
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'ఎల్2: ఎంపురాన్'. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ దాటేసిన లూసిఫర్ సీక్వెల్.. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. గతేడాది సూపర్‌హిట్‌గా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్‌ను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా ఎంపురాన్ నిలిచింది. మంజుమ్మల్ బాయ్స్ రూ.242 కోట్లతో సాధించి మలయాళ మూవీ ఇండస్ట్రీలో రికార్డుకెక్కింది. తాజాగా ఆ రికార్డ్‌ను లూసిఫర్-2 అధిగమించింది. దీంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో లూసిఫర్2 చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇక దేశీయంగా వసూళ్లు పరిశీలిస్తే రూ.88.25 కోట్ల నికర వసూళ్లు సాధించింది. అలాగే ఓవర్‌సీస్‌లోనే ఎెంపురాన్ అద్భుతాలు సృష్టిస్తోంది. ఏకంగా రూ.103 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌లో ఖాయంగా కనిపిస్తోంది.