Shruti
-
ఆత్మహత్యలా.. హత్యలా?
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం/భిక్కనూరు: ఒకే సమయంలో, ఒకేచోట ఒక ఎస్ఐ, కానిస్టేబుల్, మరో యు వకుడు చనిపోవటం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ (32), బీబీపేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి (30), బీబీ పేటకే చెందిన నిఖిల్ (29) అనే యువకుడి మృతదేహాలు జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో లభ్య మయ్యా యి.శృతి, నిఖిల్ మృత దేహాలు బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బయటకు తీయగా, గురువారం ఉదయం 8.30 గంటలకు సాయికుమార్ మృతదేహం కూడా అదే చెరువులో దొరికింది. దీంతో వీరు ఎలా చనిపోయారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇవి ఆత్మహత్యలా? లేక ఈ మరణాల వెనుక ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన పోలీస్ శాఖను కూడా కుదిపేస్తోంది. మృతులు ముగ్గురికి చాలాకాలం నుంచి పరిచయం ఉండటంతో రకరకాల చర్చ జరుగుతోంది. అనుకోకుండా బయటపడిన ఘటన.. ఈ మూడు మరణాల ఘటన కూడా అనుకోకుండా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ సాయికుమార్ ఫోన్ స్విచాఫ్ వస్తోంద ని ఆయన కుటుంబ సభ్యులు బుధవారం పోలీస్ ఉన్నతాధికారులకు తెలపటంతో.. ఆయన మొబైల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద సాయికుమార్, నిఖిల్ చెప్పులు, సెల్ఫోన్లు.. శ్రుతి మొ బైల్ కనిపించాయి. ఎస్ఐ కారు కూడా చెరువు సమీపంలో ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. గజ ఈతగా ళ్లతో చెరువులో గాలించగా మరణాల మిస్టరీ బయటపడింది. జిల్లా ఎస్పీ సింధుశర్మ, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. దాదాపు 12 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. 3 మృతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తిచేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతుచిక్కని కారణాలు: ఈ ముగ్గురి మరణం వెనుక గల కారణాలు ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. వీరు ఎలా చనిపోయారన్నది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే తేలుతుందని ఎస్పీ సింధుశర్మ తెలిపారు. అయితే, వీరి మరణంపై జిల్లాలో తీవ్రంగా చర్చ సాగుతోంది. ఎస్సై సాయికుమా ర్ బీబీ పేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన సమయంలో శ్రుతితో సన్నిహితంగా ఉండేవారని ప్రచారం జరుగుతోంది. నిఖిల్ ఇటు సాయికుమార్‌తో అటు శ్రుతితో క్లో జ్గా ఉండేవాడని సమాచారం. ముగ్గురూ ఒకేసారి చనిపోవ డంతో వారి మధ్య నడిచిన వ్యవహా రం ఏమిటన్నది ఇప్పుడు కీలకంగా మారింది.సాయికుమార్ స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారం మండ లం కిష్టాపూర్ గ్రామం. 2018 ఎస్ఐ బ్యాచ్‌కు చెందిన ఆయన.. 2022 ఏప్రిల్ 13న బీబీపేటలో ఎస్ఐ గా చేరారు. గత ఏడాది ఆగస్టు 1న భిక్కనూరు ఎస్ఐగా బదిలీ అయ్యారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో 2021 నుంచి పనిచేస్తోంది. బీబీపేటకు చెందిన తోట నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్ల రిపేర్లు చేసేవాడు. పోలీస్‌స్టేషన్‌లో కంప్యూటర్లు మొరాయించినపుడు అతడే వచ్చి రిపేర్ చేసి వెళ్లేవాడని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కలిసి చనిపోయేదాకా ఎందుకు వచ్చిందన్నదానిపై పోలీసులు దృష్టి పెట్టారు. నా కొడుకు పిరికివాడు కాదు: పోస్ట్‌మార్టం నిర్వహించిన కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్దకు మృతులకు టుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకొని బోరున విలపించారు. తన కొడుకు కష్టపడి చదివి ఉద్యోగం సాధించాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఎస్ఐ సాయికుమార్ తండ్రి అంజయ్యకన్నీరుమున్నీరయ్యాడు. ఎవ రో ఒకరిని కాపాడే ప్ర యత్నంలో చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేశా రు. శ్రుతి తండ్రి పుండరీకం మాట్లా డుతూ.. ఈ ఘటన ఎలా జరిగిందనేది పోలీసులు తేల్చాలని కోరారు. నిఖిల్ చనిపోయిన విషయం పోలీసు లు చెబితే తెలిసిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. చదువులో టాపర్ఎస్ఐ సాయికుమార్ చిన్నతనం నుంచి చదువు లో టాపర్. 2007–2008లో పదో తరగతిలో మండల టాపర్‌గా నిలిచాడు. ఇంటర్‌లోనూ మంచి మార్కులు సాధించారు. హైదారాబాద్‌లోని సీబీఐటీలో బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. 2018లో పోస్టల్ డిపార్టుమెంట్, ఏఆర్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఎస్సైగా మొదటి పోస్టింగ్ సాధించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీబీపేట, భిక్కనూరులో ఎస్సైగా చేశాడు. రెండు పర్యాయాలు ఎస్పీ సింధుశర్మ చేతులమీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. 2022లో కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. మహాలక్ష్మి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని తెలిసింది. -
సింగర్ శృతి మృతికి కారణం అదే..?
-
మాటలు రావట్లేదు.. ఆయన మృతిపై 'దేవర' నటి ఎమోషనల్ (ఫొటోలు)
-
'శ్రుతి' తప్పిన ప్రకృతి.. కనురెప్పనూ కాటేసింది!
కన్నీటికి కూడా ఇష్టం ఉన్నట్టుంది. కన్నీటికి కూడా ఒక మనిషి కంటినే అంటి పెట్టుకొని ఉండాలన్న కోరిక ఉన్నట్టుంది. కన్నీరు ఎందుకనో ఒకే మనిషిని పదే పదే ఆలింగనం చేసుకుంటూ ఆ మనిషికి మరింత ప్రేమను పంచాలని అనుకుంటున్నట్టుంది. కేరళలో ఒకమ్మాయి శ్రుతి. ఆ అమ్మాయి గత కొన్ని రోజులుగా కన్నీరు కారుస్తోంది. ఆమెను ఊరడించడానికి కేరళ ప్రభుత్వం, కేరళ ప్రజలు కదిలారు. ఈ ప్రేమ కోసమేనా కన్నీరుకు ఆమెపై ప్రేమ?‘బాధ పడకు. నీకు నేనున్నాను. నేను చనిపోయినా నువ్వు ఒంటరివి కావు. నీకంటూ ఒక భరోసా ఉండేలా చూస్తాను’ అన్నాడా యువకుడు ఆ అమ్మాయితో ఓదార్పుగా. ఇవాళ ఆ యువకుడు కన్నుమూశాడు. ఆ యువకుడి మాటలను గుర్తు చేసుకుంటున్న కేరళ ప్రజలు ‘మేమున్నాం’ అంటూ ఆ అమ్మాయికి తోడుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఘటన చాలా అరుదు.ఆ అమ్మాయి పేరు శ్రుతి..అందరు అమ్మాయిల్లాంటిదే శ్రుతి. కోజికోడ్‌లో ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేయడం... సెలవులలో ఇంటికెళ్లి కుటుంబ సభ్యులతో గడపడం... తండ్రి చిన్న ఉద్యోగి... తల్లి చిన్న షాపు నడిపేది... చెల్లెలు కాలేజీ చదువుతోంది. వాళ్ల కుటుంబం వాయనాడ్‌లోని చూరలమలలో కొత్త ఇల్లు కట్టుకుని వరదలకు నెల ముందే షిఫ్ట్ అయ్యారు. అక్కడే శ్రుతి నిశ్చితార్థం జరిపించారు. ఈ డిసెంబర్లో పెళ్లి చేయాలని 4 లక్షల డబ్బు. 15 సవర్ల బంగారం ఇంట్లో దాచారు. అంతా సంతోషమే. కాని...జూలై 30 రాత్రి..ఆ రాత్రి ఉద్యోగరీత్యా శ్రుతి చూరలమలకు రెండు గంటల దూరంలో ఉన్న కోజికోడ్‌లో ఉంది. వరద విజృంభించింది. శ్రుతి వాళ్ల కొత్త ఇల్లు ధ్వంసమైంది. తల్లి, తండ్రి, చెల్లెలు... పెళ్లి కోసం దాచిన డబ్బు మొత్తం పోయాయి. ఎవరూ మిగల్లేదు. ఏమీ మిగల్లేదు. శ్రుతి కన్నీరు కట్టలు తెంచుకుంది. అది ఆగలేదు. ఆపేందుకు ఒక్కడు పూర్తిగా ప్రయత్నించాడు. అతని పేరు జాన్సన్. శ్రుతికి కాబోయే భర్త.నేనే తోడుంటా..‘శ్రుతికి ఇప్పుడు ఏమీ మిగల్లేదు. అంతమాత్రం చేత నేను వదిలేస్తానా? పదేళ్లుగా మేము స్నేహితులం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నిశ్చితార్థం కూడా అయ్యింది. ఇప్పుడు ఆమె సర్వం కోల్పోయినా నేను వదలను. తోడుంటా. నేను చనిపోయినా ఆమె ఒంటరిదై పోకుండా మంచి ఉద్యోగం, ఇల్లు ఏర్పాటు చేస్తా’ అన్నాడు. ఆ మాటలు ఎందుకన్నాడో. అవి వాయనాడ్ విషాదాన్ని ప్రసారం చేసేటప్పుడు టీవీలో టెలికాస్ట్ అయ్యాయి.ఆ తోడు కూడా పోయింది...శ్రుతికి ఇక ఏడవడానికీ కన్నీరు మిగల్లేదు. జాన్సన్ చనిపోయాడు. మొన్నటి మంగళవారం వాయనాడ్‌లో అతను, శ్రుతి, శ్రుతి బంధువులు కొంతమంది ప్రయాణిస్తున్న వ్యాను బస్సుతో ఢీకొంది. శ్రుతి, ఆమె బంధువులు స్వల్పంగా గాయపడ్డారు. కాని జాన్సన్ మృత్యువుతో పోరాడి బుధవారం మరణించాడు. అన్నీ కోల్పోయిన శ్రుతికి ఆఖరి ఆసరా కూడా పోయింది. ఆమె ఏం కావాలి?మేమున్నాం..ఇక కేరళ జనం తట్టుకోలేకపోయారు. మేమున్నాం అంటూ శ్రుతి, జాన్సన్ జంట ఫొటోలను డీపీగా పెట్టుకోసాగారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ నేనున్నానంటూ ఫేస్బుక్ పోస్ట్ రాశారు. ఫహద్ ఫాజిల్, మమ్ముట్టి సంతాపం వ్యక్తం చేశారు. కేరళ మంత్రి ఒకరు శ్రుతికి మంచి ఉద్యోగం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిది... కేరళ ప్రజలది అన్నారు. శ్రుతి కోసం కేరళ కన్నీరు కారుస్తోంది. శ్రుతి కన్నీటిని కేరళ పంచుకుంది. అయినవారిని లాక్కుని పరాయివారినెందరినో ఆమె బంధువులుగా మార్చింది కన్నీరు. ఈ కన్నీటిని ఏమని నిందించగలం. కన్నీరా కనికరించు... చల్లగా చూడు అనడం తప్ప.ఇవి చదవండి: బెయిలా? జైలా?.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు -
వైద్యురాలు కమ్ మోడల్: తొలి మిస్ యూనివర్స్ పెటిట్గా కన్నడ బ్యూటీ!
అమెరికాలో పొట్టి మహిళల కోసం నిర్వహించే అందాల పోటీల్లో విజయకేతనం ఎగురవేసింది కన్నడ బ్యూటీ. భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో ఉండే ఈ మోడల్ అతిపెద్ద కలను సాకారం చేసుకుంది. ప్రతి అమ్మాయి తాను అందాల రాణిని కావాలని ఆకాంక్షిస్తుంటది. అది సాధ్యం కానీ లక్ష్యమే అయినా పట్టుదలగా దాన్ని సాకారం చేసుకుని మరీ అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ కన్నడ మోడల్. ఆమె పేరు శృతి హెగ్డే. ఎవరీమె..? ఎలా ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొన కలిగిందంటే..బెంగళూరుకు చెందిన శృతి హెగ్డే అనే వైద్యురాలు మోడల్‌గా మారి అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఈ అందాల పోటీ అంత సులభమైనది కాదు. ఇది పొట్టి మహిళలకు అవకాశం కల్పించేందుకు 2009లో ప్రారంభించిన అందాల పోటీ. ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్లంతా అమేజనోనియన్ ప్రమాణాల ప్రకారం మరుగుజ్జుగా ఉంటారు. ప్రతి ఏడాది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపాలో ఈ పోటీలు నిర్వహిస్తారు.నిజానికి శృతి డాక్టర్‌గా పనిచేస్తూ మరోవైపు మోడల్‌గా ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రిపేరయ్యేది. ఆస్పత్రిలో 36 గంటల షిఫ్ట్‌ల తోపాటు విశ్రాంతి తీసుకొని మెడికల్ ఎమర్జెన్సీని కూడా ఎదుర్కోంది. అందాల రాణి కావాలన్నది ప్రతి అమ్మాయి కల..అయితే తాను జస్ట్ ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నా, దీనికి తన అమ్మ అందించిన సపోర్టు కూడా ఎంతో ఉపయోగపడిందని అంటోంది హెగ్డే. తాను 2018 మిస్ ధార్వాడ్ పోటీకి సైన్ అప్ చేసింది. ఈ పోటీలో గెలిచేందుకు సన్నద్ధమవుతున్న క్రమంలో తాను చాలా పాఠాలను నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ముందుగా తన వైద్య రంగాన్ని, మోడలింగ్ కెరీర్‌ని బ్యాలెన్స్ చేయడం చాలా సవాలుగా ఉండేది. ఒక్కోసారి విశ్రాంతి తీసుకునేంత తీరిక లేని పనులతో ఉక్కిరిబిక్కిరిగా ఉండేదని చెబుతోంది. ఇంతలో 2019లో తనకు గర్భాశయ కణితులు ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పింది. దీంతో ఓ రెండేళ్లు ట్రీట్‌మెంట్‌తోనే గడిచిపోయింది. ఇక కెరీర్ ముగిసిపోయింది. ఈ అందాల పోటీల్లో పాల్గొనలేను అనుకున్న సమయాన్ని ఆమె తల్లి అందించిన మద్దతుతో తిరిగా మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. అలా మిస్ ఆసియా ఇంటర్నేషనల్ ఇండియా 2023 రెండో రన్నరప్‌గా టైటిల్‌ని దక్కించుకుంది. ఎప్పుడైతే ఈ టైటిల్ గెలిచిందో అప్పుడు ఆమె మీద ఆర్థిక ఒత్తిడి తగ్గింది. అంతకమునుపు ఓ పక్క ట్రీట్మెంట్ మరోవైపు పోటీల ప్రీపరేషన్తో ఆర్థిక భారం ఎక్కువగా ఉండేది. దీంతో పోటీల్లో ప్రదర్శని ఇచ్చేందుకు కేవలం రెండు దుస్తులే ఉండేవి. వాటినే వేర్వురు ప్రదర్శనల్లో ధరించేదాన్ని అని చెబుతోంది. ఇప్పుడు ఆమెకు స్పాన్సర్లు లభించడంతో ఈ ఆర్థిక భారం నుంచి కాస్త ఉపశమనం పొందింది. ఆమె కష్టానికి ఫలితమే దక్కి గత నెల జూన్ 10న భారతదేశపు తొలి మిస్ యూనివర్సల్ పెటైట్‌గా కిరీటాన్ని గెలుచుకుంది. (చదవండి: స్పేస్‌లో భోజనం టేస్ట్ ఎలా ఉంటుందంటే..!) -
Shruti Reddy: స్టన్నింగ్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న శ్రుతి రెడ్డి (ఫోటోలు)
-
టాప్ 10 ఇండియన్ యూట్యూబర్స్ లిస్ట్‌లో.. 'శ్రుతి అర్జున్ ఆనంద్'!
శ్రుతి.. ఉత్తరప్రదేశ్, ఝాన్సీలో పుట్టిపెరిగింది. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. మేకప్, ఫ్యాషన్ అంటే చాలా ఆసక్తి. అందుకే తన తొలి వీడియోను వాటి మీదే అంటే.. హెయిర్ స్టయిల్స్ మీదే తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. అప్పుడు ఆమె అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది.ఆ వీడియోకు ఆమె ఊహించని రీతిలో వ్యూస్, షేర్స్ వచ్చాయి. ఆ ప్రోత్సాహం, ఉత్సాహంతో ‘ShrutiArjunAnand’ పేరుతో యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసింది. 2013లో ఆమె ఇండియా వచ్చేవరకు ఆ చానెల్లో ఎక్కువగా ఫ్యాషన్ కంటెంట్ వీడియోలే అప్లోడ్ అయ్యేవి. ఇండియా వచ్చేశాక యూట్యూబ్ చానెల్ మీద ఫుల్ టైమ్ వర్క్ చేయడం మొదలుపెట్టింది.డే టు డే లైఫ్‌లోని పరిస్థితులు, కుటుంబ విషయాలను కథానాంశాలుగా తీసుకుని కామెడీ టచ్‌తో వీడియోలుగా తీసి తన చానెల్లో అప్లోడ్ చేస్తోంది. తన చానెల్కున్న లక్షల వ్యూస్, మిలియన్ల సబ్స్క్రైబర్స్తో ఆమె 2016లోనే టాప్ 10 ఇండియన్ యూట్యూబర్స్ లిస్ట్‌లో చేరిపోయింది. ఇప్పుడు శ్రుతి.. దేశంలోకెల్లా రిచెస్ట్ యూట్యూబర్స్లో ఒకరు.ఒక్క శ్రుతే కాదు ఆమె భర్త అర్జున్, కూతురు కూడా టాప్ యూట్యూబర్సే. ఇంకా చెప్పాలంటే ఆమె కుటుంబమంతా యూట్యూబర్సే. ‘ShrutiArjunAnand Digital Media’ ప్రైవేట్ లిమిటెడ్, ‘Shruti Makeup & Beauty’ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలను స్థాపించి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలసి పనిచేస్తూ సోషల్ మీడియా వ్యూయర్స్ నచ్చే.. మెచ్చే కంటెంట్‌ని క్రియేట్ చేస్తోంది శుత్రి అర్జున్ ఆనంద్. -
Gaming: శతకోటి సూర్యప్రభా భాసిత... వీరాధివీరా!
పురాణాలు ఇప్పుడు కాలక్షేపం కోసం కాదు. వయసు మళ్లిన వారి కోసం మాత్రమే కాదు. మిలీనియల్స్ నుంచి జెన్ జెడ్ వరకు యువతరం పురాణాలను ఇష్టపడుతోంది. అయితే అది చదువు రూపంలో కాదు. గేమింగ్ రూపంలో. ఇండియన్ మైథలాజికల్ గేమ్స్‌ను ఆడడానికి గేమర్స్‌లో 82 శాతం మంది ఇష్టపడుతున్నట్లు చెబుతోంది గేమింగ్ అండ్ ఇంటరాక్టివ్ మీడియా ఫండ్ సంస్థ లుమికై. అర్జునుడి నుంచి కర్ణుడి వరకు రకరకాల పురాణపాత్రలలో ‘ప్లేయర్’ రూపంలో పరకాయ ప్రవేశం చేస్తోంది యువతరం...వెల్కమ్ టు గేమ్ జోన్..అహ్మదాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని శాన్వీకి గేమింగ్ అంటే బోలెడంత ఇష్టం. ఎక్కువ సమయాన్ని టెక్ట్స్బుక్స్తోనే గడిపే శాన్వీ కాసేపు వీడియో గేమ్స్ ఆడడం ద్వారా రిలాక్స్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ‘డెత్స్ డోర్’ నుంచి ‘మాన్స్టర్ హంటర్’ వరకు ఎన్నో గేమ్స్ ఆడింది. అయితే ఒక ఫ్రెండ్ సలహా ప్రకారం కొన్ని నెలల క్రితం తొలిసారిగా ఇండియన్ మైథలాజికల్ గేమ్ ఆడింది. ఇక అప్పటి నుంచి అలాంటి గేమ్స్ మాత్రమే ఆడుతోంది.‘మైథలాజికల్ గేమ్స్‌కు ఇతర గేమ్స్‌కు తేడా ఏమిటో తొలిసారిగా తెలుసుకున్నాను. ఇవి కేవలం కాలక్షేప ఆటలు కావు. పురాణ జ్ఞానాన్ని, తార్కిక శక్తిని పెంచుతాయి’ అంటుంది శాన్వీ. ‘చిన్న పట్టణాలతోపాటు గ్రామీణ ్రపాంతాలలో కూడా స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడంతో గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరిగింది. మన దేశంలో పెద్ద గేమింగ్ కన్జ్యూమర్ బేస్ ఉంది. గతంతో ΄ోల్చితే వచ్చిన మార్పు ఏమిటంటే మన సాహిత్యం, సంస్కృతితో ముడిపడి ఉన్న పాత్రలను యువ గేమర్స్ ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్–క్లాస్ టెక్నాలజీతో మనవైన పాత్రలను ఇండియన్ స్టూడియోలు డెవలప్ చేస్తున్నాయి’ అంటుంది ‘విన్జో గేమ్స్’ కో–ఫౌండర్ సౌమ్య సింగ్ రాథోడ్.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మన పురాణాలు, చరిత్ర, సంస్కృతి, జానపద సాహిత్యంలోని పాత్రల ఆధారంగా మరిన్ని గేమ్స్ ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ నుంచి రానున్నాయి అంటుంది సౌమ్య. ‘పురాణాలను గేమింగ్‌తో మిళితం చేయడంతో ప్లేయర్స్ కొత్త రకం అనుభూతికి గురవుతున్నారు. అన్ని వయసుల వారిని ఈ గేమ్స్ ఆకట్టుకుంటున్నాయి’ అంటున్నాడు ‘ఇన్ఫోఎడ్జ్ వెంచర్స్’ ఫౌండర్ చిన్మయ్ శర్మ. ‘మన పురాణాల్లో దాగున్న ఎన్నో ఇతివృత్తాలు డెవలపర్లను ఆకర్షిస్తున్నాయి. ఆ పాత్రలు యూత్‌ను ఆకట్టుకునేలా గేమ్‌ను డిజైన్ చేస్తున్నారు’ అంటున్నాడు యుగ్ మెటావర్స్ సీయీవో ఉత్కర్ష్ శుక్లా.మైథలాజికల్ గేమ్స్ అనేవి ఎక్కువగా ఫస్ట్–పర్సన్ షూటర్(ఎఫ్‌పీఎస్) గేమ్స్. మెయిన్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి ఆడే గేమ్స్.‘టెస్ట్ యువర్ స్కిల్స్ ఇన్ దిస్ ఎపిక్ స్ట్రాటజీ గేమ్’ అంటూ ఆహ్వానించిన ‘కురుక్షేత్ర: అసెన్షన్’ దిల్లీకి చెందిన సజనికి బాగా నచ్చింది. ఈ వీడియో గేమ్‌లో అర్జునుడు, భీముడు, కర్ణుడులాంటి ఎన్నో పాత్రలు ఉంటాయి.‘మైథలాజికల్ గేమ్స్ మనల్ని మన మూలాల్లోకి తీసుకువెళతాయి. మన పురాణాలు, జానపదాల ఆధారంగా గేమ్స్‌ను రూపొందించే అద్భుత అవకాశం ఇప్పుడు గేమ్ డెవలపర్లకు వచ్చింది. దేవ, దానవుల మధ్య యుద్ధానికి సంబంధించి సెకండ్ గేమ్‌ను రూపొందిస్తున్నాం’ అంటున్నాడు ‘కురుక్షేత్ర’ గేమ్‌ను రూపొందించిన ‘స్టూడియో సిరా’ కో–ఫౌండర్ అభాస్ షా.‘కురుక్షేత్ర’ను తక్కువ సమయంలో ఆరు లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్నారు.మన దేశంలోనే కాదు ఆగ్నేయాసియా దేశాలలో కూడా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందించిన గేమ్స్‌ను ఆడడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టాన్ని క్యాష్ చేసుకోవడం అని కాకుండా ఈ గేమ్స్ ద్వారా యువతలో నైతిక విలువలు పాదుకొల్పే, ఆత్మస్థైర్యం పెంచగలిగే ప్రయత్నం చేస్తే భవిష్యత్ కాలంలో వాటికి మరింత ఆదరణ పెరుగుతుంది. రాజీ పడకుండా...నోడింగ్ హెడ్స్ గేమ్స్ కంపెనీ రూపొందించిన ‘రాజీ: యాన్ ఏన్షియెంట్ ఎపిక్’ మనల్ని మన పురాణ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. మన దేవాలయాల సౌందర్యం నుంచి ఇతిహాస కళ వరకు ఈ గేమ్‌లో ప్రతిఫలిస్తుంది. కంపెనీ ్రపారంభం నుంచి మన పురాణాల ఆధారంగా గేమ్‌ను రూపొందించాలని కల కన్నది పుణేకు చెందిన ‘నోడింగ్ హెడ్స్ గేమ్స్’ కంపెనీ ఫౌండర్ శృతి ఘోష్.‘రాజీ’ రూపంలో తన కలను నిజం చేసుకుంది.‘గ్రీకు ఇతర పురాణాలు సినిమాలు, గేమ్స్ రూపంలో మనల్ని ఆకట్టుకున్నాయి. అయితే ఆ స్థాయిలో మన పురాణాలు గుర్తింపు పొందలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పురాణాల ఆధారంగా రాజీ గేమ్‌కు రూపకల్పన చేశాం. ఇది ఎంతో మంది డెవలపర్లకు స్ఫూర్తిని ఇచ్చింది. ఎంత చెప్పినా మన పురాణాల్లో నుంచి చెప్పడానికి ఇంకా ఎంతో ఉంటుంది’ అంటుంది శృతి ఘోష్.– శృతి ఘోష్ -
Haryana Political Crisis: బీజేపీ గూటికి కిరణ్ చౌదరి
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ హరియాణాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఎమ్మెల్యే కిరణ్ చౌదరి, ఆమె కూతురు శ్రుతి చౌదరిని కాంగ్రెస్‌ను వీడి బుధవారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, హరియాణా సీఎం నయాబ్‌సింగ్ సైనీల సమక్షంలో వీరిద్దరూ కాషాయ కండువాలు కప్పుకున్నారు. కిరణ్ చౌదరి ఎమ్మెల్యే కాగా, శృతి హరియాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ. హరియాణా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కోడలు కిరణ్. హరియాణా కాంగ్రెస్ పార్టీని సొంత జాగీరులా నడుపుతున్నారని తన బద్ధ విరోధి, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాపై కిరణ్ ధ్వజమెత్తారు. -
తెలియనితనంలో ఉండే బలం ప్రతిఘటనే!
నోరు మూయించి పెత్తనం చేసే పాలకులు నోరు మూసుకుని బతికే ΄పౌరులు చరిత్ర నిండా ఉంటారు. కాని నోరు మూసుకొని ఉండటం చేతగాక అన్యాయాన్ని చూస్తూ ఉండలేక గొంతెత్తి గర్జించేవాళ్లు చరిత్రలో నిలబడిపోతారు. మన దేశ మూలాలున్న హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని శ్రుతి కుమార్– ఆ ప్రతిష్టాత్మక ్రపాంగణంలో గాజా మీద ఇజ్రాయిల్ చేస్తున్న పాశవిక దాడులకు వ్యతిరేకంగా నోరు విప్పింది. ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. వెనుకంజ వేయని మానవత్వం చాటిన శ్రుతి కుమార్ పరిచయం, నేపథ్యం.హార్వర్డ్ యూనివర్సిటీ తన విద్యార్థుల గురించి సరిగ్గా అధ్యయనం చేసినట్టు లేదు. చేసి ఉంటే బహుశా శ్రుతి కుమార్‌కు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండేది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ సెరెమొనీలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులు విశేషంగా హాజరయ్యి వేదిక మీద పట్టా అందుకుంటున్న తమ పిల్లలను హర్షధ్వానాలతో ఉత్సాహపరుస్తారు. హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రతి ఏటా ఈ సెర్మనీలో పట్టా పొందుతున్న ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రసంగించే అవకాశం ఇస్తారు. ఈసారి ప్రసంగం చేసే అవకాశం శ్రుతి కుమార్‌కు వచ్చింది. అక్కడే ఆమెకు గొంతెత్తే అవకాశం లభించింది.నిరసనల నేపథ్యంఅక్టోబర్ 7, 2023న హమాస్ సంస్థ ఇజ్రాయిల్ మీద దాడి చేసి 1400 ఇజ్రాయిలీల మరణానికి కారణం కావడంతో బదులు తీర్చుకోవడానికి రంగంలో దిగిన ఇజ్రాయిల్ నేటికీ ఆగని బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. ఇప్పటికి 35,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా వీరిలో కనీసం ఇరవై వేల మంది స్త్రీలు, పసి పిల్లలు. ఈ దాడులు మొదలైనప్పటి నుంచి అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు మొదలైనా ఇజ్రాయిల్ మరింత దుర్మార్గంగా గాజాలోని ఆస్పత్రుల పై, స్కూళ్లపై దాడులు చేస్తుండటంతో ఇక విద్యార్థులు ఆగలేకపోయారు. ఏప్రిల్ నుంచి అమెరికా విశ్వవిద్యాలయాలు ‘యాంటీ ఇజ్రాయిల్’ నిరసనలతో హోరెత్తాయి. యూనివర్సిటీలు దిక్కుతోచక పోలీసులను ఆశ్రయిస్తే ఇప్పటికి 900 మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. వారిలో ఒక భారతీయ విద్యార్థిని కూడా ఉంది. అమెరికా యూనివర్సిటీలు తమ దగ్గర పోగయ్యే ఫండ్స్‌ను ఇజ్రాయిల్‌కు వంత పాడే బహుళ జాతి వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం మానేయాలని, ఆ డబ్బును వెనక్కు తీసుకోవాలనేది విద్యార్థుల ప్రధాన డిమాండ్. అంతే కాదు టెల్ అవివ్ (ఇజ్రాయిల్) యూనివర్సిటీతో కోర్సుల ఆదాన ప్రదానాలు చేసుకోవడం బంద్ చేయాలని కూడా డిమాండ్. ఏప్రిల్ 18న ఇదే విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీలో భారీ నిరసన జరిగింది. విద్యార్థులు ఏకంగా మూడు చోట్ల పాలస్తీనా జెండాను ఎగురవేశారు. దాంతో యూనివర్సిటీ కన్నెర్ర చేసి ‘వయొలేషన్ ఆఫ్ యూనివర్సిటీ పాలసీ’ కింద 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా శిక్షించింది. అదే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రుతి కుమార్ ఈ అంశం మీద నిరసన వ్యక్తం చేసేందుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీని ఎంచుకుంది.ఆమె ఒక టోర్నడోబీభత్సమైన పిడుగుపాట్లకూ, టోర్నడోలకు పేరు పెట్టిన నెబ్రాస్కా (అమెరికా) రాష్ట్రంలో పుట్టిన కన్నడ మూలాలున్న అమ్మాయి శృతి కుమార్. అక్కడ విస్తారంగా సాగు చేసే జొన్నరైతుకు పెద్ద కూతురు ఆమె. చదువుతో పాటు ఆట, పాట, మాటలో కూడా ఆసక్తి చూపింది. మంచి వక్త. ‘నేషనల్ స్పీచ్ అండ్ డిబేట్ –2019’లో పాల్గొని ఐదవ ర్యాంకులో నిలిచింది. 2020లో ‘వాయిస్ ఆఫ్ డెమొక్రసీ’ పోటీలో మొదటి విజేతగా నిలిచి 30 వేల డాలర్లు గెలుచుకుంది. అంతేకాదు తన చదువుకు స్పాన్సర్ని కూడా. యోగాలో దిట్ట. ముందు నుంచి అన్యాయాల, అపసవ్యతల మీద వ్యతిరేకత తెలిపే అలవాటున్న శ్రుతి కుమార్‌కు హార్వర్డ్ అవకాశం ఇవ్వడంతో ఆ యూనివర్సిటీనే హెచ్చరించి ఖంగు తినిపించింది.తెలియనితనపు బలంహార్వర్డ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో శ్రుతి కుమార్ తన ప్రసంగానికి పెట్టుకున్న పేరు ‘తెలియనితనంలో ఉండే బలం’. ఆమె తన ప్రసంగం చేస్తూ ‘ప్రపంచంలో ఆర్గనైజ్డ్గా జరుగుతున్న అన్యాయాల గురించి అన్నీ తెలిసి నోరు మెదపని వారి కంటే ఏమీ తెలియకనే అది అన్యాయమనే కేవలం గ్రహింపుతో బరిలోకి దిగి ఎదిరించే నాలాంటి విద్యార్థులకు ఉండే బలం పెద్దది’ అని అంది. ‘పసిపిల్లల వంటి అమాయకత్వంతో కొత్త జన్మెత్తి అన్యాయాలను ప్రతిఘటించడానికి ముందుకు రావాలనే’ అర్థంలో శ్రుతి కుమార్ మాట్లాడి హర్షధ్వానాలు అందుకుంది. ‘మన విశ్వవిద్యాలయ ్రపాంగణంలో భావ ప్రకటనా స్వేచ్చపట్ల వ్యక్తమైన అసహనాన్ని చూసి నేను చాలా నిరాశకు గురవుతున్నాను. 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా ఆపారు. దీనిని వ్యతిరేకిస్తూ పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదు వందల మంది అధ్యాపకులం ఖండించాం. విశ్వవిద్యాలయ యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. అయినా సరే వినలేదు. హార్వర్డ్, మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్, మా మాటలు వింటున్నావా?’ అని శ్రుతి గర్జించింది. ‘ఇప్పుడు గాజాలో జరుగుతున్న ఘటనల మీద క్యాంపస్ మొత్తంగా దుఃఖం, అనిశ్చితి, అశాంతి చూస్తున్నాను. సరిగ్గా ఇప్పుడే ఇటువంటి క్షణంలోనే తెలియనితనపు శక్తి కీలకమైన దవుతుంది’ అందామె.పర్యవసానాలను గురించి వెరవక శ్రుతి ఈ ప్రసంగం చేసింది. యూనివర్సిటీకి తాను ఇచ్చిన ప్రసంగం పేజీలలో లేనిదాన్ని మధ్యలో ఇమిడ్చి ధైర్యంగా మాట్లాడింది. నిజం చె΄్పాలంటే శ్రుతి అన్ని దేశాల విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిస్తోంది. అన్నీ తెలిసి ఊరికే ఉండటం కన్నా, ఏమీ తెలియకనే ‘అన్యాయం’ అనిపించినప్పుడు వెంటనే గొంతెత్తాలని సందేశం ఇస్తోంది.ఆమె ప్రసంగంలో కొంత‘నేడు ఈ ఉత్సవం మనకు తెలిసినదాని కోసం చేస్తున్నారు. మనకు ఏం తెలుసో దానిని ప్రశంసిస్తున్నారు. కాని తెలియనితనపు బలం ఒకటుంటుంది. నేనిక్కడికి (హార్వర్డ్) వచ్చేవరకూ ‘విజ్ఞానశాస్త్ర చరిత్ర’ అనే పాఠ్యాంశం ఉన్నదనేదే నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఆ శాఖ నుంచి నేను గ్రాడ్యుయేట్ నయ్యాను. చరిత్రంటే మనకు తెలిసిన కథల గురించి ఎంత చదవాలో... తెలియని కథల గురించి కూడా అంత చదవాలని ఇక్కడే తెలుసుకున్నాను’(మరికొంతసేపు మాట్లాడి తన దుస్తులలో నుంచి చిన్న కాగితం తీసి ప్రధాన ప్రసంగానికి విరామం ఇచ్చి ఇలా మాట్లాడింది) ‘నా నాల్గవ సంవత్సరం చదువులో యూనివర్సిటీలో మా భావ ప్రకటనా స్వేచ్ఛ, మా నిరసన ప్రదర్శనా స్వేచ్ఛ నేరాలుగా మారిపోయాయి. నేనిక్కడ ఇవాళ మీ ముందు నిలబడి నా సహ విద్యార్థులైన పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను గుర్తు చేసుకోవాలి. ఆ పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్లు ఇవాళ పట్టభద్రులు కాలేకపోతున్నారు. మన విశ్వవిద్యాలయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల వ్యక్తమైన అసహనం ఫలితం ఇది. దీనికి నేను చాలా నిరాశæ చెందుతున్నాను. పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదువందల మంది అధ్యాపకులం ఈ అసహనాన్ని ఖండించాం. యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. విద్యార్థులు మాట్లాడినా అధ్యాపకులు మాట్లాడినా అదంతా ఈ క్యాంపస్‌లో స్వేచ్ఛ గురించే. ΄పౌరహక్కుల గురించే. హార్వర్డ్... మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్... మా మాటలు వింటున్నావా?’(అని మళ్లీ ప్రధాన ఉపన్యాసంలోకి వచ్చింది) ‘ఒక జాతి అయిన కారణాన తనను లక్ష్యంగా చేసి దాడులకు గురి చేయడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. హింసా, మృత్యువూ మన కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. మనకు తెలియవలసిన అవసరం కూడా లేదు. మనం కూడగట్టి మాట్లాడటం అనేది మనకు తెలిసి ఉన్న విషయాల గురించే కానక్కరలేదు. మనకు తెలియనిదాని గుండా కూడా ప్రయాణించాలి’ అందామె.ప్రసంగం చివర ఎమిలీ డికిన్సన్ కవితా వాక్యాన్ని కోట్ చేసింది. ‘ప్రభాతం ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ప్రతి తలుపూ తెరిచి పెడతాను’. -
శృతి శర్మ : ‘హీరామండి’లో మెరిసిన ‘ఏజెంట్’ హీరోయిన్
-
శ్రుతికి స్వాగతం పలికిన 'దేవర'
మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో శ్రుతి తెలుగుకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘దేవర’ షూటింగ్లో శ్రుతి జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మాధ్యమాల వేదికగా వెల్లడించారు శ్రుతి. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ కేరళ వెళ్లాలనే ఆలోచనలో ఉందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. -
గడ్డిదారంతో దుస్తులు.. పట్టుపురుగులొద్దు, పత్తి వద్దు. పాలిస్టర్ వద్దు
‘పట్టు కోసం పట్టుపురుగుల ్రపాణాలు తీయవద్దు. పత్తి కోసం రైతులు కష్టాలను కొని తెచ్చుకోవద్దు. మట్టిలో కలవడానికి మొరాయిస్తుంది పాలియెస్టర్. ఆ దుస్తులతో పర్యావరణానికి హాని కలిగించద్దు.గడ్డి దారంతో ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్ తీసుకువద్దాం.స్టైల్ స్టేట్మెంట్కి కొత్త నిర్వచనం ఇద్దాం’... ...అంటోంది నేచర్ లవర్ శృతి రావల్. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన శృతి అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించింది. పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే తన సంకల్పానికి వస్త్ర ప్రపంచాన్ని వేదికగా మార్చుకుందామె. ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పట్ల తన ఆసక్తిని సాక్షితో పంచుకున్నదీ యువతి. ఫ్యాషన్ – పర్యావరణం ‘‘నేను పుట్టింది హరియాణాలోని పంచకుల. అమ్మ పుట్టిల్లు పంజాబ్. నాన్నది హరియాణా. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేటప్పటికి నేను సిక్తŠస్ క్లాస్‌లో ఉన్నాను. ఇక నా చదువు, కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడిపోయింది. ఫ్యాషన్ ప్రపంచాన్ని బాగా అధ్యయనం చేసే కొద్దీ ఈ ఇండస్ట్రీ నుంచి పర్యావరణానికి కలిగే హాని అర్థమైంది. చాలా ఆందోళన కలిగింది. మన వస్త్రాల మోజు భూమిని అతలాకుతలం చేస్తోంది. భూమాతను కలుషితం చేస్తున్న ఇండస్ట్రీలలో ఫ్యాషన్ ఇండస్ట్రీ రెండవది. దీనికి పరిష్కారం ఈ రంగంలోనే వెతకాలనిపించింది. పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాన్ని చూపించాలనేదే నా ప్రయత్నం. నా స్టూడియోకి ‘ఎవోక్’ అని పేరు పెట్టడంలోని ఉద్దేశం కూడా పర్యావరణం పట్ల నిద్ర మేల్కొనండి’ అని పిలుపునివ్వడం. రిస్క్ అని హెచ్చరించారు! ఎవోక్ ్రపాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్. ఈ ఎకో ఫ్రెండ్లీ క్లోతింగ్ స్టూడియోని 2020 మార్చిలో ్రపారంభించాను, అదే నెలలో లాక్డౌన్ మొదలైంది. ఆ మెటీరియల్‌తో మాస్కులు చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి విరాళంగా ఇచ్చాను. ఈ ్రపాజెక్టు ్రపారంభానికి ముందే... ‘రిస్క్ చేస్తున్నావు’ అన్నారు తెలిసిన వాళ్లందరూ. పర్యావరణ పరిరక్షణ గురించి దశాబ్దాలుగా చెప్తున్నా కూడా సమాజంలో తగినంత చైతన్యం రానేలేదు. ఈ గడ్డి దుస్తుల గురించి అసలే తెలియదు. రంగు భరోసా, వస్త్రం మన్నిక ఉంటుందని కూడా తెలియదు. అలాంటప్పుడు మార్కెట్ ఎలా? పెట్టుబడి వెనక్కి వచ్చేదెప్పటికి? అన్నారు. అందరూ అలా అనుకుని తమను తాము సేఫ్జోన్లో ఉంచుకుంటే చాలా? బాగా లాభాలు వచ్చే రంగాన్నే ఎంచుకోవాలనే స్వార్థం తప్పు కాదు. కానీ లాభాల కోసం కొన్నేళ్లపాటు ఎదురు చూడగలిగిన ఆర్థిక పరిపుష్టి ఉన్నవాళ్లయినా ఒక ప్రయత్నం చేయాలి. ఇరవై ఏళ్ల కిందట ఎవరూ ముందుకు రాకపోతే మనం ఈ రోజు ఎలక్ట్రానిక్ వెహికల్‌ను వాడగలిగేవాళ్లమా? అలాగే వీగన్ డైట్ గురించి కూడా ఎంతోమంది సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చైతన్యవంతం చేశారు. నేను కూడా గత నెల 23వ తేదీన హెంప్, బెంబెర్గ్, టెన్సెల్, సిట్రస్ పీల్ వస్త్రాలతో రూపొందించిన డిజైనర్ వేర్‌తో ఫ్యాషన్ పెరేడ్ నిర్వహించాను. ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉద్యమంలో మమేకమయ్యే క్రమంలో నేను వెజిటేరియన్‌గా మారిపోయాను’’ అని చెప్పింది శృతి. ‘భవిష్యత్తులో మనం ప్రతి విషయంలోనూ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిందే. అందులో భాగంగా నేను నా ఫ్యాషన్ రంగాన్నే మాధ్యమంగా ఎంచుకున్నాను’ అని చె΄్పారు శృతి రావల్. ఆకులతో దారం ! ఒక రైతు పొలం దున్ని పత్తి పంట వేసి ఒక కేజీ పత్తి పండించాలంటే ఇరవై వేల లీటర్ల నీరు కావాలి. ఒక టెక్స్టైలర్ ఒక టీ షర్టుకి రంగులద్దడానికి రెండున్నర వేల లీటర్ల నీరు కావాలి. పత్తి పండడానికి పట్టే నీటిని భూమి పీల్చుకుంటుంది, ఇది కొంతలో కొంత నయం. కానీ హాట్ డైయింగ్ పద్ధతిలో రసాయన రంగులద్దిన నీరు భూమిని కలుషితం చేస్తుంది. అందుకే నేను గడ్డి మొక్కల దారంతో వడికిన వస్త్రాలను పరిచయం చేస్తున్నాను. మనదేశంలో ఇలాంటి సంస్థలు నాలుగైదుకి మించిలేవు. ఇక పూర్తి స్థాయి హెంప్ (నార) క్లోతింగ్ స్టూడియో హైదరాబాద్‌లో ఇదొక్కటే. ఆకులను శుభ్రం చేసే ్రపాసెస్లో బూజు పట్టకుండా సహజసిద్ధమైన వనరులనే జత చేస్తారు. ఎండిన ఆకులతో దారం వడుకుతారు. మొక్కల ఆకుల దారంతో వస్త్రాలు తయారు చేసే పరిశ్రమలు మనదేశంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో మాత్రమే ఉన్నాయి. ఈ గడ్డి రకం మొక్కలు పత్తిలాగ ఎక్కువ నీటిని తీసుకోవు, పత్తికంటే త్వరగా పెరిగి చేతికి వస్తాయి. వీటి పరిరక్షణ కోసం శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఈ దారం ఇప్పుడు చైనా నుంచి దిగుమతి అవుతోంది. ఈ దుస్తులు ఎలా ఉంటాయోననే ఆందోళన అక్కర్లేదు. నేను ధరించింది హెంప్ వీవింగ్ డ్రస్సే. క్లాత్ మీద డిజైన్లు నేను రూపొందించి డిజిటల్ ప్రింట్ చేయిస్తాను. కోల్డ్ డై కలర్స్ కాబట్టి క్లాత్‌తోపాటు ఎక్కువ కాలం మన్నుతాయి. – శృతి రావల్, ఫౌండర్, ఎవోక్ స్టూడియో,హైదరాబాద్ - – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
స్నేహా కాదు.. ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం పుష్ప పార్ట్-2లో నటిస్తున్నాడు. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే బన్నీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. పొలిటికల్ లీడర్ కూతురు స్నేహరెడ్డిని అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లాడాడు. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు. అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి కూడా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా పిల్లలతో బన్నీ సరదా మూమెంట్స్, వెకేషన్ ఇలా తనకి సంబంధించిన విషయాలను ఇన్‌స్టాలో పంచుకుంటుంది. ఈ క్రమంలో స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌కు స్నేహా కంటే ముందు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో తన ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరును బన్నీ రివీల్ చేసేశాడు. ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 ఫైనల్స్‌కు అల్లు అర్జున్ గెస్టుగా విచ్చేశాడు. కంటెస్టెంట్లలో శ్రుతి అనే సింగర్ పాట పాడిన అనంతరం బన్నీ మాట్లాడుతూ.. 'నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ వీడియో చూసి స్నేహా ఎలా రియాక్ట్ అవుతుందో..! -
సంకల్ప బలమే సబల విజయం
కోపం వస్తే కొందరు ఏంచేస్తారు? దగ్గర్లో ఉన్న వస్తువును నేలకేసి బాదుతారు. మరింత ముందుకు వెళ్లి తమకు తాము హాని చేసుకుంటారు. ప్రతికూలత ప్రతిధ్వనించే కోపాన్ని శక్తిగా మలుచుకుంటే అద్భుతాలు సాధించలేమా! ‘అప్నా క్లబ్’ కో–ఫౌండర్, సీయీవో శ్రుతి విజయగాథ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది... శ్రుతికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అయితే అది అకారణ కోపం మాత్రం కాదు. ‘నీకు ముగ్గురూ ఆడపిల్లలేనా. అయ్యో!’ అని తన తండ్రి దగ్గర ఎవరో వాగినప్పుడు... ‘ఈ అమ్మాయిలకు మ్యాథ్స్ బొత్తిగా రాదు’ ‘కాలేజీలో సైన్స్ జోలికి వెళ్లవద్దు. ఏదైనా తేలికపాటి సబ్జెక్ట్ తీసుకోండి’ అని క్లాసు టీచర్ ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు... ‘అలా గట్టిగా నవ్వుతావేమిటీ? ఆడపిల్లను అనే విషయం మరిచావా’ అని బంధువు ఒకరు అన్నప్పుడు... ఆమెకు కట్టలు తెచ్చుకునేంత కోపం వచ్చేది. అయితే ఆ కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తనకు తెలుసు. ‘ఆడపిల్లలకు మ్యాథ్స్ రాదు’ అని వెక్కిరింపు శ్రుతిలో పట్టుదలను పెంచి ఐఐటీ–దిల్లీ వరకు తీసుకెళ్లింది. అయితే అక్కడ కూడా లింగవివక్ష రకరకాల రూపాల్లో వెక్కిరించేది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు ‘ఇక్కడ ఆడవాళ్లకు ఏం పని?’ ‘స్కోర్ జీరో బ్యాచ్’ ఇలా ఎన్నో వెక్కిరింపులు వినిపించేవి. తన స్నేహితులతో కలిసి ఎన్నో కప్పులు గెలుచుకొని ఆ వెక్కిరింపులకు గట్టి సమాధానం చెప్పింది శ్రుతి. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగప్రస్థానం మొదలైంది. అయితే అక్కడ కూడా ఏదో రకమైన వివక్షత కనిపించేది. ఆ తరువాత కాలంలో... ఉద్యోగం వద్దనుకొని ఒక స్వచ్ఛంద సంస్థలో చేరింది శ్రుతి. అక్కడ మనసు ప్రశాంతంగా అనిపించింది. తన గురించి తాను తీరిగ్గా ఆలోచించుకునే అవకాశం వచ్చింది. ‘ప్రయాణించడానికి దారులు ఎన్నో ఉన్నాయి. సాధించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి’ అనే ఎరుక ఆమెలో కలిగింది. ‘నువ్వు ఎంబీఏ చేస్తే రాణించగలవు’ అని అక్కడ ఒకరు సలహా ఇచ్చారు. అలా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్‌బీఎస్)లో చేరింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘సైర్’ పేరుతో టూర్ అండ్ ట్రావెల్ స్టార్టప్‌ను ఆరంభించింది. ఈ స్టార్టప్ నష్టాలు మిగల్చడంతో పాటు విలువైన పాఠాలు నేర్పింది. ఆ పాఠాల వెలుగులో మరో ప్రయాణం మొదలుపెట్టింది శ్రుతి. చిన్న పట్టణాలలో ప్రజలు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) ప్రాడక్ట్స్ కొనడానికి ఆసక్తిగా ఉన్నారనే విషయం అర్థమైన తరువాత మనీష్ కుమార్‌తో కలిసి ‘అప్నాక్లబ్’ అనే ఎఫ్ఎంసీజీ ప్లాట్‌ఫామ్‌ను బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ ఒక రేంజ్లో సక్సెస్ అయింది. శ్రుతిలో ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ప్రపంచానికి తెలిసాయి. ‘అప్నాక్లబ్’ బ్యాకర్స్ జాబితాలో టైగర్ గ్లోబల్, ట్రూ స్కేల్ క్యాపిటల్, వైట్‌బోర్డ్ క్యాపిటల్... మొదలైన సంస్థలు ఉన్నాయి. ‘శ్రుతి గొప్ప సంకల్పబలం ఉన్న వ్యక్తి’ అని ప్రశంసిస్తున్నారు వైట్‌బోర్డ్ క్యాపిటల్ పార్ట్నర్ అన్షు ప్రషర్. నిజమే కదా... ‘ఆడపిల్లలకు లెక్కలు రావు’ అనే వెక్కిరింపును సవాలుగా తీసుకొని సంకల్పబలంతో గణితంలో ప్రతిభ ప్రదర్శించింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకునే రోజుల్లో అదృశ్య వివక్షను ఖాతరు చేయకుండా ముందడుగు వేయడానికి ఆ సంకల్పబలమే ఉపయోగపడింది. స్టార్టప్ యాత్రలో కూడా కామెంట్స్ రూపంలో లింగవివక్షత కనిపించినా, ధైర్యం కోల్పోకుండా ఉండడానికి ఆ సంకల్ప బలమే ఉపయోగపడింది. ఎక్కడో మొదలైన సంకల్పబలం ‘అప్నా క్లబ్’ వరకు తనతోనే ఉంది. చీకటి కమ్ముతున్నప్పుడు వెలుగును ఆయుధంగా ఇచ్చింది. ఓటమి వెక్కిరించినప్పుడు గెలుపును ఆయుధంగా ఇచ్చింది. ‘కోపం ఉన్న ఆడవాళ్లను జనాలు అసౌకర్యంగా చూస్తారు. మగవాళ్ల విషయానికి వస్తే యాంగ్రీ యంగ్‌మెన్ అని మురిసిపోతారు’ అంటూ నవ్వుతుంది శ్రుతి. తనను ‘ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడం కంటే ‘ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడానికే శ్రుతి ఇష్టపడుతుంది. చిన్నప్పుడు తండ్రి ఒకరోజు అడిగాడు... ‘మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులు స్కోర్ చేయాలో తెలుసా?’ ‘నన్ను నమ్మండి’ అన్నది శ్రుతి. అప్పటినుండి తనపై తనకు ఉన్న నమ్మకాన్ని, ఇతరులకు తనపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు శ్రుతి. -
Shruthi Nanduri: నండూరి ఇంటి అమ్మాయి నోట ఎంకిపాట
నండూరి ఎంకిపాటల సొగసుదనం.. ఆ పదాల మాధుర్యం ఈ తెలుగు నేలకు సుపరిచయమే. ముత్తాత రాసిన పాటలను తన నోట ఆలపించడానికి అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చింది మునిమనమరాలు శృతి. మెడిసిన్ చదువుకుంటూనే శాస్త్రీయ సంగీత సాధన చేస్తోంది. సంగీతకార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శృతి నండూరిని పలకరిస్తే ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచింది. ‘‘అమ్మ లక్ష్మి, నాన్న సుధాకర్ నండూరి ఇద్దరూ ముప్పై ఏళ్లుగా న్యూజెర్సీలోనే ఉంటున్నారు. నేను అక్కడే పుట్టి పెరిగాను. కర్ణాటక సంగీతం ఐదేళ్ల వయసు నుంచే నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం కూడా గురువుల దగ్గరే శిక్షణ తీసుకున్నాను. సంగీతానికి సంబంధించిన వీడియోలు చేస్తుంటాను. న్యూజెర్సీలో చాలా చోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చాను. అమెరికాలో తెలుగు మహాసభలు జరిగినప్పుడు వెళుతుంటాను. ఆ విధంగా ఇండియా నుంచి వచ్చే సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు పరిచయం అయ్యారు. వాళ్లతో కలిసి స్టేజ్ షోలలో పాల్గొన్నాను. అక్కడ నా ఇంటిపేరులో నండూరి ఉండటంతో ‘నండూరి వారి అమ్మాయంట’ అని చెప్పుకునేవారు. నాతో నేరుగా ‘మీ ముత్తాత గారి గురించి తెలుసా!’ అని అడిగేవారు. దీంతో ‘నండూరి గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఏంటి’ అని అమ్మనాన్నలను అడిగాను. అప్పుడు తెలిసింది ముత్తాతగారి గురించి, ఆ పేరులోని ప్రత్యేకత గురించి. అప్పటి నుంచి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మా పెదనాన్న, మామయ్య, బంధువులను అడుగుతుంటాను. నాన్నను కూడా ఇంకా సమాచారం తెలుసుకొని చెప్పమని వేధిస్తుంటాను. ► ఒక్కో పదాన్ని పలుకుతూ.. అమ్మ వైపు కళాకారులు ఉన్నారు కాని నాన్నవైపు మా ముత్తాత నండూరి సుబ్బారావుగారి తర్వాత ఆర్ట్స్‌లో ఎవరూ లేరు. ఆయన రైటింగ్ గురించి గొప్పగా చెబుతుంటారు. కానీ, తాతగారి గురించి తెలిసిన విషయాలు అంతగా చెప్పేవారు లేరు. నాన్న ద్వారా కొద్దిగా విని ఉన్నాను. సంగీతం నేర్చుకుంటూ, చదువుకుంటూ నా ధ్యాసలో నేనుండిపోయాను. ఆయన పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. అయితే, నాకు తెలుగు రాయడం, చదవడం రాదు. ఆయన ప్రత్యేకత తెలిశాక నాన్నను కూర్చోబెట్టి ఆ బుక్స్‌లోని ఒక్కో పదాన్ని పలుకుతూ, అర్థం తెలుసుకుంటూ ఉండేదాన్ని. కొన్ని రోజుల పాటు ఇదే పనిలో ఉన్నాను. చాలా అద్భుతం అనిపించింది. ► ఎంకిపాట నా నోట ఎంకి పాటల లిరిక్స్ తీసుకొని, కొత్తగా కంపోజ్ చేసి, నేనే పాడాలని నిశ్చయించుకున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం కొందరు మ్యూజిక్ డైరెక్టర్లను కూడా కలిశాను. అదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీపట్నాయక్ గారు ఇదే ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలిసింది. ఒకేసారి మా ఇద్దరిలో ఇలాంటి ఆలోచన రావడం నాకే వింతగా అనిపించింది. ‘ఎంకిపాటల్లో నుంచి కొన్ని లైన్స్ పాడమని అడిగారు. నేను పాడడంతో ‘నీ వాయిస్ ఈ పాటలకు చాలా బాగా సూటవుతుంది’ అని ఆ ప్రాజెక్ట్‌లో సింగర్‌గా నాకే అవకాశం ఇచ్చారు. ఆ విధంగా ఎంకిపాటలు నా నోట పాడించారు. ‘‘నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు మొన్నెతిరిగొస్తనన్నాడే...’’ ఎంకిపాట ఆర్పీనోట అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో పాడాను. ఆ పదాలను వింటూ అర్థం చేసుకుంటూ వాటికి తగిన న్యాయం చేయాలనుకున్నాను. ► చదువు.. సంగీతం అమెరికాలో మెడిసిన్ చేస్తున్నాను. ఫిజికల్ మెడిసిన్‌లో రిహాబిలిటేషన్ అనేది నా స్పెషలైజేషన్. బ్రెయిన్ ఇంజ్యూరీ, స్పోర్ట్స్ మెడిసిన్.. వంటి వాటిలో మ్యూజిక్ థెరపీ కొంత ఫిట్ అవుతుంది. అందుకే ఈ రెండింటీని బ్యాలెన్స్ చేస్తున్నాను. నా బ్రాండ్, డ్రీమ్, లైఫ్ గోల్ అదే. రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు.. అని కొందరు అడుగుతుంటారు. బెస్ట్ డాక్టర్ని, అలాగే బెస్ట్ సింగర్‌ని కూడా అవ్వాలనేది నా డ్రీమ్. అందుకు ఎంత రిస్క్ అయినా చేస్తానని చెబుతుంటాను. ► మా ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తుంటాను మా ఫ్రెండ్స్ అంతా తెలుగురానివారే. వాళ్లకు మా ముత్తాతగారి గురించి ఎంతసేపు చెప్పినా చాలా ఆసక్తిగా వింటారు. ఇంకా విషయాలు అడుగుతారు. నేను ఎంకిపాటలు పాడి, ఆడియో క్లిప్పింగ్స్ మా ఫ్రెండ్స్‌కు పంపిస్తుంటాను. ఆప్పటి పాటలన్నీ విలేజీ స్టైల్ అవడంతో ఒక్కసారిగా ఆ టైమ్ పీరియడ్ నుంచి ఈ పీరియడ్‌కు ఏదో కలిసిపోయిన ఫీల్ కలుగుతుంది. ఒక్కోసారి నైన్టీన్త్ సెంచరీ అమ్మాయినేమో అనిపిస్తుంటుంది(నవ్వుతూ). వెస్ట్రన్ మ్యూజిక్ షోస్ కూడా చేస్తుంటాను. నన్ను తెలుగువారు కూడా గుర్తించాలి. అందుకే, ఇంగ్లిషు, తెలుగు రెండూ కవర్ చేస్తూ ఉంటాను. తెలుగు సినిమాల పాటలన్నీ పాడుతుంటాను. నిద్రలేస్తూనే ఏదో పాటతో నా డే మొదలైపోతుంది. వెస్ట్రన్, కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పుడే హిందీ, తెలుగు పాటలు పాడటం, స్పష్టంగా పదాలు పలకడం సాధన చేయడం అలవాటు చేసుకుంటూ వచ్చాను. ► గాయనిగా పేరు.. సింగర్‌గా బాగా గుర్తింపు తెచ్చుకోవాలని, మంచి మంచి పాటలు పాడాలనేది నా డ్రీమ్. అందుకోసం ఎంతదూరమైనా ప్రయాణిస్తాను. ఆ ప్రయత్నంలో ఎక్కడా ఆగకూడదు. అందుకే, ‘ఆహా వేదికగా జరిగే తెలుగు ఇండియన్ ఐడియల్ 2’ లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చాను. ఇక్కడ ఎంతోమంది నుంచి నా వర్క్‌ని ఇంకా బెటర్ చేసుకుంటున్నాను. నేర్చుకోవాల్సింది చాలా ఉందని అర్ధమైంది. తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ప్రయాణించడమే’’ అంటూ నవ్వుతూ వివరించింది శృతి నండూరి. – నిర్మలారెడ్డి నండూరి వెంకట సుబ్బారావు రచయితగా తెలుగువారికి సుపరిచితులు. నండూరి రచించిన గేయ సంపుటి ‘ఎంకిపాటలు.’ తెలుగు సాహిత్యంలో ప్రణయ భావుకతకూ, పదాల పొందికకూ కొత్త అందాలు అద్దిన ఈ రచనను సాహిత్యకారులు గొప్పగా ప్రస్తావిస్తుంటారు. -
సివిల్స్ టాపర్ శ్రుతీ శర్మ
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్–2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సోమవారం వెల్లడించింది. తొలి ర్యాంకును చరిత్ర విద్యార్థిని శ్రుతీ శర్మ సొంతం చేసుకుంది. ఈసారి టాప్–3 ర్యాంకులూ మహిళలే దక్కించుకున్నారు! రెండో స్థానంలో అంకితా అగర్వాల్, మూడో స్థానంలో గామినీ సింగ్లా నిలిచారు. ఐశ్వర్య వర్మకు నాలుగు, ఉత్కర్ష్ ద్వివేదికి ఐదో ర్యాంకులు లభించాయి. టాప్ 25లో 15 మంది పురుషులు, 10 మంది మహిళలున్నారు. 685 మంది ఎంపిక కాగా, వీరిలో 508 మంది పురుషులు, 177 మంది మహిళలు. విజేతల్లో 25 మంది దివ్యాంగులున్నారు. 2015లో తొలి నాలుగు ర్యాంకులూ మహిళలే సాధించారు. 2021 అక్టోబర్ 10న జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 5,08,619 మంది హాజరయ్యారు. 9,214 మంది మెయిన్ రాతపరీక్షకు అర్హత సాధించారు. ఈ ఏడాది జనవరిలో పరీక్ష జరిగింది. 1,824 మంది ఇంటర్వ్యూకు అర్హత పొందగా 685 మంది ఎంపికయ్యారు. ఫలితాలను www. upsc. gov. in. వెబ్సైట్లో పొందుపర్చారు. చదవండి: సివిల్స్‌లో తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ హిస్టరీ ఆప్షనల్‌గా టాప్ ర్యాంక్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి హిస్టరీ(ఆనర్స్)లో పట్టభద్రురాలైన శ్రుతీ శర్మ సివిల్స్ పరీక్షలో హిస్టరీ సబ్జెక్టును అప్షనల్గా ఎంచుకొని టాప్ ర్యాంకుతో జయకేతనం ఎగురవేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఎకనామిక్స్(ఆనర్స్)లో గ్రాడ్యుయేట్ అయిన అంకితా అగర్వాల్ సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకున్నారు. రెండో ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఇక కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేసిన గామినీ సింగ్లా సోషియాలజీ ఆప్షనల్‌గా సివిల్స్ రాశారు. మూడో ర్యాంకు సాధించారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ టాప్–25 ర్యాంకర్లలో చాలామంది ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, కామర్స్, మెడికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లే ఉన్నారు. వీరంతా ఐఐటీ, ఎయిమ్స్, వీఐటీ, పీఈసీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, జీబీ పంత్ యూనివర్సిటీ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. వీరు సివిల్స్(మెయిన్) రాత పరీక్షలో ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, హిందీ లిటరేచర్, హిస్టరీ, మ్యాథ్స్, మెడికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జువాలజీ సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. ప్రధాని మోదీ అభినందనలు సివిల్స్ విజేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న నేపథ్యంలో దేశ అభివృద్ధి ప్రయాణంలో ఇదొక కీలక దశ. ఈ సమయంలో పరిపాలనాపరమైన ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న యువతకు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. సివిల్స్‌లో ఆశించిన ఫలితం సాధించలేకపోయిన అభ్యర్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎంచుకున్న రంగంలో వారు అద్భుతాలు సృష్టించగలరని, దేశాన్ని గర్వపడేలా చేయగలరని తెలిపారు. వారికి సైతం అభినందనలు తెలిపారు. మొదటి ర్యాంకు ఊహించలేదు: శ్రుతీ శర్మ సివిల్స్ పరీక్షలో తనకు మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదని శ్రుతీ శర్మ చెప్పారు. ఇది ఊహించని ఫలితం అని ఆనందం వ్యక్తం చేశారు. తన సివిల్స్ ప్రయాణంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితుల సహాయం మర్చిపోలేనిదని తెలిపారు. ఈ క్రెడిట్ మొత్తం వారికే చెందుతుందని పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన శ్రుతి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. నాలుగేళ్లుగా సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. జామియా మిలియా ఇస్లామియాకు చెందిన రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో సివిల్స్ శిక్షణ పొందారు. మహిళల సాధికారతకు కృషి: అంకితా అగర్వాల్ మహిళల సాధికారత కోసం కృషి చేస్తానని, ప్రాథమిక ఆరోగ్యం, పాఠశాల విద్యా రంగాలను బలోపేతం చేయడం తన లక్ష్యమని సెకండ్ ర్యాంకర్ అంకిత చెప్పారు. కోల్‌కతాకు చెందిన ఆమె 2020 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం హరియాణాలో ప్రొబేషన్‌లో ఉన్నారు. ఈసారి రెండో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈసారి సివిల్స్‌లో మొదటి మూడు ర్యాంకులు మహిళలకే దక్కడం దేశానికి గర్వకారణమని అంకిత అన్నారు. కల నెరవేరింది: గామినీ సింగ్లా కష్టపడే తత్వం, అంకితభావం ఉన్న మహిళలు ఏదైనా సాధించగలరని మూడో ర్యాంకర్ గామినీ సింగ్లా వ్యాఖ్యానించారు. తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌ను ఎంచుకుంటానని, దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని వివరించారు. గామినీ సింగ్లా రెండో ప్రయత్నంలో సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించారు. ఆమె తల్లిదండ్రులు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంలో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. -
చిక్ బుక్ రైలు
దిల్లీకి చెందిన శృతిశర్మ గురించి చెప్పుకునే ముందు బ్రిటీష్ నటి ఎమ్మా వాట్సన్ దగ్గరకు వెళ్లాలి. హారిపోటర్ ఫిల్మ్‌సిరీస్‌తో ఫేమ్ అయిన ఎమ్మా ఉద్యమకార్యకర్త కూడా. స్త్రీల హక్కులకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టభద్రురాలైన ఎమ్మాకు పుస్తక పఠనం అంటే వల్లమాలిన ప్రేమ. మార్కెట్లో ఏ మంచి పుస్తకం వచ్చినా ఆమె చదవాల్సిందే. ఒక మంచి పుస్తకం గురించి ఎక్కడైనా విన్నా చదవాల్సిందే. అలాంటి ఎమ్మా ప్రజల్లో పుస్తకపఠన అలవాటును పెంపొందించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టింది. న్యూయార్క్, లండన్లలో సబ్వే, స్ట్రీట్‌కార్నర్, జనాలు ఎక్కువగా కనిపించే చోట్లలో పుస్తకాలు పెట్టడం మొదలుపెట్టింది. ఈ ప్రయత్నం మంచిఫలితాన్ని ఇచ్చింది. ‘ఒక మంచి పుస్తకం చదివాను... అనే భావన కంటే ఒక మంచి పుస్తకాన్ని చాలామందితో చదివించాను అనే భావన ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది’ అంటుంది ఎమ్మా. మళ్లీ దిల్లీ దగ్గరకు వద్దాం. ఎమ్మా వాట్సన్‌లాగే శృతిశర్మకు కూడా పుసక్తపఠనం అనేది చాలా ఇష్టం. అయితే చిన్నప్పుడు ఆమెకు అదొక ఖరీదైన వ్యవహారం. అయినప్పటికీ ఏదో రకంగా పుస్తకాలు సేకరించి చదివేది. ఇప్పుడు పుస్తకాలు కొనడానికి ఆర్థికసమస్య అంటూ లేకపోయినా తానే కాదు పదిమంది చేత పుస్తకాలు చదివించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి రావడానికి రెండు కారణాలు. 1. ఎమ్మా వాట్సన్ 2. మెట్రో రైలు లో ప్రయాణం. ఒకరోజు తాను మెట్రోలో ప్రయాణం చేస్తోంది. ఎటు చూసినా సెల్‌ఫోన్ లో మాట్లాడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేది? కొందరు న్యూస్‌పేపర్స్ చదివేవారు. కొందరు వీక్లీ చదువుకునే వారు. కొందరు పుస్తకాలు చదువుతూ కనిపించేవారు. ఈ సమయంలోనే తనకు పుస్తకాల ఆలోచన వచ్చింది. మొదటి ప్రయత్నంగా ప్రముఖ రచయిత్రి జంపా లహిరి పుస్తకాలను మెట్రో స్టేషన్, ట్రైన్లలో పెట్టింది. ఈ విషయంలో భర్త తరుణ్ చౌహాన్ కూడా తనకు సహాయంగా నిలిచాడు. ‘తమ ఎదురుగా పుస్తకం కనిపించగానే ఆబగా చదవకపోవచ్చు. మొదటిసారి పుస్తకాన్ని ఇటూ అటూ తిరగేయవచ్చు. రెండోసారి ఆసక్తిగా కనిపించే భాగాలను చదవాలనిపించవచ్చు. మూడోసారి పుస్తకం మొత్తం చదవాలనిపించవచ్చు. ఆ తరవాత మరిన్ని పుస్తకాలు చదవాలనే ఆలోచన రావచ్చు’ అంటోంది శృతిశర్మ. అయితే ఆమె ప్రయత్నం వృథా పోలేదు. పుస్తకాలు చదివిన వాళ్లు ఆమెకు కృతజ్ఞత పూర్వకంగా ఫోన్లు చేస్తుంటారు. అంతేకాదు, శృతిశర్మను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది తాము కూడా ట్రైన్లో ప్రయాణికులు చదవడానికి బుక్స్ అందుబాటులో పెడుతున్నారు. -
గ్రేట్ ఫాదర్.. మా నాన్నహీరో
‘నాన్నంటే మా నాన్నలా ఉండాలి’ అంటోంది శృతి చతుర్వేది. నిజమే... నాన్న అయినా, అమ్మ అయినా పిల్లలకు అండగా నిలవాల్సింది వాళ్లను సమాజం వేలెత్తి చూపించిన క్షణంలోనే. ఆ క్షణంలో మిగిలిన వారికంటే ముందుగా తల్లిదండ్రులే పిల్లలను నేరస్థులుగా చూడడం మొదలు పెడుతుంటారు. మరికొందరు తల్లిదండ్రులు సమాజానికి భయపడి పిల్లలను దూరంగా ఉంచి, అలా దూరంగా ఉంచడాన్ని తమ నిక్కచ్చితనానికి, కచ్చితత్వానికి కొలమానంగా భావిస్తుంటారు. శృతి చతుర్వేది తండ్రి హరీశ్ చతుర్వేది కూతురు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు అండగా నిలిచాడు. కూతురి వెనుక జరిగిన కుట్రను ఛేదించడంలో సహకరించాడు. తమ ఇంట్లో ఆశ్రయం పొంది, ఘాతుకానికి ఒడిగట్టిన ద్రోహుల్ని ఇంటినుంచి తరిమికొట్టి కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు. అందుకే శృతి చతుర్వేది తన తండ్రి గురించి అంత గొప్పగా చెప్పగలిగింది. అసలేం జరిగింది? శృతి ఫొటోలు మార్ఫింగ్‌కు గురయ్యాయి. గౌరవంగా జీవించే ఆ కుటుంబం గురించి బంధువులు, స్నేహితులు అసభ్యంగా మాట్లాడుకునే పరిస్థితి ఎదురైంది. ఒకరకంగా సామాజిక బహిష్కరణ వంటిది. శృతి తండ్రి ప్రతి ఫొటోనీ నిశితంగా గమనించాడు. నిజానికి ఆ ఫొటోలన్నీ ఆయన గతంలో చూసినవే. అయితే కొత్త పరిసరాల్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా కనిపిస్తున్నాయి. తమ కుటుంబం పిక్నిక్కి వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలో శృతి పక్కన ఆమె కాలేజ్ స్నేహితుల్లో అబ్బాయిల ఫొటోలున్నాయి. గ్రూప్ ఫొటోల నుంచి ఆ అబ్బాయి ఫొటోను క్రాప్ చేసి శృతి పిక్నిక్ ఫొటోతో జత చేశారెవరో. అలాగే మరికొన్ని ఫొటోల్లో శృతిలాగానే కనిపిస్తోంది. కానీ దేహం శృతిది కాదు. మరెవరి దేహానికో శృతి ముఖాన్ని అతికించారు. ఫొటోలను మార్ఫింగ్ చేయడంతోపాటు ఆ ఫొటోలను తమ కుటుంబానికి ఆత్మీయులైన వాళ్లకు చేరేటట్లు చేశారు. ఇదంతా చేసింది ఎవరు? హరీశ్ చతుర్వేదికి ఒక సందేహం వచ్చింది. చివరికి అతడి సందేహమే నిజమైంది. ఎలా జరిగింది! శృతి చతుర్వేది వయసు 28. ఢిల్లీలో మీడియా మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగి. ఆమె పద్దెనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ల కజిన్ అతడి భార్యతోపాటు శృతి ఇంటికి వచ్చాడు. అతడి ప్రేమను అతడి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి ప్రేమించిన అమ్మాయితోపాటు శృతి వాళ్ల ఇంటికి వచ్చి తలదాచుకున్నాడు. అలా వచ్చిన ఆ దంపతులు కొన్ని నెలల పాటు ఉండిపోయారు. ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక ల్యాప్‌టాప్‌ని అందరూ ఉపయోగించేవారు. శృతి ఇంట్లో అందరూ తెరిచిన పుస్తకంలా ఉండేవారు. ఎవరికీ ఏ రహస్యాలు లేని జీవితాలు వాళ్లవి. ఇంట్లో అందరి ముఖ్యమైన సమాచారంతోపాటు పిక్నిక్లకు వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలు కూడా అదే ల్యాప్‌టాప్‌లో ఉండేవి. శృతి కజిన్ దంపతులకు ఉద్యోగ ప్రయత్నాల కోసం ఆ ల్యాప్‌టాప్‌నే ఇచ్చారు శృతివాళ్లు. శృతి కజిన్ భార్య కంప్యూటర్ ఇంజనీర్. ఇదంతా చేసింది ఆమే. ఫొటోషాప్‌లో శృతి ఫొటోలను మార్ఫింగ్ చేసింది. వాళ్లకు ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో తమకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి వాళ్లనే అభాసుపాలు చేశారు. ఇలా ఉండాలి! శృతి అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ‘‘ఆ రోజు మా నాన్న అంత హుందాగా వ్యవహరించి ఉండకపోతే ఈ రోజు నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్‌గా నిలిచేదాన్ని కాదు. నాకు ధైర్యం చెప్పి, ఆ ద్రోహుల్ని ఇంటి నుంచి తరిమివేశాడు. తండ్రి పిల్లల్ని సమాజం వైపు నిలబడి చూడకూడదు. తన పిల్లల వైపు నిలబడి సమాజాన్ని ఎదుర్కోగలగాలి. ఇది ధైర్యవంతులకే సాధ్యం. మా నాన్న ధీరుడు’’ అంటోంది శృతి చతుర్వేది. -
తెలుగులో హీరోయిన్గా, హిందీ సీరియల్స్‌లో నటిగా!
శ్రుతి శర్మ.. రియాలిటీ షో విన్నర్ కాలేదు.. కానీ రియల్ లైఫ్‌లో విన్నర్‌గా నిలిచింది.. సినిమాల్లో, సీరియల్స్‌లో నటించాలనే కలను నిజం చేసుకుని! పుట్టింది, పెరిగింది, చదివింది.. అంతా లక్నోలోనే. చదువుకునేరోజుల్లో డాన్స్, నాటకాల్లో పాల్గొనడంతో నటన మీద ఆసక్తి పెరిగింది. దాంతో విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే ముంబైలోని ‘అనుపమ్ ఖేర్స్ యాక్టింగ్ స్కూల్’లో చేరి ట్రైనింగ్ తీసుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2018లో ‘ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్స్’ రియాలిటీ షోతో చిన్ని తెర ప్రేక్షకులకు పరిచయం అయింది. అందులో తను విజయం సాధించక పోయినా, తన నైపుణ్యంతో ప్రేక్షకులను మెప్పించి ‘స్పెషల్ మెన్షన్’ అవార్డును అందుకుంది. ఆమె ప్రతిభకు ముచ్చటపడ్డ ఆ షో గెస్ట్ కరన్ జోహార్, తను తీయబోయే సినిమాలో ఆమెకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించడంతో శ్రుతి రియల్ విన్నర్ అయిందనే కాంప్లిమెంట్స్ పొందింది. తెలుగు సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ‘గఠ్బంధన్’, ‘నజర్ 2’, ‘యే జాదు హై జిన్ కా!’, ‘నమక్ ఇష్క్ కా’ సిరీయల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ‘పగ్లైట్’లో ముఖ్య భూమిక పోషించి వెబ్ వీక్షకులకూ అభిమాన నటి అయింది. డాన్స్ అంటే చాలా ఇష్టం. భరతనాట్యంలో శిక్షణ పొందింది. రచనారంగంలోనూ చేయితిరిగిన వాక్యం, ఎక్స్ప్రెషన్ ఆమెవి. శ్రుతి రాసిన ‘ప్రిత్యాగ్’ అనే నాటకం విమర్శకుల ప్రశసంలు అందుకుంది. ఆ నాటకానికి ఆమె సోదరుడు శగున్ శర్మ దర్శకత్వం వహించాడు. చిన్నప్పటి నుంచి సినిమాలు, సీరియల్స్ చూస్తూ పెరిగా. నటిగా కాకుండా మరేవిధంగానూ నన్ను నేను ఊహించుకోలేను. సినిమాలే నా జీవితం. – శ్రుతి శర్మ చదవండి: ఎమ్మెల్యే శంకర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ పచ్చందనమే పచ్చదనమే... -
అత్యవసర సర్జరీ చేయించుకుంటున్న నటి
బాలీవుడ్ నటి శృతి సేత్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా వెల్లడిస్తూ ఆస్పత్రి బెడ్ మీద నిద్రిస్తున్న ఫొటోను షేర్ చేశారు. "నన్ను, నా కుటుంబాన్ని ఎన్నో ఒడిదుడుకులకు గురి చేసిన 2020కి ఎమర్జెన్సీ సర్జరీతో ముగింపు పలుకుతున్నాను. హఠాత్తుగా సర్జరీ చేయించుకోవాల్సి వస్తుండటం వల్ల క్రిస్మస్, కొత్త సంవత్సరం ప్లాన్లు రద్దు చేసుకున్నాను. ఓ పెద్ద అనారోగ్య సమస్య నుంచి బయటపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే నేనింకా కొన్ని జీవిత పాఠాలను నేర్చుకోనట్లు అనిపిస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే అవన్నీ నేర్చుకుంటున్నా" అని చెప్తూనే, ఆమె అలవరుచుకుంటున్న పాఠాలను అభిమానులతో పంచుకున్నారు. ► ఆరోగ్యాన్ని లైట్ తీసుకోకండి ► ఆస్పత్రికి వెళ్తే అక్కడ జీవితమేంటో బోధపడుతుంది. ► ఆహారం అనేది మెదడుకు డ్రగ్ లాంటిది. తిండి లేకపోతే గ్లూకోజ్ ఎక్కించినా మనిషి బతుకుతాడు. ► నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు దాన్ని చాలా మిస్సవుతున్నా. ► ఉదయాన్నే కళ్లు తెరవగలుగుతున్నందుకు, రాత్రవగానే నిద్రపోగలుగుతున్నందుకు కృతజ్ఞతగా ఉండండి. ► ఆరోగ్యాన్ని గాలికి వదిలేయకుండా కాస్త శ్రద్ధ వహించండి. ► మీ మంచి కోరుతూ, మిమ్మల్ని నిజంగా ఇష్టపడేవాళ్ల చేయి వదలకండి. అంటూ శృతి విలువైన సూచనలిచ్చారు. కాగా శృతి సేత్ దర్శకుడు దనీశ్ అస్లామ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అలీనా అనే కూతురు ఉంది. ఇక శృతి కెరీర్ విషయానికి వస్తే ఆమె 'షరరాత్' అనే పాపులర్ టీవీ షోలో మెరిశారు. క్యా హోతా హై ప్యార్, ద సూట్ లైఫ్ ఆఫ్ కరణ్ అండ్ కబీర్, ద ఫర్గాటెన్ ఆర్మీ-ఆజాదీ కె లియే వంటి కార్యక్రమాల్లో మెరిశారు. View this post on Instagram A post shared by Shruti Seth (@shru2kill) -
వనవాసం రెడీ
నవీన్‌రాజ్ శంకరాపు, శశికాంత్, బందెల కరుణశ్రావ్య, శృతి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వనవాసం’. భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వం వహించారు. శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ పతాకంపై సంజయ్ కుమార్.బి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా భరత్ కుమార్.పి మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌లాగానే సినిమా కూడా ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మేము అనుకున్న దానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 25న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు సంజయ్ కుమార్.బి. -
ప్లాన్
పట్టుకోండి చూద్దాం జానకిరామయ్య కోటీశ్వరుడు. ఆయన ఒక్కగానొక్క కూతురు శృతి. కూతురిని పూలల్లో పెట్టి చూసుకుంటాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శృతి పెళ్లీడుకొచ్చిన తరువాత... జానకిరామయ్యలో అభద్రతలాంటిదేదో బయలుదేరింది. ‘శృతి అత్తవారింటికి వెళితే నా పరిస్థితి ఏమిటి? ఈ లంకంతా కొంప ఎంత బోసి పోతుంది!’ ఇలా ఏవేవో ఆలోచిస్తూ తనలో తాను బాధ పడుతుండేవాడు. ‘‘రోజు రోజుకూ మీరు చాదస్తంగా తయారవుతున్నారు. ఆడపిల్ల అన్నాక ఏదో ఒకరోజు అత్తావారింటికి వెళ్లాల్సిందే కదా. ఎందుకు ప్రాక్టికల్‌గా ఆలోచించరు?’’ అని జానకిరామయ్యను మందలించింది భార్య అన్నపూర్ణ. నిజానికి జానకిరామయ్య సున్నిత మనస్కుడేమీ కాదు. వ్యాపారంలో ఎన్నో ఆటు పోట్లు తట్టుకొని రాటు తేలాడు. ‘ఇతని హృదయం ఏ స్పందన లేని రాయి’ అని జానకిరామయ్యను ఉద్దేశించి చాలామంది అనేవాళ్లు. అలాంటి జానకిరామయ్య కాస్త... కూతురు పుట్టాక మారిపోయాడు. బంధాలలోని తీయదనానికి అలవాటు పడ్డాడు. ఇరవై నాలుగు గంటలూ కూతురు గురించే ఆలోచించేవాడు. కూతురు లేకుండా తాను బతకలేననుకొని...ఇల్లరికపు అల్లుని కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈలోపే శృతి ఒక యువకుడిని ఇంటికి తీసుకువచ్చి తండ్రికి పరిచయం చేసింది. ‘‘డాడీ... ఈయన అభి. గత కొంత కాలంగా మేము ప్రేమించుకుంటున్నాము. మీరు ఆశీర్వదిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’’ అంది శృతి. జానకిరామయ్య షాక్ అయ్యాడు... మాట్లాడుతుంది తన కూతురేనా? అని! ఎందుకంటే తన కళ్లకు... శృతి ఎప్పుడూ చిన్న పిల్లే!‘‘పెళ్లైన తరువాత శృతి, నువ్వు ఈ ఇంట్లోనే ఉంటే మంచిదనుకుంటున్నాను. నాకు కూడా అమ్మాయి తప్ప ఎవరూ లేరు కదా. నీకేమైన అభ్యంతరమా?’’ అభిని చూస్తూ అడిగాడు జానకిరామయ్య.‘‘సారీ అండీ... మా అమ్మానాన్నలకు నేనొక్కగానొక్క కొడుకును. నన్ను ఒక్కరోజు చూడకుండా ఉండలేరు’’ అంటూనే కొద్దిసేపట్లో ప్లేటు ఫిరాయించి... ‘‘శృతి కోసం ఈ మాత్రం చేయలేనా? ఇక్కడే మీతో పాటు ఉంటాను’’ అన్నాడు అభి. జానకిరామయ్యకు గాల్లో తేలి పోయినట్లు అనిపించింది.అభిని దేవుడే తన దగ్గరికి పంపించాడు అనుకున్నాడు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈలోపే ఒక వార్త జానకిరామయ్య గుండెలో గునపంలా గుచ్చుకుంది.అభి మోసగాడనే విషయం బయటపడింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పెద్దింటి అమ్మాయిలను వలలో వేసుకొని మోసం చేయడం అతని అలవాటు. జానకిరామయ్య ఏ జన్మలో చేసుకున్న అదృష్టమోగానీ... అభి మోసగాడనే విషయం పెళ్లికి ముందే బయటపడింది.శృతి డిప్రెషన్‌లాంటి స్థితిలోకి వెళ్లిపోయింది.కూతురు పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాడు జానకిరామయ్య. గాలి మార్పు కోసం భార్యాబిడ్డలను అమెరికాలోని అన్న కూతురి దగ్గరకు పంపాడు. రెండు మూడు నెలలు శృతి అక్కడ ఉంటే మళ్లీ మామూలు మనిషి అయిపోతుందనుకున్నాడు. ఒకరోజు పోలిస్‌స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది.‘‘వాడు బెయిల్‌పై విడుదలయ్యాడు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి’’ అని జానకిరామయ్యకు జాగ్రత్తలు చెప్పాడు ఇన్స్పెక్టర్. జానకిరామయ్య ఇంట్లో శ్రీను అనే కుర్రాడు చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. అతని పనితీరు, వినయం జానకిరామయ్యకు బాగా నచ్చాయి. శ్రీను అంటే గురి ఏర్పడింది.శ్రీను బయటికి వెళితే చాలు... తన యాజమాని భద్రతను దృష్టిలో పెట్టుకొని బయట తాళం వేసి వెళ్లేవాడు. అది శతృదుర్భేద్యమైన తాళం. ఆరోజు కూడా... ‘‘మీరు పుస్తకం చదువుతూ ఉండండి. నేను కూరగాయలు తీసుకొనివస్తాను’’ అని బయట తాళం వేసి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత...‘‘మా అయ్యగారు తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు’’ అని గట్టిగా ఏడుస్తున్నాడు శ్రీను. కూతురి గురించి ఆలోచిస్తూ... మానసిక బాధతోనే జానకిరామయ్య ఆత్మహత్య చేసుకున్నాడనుకున్నారు అందరూ. అయితే... ఇన్స్పెక్టర్ నరసింహ మాత్రం ‘ఇది ఆత్మహత్య కాదు... హత్య’ అని ప్రకటించాడు. కిటికీలు లోపలి నుంచి వేసి ఉన్నాయి. బయట గట్టి తాళం వేసి ఉంది. ఏ రకంగా చూసినా... బయటి వ్యక్తి ఇంట్లోకి దూరి జానకిరామయ్యను హత్య చేసే ఛాన్సే లేదు. మరి ఆయన ఎలా హత్యకు గురయ్యాడు? క్లూ: ఎడమవైపు కిటికీ ఫ్రేమ్ దగ్గర కొన్ని నీళ్లు కనిపించాయి. శ్రీను హంతకుడు. శ్రీను ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందు ఎడమ వైపు ఉన్న కిటికీని తెరిచి ఫ్రేమ్‌లో ఐస్‌క్యూబ్‌లను పెట్టి... కిటికీ ఓపెన్‌గా ఉండేలా చూసుకున్నాడు. బయట తాళం వేసి తెరిచిన కిటికీ నుంచి జానకిరామయ్యను షూట్ చేశాడు. కొద్దిసేపటి తరువాత... ఐసుముక్కలు కరిగి కిటికీ దానికదే క్లోజ్ అయిపోయింది. ఐస్ కరిగి నీళ్లు మిగిలాయి. -
వీడియో ఆధారంగా ఓ అభిప్రాయానికి రాలేం
శ్రుతి, సాగర్ ఎన్కౌంటర్ కేసులో హైకోర్టుకు విన్నవించిన ఎయిమ్స్ సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి, విద్యాసాగర్‌లకు స్థానిక వైద్యులు పోస్టుమార్టం నిర్వహణకు సంబంధించిన వీడియో ఆధారంగా నిర్దిష్ట అభిప్రాయానికి రావడం సాధ్యం కాదని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) వైద్యులు తేల్చి చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్య బృందంతో చర్చించిన తరువాతనే ఓ అభిప్రాయానికి రాగలమని హైకోర్టుకు నివేదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... ఎయిమ్స్ వైద్యులు కోరుతున్న విధంగా పోస్టుమార్టం తాలూకు డాక్యుమెంట్లు, దాన్ని నిర్వహించిన వైద్యుల ఫోన్ నంబర్లు, ఎఫ్ఐఆర్ తదితర వివరాలు పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్నింటినీ పరిశీలించి జూన్ 15 లోపు అభిప్రాయాన్ని తెలియచేయాలని ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో సమన్వయ బాధ్యతలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌కు అప్పగిస్తూ, తదుపరి విచాణను జూన్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిమ్స్ వైద్యులు ఇచ్చే నివేదికను సీల్డ్ కవర్లోనే అందచేయాలని శరత్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. -
మిర్చి ప్రాపర్టీ
హీరోయిన్లు లతాహెగ్డే, పూజిత(తుంటరీ ఫేంలు)లు మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్లో సందడి చేశారు. రేడియో మిర్చి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ‘మిర్చి ప్రాపర్టీ షో’ను శనివారం వీరు ప్రారంభించారు. ఇందులో ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తున్నామని రేడియో మిర్చి హైదరాబాద్ స్టేషన్ డెరైక్టర్ అరిందం మోండల్ చెప్పారు. రూ.60 లక్షల నుంచి అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న ఈ షో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. - మాదాపూర్