poster release
-
హిస్టారికల్ ప్యారడైజ్
‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై రూపొందుతోన్న ఈ మూవీ 2026 మార్చి 26న విడుదల కానుంది. కాగా ఈ సినిమా సరిగ్గా 365 రోజుల్లో తెరపైకి రానుందని పేర్కొని, ‘వన్ ఇయర్ టు గో... ఇండియన్ సినిమా విట్నెస్ ది మ్యాడ్నెస్’ అంటూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే విడుదలైన మా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గ్రిప్పింగ్ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించి రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సాధించింది. హైదరాబాద్ చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ నానీని మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో చూపించనుంది. సుధాకర్ చెరుకూరి అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం, ఏఓ విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మా చిత్రం తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ సహా 8 భాషల్లో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
యుద్ధం ఆరంభం
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్–ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ము΄్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ పాత్రలో కల్యాణ్ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారని తెలుస్తోంది. కాగా ‘అర్జున్ బ్యాటిల్ బిగిన్స్’ అంటూ ఈ నెల 14న ఈ సినిమా ప్రీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించి, కల్యాణ్‌రామ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘టాకీ పార్టు పూర్తయింది. మిగిలిన షూట్ కూడా పూర్తయ్యాక రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా ఇది తల్లీకొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ ఫిల్మ్ అని తెలుస్తోంది. సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ‘యానిమల్’ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అజనీష్ లోక్‌నాథ్. -
తేదీ మారలేదు
ధనుష్(Dhanush) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘ఇడ్లీ కడై’ (Idly Kadai)(తెలుగులో ఇడ్లీ కొట్టు అని అర్థం). నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అరుణ్ విజయ్, షాలినీ పాండే, సముద్ర ఖని, రాజ్ కిరణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆకాశ్ భాస్కరణ్తో కలిసి ధనుష్ నిర్మిస్తున్న మూవీ ఇది. కాగా ‘ఇడ్లీ కడై’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించారు. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్ 10న విడుదల కావడం లేదనే ప్రచారం జరిగింది. అయితే ‘ఇడ్లీ కడై’ సినిమాను ఏప్రిల్ 10నే రిలీజ్ చేస్తామన్నట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో అనుకున్నట్లే ‘ఇడ్లీ కడై’ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్నట్లుగా స్పష్టమైపోయింది. ఇక ధనుష్ దర్శకత్వంలోని మరో మూవీ ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. పవీష్, అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ తెలుగులో ‘జాబిలమ్మా నీకు అంత కోపమా...’ అనే టైటిల్‌తో రిలీజ్ కానుంది. -
ఓ వెన్నెల...
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ నెల 3న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘భైరవం’ మూవీ నుంచి ‘ఓ వెన్నెల..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ‘భైరవం’. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
స్టయిలిష్‌గా...
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా గురువారం (డిసెంబరు 12) వెంకటేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి ఆయన స్టయిలిష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాలోని రెండో పాట ‘మీనూ... ప్రోమోను నేడు రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. -
నవంబరులో జీబ్రా
సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్నది ట్యాగ్‌లైన్. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సునీల్, సత్యరాజ్, సత్య అక్కల కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు.ఈ సినిమాని నవంబరు 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, సత్యదేవ్, ధనుంజయ పోస్టర్ని విడుదల చేశారు. ‘‘క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘జీబ్రా’. ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ వీడియో, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్య పొన్మార్, సంగీతం: రవి బస్రూర్, సహనిర్మాత: ఎస్. శ్రీలక్ష్మి రెడ్డి. -
మా మనవడ్ని ఆదరించాలని కోరుకుంటున్నాం
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో చిన్న రెడ్డయ్య, ఎన్.పాండు రంగారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడు సుదర్శన్‌ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. రవికిశోర్ కొత్త దర్శకుడైనా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నలభై ఏళ్లుగా మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. రాజీపడకుండా నిర్మించిన నిర్మాతలను, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడ్ని, తొలిసారి వెండితెరపై కనిపించనున్న మా మనవడ్ని ఆదరించి ఈ సినిమాకి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను’’ అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. -
దీపావళికి షణ్ముఖ
ఆది సాయికుమార్ హీరోగా అవికా గోర్ హీరోయిన్గా నటించిన డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. పాన్ ఇండియా మూవీగా షణ్ముగం సాప్పని దర్శకత్వలో సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ని విడుదల చేశారు. షణ్ముగం సాప్పని మట్లాడుతూ – ‘‘ఆది సాయికుమార్ కెరీర్లో ఓ మైల్స్టోన్ మూవీలా నిలిచిపోతుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రూపొందించిన చిత్రం ఇది. గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా సాగే ఈ చిత్రం విజువల్ వండర్లా ఉంటుంది. రవి బస్రూర్ ‘షణ్ముఖ’కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. దీపావళి సీజన్లో కుటుంబమంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ పాన్ ఇండియా మూవీని పలు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
లవ్ స్కోర్ ఎంత?
లవ్ స్కోర్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నారు కృతీ శెట్టి. మరి... స్కోర్ ఎంత అంటే ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’లో చూడాలంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్, విఘ్నేష్ భార్య నయనతార ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాలోని ప్రదీప్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. తాజాగా కృతీ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే 2035 సెప్టెంబరు 9న ఓ హై ఎండ్ టెక్నాలజీ మొబైల్ ఫోన్లో కృతీ శెట్టి లవ్ స్కోర్‌ను చెక్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీన్నిబట్టి భవిష్యత్‌లో సోషల్ మీడియా ప్రభావం, యువతీ యువకుల తీరు, మానవీయ సంబంధాలు వంటి అంశాలను ఈ చిత్రంలో దర్శకుడు విఘ్నేష్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. -
జాబిలమ్మ వచ్చెనండి
రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. బుధవారం కియారా అద్వానీ బర్త్ డే సందర్భంగా ‘గేమ్ చేంజర్’లో ‘జాబిలమ్మ..’ అంటూ యూనిట్ ఆమె కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఇప్పటికే ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం మిగిలిన ప్రధాన తారాగణం పాల్గొనగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. -
హైదరాబాద్‌లో స్వయంభూ
నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. కాగా శనివారం (జూన్ 1) నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘స్వయంభూ’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.‘‘ఈ చిత్రంలో లెజెండరీ వారియర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు నిఖిల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన సెట్లో జరుగుతోంది. ‘బాహుబలి, ఆర్‌ర్‌ఆర్’ వంటి భారీ చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ ‘స్వయంభూ’లో తన మ్యాజిక్ చూపించనున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. -
మాస్ మల్లి
సిగరెట్ కాల్చుతూ రిక్షాలో మాస్‌గా కూర్చొన్న అతని పేరు మల్లి. ఇంటిపేరు బచ్చల. చేసేది ట్రాక్టర్ డ్రైవర్‌గా... ఇంకా అతని పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునేవారు థియేటర్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ బచ్చల మల్లి చాలా రోజులు గుర్తిండిపోతాడు. నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రోహిణి, రావు రమేశ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్. -
జూన్‌లో హరోం హర
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ సినిమా విడుదల తేదీ మారింది. ముందుగా ఈ నెల 31న సినిమా విడుదలకు యూనిట్ ΄్లాన్ చేసింది. అయితే జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, సుధీర్ కొత్తపోస్టర్ని రిలీజ్ చేశారు.జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ‘హరోం హర’లో మాళవికా శర్మ కథానాయిక. సుమంత్ జి. నాయుడు నిర్మించారు. ‘‘ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘హరోం హర’. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగే పీరియాడికల్ ఫిల్మ్ ఇది’’ అన్నారు మేకర్స్. -
డబుల్ యాక్షన్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’(2019) మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రూపొందుతోంది. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించి, రామ్ సరికొత్త పోస్టర్ విడుదల చేశారు. ఫేస్ మాస్క్, పులి చారల చొక్కా, టోర్న్ జీన్స్ ధరించి ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో క్రాకర్స్ పట్టుకుని ఇంటెన్స్ లుక్‌తో కనిపించారు రామ్. ‘‘డబుల్ ఇస్మార్ట్’ లో డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ హై–బడ్జెట్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, సంగీతం: మణిశర్మ, కెమెరా: సామ్ కె. నాయుడు, జియాని జియాన్నెలి. -
కుటుంబ కథాచిత్రం
రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ‘శుభలేఖ’ సుధాకర్ కీలక పాత్రల్లో రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. హెచ్ఎన్జీ సినిమాస్‌పై హెచ్ మహాదేవ గౌడ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఉదయ్ శర్మ మాట్లాడుతూ–‘‘రేషన్ కార్డులాగా ఉన్న ఫస్ట్ లుక్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. మా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. ఎంతో మంది సీనియర్స్ నటిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మగారి మ్యూజిక్ హైలెట్’’ అన్నారు. ‘‘సఃకుటుంబానాం’ మంచి క్రియేటివిటీతో కూడిన కుటుంబ కథా చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మహాదేవ గౌడ్. ఈ చిత్రానికి కెమెరా: మధు దాసరి. -
సస్పెన్స్.. థ్రిల్
‘కాంచన 3, రూలర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ వేదిక లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఫియర్’. హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఏఆర్ అభి నిర్మించారు. కాగా బుధవారం (ఫిబ్రవరి 21) వేదిక పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఫియర్’. ఇందులో వేదిక క్యారెక్టర్ కొత్తగా ఉంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. ఆమె కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన చిత్రం అవుతుంది. ప్రస్తుతం ‘ఫియర్’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ, సహ నిర్మాతలు: సుజాత రెడ్డి, సామ సురేందర్ రెడ్డి. -
గ్రామీణ ప్రేమకథ
గ్రామీణ ప్రేమకథగా రూపొం దిన చిత్రం ‘శశివదనే’. రక్షిత్ అట్లూరి, కోమలి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి, పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అనే డైలాగ్ విడుదలైన పోస్టర్‌పై ఉంది. -
థ్రిల్లింగ్ ఈగల్
రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా నూతన సంవత్సరం కానుకగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఈగల్’. రవితేజని పవర్ఫుల్ పాత్రలో సరికొత్తగా చూపించనున్నారు కార్తీక్. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘2024 ఉషోదయం మీకు ఆశీర్వాదాలు, విజయాలతో పాటు మరపురాని జ్ఞాపకాలను ఇస్తుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అంటూ రవితేజ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: దేవ్ జాంద్. -
స్నేహితుల కథ
హర్షా నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌పుల్ ఎంటర్టైనర్ మూవీ ‘రోటి కపడా రొమాన్స్’. బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి సృజన్ కుమార్ బొజ్జం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫస్ట్ డోస్ అంటూ ఈ సినిమా పబ్లిసిటీ వీడియోను శనివారం విడుదల చేశారు మేకర్స్. ‘‘నలుగురు స్నేహితుల కథే ఈ చిత్రం. వారి స్నేహం, ప్రేమ, వారి లైఫ్ జర్నీ ఈ సినిమాలో ఉంటుంది. యూత్‌కు ఈ సినిమా ఓ పండగలా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్–ఆర్ఆర్ ధ్రువన్–వసంత్ .జి, కెమెరా: సంతోష్ రెడ్డి. -
ఆ రోజు థియేటర్స్‌లో అన్నపూరణి
అన్నపూరణిగా థియేటర్స్‌లోకి వచ్చేందుకు రెడీ అయ్యారు హీరోయిన్ నయనతార. ఆమె కెరీర్లో రూ΄÷ందుతున్న 75వ సినిమా ‘అన్నపూరణి’ (తెలుగులో ‘అన్నపూర్ణ’ అని అర్థం). ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనేది ఉపశీర్షిక. జీ స్టూడియోస్, నాడ్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామ్యులుగా ఉన్న ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించి, ఓ ΄ోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఫుడ్.. ఫన్.. ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
'ఈగల్' విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న రవితేజ
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఈగల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘ఈగల్’ చిత్రాన్ని 2024 జనవరి 13న సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించి, రవితేజ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘ఈ సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దవ్‌జాంద్, కెమెరా–ఎడిటింగ్–దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
'గుంటూరు కారం' పోస్టర్.. మహేశ్ వేసుకున్న షర్ట్ ధరెంతో తెలుసా?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో శ్రీలీల,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. క్రేజీ లుక్‌లో మహేశ్ బాబు అందులో మహేశ్ మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. లుంగీ, షర్ట్ ధరించి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బీడీ కాలుస్తూ క్రేజీ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ రిలీజ్ అయిన కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పోస్టర్లో మహేశ్ బాబు వేసుకున్న షర్ట్ ఫ్యాన్స్‌ను బాగా అట్రాక్ట్ చేసింది. ఇది ఏ బ్రాండ్? దీని ధరెంత అంటూ నెట్టింట సెర్చ్ చేశారు. సాధారణంగానే సెలబ్రిటీలు వాడిన కాస్ట్యూమ్స్, వాచెస్, షూస్ వంటి వస్తువులను ట్రై చేయాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. మహేశ్ రేంజ్‌కి ఆ మాత్రం ఉండాలిగా.. ఈ క్రమంలో మహేశ్ వేసుకున్న క్యాజువల్ షర్ట్ గురించి గూగుల్ చేయగా వారికి దిమ్మతిరిగే బొమ్మ కనిపించింది. ఎందుకంటే గుంటూరు కారం లేటెస్ట్ పోస్టర్లో మహేశ్ వేసుకున్న షర్ట్ ధర అక్షరాల రూ.74,509. ఫ్యాషన్ ఫార్‌ఫెచ్ R13కు చెందిన బ్లీచ్ వాష్ ప్లాయిడ్ లాంగ్ స్లీవ్ షర్ట్‌లో మహేశ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. అయితే ఇంత సింపుల్ షర్ట్ అంత కాస్ట్లీనా అని కొందరు షాక్ అవుతుంటే, మహేశ్ రేంజ్‌కి ఆ మాత్రం ఉండాలిగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. #HBDSuperstarMahesh 🥳💥#GunturKaaram pic.twitter.com/2mf80iWpgQ — Haarika & Hassine Creations (@haarikahassine) August 8, 2023 -
బర్త్ డే స్పెషల్.. మృణాల్ కొత్త పోస్టర్
‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచారు హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ చిత్రంతోపాటు విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ‘వీడీ 13’ (వర్కింగ్ టైటిల్) సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారామె. కాగా ఆగస్టు 1న మృణాళ్ ఠాకూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘హాయ్ నాన్న’ టీమ్ నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఈవీవీ సతీష్. సెట్స్‌లో... ‘గీత గోవిందం’ వంటి హిట్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీడీ 13’ (వర్కింగ్ టైటిల్). ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లో మృణాల్ బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు. ఈ సెలబ్రేషన్స్‌లో విజయ్ దేవరకొండ, పరశురామ్, శిరీష్, హన్షితపాల్గొన్నారు. -
వెంకటేశ్ 'సైంధవ్' హార్ట్ ఎవరంటే..?
సైంధవ్ హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు? ఆ మాటకొస్తే సైంధవ్ హార్ట్ ఎవరు? అంటే... బేబీ గాయత్రి. సైంధవ్, గాయత్రిల అనుబంధం ఎలాంటిదో ‘సైంధవ్’ చిత్రంలో చూడాల్సిందే. వెంకటేశ్ టైటిల్ రోల్లో శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో గాయత్రి పాత్ర చేస్తోంది బేబీ సారా. వెంకటేశ్‌తో సారా ఉన్న పొస్టర్ని ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’ అంటూ సోమవారం విడుదల చేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా, నవాజుద్దీన్ సిద్ధిఖ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా దక్షిణాది భాషల్లో, హిందీలోనూ డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఎస్. మణికందన్. ∙వెంకటేశ్, సారా -
ఆరాధ్య...
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఆరాధ్య..’ అంటూ సాగే రెండో పాటను బుధవారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఖుషి’ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘నా రోజా నువ్వే..’ పాట వంద మిలియన్లకు చేరువలో ఉంది. ‘ఆరాధ్య..’ పాట ప్రోమోను సోమవారం, పాటను బుధవారం విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ ప్రకటించింది. తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కెమెరా: జి. మురళి. -
విజయనిర్మల ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్న శరణ్
శరణ్‌కుమార్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘సాక్షి’. జాన్వీర్ కౌర్ హీరోయిన్. శివకేశన కుర్తి దర్శకత్వంలో ఆర్యూ రెడ్డి, బేబీ లాలిత్య సమర్పణలో మునగాల సుధాకర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూలై 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– 'విజయనిర్మలగారి ఫ్యామిలీ నుంచి శరణ్ హీరోగా వస్తున్నాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, శరణ్తోపాటు చిత్ర యూనిట్‌కి మంచి పేరు రావాలి' అన్నారు. 'సాక్షి’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది' అన్నారు శరణ్. 'యూనిట్ సభ్యులందరూ బాగా సహకరించారు' అన్నారు శివ. 'ప్రేక్షకులు మా చిత్రాన్ని విజయవంతం చేయాలి' అన్నారు సుధాకర్‌రెడ్డి, ఆర్యూ రెడ్డి. -
యాక్షన్ అర్జున్
సెక్యూరిటీ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్ నటించిన యాక్షన్ చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. సాక్షీ వైద్య హీరోయిన్గా నటించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని వరుణ్ తేజ్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అర్జున్‌పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘‘ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి ప్రజలను అతను ఏ విధంగా కాపాడాడు? అందుకు అతని వ్యూహాలేంటి? అనేది ఈ సినిమాలో ఆసక్తికరం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్. -
పోలీసులే నిందితులైతే...
సాధారణంగా హత్యలకు కారణమైన దోషులకు శిక్ష పడేలా బాధ్యతగా విధులు నిర్వర్తిస్తుంటారు పోలీసులు. అయితే ఓ హత్య కేసులో పోలీసులే నిందుతులు అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసు కుంటాయి? అన్న కథాంశంతో ఓ చిత్రం రూపొందుతోంది. తేజా మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ఇది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, విద్య నిర్మిస్తున్నారు. బుధవారం (జూన్ 7) రాహుల్ విజయ్ బర్త్ డే ఈ సందర్భంగా ఈ సినిమాలో ఎస్. రవి పాత్రను రాహుల్ విజయ్ చేస్తున్నట్లుగా వెల్లడించి, పోస్టర్ రిలీజ్ చేశారు. శివానీ రాజశేఖర్, పవన్ తేజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: మిధున్ ముకుందన్. -
ఓ సామాన్యుడి సంతకం
‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘నారప్ప’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తర్వాతి చిత్రానికి ‘పెదకాపు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. మిర్యాల సత్యనారాయణ సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌పై ‘పెదకాపు 1’ అని ఉంది. సో... ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పోస్టర్‌పై ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్. -
క్రూరమైన ప్రపంచంలో విశ్వక్సేన్
విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా ‘వీఎస్ 11’(వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. దివంగత నటుడు ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా ‘వీఎస్ 11’ నుంచి విశ్వక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘నైతికత లేని సమాజంలో ఓ గ్రే మ్యాన్ ప్రయాణాన్ని వర్ణించే చిత్రం ఇది. చీకటి, క్రూరమైన ప్రపంచంలో అట్టడుగు నుంచి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి కథను ఈ సినిమా వివరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
బర్త్‌డేకి థండర్
‘‘ఫస్ట్ థండర్ రానుంది.. రెడీగా ఉండండి’ అంటూ రామ్ నటిస్తున్న తాజా చిత్రం గురించి యూనిట్ పేర్కొంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా రామ్ పుట్టినరోజు (మే 15) సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఫస్ట్ థండర్’ పేరుతో ప్రత్యేకంగా ఓ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించి, శనివారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘యాక్షన్, మాస్ ఎంటర్టైనర్గా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 20న అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రామ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డిటాకే, సమర్పణ: జీ స్టూడియోస్, పవన్‌కుమార్. -
Rajinikanth: కొత్త పోస్టర్ రిలీజ్.. రజనీ మాస్ లుక్.. స్టైల్‌గా కారులో
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా, మీర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్‌పై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. కాగా ఆదివారం ‘జైలర్’ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. స్టైల్‌గా కారులో కూర్చున్న రజనీ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. కాగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్‌సలామ్’ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం ముంబైలో ఉన్నారు రజనీకాంత్. అలాగే ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. -
ట్యాక్సీ డ్రైవర్‌గా చిరంజీవి.. అదిరిపోయిన 'భోళా శంకర్' పోస్టర్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా భోళాశంకర్. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకి రీమేక్ ఇది. ఈ సినిమాలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. మేడే సందర్భంగా.. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అంటూ భోళాశంకర్ నుంచి స్పెషల్ పోస్టర్లను వదిలారు. ఇందులో కార్మికుడి కాస్టూమ్‌లో టాక్సీ దగ్గర స్టిల్స్ అదిరిపోయాయి. చదవండి: ఇలియానా పాటకు అదిరిపోయిన స్టెప్పులేసిన అదితి శంకర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా, కీర్తి సురేష్ చెల్లెలిగా నటిస్తుంది. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కార్మికులు,కర్షకులు, శ్రమ జీవులకు అందరికి మే డే శుభాకాంక్షలు❤️ Team #BholaaShankar honour & celebrate every worker on this #MayDay💥 Releasing in Theatres on AUG 11th🤟🏻 Mega🌟 @KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @adityamusic pic.twitter.com/nOtkv3AntS — AK Entertainments (@AKentsOfficial) May 1, 2023 -
సెల్ఫిష్ బాయ్: ఫస్ట్ సాంగ్ రిలీజయ్యేది అప్పుడే
‘రౌడీ బాయ్స్’తో హీరోగా పరిచయమైన ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘సెల్ఫిష్’. నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, ‘దిల్’ రాజు, శిరీష్‌ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో స్వార్థానికి చిరునామాలా ఉండే పాత బస్తీ కుర్రాడి పాత్రలో కనిపిస్తారు హీరో ఆశిష్. ఇవానా హీరోయిన్. ఈ చిత్రంలోని తొలి పాట ‘దిల్ ఖుష్..’ను మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ఆశిష్ కొత్త పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం, ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: మణికందన్, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. -
'ఖుషి' మూవీ నుంచి సమంత లుక్ చూశారా? ఫోటో వైరల్
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అటు విజయ్‌తో పాటు, సమంతకు కూడా ఎంతో కీలకం. లైగర్‌తో విజయ్, శాకుంతలంతో సమంత బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డారు. దీంతో ఖుషిపైనే ఆశలు పెట్టుకున్నారు. చదవండి: ఆడవాళ్లు మాత్రమే ఇంటిపనులు ఎందుకు చేయాలి: హీరోయిన్ ఇక ఇప్పటికే ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కి ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ఇవాళ(శుక్రవారం)సమంత బర్త్‌డే కావడంతో ఖుషీ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను వదిలారు. ఐడీ కార్డుతో స్టూడెంట్ గెటప్‌లో కనిపించింది సామ్. ఇక హీరో విజయ్ దేవరకొండ సహా పలువురు సెలబ్రిటీల నుంచి సమంతకు పెద్ద ఎత్తున బర్త్‌డే విషెస్ అందుతున్నాయి. చదవండి: హీరోయిన్‌తో వీడియో కాల్ మాట్లాడాలా? జస్ట్ రూ. 14వేలు చెల్లించండి Happy Birthday @Samanthaprabhu2 ❤️ https://t.co/VAarKWvPSH — Vijay Deverakonda (@TheDeverakonda) April 28, 2023 -
శ్రీరామ నవమి సర్ప్రైజ్ ఇచ్చిన ఆదిపురుష్ టీం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. ఇదిలా ఉంటే నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఆదిపురుష్ నుంచి ఆసక్తికర అప్డేట్ వదిలారు మేకర్స్. సీతా సమేత శ్రీరాముడిగా ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫోటోకు ప్రతిరూపంగా ఈ తాజా పోస్టర్ని డిజైన్ చేశారు మేకర్స్. ‘మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్’ అనే క్యాప్షన్‌తో సీతా, లక్ష్మణ సమేత శ్రీరాముడికి హనుమాన్ దండం పెడుతున్న ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా టీ-సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానుంది. Mantron se badhke tera naam Jai Shri Ram मंत्रों से बढ़के तेरा नाम जय श्री राम మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్#JaiShriRam #RamNavmi#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #Pramod #Vamsi pic.twitter.com/YjmncsvqwG — UV Creations (@UV_Creations) March 30, 2023 -
ఆసక్తికరంగా 'ఏందిరా ఈ పంచాయితీ' టైటిల్ పోస్టర్
భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఏందిరా ఈ పంచాయితీ'. ఈ మూవీతో గంగాధర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇవ్వబోతున్నారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రదీప్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను సరిగ్గా గమనిస్తే.. 'పల్లెటూరి వాతావరణం, అక్కడ జరిగే గొడవలు, రకరకాల మనుషుల గురించే ప్రధానంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కత్తెర, కోడి, బోరింగ్, తాటి చెట్లు, మనుషులు పరిగెత్తడం వంటివి టైటిల్ పోస్టర్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. అంటే ఒక ఊరిలో ఉండే సహజమైన వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాకు కెమెరామెన్‌గా సతీశ్, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. -
ఉగాది స్పెషల్.. నాని, కీర్తిసురేష్ న్యూలుక్ అవుట్
నాని, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న చిత్రం దసరా. ఈనెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. తాజాగా ఉగాది పర్వదినం సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను వదిలారు. పూరిల్లు ముందు పల్లెటూరి గెటప్‌లో హీరో, హీరోయిన్ల లుక్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే నెట్టింట ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. Dharani, Vennela & entire team of #Dasara wishes everyone a very Happy Ugadi ❤️ Let's celebrate all the new beginnings today and #Dasara on March 30th in cinemas💥@NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/9MUYyGFlRm — SLV Cinemas (@SLVCinemasOffl) March 22, 2023 -
కేసీఆర్ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాలేదు
హుజూరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, సకల జనులు కలసికట్టుగా పోరాడితేనే తెలంగాణ స్వప్నం సాకారమైందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తెలంగాణ బచావో సభకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మిలియన్ మార్చ్ స్ఫూర్తితోనే హైదరాబాద్‌లో æమార్చి 10న తెలంగాణ బచావో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో వచ్చే సూచనల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారు, తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వారు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం తేటతెల్లం చేస్తోందని తెలిపారు. కుంభకోణంలో తమ వాటా కోసం ఓ కుటుంబం ప్రయత్నించిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడేందుకు ధరణి పోర్టల్ రూపొందించారని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పింది ఏంటి? ఇప్పుడు చేసేదేంటి? అని కోదండరాం ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ పార్టీ తెలంగాణలో ఉనికి కోల్పోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముక్కర రాజు, పెద్దపల్లి జిల్లా కన్వీనర్ నర్సింగ్, ప్రధాన కార్యదర్శి స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
మాన్యం కృష్ణ, అర్చన జంటగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. పండు దర్శకత్వంలో ఉషశ్రీ సమర్పణలో ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్ని హీరో ఆకాశ్ పూరి విడుదల చేసి, ‘‘సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మహిళలకు కనెక్ట్ అయ్యే అంశాలు మా సినిమాలో ఉన్నాయి’’ అని చిత్ర యూనిట్ తెలిపింది. -
'ఆర్ఎక్స్ 100' డైరెక్టర్ అజయ్ భూపతి కొత్త సినిమా పోస్టర్ రిలీజ్
ఆర్ఎక్స్ 100 సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కించినా ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మంగళవారం అనే సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఇది పాన్ ఇండియాన్ సినిమా అంటే బజ్ క్రియేట్ చేశారు. స్వాతి - సురేశ్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.హారర్ జానర్లో ఈ సినిమా కథను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఆర్ఎక్స్ 100తో క్రేజ్ సంపాదించుకున్న పాయల్ ఈ మూవీలో హీరోయిన్గా నటించనుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. Here's the Title & Concept Poster of our #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋 It's a PAN-SOUTH INDIAN movie🔥 'KANTARA' fame @AJANEESHB is scoring 🎶 to this never-seen-before film 💥@MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/VqMNy64wYj — Ajay Bhupathi (@DirAjayBhupathi) February 28, 2023 -
అఖిల్ అక్కినేని 'ఏజెంట్' మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది..
అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ను అందించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటgంsyత ఈ చిత్రం నుంచి త్వరలోనే మ్యూజికల్ ట్రీట్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్28న విడుదల కానుంది. -
దసరా నుంచి నాని మాస్ పోస్టర్ రిలీజ్.. టీజర్ అప్డేట్ వచ్చేసింది
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. రిపబ్లిక్ డే సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.తెలుగు తో పాటుగా, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది. టీజర్‌ను ఈనెల 30న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. Get ready for the Mass Blast 💥#DasaraTeaser on January 30th 🔥🔥 In Telugu, Tamil, Kannada, Malayalam & Hindi 💥#Dasara in cinemas from March 30th 💥 Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @sathyaDP @saregamasouth pic.twitter.com/KrkxuM3GVe — SLV Cinemas (@SLVCinemasOffl) January 26, 2023 -
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. తన తదుపరి చిత్రంపై కీలక ప్రకటన చేశాడు హీరో. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'వీడీ12' చిత్రంలో నటించనున్నట్లు ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్టైన్మెంట్స్ నాని హీరోగా నటించిన 'జెర్సీ' చిత్రం కోసం కలిసి పనిచేశారు. 2019లో వచ్చిన 'జెర్సీ' సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. దీంతో ఈ ప్రేక్షకుల్లో ఆయనపై భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన పోస్టర్ విజయ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌ను గమనిస్తే విజయ్ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో ‘నేను ఎక్కడి వాడినో తెలియదు.. ఎవరిని మోసం చేస్తున్నానో చెప్పేందుకు’ అనే కొటేషన్ మరింత ఆసక్తి పెంచుతోంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్‌ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. The Script. The Team. My next. My heart skipped a few beats when I heard this. #VD12 pic.twitter.com/x7ELlsb6Ub — Vijay Deverakonda (@TheDeverakonda) January 13, 2023 -
డ్యాన్సర్ అక్సాఖాన్ హీరోయిన్గా 'క్షణం ఒక యుగం'.. పోస్టర్ రిలీజ్
యంగ్‌స్టర్స్ నటించిన క్షణం ఒక యుగం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బ్లాక్ బస్టర్ మూవీ ధమాకా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు గ్రాండ్‌గా విడుదల చేశారు. శ్రీ రూపా ప్రొడక్షన్ పతాకంపై మనీష్,మధు నందన్, లావణ్య, అక్సా ఖాన్, అలివియా ముఖర్జీ హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను శివబాబు దర్శకత్వంలో రూప నిర్మించారు. తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ.. ''సినిమా స్టోరీ నాకు చెప్పారు. చాలా నచ్చింది. అందుకే పోస్టర్ రిలీజ్ చేయడానికి వచ్చాను. కథ చాలా డిఫరెంట్‌గా ఉంది. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా'' అంటూ ఆల్‌ది బెస్ట్ చెప్పారు. ఇక నటి అక్సాఖాన్ మాట్లాడుతూ.. పోస్టర్ లాంచ్ చేసినందుకు డైరెక్టర్ త్రినాథరావుకు ధన్యవాదాలు తెలిపింది. సినిమాకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. -
క్రైమ్ థ్రిల్లర్‌గా 'చక్రవ్యూహం'.. ఆకట్టుకుంటున్న పోస్టర్
సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత సావిత్రి నిర్మిస్తున్న చిత్రం "చక్రవ్యూహం" ది ట్రాప్. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు. అప్పట్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ చివరిసారిగా ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. పోస్టర్ గమనిస్తే పోలీస్ పాత్రలో ఇంటెన్స్ లుక్‌తో అజయ్ కనిపిస్తున్నారు. ఈ సినిమాను మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సావిత్రి నిర్మాతగా, వెంకటేష్, అనూష సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. -
వేసవిలో కస్టడీ
నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 2023 మే 12న ‘కస్టడీ’ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘నాగచైతన్య పుట్టినరోజు (నవంబర్ 23) సందర్భంగా విడుదల చేసిన మా సినిమా టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని మే 12న తెలుగు, తమిళ భాషల్లో సినిమాని విడుదల చేయనున్నాం. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, కెమెరా: ఎస్ఆర్ కదిర్. -
సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ అప్పుడే!
సందీప్ కిషన్, దివ్యాంశా కౌశిక్ ‘నువ్వుంటే చాలు...’ అని ప్రేమ పాట పాడుకున్నారు. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మైఖేల్’ చిత్రంలోని పాట ఇది. సినిమాలోని ఈ తొలి పాటను ఈ 28న విడుదల చేయనున్నారు. ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించి, పాటలోని ఓ పోస్టర్ని చిత్రబృందం విడుదల చేసింది. రంజిత్ జయకొడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పితో కలిసి డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పకులు. ‘‘సందీప్ కిషన్‌కి తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ సినిమా కోసం సందీప్ అద్భుతంగా మేకోవర్ అయ్యారు. సామ్ సీఎస్ మంచి పాటలు ఇచ్చారు. రొమాంటిక్ సాంగ్ ‘నువ్వుంటే చాలు..’ని తెలుగు, తమిళ భాషల్లో ఈ 28న విడుదల చేయనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్‌గా నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: కె. సాంబశివరావు. -
స్టయిలిష్ లుక్‌లో చిరంజీవి.. వాల్తేరు వీరయ్య కొత్త పోస్టర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు మాంచి ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇక ముఠామేస్త్రి తరహాలో చిరంజీవి పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి చిరంజీవి లేటెస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చుట్టూ గన్స్.. మధ్యలో స్టైలిష్ గాగుల్స్‌తో స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్న చిరు ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్టర్ శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు. Presenting you all the new Avatar of our Megastar @Kchirutweets in #WaltairVeerayya 🔥 Ee poster Sample matrame, I promise ee episode motham POONAKALU guarantee in theatres 😎 Spot the Standees at your nearest theatres, Click your selfies and tag #WaltairVeerayyaOnJan13th 👍🏻 pic.twitter.com/9l24d13CbX — Bobby (@dirbobby) December 16, 2022 -
సైకో థ్రిల్లర్
సాయిధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘దక్షిణ’. ఓషో తులసీరామ్ దర్శకత్వంలో కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఆదివారం (నవంబరు 20) సాయిధన్సిక బర్త్ డే సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘‘సైకో థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. సాయి ధన్సిక హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. డిసెంబరులో విశాఖలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది’’ అన్నారు అశోక్ షిండే. బెంగాలీ హీరో రిషవ్ బసు విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: బాలాజీ. -
‘బింబిసార’ బ్లాక్‌బస్టర్.. మరో వైవిధ్యమైన కథతో వస్తున్న కల్యాణ్ రామ్
‘బింబిసార’ వంటి హిట్ సినిమా తర్వాత కల్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘అమిగోస్’. రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. కల్యాణ్ రామ్ కెరీర్లో 19వ సినిమాగా రూపొందుతుంది. ఈ చిత్రానికి ‘అమిగోస్’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రం బృందం. చదవండి: చిక్కుల్లో షారుక్ చిత్రం, డైరెక్టర్‌పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు అంతేకాదు ఈ సినిమాను 2023 ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘దె సే వెన్ యు మీట్ సమ్‌బడీ దట్ లుక్స్ జస్ట్ లైక్ యు, యు డై’ (నీలాగే కనపడే ఇంకో వ్యక్తి నీకు ఎదురుపడితే నువ్వు చస్తావు) అనేది పోస్టర్‌పై క్యాప్షన్‌గా ఉంది. ఈ చిత్రానికి సంగీతం గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. Hola #Amigos ❤️🔥 Expect the unexpected! See you in cinemas from Feb 10, 2023 🔥#RajendraReddy @AshikaRanganath @GhibranOfficial @MythriOfficial pic.twitter.com/1S2gdnUHeg — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 7, 2022 -
'వరీసు' నుంచి విజయ్, రష్మికల క్రేజీ పోస్టర్ వచ్చేసింది..
తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో నటిస్తున్న సినిమా వారసుడు. తమిళ వారిసుకు అనువాదంగా వస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రష్మిక, విజయ్‌ల ఫస్ట్ లుక్ విడుదల చేయలేదు. నేడు (శనివారం) సాయంత్రం రంజితమే సాంగ్ రిలీజ్ చేయనున్న సందర్భంగా ఈ సినిమా నుంచి క్రేజీ పోస్టర్‌ను వదిలారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మాస్ షేడ్స్‌తో కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. Let the countdown begin nanba 🔥#RanjithameFromToday 5:30 PM. 🎙️ #Thalapathy @actorvijay sir & @manasimm 🎵 @MusicThaman 🖊️ @Lyricist_Vivek@directorvamshi @iamRashmika @AlwaysJani #BhushanKumar #KrishanKumar #ShivChanana @TSeries #Ranjithame #Varisu #VarisuPongal pic.twitter.com/cQojtDDJFL — Sri Venkateswara Creations (@SVC_official) November 5, 2022 -
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఘోస్ట్ పోస్టర్ విడుదల
కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా సందేశ్ నాగరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ చిత్ర బృందం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. గాల్లోకి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య గన్ పట్టుకున్న శివరాజ్ కుమార్, వెనక ఫైర్, స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ డ్రాప్ లో పోస్టర్ ఆకట్టుకుంటోంది. భారీ వేడుకతో ప్రారంభమైన ఘోస్ట్ ప్రస్తుతం రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. -
పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’.. ఫస్ట్ లుక్, ప్రమోషనల్ సాంగ్ రిలీజ్
నేహ లీడ్రోల్లో వేదాంత్ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా తెరకెక్కిన చిత్రం 'లిల్లీ'. ఈ చిత్రంలో రాజ్వీర్ ముఖ్యప్రాతలో నటించారు. ఈ సినిమా ద్వారా శివమ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోపురం స్టూడియోస్ పతాకంపై కె.బాబురెడ్డి, జి.సతీష్‌కుమార్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు ఎమోషనల్ సాంగ్‌ను దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ.. 'శివమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్యాన్సర్‌పై పోరాటంపై ఉంటుంది. క్రియేటివ్ యూనిక్ గా ఉంది. అలాగే సీనియర్ నటుడు శివ కృష్ణ సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆయన మనవడు నటించిన ఈ సినిమా హిట్ అవ్వాలి. ఈ చిత్రంలో నటించిన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు. (చదవండి: న్యాచురల్ స్టార్ 'దసరా' అప్డేట్.. ఊరమాస్ లుక్‌లో నాని) నటుడు శివ కృష్ణ మాట్లాడుతూ... 'నా కెరీర్ లో చాలా మంది దర్శకులతో పని చేశా. కానీ వీవీ వినాయక్ అంత కూల్ పర్సన్‌ను నేను ఇంత వరకు చూడలేదు. ఆయనతో పనిచేయడం నా అదృష్టం. ఈ కార్యక్రమానికి రావడం సంతోషం' అని అన్నారు. దర్శకుడు శివమ్ మాట్లాడుతూ.. ' ఈ చిత్రంలో లిల్లీ పాత్రలో నటించిన నేహ నా జీవితానికి టర్నింగ్ పాయింట్. 32 ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అంజలి’ సినిమానే ఈ చిత్రానికి ఇన్స్పిరేషన్' అని అన్నారు. -
గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి మూవీ టైటిల్ ఇదే
కన్నడ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్దన్‌రెడ్డి వారసుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్నారు. రాధాకృష్ణన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు రవిచంద్రన్, జెనీలియా, నితేష్ దేశ్‌ముఖ్, శ్రీలీల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి చిత్రం ఫేమ్ సెంథిల్‌కుమార్ చాయాగ్రహణం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి ఫిలిమ్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి కథానాయకుడిగా పరిచయం అవుతున్న కిరీటికి ఆశీస్సులు అందించారు. శ్రమకు గుర్తింపు దక్కుతుందని పేర్కొన్నా రు. కాగా గురువారం నటుడు కిరీటి పుట్టినరోజు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిరీటి కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర టైటిల్ ప్రకటించారు. దీనికి జూనియర్ అనే టైటిల్ ఖరారు చేశారు. గురువారం విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌కు విశేష స్పందన వస్తోందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ జోరుగా సాగుతోందని దర్శకుడు తెలిపారు. -
ఆసక్తి రేపుతున్న సూర్య కొత్త సినిమా పోస్టర్.. 10 భాషల్లో విడుదల
తమిళసినిమా: వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు సూర్య. తన అద్భుతమైన నటనతో సూరరై పోట్రు చిత్రానికి ఉత్తమ జాతీయ అవార్డు గెలుచుకున్న ఈయన అకాడమీ అవార్డుల కమిటీలో సభ్యుడిగానూ అరుదైన గౌరవాన్ని పొందారు. కాగా తాజాగా ఈయన తన 42వ చిత్రానికి సిద్ధమయ్యారు. బాలీవుడ్ బ్యూటీ దిశ పటాని ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అవుతోంది. కాగా యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీకృష్ణ, ప్రమోద్ స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్‌రాజా కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి చిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు అజిత్ హీరోగా వీరం, విశ్వాసం, వివేకం వంటి విజయవంతమైన చిత్రాలను అదే విధంగా రజనీకాంత్ కథానాయకుడిగా అన్నాల్తై చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. తాజాగా సూర్య హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రానికి వెట్రి పళణిస్వామి ఛాయాగ్రహణం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతానికి సూర్య 42 పేరుతో నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను చిత్ర వర్గాలు శుక్రవారం విడుదల చేశారు. పోరాట వీరుడుగా సూర్య కనిపిస్తున్న ఈ మోషన్ పోస్టర్ ఆయన అభిమానులు విపరీతంగా అలరిస్తోంది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. చిత్ర విడుదల వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు వారు తెలిపారు. We seek all your good wishes as we begin our adventure!https://t.co/18rEmsLxom #Suriya42 @directorsiva @ThisIsDSP @DishPatani @iYogiBabu @vetrivisuals@kegvraja @StudioGreen2 @UV_Creations — Suriya Sivakumar (@Suriya_offl) September 9, 2022 -
'హనుమాన్'పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో తేజ సజ్జా నటిస్తున్న చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం మరో అప్డేట్ వచ్చింది. నేడు(మంగళవారం) హీరో తేజ సజ్జా పుట్టినరోజు కావడంతో ఆయనకి విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు.ఈ సినిమా నుంచి అసలైన గిఫ్ట్ ఈ దసరాకి అందిస్తానని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. కాగా ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ లు సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. Happy birthday my Super Hero @tejasajja123 🤗 Gift #Dussehra ki yisthaa! 😉#HanuMan #HappyBirthdayTejaSajja 🥳#SuperHeroHanuMan🔶@Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets @tipsofficial pic.twitter.com/qMBLw6TdCH — Prasanth Varma (@PrasanthVarma) August 23, 2022 -
ఆకట్టుకుంటున్న నాని 'దసరా' స్పెషల్ పోస్టర్
నాచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “దసరా”. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన దసరా టీజర్‌తో మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే నేడు(ఆదివారం)ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట సందడి చేస్తోంది. బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. సముద్రఖని, పూర్ణ, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రోషన్ మ్యాథ్యూ, సాయికుమార్, జరీనా వవాబ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. Dhoom dhaam dostaan Iraga maraga chedhaam ❤️🔥#HappyFriendshipDay #Dasara pic.twitter.com/0JrI1mybmf — Nani (@NameisNani) August 7, 2022 -
"మూడు చేపల కథ" ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
"సమంత" చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, తొలి చిత్రంతోనే దర్శకుడిగా తన ప్రతిభను ప్రకటించుకున్న యువ ప్రతిభాశాలి ముఖేష్ కుమార్ తెరకెక్కించిన ద్వితీయ చిత్రం "మూడు చేపల కథ". షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేశారు. రియలిస్టిక్ డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్ గా ముఖేష్ కుమార్ రూపొందిస్తున్న "మూడు చేపల కథ" మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. యండమూరి నవలలు చదువుతూ పెరిగి ఆయన ఇచ్చిన ప్రేరణతో రచయిత అయి దర్శకుడిగా మారిన తను దర్శకత్వం వహించిన "మూడు చేపల కథ" ఫస్ట్ లుక్ యండమూరి ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖేష్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా, కదిరిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తన రెండవ చిత్రం "మూడు చేపల కథ" తెరకెక్కించానని ముఖేష్ తెలిపారు. ప్రముఖ ఆర్జే లక్ష్మీ పెండ్యాల (లక్కీ), సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ, ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న "గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ" స్టూడెంట్స్ డా: కల్యాణ్, సుభాష్ గయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. అధిక భాగం షూటింగ్ అనంతపురంలో జరుపుకున్న ఈ చిత్రం పోస్టర్‌ను ప్రముఖ యాంకర్ రమేష్ అనంతపురంలోనూ రిలీజ్ చేశారు. -
‘సిన్స్ 1975’.. పోస్టర్ రిలీజ్
అభిలాష్, రోహీ నయన్ జంటగా రూపొందిన చిత్రం ‘సిన్స్ 1975’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో బెల్లాన అప్పారావు నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. బెల్లాన అప్పారావు మాట్లాడుతూ– ‘‘ఒకప్పటి టాప్ గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా సురేంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో ఫస్ట్ లుక్‌తో పాటు విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. సురేంద్ర మాట్లాడుతూ– ‘‘నిజజీవిత గ్యాంగ్‌స్టర్ కథతో తెరకెక్కించాం కాబట్టి సహజంగా ఉండాలని కొత్తవారిని నటింపజేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, సహనిర్మాతలు: గడ్డం శిరీష, నల్లపు రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: సురేష్ బాబు అట్లూరి. -
‘కాళీ’ పోస్టర్‌పై తీవ్ర వివాదం.. అమ్మవారి పాత్రధారి సిగరెట్ తాగుతూ...
న్యూఢిల్లీ: ‘కాళీ’ అనే డాక్యుమెంటరీ పోస్టర్ తీవ్ర వివాదానికి దారితీసింది. కెనడాలోని ఆగాఖాన్ మ్యూజియంలో ఈ పోస్టర్‌ను ప్రదర్శించారు. కాళీ మాత పాత్రధారి సిగరెట్ తాగుతూ, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్(ఎల్జీబీటీ)ని సూచించే ఏడు రంగుల జెండాను ప్రదర్శిస్తూ పోస్టర్లో కనిపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్యుమెంటరీ దర్శకురాలు లీనా మణిమేఖలై దీనిపై సోమవారం స్పందించారు. ‘‘నేను బతికున్నంతకాలం నిర్భయంగా గొంతు వినిపిస్తూనే ఉంటా. అందుకు నా జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా సిద్ధమే. డాక్యుమెంటరీ చూస్తే పోస్టర్ వెనుక ఉద్దేశం అర్థమవుతుంది’’ అన్నారు. తమిళనాడుకు చెందిన ఆమె టొరంటోలో ఉంటున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన మణిమేఖలైపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశామని ‘గో మహాసభ’ వెల్లడించింది. పోస్టర్‌పై కెనడాలోని హిందూ సమాజం నుంచి ఫిర్యాదులందాయని ఒట్టావాలోని ఇండియన్ హైకమిషన్ తెలియజేసింది. డాక్యుమెంటరీలో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే అంశాలుంటే తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. -
చిరంజీవి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..‘సంక్రాంతి’కి వచ్చేస్తున్నాడు
చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఓ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా ‘కలుద్దాం సంక్రాంతికి.. జనవరి 2023’ అంటూ శుక్రవారం పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. చిరంజీవిని గతంలో చూడని మాస్ అప్పీలింగ్, పవర్ ప్యాక్ పాత్రలో చూపించబోతున్నారు బాబీ. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ను జూలైలో ప్రారంభిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆర్థర్ ఎ విల్సన్, సహనిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం, సీఈవో: చెర్రీ, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కేవీవీ. -
ఇద్దరు హీరోయిన్స్‌తో హస్యనటుడు సంతానం రొమాన్స్
గులు గులు చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. హాస్యనటుడు సంతానం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. నటి అతుల్య చంద్ర, నమితా కృష్ణమూర్తి నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మేయాదమాన్, అడై చిత్రాల దర్శకుడు రత్నకుమార్ తెరకెక్కిస్తున్నారు. సర్కిల్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.రాజ్ నారాయణన్ భారీఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీనిని జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సినీ వర్గాల నుంచి, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. దీనికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు తెలిపారు. -
‘ఊరు పేరు భైరవకోన’ పోస్టర్ రిలీజ్
హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు (07.05.) సందర్భంగా ఆయన తాజా చిత్రాల (మైఖేల్, ఊరు పేరు భైరవకోన) నుంచి లుక్స్ రిలీజయ్యాయి. పాన్ ఇండియా మైఖేల్ .. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకొడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: శివ చెర్రీ. ఊరు పేరు భైరవకోన.. సందీప్ హీరోగా, కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, కెమెరా: రాజ్ తోట, సంగీతం: శేఖర్ చంద్ర. -
బాలకృష్ణ చేతుల మీదుగా 'లవ్ రెడ్డి' పోస్టర్ రిలీజ్
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’. ఈ సినిమాతో స్మరణ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎమ్జీఆర్ ఫిలిమ్స్, గీతాన్ష్ ప్రొడక్షన్స్, సెహరి స్టూడియోస్ బ్యానర్స్‌పై హేమలతా రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజన్ రెడ్డి, నాగరాజు బీరప్ప నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేసి, ‘యంగ్ టీమ్ కలిసి చేస్తున్న ‘లవ్ రెడ్డి’ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథ ‘లవ్ రెడ్డి’. 80 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగాన్ని కర్ణాటకలోని బాగేపల్లి, చిక్బల్లాపూర్, బెంగళూరులో చిత్రీకరించనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రిన్స్ హెన్రీ, సహనిర్మాతలు: నవీన్ రెడ్డి, సుమలతా రెడ్డి, సుస్మితా రెడ్డి, హరీష్. చదవండి: బాలీవుడ్లో కామాంధుడిని బయటపెడతా: సల్మాన్ మాజీ ప్రేయసి -
'రావణాసుర' చిత్రంలో సుశాంత్ సీరియస్ రోల్
రవితేజ హీరోగా సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రావణాసుర’. ఈ చిత్రంలో సుశాంత్ ముఖ్య పాత్ర చేస్తున్నారు. శుక్రవారం సుశాంత్ బర్త్‌డే సందర్భంగా ఆయన పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ఈ పోస్టర్ సుశాంత్ సీరియస్ రోల్ చేస్తున్నారని స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. మరోవైపు సుశాంత్ తొలిసారి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ‘జీ 5’ ఒరిజినల్ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొన్నారాయన. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో సుశాంత్ లుక్‌ని రిలీజ్ చేశారు. -
కొత్త సినిమా అనౌన్స్ చేసిన హీరో సుధీర్‌బాబు
Hero Sudheer Babu Announces His Next Movie: హీరో సుధీర్‌బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలె శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో హిట్ అందుకున్న సుధీర్‌బాబు ప్రస్తుతం కృతిశెట్టితో కలసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. తాజాగా తన 16వ సినిమాకు సంబంధించిన అప్డేట్ని అభిమానులతో పంచుకున్నాడు. మహేష్ సురపనేని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘గన్స్ డోంట్ లై’ అనే ట్యాగ్‌లైన్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చుట్టూ తుపాకులు, పోలీస్ స్పెషల్ క్రైమ్స్ డివిజన్ అనే లోగోతో ఇంట్రెస్టింగ్గా పోస్టర్‌ను వదిలారు. ఈ సినిమాలో హీరోయిన్ సహా మరింత సమాచారం త్వరలోనే తెలియనుంది. Super excited for this one 😊#Sudheer16 Action Unlimited👊🏻@bharathhere @actorsrikanth @imaheshh @vincentcinema @bhavyacreations #anandaprasad @anneravi pic.twitter.com/NZix4covyc — Sudheer Babu (@isudheerbabu) February 12, 2022 -
స్ప్రింటర్‌గా ఆది పినిశెట్టి.. పోస్టర్ రిలీజ్
ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఆది స్ప్రింటర్‌గా కనిపిస్తున్నారు. ‘‘స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. సరైన స్ప్రింటర్‌లా కనిపించడానికి ఆది కఠినమైన శిక్షణ తీసుకున్నారు. తమిళ–తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఒలింపిక్స్‌లో భారతదేశం మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నందున మా సినిమా టీజర్ విడుదలకు ఇది సరైన సమయం అని భావించి, ఈ నెల 6న టీజర్ రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. Gearing up for the run! 🏁 #ClapTeaser#Ilaiyaraaja @aakanksha_s30 @Kurupkrisha @prithivifilmist @BigPrintOffl @SRCOffl @SSSMOffl @CNGS_2019 @PMM_Films @pravethedop @ClapMovie @LahariMusic @UrsVamsiShekar @DoneChannel1 pic.twitter.com/PNITGVEDYx — Aadhi🎭 (@AadhiOfficial) September 2, 2021 చదవండి : RC 15: మరో వివాదంలో డైరెక్టర్ శంకర్.. -
‘ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ అం అః’ పోస్టర్ విడుదల
సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం ‘అం అః’. ‘ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్’ ట్యాగ్‌లైన్. శ్యామ్ మండల దర్శకుడు. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై నిర్మాత జోరిగే శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్‌తో పాటు నిర్మాత శ్రీనివాస్, దర్శకుడు శ్యామ్ మండల, హీరో సుధాకర్ జంగం, సినిమాటోగ్రాఫర్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘అం అః’ మూవీ టైటిల్ చాలా బాగుంది. ఇది వరకు నేను కూడా అఆఇఈ అనే టైటిల్‌తో సినిమా చేశాను. ఇప్పుడు ‘అం అః’ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. పోస్టర్‌ను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ శ్యామ్ మండల, నిర్మాత శ్రీనివాస్‌గారు, హీరో సుధాకర్ ఓ టీమ్‌గా ఏర్పడి మంచి కంటెంట్‌తో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్స్’ అన్నారు. నిర్మాత జోరిగే శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ‘‘మా మూవీ పోస్టర్‌ను విడుదల చేసిన శ్రీకాంత్‌గారికి థాంక్స్. డైరెక్టర్ శ్యామ్ మండలగారు అనుకున్న ప్లాన్ ప్రకారం సినిమాను చక్కగా పూర్తి చేశారు. శివగారు తన సినిమాటోగ్రఫీతో సినిమాను రిచ్‌గా ఎలివేట్ చేశారు. అలాగే సినిమా బాగా రావడానికి సపోర్ట్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్’’ అన్నారు. దర్శకుడు శ్యామ్ మండల మాట్లాడుతూ ‘మా మూవీ ‘అం అః’ పోస్టర్‌ను విడుదల చేసిన శ్రీకాంత్ గారికి థాంక్స్. కరోనా పరిస్థితుల్లోనూ నిర్మాత శ్రీనివాస్ గారు ఇచ్చిన సపోర్ట్‌తో ‘అం అః’ సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశాను. అంతకు ముందు ఆయనిచ్చిన సపోర్ట్‌తోనే ట్రూ అనే సినిమాను కూడా పూర్తి చేశాను. నాపై నమ్మకంతో శ్రీనివాస్ గారు ‘అం అః’ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ అందించారు. హీరో సుధాకర్ కంటెంట్‌ను నమ్మి వర్క్ షాప్ చేసి చక్కటి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ టీమ్‌తో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు. -
కృష్ణాష్టమి: 'రాధే శ్యామ్' సర్ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్
Radhe Shyam Janmashtami Special: ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా ఓ సర్ప్రైజింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో ప్రభాస్, పూజాల లుక్ ఆకట్టుకుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్నరాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్ ప్రేరణగా నటించారు. కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా 2022 జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. As we celebrate Janmashtami, let Vikramaditya and Prerna teach you a new meaning of love! 💕 Here's wishing you all a very Happy Janmashtami! #RadheShyam Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/3FZTeyUF5F — Radhe Shyam (@RadheShyamFilm) August 30, 2021 చదవండి : 96 మూవీ కాంబో రిపీట్, విజయ్ సేతుపతికి మరో హిట్! బిగ్‌బాస్ 5: ఆ స్టార్ సింగర్ ఎంట్రీ ఫిక్స్! -
నాగశౌర్యకు ముద్దిచ్చిన హీరోయిన్..
ప్రాచీన విలువిద్య నేపథ్యంలో నాగశౌర్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లక్ష్య’. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్‌దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని నాగశౌర్య, కేతికల పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. -
యాహూ.... ముగించేశాం
ఫొటో చూశారుగా... శర్వానంద్, సిద్ధార్థ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ జోరుకి కారణం ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన ‘మహా సముద్రం’ సినిమా పూర్తి కావడమే. ఈ సందర్భంగా శర్వానంద్, సిద్ధార్థ్ ‘యాహూ.. ముగించేశాం’ అనేలా నవ్వుతూ ఉన్న పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘ఎనిమిదేళ్ల తర్వాత ‘మహా సముద్రం’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. ఇంతకంటే సంతోషమైనది మరేదీ లేదు.. థియేటర్లలో కలుద్దాం’’ అన్నారు. ‘‘పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అన్ని అడ్డంకులను అధిగమించి బెస్ట్ ఔట్పుట్ ఇచ్చిన అజయ్ భూపతి, శర్వానంద్, సిద్ధార్థ్, అదితి, అనూ ఇమ్మాన్యుయేల్‌కి థ్యాంక్స్’’ అన్నారు అనిల్ సుంకర. ఈ చిత్రానికి సహ నిర్మాత: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. -
పాప్‌కార్న్ సినిమా: ఆ తర్వాత ఏమైంది?
హీరోయిన్ అవిగా గోర్ నిర్మాతగా పరిచయమవుతున్న చిత్రం ‘పాప్ కార్న్’. సాయి రోనక్, అవికా గోర్ జంటగా యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. భోగేంద్రగుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అవికా గోర్, ఎంఎస్ చలపతిరాజు సహనిర్మాతలు. బుధవారం (జూన్ 30) అవికా పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించి, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త కథాకథనాలతో రూపొందుతున్న చిత్రమిది. అవికా గోర్ నిర్మాణ భాగస్వామ్యంలో ఈ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు భోగేంద్రగుప్తా మడుపల్లి. ‘‘మెలోడ్రామా జానర్లో సాగే చిత్రమిది. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం గల ఓ అమ్మాయి, ఓ అబ్బాయి... తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అనేది చిత్రకథ’’ అన్నారు మురళీ నాగ శ్రీనివాస్ గంధం. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్. View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) -
‘పక్కా కమర్షియల్’..పోస్టర్ రిలీజ్
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రంలోని స్టైలిష్ పోస్టర్‌ను గోపీచంద్ బర్త్‌డే (జూన్ 12) సందర్భంగా విడుదల చేశారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ నలభై శాతం పూర్తయింది. కొత్త షెడ్యూల్‌ను వచ్చే నెల మొదటివారంలో ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: జేకేఎస్ బిజాయ్, సహనిర్మాత: ఎస్కేఎన్. -
శత్రుసంహారానికి ఆచార్య సిద్ధం!
ధర్మానికి ధైర్యం తోడైన వేళ శత్రుసంహారానికి ఆచార్య సిద్ధమయ్యాడు. సిద్ధతో సహా ముందుడుగు వేశాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆచార్యగా చిరంజీవి, సిద్ధ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. శనివారం చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో తండ్రీకొడుకులు కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘మీతో కలిసి నటించడంతో నా కల నెరవేరినట్లు ఉంది నాన్నా. ఇంతకన్నా నాకు బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది’’ అని, ‘లాహి లాహి...’ పాటలో వింటేజ్ మెగాస్టార్‌ని చూస్తారని ప్రామిస్ చేస్తున్నాం అని పేర్కొన్నారు రామ్‌చరణ్. అలాగే ‘ఆచార్య’లోని ‘లాహి లాహి...’ అనే పాట లిరికల్ వీడియోను మార్చి 31న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ పాటకు సంబంధించి చిరంజీవి ఫొటోను విడుదల చేశారు. మే 13న ఈ సినిమా రిలీజ్. -
శ్రీమతి ఎంజీఆర్
మధుబాల మంచి నటి. ‘రోజా’, ‘జెంటిల్‌మేన్’ వంటి సినిమాలు చాలు.. ఆమె ఎంత మంచి నటో చెప్పడానికి. కథానాయికగా మంచి పాత్రలు చేసిన మధు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అలాంటి పాత్రలే చేస్తున్నారు. వచ్చే నెల 23న విడుదల కానున్న ‘తలైవి’లో ఆమె ఓ నిజజీవిత పాత్ర చేశారు. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కంగనా టైటిల్ రోల్ చేశారు. ఇందులో ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ పాత్రను మధుబాల చేశారు. శుక్రవారం (మార్చి 26) మధుబాల బర్త్‌డే సందర్భంగా ఆమె లుక్ విడుదలైంది. ఆస్పత్రిలో ఎంజీఆర్ పక్కన కూర్చుని, ఆయన్ను చూస్తున్న జానకీ రామచంద్రన్ లుక్‌కి మంచి స్పందన లభించింది. -
ఆర్ఆర్ఆర్ : రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కి గిఫ్టిచ్చిన రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. రేపు(మార్చి27)న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేసింది చిత్ర బృందం. ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. చేతిలో విల్లు పట్టుకొని అల్లూరి సీతారామరాజుగా పవర్ఫుల్ లుక్‌లో కనిపించారు రామ్ చరణ్. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే విడుదల చేసిన కామన్ డీపీ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. క్రియేటివ్‌గా కాకుండా ఓ సాదాసీదా ఫొటోను వదిలారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని కూల్ చేసేందుకు మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్‌ను సంతృప్తి పరుస్తుంది. ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌కు జోడీగా సీతగా ఆలియా భట్ నటిస్తుంది. ఈ మూవీని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. చదవండి : ఆర్ఆర్ఆర్: సీత వచ్చేసిందిగా ఆర్ఆర్ఆర్: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్! The man of bravery, honour and integrity. Presenting my #AlluriSitaRamaraju to you all... 🔥 #RRR #RRRMovie @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/uEFLFp8bDX — rajamouli ss (@ssrajamouli) March 26, 2021 -
రానాతో సాయిపల్లవి కోలు.. కోలు...
‘కోలు కోలు..’ అంటూ సాయిపల్లవి హుషారుగా స్టెప్పేశారు. రానా సరసన నటిస్తున్న ‘విరాటపర్వం’లో సాయిపల్లవిపై తీసిన సోలో సాంగ్ ఇది. వేణు ఊడుగుల దర్శకత్వంలో డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘కోలు కోలు..’ అనే లిరికల్ వీడియో సాంగ్ ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ పాటకు సంబంధించిన సాయిపల్లవి పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘‘ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని పాత్రలను రానా, సాయిపల్లవి చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూ సర్: విజయ్‌కుమార్ చాగంటి. -
అదిరిపోయే కొత్త లుక్‌లో కల్యాణ్ దేవ్..
పుట్టినరోజు సందర్భంగా కల్యాణ్ దేవ్ రెండు చిత్రాల విశేషాలను చెప్పారు. రమణతేజ దర్శకత్వంలో కల్యాణ్ దేవ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కిన్నెరసాని’. రామ్ తాళ్లూరి నిర్మాణ సారథ్యంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గురువారం కల్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ‘కిన్నెరసాని’ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌తో పాటు గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు శ్రీధర్ సీపాన దర్శకత్వంలో కల్యాణ్ దేవ్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమాకు సంబంధించిన వీడియోను కూడా కల్యాణ్ దేవ్ బర్త్‌డే సందర్భంగానే రిలీజ్ చేశారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. కాగా, రెండు చిత్రాల్లోనూ కల్యాణ్ దేవ్ లుక్ వ్యత్యాసంగా ఉంటుందని విడుదల చేసిన లుక్స్ చెబుతున్నాయి. -
ఏజెంట్ అగ్ని
ఏజెంట్ అగ్ని... తనకి ఏ మాత్రం భయం లేదు. ఉన్నదల్లా తెగువ మాత్రమే. ఆమె సాహసాల్ని చూడాలంటే అక్టోబర్ వరకూ వేచి చూడాలి. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘థాకడ్’. రజనీష్ రాజీ ఘయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ని అనే గూఢచారి పాత్రలో కంగన కనిపిస్తారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపిస్తారామె. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘థాకడ్’ నా కెరీర్లో బెంచ్‌మార్క్ సినిమా అవుతుంది. భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఇది ప్రత్యేకంగా ఉండబోతోంది’’ అన్నారు కంగనా రనౌత్. -
అందమైన ప్రేమ
‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ స్టోరి’. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా కె.నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని ఈ నెల 10న ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించి, తాజా పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ప్లెజంట్ ప్రేమకథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే శేఖర్ కమ్ముల రూపొందించిన మరో ఆహ్లాదకరమైన చిత్రం ‘లవ్ స్టోరి’. ఈ అందమైన ప్రేమకథపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ‘ఏయ్ పిల్లా..’ పాటకి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగు తున్నాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి.కుమార్, సంగీతం: పవన్ సి.హెచ్, సహనిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వర రావు. -
వినోదం మూడింతలు
కోబ్రా అంటే పాము అని మనకు తెలుసు. అయితే ‘ఎఫ్2’లో కోబ్రా అంటే కో–బ్రదర్స్ (తోడల్లుళ్లు). వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా ఈ సినిమాలో చేసిన కామెడీ మామూలుగా ఉండదు. వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌కి జోడీగా మెహరీన్ నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు వినోదం మూడింతలు అంటూ వెంకీ బర్త్‌డే సందర్భంగా ఆదివారం ‘ఎఫ్ 3’ని ప్రకటించారు. తొలి భాగంలో హీరోలు భార్యల వల్ల ఫ్రస్ట్రేట్ అవుతారు. సీక్వెల్లో ఇద్దరూ డబ్బు కారణంగా ఇబ్బందుల పాలవుతుంటారు. ఆ విషయాన్ని సూచిస్తూ, వెంకీ, వరుణ్ ట్రాలీలో డబ్బుల కట్టలు పట్టుకుపోతున్న పోస్టర్ని విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే రూపొందనున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌లే కథానాయికలు. అదనంగా మరో ముగ్గురు నాయికలు ఉంటారని సమాచారం. ఇద్దరు వెంకీ సరసన, ఇద్దరు వరుణ్ తేజ్ సరసన నటిస్తారట. మరో హీరో అతిథి పాత్రలో కనిపిస్తారని వినికిడి. బహుశా ఆ హీరోకి జోడీగా ఐదో హీరోయిన్ ఉంటుందేమో! -
డోస్ రెండింతలు
మంచు విష్ణు కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ఢీ’. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. సోమవారం విష్ణు పుట్టినరోజు సందర్భంగా ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్‌గా ‘డి–డి’ని ప్రకటించారు చిత్రనిర్మాత, హీరో మంచు విష్ణు, దర్శకుడు శ్రీను వైట్ల. 24 ఫ్యాక్టరీ ఫిలింస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. సంకెళ్ల మధ్య రెండు ‘డి’ అక్షరాలను డిజైన్ చేశారు. ‘ఢీ’లో ఉన్న కామెడీ, యాక్షన్ ఈ సీక్వెల్లో రెట్టింపు ఉంటాయనే ఉద్దేశంతో ‘డబుల్ డోస్’ అని ట్యాగ్‌లైన్ పెట్టారు. గోపీమోహన్, కిషోర్ గోపులు రచయితలుగా చేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: అవ్రామ్ భక్త మంచు, సంగీతం: మహతి స్వరసాగర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్. -
బర్త్‌డే స్పెషల్ : నాగ చైతన్య న్యూ లుక్
సాక్షి, హైదరాబాద్: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పల్లెటూరి గెటప్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. చేతూ పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ''లవ్ స్టోరి'' స్పెషల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లుంగీ, బనియన్‌తో పల్లెటూరి యువకుడి పాత్రలో నాగ చైతన్య లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కొందరితో స్నేహాలు చాలా బావుంటాయి. చైతూతో అసోసియేషన్ అలాంటిదే.. థ్యాంక్యూ.. హ్యాపీ బర్త్ డే చైతన్య'' అంటూ 'లవ్ స్టోరి'' చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల చేకు శుభాకాంక్షలు తెలిపారు. నాగ చైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు నాగ చైతన్య తన శ్రీమతి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేనితో కలిసి మాల్దీవుల్లో విహారయాత్రలో ఉన్నారు. అయితే తన హబ్బీ పుట్టినరోజు సందర్భంగా, సమంతా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న అద్భుతమైన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అంతకుముందు స్కూబా డైవింగ్ కోసం సిద్ధమవుతున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Some associations are meant to be cherished ...... Thank you .. Happy Birthday Chaitanya ...#HBDNagaChaitanya @chay_akkineni#lovestory #nagachaitanya #saipallavi pic.twitter.com/bfJYFXn4PR — Sekhar Kammula (@sekharkammula) November 23, 2020 . View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
మంచి నటి అనిపించుకుంటాను
‘‘అల్లు అరవింద్‌గారి సినిమాల వల్ల నేను యాక్టర్ నుండి స్టార్ అయ్యాను. ఇప్పుడు చేస్తున్న ‘లెవెన్త్ అవర్’ సిరీస్ వల్ల ఓ స్టార్ నుండి మంచి నటిగా పేరు తెచ్చుకుంటానని భావిస్తున్నాను. ఓ నటిగా తెలుగు సినిమాలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. తెలుగు కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది’’ అన్నారు హీరోయిన్ తమన్నా. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. త్వరలో ‘ఆహా’లో ప్రసారం కానున్న ఈ సిరీస్ టైటిల్, పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘కొన్ని గంటల్లో నడిచే కథ ‘లెవెన్త్ అవర్’. ప్రవీణ్ సత్తారు కథ నచ్చితేనే చేస్తాడు. ఈ సబ్జెక్ట్ బావుందని అన్నారు. ప్రదీప్‌గారు నిర్మాతే కాదు.. అద్భుతమైన రైటర్ కూడా. అందుకనే మా కోసం ఆయన్ని మరో వెబ్ సిరీస్ చేయమని అడిగాను’’ అన్నారు. ‘‘8 అవర్స్’ అనే బుక్ నుండి హక్కులు కొని ‘లెవెన్త్ అవర్’ కథ తయారు చేశాను’’ అన్నారు రచయిత, నిర్మాత ప్రదీప్. ‘‘ఓ సిరీస్‌కు కావాల్సిన అన్ని అంశాలు మా ‘లెవన్త్ అవర్’లో ఉన్నాయి. ఒక రాత్రిలో జరిగే కథ’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
నాంది పూర్తి
‘అల్లరి’ నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నాంది’. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘నాంది’ సినిమాలో పూర్తి భిన్నమైన, ఉద్వేగభరితమైన పాత్ర పోషించారు నరేష్. ఇలాంటి పాత్రను ఆయన ఇప్పటివరకు చేయలేదు. సతీష్ వేగేశ్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు (ఫస్ట్ రివీల్ ఇంప్యాక్ట్) అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్: రాజేష్ దండా, కెమెరా: సిద్, సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
సంక్రాంతి బరిలో అరణ్య
రానా హీరోగా నటించిన చిత్రం ‘అరణ్య’. తెలుగులో ‘అరణ్య’గా హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, తమిళ్లో ‘కాడన్’ పేరుతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. 25 ఏళ్లుగా అడవిలో జీవిస్తున్న ఓ మనిషి కథ ‘అరణ్య’. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభంపై దృష్టి పెట్టి తీసిన చిత్రమిది. మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన నూతన పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో రానాతో పాటు విష్ణు విశాల్ కనిపిస్తున్నారు. జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: శంతను మొయిత్రా, కెమెరా: ఎ.ఆర్. అశోక్ కుమార్. -
వరలక్ష్మీ దాగుడుమూతలు
వరలక్ష్మీ శరత్‌కుమార్ దాగుడుమూతలు ఆడుతున్నారు. చిన్నప్పుడు ఆడుకునే దాగుడుమూతలు ఆటని ఇప్పుడు ఆడుతుందేంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. వరలక్ష్మీ ‘కన్నామూచ్చి’ అనే తమిళ సినిమాతో డైరెక్టర్‌గా మారబోతున్నారు. ‘కన్నామూచ్చి’ అంటే తెలుగులో దాగుడుమూతలు అని అర్థం. మహిళా ప్రధానంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తేనాండల్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించనుంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి, వరలక్ష్మీ మాట్లాడుతూ– ‘‘ఫైనల్‌గా దర్శకురాలిగా కొత్త అవతారంలోకి అడుగుపెడుతున్నాను. దర్శకురాలిగా కష్టపడి నేనేంటో నిరూపించుకుని, మీ (ప్రేక్షకులు) అందరి ముందు తలెత్తుకుని నిలబడతాను’’ అన్నారు. -
నరుడి బ్రతుకు నటన
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం మంచి విజయం సాధించింది. మరోసారి వీరిద్దరూ జంటగా ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాలో నటించనున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్ కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా దీపావళికి ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. హెడ్‌ఫోన్స్, హార్ట్ సింబల్.. ఓ జంటతో ఈ ప్రచార చిత్రాన్ని డిజైన్ చేశారు. మామూలుగా హార్ట్ సింబల్ ఎరుపు రంగులో ఉంటుంది. కానీ నీలం రంగులో కనిపిస్తోంది. అదేంటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, సంగీతం: కాలభైరవ, కెమెరా: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని. -
మిషన్ ముగిసింది
లాక్డౌన్ తర్వాత పెద్ద హీరోల్లో ఫస్ట్ షూటింగ్లో పాల్గొన్న స్టార్ అక్షయ్ కుమార్. ఆయన హీరోగా ‘బెల్‌బాటమ్’ అనే పీరియాడికల్ చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం చిత్రబృందంతో కలసి స్కాట్‌ల్యాండ్ వెళ్లారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఓ డిటెక్టివ్ సురక్షితంగా ఎలా రక్షించాడన్నది చిత్రకథాంశం. రంజిత్ యం. తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హ్యుమా ఖురేషీ, లారా దత్తా, వాణీ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. 40 రోజుల్లో మిషన్‌ని పూర్తి చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. -
గాజులు ఘల్లుమన్నవే
పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. సోమవారం కృతీ శెట్టి బర్త్‌డే సందర్భంగా ‘క్యూటెస్ట్ అండ్ నేచురల్ యాక్ట్రెస్ కృతీ శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. చేతులకు గాజులు వేసుకుంటూ అపురూపంగా వాటిని చూసుకుంటోన్న ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ‘‘ఉప్పెన’ చిత్రంలో వైష్ణవ్ తేజ్, కృతి మధ్య కెమిస్ట్రీ ముచ్చటగా అనిపిస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పాటలు సంగీతప్రియులను అలరిస్తూ టాక్ ఆఫ్ ద టౌ¯Œ గా మారాయి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. సానుకూల పరిస్థితులు ఏర్పడి, థియేటర్లు తెరుచుకోగానే సినిమాని విడుదల చేయడానికి సన్నద్ధంగా ఉన్నాం’’ అని నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్ సైనుద్దీ¯Œ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి, సీఈవో: చెర్రీ. -
నో పార్కింగ్
సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది ఉపశీర్షిక. ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ చిత్రంలోని సుశాంత్ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మార్చి పోయి సెప్టెంబర్ వచ్చింది.. గేర్ మార్చి బండి తియ్’ (షూటింగ్ మొదలుపెడుతున్న విషయాన్ని ఉద్దేశిస్తూ) అని ట్వీట్ చేశారు సుశాంత్. హీరో సుమంత్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘ఆప్యాయత నిండిన అన్ని జ్ఞాపకాలు ఈ రోజు ఎక్కువగా మెదులుతున్నాయి తాతా.. మీ జీవితంలో ఒక చిన్న భాగమైనందుకు జీవితాంతం రుణపడి ఉంటాను, కృతజ్ఞుడనై ఉంటాను’ అని భావోద్వేగపూరితంగా రాసుకొచ్చారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: ఎం. సుకుమార్. -
ఉపేంద్ర కబ్జా
ఉపేంద్ర పుట్టినరోజు (సెప్టెంబర్ 18) సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కబ్జా’ థీమ్ పోస్టర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేయించారు. శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్ప్రైజెస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని లాంకో శ్రీధర్ సమర్పిస్తున్నారు. ‘ఏ’, ‘ఉపేంద్ర’ తదితర చిత్రాలతో హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఉపేంద్ర. ప్రస్తుతం ఆయన హీరోగా ‘కబ్జా’ ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో సుధీర్‌బాబు హీరోగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాకి దర్శకత్వం వహించిన ఆర్.చంద్రు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
మోదీ మనోవిరాగి
ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘మోదీ’. తెలుగులో ఈ సినిమా ‘మనోవిరాగి’గా, తమిళంలో ‘కర్మయోగి’గా విడుదల కానుంది. ఎస్. సంజయ్ త్రిపాఠి రచించి, దర్శకత్వం వహించారు. మహావీర్ జైన్‌తో కలిసి దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధినేత యం. సుభాస్కరన్ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. గురువారం మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సినిమా పోస్టర్లను విడుదల చేశారు. మోదీ పాత్రలో అభయ్‌వర్మ నటించారు. మోదీ పెరిగిన గుజరాత్‌లోని వాద్నగర్, ఉత్తరాఖండ్‌లలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా యం. సుభాస్కరన్ మాట్లాడుతూ– ‘‘ప్రధాని మోదీగారి టీనేజ్ విశేషాలు, ఆయన జీవితంలోని ముఖ్యమైన మలుపుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సమర్పించటం సంతోషంగాను, మాకు దక్కిన గౌరవంగాను భావిస్తున్నాం’’ అన్నారు. -
అప్పట్లో ఓ దెయ్యం ఉండేది
‘ఖైదీ’తో సూపర్ హిట్ ఇచ్చారు తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో ‘మాస్టర్’ తెరకెక్కించారు. లాక్డౌన్ వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు తన తాజా చిత్రం లోకనాయకుడు కమల్‌హాసన్‌తో ఉంటుందని ప్రకటించారు. ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసి ఈ వార్తను ప్రకటించారు లోకేశ్. అందులో ‘అప్పట్లో ఓ దెయ్యం ఉండేది’ అని రాసి ఉంది. కమల్‌హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 2021 వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీత దర్శకుడు. కమల్‌హాసన్ స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చానని పలు సందర్భాల్లో చెప్పారు లోకేశ్. 2021లో విడుదలయ్యేవాటిలో కమల్ హీరోగా తాను తీయబోతున్న సినిమా ఉత్తమ చిత్రంగా ఉంటుందని కూడా అన్నారు లోకేశ్ కనగరాజ్. Aandavarukku Nandri 🙏🏻#KamalHaasan232 #எவனென்றுநினைத்தாய்@ikamalhaasan @Dir_Lokesh @anirudhofficial @RKFI pic.twitter.com/ealPsOWxFS — Lokesh Kanagaraj (@Dir_Lokesh) September 16, 2020 -
థ్రిల్‌ని పంచే విధి
శశాంక్ మంగు, భవ్యశ్రీ జంటగా సూర్యకుమార్ భగవాన్ దాస్ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విధి లిఖితం’. ఎమ్. లోచన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై పాండు నిర్మిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ– ‘‘సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. వైవిధ్యమైన కథాంశంతో ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెగ్యులర్ చిత్రాలు తీస్తే చూసే పరిస్థితి లేదు. ఒక కొత్త పాయింట్‌తో సినిమా తీయకపోతే పోటీలో నిలవడం కష్టంగా ఉంది. లోచన్ చెప్పిన కథ చాలా కొత్తగా, థ్రిల్లింగ్‌గా ఉంది. వికాశ్ కురుమెళ్ల మంచి సంగీతం అందిస్తున్నారు. లక్ష్మీ శ్రీనివాస్ కంతేటి, రామకృష్ణ పరిటాల చక్కని మాటలు అందించారు. మా సినిమా మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన రావటంతో యూనిట్ అంతా ఉత్సాహంగా ఉన్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాగేంద్ర కుమార్ మోతుకూరి. -
పవర్ఫుల్ లాయర్
‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పవన్ అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్ఫుల్ లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్‌గారు కనిపించబోతున్నారు. కరోనా వైరస్ పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్ , కెమెరా: పి.ఎస్. వినోద్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి. -
నాగ్ బర్త్‌డే : ఫ్యాన్స్‌కు సర్ప్రైజింగ్ గిఫ్ట్
-
నాగ్ బర్త్‌డే : ఫ్యాన్స్‌కు సర్ప్రైజింగ్ గిఫ్ట్
ఆరు పదుల వయసులోనూ అమ్మాయిల మనసుల్ని కొల్లగొడుతున్న నవ మన్మథుడు నాగార్జున. ప్రస్తుతం ఆయన వయసు 60 ఏళ్లు దాటాయంటే నమ్మడం కష్టంగానే ఉంటుంది. నేటితో(ఆగస్ట్ 29) ఆయన 60 ఏళ్లు పూర్తి చేసుకొని 61 వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా నాగార్జునకి అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నాగ్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. (చదవండి : కింగ్ బర్త్‌డే: దేనికైనా అతనే బాస్..) ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఇప్పటి వరకు 12 మిషన్స్‌ను చేసినట్టు ఉంది. అతనికి సహాయకులుగా మరో ఐదుగురు అధికారులు నటిస్తున్నారు. అందులో ఓ లేడీ ఆఫీసర్ కూడా ఉంది. ఎన్ఐఏ ఆఫీసర్‌గా నాగ్ లుక్ ఆసక్తిని కలిగిస్తోంది. మ్యాట్నీ ఎంటర్మమెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు అహిసార్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా దియా మీర్జా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. -
సరికొత్త కాంబినేషన్
శనివారం కీర్తీ సురేష్ ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఇందులో ఓ విశేషం ఉంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ముఖ్య పాత్ర చేయనున్నారు. ‘7/జి బృందావన్ కాలనీ’, ‘యుగానికి ఒక్కడు, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు ఆయన. ఇప్పుడు సెల్వ రాఘవన్, కీర్తీ సురేష్ ముఖ్య పాత్రల్లో ‘సాని కాయిదం’ అనే తమిళ చిత్రం తెరకెక్కనుంది. అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. ‘‘దర్శకుడు సెల్వ రాఘవన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషం’’ అన్నారు కీర్తీ సురేష్. ‘‘మరో కొత్త అధ్యాయం ప్రారంభం’’ అన్నారు సెల్వ రాఘవన్. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
సుకుమార్ స్క్రీన్‌ప్లేతో..
సాయితేజ్ కథానాయకుడిగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్‌ఎ¯Œ ప్రసాద్ ఈ చిత్రం నిర్మించనున్నారు. సుకుమార్ వద్ద రచన శాఖలో పనిచేసిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతిః సింహరాశౌ స్థిత నమయే, అంతిమ పుష్కరే’ అని రాయడంతోపాటు షట్‌చక్రంలో ఓ కన్నుని ఈ పోస్టర్లో పొందుపరిచారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. -
మంచికి మంచి
దిల్ ప్రీత్, కోనేటి వెంకటేష్, రత్న, దర్బార్, అమృత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వన్ నైట్ 999’. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్లో బాలరాజు ఎస్. స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేసి, మాట్లాడుతూ –‘‘మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. హెల్ప్ టు హెల్ప్ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇలాంటి ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని తీసిన బాలరాజు, ఇతర చిత్రబృందానికి అభినందనలు’’ అన్నారు. ‘‘నేను గతంలో రెండు షార్ట్ ఫిల్మ్స్ తీశాను. వాటిలో ‘ఓ నిమిషం’ అనే షార్ట్ ఫిల్మ్‌కు ఉత్తమ సినిమా అవార్డు వచ్చింది. తాజాగా హెల్ప్ టు హెల్ప్ అనే కాన్సెప్ట్‌తో ‘వన్ నైట్ 999’ అనే సినిమా తీశాను’’ అన్నారు బాలరాజు ఎస్. ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్, ఎస్.ఎఫ్.ఎక్స్: జాకట రమేష్. -
సంక్రాంతికి ఫిక్స్
అఖిల్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసూ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కొత్త పోస్టర్ బుధవారం విడుదలయింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు త్వరలో ఆరంభం కానున్నాయి. టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. ఈ ఏడాదే సినిమాను విడుదల చేస్తామని గతంలో చెప్పారు నిర్మాతలు. కరోనా వల్ల షూటింగ్స్‌కి ఆటంకం ఏర్పడటంతో విడుదల వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
అదిరే అధీరా
తెల్లటిగడ్డం, మెలితిరిగిన మీసాలు, ముఖంపై పచ్చబొట్టు, చేతిలో కత్తితో సంజయ్ దత్ కొత్త లుక్‌లో అభిమానులను ఆనందపరిచారు. సూపర్ హిట్ మూవీ ‘కె.జి.ఎఫ్’కి కొనసాగింపుగా రూపొందుతున్న ‘కె.జి.ఎఫ్ చాప్టర్–2’లో ఆయన విలన్ అధీరా పాత్రను పోషిస్తున్నారు. బుధవారం సంజయ్ దత్ పుట్టినరోజు (జూలై 29) సందర్భంగా అధీరా పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. ‘లుక్ అదిరే’ అనే ప్రశంసలు లభించాయి. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘‘హ్యాపీ బర్త్‌డే టు సంజూ బాబా. మా చిత్రంలో భాగమైనందుకు ఆయనకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు ప్రశాంత్. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలనచిత్రం ద్వారా నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేస్తారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: భువన్ గౌడ. -
సూర్య @ డబుల్ ధమాకా
ఒకవైపు రొమాంటిక్, మరోవైపు రఫ్... ఇలా రెండు రకాల పోస్టర్లతో గురువారం అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చారు సూర్య. బర్త్ డే (జూలై 23) సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’లోని ‘కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటలో సూర్య, అపర్ణా బాలమురళిల పోస్టర్ రొమాంటిక్‌గా ఉంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సమకూర్చిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, సింగర్ ధీ పాడారు. ఈ చిత్రానికి ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకురాలు. ఇక మరో లుక్ విషయానికొస్తే, సూర్య ఇటీవల సైన్ చేసిన ‘వాడీవాసల్’ అనే తమిళ సినిమా పోస్టర్ కూడా విడుదలైంది. ఇందులో సూర్య చాలా రఫ్‌గా కనిపించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. -
మిస్టర్ లోన్లీ విజయం సాధించాలి
‘‘మిస్టర్ లోన్లీ’ చిత్రం మంచి కథాంశంతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. విక్కీ, కియారెడ్డి, సోనాలి వర్ధమ్, లోహిత ప్రధాన పాత్రల్లో ముక్కి హరీష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర లోన్లీ’. ఎస్కేఎమ్ఎల్ మోషన్ పిక్చర్స్ నేతృత్వంలో కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్ని ఎంవీవీ సత్యనారాయణ విడుదల చేశారు. కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ– ‘‘కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. అన్ని వర్గాలను ముఖ్యంగా యువతను ఆకట్టుకునే అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి ఆదరణ లభించింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ఆనంద్ గారా పాల్గొన్నారు. -
నేను ములాయం సింగ్
సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ జీవితం ఆధారంగా ‘మై ములాయం సింగ్ యాదవ్’ (నేను ములాయం సింగ్ యాదవ్) అనే సినిమా తెరకెక్కుతోంది. సువేందు రాజ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ములాయం పాత్రలో అమిత్ సేథి నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్ని విడుదల చేశారు చిత్రబృందం. ఈ సందర్భంగా సువేందు రాజ్ ఘోష్ మాట్లాడుతూ– ‘‘ములాయం సింగ్ యాదవ్ అనే పేరే ఎంతో శక్తివంతమైంది. ఒక రైతు కొడుకు ముఖ్యమంత్రిగా, అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగారు. భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల కోసం ఆయన ఎంతో చేశారు. అలాంటి వ్యక్తి జీవితం గురించి ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నా’’ అన్నారు. -
ఆట మొదలైంది
విశాల్ హీరోగా ఎం.ఎస్. ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా కీలక పాత్రలో రెజీనా నటిస్తున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ పోస్టర్ని సోమవారం విడుదల చేశారు. పవర్ఫుల్ లుక్‌లో విశాల్ ఉన్న ఈ పోస్టర్‌కి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం తెలిపింది. ‘చక్ర’ గ్లింప్స్ ఆఫ్ ట్రైలర్ పేరుతో ‘ఆట మొదలైంది’ అని విశాల్ చెప్పే డైలాగ్‌తో వీడియోను కూడా విడుదల చేశారు. ‘‘బ్యాంక్ దోపిడీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో కొత్త కథా కథనాలతో ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. మనోబాలన్, రోబో శంకర్, కేఆర్ విజయ్, సృష్టి డాంగే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: బాలసుబ్రమణ్యం. -
కల నిజమైంది
ఒకే తెరపై తండ్రీ కొడుకులు కనిపిస్తే చూడాలని అభిమానులు అనుకుంటారు. ఆ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఆ కాంబినేషన్ కుదిరితే అభిమానుల ఆనందాలకు అవధులు ఉండవు. తాజాగా విలక్షణ నటుడు విక్రమ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.. దీనికి కారణం తండ్రీ కొడుకులు విక్రమ్– ధ్రువ్ విక్రమ్ కలిసి తొలిసారి ఒకే సినిమాలో నటì ంచనుండటం. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న సినిమాలో విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోలుగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘‘కార్తీక్ సుబ్బరాజ్‌గారి సినిమాలన్నీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. మా నాన్నగారికి నేను పెద్ద అభిమానిని. అనిరు«ద్ పాటలన్నీ అదే పనిగా వినేవాణ్ణి. ఈ ముగ్గురితో కలిసి పని చేయడం కల నిజమైనట్టు ఉంది’’ అన్నారు ధ్రువ్. ఇది విక్రమ్ కెరీర్లో 60వ సినిమా కావడం విశేషం. ధ్రువ్‌కి ఇది రెండో సినిమా. తెలుగు ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ ద్వారా హీరోగా పరిచయమయ్యారు ధ్రువ్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించగలిగారు. ఇక తండ్రితో కలసి ధ్రువ్ నటించనున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్ని విడుదల చేశారు చిత్రబృందం. పోస్టర్లో రెండు చేతులు కనిపిస్తున్నాయి. ఒకటి విక్రమ్, మరోటి ధ్రువ్‌ది అని ఊహించవచ్చు. లలిత్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీతం అందించనున్నారు. ∙కుమారుడు ధ్రువ్‌తో విక్రమ్ -
అసలు సిసలైన థ్రిల్లర్
‘‘థ్రిల్లర్ జానర్లో ఓ తెలుగు సినిమా వస్తుందనగానే ఏదో ఒక అంతర్జాతీయ సినిమా నుంచి స్ఫూర్తి పొంది తీస్తున్నారేమో అనుకుంటారు. కానీ, మా ‘ఎ’ సినిమా ఇప్పటివరకు ఏ భాషలో రానటువంటి సరికొత్త కథాంశంతో తెరకెక్కిన అసలు సిసలైన థ్రిల్లర్’’ అని దర్శకుడు యుగంధర్ ముని అన్నారు. నితిన్ ప్రసన్న, ప్రీతీ అశ్రాని, స్నేహల్ కమత్, బేబీ దీవెన, రంగాథం, కృష్ణవేణి, భరద్వాజŒ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎ’. అవంతిక ప్రొడక్ష¯Œ ్స పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా యుగంధర్ ముని మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలోని సన్నివేశాల చిత్రీకరణకు దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారిని ఆదర్శంగా తీసుకున్నాను. వీఎఫ్‌ఎక్స్‌లను తగ్గించి పాత కెమెరా ట్రిక్‌లను వాడాం. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌కు స్టోరీబోర్డ్ గీయించాం. నితిన్ ప్రసన్న మొదటి సినిమాలోనే 3 పాత్రల్లో నటించారు’’ అన్నారు. -
వెండితెర సరోజిని
స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ తెరకెక్కనుంది. ఈ బయోపిక్కు ‘సరోజిని’ అనే టైటిల్ ఖరారు చేశారు. హిందీలో ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి, ఇప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోన్న దీపికా చిఖలియా టైటిల్ రోల్ చేయనున్నారు. ఆకాష్ నాయక్, ధీరజ్ మిశ్రా ద్వయం ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని రాయల్ ఫిల్మ్ మీడియా సమర్పణలో కాను భాయ్ పటేల్ నిర్మించనున్నారు. గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు దీపిక. ‘‘సరోజినీ నాయుడుగా మీ లుక్ బాగుంది’’ అంటూ దీపికను చాలామంది అభినందించారు. లాక్డౌన్ పూర్తయ్యాక ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. -
నా మూడేళ్ల కల ఇది
రాహుల్, త్రిష్నా ముఖర్జీ జంటగా నటించిన చిత్రం ‘మధ’. ఇందిరా బసవ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీవిద్య దర్శకురాలు. ఈ నెల 13న విడుదలవుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘యంగ్ ఏజ్‌లో అందరూ డబ్బులు పెట్టి సినిమా చూస్తే ఈ చిత్రదర్శకురాలు శ్రీదివ్య మాత్రం డబ్బులు పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆమెలో చాలా ప్యాషన్ కనిపించింది’’ అన్నారు. నవదీప్ మాట్లాడుతూ– ‘‘శ్రీవిద్య నాకు ఫేస్బుక్ ఫ్రెండ్. నేనీ సినిమా చూశాను. నెక్ట్స్ లెవల్ మూవీ అని ఓ ప్రేక్షకునిగా చెప్పగలను. ఈ సినిమాను ఓ పెద్ద హీరోయిన్‌తో చేయమంటే తన టీమ్ కోసం ఆమె ఒప్పుకోలేదు’’ అన్నారు. శ్రీవిద్య మాట్లాడుతూ– ‘‘నా మూడేళ్ల కల ఇది. ‘మధ’ ప్యారలల్ మూవీ అనొచ్చు. స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలతో తీసిన ఈ చిత్రం ప్రతి అమ్మాయికి నచ్చుతుంది’’ అన్నారు. ‘‘శ్రీవిద్య కాన్సెప్ట్ చెప్పగానే, సినిమాలో ఉన్న అన్ని ఎమోషన్స్‌కి కనెక్ట్ అయ్యాను అన్నారు’’ త్రిష్నా. -
కరోనా: ఇక్కడి పరిస్థితుల కారణంగా తక్కువ వ్యాప్తి
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్‌పై(కోవిడ్ 19) అవగాహన కల్పిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంగళవారం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. ఏపీలోని తిరుపతిలో వ్యాధి నిర్దారణ కేంద్రం ఉందని, కరోనా వైరస్ ఇప్పటివరకు వచ్చిన వ్యాధుల కంటే భయంకరమైన వ్యాధి కాదని తెలిపారు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందన్నారు. కరోనా వ్యాధి కేవలం రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఎఫెక్ట్ అవుతుందని, బయట దేశాలలో ఉండి వచ్చిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (కరోనా అలర్ట్: ‘మాస్కులకు ఆర్డర్లు ఇస్తే మంచిది’) కరోనా వైరస్ తో లక్ష మంది ప్రజలు బాధ పడుతున్నారని, ఇందులో 25 శాతం మంది చనిపోవడం జరిగిందన్నారు. ఇది అంటువ్యాధిగా నిర్దారణ చేయటంతో ఐఎంఏ తరుపున అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వయసులో పెద్ద వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దగ్గిన, తుమ్మిన చేతులు అడ్డుపెట్టుకోవటం.. మాస్క్ లు ధరించటంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాధారణ జలుబు దగ్గు వల్ల ఇబ్బంది ఉండదని, ఒక వారం పదిరోజులు దగ్గు జలుబుతో బాధ పడుతున్న వారు బయట జన సమూహాలు ఉన్న ప్రదేశాలకి వెళ్లకుండా ఉండటం మంచిదని తెలిపారు. (కరోనాతో మరో వైద్యుడు మృతి) -
అహం బ్రహ్మస్మి
దాదాపు మూడేళ్లు వెండితెరకు దూరంగా ఉన్న మంచు మనోజ్ తన తర్వాతి చిత్రానికి సంబంధించిన వివరాలను గురువారం వెల్లడించారు. మనోజ్ తాజా చిత్రానికి ‘అహం బ్రహ్మస్మి’ అనే టైటిల్ ఖరారైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం మార్చి 6న జరుగుతుంది. ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పణలో మంచు మనోజ్, నిర్మలాదేవి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘నా తొలి చిత్రం ‘దొంగ దొంగది’ సమయంలో ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యానో ఇప్పుడూ అదే భావోద్వేగంతో ఉన్నా’’ అని పేర్కొన్నారు మనోజ్. -
పిట్టకథే కానీ పెద్ద కథ
‘‘పిట్టకథ టైటిల్ చాలా బాగుంది. ఇండస్ట్రీలో ఈ మధ్య పిట్టకథ గురించే చర్చ జరుగుతోంది. ఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను. ‘ఓ పిట్టకథ’ ఈ వేసవిలో ప్రేక్షకులకు చల్లటి ఉపశమనం ఇస్తుంది’’ అని డైరెక్టర్ కొరటాల శివ అన్నారు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేష¯Œ ్స పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా క్యారెక్టర్స్ పోస్టర్‌ను కొరటాల శివ ఆవిష్కరించారు. చెందు ముద్దు మాట్లాడుతూ– ‘‘ఒక పల్లెటూరులో జరిగే కథ ఇది. వినోదం, ఉత్కంఠను రేకెత్తిస్తుంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు వి.ఆనందప్రసాద్. ‘‘మార్చిలో సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి. ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కుమార్ య¯Œ , సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
వందతో ఆగకూడదు
శైలేష్, ఏఇషా ఆదరహ జంటగా శైలేష్ సాగర్ దర్శక త్వంలో రామసత్యనారాయణ నిర్మించిన 98వ చిత్రం ‘శివ 143’. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తున్న సందర్బంగా ప్రముఖ ఎంపీ టీజీ వెంకటేష్ రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘రామసత్యనారాయణ సెంచురీకి చేరువలో ఉన్నారు. వంద సినిమాలతో ఆపకుండా ఆయన మరెన్నో సినిమాలు నిర్మించాలి. ‘శివ 143’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకున్నాం. కానీ సెన్సార్ బోర్డ్‌వారు సినిమాని చూడకపోవడంతో కుదరలేదు. అందుకే ఫిబ్రవరికి వాయిదా వేశాం. ఈ చిత్రానికి ముందు మేం నిర్మించిన ‘పోలీస్ పటాస్’ ట్రైలర్‌ని వెంకటేష్‌గారి చేతుల మీదగా విడుదల చేయించాం. ఆ సినిమాను విజయవంతంగా విడుదల చేశాం. అలానే ఈ సినిమాని కూడా ఫిబ్రవరిలో విడుదల చేస్తాం’’ అన్నారు రామసత్యనారాయణ. -
తాగి వాహనాలు నడిపితే..
శ్రీనివాస్, ఇర్ఫాన్, చంటి, మనోహర్, లోహితలు ముఖ్య పాత్రలు చేస్తున్న చిత్రం ‘రా’. రాజ్ డొక్కర దర్శకత్వం వహించి, నిర్మించారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన, అవినాష్, సతీష్ బోట్ల ముఖ్య అతిథులుగా పాల్గొని ‘రా’ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. ‘రా’ సినిమాలో కంటెంట్ హారర్ కామెడీ, లవ్‌స్టోరీ ఉందని అర్థమవుతోంది. రాజ్ డొక్కర దర్శకత్వం వహిస్తూ, సినిమాని నిర్మించటం గ్రేట్ ’’ అన్నారు. ‘‘ఈ టైటిల్ ఎందుకు పెట్టామనేది ఇంట్రవెల్లో తెలుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మెసేజ్ కూడా ఉంటు ంది. 2 పాటలు, రెండు ఫైట్లు మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. -
ఇచ్చట వాహనములు నిలుపరాదు
సుశాంత్ హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘చిలసౌ’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ఈ సినిమాను జాతీయ అవార్డు వరించింది. ఇక సుశాంత్ హీరోగా నటించనున్న తాజా చిత్రానికి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, హరీష్ కోయిలగుండ్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే రొమాంటిక్ థ్రిల్లర్ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
కపటధారి
కన్నడంలో సూపర్ హిట్ అయిన చిత్రం ‘కవలుదారి’. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు సుమంత్. ఈ సినిమాకు ‘కపటధారి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్‌ను నాగార్జున విడుదల చేశారు. సుమంత్, నందితా శ్వేత జంటగా నాజర్, పూజాకుమార్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధనంజయ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిమన్ కే కింగ్, డైలాగ్స్: బాషా శ్రీ. -
కమల్ @ 65
గురువారం కమల్‌హాసన్ బర్త్‌డే. ఈ ఏడాదితో 65వ సంవత్సరంలో అడుగుపెట్టారు కమల్. అంతే కాదు నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. 5 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా పరిచయం అయ్యారు కమల్. ఈ బర్త్‌డేను కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు కమల్‌హాసన్. కుటుంబ సమేతంగా (సోదరుడు చారుహాసన్, కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరాహాసన్) తమ స్వగ్రామం పరమకుడికి ప్రయాణం అయ్యారు. గురువారం నుంచి మూడురోజుల పాటు పుట్టినరోజు వేడుకలను ప్లాన్ చేశారు కమల్ కుటుంబ సభ్యులు. గురువారం తన తండ్రి (డి.శ్రీనివాసన్) విగ్రహాన్ని ఆవిష్కరించారు కమల్. శుక్రవారం దర్శకుడు బాలచందర్ విగ్రహావిష్కరణను ప్లాన్ చేశారు. కమల్ నటించిన ‘హే రామ్’ చిత్రం ప్రత్యేక ప్రదర్శన శనివారం చెన్నైలో జరగనుంది. ఇక పుట్టినరోజు సందర్భంగా కమల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. -
వినోదాల జాతిరత్నాలు
‘మహానటి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నాగ్అశ్విన్ ‘జాతిరత్నాలు’ సినిమాతో నిర్మాతగా మారారు. ‘మహానటి’ చిత్రంతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న తర్వాత స్వప్న సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రమిది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనుదీప్ కె.వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రియదర్శి 210, నవీన్ పొలిశెట్టి 420, రాహుల్ రామకృష్ణ 840 నంబర్లతో ఖైదీల దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో మంచి క్రేజ్ నెలకొంది. ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఫరియా అబ్దుల్లా, మురళీశర్మ, వి.కె.నరేశ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ‘శుభలేఖ’ సుధాకర్, ‘వెన్నెల’ కిషోర్, ‘మిర్చి’ కిరణ్, గిరిబాబు, ‘మహానటి’ ఫేమ్ మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాత: హర్ష గారపాటి, సంగీతం: రధన్, కెమెరా: సిద్ధాన్ మనోహార్. -
రైలెక్కి చెక్కేస్తా...
శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై బేబి ఢమరి సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్ సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన హారర్ చిత్రం ఇది. ఈ చిత్రంలోని ‘రైలెక్కి చెక్కేస్తా...’ అనే ఐటెమ్ సాంగ్‌ను దర్శకుడు బాబీ, నటుడు సత్యప్రకాశ్ విడుదల చేశారు. ‘ఎర్రచీర’ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను రామసత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ– ‘‘ఐటెమ్ సాంగ్ బావుంది. సుమన్ గారు దర్శకునిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు నిర్వర్తించటం చాలా గొప్ప విషయం. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా దర్శకుడు బాబీ మా సినిమాను ఆశీర్వదించటానికి వచ్చారు. కొన్ని కారణాల వల్ల ఢమరి అనే సొంత మ్యూజిక్ కంపెనీని స్టార్ట్ చేశాను. శ్రీకాంత్‌గారు ఇంతకుముందు ఎప్పుడూ చేయని అఘోర పాత్రలో నటించారు. డిసెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇందులో మంచి పాత్ర చేశా’’ అన్నారు హీరోయిన్ సంజనా శెట్టి. సినిమాలో ఓ కీలక పాత్ర చేసిన సురేష్ కొండేటి, మాజీమంత్రి పుష్పలీల, సంగీత దర్శకుడు ప్రమోద్, రచయిత గోపి తదితరులు పాల్గొన్నారు. -
వైకుంఠపురములో పాట
ఒక చేతిలో పుంజు, మరో చేతిలో కత్తి పట్టుకుని సంక్రాంతి పందేనికి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అల... వైకుంఠపురములో...’. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. తాజాగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు విడుదల తేదీని శనివారం అధికారికంగా వెల్లడించారు. అలాగే అల్లు అర్జున్ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక తారాగణంపై పాట చిత్రీకరిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
కేజ్రీవాల్‌పై బీజేపీ పోస్టర్ వార్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ పోస్టర్ వార్‌కు తెరలేపింది. కేజ్రీవాల్ దేశ ద్రోహులకు మద్దతిస్తారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీలో పలుచోట్ల బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆధ్వర్యంలో పోస్టర్లు వెలిశాయి. దేశ వ్యతిరేక నినాదాలు చేసే వారిని కేజ్రీవాల్ కాపాడతారంటూ రాసిఉన్న పోస్టర్లను నగరంలోని మండీ హౌస్, కన్నాట్ ప్లేస్, అశోకా రోడ్, ఐటీఓ సహా పలు కూడలి ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కాగా, జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్టు నిరూపితం కాలేదని ఢిల్లీ ప్రభుత్వం హోం శాఖ పేర్కొన్న నేపథ్యంలో ఈ పోస్టర్లు ఏర్పాటుకావడం గమనార్హం. ఆప్ రెబెల్ నేతగా పేరొందిన కపిల్ మిశ్రా ఇటీవల ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రా బీజేపీ తరపున ప్రచారం చేశారు. -
నిను తలచి...
వంశీ యాకశిరి, స్టెఫీ పటేల్ జంటగా రూపొందిన చిత్రం ‘నిన్ను తలచి’. ఎస్ఎల్యన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ పతాకాలపై ఓబులేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్ కుమార్ నిర్మించారు. అనిల్ తోట దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లేటేస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘త్వరలోనే వీడియో సాంగ్స్, ట్రైలర్‌ను రిలీజ్ చేస్తాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రనిర్మాతలు తెలిపారు. అనిల్ తోట మాట్లాడుతూ– ‘‘అనుకున్న బడ్జెట్లో అనుకున్న టైమ్‌లో చిత్రాన్ని పూర్తి చేశాం. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న వంశీ కొత్త హీరోలా అనిపించడు. అతని నటన సినిమాకు ప్లస్ అవుతుంది’’ అన్నారు. వంశీ మాట్లాడుతూ– ‘‘ఓ ఫీల్‌గుడ్ మూవీతో హీరోగా పరిచయమవ్వటం ఆనందంగా ఉంది. నిర్మాతలు అన్ని సౌకర్యాలు కల్పిస్తే దర్శకుడు అనిల్ తోట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కించారు’ అన్నారు. -
సైగలే మాటలు
మాటల్లేవ్. ఓన్లీ సైగలే అంటున్నారు అనుష్క. అందుకే చేతులతో సైగలు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడున్న ఫొటోలో చేతులు చూశారు కదా. ఇది అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్ధం’ టైటిల్ పోస్టర్ లుక్. అనుష్క ఇండస్ట్రీలోకి వచ్చి పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో అనుష్క బదిర యువతి (చెవిటి మూగ) పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. మరో హీరోయిన్ అంజలి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఆర్. మాధవన్, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ప్రస్తుతం అమెరికాలోని సియాటిల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణ దాదాపు ముగిసిందని తెలిసింది. యునైటెడ్ స్టేట్స్లోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. శ్రీనివాస్ అవసరాల, హంటర్ ఓ హరో మెయిన్, సుబ్బరాజు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. -
ధృవ కష్టం తెలుస్తోంది
ధృవ కరుణాకర్ హీరోగా నటించిన చిత్రం ‘అశ్వమేథం’. నితిన్ దర్శకత్వంలో ప్రియా నాయర్, వందనా యాదవ్, ఐశ్వర్యా యాదవ్, శుభ మల్హోత్రా, రూపేష్‌లు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకలో పి. కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భరద్వాజ మాట్లాడుతూ– ‘‘సంజయ్ వల్లనే ఈ కార్యక్రమానికి వచ్చాను. నన్ను నిర్మాణం వైపు నడిపించిన వ్యక్తి కూడా తనే. ఈ చిత్రం ట్రైలర్ బాగుంది. ధృవ చాలా కష్టపడ్డట్లు తెలుస్తోంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం హాంకాంగ్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. డూప్ లేకుండా నటించాను. నన్ను నమ్మి నా కోసం కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాతలకు ధన్యవాదాలు. నేను, దర్శకుడు నితిన్ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాం’’ అన్నారు «ధృవ. ‘‘స్టోరీ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయి. ఆగస్టులో విడుదల ప్లాన్ చేశాం’’ అన్నారు నితిన్. ‘‘ధృవ చేసిన సాహసాలకు షాకయ్యా. అనుకున్న డేట్ కంటే ముందుగానే సినిమాను పూర్తి చేసే నితిన్ లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి అవసరం. ఈ చిత్రంలో నేను చేసిన మాంత్రికుడి పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు సుమన్. -
ఆమె గుర్తుకొచ్చింది
‘‘ఈ సినిమా పోస్టర్ విడుదల చేస్తుంటే నాకు 25 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టు అనిపిస్తోంది. నాకు మంచి జీవితాన్ని ఇచ్చిన చిత్రం ‘ఆమె’. చరితచిత్ర బ్యానర్ ద్వారా నేను హీరో అయ్యాను. ఆ బ్యానర్లో యాక్టివ్‌గా సినిమాలు చేయమని తమ్మారెడ్డిగారికి చాలా సార్లు చెప్పాను. వైవిధ్యమైన చిత్రం ‘ఆమె’తో ఆయన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీకాంత్. అమలాపాల్ లీడ్ రోల్లో రత్నకుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం‘ఆడై’. ఈ చిత్రాన్ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘ఆమె’ పేరుతో ఈ నెల 19న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. భరద్వాజ మాట్లాడుతూ– ‘‘1979లో ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకొచ్చిన 40 ఏళ్లలో ఎన్నో సినిమాలు చేశాం. కానీ అమలాపాల్ ‘ఆమె’ చూసి షాక్ అయ్యాను. ఇలాంటి సినిమాలు చేయాలంటే ప్యాషన్ ఉండాలి. అమలాపాల్ నటన చూసి షాకయ్యాను. ఈ జనరేషన్లో ఇంత గొప్పగా నటించిన వాళ్లు లేరు. ఈ సినిమా చేస్తున్నందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. ‘‘హీరోయిన్లు కూడా కంటెంట్లను నమ్మి సినిమాలు చేస్తున్నారు. సమంత, అమలాపాల్, నయనతార, అనుష్క వంటివారందరూ ఆదర్శంగా నిలుస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్ నందినీరెడ్డి. ‘‘మా సినిమాని ఓ సెన్సార్ బోర్డు సభ్యురాలు మెచ్చుకున్నారు. అంత సెన్సిబుల్ సెన్సార్ బోర్డు మన దగ్గర ఉన్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు రత్నకుమార్. ‘‘నేను నగ్నంగా నటించిన సన్నివేశంలో నగ్నత్వం కన్నా, నీ కళ్లలో ఎక్కువ బాధ కనిపించింది’’ అని అనురాగ్ కశ్యప్‌గారు చెప్పిన మాటలను మర్చిపోలేను’’ అని అమలాపాల్ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: రాంబాబు కల్లూరి, విజయ్ మోరవెనేని, సహ నిర్మాత: ఒ. ఫణీంద్ర కుమార్. -
శేష్ ఎవరు?
అడివి శేష్, పీవీపీ కాంబినేషన్లో వచ్చిన ‘క్షణం’ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మరో చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రానికి ‘ఎవరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో శేష్‌కి జోడీగా రెజీనా నటిస్తుండగా, నవీన్ చంద్ర ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఆగస్ట్ 23న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
మహిళలు తలచుకుంటే...
ఆర్.కె. ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రచనా స్మిత్, కావ్యారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహిళా కబడ్డీ’. శనివారం రామకృష్ణగౌడ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘మహిళా కబడ్డీ’ పోస్టర్‌ను తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘గౌడ్ నాకు చాలా కాలం నుంచి మిత్రుడు. ఆయన తీస్తున్న ‘మహిళా కబడ్డీ’ చిత్రంలోని పాటలను విన్నాను. ఎంతో బావున్నాయి. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని చాటి చెప్పే సినిమా ఇది’’ అన్నారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘పాటల రికార్డింగ్ పూర్తయింది. గీతా మాధురి, మంగ్లీ, మధుప్రియ లాంటి ప్రముఖ గాయనీ మణులు పాడిన ఆరు పాటలను రికార్డ్ చేసాం. దాంతోపాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయి కబడ్డీలో జాతీయ స్థాయిలో ఎలా నిలిచింది? ఆమె జర్నీలో ఉన్న సమస్యలు, మలుపులు ఏమిటి అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్. -
ట్వంటీ ప్లస్
చక్రవర్తి, బంగార్రాజు, ఆంధ్ర అప్పాచీ, అక్షర, సంతోషిని, ఉమ ముఖ్య తారలుగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూపం ఎస్, 20ప్లస్’. సాయిలోకేష్ ప్రొడక్షన్ పతాకంపై సి.రామాంజనేయ నిర్మించిన ఈ సినిమా పోస్టర్ని నిర్మాత సాయివెంకట్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. దుర్గాప్రసాద్ మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి. తనకు ఈ సినిమాతో మంచి పేరొస్తుంది’’ అన్నారు. ‘‘దర్శకు డిగా అవకాశం ఇచ్చిన రామాంజనేయగారికి థ్యాంక్స్. వెల్లంకి విజయలక్ష్మి రాసిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని వెల్లంకి దుర్గాప్రసాద్ అన్నారు. ‘‘ప్రేక్షకులకు మంచి వినోదం అందించబోతున్నాం. ఆరవన్, మెలోడి శ్రీనివాస్ కలిసి ఈ చిత్రానికి మంచి సంగీతం అందించారు’’ అని రామంజనేయ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్, సాగర్. -
ఆకాశవాణి
శివ, ఉమయ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. ‘జబర్దస్త్’ ఫేం సతీష్ బత్తుల ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సైన్స్ స్టూడియోస్‌పై మర్రిమేకల మల్లికార్జున్ నిర్మించిన ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సతీష్ ఈ చిత్రకథను నాకు ముందే చెప్పాడు. మంచి పాయింట్‌తో తీస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని భావించా. ఈ రోజు పోస్టర్ చూస్తుంటే మరింత నమ్మకం కలిగింది. మల్లికార్జున్గారు నిర్మాతగా చేస్తున్న తొలి చిత్రమిది. ఆయనకు మంచి పేరు, డబ్బు తెచ్చి పెట్టే చిత్రమవుతుంది’’ అన్నారు. ‘‘థ్రిల్లింగ్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. సతీష్‌గారు సినిమాని చక్కగా తెరకెక్కించారు. ఓ మంచి సినిమాను నిర్మించడంలో నా బాధ్యతను చక్కగా నిర్వర్తించాను’’ అన్నారు మర్రిమేకల మల్లికార్జున్. ‘‘ఈ సినిమాతో దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. మల్లికార్జున్‌గారి సపోర్ట్ లేకపోతే ఇంత దూరం రాగలిగేవాళ్లం కాదు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు సతీష్ బత్తుల. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, కెమెరా: ఆరీఫ్. -
సైన్స్‌తో ఏదైనా!
ఏ విషయాన్నైనా సైన్స్ సాధించగలదు. ఏ మంచైనా, ఏ చెడైనా, క్రేజీగా అయినా అంటూ... ‘డిస్కో రాజా’ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శనివారం టైటిల్ లోగో రిలీజ్ చేశారు. సీతాకోక చిలుక డిజైన్‌లో డిస్కోరాజా టైటిల్ పెట్టడం, మోషన్ పోస్టర్లో మైండ్‌లోని న్యూరాన్స్ చూపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముగ్గురు కథానాయికలు నటించనున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ఓ కథానాయికగా కన్ఫార్మ్ అయ్యారు. ‘వెన్నెల’ కిశోర్ కీలకపాత్ర చేయనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. -
గన్ టు గన్
బందిపోటుగా తుపాకీ పట్టిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నెక్ట్స్ చిత్రం కోసం ఆర్మీ ఆఫీసర్‌గా గన్ను పట్టనున్నారు. ఆర్మీ డే సందర్భంగా ‘రైఫిల్ మేన్’ అనే సినిమాలో సోల్జర్‌గా నటించనున్నట్లు అనౌన్స్ చేశారు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఈ సినిమాకు విక్రమ్ మల్హోత్రా, వసు భగ్నానీ నిర్మాతలు. ‘‘ఆధునిక శత్రుత్వం.. కాపాడుకోవాల్సిన సరిహద్దు.. ధైర్యవంతుడైన సైనికుడు’’ అంటూ ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘కిజీ ఔర్ మన్నీ’ షూటింగ్‌ను ఇటీవలే కంప్లీట్ చేసుకున్న సుశాంత్ ఇప్పుడు తన బర్త్ డే కోసం ‘సంచిరియా’ షూట్ నుంచి బ్రేక్ తీసుకుంటారని సమాచారం. ఈ సినిమాలో సుశాంత్ బందిపోటుగా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. -
రహస్యం ఏంటో?
సాగర్ శైలేష్, శ్రీ రితిక జంటగా సాగర శైలేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రహస్యం’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్ పోస్టర్‌ను శ్రీకాంత్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రామసత్యనారాయణగారు మంచి నిర్మాత. మంచి ప్లానింగ్‌తో సినిమాని విడుదల చేస్తారు. ‘రహస్యం’ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు.‘‘వైవిధ్యమైన కథతో రూపొందిన చిత్రమిది. ‘రహస్యం’ టైటిల్ ఎందుకు పెట్టామన్నది తెరపైనే చూడాలి. సాగర్ శైలేష్ ప్రాణం పణంగా పెట్టి తీశారు. దర్శకులు రామ్‌గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్, మారుతి, నిర్మాత రాజ్ కందుకూరిగార్లు విడుదల చేసిన ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు రామసత్యనారాయణ. -
జరిగింది ఏమిటి?
శ్రీరాం హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘అసలేం జరిగింది?’. ఎన్వీఆర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను నీలిమ నిర్మించనున్నారు. శనివారం ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేసిన ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణలో ఇంతవరకు ఎవరూ తీయని లొకేషన్స్‌లో యూనిట్ ఈ సినిమాను చిత్రీకరించాలనుకోవడం అభినందనీయం. లొకేషన్స్ అన్వేషణ కోసం టీమ్ 6 నెలల పాటు కష్టపడ్డారు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న కెమెరామేన్ ఎన్‌వీఆర్‌కు శుభాకాంక్షలు. ఈ చిత్రం విజయవంతమై, యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘వచ్చే నెల 11న షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నాం. రామ్‌గోపాల్‌వర్మ ‘భైరవగీత’ చిత్రంలో విలన్‌గా నటించిన విజయ్ రామ్ ఈ సినిమాలో కూడా విలన్‌గా నటిస్తారు. మహావీర్ సంగీతం అందిస్తారు. ఈ చిత్రానికి నెర్రపల్లి వాసు కథ అందించారు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే కథ ఇది’’ అన్నారు నిర్మాత. -
టైటిల్ బాగుంది
నవీన్‌రాజ్ శంకరాపు, శశికాంత్ హీరోలుగా, బందెల కరుణశ్రావ్య, శృతి హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వనవాసం’. భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వంలో సంజయ్ కుమార్ బి. నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఈ చిత్రం పోస్టర్, టైటిల్‌ని ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘వనవాసం’ టైటిల్ బాగా నచ్చింది. ఈ టైటిల్‌లానే సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నా. టీమ్‌కి అభినందనలు’’ అన్నారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం. ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు భరత్. ‘‘ భరత్ చాలా బాగా తీశారు. త్వరలోనే సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని సంజయ్ కుమార్. బి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కుమార్, కెమెరా: ప్రేమ్ జై. విన్సైట్. -
‘విధి’ విజయం సాధించాలి
రామ్, విష్ణుప్రియ, కల్పన ముఖ్య తారాగణంగా మారుతీ క్రియేషన్స్ పతాకంపై అరుణ్‌రెడ్డి బిల్లా దర్శకత్వంలో హనుమంతరెడ్డి నిర్మించిన చిత్రం ‘విధి’. ఈ చిత్రం పోస్టర్‌ను వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించి, ‘‘ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అన్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వై.ఎస్. జగన్‌ను శనివారం చిత్రబృందం కలిసింది. చిత్రదర్శకుడు అరుణ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘జగనన్న పాదయాత్ర మహోన్నతమైనది. ఆయన చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా ఆయనతో కలిసి నడుస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో జగన్ అన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వినయ రామ
సవాల్ విసిరే సత్తాతో పాటు సంప్రదాయాలకు విలువిచ్చే పవర్ఫుల్ కుర్రాడు రామ్ కొణిదెల. ఇక్కడున్న ఫొటో చూస్తే అర్థం అవుతుందిగా.. ఎంత వినయంగా కనిపిస్తున్నాడో కదూ. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘రామ్‌చరణ్–బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ సినిమాకి ‘వినయ విధేయ రామ’ టైటిల్ అనౌన్స్ చేయగానే మంచి స్పందన వచ్చింది. టీజర్లకు కూడా మంచి స్పందన లభిస్తోంది. సక్సెస్‌ఫుల్‌గా టాకీ పార్టును కంప్లీట్ చేశాం. వచ్చే నెల 10 నుంచి హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో ఓ పాటను చిత్రీకరించబోతున్నాం. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత దానయ్య. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
శోభన్‌బాబు చిరస్థాయిగా ఉంటారు
‘‘ఎన్టీ రామారావుగారు ముందుగా పరిచయమైనా హీరోగా మా ఫస్ట్ సినిమా శోభన్బాబుగారికే రాశాం. ఆ తర్వాత ఆయనతో 13 సినిమాలకు కలసి పనిచేశాం. శోభన్‌బాబుగారు సినిమాలు మానేసే దశలో మా డైరెక్షన్లో ‘సర్పయాగం’తో పాటు ‘దోషి–నిర్దోషి’ అనే చిత్రం రాశాం. రెండూ మంచి హిట్టయ్యాయి. అప్పుడు శోభన్‌బాబుగారు ఫోన్ చేసి.. ‘నేను గౌరవంగా రిటైర్ అయ్యేలా హిట్లు ఇచ్చారు.. ఫ్రీగా ఓ సినిమా చేసుకోమన్నారు. కానీ మేము చేయలేదు. మేము సినిమా చేసినా, చేయకున్నా మా మనసుల్లోనే కాదు అందరి మనసుల్లోనూ ఆయన చిరస్థాయిగా బతికే ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు కూడా’’ అని రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. దివంగత శోభన్‌బాబు పేరిట ‘అఖిల భారత శోభన్ బాబు సేవాసమితి’ ఆధ్వర్యంలో డిసెంబర్ 23న ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేయనున్నారు. 2017కి గానూ నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుల కార్యక్రమం పోస్టర్ని రచయితలు పరుచూరి బ్రదర్స్ రిలీజ్ చేయగా, దర్శకుడు మారుతి టీజర్‌ను ఆవిష్కరించారు. ఓ సందర్భంలో ‘నేను మీకు పెద్దన్నయ్యను’ అన్నారు శోభన్‌బాబుగారు. అంత ప్రేమాభిమానాలు మాపై వర్షింపజేసిన ఆయన కోసం వారి అభిమానులతో కలసి ఎన్ని సంవత్సరాలైనా ఈ పరుచూరి బ్రదర్స్ అడుగేస్తారు’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. అఖిల భారత శోభన్‌బాబు సేవాసమితి సభ్యులు వీరప్రసాద్, నిర్మాత ఎమ్.నరసింహారావు, శోభన్‌బాబు అభిమానులు సుధాకర్ బాబు (మాజీ ఎమ్మెల్యే) జె.రామాంజనేయులు, జేష్ట రమేశ్ బాబు (మాజీ ఎమ్మెల్యే), సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
గుండెను తడిమేలా ఘంటసాల ది గ్రేట్
‘‘ఘంటసాల అంటే పాట. పాట అంటే ఘంటసాల అని మనందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలియజేసేదే ఈ చిత్రం’’ అని ‘ఘంటసాల ది గ్రేట్’ చిత్రబృందం పేర్కొంది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. ఘంటసాల పాత్రను గాయకుడు కృష్ణచైతన్య పోషించారు. సీహెచ్ రామారావు దర్శకత్వంలో ఆయన సతీమణి లక్ష్మీ నీరజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పోస్టర్స్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు. డిసెంబర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించి తుమ్మల రామసత్యనారాయణ మాట్లాడుతూ – ‘‘రామారావు చేసిన ఈ సాహసాన్ని అభినందించాలి. పాత్రల గురించి బాగా స్టడీ చేసి సినిమా తీశారు’’ అన్నారు. ‘‘బయోపిక్‌లు తీయడం చాలా కష్టం. గట్స్ ఉండాలి. ఇందులో హీరోగా ఓ పాత్ర చేశాను. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా రామారావు వర్క్ చేశారు’’ అన్నారు సాయి వెంకట్. ‘‘గొప్ప విజయాలను నమోదు చేయడమే కాకుండా గుండె తడి చేసి, గుండెను తడిమేసే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి’’ అన్నారు సుదర్శన్. ‘‘నేను చాలా చిన్నవాణ్ని. మొదట ఈ సినిమా చేయకూడదనుకున్నా. ఇప్పుడు అలా ఎందుకు అన్నానా అనిపిస్తోంది. ఘంటసాలగారి పాటలు విన్నాం. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసు. ఈ సినిమాలో ఆయన వ్యక్తిత్వం తెలియజేస్తున్నాం’’ అన్నారు కృష్ణ చైతన్య. ‘‘ఘంటసాలగారి మీద ఆరాధనతో ఈ సినిమా తీశాను. మా కష్టాన్ని అభినందిస్తారనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: సాలూరి వాసూరావు, కెమెరా: వేణు వాదనల. -
స్వరరాగ గంగా ప్రవాహం
నవంబర్ 11న హైదరాబాద్‌లో స్వరరాగ గంగా ప్రవాహం జరగనుంది. ప్రముఖ గాయకులు కె.జె. ఏసుదాస్ లైవ్‌లో పాడనున్నారు. ఐదు దశాబ్దాలుగా అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది చిత్రాల్లో తన మధుర గాత్రంతో ప్రేక్షకుల్ని సంగీత స్వర సాగరంలో ఓలలాడించిన గాన కోవిదుడు ఏసుదాస్. తెలుగు ప్రేక్షకుల కోసం నవంబర్ 11న హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్నారు. గతంలో మేస్ట్రో ఇళయరాజాతో, హీరోయిన్, భరత నాట్యం కళాకారిణి శోభనతో ప్రోగ్రామ్స్ నిర్వహించిన ‘11.2’ సంస్థ ఏసుదాస్ ప్రోగ్రామ్ని నిర్వహించనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఏసుదాస్ లైవ్ కన్సర్ట్ జరగలేదు. తొలిసారి జరగనున్న ఈ కార్యక్రమం పోస్టర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.టి.ఆర్ విడుదల చేశారు. -
ఇప్పుడు రితిక
అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేశ్, సమంత రీసెంట్గా అదితీ రావ్ హైదరీ తమకు తామే సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి రితికా సింగ్ చేరారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య తారలుగా కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నీవెవరో’. ‘లవ్ ఈజ్ బ్లైండ్ నాట్ ది లవర్’ అనేది ట్యాగ్‌లైన్. రీసెంట్గా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను కొరటాల శివ లాంచ్ చేశారు. ఈ సినిమాలోని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు రితికాసింగ్. ‘‘నా రెండో తెలుగు సినిమా ‘నీవెవరో’ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నాను. ముందు నేను చెప్పగలనా? అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలుగు పూర్తిగా రాదు. కానీ భరద్వాజ్ ఎంతో సహాయం చేశారు’’ అని పేర్కొన్నారు రితికా సింగ్. వెంకటేశ్ నటించిన ‘గురు’ ద్వారా రితికా తెలుగుకి పరిచయమైన విషయం గుర్తుండే ఉంటుంది. -
నో స్క్రిప్ట్ నోరీటేక్స్
కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కథానాయిక శ్రుతీహాసన్. కానీ హీరోయిన్గా కాదు. నిర్మాతగా. అయితే సినిమా పూర్తయ్యాక నిర్మాతగా కమిట్ అయ్యారు. విచిత్రంగా ఉంది కదూ. విషయంలోకి వస్తే... ఇసిడ్రో ప్రొడక్షన్స్ పతాకంపై ‘లెన్స్’ ఫేమ్ జయప్రకాశ్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘ది మస్కిటో ఫిలాసఫీ’. ఈ సినిమాకే నిర్మాతగా ముందుకొచ్చారు శ్రుతీ. మ్యూజిక్ డైరెక్టర్‌గా, హీరోయిన్గా సక్సెస్ సాధించిన శ్రుతీ ఇప్పుడు నిర్మాతగా కూడా విజయం సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ‘‘ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ కంటెంట్ సినిమాలను ఇసిడ్రో ప్రొడక్షన్స్ ద్వారా ఆడియన్స్‌కు అందించాలనుకుంటున్నాం. ‘ది మస్కిటో ఫిలాసఫీ’ అలాంటి చిత్రమే అని నమ్ముతున్నాం. ‘లెన్స్’ వంటి మంచి చిత్రం తీసిన జయప్రకాశ్‌తో అసోసియేట్ అవ్వడం ఆనందంగా ఉంది. ఆయన స్టోరీ టెల్లింగ్ కొత్తగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. అలాగే ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారామె. ఆ పోస్టర్‌పై ‘నో స్క్రిప్ట్.. నో రీటేక్స్’ అని ఉండటం విశేషం. చిత్రదర్శకుడు జయప్రకాశ్ మాట్లాడుతూ–‘‘రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలను ఆడియన్స్‌కు అందించాలని నిర్మాతలు కోరుకుంటారు. అలా గుడ్ కంటెంట్‌తో ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమానే ‘ది మస్కిటో ఫిలాసఫీ’. ట్రెడిషన్ అండ్ మోడ్రనిటీ బ్యాక్‌డ్రాప్‌లో నలుగురు స్నేహితుల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. స్క్రిప్ట్, డైలాగ్స్ లేకుండా చిత్రీకరించాం’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘సారిక (నటి, శ్రుతీహాసన్ తల్లి) మేడమ్‌తో ఈ సినిమా గురించి చెప్పాను. ఆ తర్వాత శ్రుతీహాసన్గారి ఇసిడ్రో మీడియా మూవీ బోర్డ్లోకి వచ్చింది. నా టాలెంట్ అండ్ విజన్‌ని నమ్మినందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
మనసు పడ్డారు
అందమైన అమ్మాయిని చూసినప్పుడు అబ్బాయిల మనసు పడి పడి లేస్తుంది. శర్వానంద్‌కి కూడా ఓ అమ్మాయి కనిపించింది. అందమైన ఆ అమ్మాయి లేత బుగ్గపై ఉన్న మొటిమలు తనకు ముత్యాల్లా అనిపించాయి. అమ్మాయి మనసు కూడా అబ్బాయికి ఫిదా అవుతుంది. మరి.. ఈ ఇద్దరి ప్రేమకథ ఎంతవరకూ వచ్చిందంటే కోల్‌కత్తాలో మొదలై ప్రస్తుతానికి హైదరాబాద్ వచ్చింది. శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. బుధవారం హీరోయిన్ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం కోసం కోల్‌కతాలో కీలక సన్నివేశాలు తీశారు. ‘‘టిపికల్ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ మూవీ ఇది. హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్ ఈ నెల 11న మొదలవుతుంది’’ అని పేర్కొన్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
అంతా అనసూయ గురించే...
సాక్షి, సినిమా : రంగస్థలం ప్రీ రీలీజ్ ఈవెంట్లో తన పాత్ర గురించి యాంకర్ అనసూయ ఎంతో భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. అసలు తనకు ఆ పాత్ర చేయటం అస్సలు ఇష్టం లేదని.. కానీ, సుకుమార్ బలవంతం మేరకు తాను ఆ పాత్ర చేశానని, ఆ తర్వాతే ఆ పాత్ర విలువేంటో తెలిసి ట్రావెల్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే అంతలా ఆ పాత్రలో ఏం స్పెషాలిటీ ఉందా? అన్న ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో రంగమత్త పాత్రకు సంబంధించి పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటిదాకా క్లాస్, గ్లామర్ రోల్‌ల్లో కనిపించిన అనసూయ.. ఇందులో పూర్తిగా డీగ్లామర్ పాత్రలో కనిపించనున్నట్లు అర్థమౌతోంది. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో ప్రతీ చిన్న పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ లెక్కన్న రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకు కూడా ఏదో ఇంపార్టెన్స్ ఉంటుందనే.. అందుకే అనసూయ ఓకే చేసి ఉంటుందని చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్, సమంత లుక్కులు ఎప్పటి నుంచో వైరల్ అవుతున్నప్పటికీ అనసూయ పాత్ర విషయంలోనే చిన్నపాటి సస్పెన్స్ మెయింటెన్ చేశారు. దీంతో ఈ పోస్టర్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. -
మార్చి 16న ‘పంచ్’ పడుద్ది!
నాగచైతన్యకు ప్రేమ కథా చిత్రాలే కలిసి వచ్చాయి. మాస్ హీరోయిజం ట్రై చేసిన ప్రతిసారి చేతులు కాలాయి. చైతు లవర్ బాయ్‌లా కనిపించిన సినిమాలే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. అయినా సరే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు అక్కినేని హీరో. తనకు ప్రేమమ్ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్లో ‘సవ్యసాచి’ సినిమాను చేస్తున్నాడు చైతు. మరి ఈ సినిమా తనకు మాస్ ఇమేజ్ను తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాలి. సవ్యసాచి అని టైటిల్ పెట్టే ఆసక్తి రేకెత్తించారు. అర్జునుడికి మరో పేరే సవ్యసాచి. అయితే ఈ సినిమాకు సంబంధంచిన తొలి పోస్టర్‌ను మార్చి 16న విడుదల చేయనున్నారు. ఫస్ట్ పంచ్ పేరుతో ఈ పోస్టర్ రేపు (శుక్రవారం) ఉదయం 10:30 లకు విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో మాధవన్ విలన్‌గా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు, పోరాటాలు సినిమాకి హైలెట్ అవుతాయని చిత్రబృంద్ అంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణీ సంగీతమందిస్తున్నారు. -
గాటు కథేంటి గురూ!
నోట్లో సిగార్... చేతిలో స్టీరింగ్.. డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తోపాటు కండలు తిరిగిన దేహంతో ఫ్యాన్స్‌కి ‘హోలీ’ ఫీస్ట్ ఇచ్చాడు సూర్య. ‘పోస్టర్ ఇంపాక్ట్’ అంటూ ఈ పోస్టర్ని చిత్రబృందం రిలీజ్ చేసింది. అల్లు అర్జున్ టైటిల్ రోల్లో వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. గురువారం రిలీజైన పోస్టర్లో సూర్య ఎడమ కంటిపై గాటు ఉంది గమనించారా? ఇప్పుడు చర్చంతా ఆ గాటు గురించే. గాటు కథేంటి గురూ అని ఎవరికి తోచిన కథలు వాళ్లు అల్లుతున్నారు. అసలు కథ ఏంటో మే 4న తెలిసిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నారు. ఈ నెల 14వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీక్రియేషన్స్ పతాకంపై శిరీషాశ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. -
వైశాలి... ఫిగర్ అదిరింది
ధనలక్ష్మీ గుర్తుందా? అదేనండి... ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో ఈ పేరుతోనే హీరోయిన్గా పరిచయమయ్యారు స్నేహా ఉల్లాల్. ఆ సినిమా తర్వాత ‘నేను మీకు తెలుసా’, ‘సింహా’, ‘అలా... మొదలైంది’, ‘మడత కాజా’, యాక్షన్ 3డీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ తేనెకళ్ల సుందరి కొన్ని కారణాల వల్ల సిల్వర్ స్క్రీన్కు దూరమయ్యారు. ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత ‘ఆయుష్మాన్ భవ’ సినిమాతో తెలుగు తెరపై మరోమారు మెరవనున్నారు. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సినిమాలోని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఏంటి? వైశాలి అంటే ట్రెడిషనల్ అనుకుంటున్నారా..? పిచ్చ పోష్! ఫిగర్ అదరిపోద్ది’’ అని ఈ పోస్టర్‌పై ఉండటం విశేషం. సో.. ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్ పేరు వైశాలి అని అర్థమైంది కదా. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మంచి హిట్స్‌లో ఒకటి నిలిచిన నాని ‘నేను లోకల్’ దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘సాక్షి’ ఆయన్ను సంప్రదించగా ‘‘ఈ సినిమాతో నాకు ఎటువంటి సంబంధం లేదు. హీరో రామ్‌తో ఓ లవ్‌స్టోరీ సినిమా చేయనున్నాను. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు త్రినాథరావు. -
'సే నో టు డ్రగ్స్' పేరుతో షార్ట్‌ఫిల్మ్