మోహన్‌లాల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌.. ట్రైలర్ చూశారా? | Mohanlal and Shobana latest Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

Mohanlal: మోహన్‌లాల్- శోభన క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌.. ట్రైలర్ వచ్చేసింది

Published Wed, Mar 26 2025 4:47 PM | Last Updated on Wed, Mar 26 2025 4:47 PM

Mohanlal and Shobana latest Movie Trailer Out Now

మలయాళ స్టార్ మోహన్‌ లాల్ నటించిన ఎల్‌2 ఎంపురాన్‌ విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రానికి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. గతంలో లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

అయితే వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న మలయాళ స్టార్‌ మోహన్‌లాల్ మరో మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఆ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తుడరమ్‌ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో ఆయన కనిపించనున్నారు. ఈ  చిత్రంలో మోహన్‌ లాల్‌ జోడీగా శోభన హీరోయిన్‌గా నటించారు. ట్రైలర్‌ చూస్తే క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మోహన్‌లాల్ షణ్ముఖం పాత్రను పోషిస్తుండగా.. శోభన లలితగా కనిపించింది. ఈ సినిమాను రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం రెంజిత్ నిర్మిస్తున్నారు.  అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement