
కె.జె. ఏసుదాస్
నవంబర్ 11న హైదరాబాద్‌లో స్వరరాగ గంగా ప్రవాహం జరగనుంది. ప్రముఖ గాయకులు కె.జె. ఏసుదాస్ లైవ్‌లో పాడనున్నారు. ఐదు దశాబ్దాలుగా అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది చిత్రాల్లో తన మధుర గాత్రంతో ప్రేక్షకుల్ని సంగీత స్వర సాగరంలో ఓలలాడించిన గాన కోవిదుడు ఏసుదాస్. తెలుగు ప్రేక్షకుల కోసం నవంబర్ 11న హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్నారు. గతంలో మేస్ట్రో ఇళయరాజాతో, హీరోయిన్, భరత నాట్యం కళాకారిణి శోభనతో ప్రోగ్రామ్స్ నిర్వహించిన ‘11.2’ సంస్థ ఏసుదాస్ ప్రోగ్రామ్‌ని నిర్వహించనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఏసుదాస్ లైవ్ కన్సర్ట్ జరగలేదు. తొలిసారి జరగనున్న ఈ కార్యక్రమం పోస్టర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.టి.ఆర్ విడుదల చేశారు.