టైటిల్‌ బాగుంది | Vanavasam Movie First Look Poster Launch By Director Trivikram | Sakshi
Sakshi News home page

టైటిల్‌ బాగుంది

Published Mon, Jan 7 2019 1:36 AM | Last Updated on Mon, Jan 7 2019 1:36 AM

Vanavasam Movie First Look Poster Launch By Director Trivikram - Sakshi

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నవీన్‌రాజ్‌ శంకరాపు

నవీన్‌రాజ్‌ శంకరాపు, శశికాంత్‌ హీరోలుగా, బందెల కరుణశ్రావ్య, శృతి హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వనవాసం’. భరత్‌ కుమార్‌.పి నరేంద్ర దర్శకత్వంలో సంజయ్‌ కుమార్‌ బి. నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఈ చిత్రం పోస్టర్, టైటిల్‌ని ప్రముఖ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘వనవాసం’ టైటిల్‌  బాగా నచ్చింది.

ఈ టైటిల్‌లానే సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నా. టీమ్‌కి అభినందనలు’’ అన్నారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం. ప్రేక్షకులు మెచ్చే  విధంగా ఉంటుంది’’ అన్నారు భరత్‌. ‘‘ భరత్‌ చాలా బాగా తీశారు. త్వరలోనే సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని సంజయ్‌ కుమార్‌. బి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కుమార్, కెమెరా: ప్రేమ్‌ జై. విన్సైట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement