Vanavasam
-
వనవాసం రెడీ
నవీన్‌రాజ్ శంకరాపు, శశికాంత్, బందెల కరుణశ్రావ్య, శృతి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వనవాసం’. భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వం వహించారు. శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ పతాకంపై సంజయ్ కుమార్.బి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా భరత్ కుమార్.పి మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌లాగానే సినిమా కూడా ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మేము అనుకున్న దానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 25న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు సంజయ్ కుమార్.బి. -
వనవాసం పెద్ద హిట్ అవుతుంది
‘‘యాక్టర్ అవుదామని వచ్చిన సంజయ్ కుమార్‌గారు నిర్మాత అయ్యారు. ఈ సినిమాను నిర్మిస్తున్న తన ఫ్రెండ్ చనిపోవడంతో సంజయ్‌గారు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే ‘వనవాసం’ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా’’అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. నవీన్‌రాజ్ శంకరపుడి, శశికాంత్, శ్రావ్య, శృతి ముఖ్య తారలుగా భరత్.పి, నరేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వనవాసం’. భవాని శంకర ప్రొడక్షన్స్ పతాకంపై బి.సంజయ్ కుమార్ నిర్మించారు. మోహన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘20 ఏళ్ల క్రితం యాక్టింగ్ స్కూల్లో పరిచయమయ్యారు నరేశ్. ఇప్పుడు నా సినిమాని ప్రోత్సహించడానికి రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ మధ్య చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత తుమ్ముళ్లపల్లి రామసత్యనారాయణ. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది. సంజయ్‌గారు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమా తీశారు’’ అన్నారు భరత్.పి, నరేంద్ర. నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు. ∙ నవీన్,శ్రావ్య -
టైటిల్ బాగుంది
నవీన్‌రాజ్ శంకరాపు, శశికాంత్ హీరోలుగా, బందెల కరుణశ్రావ్య, శృతి హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వనవాసం’. భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వంలో సంజయ్ కుమార్ బి. నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఈ చిత్రం పోస్టర్, టైటిల్‌ని ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘వనవాసం’ టైటిల్ బాగా నచ్చింది. ఈ టైటిల్‌లానే సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నా. టీమ్‌కి అభినందనలు’’ అన్నారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం. ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు భరత్. ‘‘ భరత్ చాలా బాగా తీశారు. త్వరలోనే సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని సంజయ్ కుమార్. బి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కుమార్, కెమెరా: ప్రేమ్ జై. విన్సైట్. -
ఊరంతా వనవాసం !
నెలరోజుల్లో ఏడుగురి మృతితో ముందుగానే అడవి బాట జంతు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు తమిళనాడులో వింత ఆచారం క్రిష్ణగిరి : ఊరంతా వనవాసానికి బయలుదేరింది. పుష్కరానికి ఒక్కసారి మేలుమలై గ్రామ ప్రజలు ఒక రోజు పాటు అడ విదారి పడతారు. సూళగిరి సమీపంలోని మేలుమలై గ్రామంలో 400 కుటుంబాలు ఆదివారం ఉదయం వనవాసానికి బయలుదేరారు. అయితే ఈ సారి మాత్రం కొంత ముందుగానే గ్రామదేవత ఆదేశానుసారం గ్రామం అడవి బాటపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు... గత నెల రోజుల వ్యవధిలో ఏడుగురు మరణించడంతో గ్రామస్తుల్లో భయం చోటుచేసుకుంది. దీంతో గ్రామస్తులు అందరూ గతనెల 29న ఒకచోటకు చేరి చర్చించారు. ఇదే సమయంలో పూజారి వెంకటేశులుకు మారియమ్మ దేవత పూనకం వచ్చి అమృతవాక్కు పలికిందని, గ్రామానికి అరిష్టం జరిగిందని, గ్రామం మొత్తం వనవాసం చేయాలని అమ్మవారు ఆదేశించినట్లు గ్రామస్తులు తెలిపారు. వనవాసానికి ఇంకా రెండేళ్లు ఉన్నా కూడా వనవాసం చేయాల్సిందేనని అమ్మవారు ఆదేశించడంతో గ్రామస్తులు ఆదివారం ఉదయం వనవాసానికి సిద్ధమయ్యారు. ఉదయం 6.30 గంటకు బిక్కనపల్లి అడవికి చేరుకున్నారు. అడవిలో స్నానాలు చేసి విశేషపూజలు చేశారు. గ్రామదేవతకు జంతుబలులిచ్చి మొక్కులు తీర్చుకొన్నారు. అనంతరం వనభోజనాలు ఆరగించారు. ఆదివారం రాత్రి 7 గంటలకు మళ్లీ గ్రామదేవతను ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకొచ్చారు. బోసిపోయిన గ్రామం రాత్రి మళ్లి కళకళలాడింది. గ్రామ రక్షణ కోసం.. గ్రామానికి ఏ అరిష్టం జరగకుండా వర్షాలు సమృద్ధిగా కురవడం కోసం, పంటపొలాలపై చీడపీడల దాడిని నివారించేందుకు గ్రామంలో చెడ్డ జరగకుండా గ్రామదేవత మొక్కులు తీర్చుకొనేందుకు ప్రతి 12 ఏళ్లకొకసారి తాతల కాలం నుంచి ఈ ఆచారం ఉందని గ్రామపెద్ద మునిరాజు తెలిపారు.