
శ్రుతి.. ఉత్తరప్రదేశ్, ఝాన్సీలో పుట్టిపెరిగింది. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. మేకప్, ఫ్యాషన్ అంటే చాలా ఆసక్తి. అందుకే తన తొలి వీడియోను వాటి మీదే అంటే.. హెయిర్ స్టయిల్స్ మీదే తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. అప్పుడు ఆమె అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తోంది.
ఆ వీడియోకు ఆమె ఊహించని రీతిలో వ్యూస్, షేర్స్ వచ్చాయి. ఆ ప్రోత్సాహం, ఉత్సాహంతో ‘ShrutiArjunAnand’ పేరుతో యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసింది. 2013లో ఆమె ఇండియా వచ్చేవరకు ఆ చానెల్‌లో ఎక్కువగా ఫ్యాషన్ కంటెంట్ వీడియోలే అప్‌లోడ్ అయ్యేవి. ఇండియా వచ్చేశాక యూట్యూబ్ చానెల్ మీద ఫుల్ టైమ్ వర్క్ చేయడం మొదలుపెట్టింది.
డే టు డే లైఫ్‌లోని పరిస్థితులు, కుటుంబ విషయాలను కథానాంశాలుగా తీసుకుని కామెడీ టచ్‌తో వీడియోలుగా తీసి తన చానెల్‌లో అప్‌లోడ్ చేస్తోంది. తన చానెల్‌కున్న లక్షల వ్యూస్, మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌తో ఆమె 2016లోనే టాప్ 10 ఇండియన్ యూట్యూబర్స్ లిస్ట్‌లో చేరిపోయింది. ఇప్పుడు శ్రుతి.. దేశంలోకెల్లా రిచెస్ట్ యూట్యూబర్స్‌లో ఒకరు.
ఒక్క శ్రుతే కాదు ఆమె భర్త అర్జున్, కూతురు కూడా టాప్ యూట్యూబర్సే. ఇంకా చెప్పాలంటే ఆమె కుటుంబమంతా యూట్యూబర్సే. ‘ShrutiArjunAnand Digital Media’ ప్రైవేట్ లిమిటెడ్, ‘Shruti Makeup & Beauty’ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలను స్థాపించి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలసి పనిచేస్తూ సోషల్ మీడియా వ్యూయర్స్ నచ్చే.. మెచ్చే కంటెంట్‌ని క్రియేట్ చేస్తోంది శుత్రి అర్జున్ ఆనంద్.
Comments
Please login to add a commentAdd a comment