వనవాసం రెడీ | Vanavasam movie updates | Sakshi
Sakshi News home page

వనవాసం రెడీ

Published Mon, Oct 14 2019 6:18 AM | Last Updated on Mon, Oct 14 2019 6:18 AM

Vanavasam movie updates - Sakshi

నవీన్‌రాజ్‌ శంకరాపు, శశికాంత్, బందెల కరుణశ్రావ్య, శృతి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వనవాసం’. భరత్‌ కుమార్‌.పి నరేంద్ర దర్శకత్వం వహించారు. శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్‌ పతాకంపై సంజయ్‌ కుమార్‌.బి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా  భరత్‌ కుమార్‌.పి మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌లాగానే సినిమా కూడా ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మేము అనుకున్న దానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది.  నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 25న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు సంజయ్‌ కుమార్‌.బి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement