఎదుర్కొన్న ఆక్మల్.. 13 ఫోర్లు, 5 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. అతడితోపాటు హాఫీజ్(23) రాణించాడు. విండీస్ బౌలర్లలో మహ్మద్, పొలార్డ్, బ్రావో, నర్స్ తలా వికెట్ సాధించారు.అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. విండీస్ టాపర్డర్ మొత్తం విఫలమైంది. క్రిస్ గేల్(5),స్మిత్(3), సిమ్మన్స్(0) తీవ్ర నిరాశపరిచారు. అయితే మిడిలార్డర్లో వాల్టన్(42), పెర్కిన్స్(30) పోరాడనప్పటికి విండీస్‌కు ఓటమి తప్పలేదు. పాక్ బౌలర్లలో రీస్ మూడు వికెట్లు పడగొట్టగా.. తన్వీర్, యమీన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన పాక్.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.
బిజినెస్

యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రూ.2000 మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే యోచన ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో స్పష్టం చేసింది. రూ.2000 దాటిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఎలాంటి సిఫారసు చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ వర్షాకాల సమావేశాల్లో చెప్పారు.రూ.2000 మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, జీఎస్టీ రేట్లు, మినహాయింపులను కేంద్రం, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులతో కూడిన రాజ్యాంగ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా నిర్ణయిస్తామని సభకు తెలిపారు. యూపీఐ ట్రాన్సాక్షన్ డేటా ఆధారంగా కర్ణాటకలోని వ్యాపారులకు దాదాపు 6,000 జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందాయి.మరోవైపు యూపీఐ లావాదేవీలను మరింత లోతుగా స్క్రూటినీ చేస్తూ, వాటి ఆధారంగా జీఎస్టీని దూకుడుగా అమలు చేస్తే మొదటికే మోసం రావొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో హెచ్చరించింది. దీనివల్ల చిన్న వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలా జరగకుండా జీఎస్టీ అమలు విషయంలో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది.

రూ. 353 కోట్ల ఐపీవోకి హైదరాబాదీ సంస్థ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెఫ్రోప్లస్ బ్రాండ్ పేరిట డయాలసిస్ సేవలందించే హైదరాబాదీ సంస్థ నెఫ్రోకేర్ హెల్త్ సరీ్వసెస్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. దీని ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 353.4 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత షేర్హోల్డర్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో 1.27 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ ద్వారా నెఫ్రోప్లస్ రూ. 70.6 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ టూ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొదలైనవి కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నాయి. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 129.1 కోట్లను దేశీయంగా కొత్తగా డయాలసిస్ క్లినిక్‌లను ప్రారంభించేందుకు, రూ. 136 కోట్లను రుణాల చెల్లింపునకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది.2009లో ఏర్పాటైన నెఫ్రోప్లస్‌కి దేశవ్యాప్తంగా 269 నగరాల్లో 447 క్లినిక్‌లు ఉన్నాయి. ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్, నేపాల్‌తో పాటు ఇటీవలే సౌదీ అరేబియా ద్వారా మధ్యప్రాచ్య మార్కెట్లోకి కూడా విస్తరించింది. 2025 మార్చి 31 నాటికి కంపెనీ వద్ద 5,000 పైగా డయాలసిస్ మెషిన్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 755.8 కోట్ల ఆదాయం, రూ. 67 కోట్ల లాభం ఆర్జించింది.

ఈ బ్యాంకుల లాభాలు తగ్గాయ్..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం స్టాండెలోన్ ప్రాతిపదికన లాభం రూ. 3,282 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ. 3,520 కోట్లతో పోలిస్తే 7 శాతం క్షీణించింది. రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను తగ్గించడం, ఫీజు ఆదాయాల వృద్ధి నెమ్మదించడం, ప్రొవిజనింగ్ పెరగడం వంటి అంశాలు ఇందుకు కారణం.వార్షికంగా చూస్తే మొండిబాకీలకు ప్రొవిజనింగ్ 109 శాతం ఎగిసి రూ. 1,208 కోట్లకు చేరింది. ఇక నికర వడ్డీ ఆదాయం 6 శాతం పెరిగి రూ. 7,259 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 4.65 శాతంగా నమోదైంది. మరోవైపు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ లాభం స్వల్పంగా 1 శాతం వృద్ధితో రూ. 4,472 కోట్లకు చేరింది. జనరల్ ఇన్సూరెన్స్ విభాగం విక్రయానికి సంబంధించి రూ. 3,000 కోట్లు కూడా జత కావడంతో గత క్యూ1లో లాభం రూ. 7,448 కోట్లుగా నమోదైంది. తాజాగా నిర్వహణలోని మొత్తం ఆస్తుల పరిమాణం (ఏయూఎం) 18 శాతం పెరిగి రూ. 6,36,311 కోట్ల నుంచి రూ. 7,50,143 కోట్లకు పెరిగింది. స్థూల ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో రిటైల్ కమర్షియల్ వాహన రుణాల పోర్ట్‌ఫోలియోలో ఒత్తిడి నెలకొన్నట్లు బ్యాంకు తెలిపింది. స్వల్పంగా పెరిగిన మొండిబాకీలు .. సమీక్షాకాలంలో అసెట్ క్వాలిటీ స్వల్పంగా క్షీణించింది. స్థూల నిరర్థక ఆస్తుల పరిమాణం (జీఎన్‌పీఏ) 1.39 శాతం నుంచి 1.48 శాతానికి పెరిగింది. నికర ఎన్పీఏలు స్థిరంగా 0.34 శాతంగా నమోదయ్యాయి. అటు కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (కాసా) నిష్పత్తి 43.4 శాతం నుంచి 40.9 శాతానికి తగ్గింది. సగటున మొత్తం డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ. 4,35,603 కోట్ల నుంచి రూ. 4,91,998 కోట్లకు, రుణాలు 14 శాతం పెరిగి రూ. 4,44,823 కోట్లకు చేరాయి. కరెంట్ డిపాజిట్లు 9 శాతం పెరిగి రూ. 62,200 కోట్ల నుంచి రూ. 67,809 కోట్లకు, సేవింగ్స్ డిపాజిట్లు 2 శాతం వృద్ధితో రూ. 1,22,105 కోట్ల నుంచి రూ. 1,24,186 కోట్లకు, టర్మ్ డిపాజిట్లు రూ. 2,1,298 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ. 3,00,003 కోట్లకు చేరాయి. స్లిప్పేజీలు రూ. 1,318 కోట్ల నుంచి రూ. 1,812 కోట్లకు పెరిగాయి.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లాభం 32% డౌన్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ. 463 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ1లో నమోదైన రూ. 681 కోట్లతో పోలిస్తే ఏకంగా 32.07 శాతం క్షీణించింది. సమీక్షాకాలంలో అసెట్ క్వాలిటీ సైతం నెమ్మదించింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం 1.87 శాతం నుంచి 1.97 శాతానికి పెరిగింది. రూ. 4,433.5 కోట్ల నుంచి రూ. 4,867.5 కోట్లకు చేరింది. అలాగే నికర ఎన్పీఏలు శాతాలవారీగా 0.53 శాతం నుంచి 0.53 శాతానికి, రూ. 1,230 కోట్ల నుంచి రూ. 1,346 కోట్లకు పెరిగాయి. వడ్డీ ఆదాయం 5 శాతం అప్.. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం రూ. 4,695 కోట్ల నుంచి రూ. 4,933 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ త్రైమాసికాలవారీగా 24 బేసిస్ పాయింట్లు క్షీణించి 5.71 శాతం నుంచి 5.95 శాతానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్ల కోత ప్రభావం ఇందుకు కారణమని బ్యాంకు తెలిపింది. క్యూ1లో కస్టమర్ల డిపాజిట్లు 25.5 శాతం పెరిగినట్లు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వి. వైద్యనాథన్ తెలిపారు. అసెట్ క్వాలిటీ విషయానికొస్తే సూక్ష్మరుణాల విభాగం మినహా అన్ని వ్యాపారాలు మెరుగ్గా రాణించినట్లు వివరించారు. అర్హులైన రుణగ్రహీతలకు, రెపో రేట్ల తగ్గింపు ప్రయోజనాలను బదలాయించడం వల్ల మార్జిన్లు తగ్గినట్లు వైద్యనాథన్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి మార్జిన్లు మెరుగుపడొచ్చని వివరించారు.

ఆటో మొబైల్... ఎగుమతులు ఆకర్షణీయం
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ ఎగుమతులు జూన్ త్రైమాసికంలో ఆకర్షణీయంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 22 శాతం పెరిగాయి. మొత్తం 14,57,461 యూనిట్లు ఎగుమతి అయినట్టు ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 11,92,566 యూనిట్లుగా ఉన్నాయి. ప్రధానంగా ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర, వాణిజ్య వాహన ఎగుమతులు అధికంగా జరిగాయి. ప్యాసింజర్ వాహన ఎగుమతులు 2,04,330 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 1,80,483 యూనిట్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. మారుతి సుజుకీ 96,181 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను క్యూ1లో ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని ఎగుమతులు 69,962 యూనిట్ల కంటే 37 శాతం ఎక్కువ. గత నాలుగేళ్ల నుంచి ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో మారుతి సుజుకీ అగ్రస్థానంలో ఉంటున్నట్టు సంస్థ సీఈవో (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. క్యూ1లో తమ వాటా 47 శాతానికి చేరుకున్నట్టు చెప్పారు. మారుతి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా అత్యధికంగా 48,140 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 13 శాతం అధికం. ద్విచక్ర వాహన ఎగుమతులు 11,36,942 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో ద్విచక్ర వాహన ఎగుమతులు 9,23,148 యూనిట్ల కంటే 23 శాతం పెరిగాయి. వాణిజ్య వాహన ఎగుమతులు సైతం 23 శాతం పెరిగి 19,427 యనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహన అమ్మకాలు 34 శాతం పెరిగి 95,796 యూనిట్లకు చేరాయి.
ఫ్యామిలీ

నూరేళ్ల నమ్మకం
నమ్మకం, నిజాయితీ సహజీవనం చేసే చోటు ఆ చాయ్ దుకాణం. అది నిన్న మొన్నటి దుకాణం కాదు, వందేళ్ల నాటిది. దీనికి పెట్టుబడి నమ్మకం, రాబడి నిజాయితీ. ప్రపంచంలోనే అరుదైన లక్షణాలు ఉన్న ఆ చాయ్ దుకాణం పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరామ్‌పూర్ పట్టణంలో ఉంది. నరేశ్‌చంద్ర షోమ్ అనే స్వాతంత్య్ర సమరయోధుడు 1920లలో ఈ దుకాణాన్ని ప్రారంభించారు. ఈ చాయ్ దుకాణాన్ని ప్రారంభించడానికి కారణం లాభాపేక్ష కాదు, ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల చర్చలు, సమావేశాలకు ఒక కుదురైన వేదికగా ఉపయోగపడటానికి నరేశ్‌చంద్ర షోమ్ దీనిని ప్రారంభించారు. ఆయన ఏ ముహూర్తాన ఈ దుకాణాన్ని ప్రారంభించారో గాని, నేటి వరకు ఈ చాయ్ దుకాణం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. నేటికీ స్థానిక తేనీటిప్రియులకు అభిమాన ఆలవాలంగా నిలిచి ఉంది.స్వాతంత్య్ర పోరాట కాలంలో మిగిలిన సమరయోధుల మాదిరిగానే నరేశ్‌చంద్ర కూడా తరచు అరెస్టయి జైలుకు వెళుతుండేవారు. తాను అరెస్టయినప్పుడల్లా ఆయన ఈ దుకాణం బాధ్యతలను స్థానిక కస్టమర్లకే అప్పగించేవారు. వారు చాలా నమ్మకంగా టీ పెట్టుకుని తాగి, అందుకు తగిన డబ్బును అక్కడే ఉంచి వెళ్లేవారు. వారు తమ తర్వాత వచ్చే కస్టమర్లకు ఆ బాధ్యతను అప్పగించేవారు. ఇప్పటికీ ఈ దుకాణంలో ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. నరేశ్‌చంద్ర తదనంతరం ఆ భవన యజమాని ‘లఖీరాణి దఖీ’ అల్లుడు అశోక్ చక్రవర్తి ఈ దుకాణం బాధ్యతలు తీసుకున్నాడు. క్లరికల్ ఉద్యోగం చేస్తున్న ఆయన ఉదయాన్నే దుకాణం తెరిచి; దుకాణానికి కావాల్సిన పాలు, టీ పొడి, పంచదార వంటివి ఏర్పాటు చేసి ఉద్యోగానికి వెళ్లిపోతారు. ఇక సాయంత్రం విధుల నుంచి రాగానే మళ్లీ దుకాణానికి వచ్చి, మూసేంత వరకు ఉంటారు. మరి మధ్య కాలంలో దుకాణంలో సిబ్బంది ఎవరూ ఉండరు. ఆ సమయంలో కొందరు స్వచ్ఛందంగా ఈ టీ దుకాణాన్ని నడిపిస్తున్నారు. పదవీ విరమణ పొందిన వారు, ఈ టీ దుకాణంపై అభిమానం కలిగినవారు ఇలా చాలామంది ఈ దుకాణాన్ని నడిపిస్తున్నారు! ఆశిష్ బంధోపాధ్యాయ్ అనే పదవీ విరమణ పొందిన ఒక పెద్దాయన.. అశోక్ చక్రవర్తి లేని సమయంలో దుకాణంలో ఉంటారు. పాలు లేకపోయినా, పంచదార లేకపోయినా క్యాష్ కౌంటర్లో డబ్బు తీసి, బజారు నుంచి కొని తెచ్చి పెడతారు. ఆయన కూడా లేనప్పుడు, టీ తాగడానికి వెళ్లిన వారే టీ పెట్టుకుని కప్పుల్లో పోసుకుని, తాగి, వాటిని శుభ్రపరచి, డబ్బులు క్యాష్ కౌంటర్ దగ్గర వేసి వెళ్లిపోవచ్చు. ఇక్కడ కావాల్సినంత సమయం గడపొచ్చు. టీ తాగినవారంతా డబ్బు ఇస్తున్నారా లేదా అనే విషయం తెలియడానికి నిఘా నేత్రాలేమీ ఉండవు. ఇక్కడ రోజుకు సుమారు రెండు వందలకు పైగా టీలు అమ్ముడుపోతుంటాయి. ఈ దుకాణానికి ఎదురుగా ఛత్ర కాళీబాబు శ్మశానవాటిక ఉండటంతో అక్కడికి వచ్చేవారు సైతం ఇక్కడికి టీ తాగడానికి వస్తారు.ఒకవేళ డబ్బు లేకపోయినా ఇక్కడ టీ తాగి వెళ్లొచ్చు. అలా వెళ్లిన వాళ్లు మరోరోజు తాము ఇవ్వాల్సిన డబ్బుల్ని గుర్తుపెట్టుకుని మరీ తెచ్చి క్యాష్ కౌంటర్లో వేస్తారు. పైగా ఈ దుకాణానికి బోర్డ్ కూడా ఉండదు. చాలామంది ఛత్ర ఘాట్ ఎదురుగా ఉన్న టీ షాప్ అని పిలుస్తుంటారు.ఆశిష్ బంధోపాధ్యాయ్తో పాటు సుమారు పదిమంది స్నేహితులు ఒక బృందంగా ఉండి, అశోక్ చక్రవర్తి లేని సమయంలో వీలును బట్టి దుకాణం బాధ్యతలను పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ బ్లాక్ టీ, మసాలా టీ కూడా పెట్టుకోవచ్చు. అందుకు నిమ్మకాయలు, మసాలా పొడులు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే చాయ్‌లోకి బిస్కట్స్ కూడా లభిస్తాయి. ఇక సాయంత్రం అశోక్ చక్రవర్తి వచ్చి ఆ రోజు కలెక్షన్‌ను క్యాష్ కౌంటర్లో లెక్క చూసుకుని, మరునాటికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటారు. ఇలా సాగుతున్న దుకాణం స్థానికులకు గొప్ప కాలక్షేప కేంద్రం. ఈ చోటు మానసిక సంతోషానికి గొప్ప ప్రదేశం అంటుంటారు ఆశిష్. ఇక్కడికి చాయ్ తాగడానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఎన్నో ఏళ్లుగా వస్తున్నవాళ్లే! ఎవరిని కదిలించినా ఏదో ఒక అనుభూతిని పంచుకుంటారు. ‘నరేశ్చంద్రగారు ఉన్నప్పటి నుంచి వస్తుంటాను’ అని కొందరు; ‘మా నాన్నతో కలిసి ఇక్కడికి వచ్చేవాళ్లం’ అని ఇంకొందరు చెబుతుంటారు. కాని, ఈ రోజుల్లో కూడా ఒక వ్యాపార కేంద్రం ఎటువంటి నిఘా నేత్రాలు లేకుండా, ఏ ఒక్క సహాయకుడు లేకుండా కస్టమర్లతో కళకళలాడేలా నడిపించడం అబ్బురమే!

చినుకు చినుకుల జీవధార
ప్రకృతి సహజ పరిణామమైన రుతుచక్ర భ్రమణంలో ఏటా వర్షర్తువు వస్తుంది. వర్షాకాలం ఏటా రావడం తథ్యమే అయినా, వాన రాకడలో తరచుగా ముందు వెనుకలు జరుగుతుంటాయి. ‘వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు’ అని మనకో సామెత ఉంది. ఎప్పుడు కురుస్తాయో తెలియని వాన రాక కోసం ఒక్కో ఏడాది రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కో ఏడాది వానలు పుష్కలంగా కురుస్తుంటాయి. ఒక్కో చోట అనావృష్టి కరవు కాటకాలను సృష్టిస్తుంది. ఒక్కో చోట అతివృష్టి వరదలతో ముంచెత్తి పెనునష్టాన్ని కలిగిస్తుంది. వానలు తెచ్చిపెట్టే కష్టనష్టాలు ఎలా ఉన్నా, వానలు లేనిదే మనుగడ సాగించడం అసాధ్యం. ఈ భూమ్మీద మనుషులతో పాటు పశుపక్ష్యాదులు, చెట్లు చేమలు వంటి సమస్త జీవులు బతకాలంటే, వానలు కురవాల్సిందే!వానలే లేకుంటే మనం నివసించే ఈ భూమి కూడా మిగిలిన గ్రహాల మాదిరిగా జీవరహిత గోళంగానే మిగిలి ఉండేది. వానల వల్లనే భూమి మీద జీవజాలం ఏర్పడింది. వానల వల్లనే భూమి మీద నాగరికతలు ఏర్పడ్డాయి. తొలినాటి మానవులకు వాన ఒక ప్రకృతి అద్భుతం. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, చిటపట చినుకులతో మొదలై, క్రమంగా పుంజుకుని జడివానగా మారే దృశ్యం ఇప్పటికీ ఒక అద్భుతమే! నాగరికతలు ఏర్పడిన కాలం నుంచి వివిధ సంస్కృతులలో వర్షారాధన ఉండేది. వానాకాలంలో ప్రత్యేకంగా జరుపుకొనే పండుగలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రాచీన సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు వర్షవర్ణన కనిపిస్తుంది. వైదిక సాహిత్యంలోని ‘పర్జన్యసూక్తం’, ‘వరుణస్తుతి’ వంటివే కాకుండా, లౌకిక సాహిత్యంలోనూ కవులు మేఘవర్ణన, వర్షవర్ణన చేశారు.‘ఆనందదో వర్షతు మేఘ వృందఃఆనందదా జలధరా స్సంతతం భవంతుఆనందదోవుణ ఏష సదాస్తుమహ్యంఆనందినీ రోషధయో భవంతు’అని ‘వరుణస్తుతి’ వర్షానందాన్ని స్తుతించింది.‘విరిసెను మేఘ పరంపరమెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్పరచెను ఝంఝానిలములుకురిసెను వర్షము కుంభగుంభితరీతిన్’అంటూ మబ్బులతో మొదలై కుంభవృష్టిగా మారే వర్షదృశ్యాన్ని ఆవిష్కరించారు గుంటూరు శేషేంద్రశర్మ.నాగరికతలతో పాటు సంగీత సాహిత్యాది కళలను కూడా ప్రభావితం చేసిన ప్రకృతి పరిణామం వాన. వానలు లేనిచోట జీవం ఉండదు. జీవానికి తావులేని చోట మనుగడ ఉండదు. మనుగడ లేని చోట ఇక నాగరికతలెక్కడ? సంగీత సాహిత్యాది కళావైభవాలెక్కడ? భూమ్మీద వానలు కురిసే తావులతో పాటు అక్కడక్కడా చినుకు కురవని ఎడారులు కూడా ఉన్నాయి.ఇప్పటి ఎడారులు ఒకనాడు పచ్చని నేలలేనని, ప్రకృతి మార్పుల ఫలితంగానే అవి ఎడారులుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఆఫ్రికాలోని సహారా ఎడారి ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడేదని; ఒకప్పుడు అక్కడ జలకళతో అలరారే సరోవరాలు, నదులు ఉండేవని; వాటి ఒడ్డున పచ్చని సవన్నా గడ్డిభూములు ఉండేవని; ఆ గడ్డిభూముల్లో అనేక జంతువులు జీవించేవని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. వేలాది సంవత్సరాల పరిణామంలో భూకక్ష్యలో వచ్చిన మార్పుల వల్ల సహారా ప్రాంతంలో వానలు కురవడం ఆగిపోయి, పూర్తిగా ఎడారిగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో సహారా ఎడారిలో అక్కడక్కడా తాత్కాలికంగా పచ్చదనం కనిపిస్తోంది. ‘ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్’ ఉత్తర దిశవైపు కదిలినప్పుడు సహారా ఎడారిలో అక్కడక్కడా నాలుగు చినుకులు కురుస్తున్నాయి. ఆ చినుకుల వల్లనే ఈ ఎడారిలో తాత్కాలికంగా పచ్చదనం కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వర్షారాధన సంస్కృతిప్రాచీన నాగరికతలు విలసిల్లిన ప్రతిచోట వర్షారాధన సంస్కృతి ఉంది. అన్ని నాగరికతలలోనూ వర్షాలకు అధిదేవతలు ఉన్నారు. భారత ఉపఖండంలో వైదికార్యులు ఇంద్రుడిని, వరుణుడిని వర్షాధిదేవతలుగా కొలిచేవారు. మన పురాణాల్లో ఇంద్ర వరుణుల ప్రస్తావన కనిపిస్తుంది. ప్రాచీన గ్రీకు ప్రజలు వర్షాల కోసం జూస్ అనే వర్షాధిదేవుడిని, హైయడీస్ అనే అప్సరసలను ఆరాధించేవారు. వర్షాల కోసం ప్రాచీన రోమన్లు దేవతలకు రాజైన జూపిటర్ను, సముద్రాధిదేవత అయిన నెప్ట్యూన్‌ను పూజించేవారు. ప్రాచీన ఈజిప్షియన్ ప్రజలు టెఫ్నట్ అనే వర్షదేవతను ఆరాధించేవారు. సుమేరియన్ నాగరికతలోని ప్రజలు ఇష్కుర్ అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు.ఇష్కుర్కు ‘అదాద్’ అనే మరోపేరు కూడా ఉన్నట్లు అకాడియన్ పురాణాల కథనం. మధ్య అమెరికాలోని మాయన్ నాగరికత ప్రజలు చాక్ అనే వర్షాధిదేవుడిని పూజించేవారు. ఉత్తర అమెరికాలో మూలవాసులైన నవాజో ప్రజలు టొనీనిలీ అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు. దక్షిణ అమెరికాలో పురాతన మూయిస్కా మతస్థులు వర్షాల కోసం చిబ్చాకూమ్ అనే దేవుడిని పూజించేవారు. ప్రాచీన చైనీస్ ప్రజలు యుషి అనే వానదేవుడిని పూజించేవారు. జపాన్‌లోని షింటో మతస్థులు కురాఒకామి అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు. ఆస్ట్రేలియాలోని మూలవాసులు వాంజినా అనే వర్షాధిదేవతను పూజించేవారు. వానల కోసం దేవుళ్లను, దేవతలను పూజించడం, వారి ప్రీతి కోసం రకరకాల నైవేద్యాలు సమర్పించడం, పండుగలు జరుపుకోవడం పురాతన కాలం నుంచే ఉంది. చాలాచోట్ల ఇప్పటికీ వానల కోసం ప్రత్యేకంగా పూజలు జరపడం, వేడుకలు జరపడం వంటి ఆచారాలు కొనసాగుతున్నాయి.మన వానాకాలం పండుగలుమన దేశంలో వానాకాలంలో వచ్చే పండుగలు ఎన్నో ఉన్నాయి. కొన్ని పండుగలను దేశవ్యాప్తంగా జరుపుకొంటే, మరికొన్నింటిని వేర్వేరు ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల ప్రజలు జరుపుకొంటారు. వానాకాలంలో వచ్చే జగన్నాథ రథయాత్ర, కృష్ణాష్టమి, వినాయకచవితి పండుగలను దాదాపు దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. అలాగే, తెలంగాణలో బోనాల పండుగ, కేరళలో ఓనం పండుగ, తమిళనాడులో ఆదిపెరుక్కు తదితర పండుగలు జరుపుకొంటారు. ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తీజ్, లద్దాఖ్‌లో హెమిస్ సెచు, మేఘాలయలో భేడియేంఖ్లామ్, గోవాలో సావో జొవావో వంటి పండుగలను జరుపుకొంటారు. ఇవేకాకుండా, దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో శాకాంబరి పూజలు జరుపుతారు.అత్యధిక వర్షపాతంప్రపంచంలో కొన్నిచోట్ల దాదాపు ప్రతి ఏడాది అధిక వర్షాలు కురుస్తుంటాయి. ఇంకొన్ని చోట్ల అరుదుగా అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. మేఘాలయలోని మౌసిన్రామ్ గ్రామంలో 11,872 మిల్లీ మీటర్ల వార్షిక వర్షపాతం నమోదవడంతో ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఒకే సంవత్సరంలో అత్యధిక వర్షపాతం రికార్డు కూడా మౌసిన్రామ్ గ్రామానికే దక్కడం విశేషం. ఈ గ్రామంలో 1985 సంవత్సరంలో ఏకంగా 26,471 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఫ్రెంచ్ ప్రభుత్వం అధీనంలోని రీయూనియన్ దీవిలోని ఫోక్ ఫోక్ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అత్య«ధిక వర్షపాతం నమోదైంది. హిందూ మహాసముద్రంలో మడగాస్కర్కు తూర్పున ఉన్న రీయూనియన్ దీవిలో సముద్రమట్టానికి 2,990 మీటర్ల ఎత్తులో ఉండే ఫోక్ ఫోక్ ప్రాంతంలో 1966 జనవరి 7–8 తేదీల నడుమ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా 1870 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.వానాకాలం వెతలుసెగలు రేపే వేసవి తర్వాత వచ్చే వర్షాలు కొంత హర్షాన్ని తెచ్చినా, తెరిపిలేని వానలు వరుసగా వెతలను కూడా మోసుకొస్తాయి. మన దేశంలోని పరిస్థితులనే చూసుకుంటే, వానలు కురిస్తే చాలు నగరాలు, పట్టణాల్లోని రహదారులన్నీ జలమయంగా మారుతాయి. మురుగునీటి ప్రవాహంతో నిండిన రోడ్లపై వాహనాల రాకపోకలకు అడుగడుగునా అవరోధాలు ఏర్పడతాయి. ఒక్కోసారి రోజుల తరబడి ముసురు విడిచిపెట్టని పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు రోజువారీ కూలీలు ఉపాధి దొరకక ఇబ్బంది పడతారు. జలమయమైన రోడ్ల మీదుగా రాకపోకలు సాగించడానికి ఉద్యోగులు, విద్యార్థులు నానా ఇక్కట్లు పడతారు. అధిక వర్షాలు కురిసినప్పుడు నదుల్లో వరద పోటెత్తి, నదీ తీరాలలో ఉండేవారికి ప్రాణనష్టం, ఆస్తినష్టం వంటి తీవ్రనష్టాలు వాటిల్లుతాయి.వానాకాలంలో వీథులు, ఇళ్ల పరిసరాలన్నీ బురదమయంగా మారడంతో రకరకాల వ్యాధులు విజృంభిస్తాయి. పలుచోట్ల చిట్లిన మంచినీటి పైపులైన్లలోకి మురుగునీరు ప్రవేశించడంతో నీరు కలుషితమై, కలరా, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు పెరుగుతాయి. మురుగునీరు నిలిచిపోవడంతో ఈ కాలంలో దోమల బెడద పెరిగి, వాటి వల్ల వచ్చే డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు సోకుతాయి. వాతావరణంలో తేమకు తోడు కాలుష్యం పెరగడం వల్ల జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు ఎక్కువవుతాయి. వానాకాలంలో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతుంటాయి.చాలా చోట్ల వీ«థుల్లోనే తినుబండారాలు అమ్మే దుకాణాలు, టీ షాపులు ఉంటాయి. వానాకాలంలో వీటి చుట్టూ మురుగునీరు, బురద చేరి ఉంటుంది. ఈగలు, దోమలు ముసురుతూ ఉంటాయి. పరిసరాలు అంత దారుణంగా ఉన్నా, ఉపాధి కోసం ఆ చిరువ్యాపారులు వ్యాపారాలు సాగిస్తుంటారు. అలాంటి చోట్ల తినుబండారాలు తినేవారికి వానాకాలంలో జీర్ణకోశ సమస్యలు, పరిసరాల శుభ్రత లోపించడం వల్ల రకరకాల అంటువ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువవుతాయి.వర్షాలు అతిగా కురిస్తే రైతులకు పంటనష్టం తప్పదు. పొలాల్లో నీరు నిలిచిపోయి, నాట్లు వేసే సమయంలో అతిగా వర్షాలు కురిస్తే, సజావుగా పెరగాల్సిన మొక్కలు కుళ్లిపోతాయి. పంట చేతికి వచ్చే సమయంలో అతిగా వర్షాలు వస్తే, రైతులకు శ్రమ దండగై, పంటనష్టం జరుగుతుంది.వానాకాలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంటుంది. దీనివల్ల జనాల రోజువారీ పనులు దెబ్బతింటాయి. వ్యాపార లావాదేవీలకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. గాలి వానల ధాటికి ఒక్కోసారి స్తంభాల నుంచి విద్యుత్ తీగలు నేల మీదకు పడి ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి.చినుకు కురవని నేలప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఆఫ్రికాలో ఉంది. మన దేశంలో థార్ ఎడారి ఉంది. ఈ ఎడారులు ఇసుక మేటలతో పొడి పొడిగా ఉంటాయి. వీటిలో అరుదుగా కనిపించే ఒయాసిస్సుల్లో మాత్రమే కాస్త నీటిజాడ కనిపిస్తుంది. ఇలాంటి ఎడారుల్లో కూడా అతి అరుదుగా కొద్దిపాటి చినుకులు కురుస్తుంటాయి. అయితే, ఈ భూమ్మీద చినుకు కురవని నేల ఏదైనా ఉందా అంటే, అది చిలీలోని అటకామా ఎడారి మాత్రమే! అటకామా ఎడారిలోని పలు ప్రదేశాల్లో చరిత్రలో ఏనాడూ చినుకు కురిసిన దాఖలాల్లేవు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రదేశంగా రికార్డులకెక్కింది.వర్షాధార దేశాలుభూమధ్య రేఖకు ఉత్తర, దక్షిణ దిశలలోని కర్కాటక, మకర రేఖల నడుమనున్న చాలా దేశాలకు, వాటికి కాస్త అటు ఇటుగా ఉన్న దేశాలకు వర్షాలే ఆధారం. భారత్, చైనా సహా అత్యధిక జనాభా కలిగిన పలు దేశాలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏటా వర్షాకాలం వస్తుంది. అలాగని, ప్రతి ఏడాది ఒకేలా వర్షాలు కురుస్తాయనే భరోసా ఉండదు. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు ఈ దేశాలు చక్కని పంట దిగుబడులతో కళకళలాడతాయి. తగినంత వానలు కురవనప్పుడు కరవు కాటకాలతో అల్లాడిపోతాయి. వానలు మితిమీరి కురిసినప్పుడు వరదలు ముంచెత్తి, పంటనష్టమే కాకుండా, ఆస్తినష్టం, ప్రాణనష్టాన్ని కూడా చవిచూస్తాయి. వరదలు ముంచెత్తకుండా పలుచోట్ల ఆనకట్టలు కడుతున్నా, అనావృష్టిని ఎదుర్కోవడానికి వీలుగా నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు కడుతున్నా ఈ ప్రాంతాలకు తరచుగా అతివృష్టి, అనావృష్టి బాధలు తప్పడం లేదు.భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణాలలో ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఏటా రుతుపవనాలు వస్తాయి. రుతుపవనాల రాకతో ఈ ప్రాంతాల్లో వానాకాలం మొదలవుతుంది. పశ్చిమ, దక్షిణ ఆఫ్రికా దేశాల్లోను; ఉత్తర అమెరికా, ఆసియా దేశాలతో పాటు యూరోప్ దేశాలలో ఏటా జూన్ నెలాఖరులోగా వానాకాలం మొదలవుతుంది. దక్షిణార్ధగోళంలోని ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలలో సెప్టెంబర్ నుంచి వానాకాలం మొదలవుతుంది. వానాకాలంలోనే సముద్రంలో అల్పపీడనాలు, తుఫానులు వంటివి ఏర్పడుతుంటాయి. తుఫానుల వంటి ప్రకృతి విపత్తుల వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో ఒక్కోసారి అపారనష్టం వాటిల్లుతూ ఉంటుంది. వర్షాధార దేశాలకు తఫాను ముప్పు వెన్నంటే ఉన్నా, వర్షాలు లేకుండా ఈ దేశాలు మనుగడ సాగించలేవు. ఇటీవలి కాలంలో పెరిగిన వాతావరణ కాలుష్యం, అడవుల నరికివేత వంటి చర్యల వల్ల అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తరచుగా తలెత్తుతున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటేనే సకాల వర్షాలు సజావుగా కురుస్తాయి. మానవాళికి హర్షాతిరేకాన్ని తీసుకొస్తాయి.వానాకాలం జాగ్రత్తలువానాకాలంలో పుష్కలంగా వానలు కురవడం వల్ల నదులు, జలాశయాలు నీటితో నిండుతాయి. అయితే, వానాకాలంలో నీటితోనే జాగ్రత్తగా ఉండాలి. వానల ఉద్ధృతి వల్ల చెరువులు, బావుల్లో మురికి నీరు పైకి తేలుతుంది. చిట్లిన మంచినీటి పైపులైన్ల ద్వారా మురుగునీరు తాగునీటిలోకి చేరే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వానాకాలంలో నీటిని బాగా వడగట్టి, కాచి, చల్లార్చి తాగడం మంచిది. వానాకాలంలో నీటి పట్ల జాగ్రత్తలు తీసుకునేటట్లయితే చాలా వ్యాధుల నుంచి ముప్పు తప్పించుకోవచ్చు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వానాకాలంలో వాతావరణ కాలుష్యం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు వంటి ఇబ్బందులను తప్పించుకోవడం కష్టం. కాలంలో మార్పుల వల్ల వచ్చే ఇలాంటి సామాన్యమైన ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్–సి వంటి పోషకాలు ఉండే పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి.వానాకాలం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కాలంలో వీలైనంత వరకు తాజా ఆహారాన్ని తీసుకోవడమే మంచిది. పరిశుభ్రమైన ఆహారం, ఇంట్లో వండుకున్న పదార్థాలు మాత్రమే తినడం అలవాటు చేసుకుంటే, వానాకాలంలో వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ కాలంలో ఆరుబయట విక్రయించే తినుబండారాలను తినడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.వాన కురిసే సూచన ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పకుండా గొడుగు లేదా రెయిన్‌కోటు వెంట తీసుకువెళ్లడం క్షేమం. నీరు నిండిన రోడ్లపై నడవడానికి అనువైన వాటర్‌ప్రూఫ్ చెప్పులు ధరించడం మంచిది. అనుకోకుండా తోవలో ఎక్కడైనా వానలో తడిస్తే, ఇంటికి రాగానే తడిబట్టలను విడిచి పొడి దుస్తులను ధరించడం మంచిది. తడిసిన దుస్తులతో ఎక్కువసేపు ఉన్నట్లయితే, చర్మంపై ఫంగస్ పెరిగి, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.తోవలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వాన మొదలైతే, విద్యుత్ స్తంభాలు, వేలాడుతూ కనిపించే విద్యుత్ తీగలు లేని సురక్షితమైన ప్రదేశంలో తలదాచుకోవడం మంచిది. వాన కురిసేటప్పుడు విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రమాదాలను నివారించుకోవచ్చు. వానలో చెట్ల కింద తలదాచుకోవడం కూడా మంచిది కాదు. గాలి తీవ్రత ఎక్కువైతే భారీ కొమ్మలు విరిగి మీదపడే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, వానాకాలాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు.

ఔషధవనంలో అపురూప ఆలయం
వనపర్తి జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోని చిట్టడవిలో.. ఎత్తయిన కొండ శిఖరంపై భూదేవి, శ్రీదేవి సమేతుడై కొలువుదీరిన తిరుమలనాథస్వామి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో సుమారు 300 ఏళ్ల క్రితం ఈ కొండపై స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ప్రాంత ప్రజలు ఏటా శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించేలా.. పశువుల కాపరులు, అడవి తల్లిని నమ్ముకున్న ముదిరాజ్‌లు దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే సంప్రదాయాన్ని ప్రారంభించారు. వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు వెళ్లే ప్రధాన రహదారిలో.. 5 కిలోమీటర్ల దూరంలో స్వామివారి ఆలయ ముఖద్వారం ఉంటుంది. అక్కడే ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు.ఆలయ చరిత్ర శతాబ్దాల క్రితం వనపర్తి సంస్థానాధీశులు వేటకు వెళ్లినప్పుడు ఎత్తయిన కొండ ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం, వేల అడుగుల ఎత్తులో విశాలమైన రాతిచాప, అక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరు (నీటి కొలను) ఉండటం చూశారు. శిఖరాగ్రాన స్వామివారిని ప్రతిష్టించాలని నిర్ణయించుకుని.. ఏకశిలపై స్వామి, అమ్మవార్ల విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ట చేసినట్లు చరిత్ర కథనం. ఏటా శ్రావణ మాసంలోని శనివారాల్లో అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేస్తారు. వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన కొందరిని ఆలయ ధర్మకర్తలుగా, పెద్దగూడెంలోని ఓ ముదిరాజు కుటుంబాన్ని పూజలు చేసేందుకు నియమించారు. నాటి నుంచి నేటివరకు ఆయా కుటుంబాల వారే స్వామివారిని సేవించుకుంటూ.. ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.తాటిచెట్టు మెట్ల నుంచి.. మొదట్లో గుట్టపై నుంచి స్వామివారు కొలువుదీరిన శిఖరాగ్రానికి చేరుకునేందుకు సంస్థానాధీశులు తాటిచెట్ల కాండంతో మెట్లను ఏర్పాటు చేసినట్లు భక్తులు చెబుతారు. 1993 ప్రాంతంలో దాతల సహాయంతో ఇనుప మెట్లను, ఇటీవల కాంక్రీట్ మెట్లను ఏర్పాటు చేశారు. శ్రీరంగాపురం రంగనాయకస్వామి, పెద్దగూడెంలోని కోదండరామస్వామి ఆలయాలతోపాటు తిరుమలనాథస్వామి ఆలయాల్లో సంస్థానాధీశులు విగ్రహ ప్రతిష్ట చేయించి పూజలు చేసేవారని స్థానికులు పేర్కొంటారు. ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హయాంలో తారురోడ్డును నిర్మించారు. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది.ఔషధ మొక్కలకు పుట్టినిల్లు.. తిరుమలనాథస్వామి కొలువుదీరిన కొండపై ఎన్నో ఔషధ మొక్కలు (Medicinal Plants) ఉన్నట్లు గుర్తించారు. ఏటా శ్రావణ మాసంలో పచ్చని చెట్లు, ఎన్నో రకాల ఔషధ మొక్కలతో పాటు.. చేతికి అందేంత ఎత్తులో వెళ్తున్న మేఘాలు.. చల్లని జల్లులతో ఆహ్లాదకరమైన వాతావరణం మంతమ్రుగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని, జాతరను తిలకించి.. ప్రకృతిని ఆస్వాదిస్తారు.సుదూర ప్రాంతాల నుంచి.. వనపర్తికి 5 కిలోమీటర్ల దూరంలో వెలిసిన తిరుమలనాథస్వామిని దర్శించుకొని.. మొక్కులు తీర్చుకునేందుకు జిల్లాతోపాటు గద్వాల, మహబూబ్‌నగర్, కర్ణాటకలోని రాయచూరు, బళ్లారి, హుబ్లీ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. కర్ణాటక ప్రాంతవాసులు.. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు. శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం చేస్తారు.తొలి శనివారం.. శ్రావణ మాసంలో వచ్చే తొలి శనివారం తిరుమలనాథస్వామి గుట్టపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు కల్యాణ మహోత్సవం జరిపిస్తారు. సామాన్యుల నుంచి కోటీశ్వరులు సైతం ఒకేచోట నేలపై కూర్చొని స్వామి, అమ్మవార్లకు కల్యాణం చేయిస్తారు. భక్తులతోనే కల్యాణ మహోత్సవం నిర్వహించడం ఇక్కడి విశేషం.చదవండి: ఈ జలపాతాలకు చూసేందుకు రెండు కళ్లు చాలవు

హిరాకుద్ జలాశయానికి వరదపోటు
ఒడిశా, భువనేశ్వర్: హిరాకుద్ జలాశయంలో వరద నీటి ఉధృతి పెరుగుతుంది. ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం పరిమితి 630 అడుగులు కాగా ప్రస్తుతం 609.39 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. నీటి మట్టం నియంత్రణలో భాగంగా అంచెలంచెలుగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఎడమ వైపు 13, కుడి వైపు ఏడు.. మొత్తం మీద 20 గేట్లు తెరిచి వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం లోనికి ప్రతి సెకన్‌కు 2.51 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తుండగా సెకనుకు 2.75 లక్షల క్యూసెక్కులు వరద నీరు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా మిగిలిన గేట్లు తెరిచే విషయం ఖరారు చేస్తారని జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ తెలిపారు. గురువారం నుంచి పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. 15 జిల్లాల 43 మండలాల్లో 50 మిల్లీమీటర్లు పైబడి వర్షపాతం నమోదు అయినట్లు విభాగం సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే నదుల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని నదుల నీటి మట్టం ప్రమాద సంకేతం దిగువన కొనసాగుతుందని సమాచారం. #ହୀରାକୁଦର_୨୦ଟି_ଗେଟ୍_ଖୋଲା👉ହୀରାକୁଦରୁ ୨୦ଟି ଗେଟ୍ ଦେଇ ବନ୍ୟାଜଳ ନିଷ୍କାସନ ଜାରି👉୬୦୯.୩୯ଫୁଟ୍ ରହିଛି ଜଳଭଣ୍ଡାରର ଜଳସ୍ତର#HirakudDam #Sambalpur #Odisha #GateOpen pic.twitter.com/vR9RNEZh7B— Mukesh Kumar Sahu (@Anchor_Mukesh) July 26, 2025
ఫొటోలు
అంతర్జాతీయం

లక్ష ఏళ్లనాటి సమాధులు
ఇజ్రాయెల్‌లో ఏకంగా లక్ష ఏళ్ల నాటి అతి పురాతన సమాధుల సమూహం వెలుగు చూసింది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన శవాల దిబ్బల్లో ఒకటిగా భావిస్తున్నారు. నాటి ఆదిమ మానవుల మృతదేహాలను ఇక్కడ గుంతల్లో జాగ్రత్తగా సమాధి చేసినట్టు కనుగొన్నారు. సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని టిన్ష్మెట్ గుహలోని ఈ సమాధుల సమూహానికి గురించిన వివరాలను ఇటీవలే అకాడమిక్ జర్నల్‌లో ప్రచురించారు. చనిపోయిన వారి గౌరవార్థం మృతదేహాల పక్కన పాతిపెట్టిన పలు వస్తువులు, అవశేషా లను అక్కడినుంచి తవ్వితీశారు. ఇది మానవ జాతికి సంబంధించి వెలుగు చూసిన అతి గొప్ప ఆవిష్కరణ అని తవ్వకాల బృందం డైరెక్టర్లలో ఒకరు, హీబ్రూ యూనివర్సిటీ ఆర్కియాలజీ ప్రొఫెసర్ యోసి జైద్నెర్ అన్నారు. ఈ దిబ్బల్లో మృతదేహాలను గర్భస్థ పిండం ఆకృతిలో పాతిపెట్టారు. ఇవి లక్ష నుంచి లక్షా 10 వేల ఏళ్ల నాటివని వివరించారు.గుహ మొదట్లోనే పుర్రెటిన్ష్మెట్ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు 2016 నుంచీ తవ్వకాలు సాగిస్తున్నారు. గుహ మొదట్లో రాతి గుండా బయటికి చొచ్చుకుని వచ్చినట్టుగా ఉన్న ఓ పుర్రెను గుర్తించారు. లోపల సమాధుల్లో శవాల పక్కన గులకరాళ్లు, జంతువుల అవశేషాల వంటివి కనిపించాయి. వీటిలో చాలావరకు నాటి రోజువారీ జీవితంలో ఉపయోగం లేనివే. దాంతో ఇవి అప్పటి ఆచారం ప్రకారం మృతుల గౌరవార్థం ఉంచినవేనని తేల్చారు. ఇవన్నీ రాతియుగం నాటివిగా, అంటే సుమారు 2.5 లక్షల నుంచి 30 వేల ఏళ్ల మధ్యనాటివిగా తేలింది. ఈ వివరాలను నేచర్హ్యూమన్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురించారు. ఇక్కడ రెండు అస్థిపంజరంతో కూడిన పూర్తిస్థాయి పుర్రెలు, మూడు పుర్రెలు, ఎముకలతో పాటు అలంకరణ సామగ్రి వంటివి కూడా దొరికాయి. అప్పట్లోనే మనిషి కేవలం తిండి, స్వీయరక్షణకు పరిమితం కాకుండా ఇతరత్రా అంశాలను కూడా నేర్చుకున్నట్టు దీన్నిబట్టి తెలుస్తోందని పురాతత్వవేత్తలు అభిప్రాయç ³డుతున్నారు. సున్నితత్వం దృష్ట్యా ఈ గుహ భాగాలను అతి చిన్న పరికరాలతో జాగ్రత్తగా తొలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అందులోని పూర్తి విశేషాలు బయట పడాలంటే మరికొన్నేళ్లు పడుతుందని భావిస్తున్నారు. ఇవి ఇజ్రా యెల్లోని 100 ఏళ్ల క్రితం స్కుల్లో, 50 ఏళ్ల నాడు ఖఫ్జేలో బయటపడ్డ గుహలను తలపిస్తు న్నాయి. మృతదేహాలను గాలికి వదిలేయకుండా ఇలా ఒక పద్ధతి ప్రకారం అంత్యక్రియలు జరిపే ఆచారం బహుశా 2 లక్షల ఏళ్ల క్రితమే పురుడుపోసుకుని ఉంటుందని పురాతత్వవేత్తలు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్

హెచ్ఐవీకి సూదిమందు ఆమోదించిన ఈయూ
లండన్: హెచ్ఐవీ/ఎయిడ్స్‌ను అడ్డుకునే సూదిమందు ‘లెనకపవిర్’కు యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు చెందిన మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదం తెలిపింది. ఏడాదిలో రెండు పర్యాయాలు తీసుకునే ఈ ఔషధం వైరస్ వ్యాప్తిని నివారించడంలో సాయపడుతుందని పేర్కొంది. యూరప్‌లో దీనిని యెయ్టువో అనే పేరుతో గిలియడ్ సైన్సెస్ విక్రయాలు జరుపుతుంది. దీంతో ఈయూలోని 27 సభ్య దేశాలతోపాటు ఐస్‌ల్యాండ్, నార్వే, లీచిన్స్టెయిన్ల్లోనూ ఇది అందుబాటులోకి వస్తుంది. లెనకపవిర్తో హెచ్ఐవీ బాధిత మహిళలు, పురుషులకు చికిత్స చేయగా 100 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు గతేడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. హెచ్ఐవీ మహమ్మారిని తరిమికొట్టడంలో లెనకపిర్ కీలక మలుపుగా మారనుందని ఐరాస ఎయిడ్స్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ తెలిపారు. జూన్‌లో అమెరికా ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సైతం లెనకపవిర్‌ను ఆమోదించింది. ఐరాస ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్ఐవీ వైరస్ నివారణలో లెనకపవిర్ ఎంతో సహాయకారికానుందని పేర్కొంది. ఒకసారి ఈ సూది మందు తీసుకుంటే ఆరు నెల్లపాటు హెచ్ఐవీ సోకకుండా ఆపగలుగుతుంది. కాగా, లెనకపవిర్‌ను తక్కువ ధరలో హెచ్ఐవీ కేసులు తీవ్రంగా ఉండే ఆఫ్రికా, ఆసియా, కరీబియన్ ప్రాంతాల్లోని 120 పేద దేశాలకు సరఫరా చేస్తామని గిలియడ్ సైన్సెస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల హెచ్ఐవీ బాధితులుండగా 2024లో సుమారు 6.30 లక్షల మంది చనిపోయినట్లు అంచనా.

పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ పాలస్తీనాకు మద్దతుగా నిలిచారు. ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఫ్రాన్స్ గుర్తిస్తుందని మాక్రాన్ చెప్పారు. ఈ విషయాన్ని సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అధికారికంగా ప్రకటిస్తానన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. గాజాలో యుద్ధం ఆగిపోవడం, అక్కడి జనాభాను ఆకలి నుంచి రక్షించడమే ప్రస్తుతం మన ముందున్న అత్యవసర కర్తవ్యమని పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరిగిన వెంటనే ఆయన ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చారు. యూదు వ్యతిరేకతను ఖండించారు. ఆ తరువాతి కాలంలో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం, రానురాను పెరిగిన సంక్షోభం పట్ల ఆయన తీవ్ర నిరాశ చెందారు. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని గతంలో పలుమార్లు చెప్పిన ఆయన.. తాజాగా పునరుద్ఘాటించారు. నిర్లక్ష్యపూరిత నిర్ణయం: అమెరికాపాలస్తీనా పట్ల ఫ్రాన్స్ తీరును అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించాయి. ఇది హమాస్ ప్రచారానికి ఉపయో గపడే నిర్లక్ష్య పూరిత నిర్ణయ మని విదేశాంగ మంత్రి మార్కో రూబి యో అన్నారు. ‘‘యూ ఎన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా రాజ్యాన్ని గు ర్తించాలనే మాక్రాన్ ప్ర ణాళికను అమెరికా తిరస్కరిస్తుంది. ఈ నిర్లక్ష్య నిర్ణయం హమా స్ ప్రచా రానికి ఉపయో గపడుతుంది. శాంతిని దెబ్బ తీస్తుంది’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఫ్రాన్స్ తీరు సిగ్గుచేటు: ఇజ్రాయెల్ఇక మాక్రాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలస్తీనాను గుర్తించడమంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని, ఇది ఇజ్రాయెల్ అస్తిత్వానికి ముప్పు కలిగిస్తుందని ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ అన్నారు. గాజా ఇజ్రాయెల్‌ను నిర్మూలించే లాంచ్ ప్యాడ్ అవుతుందని, దాని పక్కన శాంతియుతంగా జీవించలేమని తెలిపారు. ఫ్రాన్స్ నిర్ణయం సిగ్గుచేటని ఇజ్రాయెల్ ఉప ప్రధాని యారివ్ లెవిన్ అన్నారు. అది ఫ్రెంచ్ చరిత్రపై ఒక నల్ల మచ్చని, ఉగ్రవాదానికి నేరుగా సహాయమందించడమని చెప్పారు. తాము ఆక్రమించిన వెస్ట్ బ్యాంక్‌కు ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని వర్తింపజేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. స్వాగతించిన హమాస్.. ఫ్రాన్స్ ప్రకటనను పాలస్తీనియన్ అథారిటీ సీనియర్ అధికారి హుస్సేన్ అల్–షేక్ స్వాగతించారు. ఇది అంతర్జాతీయ చట్టాల పట్ల ఫ్రాన్స్ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కులకు, రాజ్య స్థాపనకు మద్దతివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాలస్తీనా గుర్తింపు విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్‌ను అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.

మాల్దీవులతో బలీయ బంధం
మాలె: భారత్, మాల్దీవ్స్ విశ్వసనీయమైన మిత్రదేశాలు అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మాల్దీవ్స్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటామని, ద్వీప దేశానికి రూ.4,850 కోట్ల రుణం(లైన్ ఆఫ్ క్రెడిట్) ఇవ్వబోతున్నామని ప్రకటించారు. శుక్రవారం మాల్దీవ్స్ రాజధాని మాలెలో ప్రధాని మోదీ, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ నుంచి శుక్రవారం ఉదయం మాల్దీవులకు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టులో మొహమ్మద్ ముయిజ్జుతోపాటు సీనియర్ మంత్రులు ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం రిపబ్లిక్ స్క్వేర్‌లో మోదీకి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఇండియా–మాల్దీవ్స్ మధ్య కొన్ని రోజుల క్రితం సంబంధాలు బలహీనపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. సైనిక సామర్థ్యం పెంపునకు సహకారం మాల్దీవులతో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ స్పష్టంచేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడులు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. భారత్ అమలు చేస్తున్న ‘పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం’, ‘మహాసాగర్’ విధానాల్లో మాల్దీవులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసానికి ఒక కొలమానం అని వివరించారు. మాల్దీవుల సైనిక సామర్థ్యం పెంపునకు భారత్ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి స్వా గతం పలకడం తన హృదయాన్ని హత్తుకుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.రక్షణ శాఖ కార్యాలయం ప్రారంభం ఇండియా–మాల్దీవ్స్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక తపాళ బిళ్లను మోదీ, ముయిజ్జు ఆవిష్కరించారు. వేర్వేరు కీలక రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) ఇరు దేశాలు సంతకాలు చేశాయి. మాల్దీవ్స్‌లో భారత యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి మరో ఒప్పందం కుదిరింది. రూ.4,850 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌పై రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మాలె సిటీలో రక్షణ శాఖ కార్యాలయాన్ని మోదీ, ముయిజ్జు ప్రారంభించారు.
జాతీయం

విశ్వసనీయ నేత మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ, విశ్వసనీయత కలిగిన నాయకుడిగా మరోసారి ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. మోదీకి ఏకంగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ లభించడం విశేషం. అంటే సర్వేలో పాల్గొన్నవారిలో 75 శాతం మంది మోదీని ప్రజాస్వామ్య ప్రపంచ నేతగా ఆమోదించారు. 18 శాతం మంది మోదీ వైపు మొగ్గు చూపలేదు. మిగతా 7 శాతం మంది ఏదీ చెప్పలేకపోయారు. ఈ సర్వే వివరాలను ‘మార్నింగ్ కన్సల్ట్’ విడుదల చేసింది. అత్యంత విశ్వసనీయ ప్రపంచ నాయకుల్లో మోదీ మొదటి స్థానంలో ఉండగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ రెండో స్థానంలో, అర్జెంటీనా అధినేత జేవియర్ మిలీ మూడో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం 44 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ఎనిమిదో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. ఈ నెల 4 నుంచి 10వ తేదీ దాకా ఈ సర్వే నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ప్రజాభిప్రాయం సేకరించారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగానే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

శత్రు పీచమణచే రుద్ర!
ద్రాస్(కార్గిల్): మన సైన్యం మరింత శక్తిసామర్థ్యాలు సంతరించుకోబోతోంది. బహుముఖ అవసరాలను తీర్చేలా అత్యాధునిక పూర్తిస్థాయి సాయుధ దళా (బ్రిగేడ్) లను ఏర్పాటు చేసుకోనుంది. ఈ స్పెషల్ ఫోర్స్ యూనిట్లకు ‘రుద్ర’గా నామకరణం చేసినట్టు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. అలాగే సరిహద్దుల వద్ద శత్రువులకు కోలుకోలేని షాకిచ్చే ‘భైరవ్’లైట్ కమెండో బెటాలియన్లు కూడా రానున్నట్టు తెలిపారు. కార్గిల్ యుద్ధంలో పాక్ పీచమణచిన చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా జరుపుకుంటున్న విజయ్ దివస్‌కు 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ద్రాస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ‘‘భావి అవసరాలకు దీటుగా ఎదిగే తిరుగులేని శక్తిగా సైన్యం బలోపేతం అవుతోంది. రుద్ర బ్రిగేడ్ల ఏర్పాటు అందులో భాగమే’’అని తెలిపారు. ఇందుకు శుక్రవారమే కేంద్రం నుంచి అనుమతులు లభించినట్టు వెల్లడించారు. ‘‘అలాగే ప్రతి పదాతి బెటాలియన్‌లోనూ డ్రోన్ ప్లటూన్లు ఏర్పాటు కానున్నాయి. ఆర్టీలరీ విభాగాల విధ్వంసక శక్తిని ‘దివ్యాస్త్ర’, లాయిటర్ మ్యునిషన్ బ్యాటరీలతో మరింతగా బలోపేతం చేశాం. పూర్తిగా దేశీయంగా తయారు చేసిన గగనతల రక్షణ వ్యవస్థలతో వాయుసేనను దురి్నరీక్ష్యంగా తీర్చిదిద్దుతున్నాం. ఇది మన సైనిక పాటవాన్ని చెప్పలేనంతగా పెంచేస్తోంది’’అని పేర్కొన్నారు. 1999లో కిరాయి మూకల ముసుగులో పాక్ సైన్యం కశ్మీర్లో సరిహద్దుల గుండా చొచ్చుకొచ్చి మన భూభాగంలో పాగా వేయడం తెలిసిందే. మంచుకొండల్లోని తోలోలింగ్, టైగర్‌హిల్స్ వంటి శిఖరాలపై అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో మూడు నెలల పాటు జరిపిన ముమ్మర పోరులో పాక్ మూకలను మన సైన్యం తిప్పికొట్టడం తెలిసిందే. అందుకు గుర్తుగా ఏటా జూలై 26న విజయ్ దివస్ జరుపుకుంటూ వస్తున్నాం. ఏమిటీ ‘రుద్ర’? ఆర్మీ చీఫ్ ప్రకటించిన రుద్ర బ్రిగేడ్ అత్యాధునిక యుద్ధ విభాగం (బ్రిగేడ్). దీని విశేషాలు అన్నీ ఇన్నీ కావు... → ఇది త్రివిధ దళాలతో కూడిన బ్రిగేడ్ → ఇందులో పదాతి, సాయుధ విభాగాలు, ఆర్టిలరీ, స్పెషల్ ఫోర్సెస్, మానవ రహిత యుద్ధ విమాన వ్యవస్థలు తదితరాలు ఉంటాయి. → ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సాయుధ, మద్దతు వ్యవస్థలు వీటికి వెన్నుదన్నుగా నిలుస్తాయి. → రెండు సైనిక పదాతి దళ విభాగాలను ఇప్పటికే రుద్ర బ్రిగేడ్లుగా ఆధునీకరించారు. మరిన్ని బ్రిగేడ్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. → ఇప్పటిదాకా సైనిక బ్రిగేడ్లు ఏక తరహా వ్యక్తిగత ఆయుధాలతో కూడినవిగా మాత్రమే ఉన్నాయి.కార్గిల్ వీరగాథలు విన్పించే ‘ఇ–శ్రద్ధాంజలి’ యాప్ బతాలిక్ సెక్టర్లో ఇండస్ వ్యూ పాయింట్ కార్గిల్ వీరుల గౌరవార్థం మూడు ప్రాజెక్టులు కార్గిల్ యుద్ధ అమరవీరులను గౌరవార్థం మూడు కొత్త ప్రాజెక్టులను ఆర్మీ చీఫ్ ప్రకటించారు. ‘ఇ–శ్రద్ధాంజలి’పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు. దీని ద్వారా కార్గిల్ వీరులకు పౌరులు శ్రద్ధాంజలి తెలపవచ్చు. అలాగే ఓ ఈ క్యూఆర్ ఆధారిత ఆడియో గేట్‌వే యాప్ కూడా రూపొందించారు. ఇది కార్గిల్ యుద్ధానికి సంబంధించిన రోమాంఛిత గాథలను వినిపిస్తుంది. దీన్ని అమరవీరులకు అంకితమిచ్చారు. అలాగే నియంత్రణ రేఖ సమీపంలోని బతాలిక్ సెక్టర్‌ను సందర్శించే వారి కోసం వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఇది కార్గిల్, ఇండస్ లేహ్, బల్టిస్తాన్ మధ్య భాగంలో 10 వేల అడుగుల ఎత్తున ఉండే కీలక వ్యూహాత్మక పాయింట్. అక్కడ విధులు నిర్వహించే సైనికుల జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసి అర్థం చేసుకునేందుకు ఈ వ్యూ పాయింట్ వీలు కలి్పస్తుంది. ‘‘ఇది మ్యూజియంల వంటి కాన్సెప్టు. ఇయర్‌ఫోన్స్ ద్వారా ఆడియో ద్వారా కార్గిల్ యుద్ధ విశేషాలను వినవచ్చు. మన సైనికుల శౌర్యం, ధైర్యస్థైర్యాలు, త్యాగాలను తెలుసుకుని పొంగిపోవచ్చు’’అని సైనికాధికారి ఒకరు వివరించారు.ఉగ్ర భూతాన్ని సహించేదే లేదు ‘సిందూర్’తో పాక్‌కు హెచ్చరికదాయాదికి ఆర్మీ చీఫ్ చురకలు‘‘ఉగ్ర భూతానికి దన్నుగా నిలిచే దుష్టశక్తులను భారత్ ఏ మాత్రమూ సహించే ప్రసక్తే లేదు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మన త్రివిధ దళాలు తిరుగులేని సమన్వయంతో జరిపిన పెను దాడులు పాకిస్తాన్‌కు పంపిన తిరుగులేని హెచ్చరిక సంకేతాలవే. అంతమాత్రమే కాదు, దేశం హృదయానికి తీరని గాయం చేసిన పహల్గాం ఉగ్ర దాడికి మన సమష్టి ప్రతిస్పందన కూడా. గత ఉగ్ర దాడుల మాదిరిగా ఈసారి మన దేశం కేవలం శోకించి సరిపెట్టుకోలేదు. అలాంటి ఘాతుకాలకు మన స్పందన నిర్ణయాత్మకంగా, ప్రత్యర్థి కోలుకోలేని రీతిలో ఉంటుందని నిరూపించాం. తద్వారా అలాంటి మతిలేని ఉగ్రోన్మాదానికి, దానికి దన్నుగా నిలిచే ధూర్త దేశాలకు మన స్పందన విషయంలో సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించాం’’అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. 1999లో కార్గిల్ యుద్ధంలో పాక్‌పై మన విజయానికి ప్రతీకగా జరుపుకుంటున్న విజయ్ దివస్‌కు శనివారంతో 26 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని ద్రాస్‌లో కార్గిల్ యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. అక్కడి సైనిక సిబ్బంది తదితరులను ఉద్దేశించి మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మే 7న పర్యాటకులపై పాక్ ప్రేరేపిత జైషే ఉగ్ర సంస్థకు చెందిన ముష్కరులు విచక్షణారహిత కాల్పులకు తెగబడి 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. అందుకు ప్రతిగా ఆపరేషన్ సైన్యంపై దేశ ప్రజలు చూపిన తిరుగులేని విశ్వాసం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ వల్లే ఉన్మాదానికి తిరుగులేని రీతిలో సమాధానం చెప్పగలిగాం. మన దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి, ప్రజలకు హాని తలపెట్టే ముష్కర శక్తులకు తగిన సమాధానం ఇస్తామని నిరూపించాం’’అని ప్రకటించారు. సిందూర్ ఆపరేషన్‌లో పాక్ గడ్డపై స్వేచ్ఛగా చెలరేగుతున్న 9 మంది అత్యున్నత స్థాయి ఉగ్రవాదులను మట్టుబెట్టిందని గుర్తు చేశారు. మనకు అణుమాత్రం కూడా నష్టం కలగకుండా పని పూర్తి చేశామన్నారు. ‘‘పీఓకే, పాక్‌లోని ఉగ్ర స్థావరాలను అత్యంత కచి్చతత్వంతో నేలమట్టం చేశాం. తద్వారా దాయాదిపై నిర్ణాయక విజయం సాధించాం. వాటిపై మన బాంబు, క్షిపణి దాడులను అడ్డుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను పూర్తిస్థాయిలో అడ్డుకున్నాం. ప్రతిగా మే 8, 9 తేదీల్లో పాక్ సైన్యం మన సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై తలపెట్టిన దాడులకు మర్చిపోలేని రీతిలో బదులిచ్చాం. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనేలా చూసేందుకు ప్రయత్నం చేశాం. కానీ పాక్ మాత్రం ఎప్పట్లాగే ఉగ్ర మూకలను ప్రేరేపించడం ద్వారా మరోసారి పిరికిపంద చర్యకు దిగింది. మన గగనతల రక్షణ వ్యవస్థ దుర్భేద్యమైన కవచంలా నిలిచి కాపాడింది. ఒక్క క్షిపణి, డ్రోన్ కూడా సరిహద్దులు దాటి చొచ్చుకురాకుండా అడ్డుకుంది’’అని ఆర్మీ చీఫ్ గుర్తు చేశారు. భారత సైన్యం ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా ఎదుగుతోందన్నారు.
అపురూపాలు.. మళ్లీ మన చెంతకు!
ఇతర దేశాల్లో ఉండిపోయిన మన పురాతన వస్తువులను రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. వివిధ దేశాలకు తరలి వెళ్లిన ఈ అపురూప కళాఖండాలను.. సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందడం, జాతీయ గౌరవాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా తిరిగి సొంతం చేసుకుంటోంది. వీటిని సంరక్షించడం, అధ్యయనం కోసం అందుబాటులో ఉండేలా చూడటం కూడా ఈ ప్రయత్నాల ముఖ్య ఉద్దేశం.⇒ సీతా రామ లక్ష్మణుల లోహ విగ్రహాలను 2020లో యూకే నుంచి తెప్పించగలిగాం.⇒ సంతానలక్ష్మి విగ్రహం... 2021లో అమెరికా నుంచి తిరిగి రప్పించగలిగాం.⇒ మహిషాసుర మర్దిని విగ్రహాన్ని 2022లో ఆస్ట్రేలియా నుంచి తీసుకురాగలిగాం.⇒ సూర్య భగవానుడి రాతి శిల్పాన్ని 2023లో యూకే నుంచి సాధించుకున్నాం.13 మాత్రమే..2021 అక్టోబరులో అమెరికా సుమారు 15 మిలియన్ డాలర్ల విలువైన 248 అపురూప దేవీ దేవతా విగ్రహాలు, పురాతన వస్తువులను మనదేశానికి అప్పగించింది. ‘ప్రపంచంలోని ఏ మ్యూజియం కూడా అనైతికంగా సంపాదించిన ఏ కళాకృతిని కలిగి ఉండకూడదు. స్వాతంత్య్రానికి ముందు, తరువాత విగ్రహాలను మన దేశం నుంచి అనైతిక రీతిలో బయటకు తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతి పెరుగుతున్నందున వివిధ దేశాలు మన వారసత్వాన్ని తిరిగి ఇవ్వడం ప్రారంభించాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల ఫలితంగా ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, థాయ్‌లాండ్, యూకే, యూఎస్ఏ నుంచి భారీ ఎత్తున పురాతన వస్తువులను స్వాధీనం చేసుకుంది. 2014 నుంచి ఇప్పటివరకు మొత్తం 640 పురాతన వస్తువులు భారత్‌కు తిరిగి వచ్చాయి. 1947 నుంచి 2014 మధ్య కేవలం 13 పురాతన వస్తువులను మాత్రమే మన దేశం స్వాధీనం చేసుకోగలిగింది.⇒ ఇలా.. 2020–24 మధ్య 610 పురాతన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అమెరికా నుంచి వెనక్కి వచ్చినవే ఎక్కువ కావడం గమనార్హం. సగం వస్తువులను దౌత్య మార్గాల ద్వారా భారత్ తిరిగి అందుకుంది. ఈ భారతీయ కళాఖండాలు, వాటి పునరుద్ధరణ గురించి అవగాహన పెంచడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు, ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. భారత పురావస్తు శాఖ తన అధికార పరిధిలోని రక్షిత స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, మ్యూజియాలలో దొంగతనానికి గురైన వస్తువుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తోంది.సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందడంవలసవాద కాలంలో భారత్ నుంచి అనేక కళాఖండాలు తరలిపోయాయి. తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియాలు, ప్రైవేట్ సేకరణ సంస్థలకు విక్రయం లేదా బహుమతిగా చేరాయి. ఈ వస్తువులను తిరిగి పొందడం జాతీయ గుర్తింపు, గౌరవంగా భారత్ భావిస్తోంది. అలాగే వలసవాద పాలనలో భారతీయ కళాఖండాలను క్రమబద్ధంగా దోచుకోవడం దేశ చరిత్రపై ఒక మచ్చను మిగిల్చింది. ఈ వస్తువులను తిరిగి పొందడం చారిత్రక అన్యాయాలను సరిదిద్దడానికి, ఎదుర్కొన్న సాంస్కృతిక నష్టాలను గుర్తించడానికి సహాయపడుతుంది.అక్రమ రవాణాను అరికట్టడంపురాతన వస్తువుల అక్రమ వ్యాపారాన్ని కొందరు లాభదాయకంగా మల్చుకున్నారు. దొంగిలించిన కళాఖండాలను తిరిగి పొందడం, చట్టపరమైన చట్రాలను బలోపేతం చేయడం ద్వారా భారత్ ఈ వ్యాపారంపై ఉక్కుపాదం మోపేందుకు చురుకుగా పనిచేస్తోంది.సంరక్షణ–పరిశోధనరికవరీ తరువాత ఈ కళాఖండాలను మ్యూజియాలు, ఇతర సంస్థలలో భద్రపరుస్తున్నారు. అక్కడ వాటిని సంరక్షణ, అధ్యయనంతోపాటు ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంచుతున్నారు.అంతర్జాతీయ సహకారందొంగతనానికి గురైన కళాఖండాలను దౌత్య మార్గాలు, ఒప్పందాల ద్వారా స్వదేశానికి తిరిగి రప్పించడానికి భారత్ ఇతర దేశాలతో, ముఖ్యంగా అమెరికాతో చురుగ్గా వ్యవహరిస్తోంది.

ఏడాది వయస్సున్న బుడ్డోడు కొరికితే కోబ్రానే చనిపోయింది..!
సాధారణంగా పాము కరిచి ప్రజలు మృత్యువాత పడిన ఘటనలే మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే మనిషి కరిస్తే పాము చచ్చిపోతుందా అనేది మాత్రం ఇక్కడ ఆసక్తికరం. ఒకవేళ ఈ తరహా ఘటనలు జరిగినా అరుదనే చెప్పాలి. మరి ఏడాది వయస్సున్న చంటోడు కోబ్రాను కొరికితే అది చచ్చిపోయిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోబెట్టాహ్ జిల్లాలోని వెస్ట్ చాంపరన్‌లో చోటుచేసుకుంది. ఆ బుడ్డోడు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో కోబ్రా వచ్చింది. అయితే అది ఆట వస్తువు అనుకున్న ఆ పిల్లాడు.. దాన్ని గట్టిగా పట్టుకుని ఒక పట్టుపట్టాడు. ఆ పామును కోరిక పారేశాడు. దాంతో ఆ పాము చనిపోవడం ఇప్పుడు షాకింగ్ ఘటనగా మారిపోయింది. పామును కరిచిన తర్వాత ఆ చంటోడు స్పృహ కోల్పోవడంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఆ పిల్లాడికి ఎటువంటి విషం ఎక్కలేదని డాక్టర్లు చెప్పడంతో తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పిల్లాడ్ని కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలనే డాక్టర్ల సూచన మేరకు అక్కడే ఉంచారు. ఆ పిల్లాడి అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం.. ఒక పొడవాటి కోబ్రా ఇంట్లోకి వచ్చిందని, ఆ సమయంలో పిల్లాడు ఆడుకుంటూ ఉన్నాడని, ఆ పామును ఆట వస్తువు అనుకుని దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకుని నోటితో కొరికినట్లు చెప్పారు.
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంచ్
అమెరికాలోని డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీ లాంఛ్ అయింది. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మొదలగు నగరాలతో పాటు నార్త్ అమెరికాకు నలుదిక్కులా విస్తరించి.. పుట్టిన నేల నుంచి పెరిగిన గడ్డ వరకు.. ప్రవాసులకు అండగా.. మరింత చేరువగా.. సరికొత్తగా ఆవిష్కృతం అయింది సాక్షి టీవీ నార్త్ అమెరికా. టెక్సాస్, ఫెయిర్‌వ్యూ లోని సౌత్విండ్ ఎల్ఎన్ వేదికగా ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. అమెరికా, భారత జాతీయగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఈవెంట్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా, సాక్షి టీవీ స్టాప్, యాడ్ అమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ AAA నుంచి రఘు వీరమల్లు , పవన్ కుమార్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, అసోసియేషన్ హెడ్స్, సబ్జెక్టు మేటర్ ఎక్స్పర్ట్స్, తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్లే చేసిన సాక్షి టీవీ నార్త్ అమెరికా AVని ప్రవాసులు ఎంతో ఆకసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ USA కి ప్రవాసులు తమ శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికాకు నలుదిక్కుల వ్యాప్తి చెంది.. US లో నెంబర్ 1 నెట్వర్క్ గా రూపాంతరం చెంది.. ప్రవాసుల గొంతుకగా Sakshi TV USA నిలుస్తోందని కె.కె. రెడ్డి పెర్కొన్నారు. డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ అవటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాక్షి టీవీ ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. ఇక సాక్షి టీవీ ఎన్నారై ప్రత్యేక కార్యక్రమాల గురించి సింహా వివరించారు. అమెరికాలో ప్రవాసుల గొంతుకగా నిలుస్తోన్న సాక్షి టీవీని పలువురు ప్రముఖులు కొనియాడారు. సాక్షి ఎన్నారై కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రవాసులు సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ ఈవెంట్ పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె. రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ నార్త్ అమెరికాను అందరూ ఆదరించాలని కోరారు.

అమెరికా నాసా ఎన్ఎస్ఎస్ ఐఎస్డీసిలో సత్తా చాటిన విద్యార్థులు
బంజారాహిల్స్: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో నాసా ఏర్పాటు చేసిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ 3 ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజ్ 4 ప్రాజెక్టులు, వరల్డ్‌లో మూడో ప్రైజ్ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్‌లో ఆర్టిస్టిక్ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు.

అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో నాట్స్ సేవా కార్యక్రమాలు
డాలస్, టెక్సాస్ : భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో కార్యక్రమాన్నిచేపట్టి వీధులను శుభ్రం చేసింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్‌వేలో చెత్తను తీసేసి.. అక్కడ వీధిని శుభ్ర పరిచింది. దాదాపు 20 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 పౌండ్లకు పైగా చెత్తను సేకరించి ఆ వీధిని బాగుచేసింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే లక్ష్యాలు నెరవేరుతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకీ , పెద్దలకీ మరియు మద్దతు అందించిన దాతలకు నాట్స్ డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ. శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర , మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె,డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డాలస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు నాట్స్ ముందడుగు
డాలస్, టెక్సాస్: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఆకలితో ఆలమటిస్తున్న పేద పిల్లలకు పోషకాహారం అందించేందుకు రంగంలోకి దిగింది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్లు కలిసి పేద పిల్లలకు ఆహారం అందించేందుకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేశాయి. రిచర్డ్సన్ నగరంలో దాదాపు 20 మంది తెలుగు యువతీ, యువకులు, పెద్దలు.. 133 బాక్సుల పౌష్టికాహారాన్ని ప్యాక్ చేశారు. ఇందులో 28,728 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 78 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించేలా ఫుడ్ ప్యాకింగ్ చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల మార్గదర్శకత్వంలో పలువురు నాట్స్ యువ వాలంటీర్లు కుటుంబ సమేతంగా పాల్గొని వేల సంఖ్యలో ఆహార కిట్లను సిద్ధం చేశారు నాట్స్ డాలస్ చాప్టర్ యువతను ప్రోత్సహిస్తూ, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలా పేద పిల్లలకు పౌష్టికాహారం సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని బాపు నూతి అన్నారు. సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులను భాగస్వామ్యులను చేయటం చాలా సంతోషంగా ఉందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని రాజేంద్ర మాదల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డాలస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహకోశాధికారి రవి తాండ్ర, మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న తదితరులు పాల్గొన్నారు. డాలస్ చాప్టర్ టీం, నాట్స్ సలహాదారు బృందం సభ్యుల సహకారంతో ఇంత మంచి సేవా కార్యక్రమం చేపట్టినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి నాట్స్ డాలస్ విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
క్రైమ్

నేను భూమి మీద ఉండి ఉద్ధరించేది ఏం లేదు..!
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘ఎక్కడ చూసినా కరప్షన్, పొల్యూషన్. నేను భూమి మీద ఉండి ఉద్ధరించేది ఏం లేదు. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నా’అంటూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరానికి చెందిన గుత్తుల వేణుగోపాల్ (26) రాయదుర్గంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన అన్నావదినలతో కలిసి మణికొండలోని షిరిడి సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 23న అన్న, వదినలతో కలిసి రాజమహేంద్రవరానికి వెళ్లారు. అదే రోజు రాత్రి వేణుగోపాల్ తిరిగి మణికొండకు వచ్చాడు. 24న తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడగా, 25న ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం వాచ్‌మెన్‌కు ఫోన్ చేశారు. వాచ్‌మన్ వెళ్లి కిటికీలోంచి చూడగా వేణుగోపాల్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి చూపించాడు. దీనిపై రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుమార్తె చనిపోయింది.. వరకట్నం వెనక్కివ్వండి
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో మహిళ అంత్యక్రియల విషయంలో అనిశ్చితి ఏర్పడింది. ప్రమాదంలో గాయపడి మృతిచెందగా.. కట్నం డబ్బుల విషయమై తలెత్తిన వివాదం అందుకు కారణమైంది. శుక్ర, శనివారాల్లో మృతదేహం ఏరియా ఆస్పత్రిలోనే ఉంచాల్సి వచ్చింది. పోలీసుల రంగప్రవేశం, పెద్దల పంచాయితీతో వివాదం సమసిపోయింది. వివరాలిలా ఉన్నాయి. రామకృష్ణాపూర్ పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు గాండ్ల సత్యం, ఆయన కూతురు ముద్దసాని లావణ్య ఇటీవల పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సత్యం అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన లావణ్య (29) హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయింది. మృతదేహాన్ని శుక్రవారం ఇక్కడికి తరలించగా.. అంత్యక్రియల సమయంలో అనిశ్చితి నెలకొంది. కాగా, లావణ్యకు రామకృష్ణాపూర్‌లోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన ముద్దసాని సురేష్‌తో ఐదేళ్ల క్రితం వివాహామైంది. కొన్నేళ్లుగా వీరి మధ్య కుటుంబ కలహాలతో లావణ్య తల్లిగారింటి వద్ద ఉంటుంది. కట్నం డబ్బుల విషయమై..లావణ్య తల్లిగారింటి వద్దే ఉంటుండడంతో ఆమె కుటుంబ సభ్యులు సురేష్‌కు ఇచ్చిన కట్నం డబ్బులు ఇవ్వాలని గతంలో నుంచే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. లావణ్య, ఆమె తండ్రి ఇద్దరు మరణించడంతో పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం రూ.50లక్షలు, బంగారం ఇస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని, లేదంటే అత్తారింటి ఎదుట మృతదేహంతో బైఠాయిస్తామని చెప్పడంతో వివాదం తలెత్తింది. మృతదేహాన్ని తమ ఇంటి వద్దకు తీసుకువచ్చే అవకాశం ఉందని గ్రహించిన సురేష్ తండ్రి ముందే సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి అంబులెన్స్‌లోని ఫ్రీజర్‌లో భద్రపర్చారు. శుక్రవారం నుంచి శనివారం వరకు ఈ ప్రతిష్టంభన కొనసాగింది. పెద్ద మనుషులు జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. రూ.50 లక్షల కట్నంలో రూ.20 లక్షలు తిరిగి ఇవ్వడానికి అంగీకారం కుదరడంతో వివాదం సమసిపోయింది. అనంతరం లావణ్య బంధువులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

రూ. 22,845 కోట్లు కొల్లగొట్టారు!
భారత్‌లో ఇంటర్నెట్ మారుమూల పల్లెలకూ చేరింది. డిజిటల్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఈ అంశమే ఇప్పుడు సైబర్ నేరస్తులకు ఆయుధంగా మారింది. దీంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం సైబర్ నేరగాళ్లు 2024లో భారతీయుల నుంచి రూ.22,845.73 కోట్లు కొల్లగొట్టారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో ఆర్థిక సంబంధమైన ఫిర్యాదులు 24.42 లక్షలు వస్తే.. 2024లో ఈ సంఖ్య ఏకంగా 36.36 లక్షలకు పెరిగింది.ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు, బ్యాంకులు, పోలీసు విభాగాలు చేపడుతున్న అవగాహన కార్యక్రమాల పుణ్యమా అని జనంలో సైబర్ నేరాలపట్ల అవగాహన పెరిగినా నేరాలు తగ్గకపోవడం గమనార్హం. సైబర్ మోసాలే కాదు.. బాధితులు పోగొట్టుకుంటున్న మొత్తమూ ఏటా అంచనాలకు మించి నమోదవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు బాధితులు నష్టం జరిగిపోయాక.. పోలీసు స్టేషన్లు, సైబర్ పోలీస్ స్టేషన్లు, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టళ్లు, టోల్ ఫ్రీ నంబర్ల వంటివాటిని ఆశ్రయిస్తున్నారు. –సాక్షి, స్పెషల్ డెస్క్లొకేషన్ ఇట్టే పట్టేస్తారుసైబర్ భద్రతా ప్రయత్నాలకు అనుగుణంగా పోలీసుల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 2,63,348 ఐఎంఈఐలను బ్లాక్ చేసింది. నేరస్తులు ఉన్న చోటు, వారి కేంద్రాలను గుర్తించి నిఘా వ్యవస్థలకు సమాచారం చేరవేసేందుకు ’ప్రతిబింబ్’ మాడ్యూల్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఈ మాడ్యూల్ ద్వారా 10,599 మంది నిందితులను అరెస్టు చేయగలిగారు. తద్వారా 26,096 మంది నేరస్తులను గుర్తించగలిగారు. 63,019 సైబర్ దర్యాప్తు సహాయ అభ్యర్థనలను ప్రాసెస్ చేయగలిగారు.కట్టడికి కలిసికట్టుగా..న్యూఢిల్లీలోని ఇండియన్ సైబర్‌క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) కేంద్రంగా సైబర్ నేరాల నియంత్రణ కేంద్రాన్ని (సీఎఫ్ఎంసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్న విభిన్న విభాగాలు.. సైబర్ నేరం జరిగినట్టు ఫిర్యాదు అందగానే వెంటనే స్పందించి ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు, అలాగే నేరస్తులను పట్టుకునేందుకు కలిసికట్టుగా నిరంతరం శ్రమిస్తున్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం సమాచారం, డేటా, కమ్యూనికేషన్ లింక్‌ను నేరస్తులు వాడకుండా నిరోధించేందుకు.. ఐటీ సేవల కంపెనీలకు సమాచారం ఇచ్చేందుకు ‘సహ్యోగ్’ పోర్టల్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టే దిశగా టెలికం శాఖ (డాట్) రూపొందించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఐఆర్) ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించింది. మధ్యస్థ, అధిక, అత్యధిక ఆర్థిక మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను ఇది రియల్ టైమ్‌లో వర్గీకరిస్తుంది. ప్రస్తుతం చెల్లింపులకు యూపీఐ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా కోట్ల మందిని ఈ సాంకేతికత కాపాడగలదని తెలిపింది.సైబర్ మోసాల వల్ల భారతీయులు గత ఏడాది రూ.22,845.73 కోట్లు కోల్పోయారు. 2023లో ఈ మొత్తం రూ.7,465.18 కోట్లు.2024లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో (ఎన్ సీఆర్పీ) 19.18 లక్షలు, సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ద్వారా 17.18 లక్షల ఫిర్యాదులు.. మొత్తంగా 36.36 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ రెండు వేదికలు 2023లో అందుకున్న ఫిర్యాదుల సంఖ్య 24.42 లక్షలు.రూ.10 వేల కోట్లకుపైగా కాపాడారు!కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ద్వారా వచ్చిన 17.8 లక్షల ఫిర్యాదులకుగాను రూ.5,489 కోట్లకు పైగా డబ్బును ప్రజలు కోల్పోకుండా కాపాడగలిగారు. బ్యాంకుల నుంచి 11 లక్షలకు పైగా అనుమానిత సైబర్ నేరస్తుల రికార్డులు అందాయి. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును దాచిన 24 లక్షల లేయర్–1 మ్యూల్ ఖాతాల వివరాలను సస్పెక్ట్ రిజిస్ట్రీ ద్వారా నిఘా సంస్థలకు చేరాయి. తద్వారా రూ.4,631 కోట్లకు పైగా విలువైన మోసాలను నిరోధించగలిగారు.

యువతి అనుమానాస్పద మృతి
రాయగడ: రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో గల చంద్రశేఖర్‌పూర్ పోలీసులు చంద్రశేఖర్‌పూర్ సమీపంలో గల ఒక అద్దె ఇంటిలో ఒక యువతి మృతదేహాన్ని గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలిని జిల్లాలోని కాశీపూర్ సమితి గొరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన అనుపమ నాయక్ (24)గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి పోలీసులు సమాచారం తెలిపారు. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం తన కూతురు ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని దీనిపై దర్యాప్తు చేయాలని మృతురాలి తండ్రి జొయల్ నాయక్ చంద్రశేఖర్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దివ్యాంగురాలైన తన కూతురు చదువుకునేందుకు చంద్రశేఖర్‌పూర్ ప్రాంతంలో ఒక అద్దె ఇంటిలో ఉంటోంది. నాలుగు నెలలుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన కుమార్తెను బెదిరిస్తున్నాడని, ఈ సంగతిని ఆమె ఫోన్లో చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.