Prithviraj Sukumaran
-
'లూసిఫర్2'లో స్టార్ హీరో సోదరి.. ఫస్ట్ సినిమా ఇదే
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లూసిఫర్2: ఎంపురాన్(రాజు కన్నా గొప్పవాడు)'. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సోదరి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. సౌత్ ఇండియాలో ఆమె నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈమేరకు ఆమె తాజాగా ఒక వీడియోతో ఈ సినిమా గురించి పలు విషయాలు తెలిపారు. సుభద్ర బెన్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. 2019లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’ చిత్రానికి ప్రీక్వెల్‌గా పార్ట్2ను మేకర్స్ నిర్మించారు.ఆమీర్ ఖాన్ సోదరి నిఖాత్ ఖాన్ హెగ్డే(Nikhat Khan Hegde) లూసిఫర్2లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అమీర్ ఖాన్ కుటుంబంలో చాలామంది సినీ పరిశ్రమతో టచ్‌లో ఉన్నారు. కానీ, నిఖాత్ ఖాన్ మిషన్ మంగళ్ (2019) చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే, ఆమె ఎక్కువగా వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. యాక్సిస్ బ్యాంక్,రిలయన్స్ జ్యువెల్స్,హల్దిరామ్స్,విప్రో,ఫస్ట్ క్రై వంటి యాడ్స్ ఆమెకు గుర్తింపు తెచ్చాయి. అయతే, తన సోదరడు అమీర్ ఖాన్ నటించిన లగాన్ (2001) సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు.లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో 'ఎల్2: ఎంపురాన్' చిత్రాన్ని సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఇందులో టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రలు చేస్తున్నారు. సినిమా 2025 మార్చి 27న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్(Mohanlal), ఆయనకు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కనిపించనున్నారు. -
మలయాళ చిత్రాలకు కలెక్షన్స్.. అదే ప్రధాన కారణం: సలార్ నటుడు
సలార్ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రంతో తెలుగులోనూ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఎల్2 ఎంపురాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. మరో సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. 2019లో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అయితే తాజాగా మలయాళ చిత్రాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద ఎదురవుతున్న ఒత్తిడిపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మలయాళ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందని అన్నారు. అందువల్లే మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు దోహద పడుతోందని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. మలయాళ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద పోటీ గురించి ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు.పృథ్వీరాజ్ మాట్లాడుతూ..'మాకు కూడా బాక్సాఫీస్ చాలా ముఖ్యం. సినిమాలు ఆర్థికంగా లాభాలు ఉండేలా చూసుకోవడానికి మాపై కూడా చాలా ఒత్తిడి ఉంది. కానీ మలయాళ సినిమా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే బాగాలేని సినిమాలకు కలెక్షన్స్ రావని వారంతా క్లారిటీగా చెప్పారు. ఇటీవల కాలంలో నటుడు ఎవరో, దర్శకత్వం ఎవరనే అనే దానితో సంబంధం లేకుండానే కొన్ని మంచి సినిమాలు వసూళ్లు రాబట్టాయి. ప్రేక్షకుల ఆదరణ దక్కాలంటే మనం కథ పట్ల నిజాయితీగా ఉండటం చాలా అవసరం. చిత్ర నిర్మాతలు, నటులు మనం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే కథను ఎంచుకుంటే.. ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని మాకు తెలుసు' అని అన్నారు. కాగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తోన్న ఎల్2: ఎంపురాన్ మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
ఆ విషయంలో ప్రభాస్ గ్రేట్.. తనను చూసి నేర్చుకోవాలి: పృథ్వీరాజ్
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) సలార్ సినిమాతో తెలుగులోనూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. గతేడాది ద గోట్ లైఫ్ (ఆడుజీవితం), గురువాయూర్ అంబలనడయిల్ చిత్రాలతో రెండు హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదారు సినిమాలున్నాయి. SSMB29 (మహేశ్‌బాబు- రాజమౌళి కాంబో) సినిమాలోనూ పృథ్వీరాజ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేశ్-రాజమౌళి సినిమాలో పృథ్వీరాజ్?తాజాగా దీనిపై పృథ్వీరాజ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి నాకంటే ఎక్కువ మీ అందరికే బాగా తెలిసినట్లు అనిపిస్తోంది. ఇప్పటివరకు ఇంకా ఏదీ ఫైనలవలేదు. ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. అంతా ఫిక్సయ్యాక అప్పుడు చూద్దాం.. అన్నాడు. సలార్ 2 (Salaar 2 Movie) గురించి మాట్లాడుతూ.. సలార్ సీక్వెల్ ఉందని మాత్రమే నేను చెప్పగలను. ప్రశాంత్ నీల్ (Prashanth Neel).. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. అది అయిపోయిన వెంటనే సలార్ 2 మొదలుపెడ్తాం.ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలిప్రభాస్ (Prabhas) గురించి చెప్పాలంటే తన స్టార్డమ్ తనకు తెలియదు. ఆయన సోషల్ మీడియాలో లేడనుకుంటాను. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని అతడు మాత్రం హ్యాండిల్ చేయడు. సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంటాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో అసలు పట్టించుకోడు. పబ్లిక్‌లో ఉండటానికి బదులు ప్రైవేట్‌గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాడు. అది నిజంగా గ్రేట్. ఇది ప్రభాస్ దగ్గర అందరూ నేర్చుకోవాల్సిన అంశం అని చెప్పాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు, సింగర్ కూడా! లూసిఫర్, బ్రో డాడీ చిత్రాలకు ఈయనే దర్శకత్వం వహించాడు. మలయాళంలో పలు పాటలు ఆలపించాడు.చదవండి: ప్రేమించుకున్నారు.. గొడవపడ్డారు.. అంతా వాళ్లే!: హృతిక్ రోషన్ తండ్రి -
మహేశ్ బాబు- రాజమౌళి ప్రాజెక్ట్‌లో సలార్ హీరో.. క్లారిటీ ఇదే!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో భారీ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పనులతో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ లోకేషన్స్ కోసం విదేశాలకు సైతం వెళ్లివచ్చారు మన డైరెక్టర్.అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త తెగ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా చేయనున్నారని నెట్టింట టాక్ నడుస్తోంది. సలార్‌తో తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సుకుమారన్ మహేశ్‌బాబు చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. ప్రస్తుతం మలయాళంలో ఎంపురాన్ మూవీలో నటిస్తోన్న ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు.నాకంటే మీకే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయని మీడియాతో అన్నారు. మహేశ్ బాబు చిత్రంలో నటించే విషయం గురించి ఇప్పుడే చెప్పలేను.. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఓకే అయ్యాక ఈ విషయం గురించి మాట్లాడుకుందామని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. సలార్‌తో మరింత్ స్టార్డమ్ సొంతం చేసుకున్న పృథ్వీరాజ్.. సలార్-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. సలార్ సమయంలో ప్రభాస్ నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఎస్ఎస్ఎంబీ29 చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాకం చోప్రాను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే ఆమె హైదరాబాద్‌లోని చిలుకురు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. కొత్త ప్రయాణం మొదలైంది అంటూ ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. -
మోహన్‌లాల్ 'లూసిఫర్2' మూవీ టీజర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
నిన్ను ఆదుకునేది ఒకే ఒక్కడు.. మోహన్‌లాల్ 'లూసిఫర్2' టీజర్
మలయాళ టాప్ హీరో మోహన్‌లాల్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ 'లూసిఫర్' (2019). ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ చిన్న రోల్లో నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా 'లూసిఫర్' సినిమాకు సీక్వెల్‌గా 'ఎల్2: ఎంపురాన్'ను( L2E Empuraan) తెరకెక్కించారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. తెలుగు వర్షన్లో మీరు చూడాలంటే.. వీడియో దిగువన రైట్‌సైడ్ ఉండే సెట్టింగ్స్ వద్ద క్లిక్ చేసి ఆడియో ఆప్షన్లో తెలుగు భాషను ఎంచుకోవచ్చు.లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో 'ఎల్2: ఎంపురాన్' (రాజు కన్నా గొప్పవాడు) చిత్రాన్ని సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఇందులో టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రలు చేస్తున్నారు. సినిమా 2025 మార్చి 27న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్(Mohanlal), ఆయనకు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కనిపించనున్నారు. -
Oscar 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’
క్రికెట్లో వరల్డ్ కప్ ఎలాంటిదో సినిమా రంగంలో ఆస్కార్ అవార్డు అలాంటిది. ప్రపంచ వ్యాప్తంగా సినీ నటులు తమ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు పొందాలని కల కంటారు. గతేడాది రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకొని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు పోటీలో ఉన్నా ఒక దక్షిణాది చిత్రం అస్కార్ గెలిచి.. భారత ఖ్యాతీని పెంచేసింది. ఇక ఇప్పుడు 97వ ఆస్కార్ బరిలోను సౌత్ నుంచి పలు సినిమాలు పోటీలో దిగేందుకు సిద్దమయ్యాయి. అయితే వాటిల్లో సూర్య ‘కంగువా’(Kanguva Movie ) ఆస్కార్ బరిలోకి నిలిచింది. దీంతో పాటు పృథ్వి రాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘ది గోట్ లైఫ్’(Aadujeevitham: The Goat Life) కూడా ఆస్కార్‌లోకి ఎంట్రీ దక్కించుకుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ‘ఆడు జీవితం’, ‘కంగువా’ సంతోష్ , స్వాతంత్ర్య వీర సావర్కర్ ,'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్(మలయాళం) చిత్రాలు ఉన్నాయి. షార్ట్ లిస్ట్ అయినా సినిమా నుంచి ఆస్కార్ ఫైనల్ నామినేషన్లను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 12 వరకు జరుగుతుంది. జనవరి 17న నామినేషన్లను అనౌన్స్ చేస్తారు.‘లాపతా లేడీస్’ నో ఎంట్రీఇండియా నుంచి మొదటగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’(Laapataa Ladies ) ఆస్కార్‌కు ఎంపికైంది. అయితే ఈ చిత్రం ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. డిసెంబర్ 17న ఆస్కార్ షార్ట్ లిస్ట్ చిత్రాలను అకాడమీ ప్రకటించింది. వాటిలో లాపతా లేడీస్ కు చోటు దక్కలేదు. కానీ భారతీయ నటి షహనా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ చిత్రం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్‌కి ఎంపికైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ హిందీ చిత్రం యూకే నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం సొంతం చేసుకుంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ జాబితాలో షార్ట్ లిస్ట్‌లో అధికారికంగా చోటు సాధించింది.ఆస్కార్ బరిలో ఫ్లాప్ చిత్రాలుఉత్తమ చిత్రం విభాగంలో ఇండియా నుంచి కంగువా, ఆడు జీవితం(ది గోట్ లైఫ్) సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ఆయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం ఆడు జీవితం. ది గోట్ లైప్ పేరుతో ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది.అయితే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. ఇక భారీ అంచనాలతో వచ్చిన సూర్య కంగువా చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాదాపు రూ. 2000 కోట్లను కొల్లగొట్టే సినిమా ఇది అని చిత్ర బృందం మొదటి నుంచి ప్రచారం చేసింది. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ అందించలేదు. నటన, మేకింగ్ పరంగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకుంది. BREAKING: Kanguva ENTERS oscars 2025🏆 pic.twitter.com/VoclfVtLBL— Manobala Vijayabalan (@ManobalaV) January 7, 2025 -
ఎనిమిది రాష్ట్రాలు.. నాలుగు దేశాలు.. 14 నెలల జర్నీ: మోహన్ లాల్
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ఎంపురన్ (లూసిఫర్-2). 2019లో విడుదలైన లూసిఫర్‌కు సీక్వెల్‌గా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మోహన్‌లాల్ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.మోహన్ లాల్ తన ట్వీట్లో రాస్తూ..' ఎంపురాన్ 14 నెలల అద్భుతమైన ప్రయాణం. ఎనిమిది రాష్ట్రాలతో పాటు యూఎస్, యూకే, యూఏఈ సహా దాదాపు నాలుగు దేశాల్లో పర్యటించాం. ప్రతి ఫ్రేమ్‌ని ఎలివేట్ చేసే సృజనాత్మకత, అద్భుతమైన దర్శకత్వం పృథ్వీరాజ్ సుకుమారన్ సొంతం. స్క్రీన్ ప్లేతో కథకు ప్రాణం పోసిన మురళీ గోపీకి ధన్యవాదాలు. మాపై నమ్మకం ఉంచి ఎంతోగానో సపోర్ట్ చేసిన సుభాస్కరన్, లైకా ప్రొడక్షన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక నటుడిగా నా ప్రయాణంలో ఎంపురాన్ ఒక గొప్ప అధ్యాయం. ఈ కథకు పనిచేసిన తారాగణం, సిబ్బంది లేకుండా ఇవేవీ సాధ్యం కాదు. మీ ప్రేమ, మద్దతు మాకు అడుగడుగునా స్ఫూర్తినిస్తాయి.' అని రాసుకొచ్చారు.కాగా.. లూసిఫర్ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్, మంజు వారియర్, టొవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూట్ ప్రారంభించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.That’s a wrap for L2: Empuraan!What an incredible 14-month journey across 8 states and 4 countries, including the UK, USA, and UAE.This film owes its magic to the brilliant direction of Prithviraj Sukumaran whose creativity elevates every frame. A big thank you to Murali Gopy… pic.twitter.com/6bnuItDlxd— Mohanlal (@Mohanlal) December 1, 2024 -
మోహన్‌లాల్ అంత తెలివితక్కువవాడు కాదు: పృథ్వీరాజ్ అమ్మ
మలయాళ చిత్రపరిశ్రమపై 'జస్టిస్ హేమ కమిటీ' ఇచ్చిన రిపోర్ట్‌తో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. మలయాళ చిత్రపరిశ్రమలో పనిచేస్తున్న మహిళల పట్ల లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆ రిపోర్ట్‌లో ఉంది. దీంతో చాలామంది ఈ అంశం గురించి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి మల్లికా సుకుమారన్ రియాక్ట్ అయ్యారు. ఆపై మోహన్లాప్పై కూడా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నటి మల్లికా.. మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు అమ్మ అని తెలిసిందే.. సుమారు ఆమె 60కి పైగా సినిమాల్లో రాణించారు. కతర్ దేశంలో ఆమెకు ఆరు రెస్టారెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం పరిశ్రమకు దూరంగా వ్యాపారవేత్తగా ఆమె ఉన్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇలా మాట్లాడారు. 'అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)లో విని మౌనంగా ఉండే వారు మాత్రమే ఇక్కడ ఇమడగలరు. నిరుపేద నటీనటులకు ఆర్థిక సహాయం అందించే చేయూత పథకంలో చాలా లోపాలు ఉన్నాయి. ఇదే విషయం ఒకసారి మా అబ్బాయితో కూడా చెప్పాను.పథకాలకు అర్హులైనవారు, వెనుకబడినవారు చాలామంది ఉన్నారు. నెలలో 15 రోజుల పాటు విదేశాలకు వెళ్తున్నవారికి చేయూత పథకాలు అందుతున్నాయి. ఇదీ ముమ్మాటికి నిజం. మందులు కొనుక్కోవడానికి డబ్బు లేని నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వారికి ఆపన్న హస్తం అందించాలి. మోహన్‌లాల్ అంత తెలివితక్కువవాడు కాదు. సంస్థలో కొన్ని తప్పులు దొర్లాయని అమ్మ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్‌కు కూడా బాగా తెలుసు. ఇక్కడ చాలా మంది తమ స్వంత ఇష్టాలకు నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మ తొలినాళ్లలో కూడా చాలా తప్పులు జరిగాయి. దాన్ని అప్పట్లో నటుడు సుకుమారన్ (ఆమె భర్త) ఎత్తి చూపారు. చట్టబద్ధంగా ప్రతి విషయాన్ని సరిదిద్దుతామని చెప్పారు. ఇది కొందరికి ఈగోల గొడవతో ముగిసింది. సుకుమారన్ చనిపోయిన తర్వాతే వారికి అది అర్థమైంది.హేమ కమిటీ నివేదిక కుండబద్దలు కొట్టిన భూతంలా ఉందని మల్లికా అన్నారు. చిత్రపరిశ్రమకు చెందిన ఒక నటిపై దాడి కేసు విషయంలో ఈ ప్రభుత్వం ఏమేరకు న్యాయం చేసిందో చెప్పాలని ఆమె కోరారు. ఇండస్ట్రీలో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ఆ హీరోయిన్ మీద హింస జరిగిన మాట వాస్తవమే అని అందరికీ తెలుసు. కానీ, ఒక్కరు నోరెత్తరని ఆమె అన్నారు. ఆ ఘటన జరిగి ఏడేళ్లు కావస్తుందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని ఆమె కోరారు. అన్యాయం జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటే మళ్లీ జరగవు కదా అని మల్లిక ప్రశ్నించారు. -
ఖురేషీకి రైట్ హ్యాండ్
మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రం ‘లూసిఫర్’ (2019) బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎల్ 2 ఎంపురాన్’ మూవీ రూపొందుతోంది. ఇందులో మోహన్‌లాల్ హీరోగా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే... బుధవారం (అక్టోబర్ 16) పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఎల్ 2 ఎంపురాన్’లో ఆయన పోషిస్తున్న జయేద్ మసూద్ పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘ఎల్ 2 ఎంపురాన్’లో ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్, ఆయనకు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. 2025లో మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
హేమ కమిటీ రిపోర్ట్.. ఆశ్చర్యం కలగలేదన్న సలార్ నటుడు!
హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటీమణులు బహిరంగంగా తమకెదురైన వేధింపులను బయటపెడుతున్నారు. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం(అమ్మా)పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ నివేదికపై స్పందించారు. ఈ విషయంలో అమ్మా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఇండస్ట్రీని ప్రక్షాళన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. "హేమ కమిటీతో మాట్లాడిన మొదటి వ్యక్తిని నేను. సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. వారికి సురక్షితమైన పనివాతావరణం సృష్టించే మార్గాలను కనిపెట్టడమే ఈ నివేదిక లక్ష్యం. హేమ కమిటీ నివేదిక తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. ఆ ఆరోపణలు నిజమని రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఉన్నా. నివేదికలో పేర్కొన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దోషులను కఠినంగా శిక్షించాలి. అదే విధంగా ఆరోపణలు తప్పు అని రుజువైతే తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని కూడా శిక్షించాల్సిందేనంటూ' సలార్ నటుడు కోరారు. ఈ విషయంలో నిందితుల పేర్లను విడుదల చేయాలనే నిర్ణయం కమిటీ సభ్యులదేనని స్పష్టం చేశారు.కాగా.. ఈ ఏడాది ఆడుజీవితం (ది గోట్ లైఫ్) మూవీతో సూపర్‌హిట్‌ను సొంతం చేసుకున్నారు. దుబాయ్ నేపథ్యంలో ఓ యధార్థం కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అంతకుముందు సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ తనదైన నటనతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
‘గురువాయూర్ అంబలనడియాల్’ మూవీ రివ్యూ
పెళ్ళైతే ఓ కిక్కు, అదే పెళ్ళవ్వాలంటే పెద్ద చిక్కు అన్న భావంతో అల్లుకున్న హాస్యభరిత చిత్రం గురువాయూర్ అంబలనడియాల్. పృధ్విరాజ్, బసిల్ జోసెఫ్, నిఖిల్ విమల్ వంటి భారీ తారాగణంతో నిర్మించిన ఈ చిత్రం హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా మళయాళ మాతృక అయినా తెలుగు డబ్బింగ్ తో హాట్ స్టార్ లో చూడవచ్చు. ఓ సున్నితమైన పాయింట్ తో ఆద్యంతం వినోదభరితం ఈ సినిమా. కథా పరంగా దుబాయ్ లో ఉంటున్న విను రామచంద్రన్ కు కేరళ లో ఓ సంబంధం కుదురుతుంది. అది కూడా గురువాయుర్ టెంపుల్ లో పెళ్ళి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. ఎక్కడైనా పెళ్ళి కుదిరితే పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు ఇష్టపడి మాట్లాడుకుంటారు. కాని ఈ కథలో పెళ్ళికూతురి అన్నతో పెళ్ళికొడుకు ప్రేమగా ఫోన్ లో మాట్లాడుతుంటాడు. ఇక్కడ పెళ్ళికూతురు అన్న ఆనందన్ పాత్రలో పృధ్విరాజ్ పోషించారు. పెళ్ళి కోసం ఎన్నో ఆశలతో ఇండియాలో అడుగుపెట్టిన విను రామచంద్రన్ పెళ్ళి కూతురి అన్నను చూడడానికి వాళ్ళ ఇంటికి వెళతాడు.అయితే సదరు అన్న గారి భార్య ఈ పెళ్ళికొడుకు మొదట ప్రేమించిన అమ్మాయని తెలుస్తుంది. ఆ షాక్ తిన్న పెళ్ళికొడుకు కి ఏ విధమైన సమస్యలు ఎదుర్కున్నాడు, ఈ విషయం తెలిసిన పెళ్ళికొడుకు అన్న ఎలా స్పందించాడు, అసలు ఆ పెళ్ళి అయిందా లేదా అన్నది హాట్ స్టార్ ఓటిటి లోనే చూడాలి. వీకెండ్ కి ఓ మంచి కాలక్షేపభరితమైన సినిమా గురువాయూర్ అంబలనడియాల్. గో వాచ్ ఇట్.-ఇంటూరు హరికృష్ణ -
ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఆడు జీవితం'
ఈ ఏడాది వచ్చిన హిట్ చిత్రాల్లో ద గోట్ లైఫ్ ఒకటి. ఈ మలయాళ మూవీ తెలుగులో ఆడుజీవితం పేరిట విడుదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన నజీబ్ మహ్మద్ డబ్బు సంపాదించేందుకు సౌదీ అరేబియాకు వలస వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు. వీటన్నింటినీ బెన్యమిన్ అనే రచయిత గోట్ లైఫ్ అనే నవలలో రాసుకొచ్చాడు. దీన్ని ఆధారంగా చేసుకుని ఆడు జీవితం మూవీ తెరకెక్కింది.మార్చిలో రిలీజ్ఈ మూవీ కోసం పృథ్వీరాజ్ ఏడు నెలల్లో 31 కిలోలు బరువు తగ్గాడు. ఓ సన్నివేశం కోసం మూడురోజుల పాటు ఏమీ తినకుండా కఠిన ఉపవాసం చేశాడు. అంతటి అంకితభావంతో ఈ మూవీ కోసం పని చేశాడు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టింది. కానీ సుమారు నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఓటీటీలోకి రానేలేదు.ఓటీటీలోఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 19 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: Thanksgiving Movie: వయొలెన్స్.. వయొలెన్స్.. ధైర్యం ఉంటే చూసేయండి -
మహేశ్ ద్విపాత్రాభినయం.. విలన్‌గా కూడా..?
మహేశ్‌బాబు విలన్ పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటారు? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం లేకపోలేదు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్ రెండు పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకటి హీరో పాత్ర అన్నది కన్ఫార్మ్. రెండోది విలన్ అని సమాచారం. కాగా విలన్ పాత్రకు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ని అనుకున్నారనే వార్త వచ్చింది.ఆ తర్వాత విక్రమ్ పేరు వినిపించింది. అయితే ఈ రెండు పాత్రలనూ మహేశ్‌బాబుతోనే చేయించాలని రాజమౌళి అనుకుంటున్నారట. ఆఫ్రికాలోని అమేజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేశ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ మధ్య కండలు తిరిగిన దేహం, కాస్త లెంగ్తీ హెయిర్, గడ్డంతో కొత్తగా కనిపిస్తున్నారు మహేశ్. రాజమౌళి సినిమా కోసమే ఇలా మేకోవర్ అయ్యారని సమాచారం.త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలని అనుకుంటున్నారు. మరి... ఈ సినిమాలో మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అదే నిజమైతే హీరో... విలన్‌గానా? లేక రెండు పాజిటివ్ క్యారెక్టర్సా? అనేది తెలియాల్సి ఉంది. -
ప్రిన్స్ బర్త్ డే రోజున రాజమౌళి అదిరిపోయే ట్రీట్?
-
SSMB29: మహేశ్- రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ను శరవేగంగా చేస్తున్నారు రాజమౌళి. సెప్టెంబరులో ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లాలన్నది రాజమౌళి ముందున్న ప్రస్తుత టార్గెట్ అట. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రానికి చెందిన సెట్ వర్క్‌ను ఆరంభించారని తెలిసింది. జస్ట్ ఒక్క సెట్ కాదు... పలు రకాల సెట్స్‌ను డిజైన్ చేయిస్తున్నారట రాజమౌళి. వీటిలో ఆఫీస్ సెట్ కూడా ఉందని, ఎక్కువ శాతం షూటింగ్ ఈ సెట్లో జరుగుతుందని భోగట్టా. ప్రస్తుతం తయారు చేయిస్తున్న సెట్స్‌లో ఏదో ఒక సెట్లో తొలి షెడ్యూల్‌ని ఆరంభిస్తారట. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారు రాజమౌళి. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని విలన్ పాత్రకు మలయాళ నటుడు– దర్శక–నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్‌ను తీసుకున్నారనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. -
మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్ హీరో!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందకు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. భారీ బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు చాలా కష్టపడుతున్నాడు. తన లుక్‌ను కూడా మార్చుకున్నాడు. పాత్రకు తగ్గట్లుగా బాడీని బిల్డ్ చేసుకుంటున్నాడు. త్వరలోనే సెట్స్‌పైకి అడుగుపెట్టనున్నారు.(చదవండి: టాలీవుడ్లో హాలీవుడ్ భామ.. 'నిన్ను వదలను' అంటోన్న బ్యూటీ!)ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టిపెట్టాడు రాజమౌళి. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నటీనటులను, టెక్నీషియన్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహేశ్‌కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ పుకారు బయటకు వచ్చింది. అయితే చిత్రబృందం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక తాజాగా ఈ సినిమా విలన్ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి బయటకు వచ్చింది. మహేశ్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఎంపిక చేశారట. ఈ విషయానన్ని జక్కన్న గోప్యంగా ఉంచినప్పటకీ..లీకుల వీరులు బయటకు వదిలేశారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్విరాజ్.. ‘సలార్’తో పాన్ ఇండియా నటుడయ్యాడు. ఆ చిత్రంలో పృథ్విరాజ్ ప్రభాస్‌తో పోటీ పడి నటించాడు. తన సినిమాలోని విలన్ పాత్రకు పృథ్వీరాజ్ బాగా సెట్ అవుతాడని జక్కన్న భావిస్తున్నాడట. ఇక రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు? పృథ్విరాజ్ వెంటనే ఓకే చెప్పేశాడట. అన్ని సెట్ అయితే.. మహేశ్ బాబును ఢీకొట్టే విలన్‌గా పృథ్విరాజ్‌ను చూడొచ్చు. -
కోట్ల విలువైన కారు కొనుగోలు చేసిన సలార్ నటుడు!
సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల బడే మియాన్ చోటే మియాన్లో చిత్రంలో కనిపించారు. అంతకుముందు మలయాళంలో తెరకెక్కించిన ఆడు జీవితం(ది గోట్ లైఫ్) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో అమలాపాల్ హీరోయిన్గా నటించింది. దుబాయ్‌లో ఓ వ్యక్తి నిజజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.తాజాగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. సరికొత్త పోర్షే మోడల్ కారును కొన్నారు. ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోర్షే ఇండియా బ్రాండ్ ప్రతినిధులతో పృథ్వీరాజ్ మాట్లాడుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అతనితో పాటు భార్య సుప్రియా మీనన్ కూడా ఉన్నారు. కాగా.. పృథ్వీరాజ్ ఇప్పటికే లంబోర్గిని, పోర్స్చే, టాటా సఫారి, మినీ కూపర్ లాంటి మోడల్ కార్లు కలిగి ఉన్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ ఎల్2: ఎంపురాన్ షూట్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో నటించడమే కాకుండా లూసిఫర్‌కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గుజరాత్లో జరుగుతుండగా.. కేరళ, న్యూఢిల్లీ, లడఖ్, యూఎస్ఏ, యూకే లొకేషన్లలో కూడా చిత్రీకరించారు. View this post on Instagram A post shared by Porsche India (@porsche_in) -
ఓటీటీకి సలార్ నటుడి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల కాలంలో ఓటీటీలే సినీ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వచ్చాక భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు థియేటర్లు మాత్రమే కాదు.. ఓటీటీలోనూ దూసుకెళ్తున్నాయి. మరి ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అందుకే అక్కడ హిట్ అయిన చిత్రాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు.అందుకే మలయాళంలో హిట్ అయిన చిత్రాలు దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన కామెడీ చిత్రం గురువాయుర్ అంబలనాదయిల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈనెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓవర్సీస్ అభిమానుల కోసం సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు.కాగా.. ఈ ఏడాది మే 16న మలయాళంలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ.90 కోట్లు వసూళ్లు సాధించింది. జూన్ 27న మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను విపిన్ దాస్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో బసిల్ జోసెఫ్, రేఖ, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. #GuruvayoorAmbalaNadayil Will Be Streaming From June 27 On @DisneyPlusHS @PrithviOfficial @basiljoseph25#PrithvirajSukumaran pic.twitter.com/aJssR3jqG2— Shaham (@SHAHAMMUHAMMED1) June 24, 2024 -
'లూసిఫర్2'లో మాఫియా డాన్‌గా మోహన్‌లాల్ లుక్ రివీల్
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నేడు (మే 21) 64వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా లూసిఫర్ సీక్వెల్ నుంచి ఆయన లుక్‌ను రివీల్ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ లూసిఫర్ 2 పోస్టర్‌ను డైరెక్టర్, హీరో పృథ్వీరాజ్ పోస్ట్ చేశాడు.మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం లూసిఫర్.. 2019వ విడుదలైన ఈ సినిమా రూ. 200 కోట్లు రాబట్టింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా 'లూసిఫర్2: ఎంపురాన్(రాజు కన్నా గొప్పవాడు)' అనే టైటిల్‌తో ఈ ఏడాదిలో విడుదల చేయనున్నారు. సీక్వెల్ కోసం మురళీ గోపి అందించగా పృథ్వీరాజ్‌నే దీనికి కూడా దర్శకత్వం వస్తున్నారు. గతేడాదిలోనే షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌తో పాటు మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.'లూసిఫర్'లో స్టీఫెన్ గట్టుపల్లి అనే రాజకీయ నాయకుడిగా మోహన్‌లాల్ కనిపించాడు. అయితే, ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు ఈ ప్రపంచాన్నే శాసించే మాఫియాకు అధినేతగా ఉంటారు. మాఫియా డాన్ అబ్రహాం ఖురేషి సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అంత స్థాయికి ఎలా చేరుకున్నాడు. రాజకీయాలకు ముందు ఆయన ఏం చేశాడు..? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు..? అనేది తెలియాలంటే లూసిఫర్2 వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) -
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?
పృథ్వీరాజ్ సుకుమార్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం ఆడుజీవితం(ది గోట్ లైఫ్). మార్చి 28న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం కేవల 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.అయితే ఈ సినిమా రిలీజై రెండు నెలల కావొస్తున్నా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. గతంలో చాలాసార్లు ఓటీటీ స్ట్రీమింగ్పై రానుందని వార్తలొచ్చాయి. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరోసారి ఓటీటీకి సంబంధించిన నెట్టింట వైరలవుతోంది. ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తేదీపై కూడా చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ఈ మూవీ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఈ సారైనా ఓటీటీకి వస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.అసలు కథేంటంటే..?కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథే ఈ చిత్రం. వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని ఆడు జీవితం చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్ ‘గోట్ డేస్’ అనే నవలను రచించారు. దీని ఆధారంగానే ఈ సినిమాను మేకర్స్ నిర్మించారు. నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 31 కిలోల బరువు తగ్గారు. అంతే కాకుండా కొన్ని సీన్స్ కోసం 72 గంటలపాటు భోజనం లేకుండా మంచి నీళ్ల సాయంతోనే ఆయన ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమకు తగిన ఫలితం దక్కిందని చెప్పవచ్చు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. -
ఓటీటీలోకి రియల్ లైఫ్ ట్రాజెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సరైన సినిమాల్లేక బాక్సాఫీస్ డల్ అయిపోయింది. అల్లరి నరేశ్ 'ఆ ఒక్కటి అడక్కు' మూవీపై గంపెడాశలు పెట్టుకుని గతవారం థియేటర్లలో రిలీజ్ చేశాడు. పెద్దగా లాభం లేకుండా పోయింది. దీంతో ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడింది. ప్రస్తుతానికైతే ఓటీటీలో 'మంజుమ్మల్ బాయ్స్' మూవీ బాగానే ఆకట్టుకుంటోంది. త్వరలో 'ఆవేశం' స్ట్రీమింగ్ కానుండగా.. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో రియల్ లైఫ్ సినిమా వచ్చేందుకు రెడీ అయిపోయింది.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఎందుకంటే 'సలార్'లో రాజమన్నార్ అనే విలన్ పాత్రలో మెప్పించాడు. ఇతడు మెయిన్ రోల్లో నటించిన 'ద గోట్ లైఫ్' అనే సినిమా మార్చి చివర్లో రిలీజైంది. పనికోసం దుబాయి వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడ ఎలా చిక్కుకుపోయాడు? అక్కడి నుంచి స్వదేశానికి ఎలా తిరిగొచ్చాడు? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగులో మాత్రం సీరియస్ కాన్సెప్ట్ కావడంతో మనోళ్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.ఇకపోతే 'ద గోట్ లైఫ్' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైందని తెలుస్తోంది. మే 26 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుందని అంటున్నారు. మరోవైపు చెప్పిన టైమ్ కంటే ముందే మే 10నే ఓటీటీలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమా తీయడానికి దాదాపు 16 ఏళ్లు పట్టింది. ఆరేళ్ల క్రితం షూటింగ్ మొదలుపెట్టి, పలు కష్టాలతో పూర్తి చేశారు. ఈ ఏడాది రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్) -
ఓటీటీలో 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా..?
మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం 'ఆడు జీవితం'. ట్రైలర్‌తోనే భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళంలో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల జాబితాలో చేరిపోయిన ఆడు జీవితం ఓటీటీ విడుదలకు రెడీగా ఉంది.ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న బ్లెస్సీ 'ఆడు జీవితం' చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మే 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి. డిస్నీ+హాట్‌స్టార్ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. అగ్రిమెంట్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం, సినిమా విడుదలైన సమయం నుంచి 40 రోజుల తర్వాత OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలచేయవచ్చు. దీని ప్రకారం మే 10న ఓటీటీలో ఆడు జీవితం విడుదల కానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. త్వరలో అధికారికంగా ప్రకటన రానుంది. కథ ఏంటి..?కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథే ఈ చిత్రం. వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని ఆడు జీవితం చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్ ‘గోట్ డేస్’ అనే నవలను రచించారు. దీని ఆధారంగానే ఈ సినిమాను మేకర్స్ నిర్మించారు. నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 31 కిలోల బరువు తగ్గారు. అంతే కాకుండా కొన్ని సీన్స్ కోసం 72 గంటలపాటు భోజనం లేకుండా మంచి నీళ్ల సాయంతోనే ఆయన ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమకు తగిన ఫలితం దక్కిందని చెప్పవచ్చు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. -
రూ. 350 కోట్ల సినిమా.. 1+1 ఆఫర్ ఇచ్చినా చూసేవాళ్లు లేరు
బాలీవుడ్లో అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ఇద్దరు కలిసి నటించిన చిత్రం 'బడేమియా ఛోటేమియా'. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ అయింది. హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి నాలుగు రోజులకు గాను రూ.96 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్లో రూ.100 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది. ఈ చిత్రాన్ని పూజ ఎంటర్టైన్మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై జాకీ భగ్నానీ, వశు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.400 కోట్లు అందుకుంటుందని అంచనా వేసి సినిమా విడుదల చేస్తే.. భారీ డిజాస్టర్ దిశగా కొనసాగుతుంది. ఓ మై గాడ్ 2 తర్వాత అక్షయ్ కుమార్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఆపై ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు నటించడంతో మొదటిరోజు కలెక్షన్స్ కాస్త మెరుగ్గానే వచ్చాయి. ఆ తర్వాత సినిమా బాగాలేదని టాక్ రావడంతో రెండో రోజే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఆదివారం నాడు బుక్ మై షోలో వన్ ప్లస్ వన్ ఆఫర్‌ను ప్రకటించేశారు. ఈ నిర్ణయంతో ఆదివారం బుకింగ్స్ కాస్త పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆఫర్లు ప్రకటించినా కూడా రూ. 350 కోట్లు పెట్టిన సినిమాకు నాలుగురోజుల్లో రూ. 100 కోట్ల మార్క్ దాటకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. -
నటుడి సాహసం.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఆహారం లేకుండా..!
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం 'ఆడుజీవితం: ది గోట్ లైఫ్'. బ్లెస్సీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ చాలా కష్టపడినట్లు ఇటీవల ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అలాగే ఈ సినిమాలో మరో నటుడు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో హకీమ్ అనే పాత్రలో కేఆర్ గోకుల్ కనిపించారు. అతని శరీరం పూర్తిగా బక్కచిక్కపోయినట్లుగా ఈ సినిమాలో కనిపించారు. తాజాగా తన బాడీని అలా మార్చేందుకు పడిన కష్టాన్ని పంచుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ లాగే గోకుల్ పాత్ర కోసం తీవ్రంగా శ్రమించారు. దాదాపు కొన్ని రోజుల పాటు ఆహారం తినకుండా ఉన్నట్లు వెల్లడించారు. గోకుల్ మాట్లాడుతూ..'హకీమ్ పాత్ర కోసం బరువు తగ్గడానికి ప్రయోగాలు చేశా. ఆ పాత్రను వాస్తవికంగా పోషించడంలో నాకు సహాయపడింది. ఇది నన్ను శారీరకంగా, మానసికంగా దెబ్బతీసింది. కేవలం నీళ్లు తాగి బతికా. దీంతో బాడీలోని కేలరీలను క్రమంగా తగ్గించుకున్నా. 15 రోజులుగా ఏం తినకుండా కేవలం బ్లాక్ కాఫీ తాగాను. దీంతో మూడో రోజే ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. నా పరిస్థితిని చూసి నా కుటుంబం, స్నేహితులు చాలా బాధపడ్డారు. ఇది నిజంగా నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఆడుజీవితం సెట్స్‌లో నేనే అందరికంటే చిన్నవాడిని' అని అన్నారు. పృథ్వీరాజ్‌తో అనుభవం గురించి మాట్లాడుతూ..'షూటింగ్ సమయంలో అందరూ నన్ను తమ కొడుకులా చూసుకున్నారు. ఆ విధమైన శ్రద్ధ ఎల్లప్పుడూ సెట్స్‌లో సౌకర్యవంతంగా ఉండేందుకు సహాయపడింది. మనం సౌకర్యవంతంగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా పని చేయగలం. పృథ్వీరాజ్ నన్ను కొత్తవాడిగా కాకుండా సహానటుడిగా చూశాడు. నువ్వు నాలాగే బాగా పని చేస్తున్నావు అని నాతో చెప్పాడు' అని పంచుకున్నారు. కాగా.. బెన్యామిన్ రచించిన 2008 నవల ఆడుజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1990ల్లో పని కోసం గల్ఫ్‌కు వలస వెళ్లిన కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందించారు. ఇటీవలే ధియేటర్లలో విడుదలైన ఆడు జీవితం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. -
రూ.100 కోట్ల క్లబ్లో సలార్ హీరో మూవీ..!
సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడుజీవితం. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఆడియన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. మలయాళ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా వంద కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా చూస్తే మలయాళ చిత్రసీమలో ఈ మైలురాయిని సాధించిన ఆరో చిత్రంగా ఆడుజీవితం నిలిచింది. గతంలో రూ.100 కోట్ల మార్క్‌ను చేరుకోవడానికి '2018' సినిమాకు 11 రోజులు పట్టగా.. ఆ రికార్డును అధిగమించింది. 'లూసిఫర్', 'మంజుమ్మెల్ బాయ్స్' 12 రోజుల్లో ఈ ఫీట్ సాధించాయి. ఇటీవల హిట్‌గా నిలిచిన 'ప్రేమలు చిత్రానికి ఈ క్లబ్లో చేరడానికి 31 రోజులు పట్టింది. అలాగే 'పులిమురుగన్' సినిమాకు 36 రోజులు పట్టింది. అంతే కాకుండా మలయాళ చిత్రసీమలో అత్యంత వేగంగా రూ.50 కోట్ల మార్కును క్రాస్ చేసిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాదిలో ‘ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ తర్వాత రూ.100 కోట్ల మైలురాయి చేరుకున్న మూడో చిత్రంగా ఆడుజీవితం నిలిచింది. కాగా.. ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. 100 Cr and counting at the Global Box Office! Thank you for this unprecedented success! ❤️🙏 #Aadujeevitham #TheGoatLife @DirectorBlessy @benyamin_bh @arrahman @Amala_ams@Haitianhero @rikaby @resulp @iamkrgokul @HombaleFilms @AAFilmsIndia @PrithvirajProd @RedGiantMovies_… pic.twitter.com/6H1gynVIJ6 — Prithviraj Sukumaran (@PrithviOfficial) April 6, 2024 -
బాక్సాఫీస్ వద్ద క్రేజీ మార్క్‌ను దాటిన 'ఆడుజీవితం' కలెక్షన్స్
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన చిత్రం 'ఆడుజీవితం'. 'సలార్'లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ . ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 28న విడుదలైన విషయం తెలిసిందే. ఆడుజీవితం ది గోట్ లైఫ్ మూవీ తొలి వారంలోనే రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ ఏడాదే రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్ రికార్డును 'ఆడుజీవితం' బ్రేక్ చేసింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. కానీ మలయాళంలో మాత్రం ఫస్ట్ వీక్ పూర్తి అయిన తర్వాత కూడా 200లకుపైగా థియేటర్లలో రన్ అవుతుంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో కేవలం మలయాళ వెర్షన్ రూ. 90 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తెలుగులో కోటి రూపాయలు కూడా దాటలేదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2008లో అత్యధికంగా అమ్ముడైన మలయాళ నవల 'గోట్ డేస్'. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకుని బెన్యామిన్ ఈ నవల రాశారు. ఈ నవలకు మంచి ఆదరణ దక్కిన వెంటనే, సినిమాగా తీయాలని ఎంతోమంది ఆ హక్కుల కోసం ప్రయత్నించారు. బ్లెస్సీ ఆ నవల హక్కుల్ని కొని ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా రన్ టైమ్ విషయంలో కాస్త తగ్గించి ఉంటే బాగుండు అనే విమర్శ ఉంది. -
సలార్ హీరో సాహసం.. ఆ సీన్ కోసం ఏకంగా మూడు రోజులు!
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడుజీవితం(ది గోట్ లైఫ్). ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్గా నటించింది. బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. యథార్థ సంఘటనలపై బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడుకేరళకు చెందిన ఓ యువకుడు విదేశాలకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమాలో చూపించారు. అయితే ఈ చిత్రం కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ తీవ్రంగా శ్రమించారు. ఈ సినిమాలో పాత్ర కోసం ఏడు నెలల్లో 31 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. తాజాగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ సునీల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలోని నగ్నంగా కనిపించే సన్నివేశం కోసం కఠినమైన ఉపవాసం చేశారని తెలిపారు. దాదాపు మూడు రోజుల పాటు కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారని వెల్లడించారు. ఈ సినిమాపై పృథ్వీరాజ్ అంకితభావం చూపడాన్ని ఆయన కొనియాడారు. పృథ్వీరాజ్‌ను షూట్ జరిగే ప్రదేశానికి కుర్చీలో తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా నగ్న సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు కేవలం 30 ఎంఎల్ వోడ్కా ఎందుకు తాగాడనే విషయాన్ని కూడా సునీల్ వెల్లడించారు. షూట్‌కు ముందు అతని శరీరంలో మిగిలి ఉన్న నీటి నీటి శాతాన్ని బయటకు పంపేందుకు 30 ఎంఎల్ వోడ్కా తీసుకున్నారని తెలిపారు. ఈ సీన్ షాట్‌కు ముందు మేము ఆయనను కుర్చీలో నుంచి లేపాల్సి వచ్చిందని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో నజీబ్ అనే వలస కార్మికుడి పాత్రలో పృథ్వీరాజ్ కనిపించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. Wow 👏 For d Naked Scene, Prithviraj was fasting for 3 Days, not even water in last day; before shoot he took 30ML Vodka to drain remaining water frm body. He was carried in a chair to d location. We needed to lift him from the chair before the shot😯 pic.twitter.com/UjY3Kq0Ti9 — Christopher Kanagaraj (@Chrissuccess) April 2, 2024 -
The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను
సౌదీలో రెండేళ్ల పాటు 700 గొర్రెలను ఒంటరిగా మేపాడు. మరో మనిషితో మాట్లాడలేదు. మరో మాట వినలేదు. ఇసుకతో స్నానం ఇసుకే దాహం ఇసుక తప్ప మరేం కనిపించని ఒంటరితనం. బానిస బతుకు. కాని బతికి దేశం తిరిగి వచ్చాడు. 1995లో అతని జీవితం నవలగా వెలువడి మలయాళంలో సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం 138వ ప్రచురణకు వచ్చింది. అతని జీవితం ఆధారంగానే ‘గోట్ లైఫ్’ సినిమా తాజాగా విడుదలైంది. కేరళకు చెందిన నజీబ్ సంఘర్షణ ఇది. కేరళలోని అలెప్పి దగ్గరి చిన్న ఊరికి చెందిన నజీబ్ కోరుకుంది ఒక్కటే. సౌదీకి వెళ్లి ఏదో ఒక పని చేసి కుటుంబానికి నాలుగు డబ్బులు పంపాలన్నదే. ఆ రోజుల్లో కేరళ నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు చాలామంది పని కోసం వలస వెళ్లేవారు. నజీబ్ కూడా సౌదీకి వెళ్లాలనుకున్నాడు. ఏజెంట్ అతనికి ఒక మాల్లో సేల్స్‌మ్యాన్‌గా పని ఉంటుందని పంపాడు. అలా నజీబ్ సౌదీలో అడుగు పెట్టాడు. అది 1993వ సంవత్సరం. రెండు రోజుల తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో దిగాక నజీబ్ రెండు రోజుల పాటు ప్రయాణిస్తూనే ఉన్నాడు... అప్పుడు గాని అర్థం కాలేదు తాను మోసపోయానని. ఎడారి లోపల అతణ్ణి అరబ్ షేక్‌కు అప్పజె΄్పారు. ఆ షేక్ అక్కడే ఒక షెడ్డు వేసుకుని ఉండేవాడు. నజీబ్‌కు 700 గొర్రెలను కాచే పని అప్పజె΄్పాడు. వేరే బట్టలు ఇవ్వలేదు. స్నానానికి నీళ్లు ఇవ్వలేదు. బతకడానికి మాత్రం ముతక రొట్టెలు పడేసేవాడు. ఆ రొట్టెల్ని గొర్రెపాలలో తడిపి కొద్దిగా తినేవాడు నజీబ్. యజమాని, అతని తమ్ముడు ఈ ఇద్దరు మాత్రమే నజీబ్‌కు కనిపించేవారు. వారి అరబిక్ భాష తప్ప మరో భాష వినలేదు. మరో మనిషిని చూడలేదు. ‘నేను ఏడ్చినప్పుడల్లా వారు కొట్టేవారు’ అంటాడు నజీబ్. భ్రాంతులు నజీబ్‌కు ఎడారిలో ఉండి భ్రాంతులు మొదలయ్యాయి. అతడు గొర్రెల మధ్య ఉండి ఉండి తాను కూడా ఒక గొర్రెనేమో అనుకునేవాడు. రెండేళ్ల పాటు ఇలాగే జరిగింది. ఒకరోజు ఆ అన్నదమ్ములిద్దరూ పెళ్లి ఉందని వెళ్లారు. ఆ అదను కోసమే చూస్తున్న నజీబ్ ఎడారిలో పరిగెత్తడం మొదలుపెట్టాడు. దారి లేదు.. గమ్యమూ తెలియదు. పరిగెట్టడమే. ఒకటిన్నర రోజు తర్వాత మరో మలయాళి కనిపించి దారి చె΄్పాడు. అతడు కూడా తనలాంటి పరిస్థితిలో ఉన్నవాడే. చివరకు ఒక రోడ్డు కనిపించి రియాద్ చేరాడు. అక్కడి మలయాళీలు నజీబ్‌ను కాపాడారు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోతే తగిన పత్రాలు లేనందున 10 రోజులు జైల్లో పెట్టి ఇండియా పంపారు. నవల సినిమాగా నజీబ్ తిరిగి వచ్చాక కోలుకొని బెహ్రయిన్ వెళ్లాడు ఈసారి పనికి. అక్కడ పని చేస్తున్న రచయిత బెన్యమిన్‌కు నజీబ్‌తో పరిచయమైంది. నజీబ్ జీవితాన్ని బెన్యమిన్ నవలగా ‘ఆడు జీవితం’ (గొర్రె బతుకు) పేరుతో రాసి 2008లో వెలువరించాడు. అది సంచలనంగా మారింది. ఇప్పటికి వందకు పైగా ఎడిషన్స్ వచ్చాయి. 8 భాషల్లో అనువాదమైంది. ఆ నవల ్రపాశస్త్యం సినిమా రంగాన్ని ఆకర్షించింది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ‘ఆడు జీవితం’ పేరుతో నటించి మొన్న మార్చి 28న విడుదల చేశాడు. తెలుగులో గోట్‌లైఫ్ పేరుతో అనువాదమైంది. వాస్తవిక సినిమాగా ఇప్పటికే గోట్‌లైఫ్ ప్రశంసలు పొందుతోంది. -
Aadujeevitham Review: ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) మూవీ రివ్యూ
టైటిల్: ది గోట్ లైఫ్ నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు నిర్మాణం:జువల్ రొమాన్స్ దర్శకత్వం: బ్లెస్సీ సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: సునీల్ కేఎస్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ విడుదల తేది: మార్చి 28, 2024 నజీబ్(పృథ్వీరాజ్ సుకుమారన్) ఊర్లో ఇసుక పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భార్య సైను(అమలాపాల్) గర్భవతి. పుట్టబోయే బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వాలని, అలాగే సొంత ఇంటిని కట్టుకోవాలనే ఉద్దేశంతో సౌదీ వెళ్లాలనుకుంటాడు. అక్కడ భారీగా డబ్బు సంపాదించి ఫ్యామిలీని సంతోషంగా చూసుకోవాలనుకుంటాడు. ఇంటిని తాకట్టు పెట్టి రూ. 30 వేలు అప్పు తెచ్చి మరీ సౌదీకి వెళ్లాడు. అతనితో పాటు హకీమ్(కేఆర్ గోకుల్) కూడా వెళ్తాడు. వీరిద్దరిని ఏజెంట్ మోసం చేస్తాడు. సౌదీకి వెళ్లిన తర్వాత వీరికి ఎవరూ ఉద్యోగం చూపించరు. అక్కడ కఫీల్ చేతిలో ఇరుక్కుంటారు. అతను వీరిద్దరి బలవంతంగా తీసుకెళ్లి వేరు వేరు చోట్ల పనిలో పెడతాడు. నజీబ్‌ని ఏడారిలో గొర్రెలు, మేకలు, ఒంటెలు కాసే పనిలో పెడతారు. అక్కడ నజీబ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? ఏడారి నుంచి బయటపడేందుకు నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు? ఆఫ్రికన్ ఇబ్రహం ఖాదిరి (జిమ్మీ జీన్ లూయిస్) నజీబ్‌కి అందించిన సహాయం ఏంటి? చివరకు నజీబ్ తిరిగి ఇండియాకు వెళ్లాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 90వ దశకంలో పొట్టకూటి కోసం చాలామంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. అక్కడి వెళ్తే బాగా డబ్బు సంపాదించొచ్చని, దాంతో తమ కష్టాలన్నీ తీరుపోతాయనే ఆశతో అప్పు చేసి మరీ గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. అలాంటివారిలో చాలా మంది ఏజెంట్ చేతిలో మోసపోయేవారు. మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి.. అక్కడికి వెళ్లిన తర్వాత రెస్పాన్స్ అయ్యేవారు కాదు. మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చే స్థోమత లేక చాలా మంది అక్కడ యాచకులుగా.. గొర్రెలు, ఒంటెల కాపరిగా పని చేసేవారు. కొంతమంది అయితే అక్కడే చనిపోయేవారు కూడా. అలా ఏజెంట్ చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి కథే ‘ది గోట్ లైఫ్’. చదువు, అవగాహన లేకుండా, ఏజెంట్ చేతిలో మోసపోయి.. దొంగ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి జీవితాలు ఎలా ఉంటాయి? అక్కడ వారు పడే కష్టాలు ఏంటి? అనేవి కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు బ్లెస్పీ. ఇది వాస్తవంగా జరిగిన కథే. 90వ దశకంలో కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు చాలా కష్టాలు పడ్డాడు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ప్రముఖ రచయిత బెన్యామిక్ గోట్ డేస్ అనే పుస్తకాన్ని రాశారు. కేరళలో ఈ పుస్తకం అనూహ్య పాఠక ఆదరణ పొందింది. ఆ పుస్తకం ఆధారంగానే దర్శకుడు బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పుస్తకంలోని ప్రతి అక్షరానికి తెర రూపం ఇచ్చాడు దర్శకుడు. సినిమా చూస్తున్నంతసేపు మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. ప్రధాన పాత్రకు ఎదురయ్యే సమస్యలు చూసి తట్టుకోలేం. ‘అయ్యో.. ఇంకెంత సేపు ఈ వేదన’ అనే ఫీలింగ్ కలుగులుతుంది. ఓ సాధారణ ప్రేక్షకుడు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలో ఉండదు. కానీ హీరో పాత్రకు కనెక్ట్ అయితే మాత్రం సీటులో నుంచి కదలరు. హీరో ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీలో బానిసగా మారే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో గతాన్ని, వర్తమానాన్ని చూపిస్తూ కథనాన్ని ముందుకు నడిపించాడు. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో కథనాన్ని ఆసక్తికరంగా మలిచాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ప్రేక్షకుల మనసును మెలిపెట్టేస్తుంది. ఎడారిలో నీళ్ల కోసం అతను పడే బాధను చూపిస్తూనే.. వెంటనే గతంలో నది ఒడ్డున అతను ఎలా బతికాడనేది చూపించారు. ఈ రెండింటిని పోల్చకనే పోలుస్తూ ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురి చేశాడు. గొర్రెల మందతో కలిసి హీరో నీళ్లు తాగే సీన్ పెట్టి.. గల్ఫ్ వెళ్లిన తర్వాత అతని పరిస్థితి కూడా ఓ గొర్రెలాగే అయిందని చెప్పే ప్రయత్నం చేశాడు. అద్దంలో తన ముఖం తాను చూసుకొని హీరో పడే బాధను చూస్తుంటే మన గుండె బరువెక్కుతుంది. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ ఫస్టాఫ్‌లో చాలానే ఉన్నాయి. ద్వితియార్థంలో కథ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఏడారి నుంచి బయటపడేందుకు మరో ఇద్దరితో కలిసి హీరో చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో వారికి ఎదురైన కష్టాల నేపథ్యంలో సెకండాఫ్ సాగుతుంది. దర్శకుడు ప్రతి విషయాన్ని డీటెయిల్డ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు కన్నీళ్లను తెప్పిస్తాయి. ముగింపు ఆకట్టుకుంటుంది. అయితే ఈ కథ అందరికి నచ్చకపోవచు. నిడివి కూడా ఇబ్బంది పెట్టొచ్చు. కానీ హీరో క్యారెక్టర్‌తో కనెక్ట్ అయి చూసేవాళ్లకి మాత్రం ‘ది గోట్ లైఫ్’ అద్భుతమైన సినిమా. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం పృథ్వీరాజ్ సుకుమారన్ నటన. నజీబ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ పడిన కష్టమంతా తెర పై కనిపించింది. నటనపై ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయలేరు. పృథ్వీరాజ్ నట జీవితంలో ‘ది గోట్ లైఫ్’ కచ్చితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అనొచ్చు. ఖాదిరి పాత్రకు జిమ్మిజీన్ లూయీస్ న్యాయం చేశాడు. అమలాపాల్ పాత్ర నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమా కు ప్లస్ అయింది. తనదైన బిజియం తో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు కథకు అనుగుణంగా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. చివరిగా.. ఈ సినిమా కమర్షియల్‌గా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ.. ఇదొక అవార్డు విన్నింగ్ మూవీ. ఆస్వాదించేవారికి ‘ది గోట్ లైఫ్’ అద్భుతమైన సినిమా. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
బాలీవుడ్ ను షేక్ చేయబోతున్న పృథ్వీరాజ్ సుకుమారన్
-
ఏడు నెలల్లో 31 కిలోల బరువు తగ్గాను: పృథ్వీరాజ్ సుకుమారన్
‘ఏ నటుడు కూడా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందుకోలేడు. కొన్ని వదిలేయాల్సి వస్తుంటుంది. ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ కొన్ని సినిమాల్లో నటించలేకపోయాను. ఇలాంటి అరుదైన సినిమాకు పనిచేస్తున్నప్పుడు మిగతా ఆఫర్స్ వదులుకోవడం తప్పదు’ అన్నారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ► వాస్తవ కథతో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను తెరకెక్కించారు దర్శకుడు బ్లెస్సీ. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఈ సినిమాకు ఆధారం. రచయిత బెన్యామిన్.. నజీబ్ జీవితానికి అక్షర రూపమిచ్చారు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ గోట్ డేస్ అనే పుస్తకాన్ని బెన్యామిన్ రాశారు. కేరళలో అనూహ్య పాఠక ఆదరణ పొందిన ఈ పుస్తకం రైట్స్ కోసం మలయాళం సినీ పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో, దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు. ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ దక్కించుకున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ తో 2008లో బ్లెస్సీ నన్ను సంప్రదించారు. అలా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) తో నా జర్నీ మొదలైంది. ► 2018లో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ముందుగా రాజస్తాన్ ఎడారిలో షూటింగ్ చేయాలని అనుకున్నా..అక్కడ అరబ్ దేశాల ఎడారుల వాతావరణం కనిపించలేదు. దాంతో జోర్డాన్ వెళ్లి చిత్రీకరణ జరిపాం. నేను బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ షూటింగ్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం. షూటింగ్ ప్రాసెస్ లో ఉండగానే లాక్ డౌన్ వచ్చింది. అప్పుడు జోర్డాన్ షూటింగ్ లో ఉన్నాం. ప్రయాణాలు మొత్తం ఆపేశారు. అక్కడి నుంచి బయటపడే వీలు లేదు. వందేభారత్ ఫ్లైట్ తో కేరళ చేరుకున్నాం. ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఎడారిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించాం. ఇలా ఎన్నో కష్టాలు పడి, అరుదైన లొకేషన్స్ లో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ లోనూ రాజీ లేకుండా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో వర్క్ చేశాం. వాస్తవంగా రెండేళ్లలో పూర్తి చేయాల్సిన సినిమా ఇది. కోవిడ్ వల్ల ఆలస్యమైంది. ► ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే షూటింగ్ కోసం కష్టపడాల్సి వస్తుందని తెలుసు. రోజుల పాటు డైట్ చేశాను. నజీబ్ పాత్రలా మారేందుకు ప్రయత్నించాను. ఎందుకంటే నా క్యారెక్టర్ శరీరాకృతి ద్వారా ప్రేక్షకులు ఆ కథను, క్యారెక్టర్ ను అనుభూతి చెందుతారు. క్యారెక్టర్ కోసం నేను కఠినమైన ఆహార నియమాలు పాటించాను. 31 కిలోల బరువు తగ్గాను. ఈ క్రమంలో నా ఆరోగ్యం గురించి మా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. నా భార్య, మా పాప సినిమా కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ గా నిలిచారు. నజీబ్ ఎడారిలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొని ఉంటాడని ఊహించుకుంటూ ఈ క్యారెక్టర్ లో నటించాను. కష్టపడినా నజీబ్ క్యారెక్టర్ ను విజయవంతంగా పోషించినందుకు సంతోషంగా ఉంది. ► "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా కోసం మేము చేసిన సుదీర్ఘ ప్రయాణంలో మమ్మల్ని నడిపించిన విషయం మేమొక గొప్ప సినిమా చేస్తున్నామనే నమ్మకమే. ప్రేక్షకులకు ఒక స్పెషల్ మూవీ ఇవ్వబోతున్నామనే విశ్వాసంతోనే 16 ఏళ్లు సినిమాతో ముందుకు సాగాం. నజీబ్ అనే వ్యక్తి ఇప్పటికీ మన మధ్యే ఉన్నాడు. అతను తన జీవితం ద్వారా మనకు అందించిన స్ఫూర్తి ఎంతో గొప్పది. ► "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా కోసం తీవ్రమైన చలిలో, వేడి వాతావారణంలో, బలమైన గాలులు వీచే వాతావరణంలో షూటింగ్ చేశాం. ఏడారి జీవితాన్ని సజీవంగా తెరపై చూపించాలంటే అక్కడి వాతావరణాన్ని క్యాప్చర్ చేయాలి. ఇందుకోసం మా మూవీ టీమ్ ప్రతిభావంతంగా పనిచేసింది. ► డైరెక్టర్ బ్లెస్సీ నేను "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా రిలీజ్ కాబోతున్న రోజుకోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నాం. ఇది మా కల. ఆ కల నిజమవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా రూపకల్పనలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి, ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు అవన్నీ దాటుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఇంత కష్టపడిన సినిమా ప్రేక్షకుల దగ్గరకు చేరాలి. ఇందుకు పేరున్న దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ను సెలెక్ట్ చేసుకున్నా. ► లాస్ట్ ఇయర్ సలార్ లో నన్ను ప్రేక్షకులు రాజమన్నార్ గా ఆదరించారు. ఇప్పుడు "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాలో సలార్ కు పూర్తి భిన్నమైన క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నా. సర్వైవల్ థ్రిల్లర్స్ ప్రేక్షకులకు తప్పకుండా ఆసక్తి కలిగిస్తాయి. నజీబ్ క్యారెక్టర్ లో నా పర్ ఫార్మెన్స్ ఎలా ఉందో ప్రేక్షకుల స్పందనతో తెలుసుకోవాలని అనుకుంటున్నా. ► నా కెరీర్ విషయానికి వస్తే అనుకోకుండానే నటుడిని అయ్యాను. మనం సినిమాలను కమర్షియల్, కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ అంటూ విభజన చేస్తాం. కానీ నా దృష్టిలో మంచి సినిమాకు మంచి స్క్రిప్ట్ ఉండాలి. కమర్షియల్ మూవీస్ లోనూ బలమైన కథా కథనాలు ఉంటాయి. మంచి నటులు తమకొచ్చే అరుదైన అవకాశాలు వదులుకోరని భావిస్తా. -
ఎడారిలో షూటింగ్.. ఏకంగా 31 కిలోలు తగ్గా: సలార్ నటుడు
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం "ది గోట్ లైఫ్"(ఆడు జీవితం). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాకు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఆడు జీవితం పేరుతో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, మైత్రీ నుంచి నిర్మాత వై రవి శంకర్, శశి పాల్గొన్నారు. ఈ సినిమా గురించి హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ..' ఇటీవల వరదరాజ మన్నార్ పాత్రతో సలార్‌లో మీ ముందుకు వచ్చాను. మరోసారి ఆడు జీవితం సినిమాతో తెరపైకి రాబోతున్నాను. వరదరాజ మన్నార్ పూర్తిగా ప్రశాంత్ నీల్ ఇమాజినేషన్. కానీ ఈ సినిమా వాస్తవంగా జరిగిన కథ. నజీబ్ అనే పాత్రలో నటించా. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వ్యక్తి అతను. ఈ ప్రయాణంలో తను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ రాసిన పుస్తకమే గోట్ డేస్. బెన్యామిన్ రాసిన ఈ పుస్తకం కేరళలో 2008లో పబ్లిష్ అయింది. ఇప్పుడు సినిమా రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. 2008 ప్రారంభంలో ఈ సినిమాకు కమిట్ అయ్యాం. అయితే ఆ టైమ్‌లో ఈ సినిమాకు కావాల్సిన బడ్జెట్ ఖర్చు చేయడం అసాధ్యంగా ఉండేది. పదేళ్ల తర్వాత 2018లో షూటింగ్ ప్రారంభించాం' అని తెలిపారు. సినిమా షూటింగ్‌పై మాట్లాడుతూ..' నేను ఈ సినిమా కోసం మొదట బరువు పెరిగి ఆ తర్వాత 31 కిలోలు తగ్గా. బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం. ఇప్పటికి కూడా ఈ సినిమా బడ్జెట్ రిస్కు చేయడమే. మేము తిరిగి జోర్డాన్‌లో షూటింగ్ స్టార్ట్ చేసేప్పటికి కోవిడ్ లాక్ డౌన్ వచ్చింది. మూడు నెలలు పూర్తిగా షూటింగ్ ఆపేశాం. మేము భారత్ కు తిరిగి రావడం కూడా కష్టమైంది. వందే భారత్ స్పెషల్ ఫ్లైట్‌లో ఇండియాకు వచ్చాం. పాండమిక్ ఎప్పటికి ఆగిపోతుందో తెలియదు. ఏడాదిన్నర తర్వాత అల్జీరియాలోని టిముమౌన్ అనే ప్లేస్‌లో షూటింగ్ స్టార్ట్ చేశాం. సహార ఎడారి మధ్యలో లొకేషన్. అక్కడికి ఏ సినిమా యూనిట్ వెళ్లలేదు. మా బ్లెస్సీ సార్‌కు సినిమా పిచ్చి. ఆయన వల్లే మేమంతా అక్కడ షూటింగ్ చేయగలిగాం. 2008లో అనుకున్న సినిమా ఫైనల్‌గా 2024 మార్చి 28న మీ ముందుకు వస్తోంది. ఇంత కష్టపడిన ఈ సినిమాను ఫర్ఫెక్ట్గా రిలీజ్ చేయాలని అనుకున్నామని' వెల్లడించారు. -
చిరంజీవి రెండుసార్లు అడిగినా నో చెప్పిన హీరో.. ఎవరంటే?
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ దొరికితే ఎవరైనా కాదంటారా? కానీ ఓ హీరో మాత్రం నిర్మొహమాటంగా చేయనని చెప్పాడట! మెగాస్టార్ నోరు తెరిచి రెండోసారి అడిగినా కూడా వీలు కాదని తిరస్కరించాడట! ఇంతకీ ఆ హీరో కమ్ విలన్ ఎవరనుకుంటున్నారా? మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రస్తుతం ఈయన ఆడుజీవితం(ద గోట్ లైఫ్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మార్చి 28న రిలీజ్ కానుంది. చిరంజీవి సినిమా ఆఫర్ చేస్తే ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ ప్రెస్మీట్లో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు పృథ్వీరాజ్. ఆయన మాట్లాడుతూ.. 'చిరంజీవి సర్ సైరా, గాడ్ ఫాదర్ సినిమాల్లో నన్ను చేయమని అడిగారు. కానీ బిజీగా ఉండటంతో ఒప్పుకోలేకపోయాను. నేను అబద్ధం చెప్తున్నానని ఆయన అనుకుని ఉండొచ్చు. 2017-18 సమయంలో చిరంజీవి సర్.. సుహాసిని మేడమ్ ద్వారా నాకు సైరా మూవీలో ఓ రోల్ ఆఫర్ చేశారు. మెగాస్టార్ నా గురించి ఆలోచించడమే నాకు పెద్ద సర్టిఫికెట్. సేమ్ స్టోరీ చెప్తున్నా.. అప్పుడు ఈ మూవీ కోసమే ప్రిపేర్ అవుతున్నానని, అందుకే నటించలేకపోతున్నా అని ఆయనకు వివరించాను. ఆ తర్వాత లూసిఫర్ తెలుగు రీమేక్ గాఢ్ ఫాదర్ చిత్రాన్ని నన్నే డైరెక్టర్ చేయమన్నారు. అప్పడు కూడా గోట్ లైఫ్ సినిమా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అదే మాట చెప్పడంతో చిరంజీవి గారు.. నాలుగేళ్లుగా నువ్వు సేమ్ స్టోరీ చెబుతున్నావ్ అన్నారు. మీ సినిమాలో నటించడం నాకెంతో ఇష్టం సార్ కానీ కుదరడం లేదు అని వినయంగా చెప్పాను. ఆ తర్వాత చిరంజీవి గారు రెగ్యులర్ గా మెసేజ్‌లు పంపుతూ ఉండేవారు. గాడ్ ఫాదర్ రిలీజ్ రోజున కూడా మెసేజ్ పంపారు. భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవి గారితో కలిసి పనిచేస్తాను' అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఏడేళ్లు ప్రయత్నించా.. ఇక నేను బిడ్డను కనలేను -
72 గంటల పాటు షూటింగ్.. చాలా కష్టాలు పడ్డాం: సలార్ నటుడు
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ఆడుజీవితం. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్గా నటించిది. ఈ సినిమా ది గోట్ లైఫ్ అనే పేరుతో ఇంగ్లీష్‌లోనూ విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన పృథ్వీరాజ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. 'ఇందులో నేను నజీబ్ అనే బానిస పాత్రలో నటించా. దాని కోసమే 31 కిలోలు బరువు తగ్గా. జిమ్ ట్రైనర్, పోషకాహార నిపుణులు, డాక్టర్స్ పర్యవేక్షణలో ఇదంతా చేశా. వారంతా విశ్రాంతి తీసుకోమని నాకు సలహాలు ఇచ్చేవారు. కొన్ని సందర్భాల్లో 72 గంటలు షూటింగ్‌లోనే ఉండాల్సి వచ్చేది. కరోనా లాక్‌డౌన్‌తో చిత్రబృందం చాలా ఇబ్బందులు పడింది. పశ్చిమాసియాలోని జోర్డాన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. వీటిని మీతో పంచుకునేందుకు ఇదే సరైన సమయమని భావించా. అందుకే చెప్పాను' అని అన్నారు. కాగా.. ప్రభాస్ నటించిన సలార్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సంగతి తెలిసిందే. -
'సలార్' విలన్ పాన్ ఇండియా మూవీ.. ట్రైలర్ ఓ విజువల్ వండర్
ఈసారి వేసవిలో ప్రభాస్ 'కల్కి' తప్పితే స్టార్ హీరోల సినిమాలేం రావట్లేదు. ఏప్రిల్‌లో 'దేవర' రావాల్సింది కానీ వాయిదా పడింది. అయితే ఇప్పుడు సినీ ప్రేమికుల్ని మెస్మరైజ్ చేసేందుకు క్రేజీ పాన్ ఇండియా మూవీ వచ్చేస్తోంది. 'సలార్'లో ప్రభాస్ ఫ్రెండ్, విలన్‌గా చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈ మూవీ సర్వైవర్ డ్రామాలో హీరోగా నటించాడు. మార్చి 28న సినిమా థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ మూవీ 'ఆడు జీవితం'. పొట్టకూటి కోసం సౌదీకి వలస వెళ్లిన నజీబ్ మహమ్మద్ అనే మలయాళీ కుర్రాడు ఎన్ని కష్టాలు పడ్డాడు? అక్కడ బానిస బతుకు నుంచి బయటపడేందుకు ఎడారి బాట పట్టిన ఇతడు.. ఎలా బతికి బట్టకట్టాడు అనేదే స్టోరీ. పాత ట్రైలర్ సంగతి పక్కనబెడితే తాజా ట్రైలర్ మాత్రం విజువల్ వండర్లా అనిపించింది. లాంగ్ ఫ్రేమ్స్, క్లోజ్ ఫ్రేమ్స్ సీన్స్ మాత్రమే చూపించారు. ఒకే ఒక్క డైలాగ్‌తో అద్భుతమైన సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించారు. హీరోగా చేసిన పృథ్వీరాజ్ లుక్ ట్రైలర్లో చూస్తుంటే షాకింగ్‌గా అనిపించింది. ఏఆర్ రెహమన్ సంగీతం కూడా సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. ఈ సినిమా దర్శకుడు బ్లెస్సీ, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి.. ఇలా జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలు అందరూ ఈ చిత్రం కోసం పనిచేయడం విశేషం. (ఇదీ చదవండి:ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
‘ది గోట్ లైఫ్’ తప్పకుండా చూడాల్సిన సినిమా: రణ్వీర్ సింగ్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న తాజా చిత్రం "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ మూవీ సెకండ్ పోస్టర్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. 'ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా..' అంటూ ఆయన పోస్టర్ రిలీజ్ సందర్భంగా క్యాప్షన్ రాశారు. ఈ సెకండ్ లుక్ పోస్టర్ ఎమోషనల్ గా ఉంది. ఒక ఆశతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న కథానాయకుడి భావోద్వేగం అంతా ఆయన మొహంలో కనిపిస్తోంది. నజీర్ క్యారెక్టర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంతగా ఒదిగిపోయారో ఈ పోస్టర్ చూపిస్తోంది. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు. ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
'సలార్' విలన్ కొత్త సినిమా.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో తెలుసు. అతడి సినిమాల్ని ఇప్పటికే ఓటీటీల్లో చూసి ఎంటర్టైన్ అయ్యారు. ఈ మధ్య 'సలార్' సినిమాలోనూ ప్రభాస్ ప్రాణ స్నేహితుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. రెండో భాగంలో ప్రభాస్‌తో ఢీ అంటే ఢీకొట్టే విలన్‌గా కనిపించబోతున్నాడు. సరే దాని గురించి కాసేపు పక్కనబెడితే పృథ్వీరాజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. దీనిపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశాడు. 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) పేరుతో తీస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. 90వ దశకంలో జీవనోపాధి కోసం కేరళని వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథని వాస్తవ ఘటనల ఆధారంగా 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) సినిమాలో చూపించబోతున్నారు. పూర్తిగా ఎడారిలో తీసిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసిన ప్రభాస్.. లుక్ చూసి చాలా థ్రిల్ అవుతున్నానని ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సహా ఐదు భాషల్లో ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఇందులో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాని అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ తీశారు. ఇక హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. 'నా ఫ్రెండ్ ప్రభాస్ చేతుల మీదుగా 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది అనేది తెలుసు. ఐదేళ్లు ఈ సినిమా కోసం కేటాయించాను. మానసికంగా, శారీరకంగా నజీబ్ క్యారెక్టర్లా మారిపోయాను. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ మూవీ కోసం రాజీ లేకుండా కష్టపడ్డాను. ఈ మూవీకి పనిచేస్తున్నప్పుడు మేం ఎంతగా ఎంజాయ్ చేశామో, రేపు థియేటర్స్‌లోనూ ప్రేక్షకులు అంతే హ్యాపీగా ఫీలవుతారు' అని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
కన్నీళ్లు తెప్పిస్తున్న చిన్నారుల బాధ.. భారీ సాయం చేసిన హీరో
కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన వెల్లియామామట్‌లో సుమారు 15 ఆవులు మృతి చెందాయి. ఎండిన పచ్చిమిర్చి పొట్టుతో పాటు కలుషితమైన ఆహారం తినడం వల్లే అవి మృతి చెందాయని తెలుస్తోంది. ఈ పశువులు ఇద్దరు యువకులు జార్జ్ (18), మాథ్యూ (15)లకు చెందినవి. తన తండ్రి మరణం తరువాత వారిద్దరూ సుమారు 3 ఏళ్ల నుంచి ఆవులను పెంచుకుంటున్నారు. పాఠశాలకు వెళ్తూనే డెయిరీ రంగంలోకి వారు కష్టపడుతున్నారు. మాథ్యూ చదువుతో పాటు ఆవులను కూడా పెంచుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ సమయంలో వారి ఆవులు చనిపోవడంతో మాథ్యూ, జార్జ్‌తో పాటు వారి తల్లి కుంగిపోవడం ఆపై వారు ఆస్పత్రి పాలు కావడం జరిగింది. గతంలో వీరు రాష్ట్ర ఉత్తమ బాల పాడి రైతుగా అవార్డును గెలుచుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న డైరీ ఫామ్‌లలో వీరిది ఒకటి. డిసెంబర్ 31న వారి ఆవులు చనిపోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. ఆ కుటుంబం ఇబ్బందిని తెలుసుకున్న మలయాళ నటీనటులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రముఖ నటుడు జయరామ్ వారికి భారీ సాయం అందించారు. తాజాగా ఆయనే స్వయంగా వారి ఇంటికి చేరుకుని రూ. 5 లక్షలు అందించడం విశేషం. జయరామ్‌కు తెలుగు చిత్ర సీమలో కూడా మంచి గుర్తింపు ఉంది. అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ సినిమాలో తండ్రిగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిన్నారుల కుటుంబానికి సాయంగా మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి కూడా రూ. లక్ష, సలార్ నటుడు పృథ్వీరాజ్ రూ.2 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని జయరామ్ పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం ఇద్దరూ పిల్లలకు ఆ డబ్బు కూడా అందజేయనున్నట్లు తెలుస్తోంది. జయరామ్ ఆర్థిక సాయం చేసిన డబ్బు తన కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బు అని ఆయన తెలిపారు. గతంలో తాను ఎంతో ప్రేమతో పెంచుకున్న ఆవులు కూడా కొన్ని కారణాల వల్ల మృత్యువాత పడ్డాయని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను, తన భార్య ఎంతో బాధపడ్డామని ఆయన తెలిపారు. మరోవైపు కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి చించు రాణి, జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ ఆ యువ రైతుల కుటుంబానికి చేరుకున్నారు. బీమాతో కూడిన ఐదు ఆవులను రైతులకు అందజేయనున్నట్లు మంత్రి హామీనిచ్చినట్టు తెలుస్తోంది. ఆపై ఆ కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 50,000 అందించారని సమాచారం. -
‘సలార్’ మూవీ రివ్యూ
టైటిల్: సలార్ పార్ట్ 1- సీజ్ఫైర్ నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతీహాసన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, టినూ ఆనంద్, రామచంద్రరాజు తదితరులు నిర్మాతలు: విజయ్ కె. దర్శకత్వం: ప్రశాంత్ నీల్ సంగీతం: రవి బస్రూర్ సినిమాటోగ్రఫీ: భువన గౌడ్ విడుదల తేది: డిసెంబర్ 22, 2023 ప్రభాస్ ఖాతాలో సూపర్ హిట్ పడి చాలా కాలం అవుతోంది. ఆయన నటించిన గత రెండు చిత్రాలు (రాధేశ్యామ్, ఆదిపురుష్) ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ‘సలార్’పైనే పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(డిసెంబర్ 22)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడులైన రెండు ట్రైలర్లు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయినా..యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. సలార్ కథేంటంటే.. ఆద్య(శృతిహాసన్) విదేశం నుంచి కలకత్తా వస్తుంది. ఓబులమ్మ(ఝాన్సీ) మనుషుల నుంచి ప్రాణ హానీ ఉందని ఆమె తండ్రి ఆమెను బిలాల్(మైమ్ గోపీ) ద్వారా అస్సాంలో ఉన్న దేవా(ప్రభాస్) దగ్గరకు పంపిస్తాడు. దేవా బొగ్గు గనుల్లో మెకానిక్‌గా పని చేస్తుంటాడు. అతని తల్లి(ఈశ్వరీరావు)ఆ ప్రాంతంలోని పిల్లలకు పాఠాలు చెబుతూ జీవితాన్ని గడుపుతుంటారు. కొడుకు దేవా కాస్త లేట్‌గా ఇంటికి వచ్చినా..ఆమె భయపడుతుంది. అతని చేతిలో చిన్న ఆయుధం ఉన్నా సరే.. ఆందోళన చెందుతుంది. ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? పాతికేళ్ల క్రితం ఖాన్సార్‌లో ఏం జరిగింది? అక్కడి నుంచి దేవా, అతని తల్లి ఎందుకు బయటకు వచ్చారు? ఖాన్సార్ కర్త(జగపతి బాబు) రెండో భార్య కొడుకు వరద రాజమన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్)ను చంపాలని కుట్ర చేసిందెవరు? ఆ కుట్రను ఎదుర్కొనేందుకు వరద రాజమన్నార్ ఏం చేశాడు? స్నేహితుడు దేవాని మళ్లీ ఖన్సార్‌కి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? ప్రాణ స్నేహితుడు వరద రాజమన్నార్ కోసం దేవా ఏం చేశాడు? ఆద్య ఎవరు? ఓబులమ్మ మనుషులు ఆమెను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఆద్యకు దేవా ఎందుకు రక్షణగా నిలబడ్డాడు. ఖన్సార్ ప్రాంతం నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే సలార్ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మేకింగ్ పరంగా ప్రశాంత్ నీల్‌కు ఓ స్టైల్ ఉంది. ఆయన సినిమాల్లో హీరోకి ఓ రేంజ్లో ఎలివేషన్ ఉంటుంది. లెక్కలేనన్ని పాత్రలు వచ్చి వెళ్తుంటాయి. మదర్ సెంటిమెంట్ మస్ట్‌గా ఉంటుంది. సలార్‌లో కూడా ఈ హంగులన్నీ ఉన్నాయి. కేజీయఫ్‌లో మాదిరి ఇందులో కూడా ఖాన్సార్ అనే ఓ కల్పిత ప్రాంతాన్ని సృష్టించి, కథ మొత్తం దాని చుట్టే అల్లాడు. అయితే ఈ చిత్రంలో వచ్చే చాలా సన్నివేశాలు కేజీయఫ్ మూవీని గుర్తు చేస్తాయి. కథలోని పాత్రలు కూడా ఇంచుమించు అలానే అనిపిస్తాయి. కథనం కూడా అలానే సాగుతుంది. ఒకదానికి ఒకటి సంబంధం లేనీ సీన్లు చూపిస్తూ అందులో ఏదో విషయం దాగి ఉంది అనేలా కథను ముందుకు నడిపించాడు. కేజీయఫ్‌తో పోలిస్తే ఇందులో హీరో ఎలివేషన్ కాస్త తక్కువే అయినా.. అక్కడ ఉంది ప్రభాస్ కాబట్టి ఆ సీన్స్ అన్నీ థియేటర్లో ఈళలు వేయిస్తాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్‌ని ఫ్యాన్స్‌కి నచ్చేలా చూపిస్తూ కథనాన్ని నడిపించాడు ప్రశాంత్ నీల్. ఈ విషయంలో ప్రశాంత్‌ని మెచ్చుకోవాల్సిందే. కథలో గందరగోళం.. కథనానికి నిలకడలేమి ఉన్నప్పటికీ.. సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా తీర్చి దిద్దాడు. అయితే పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి అసలు కథను దాచిపెడుతూ లైటర్ వేలో పార్ట్ 1ని కంప్లీట్ చేశాడు. దేవా, వరద రాజమన్నార్ల చిన్ననాటి స్నేహబంధాన్ని చూపిస్తూ చాలా సింపుల్‌గా కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత భారీ ఎలివేషన్‌తో హీరో పాత్రని ఎంట్రీ చేశాడు. అతన్ని ప్రతిసారి తల్లి నియంత్రించడంతో హీరోయిజం పండించలేకపోతాడు. అయితే ప్రేక్షకులకు మాత్రం అది చాలా ఆసక్తిని కలిగిస్తుంది. తల్లి మాటకోసమే హీరో ఆగుతున్నాడు...ఒక్కసారి ఆమె వదిలేస్తే ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సెండాఫ్లో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర హీరోని నియంత్రిస్తుంది. కానీ ఒక్కసారి హీరో చేతికి కత్తి అందిన తర్వాత వచ్చే సీన్స్ గూస్బంప్స్ని తెప్పిస్తాయి. ఇలా రెండు పాత్రలు హీరోని నియంత్రించడం వల్లే యాక్షన్ సన్నివేశాలను మరింత బాగా ఎలివేట్ అయ్యాయి. హీరో ఎలివేషన్స్.. యాక్షన్స్ సీన్స్‌తో ఫస్టాఫ్ అలరిస్తుంది. కానీ సినిమా మొత్తంలో ప్రభాస్ మాట్లాడేది చాలా తక్కువ సేపు. ఫస్టాఫ్‌లో అయితే రెండు, మూడు డైలాగ్స్ మాత్రమే ఉంటాయి. మిగతాది అంతా ఎలివేషన్.. యాక్షనే. ఇక సెకండాఫ్‌లో కథంతా ఖన్సార్ ప్రాంతం చుట్టూ తిరిగుతుంది. ఈ క్రమంలో వచ్చే పాత్రలు గందరగోళానికి గురిచేస్తాయి. కుర్చి కోసం చేసే కుతంత్రలు కూడా అంతగా రక్తి కట్టించవు. అయితే ఈ క్రమంలో వచ్చే ఒకటి రెండు యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతాయి. ముఖ్యంగా ఓ గిరిజన బాలికను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని హీరో సంహరించే సన్నివేశం గూస్బంప్స్ తెప్పిస్తాయి. బాహుబలి తరహాలో ఇందులో కూడా తల నరికే సన్నివేశం ఉంటుంది. అది కూడా హైలెట్. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ పార్ట్ 2పై ఆసక్తిని పెంచుతుంది. ఎవరెలా చేశారంటే.. రాజమౌళి తర్వాత ప్రభాస్ కటౌట్‌ని సరిగ్గా వాడుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రభాస్ పాత్ర ఎలా ఉంటే అభిమానులకు నచ్చుతుందో అచ్చం అలానే దేవా పాత్రను తీర్చి దిద్దాడు. ఇక ఆ పాత్రలో ప్రభాస్ రెచ్చిపోయి నటించాడు. తల్లిమాట జవదాటని కొడుకుగా, స్నేహితుడి కోసం ఏదైనా చేసే వ్యక్తిగా అద్భుతమైన నటనను కనబరిచాడు. ప్రబాస్ చేత కత్తిపట్టి విలన్లను నరుకుతుంటే.. ఫ్యాన్స్ ఆనందంతో ఈళలు వేయడం పక్కా. ఇక వరద రాజమన్నార్‌గా పృథ్విరాజ్ సుకుమారన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు బాగా నటించింది. ఓబులమ్మగా ఝాన్సీ కనిపించేది ఒకటిరెండు సన్నివేశాల్లోనే అయినా డిఫరెంట్ పాత్రలో కనిపించింది. మన్సార్ ప్రాంత కర్త(రాజు)గా జగపతి బాబు తెరపై కనిపించింది కాసేపే అయినా గుర్తిండిపోయే పాత్ర చేశాడు. శృతిహాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఫస్టాఫ్‌లో ఆమే కీలకం. టినూ ఆనంద్, మైమ్ గోపీ, రామచంద్రరాజుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. రవి బస్రూర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. భువన గౌడ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేసి.. నిడివి తగ్గిస్తే బాగుండేదేమో. నిర్మాణ విలువలు సినిమా స్థాయిక తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Salaar Movie Stills: ప్రభాస్ 'సలార్' మూవీ స్టిల్స్
-
'సలార్' రెండో ట్రైలర్‌తో ప్రభాస్ రెడీ
రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సూపర్ కాంబినేషన్లో సలార్ రానుంది. ఇండియా రేంజ్లో అత్యంత భారీ యాక్షన్ చిత్రంగా డిసెంబర్ 22న విడుదల కానుంది. రెండు రోజుల క్రితం వరకు ఎలాంటి ప్రచారం లేకుండా ఉన్న సలార్ టీమ్ ఒక్కసారిగా దూకుడు పెంచేసింది. ప్రభాస్ నుంచి నిర్మాత విజయ్ కిరగందూర్ వరకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై జోరు పెంచుతున్నారు. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్‌తో భారీ బజ్ క్రియేట్ చేసిన సలార్ తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందులో ప్రభాస్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌గా నేడు (డిసెంబర్ 17) విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గెట్ రెడీ ఫర్ వైలెంట్ అని హోంబలే ఫిల్మ్స్ తన ఎక్స్ పేజీలో క్లూ ఇచ్చింది. కానీ రెండో ట్రైలర్ ఉంటుందని ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. మొదటి ట్రైలర్లో ప్రభాస్,పృథ్విరాజ్ సుకుమారన్ మధ్య స్నేహాన్ని చూపిన మేకర్స్ రెండో ట్రైలర్లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండనున్నాయని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మొదటి టికెట్‌ను టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కొన్నారు. మరోవైపు యంగ్ హీరో నిఖిల్ కూడా 100 టికెట్లు కొన్నట్లు తెలిపాడు. డిసెంబర్ 22న హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్లో ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూస్తానని ఆయన చెప్పాడు. ఈ టికెట్స్ అన్నీ కూడా తనవైపు నుంచి ఫ్రీగానే ఇస్తానని ఆయన చెప్పడం విశేషం. -
ప్రభాస్ గొప్పతనం గురించి చెప్పిన పృథ్వీరాజ్ సుకుమారన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా 'సలార్' తెరకెక్కింది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇందులో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్, సలార్ సినిమా గురించి పలు విషయాలు పంచుకున్నారు. 'వరదరాజ మన్నార్ పాత్ర కోసం నేను చాలా కష్టపడ్డాను. అది ఫలించిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఇన్పుట్ చాలా బలంగా ఉంది. అతను మొత్తం షాట్‌ను ఒక్క క్షణంలో మార్చగల దర్శకుడు. నా కెరీర్లో ఇప్పటి వరకు ఇంత గొప్ప స్క్రిప్ట్ చూడలేదు. ఈ చిత్రంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. సలార్‌తో నా కల నెరవేరింది.' అని ఆయన అన్నాడు. ప్రభాస్‌ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో అర్థమైంది! సలార్‌లో ప్రభాస్‌తో కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ.. 'ప్రభాస్‌ని ఇన్‌స్టంట్‌గా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రభాస్‌తో ఒక్కసారి మాట్లాడితే చాలు ఎవరైనా ఇష్టపడుతారు. నా వ్యక్తిగత జీవితంలో నాకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. కానీ నేను ప్రతిరోజూ మాట్లేడే వారిలో ప్రభాస్ ఉన్నారు.. నేను ఎల్లప్పుడూ మెసేజ్ చేసే స్నేహితుల్లో అతను ఒకరు. ఇతరుల సంతోషంలో కనిపించే ఆనందాన్ని వెతుక్కునే వ్యక్తి ప్రభాస్. సెట్లో ప్రతి ఒక్కరి మంచి కోసం మాత్రమే ప్రభాస్ చూస్తారు. అందరికీ సౌకర్యంగా ఉండేలా చూస్తారు. సెట్స్‌లో అందరి కోసం మంచి భోజనం తెప్పిస్తారు. ఇలా ఎప్పుడూ ఇతరుల గురించే ప్రభాస్ ఆలోచిస్తారు. అందుకే ఆయన అభిమానులు ప్రభాస్‌ను డార్లింగ్ అని పిలుస్తారని ఈ షూటింగ్ సమయంలో నాకు అర్థమైంది' అని చెప్పారు. ఆపై సలార్ సినిమా గురించి పృథ్వీరాజ్ చెబుతూ... 'సలార్ సినిమా కథను నేను ఎప్పుడూ వినలేదు.. కనీసం స్క్రిప్ట్ కూడా చదవలేదు. ఈ ప్రాజెక్ట్‌లోకి నాకు అవకాశం దక్కడం చాలా సంతోషం. ఇందులో నా పాత్ర సెకండరీ కావచ్చు అయినా కథలో నా ప్రత్యేకత ఏంటి అనేది చూస్తారు. యావరేజ్ సినిమాలో గొప్ప పాత్ర చేయడం కంటే మంచి సినిమాలో ఇలాంటి పాత్రను పోషించడం చాలా గొప్ప. టీజర్, ట్రైలర్లో మీరు చూసింది చాలా తక్కువ. ఇందులో యాక్షన్ సీన్స్‌తో పాటు ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉన్న స్టోరీ ఇది.' అని పృథ్వీరాజ్ తెలిపారు. -
వచ్చే ఏడాది ది గోట్ లైఫ్
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కించారు. విజువల్ రొమాన్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ‘‘1990వ దశకంలో జీవనోపాధిని వెతుక్కుంటూ కేరళ నుంచి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. పూర్తి స్థాయిలో ఎడారి నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది’’ అని యూనిట్ పేర్కొంది. -
సూపర్ హిట్ మూవీ సీక్వెల్లో పాక్ నటి.. ఫోటో వైరల్!
ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన పాకిస్తాన్ నటి మహీరా ఖాన్. ఆమె త్వరలోనే మాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తోన్న ఎల్2: ఎంపురాన్‌లో ఆమె హీరోయిన్గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా.. మహీరా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్ సరసన కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈనేపథ్యంలో పృథ్వీరాజ్‌తో ఉన్న మహీరా పాత ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఎల్2: ఎంపురాన్ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో విడుదలైన లూసిఫర్ పార్ట్-2గా ఎల్2: ఎంపురాన్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా.. మహీరా ఖాన్ విషయానికొస్తే.. 2017 బాలీవుడ్ చిత్రం రయీస్‌లో షారుఖ్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది. అయితే 2016 యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. దీంతో నిషేధం తర్వాత ఆమె ఇండియాలో ఏ సినిమాలోనూ కనిపించలేదు. అయితే ఇటీవలే పాకిస్థానీ కళాకారులపై ఉన్న నిషేధాన్ని ముంబై హైకోర్టు ఎత్తివేసింది. దీంతో మహీరా ఖాన్ మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సిందే. Is this an old photo?#PrithvirajSukumaran with #Mahirakhan pic.twitter.com/SvVMQG5MQD — AKV (@AnandKr13834547) November 26, 2023 View this post on Instagram A post shared by Mahira Khan (@mahirahkhan) -
లూసిఫర్ సీక్వెల్ రెడీ.. మాలీవుడ్‌లో లైకా ప్రొడక్షన్స్ ప్లాన్
కోలీవుడ్‌లో చిన్న చిత్రాల నుంచి భారీ చిత్రాల వరకు కేరాఫ్‌గా మారిన చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షనన్స్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇప్పుడు మాలీవుడ్లోకి అడుగు పెట్టారు. కంప్లీట్ యాక్టర్‌గా పేరుగాంచిన మోహన్‌లాల్ బహుభాషా నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు దశాబ్దాలుగా కథానాయకుడిగా నటిస్తూ మాలీవుడ్‌లో (మలయాళం) అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో ఈయన ఒకరు. (ఇదీ చదవండి: వాళ్లు అయితే నా దుస్తులు తొలగించేవారు.. ఊసరవెల్లి బ్యూటీ కామెంట్లు) 350 చిత్రాలకు పైగా చేసిన మోహన్ లాల్ ఈమధ్య నటించిన చిత్రం లూసిఫర్. దీనికి మరో మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించి అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. లూసిఫర్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా దానికి సీక్వెల్‌గా లూసిఫర్ 2 చిత్రం రూపొందుతోంది. ఇది కూడా మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్లో కాంబినేషన్లోనే తెరకెక్కడం విశేషం. కాగా విచిత్రాన్ని ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోని పెరంబలూర్తో కలిసి లైకా ప్రొడక్షనన్స్ సుభాస్కరన్ నిర్మిస్తుండడం మరో విశేషం. దీని గురించి లైకా ఫిలిమ్స్ సంస్థ అధినేత సుభాస్కరన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ దైవ దేశంగా భావించే మలయాళ చిత్ర పరిశ్రమంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. అంకితభావంతో పనిచేసే కళాకారులు సహజత్వంతో కూడిన సంస్కృతికి అద్దం పట్టే చిత్రాలను రూపొందించే మలయాళ చిత్ర పరిశ్రమలో లూసిఫర్ 2 చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని తాము పొందామని చెప్పారు. ఈ చిత్త పరిశ్రమ అభివృద్ధిని, ఈ చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ ధ్యేయంగా పేర్కొన్నారు. ఈ చిత్ర విజయం పదికాలాలపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందని సుభాస్కరన్ పేర్కొన్నారు. -
ప్రభాస్ కొత్త సినిమా.. ఆ స్టార్ హీరో డైరెక్షన్లో!
ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు. 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' లాంటివి చేసినా యాక్షన్ సినిమాలు చేయాలని గట్టిగా అనుకుంటారు. ఎందుకంటే ఇలాంటి కటౌట్‌కి.. ఓ మూడు నాలుగు ఫైట్స్, పవర్ఫుల్ డైలాగ్స్ పడితే థియేటర్లు తగలబడిపోతాయి. త్వరలో 'సలార్'తో ఇదే జరగబోతుందని ఫ్యాన్స్ మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. అయితే అభిమానుల కోసం డార్లింగ్ హీరో మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) 'బాహుబలి' తర్వాత 'సాహో' అనే యాక్షన్ మూవీ చేశాడు గానీ ఎందుకో అది ఫ్యాన్స్‌కి సంతృప్తి ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలు చేశాడు. కానీ ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. దీంతో అందరి చూపు 'సలార్'పై పడింది. సెప్టెంబరు 28న పాన్ ఇండియా రేంజులో థియేటర్లలోకి రానుంది. మొన్న టీజర్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 'సలార్'లో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా చేస్తున్నాడు. అయితే పృథ్వీరాజ్.. హీరో కమ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. అలానే వీలు దొరికినప్పుడు డైరెక్టర్‌గానూ మారుతున్నాడు. ఇప్పుడు అలా తనలోని దర్శకుడికి పనిచెప్పి, ఓ యాక్షన్ స్టోరీ రెడీ చేశాడట. దాన్ని ప్రభాస్‌కి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది గనుక ఓకే అయితే మాత్రం మరో 'సలార్' అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇదీ చదవండి: ఉపాసన డైమండ్ గిఫ్ట్‌పై తమన్నా క్లారిటీ!) -
'సలార్' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకేమో టెన్షన్!
'ఆదిపురుష్' రిజల్ట్ ప్రభాస్ అభిమానులని చాలా నిరాశపరిచింది. కలెక్షన్స్ తగ్గిపోవడం, లెక్కలేనన్ని వివాదాలు.. వాళ్లకు చిరాకు తెప్పిస్తున్నాయి. దీంతో ఈ సినిమా గురించి మర్చిపోవాలని ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో 'సలార్' కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ మూవీతో ప్రభాస్ హిట్ కొట్టాలని గట్టిగా కోరుకుంటున్నారు. అప్పుడే విమర్శకుల నోళ్లు మూతబడతాయనేది వాళ్ల ఆశ. అయితే ఇప్పట్లో అది జరిగేలా కనిపించట్లేదు! 'సలార్' కోసం వెయిటింగ్! ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కోరుకునేది మాస్ సినిమాలే. లేదంటే వేరే లెవల్ ఎలివేషన్స్ ఇచ్చే చిత్రాలు. 'బాహుబలి'తో డార్లింగ్ హీరో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీని తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చేశాడు. కానీ అభిమానుల్ని పూర్తిస్థాయిలో సంతృప్తి పరచలేకపోయాడు. దీంతో వాళ్లందరూ 'సలార్'పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' ఎఫెక్ట్.. ఆ 'రామాయణం' మళ్లీ రిలీజ్) విలన్‌కి ప్రమాదం 'సలార్'లో జగపతిబాబు, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్స్ గా నటిస్తున్నారు. సరిగ్గా మూడు రోజుల క్రితం పృథ్వీరాజ్‌కి ఓ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించి, సర్జరీ చేశారు. కొన్నివారాలపాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. ఇలా సడన్ గా యాక్సిడెంట్ జరగడం.. 'సలార్' చిత్రబృందానికి షాక్ ఇచ్చింది. షూట్ బ్యాలెన్స్ ఎందుకంటే 'సలార్'లో పృథ్వీరాజ్ రోల్ కి సంబంధించి కాస్త షూట్ మిగిలుంది. త్వరలో ఇది పూర్తి చేయాలనుకున్నారు. ఇప్పుడేమో అతడికి ప్రమాదం జరిగి, బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. త్వరలో కోలుకుని సెట్ లో అడుగుపెడితే పర్లేదు. ఇదంతా త్వరగా జరిగితేనే ఆల్రెడీ ప్రకటించినట్లు సెప్టెంబరు 28న 'సలార్' థియేటర్లలోకి వస్తుంది. కుదరకపోతే మాత్రం వాయిదా గ్యారంటీ. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి. View this post on Instagram A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) -
రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమాదానికి గురయ్యారు. మరయూర్ బస్టాండ్‌లో ‘విలాయత్ బుద్ధ’ సినిమా షూటింగ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సినిమాకు సంబంధించి కొన్ని భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా.. ఆయనకు ప్రమాదం జరిగింది. KSRTC బస్సులో ఓ ఫైట్ సీన్‌ను షూట్ చేస్తుండగా ఆయన జారి కిందపడ్డాడు. దీంతో ఆయన కాలికి గాయం అయింది. వెంటనే ఆయనను చికిత్స కోసం కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నేడు ఆయనకు ఆపరేషన్ చేయనున్నారు. ఈ ఆపరేషన్ తరువాత పృథ్వీరాజ్ సుమారు మూడు నెలలు రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. (ఇదీ చదవండి: ప్రముఖ కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురు పెళ్లి) మరయూర్‌లో గంధపు చెక్కల వెలికితీతకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'విలాయత్ బుద్ధ'. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా అదే ప్రాంతంలో జరుగుతోంది. ఇకపోతే తెలుగువారికి కూడా పృథ్వీరాజ్ సుపరిచితమే. పవన్, రానా నటించిన భీమ్లా నాయక్ ఒరిజినల్ వెర్షన్లో హీరోగా నటించింది ఆయననే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా 'సలార్'లో ఆయన కీ రోల్ విలన్ పాత్రలో చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: పెళ్లయిన 15 రోజులకే విడాకులు.. బుల్లితెర జంటపై సింగర్ విమర్శలు!) -
టాలీలో మాలీ హవా
‘ప్రతిభకి భాషతో సంబంధం లేదు’ అనే మాట చిత్ర పరిశ్రమలో తరచుగా వినిపిస్తుంటుంది. టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లు ఏ భాషలో ఉన్నా తెలుగు పరిశ్రమ సాదర స్వాగతం పలుకుతుంది. ప్రస్తుతం తెలుగులో సెట్స్‌పై ఉన్న పలు చిత్రాల్లో జయరామ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఫాహద్ ఫాజిల్, దేవ్ మోహన్, జోజూ జార్జ్, సుదేష్ నాయర్.. వంటి పలువురు మలయాళ నటులు కీలక పాత్రలతో హవా సాగిస్తున్నారు. ఈ మాలీవుడ్ నటులు చేస్తున్న తెలుగు చిత్రాలపై ఓ లుక్కేద్దాం. బిజీ బిజీగా... ‘భాగమతి.. అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా... ఇలా వరుసగా తెలుగు సినిమాలు చేశారు మలయాళ సీనియర్ నటుడు జయరామ్. నెగటివ్, పాజిటివ్ క్యారెక్టర్స్‌తో తెలుగులో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శ కత్వం వహిస్తున్న ‘గేమ్ ఛేంజర్’తో పాటు మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో జయరామ్ కీలక పాత్ర చేస్తున్నారు. అదిరే ఎంట్రీ మలయాళం స్టార్ హీరోల్లో ఒకరైన ఫాహద్ ఫాజిల్ ‘పార్టీ లేదా పుష్పా..’ అంటూ తెలుగులోకి అడుగుపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో అదిరే ఎంట్రీ ఇచ్చారు ఫాహద్. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలోనూ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటిస్తున్నారు ఫాహద్ ఫాజిల్. ‘పుష్ప’ మొదటి భాగంలో ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా రెండో భాగంలో మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని టాక్. పదమూడేళ్ల తర్వాత... మాలీవుడ్‌లో ఓ వైపు స్టార్ హీరోగా దూసుకెళుతూ మరోవైపు డైరెక్టర్‌గా (లూసిఫర్, బ్రో డాడీ) ప్రతిభ చూపిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా మన్మోహన్ చల్లా దర్శకత్వం వహించిన ‘పోలీస్ పోలీస్’ (2010) చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పృథ్వీరాజ్. ఆ చిత్రంలో ఓ హీరోగా నటించిన ఆయన పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మరో తెలుగు చిత్రంలో (‘సలార్’) నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ విలన్‌గా నటిస్తుండగా ఆయన తనయుని పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నారట. పృథ్వీ పాత్ర నెగటివ్ టచ్‌తో ఉంటుందని టాక్. సెప్టెంబర్ 28న ‘సలార్’ విడుదల కానుంది. ‘శాకుంతలం’తో వచ్చి... గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు దేవ్ మోహన్. మలయాళంలో నటించింది కొన్ని సినిమాలే అయినా తొలి తెలుగు చిత్రంలోనే సమంత వంటి స్టార్ హీరోయిన్‌కి జోడీగా నటించే అవకాశం అందుకున్నారు దేవ్ మోహన్. ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా నటించి, మెప్పించారు దేవ్. ఇలా ‘శాకుంతలం’తో తెలుగుకి వచ్చి, రెండో తెలుగు సినిమా ‘రెయిన్బో’లోనూ మరో స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నాకి జోడీగా నటించే చాన్స్ అందుకున్నారు దేవ్. శాంతరూబన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. జోజు.. సుదేష్ కూడా... మలయాళంలో నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జోజూ జార్జ్ ‘ఆది కేశవ’ సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విలన్‌గా నటిస్తున్నారు జోజూ. అలాగే నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ద్వారా సుదేష్ నాయర్ తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్. ఈ చిత్రంలో ఆయన స్టైలిష్ విలన్ పాత్రలో కనిపిస్తారట. వీళ్లే కాదు.. మరికొందరు మలయాళ నటులు కూడా తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
బ్రిటానియా బిస్కెట్ అధినేత బయోపిక్‌లో సూర్య, పృథ్వీరాజ్!
తమిళ సినిమా: కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య వైవిధ్యభరిత కథా చిత్రాలతో రాణిస్తున్నారు. అలాగే విజయపథంలో దూసుకుపోతున్న నిర్మాతగా కూడా గుర్తింపుపొందారు. 2డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఇప్పటికే పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో వీర్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన 42వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా సూర్య, పృథ్వీరాజ్ సుకుమారన్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వారు తమ సతీమణులతో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఇద్దరు స్టార్లు కలవడానికి కారణం ఓ భారీ చిత్రంలో నటించడానికి అనే ప్రచారం సాగుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, సూర్య జ్యోతికల 2డి ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఒక చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు. అయితే వీరిద్దరూ కలిసి ఓ భారీ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రముఖ బ్రిటానియా బిస్కెట్ అధినేత రాజన్ పిళ్లై బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు, అందులో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనికి సరిగమ ఇండియా సంస్థ సహ నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నట్లు ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ ఆనంద్ కుమార్ ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన కథ సిద్ధమవుతోందని తెలిపారు. అయితే ఇది సినిమాగా తెరకెక్కుతుందా, లేక వెబ్ సిరీస్‌గా రూపొందుతుందా? అన్న విషయం గురించి స్పష్టత లేదు. అదేవిధంగా ఇందులో నటిస్తారా, లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. -
‘సలార్’ విలన్ని చూస్తే గూస్ బంప్సే..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, పృథ్వీరాజ్ కీ రోల్ చేస్తున్నారు. నేడు( సెప్టెంబర్ 16) పృథ్వీరాజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సలార్ నుంచి ఆయన లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన వరదరాజు మన్నారర్ పాత్రలో నటిస్తున్నాడు. (చదవండి: ‘కాంతారా’ ప్రభంజనం.. నిర్మాత పంట పండింది!) లుక్‌ని బట్టి చూస్తే..సలార్ లో పృథ్వీ క్రూరమైన విలన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖం నిండా మసి పూసి.. ముక్కుకి పుడక, మెడలో వెండి కడియాలు కనిపిస్తున్నాయి. ఇందులో జగపతిబాబు కూడా విలన్ పాత్రలో పోషించినా పృథ్వీరాజు సుకుమారే మెయిన్ విలన్ అని తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. Birthday Wishes to the most versatile @PrithviOfficial, Presenting ‘𝐕𝐚𝐫𝐝𝐡𝐚𝐫𝐚𝐣𝐚 𝐌𝐚𝐧𝐧𝐚𝐚𝐫’ from #Salaar.#Prabhas @VKiragandur @hombalefilms @shrutihaasan @IamJagguBhai @bhuvangowda84 @RaviBasrur @anbariv @shivakumarart @SalaarTheSaga #HBDPrithvirajSukumaran pic.twitter.com/GKDlwSqsv2 — Prashanth Neel (@prashanth_neel) October 16, 2022 -
మహేశ్-త్రివిక్రమ్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో!
తెలుగు సినిమాలపై మరింత ఫోకస్ పెట్టినట్లున్నారు మలయాళ దర్శక-నిర్మాత, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పటికే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’ చిత్రంలో పృథ్వీరాజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తాజాగా హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త సినిమాలో ఓ ప్రధాన పాత్రలో పృథ్వీనటించనున్నారట. ఈ మేరకు ఆయనతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరుపుతోందట. తన పాత్ర నచ్చడంతో పృథ్వీరాజ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు సముఖంగానే ఉన్నారని టాక్. కాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘అతడు’,‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ 'కడువా'!
మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కడువా. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో జూన్ 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అదే సమయంలో దీనిపై వివాదాలు సైతం రాజుకున్నాయి. మూవీలో కొన్ని సన్నివేశాలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమవడంతో చిత్రయూనిట్ క్షమాపణలు చెప్పి ఆ సన్నివేశాలను తొలగించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 4 నుంచి ప్రసారం కానుంది. అయితే ఓటీటీ రిలీజ్‌ను అడ్డుకోవాలంటూ జోస్ కురువినక్కునీల్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. కడువాలోని ప్రధాన పాత్ర పేరు సహా తన జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారని మండిపడ్డాడు. ఇక గతంలోనూ అతడు కడువా విడుదల ఆపేయాలంటూ ఫిర్యాదు చేశాడు. తన జీవితకథ ఆధారంగా సినిమా తీశారని, కానీ కొన్ని సన్నివేశాలు తనను, తన కుటుంబ గౌరవాన్ని మంట గలిపేలా ఉన్నాయని మండిపడ్డాడు. దీంతో సెన్సార్ బోర్డ్ సినిమాలోని లీడ్ క్యారెక్టర్ పేరును కురువచన్ అని కాకుండా కురియచన్ అని మార్చాలని సూచించింది. ఇన్ని వివాదాల నడుమ విడుదలైన ఈ మూవీ మరికొద్ది రోజుల్లో ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, సంయుక్త మీనన్, కలాభవన్ షాజన్ ముఖ్య పాత్రలు పోషించారు. షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మ్యాజిక్ ఫ్రేమ్స్– పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌పై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. చదవండి: విజయ్, రష్మిక డేటింగ్‌పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే రవితేజకు ఊహించని షాక్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సీన్స్ లీక్! -
ఇక రీమేక్ సినిమాలు ఉండవు..ఆ మోడల్ని ఫాలో అవ్వాల్సిందే: హీరో
‘‘మలయాళ చిత్రాలు వాస్తవానికి దగ్గరగా, ఆలోచన రేకెత్తించేలా ఉంటాయని ప్రేక్షకులు భావించడం సంతోషం. అయితే కొన్నాళ్లుగా థియేటర్లో హాయిగా కూర్చుని పాప్ కార్న్ తింటూ విజల్స్ వేస్తూ ఎంజాయ్ చేసే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు రాలేదు. మా ‘కడువా’ ఆ లోటుని తీరుస్తుంది. ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. షాజీ కైలాస్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్తా మీనన్ జంటగా వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కడువా’. మ్యాజిక్ ఫ్రేమ్స్– పృథ్వీరాజ్ ప్రొడక్ష¯Œ ్సపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించిన ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ హైదరాబాద్‌లో విలేకరులతో పంచుకున్న విశేషాలు... ► ‘సింహాసనం’ (2012) తర్వాత మళ్లీ షాజీ కైలాస్ దర్శకత్వంలో సినిమా చేయడం ఎలా అనిపించింది? పృథ్వీరాజ్: మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లకు షాజీ కైలాస్గారు పెట్టింది పేరు. ఆయన సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను. నేను దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’లో కొన్ని చోట్ల ఆయన మార్క్ కనిపిస్తుంది. ‘కడువా’ కథ వినగానే ‘మీరు డైరెక్ట్ చేస్తే ఈ సినిమాను నేనే నిర్మిస్తాను’ అన్నాను. ‘కడువా’ ఆయన మార్క్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ► కడువా అంటే ఏంటి? కడువా అంటే పులి. ఇందులో హీరో పేరు కడువకున్నేల్ కురువచన్. షార్ట్ కట్లో కడువా. అందుకే ప్రతి భాషలో అదే టైటిల్ పెట్టాం. కడువ కున్నేల్ ధనికుడు. ఒక వ్యక్తితో చిన్న అహం సమస్య మొదలై పెద్ద హింసకు దారితీస్తుంది. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ ఈ చిత్రకథపై రచయితకి మరో వ్యక్తికి మధ్య వివాదం వచ్చింది. కోర్టు రచయితకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ లోనూ అహం పాయింట్ ఉంది కదా.. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (తెలుగులో ‘భీమ్లా నాయక్)లో అహం అనే పాయింట్ ఉన్నా, సినిమాటిక్‌గా రియల్ స్టోరీ. కానీ ‘కడువా’ మాత్రం కమర్షియల్, లార్జర్ దెన్ లైఫ్ సినిమా. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’తో పోలికలుండవు. ► మీకు ఎలాంటి జోనర్ సినిమాలంటే ఇష్టం? నా దృష్టిలో గుడ్ మూవీ, బ్యాడ్ మూవీ.. అంతే. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా, వైవిధ్యమైన సినిమా అయినా.. ఏదైనా సరే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తే అదే గుడ్ మూవీ. సినిమా చూస్తూ ఫోన్లో మెసేజ్‌లు చెక్ చేసుకుంటూ దిక్కులు చూస్తుంటే అది బ్యాడ్ మూవీ. నేనెప్పుడూ మంచి సినిమాలు చేయాలని తాపత్రయపడుతుంటాను. ► నటన, దర్శకత్వం, నిర్మాణం, పాటలు పాడటం... ఇన్ని పనులు కష్టం అనిపించవా? అవన్నీ సినిమాలో భాగమే. అయితే నిర్మాణానికి ఎంతో ప్రతిభ కావాలి. ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఈ విషయంలో నా భార్య (సుప్రియా మీనన్) సపోర్ట్‌గా ఉంటారు. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే వంటివి నేను చూసుకుంటాను. జీఎస్టీ, ఫైల్స్ వంటి బోరింగ్ పనుల్ని నా భార్య చూస్తుంది(నవ్వుతూ). ► మీ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ‘కడువా’ని థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి కారణం? పాన్ ఇండియా స్థాయిలో నా సినిమా విడుదల అవ్వాలనుకున్నాను. ‘కడువా’తో అది మొదలు పెట్టాను. భవిష్యత్‌లో రీమేక్ సినిమాల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి పరిశ్రమ నుండి మల్టీ లాంగ్వేజ్ సినిమాలని రూపొందించడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. రాజమౌళిగారి ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మెయిన్ స్ట్రీమ్‌గా రిలీజ్ అయ్యాయి. ఆయన చూపించిన ఆ మోడల్ని మనం ఫాలో అవ్వాలి. ‘కేజీఎఫ్ 2’ కూడా ఇదే మోడల్లో రిలీజ్ అయింది. పెద్ద బడ్జెట్ సిని మాలు భవిష్యత్‌లో అన్ని భాషల్లో థియేటర్ రిలీజ్ కావాలి. థియేటర్లో సినిమాని ఎంజాయ్ చేయడం గొప్ప అనుభూతి. ఈ అనుభూతి ఓటీటీ ఇవ్వలేదు. మీ సినిమాలు తెలుగులో రీమేక్ కావడం గురించి... హ్యాపీ. ‘లూసిఫర్’ రీమేక్ చిరంజీవిగారు చేస్తున్నారు. ఆ చిత్రాన్ని నేను తెలుగులో దర్శకత్వం చేసి ఉన్నా ఆయనే నా ఫస్ట్ ఆప్షన్. తెలుగు రీమేక్ కథలో మార్పులు గురించి నాకు తెలీదు. నేనూ ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ► ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌కి దర్శకత్వం వహించే అవకాశం ఎందుకు వదులుకున్నారు? చిరంజీవిగారికి నేను అభిమానిని. ‘లూసిఫర్’ రీమేక్ చేయమని అడిగారు. కానీ, వేరే సినిమాతో నేను బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అంతకు ముందు ‘సైరా నరసింహా రెడ్డి’లో కూడా ఒక పాత్ర చేయమని కోరారు.. అప్పుడూ వీలుపడలేదు. చిరంజీవిగారితో పని చేయాలని ఉంది. నేను ‘లూసిఫర్ 2’ చేస్తున్నాను. ఈ సినిమా తెలుగు రీమేక్ అవకాశం వస్తే చిరంజీవి గారితో చేస్తాను. -
5 భాషల్లోకి పృథ్వీరాజ్ ‘కడువా’ మూవీ, రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తాజా చిత్రం కడువా. షాజీ కైలాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో భీమ్లా నాయక్ ఫేం సంయుక్తి మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. యాక్షన్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీని జూన్ 30 విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు పృథ్వీరాజ్ ట్వీట్ చేస్తూ కడువా విడుదల తేదీని వెల్లడించాడు. చదవండి: పూజాకు నిర్మాతలు షాక్, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట! మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అలాగే అర్జున్ అశోక్, సిద్ధిక్, అజు వర్గీస్, దిలీష్ పోతన్ తదితరలు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాగా మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో లిస్టిన్ ష్టీఫెన్, సుప్రియా మీనన్‌లు ఈ సినిమాను నిర్మించారు. జెక్స్ బిజోయ్ సింగీతం అందించాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ పోలీసు పాత్రలో అలరించానున్నాడు. #Kaduva in theatres worldwide from 30th June 2022! Lyric Video - https://t.co/TZ70Vt1ZbJ കടുവ | ಕಡುವ | కడువా | கடுவா | कडुवा pic.twitter.com/gMQkkDmEfT — Prithviraj Sukumaran (@PrithviOfficial) June 20, 2022 -
ఒక్క ఏడాదిలో ఏకంగా 20 సినిమాలు ఒప్పుకున్న స్టార్ హీరో !
Prithviraj Sukumaran Nayanthara Gold First Look Poster Released: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా విభిన్నమైన కథలతో అభిమానులను, సినీ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత వైవిధ్యం తప్పకుండా ఉంటుంది. అయ్యప్పనుమ్ కోషీయమ్, బ్రో డాడీ, జన గణ మన సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒక్క ఏడాదిలోనే 20 సినిమాలు ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఉండగా ఒక్కొక్కటి ఒక్కో ఫార్మాట్లో ఉండనుందని సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా తన కొత్త చిత్రం 'గోల్డ్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమాలో హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ఈ పోస్టర్లో చుట్టూ మనుషులతో మధ్యలో నయనతార అయోమయంగా చూస్తుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ నవ్వుతూ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం #GOLD An #AlphonsPuthran Film! 😊❤️ @puthrenalphonse @PrithvirajProd @magicframes2011 pic.twitter.com/6fROJlPkQD — Prithviraj Sukumaran (@PrithviOfficial) June 6, 2022 ఈ మూవీని పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, మ్యూజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై సుప్రియా మీనన్, లిజిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'ప్రేమమ్' మూవీ ఫేమ్ అల్ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు ఏడేళ్ల తర్వాత అల్ఫోన్స్ డైరెక్టర్‌గా తన మార్క్ చూపించనున్నారు. ఈ సినిమాను ఆగస్టు 19న విడుదల చేయనున్నారు. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు -
వ్యవస్థల తీరుపై ప్రశ్నల వర్షం.. 'జన గణ మన' రివ్యూ
టైటిల్: జన గణ మన (2022) నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడ్, మమతామోహన్ దాస్, జీఎమ్ సుందర్ తదితరులు కథ: షరీస్ మహమ్మద్ దర్శకత్వం: డిజో జోస్ ఆంటోని సంగీతం: జేక్స్ బిజోయ్ నిర్మాతలు: పృథ్వీరాజ్ సుకుమారన్, లిస్టిన్ స్టీఫెన్ ఓటీటీ విడుదల తేది: జూన్ 2, 2022 (నెట్‌ఫ్లిక్స్) విభిన్నమైన కథా కథనాలతో ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది మలయాళ సినీ ఇండస్ట్రీ. అందులోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాల ఎంపికను మెచ్చుకోక తప్పదు. నటుడిగా అయ్యప్పనుమ్ కోషియుమ్, డైరెక్టర్‌గా లూసీఫర్ తదితర చిత్రాలతో అలరించిన ఆయన తాజాగా 'జన గణ మన' సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలైనప్పటికీ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో సందడి చేస్తున్న ఈ సినిమా నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్న 'జన గణ మన' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ సబా మరియం (మమతా మోహన్ దాస్)ను రేప్ చేసి శరీరాన్ని కాల్చి చంపేశారని మీడియాలో నేషనల్ హైడ్‌లైన్ అవుతుంది. తమ ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని నిరసనకు దిగుతారు ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్. దీంతో ఆ కేసును చేధించమని ఏసీపీ సజ్జన్ కుమార్ (సూరజ్ వెంజరమూడ్)ను ఆదేశిస్తుంది ప్రభుత్వం. మరీ రంగంలోకి దిగిన ఆ ఏసీపీ ఏం చేశాడు ? ఆమెను హత్య చేయడానికి కారణమేంటి ? కారకులెవరు ? వారిని ఏ విధంగా శిక్షించాలని సమాజం కోరుకుంది ? తర్వాత ఏసీపీ ఎదుర్కొన్న పరిణామాలేమిటి ? కోర్టులో లాయర్ అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సంధించిన ప్రశ్నలు ఏంటి ? తదితర ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: సత్యమేవ జయతే.. సత్యానికి అబద్ధం ఎన్నిసార్లు అడ్డుగా నిలుచున్నా, చివరిగా కటిక చీకట్లో ఉన్న సత్యం వెలుగులోకి రాక తప్పదు అని 'జన గణ మన' సినిమా ద్వారా తెలియజేశారు. ఇది పేరుకు సినిమా అయినా ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులకు 2 గంటల 41 నిమిషాల నిదర్శనం. విద్య, న్యాయ, పోలీసు, మీడియా, రాజకీయ వ్యవస్థ ఇలా ప్రతీ అంశాన్ని తడిమారు. ఈ వ్యవస్థల ఉనికి, విశ్వసనీయతను సూటిగా ప్రశ్నించారు. సమాజంలో అవి ఎలాంటి పరిస్థితులో ఉన్నాయి, వర్ణ, కుల, మత, జాతి విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రభుత్వాలు తమ గెలుపు కోసం పరిస్థితులను ఎలా మార్చుకుంటాయి ? అందుకోసం ఏం చేస్తాయి? విద్యార్థులను ఏ విధంగా వాడుకుంటాయి? వంటి విషయాలను తెరపై చూపించి వాటన్నింటి గురించి ఆలోచింపజేసేలా సినిమా ఉంది. ఏది అబద్ధం, ఏది నిజం అనేది సమాజం ఎలా నిర్ణయిస్తుందో, ఏ దృక్కోణంతో ఆలోచిస్తుందో, ఎలా ప్రభావితమవుతుందో సమాజానికి చూపించారు. ఎవరెలా చేశారంటే ? సమాజంలో నెలకొన్న పరిస్థితులు, ప్రతి ఒక్క అంశాన్ని ధైర్యంగా చూపించిన డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనికి, ఈ సినిమా నిర్మించిన పృథ్వీరాజ్ సుకుమారన్‌కు హాట్సాఫ్ చెప్పాల్సిందే. కథ అందించిన షరీస్ మహమ్మద్‌కు, జేక్స్ బిజోయ్ సంగీతానికి ప్రశంసలు దక్కాల్సిందే. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వాళ్ల నటనతో అదరగొట్టారు. ఫస్టాఫ్‌లో సూరజ్ తనవైపు దృష్టిని ఆకర్షిస్తే, సెకండాఫ్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రేక్షకులను నిజాలతో కట్టిపడేస్తాడు. ప్రొఫెసర్ సబా మరియంగా మమత మోహన్ దాస్ సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చింది. కోర్టు సీన్లో వచ్చే సన్నివేశాలు, సినిమాలోని డైలాగ్‌లు హైలెట్‌గా నిలిచాయి. చివరిగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మాత్రమే కాదు, సమాజానికి ఓ కనువిప్పు ఈ 'జన గణ మన'. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
ప్రభాస్‌తో యాక్ట్ చేయనున్న సూపర్ స్టార్
'కెజిఎఫ్' చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సలార్'. కొన్నాళ్ల క్రితం ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ చిత్రానికి 'కెజిఎఫ్'కు సంగీతం అందించిన రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. హీరోయిన్గా శ్రుతీ హాసన్ ఆద్య రోల్ పోషిస్తోంది. ప్రముఖ నటుడు జగపతిబాబు రాజమన్నార్‌గా కనిపించనున్నాడు. ఇక తాజా సమాచారం ఏంటంటే.. ప్రముఖ దర్శకుడు, నిర్మాత, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తమ 'సలార్'లో ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారని ప్రభాస్ అధికారికంగా ప్రకటించారు. తన తాజా చిత్రం రాధేశ్యామ్ ప్రమోషన్ ఈవెంట్లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రభాస్ సమాదానం ఇచ్చారు. ఇక దానిలో భాగంగా ఓ విలేకరి 'సలార్' గురించి ప్రశ్నించగా.. సినిమా స్క్రిప్ట్‌తో పాటు తన పాత్ర కూడా పృథ్వీరాజ్‌కు ఎంతో బాగా నచ్చడంతో ఆ పాత్ర చేయడానికి వెంటనే ఒప్పుకున్నారన్నారు, కాగా పృథ్వీరాజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఇక ఆ పాత్ర చేస్తున్నందుకు గానూ పృథ్వీరాజ్‌కు ప్రభాస్ కృతజ్ణతలు తెలిపాడు. ఇక 'సలార్' చిత్రం తప్పకుండా అన్ని భాషల్లోనూ పెద్ద సక్సెస్ అవుతుందని ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్' మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న విషయం తెలిసిందే. -
తెరపైకి బిస్కెట్ కింగ్ బయోపిక్.. ప్రధాన పాత్రలో ఎవరంటే ?
Prithviraj Sukumaran New Web Series On Biscuit King Rajan Pillai: వెండితెరపై ప్రముఖుల జీవిత చరిత్రలు బయోపిక్‌లుగా వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. డర్టీ పిక్చర్ సినిమా నుంచి స్కామ్ 1992 వెబ్ సిరీస్ వరకు ఎన్నో జీవితగాథలు తెరపై, ఓటీటీల్లో సందడి చేశాయి. తాజాగా 'బిస్కెట్ కింగ్'గా పేరొందిన రాజన్ పిళ్లై జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ వెబ్ సిరీస్ రానుంది. ఈ సిరీస్‌లో మలయాళీ దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పృథ్వీరాజ్ దర్శకుడిగా బాలీవుడ్లో చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇది. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసీఫర్' (మలయాళం) చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్‌గా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ నటించిన మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోశియమ్' సూపర్ హిట్ అయింది. ఇదే సినిమాను పవన్ కల్యాణ్, రానా హీరోలుగా భీమ్లా నాయక్‌గా తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజన్ పిళ్లై ఒక వ్యాపారవేత్త. బ్రిటానియా ఇండస్ట్రీలో వాటాదారు. 1970లో సింగపూర్ కేంద్రంగా తన వ్యాపారాన్ని కొనసాగించి బిస్కెంట్ కింగ్‌గా ఎదిగారు. 1993లో సింగపూర్ వాణిజ్య వ్యవహారాల శాఖ అతనిపై విచారణ చేపట్టింది. సింగపూర్ ప్రభుత్వ సమాచారం మేరకు భారత పోలీసులు 1995 జూలై 4న కొత్త ఢిల్లీలోని ఓ హోటల్లో అరెస్ట్ చేశారు. అనంతరం తీహార్ జైలుకు పంపించారు. అనారోగ్యంతో రాజన్ పిళ్లై కస్టడీలోనే మరణించడంతో అప్పట్లో సంచలనమైంది. కె. గోవిందన్ కుట్టితో కలిసి రాజన్ సోదరుడు రామ్మోహన్ పిళ్లై 'ఏ వేస్టెడ్ డెత్: ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రాజన్ పిళ్లై' పేరుతో పుస్తకం కూడా రాశారు. 2001లో విడుదలైన ఈ పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. -
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా స్టార్ హీరో?
బాహుబలి భారీ విజయం తర్వాత ప్రభాస్ చేస్తున్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఆయన సూపర్ హిట్ మూవీ ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘సలార్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో ఎంతోమంది వివిధ భాషల్లో స్టార్ హీరోలుగా ఫేమ్ ఉన్నవారు సైతం ఇతరుల సినిమాల్లో విలన్‌గా నటించడానికి సై అంటున్నారు. సంజయ్ దత్ ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, మలయాళీ స్టార్ ఫహాద్ ఫాజిల్ ‘పుష్ప’లో విలన్‌గా నటిస్తున్నారు. ఈ తరుణంలో ‘సలార్’ మూవీలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. దీంతో టాలీవుడ్, మాలీవుడ్‌ల్లో స్టార్స్‌గా వెలుగొందుతున్న వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని ఇద్దరి ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇదేగనక నిజమైతే ఈ పాన్ ఇండియా మూవీ ఇంక బజ్ రావడం ఖాయం. చూద్దాం ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో.. చదవండి: ప్రభాస్ ‘సలార్’లో మిస్ ఇండియా మీనాక్షి చౌదరి? -
దుల్కర్‌కి సీఐడీ రామదాస్ కాల్.. అది రహస్యమన్న పృథ్వీరాజ్
ఈ మధ్య కాలంలో మూవీ ప్రమోషన్ చేసే విధానం మారిపోయింది. ఇంతకుముందు తమ సినిమాని టీవీలు, పత్రికలకి ఇంటర్వూలు ఇవ్వడం ద్వారా సినిమా ప్రచారం చేసుకునేవారు. ఇంటర్న్నెట్ వాడకం పెరిగిన ఈ తరుణంలో సోషల్ మీడియాలో వినూత్నంగా మూవీ ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా అలాంటి ప్రచారమే చేశారు మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటించిన కొత్త చిత్రం ‘భ్రమమ్’. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’కి రిమేక్‌గా వస్తున్న ఈ చిత్రం గురువారం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాను ట్విట్టర్లో ప్రమోట్ చేశాడు హీరో దుల్కర్ సల్మాన్. దానిలో భాగంగా అక్టోబర్ 6న ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో దుల్కర్, పృథ్వీరాజ్‌కి ఫోన్ చేసి ‘నాకు సీఐడీ రామదాస్ ఎందుకు ఫోన్ చేశారు? ఆయనకు ఏం కావాలి? నా నెంబర్ నువ్వే ఇచ్చావా?’ అని అడగగా.. నిజం తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అది సీక్రెట్’ అంటూ మరో హీరో బదులిచ్చాడు. రాశీఖన్నా హీరోయిన్గా చేస్తున్న ‘భ్రమమ్’లో మమతామోహన్‌దాస్ కీలకపాత్రలో నటించనుంది. అయితే దుల్కర్ సల్మాన్, కీర్తీ సురేశ్ లీడ్‌రోల్ చేసిన ‘మహానటి’లో జెమినీ గణేశన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. చదవండి: దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా హను-మాన్ ఫస్ట్‌లుక్ What did CID Ramadas want from me @PrithviOfficial and did you give him my number? pic.twitter.com/5Xs2EAUOlP — dulquer salmaan (@dulQuer) October 6, 2021 -
ప్రముఖ మలయాళ నటుడు కన్నుమూత
తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నటుడు రిజబావా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 55 ఏళ్లు. కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీకి సంబంధించిన చికిత్స తీసుకుంటూ సోమవారం చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా 19వ దశాబ్దంలో మలయాళ చిత్రసీమలో ప్రతినాయకుడిగా పలు పాత్రలు పోషించి మంచిపేరు సంపాదించారు. రిజబావా మృతిపట్ల నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, అక్షయ ప్రేమ్‌నాథ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. 1990లో షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన డాక్టర్ పశుపతి అనే చిత్రంలో రిజాబావా తొలిసారిగా నటించారు. అదే ఏడాది వచ్చిన కామెడీ థ్రిల్లర్ ‘ఇన్ హరిహర్ నగర్’లో జాన్ హొనై పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడ నుండి ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. దాదాపు 150 చిత్రాలలో నటించిన రిజబావా పలు టీవీ సీరియల్స్ లోనూ చేశారు. చివరగా ఆయన మమ్ముట్టి నటించిన ‘వన్’ చిత్రంలో నటించారు. చదవండి: ఫ్యాషన్ డిజైనర్‌తో ‘తుపాకీ’ విలన్ ఎంగేజ్మెంట్, ఫొటోలు పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! రిజబాబా కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఆయన సినిమాల్లో నటించడం లేదు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. -
ఒకే ఫ్రేమ్‌లో మోహన్‌లాల్, మల్లిక.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
‘ఒకే ఫ్రేమ్‌లో గొప్ప నటుడిని, గొప్ప తల్లిని చూడడం, దానికి నేను దర్శకత్వం వహించడం ఎంతో ఆనందంగా ఉంది’అని సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు మలయాళ ప్రముఖ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజాగా చిత్రం ‘బ్రో డాడీ’. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ తల్లి మల్లిక సుకుమారన్, మళయాళ సూపర్‌స్టార్ మెహన్‌లాల్ నటిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫోటోని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ పై వ్యాఖ్యలు చేశాడు డైర్టెర్ పృథ్వీరాజ్. దీనికి "చివరికి ఇది జరగడం ఆనందంగా ఉంది" అంటూ పృథ్వీరాజ్ భార్య సుప్రియ కామెంట్ పెట్టారు. (చదవండి: బిగ్‌బాస్: ఐదో సీజన్లో కీలక మార్పులు.. సక్సెస్‌పై అనుమానాలెన్నో!) కాగా, పృథ్వీరాజ్ తల్లిదండ్రులు లేట్ సుకుమారన్, మల్లిక ఇద్దరు మళయాళ సినీ పరిశ్రమలో గుర్తింపుపొందిన నటీనటులే. అంతేకాకుండా గతంలో మెహన్‌లాల్ నటించిన లూసిఫర్ సినిమాలో పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలో నటించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న "బ్రో డాడీ"లో కళ్యాణి ప్రియదర్శన్, మీనా వంటి గుర్తింపు పొందిన నటీనటులతో పాటు పృథ్వీరాజ్ సైతం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) -
వర్చువల్ వరం!
మనకు తెలియని సరికొత్త ప్రపంచంలోకి, ఎప్పుడూ చూడని ప్రదేశంలోకి తీసుకెళ్లి ప్రేక్షకులను నోరెళ్లబెట్టేలా చేయడం సినిమాకు కొత్త కాదు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా తీసే విధానం మారుతూ వస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఒక్క యాక్టరే ఇద్దరుగా కనబడితే సంబరపడిపోయాం. ఆ తర్వాత గ్రాఫిక్స్ మాయాజాలం చూశాం. 3డీ సినిమాలు వచ్చాయి. లైవ్ యాక్షన్ టెక్నాలజీతో సినిమాలు వచ్చాయి. మారుతున్న సాంకేతికత, ప్రేక్షకుడి అభిరుచి – సినిమాను కొత్త విధానాలు అనుసరించేలా చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’తో మన దేశంలో సినిమా రూపొందనుంది. కరోనా వల్ల ఏర్పడ్డ పరిస్థితుల్లో ఈ టెక్నిక్కే భవిష్యత్తు కాబోతోందా? వేచి చూడాలి. ఇండియాలో ఇదే తొలిసారి! మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రాన్ని పూర్తిగా ‘వర్చువల్ ప్రొడక్షన్’ పద్ధతిలో చిత్రీకరించనున్నట్టు ప్రకటించారు. ఈ పద్ధతిలో తెరకెక్కనున్న పూర్తి స్థాయి తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి కాన్సెప్ట్–డైరెక్షన్ గోకుల్ రాజ్ భాస్కర్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పృథ్వీరాజ్ నిర్మాణ సంస్థ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌తో పాటు మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. టైటిల్ ఇంకా ప్రకటించని ఈ చిత్రం 5 భాషల్లో (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) విడుదల కానుంది. ‘‘సినిమాలు తెరకెక్కించడంలో ఇదో కొత్త చాప్టర్. పరిస్థితులు మారుతున్నప్పుడు, కొత్త ఛాలెంజ్‌లు ఎదురవుతున్నప్పుడు మనం కూడా కొత్త పద్ధతులను అనుసరించాలి. ఈ కథ త్వరగా మీ అందరికీ చెప్పాలనుంది’’ అని పేర్కొన్నారు పృథ్వీరాజ్. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఏంటీ వర్చువల్ ప్రొడక్షన్? నిజమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించలేనప్పుడు గ్రీన్ మ్యాట్ (గ్రీన్ స్క్రీన్) ఉపయోగించి చిత్రీకరణ జరుపుతారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా అక్కడే (నిజమైన లొకేషన్లో) చిత్రీకరించినట్టు మారుస్తారు. ప్రస్తుతం సినిమాల్లో కొన్ని సన్నివేశాలను ఇలానే తీస్తున్నారు. దీనితో వచ్చిన చిక్కేంటి? అంటే పోస్ట్ ప్రొడక్షన్ అయ్యే వరకు ఆ సన్నివేశం ఎలా వస్తుందో ఎవ్వరికీ పక్కాగా తెలియదు. సరిగ్గా కుదరకపోతే ప్రేక్షకుడి పెదవి విరుపులు వినాల్సి వస్తుంది. వర్చువల్ ప్రొడక్షన్ విషయానికి వస్తే.. సినిమా మొత్తం స్టూడియోలోనే పూర్తి చేయొచ్చు. ఇది పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది పెద్ద ప్లస్ పాయింట్. లొకేషన్స్ కోసం అటూ ఇటూ తిరిగే పని పూర్తిగా తగ్గిపోతుంది. నటీనటులందరూ గ్రీన్ మ్యాట్ ముందే నటిస్తారు. 3డీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల నిజమైన లొకేషన్లో ఉన్నభావన కలుగుతుంది. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడే సీన్ ఎలా ఉండబోతోందో దర్శకుడు మానిటర్ లో చూసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్‌తో పెద్దగా పని ఉండదు. ఈ టెక్నాలజీ వల్ల వినూత్న కథలకు మరింత ఆస్కారముంటుంది. పండోరా గ్రహం టెక్నిక్ అదే ఆల్రెడీ హాలీవుడ్లో ‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’తో సినిమాలు తెరకెక్కుతున్నాయి కూడా. జేమ్స్ కామెరూన్ ఈ టెక్నాలజీని ఉపయోగించే ‘అవతార్’ని (2019) సృష్టించగలిగారు. ఈ సినిమాను మొత్తం వర్చువల్ ప్రొడక్షన్ ఉపయోగించే పూర్తి చేశారు. ఈ చిత్ర కథాంశం ‘పండోరా’ అనే గ్రహంలో జరుగుతుంది. అదంతా ఊహాజనిత ప్రదేశం. దానికి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్స్ కూడా ఈ టెక్నాలజీతో పాటు మరింత సాంకేతికతతో తెరకెక్కుతున్నాయి. ఇదే టెక్నాలజీతో ‘లయన్ కింగ్, రెడ్ ప్లేయర్ వన్’ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్స్ జరగడమే పూర్తిగా తగ్గిపోయింది. పరిస్థితులు ఎప్పుడు మామూలుగా మారుతాయో తెలియదు. మళ్లీ ఎప్పటిలా సినిమా చిత్రీకరణలు చేయగలమా? లేదా? అనే చిన్న సందేహం చాలామందిలో ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎదురయ్యే ఛాలెంజ్‌లను ఎదుర్కొని సినిమాలు తీయడానికి ఇలాంటి కొత్త పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. ఈ కొత్త పద్ధతులు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వలేకపోతే మాత్రం ప్రయత్నం వృథా అవుతుంది. అందుకే ప్రేక్షకుడిని మెప్పించేలా సినిమా ఉండాలి.. అలాగే నిర్మాతకు నాలుగు డబ్బులు మిగలాలి. అప్పుడే ‘వర్చువల్’లాంటి టెక్నాలజీలు వరం అవుతాయి. -
ఎట్టకేలకు ఇంటికి చేరుకున్న నటుడు
మలయాళ సినీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు. లాక్‌డౌన్‌తో రెండు నెలల ఎడబాటు,14 రోజుల క్వారంటైన్ అనంతరం శనివారం తన కుటుంబంతో కలిసిపోయారు. ఇంటికి చేరుకోగానే తన భార్య సుప్రియా మీనన్, గారాల కూతురు అలంకృతాతో దిగిన ఫ్యామిలీ ఫోటోను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘మళ్లీ ఒకటయ్యాం’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలో ఇన్ని రోజులు తన కుటుంబాన్ని మిస్ అయినా బాధ.. ప్రస్తుతం కుటుంబాన్ని చేరకున్న ఆనందపు క్షణాలు అన్నీ తన కళ్లలో కొట్టొచ్చిన్నట్లు కన్పిస్తున్నాయి. (ఆ మధుర క్షణాలు.. చాలా మిస్సవుతున్నా) ‘ఆదుజీవితం’ షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లిన నటుడు పృథ్వీరాజ్, దర్శకుడు బ్లెస్సీతో పాటు 58 మంది చిత్ర బృందం లాక్డౌన్ కారణంగా జోర్డాన్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల తర్వాత భారత్ చేపట్టిన వందే భారత్ మిషన్‌లో భాగంగా మే 22న ప్రత్యేకం విమానంలో భారత్ తిరిగొచ్చారు. అనంతరం కేరళకు చేరుకున్న వీరందరిని 14 రోజులుపాటు క్వారంటైన్లో పెట్టారు. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా పృథ్వీ తన ట్విటర్లో షేర్ చేశారు. ఈ మూడు నెలలు తన భార్య, కూతురిని చాలా మిస్ అవుతున్న సంగతి, తన క్వారంటైన్‌కు సంబంధించిన విషయాలన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. View this post on Instagram Reunited 👨👩👧 ❤️ A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) on Jun 5, 2020 at 6:26am PDT View this post on Instagram Did a COVID-19 test and the results are negative. Will still be completing quarantine before returning home. Stay safe and take care all 😊 A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) on Jun 2, 2020 at 9:24pm PDT View this post on Instagram My 7 days of institutional quarantine ends today. Now off to the next 7 days of home quarantine. A huge thanks to @oldharbourhotel and its extremely well trained staff for the hospitality and care. PS: To all those who are going to or already in home quarantine, remember..going home doesn’t mean the end of your quarantine period. Do abide strictly by all quarantine regulations and make sure no person belonging to the high risk population group as stipulated by the authorities is at home. @iamedgarpinto @kashiartcafe A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) on May 29, 2020 at 2:55am PDT View this post on Instagram BACK! #OffToQuarantineInStyle A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) on May 21, 2020 at 10:59pm PDT -
ఇంకో వారం తప్పదేమో: నటుడి భార్య
‘‘ఆ ప్రయాణాలను మిస్సవుతున్నా! అంతకు మించి నిన్ను చూడకుండా ఉండలేకున్నా! ఇంకో వారం దాకా ఎదురుచూడక తప్పదేమో కదా’’అంటూ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సతీమణి సుప్రియా మీనన్ భర్తపై ప్రేమను చాటుకున్నారు. కరోనా తమ మధ్య తెచ్చిన ఎడబాటు త్వరలోనే ముగిసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదు జీవితం చిత్ర షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లిన పృథ్వీరాజ్ సహా ఇతర యూనిట్ సభ్యులు కరోనా లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఇటీవలే వీరంతా కేరళ చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా చిత్ర బృందం మొత్తం క్వారంటైన్లో ఉన్నారు.(‘ఇప్పుడే కాదు.. ఎప్పటికీ మనం కలిసే ఉంటాం’) ఈ నేపథ్యంలో దాదాపు రెండు నెలలుగా విరహ వేదనలో మునిగిపోయిన పృథ్వీరాజ్ భార్య సుప్రియతో గడిపిన ఆనంద క్షణాలను గుర్తుచేసుకుంటూ ఓ పాత ఫొటోను గురువారం షేర్ చేశారు. ‘‘జనవరి 2020లో మా ప్రయాణం! మౌంట్ బ్లాంక్ వెళ్తున్నపుడు, స్విట్జర్లాండ్/ఫ్రాన్స్ సరిహద్దులో.. కారు వెనుక భాగంలో గంటల తరబడి విరామం తీసుకున్న మధుర క్షణాలు. మున్ముందు ఇలాంటి అనుభవాలు మరెన్నో ఉంటాయి అనుకున్నాం! త్వరలోనే అంతా నార్మల్ అయిపోవాలని కోరుకుంటున్నా. పరిస్థితులు యథాస్థితికి వచ్చి.. ప్రయాణీకులు తమకిష్టమైన, తాము ప్రేమించే పనులు చేసే వీలు కలగాలి’’అని క్యాప్షన్ జతచేశారు. ఇక భర్త పోస్టుకు సుప్రియ పైవిధంగా తన స్పందన తెలియజేశారు. (ప్రేయసిని పెళ్లాడిన నటుడు) View this post on Instagram Throwback to our cross country drive in Jan 2020 @supriyamenonprithviraj ! Enroute Mont Blanc, taking a break from the long hours behind the wheel at the Switzerland/France border. Had such different ideas about the year ahead back then! Hopefully, the world will come back to normal soon, and travellers and explorers will be back to doing what they love best! A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) on May 28, 2020 at 12:46am PDT -
2 నెలల తర్వాత ఇండియాకు పృథ్వీరాజ్
కొచ్చి : ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, ఆదు జీవితం చిత్ర బృందం ఎట్టకేలకు కేరళ చేరుకున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా జోర్డాన్‌లో చిక్కుకున్న వీరు శుక్రవారం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ సతీమణి సుప్రియ మీనన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. దీంతో అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని ప్రస్తుతం క్వారంటైన్‌కు తరలించారు. కాగా, ఆదుజీవితం చిత్రం షూటింగ్ కోసం పృథ్వీరాజ్, దర్శకుడు బ్లెసీతోపాటు 58 మంది సభ్యులతో కూడిన చిత్రబృందం జోర్డాన్‌కి వెళ్లింది. అయితే కరోనా కట్టడిలో భాగంగా జోర్డాన్‌లో మార్చి 16న లాక్డౌన్ విధించారు. దీంతో చిత్రబృందం ఇండియాకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తమను ఇండియాకు తీసుకెళ్లాల్సిందిగా చిత్ర దర్శకుడు కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్ చాంబర్‌కు విజ్ఞప్తి చేశారు. తమ పరిస్థితి అంతగా బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో వందే భారత్ మిషన్‌లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా విమానంలో వీరు ఢిల్లీ మీదుగా కొచ్చి చేరుకున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత స్వదేశంలో కాలుమోపారు. ‘దాదాపు మూడు నెలల తర్వాత పృథ్వీరాజ్, ఆదుజీవితం బృందం కేరళకు చేరుకుంది. నిబంధనల ప్రకారం వారిని క్వారంటైన్‌కు తరలించారు. చాలా కాలం నిరీక్షణ తర్వాత చివరకు వారు స్వస్థలాలకు చేరుకున్నారు. ఇందుకు సహకరించిన అధికారులక కృతజ్ఞతలు. మా కోసం ప్రార్థించిన అభిమానులకు, శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు. తన నాన్న వచ్చాడని ఆలీ సంతోషపడుతోంది. రెండు వారాల క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత నాన్నను కలవబోతుంది’ అని సుప్రియ పేర్కొన్నారు. -
‘ఇప్పుడే కాదు.. ఎప్పటికీ మనం కలిసే ఉంటాం’
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ రోజు(శనివారం) తొమ్మిదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సందర్భంగా భార్య సుప్రీయ మీనన్‌కు పృథ్వీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే పృథ్వీరాజ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ‘ఆదుజీవితం’’ సినిమా షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లిన ఆయన లాక్డౌన్ కారణంగా చిత్ర యూనిట్‌తో సహా అక్కడే చిక్కుకుపోయారు. ఈ ప్రత్యేక రోజున పృథ్వీరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ... ‘9 సంవత్సరాలు. ఇప్పుడే కాదు. ఎప్పటికీ మనం కలిసే ఉంటాం’ అంటూ భార్య మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు. (లాక్డౌన్.. 9.30 గంటలు బెడ్‌పైనే స్టార్ హీరో) View this post on Instagram 9 years ❤️ Apart for now..together forever! #LoveInTheTimeOfCorona A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) on Apr 24, 2020 at 11:43am PDT అలాగే సుప్రియ కూడా భర్త పృథ్వీకి పెళ్లి రోజు విషెస్ తెలిపారు. ‘9వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ తొమ్మిదేళ్లలో మొదటిసారి మనం పెళ్లి రోజున వేరువేరుగా ఉన్నాం. త్వరగా వచ్చి విషెస్ చెబుతారని మీ కోసం ఎదురు చూస్తున్నాను’. అంటూ పెళ్లినాటి ఫోటోను షేర్ చేశారు. కాగా పృథ్వీరాజ్ తొమ్మిదేళ్ల క్రితం కేరళలోని పాలక్కాడ్‌లో సుప్రీయను వివాహం చేసుకున్నారు. వీరికి 2014 సెప్టెంబర్ 8న కూతురు అలంకృత జన్మించింది. (కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ? ) View this post on Instagram Happy 9th Anniversary @therealprithvi! First time in 9 years that we are spending the day apart! But what do?! Waiting for you to come back soon and make this up to me! #LoveInTheTimesOfCorona#9DoneForeverToGo 🧿 A post shared by Supriya Menon Prithviraj (@supriyamenonprithviraj) on Apr 24, 2020 at 11:51am PDT -
హిట్ సినిమా హక్కులు కొన్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రేక్షకుల ముందు వచ్చిన నేపథ్యంలో ఆయన తర్వాతి సినిమా ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. కొరటాల శివ దర్శకత్వంలో ఇంతకుముందే సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమా రీమేక్ హక్కులను కూడా చిరంజీవి సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్లో భాగంగా ఇటీవల చిరంజీవి కేరళలో పర్యటించారు. పృథ్విరాజ్ నటన అంటే తనకు చాలా ఇష్టమని, సైరాలో నటించమని ఆయనను కోరినట్టు ఈ సందర్భంగా చిరంజీవి వెల్లడించారు. సైరాలో నటించలేకపోయినందుకు పృథ్విరాజ్ వినమ్రంగా సారీ చెప్పారు. ‘చిరంజీవి రత్నం లాంటి మనిషి. ఆయనతో కలిసి సైరా ప్రచారంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. మానవత్వం, మంచితనం మూర్తీభవించిన మనిషి ఆయన. లూసిఫర్ సినిమా రీమేక్ హక్కులు మీరు కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. సైరాలో నటించేందుకు మీరిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేనందుకు మన్నించాలి’ అంటూ పృథ్విరాజ్ ట్వీట్ చేశారు. లూసిఫర్ సినిమా మలయాళంలో సంచలన విజయం సాధించింది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మురళీ గోపీ కథను పృథ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు. కేరళలో రాజకీయ అనిశ్చితి సందర్భంగా ఓ కుటుంబంలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో మోహన్‌లాల్ రాజకీయ నాయకుడిగా నటించారు. లూసిఫర్ విజయవంతం కావడంతో ‘ఎంపురాన్’ పేరుతో దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. మూడో పార్ట్ కూడా ఉంటుందని సమాచారం. (చదవండి: సైరా హిట్.. మెగా ఫ్యామిలీ సంబరం) With #Chiranjeevi sir at the Kerala launch of #SyeraNarasimhaReddy What an absolute gem of a man! Humility and grace personified. I’m thrilled that you bought the rights to #Lucifer and will forever be sorry that I couldn’t take up your offer to be part of #SNR sir! 🙏 pic.twitter.com/thGsUoRLAG — Prithviraj Sukumaran (@PrithviOfficial) September 30, 2019 -
కల నిజమైంది
ప్రముఖ మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాతృభాషలో మాత్రమే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి, మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. గాయకుడిగా కూడా మలయాళంలో పేరుంది. ఇప్పుడు మరో కొత్త అడుగు వేశారాయన. సినీ నిర్మాతగా మారారు. ‘పృథ్వీరాజ్ ప్రొడక్షన్ హౌస్’ను స్టార్ట్ చేసినట్లు ఆయన ప్రకటించారు. ‘‘మా కొత్త కలను నిజం చేసుకోవడానికి నేను, నా భార్య సుప్రియ ఏడాది నుంచి కష్టపడుతున్నాం. పృథ్వీరాజ్ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశామని చెప్పడానికి ఆనందపడుతున్నాను. ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేయడానికి సంవత్సరం టైమ్ ఎందుకు పట్టింది? సమ్‌థింగ్ స్పెషల్‌గా ఏం చేయబోతున్నాం? అనే మరికొన్ని ప్రశ్నలకు త్వరలోనే మేము అనౌన్స్ చేయబోయే ప్రాజెక్ట్స్ ద్వారా సమాధానాలు దొరుకుతాయి. నా వంతుగా మలయాళ ఇండస్ట్రీకి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. న్యూ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసే క్రమంలో వ్యాపారవేత్త షాజి నడేశన్, కెమెరామేన్ సంతోష్ శివన్ ఎంతో సహకరించారు. నేను నిర్మాతగా బుడి బుడి అడుగులు వేయాలనుకున్నప్పుడు నా వేలు పట్టుకుని, నేను ప్రొడక్షన్ హౌస్ ప్రకటించేవరకూ ఈ ఇద్దరూ నాతో ఉన్నారు. వారికే కాదు సినిమా అంటే ఏంటో నేను తెలుసుకునే ప్రయాణంలో నాకు తోడుగా ఉండి, సహకరించిన అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు పృథ్వీరాజ్. -
ఆనందం ఎంతో ఆనందం
...అంటున్నారు అమలా పాల్. మలయాళ చిత్రం ‘ఆడు జీవితం’లో హీరోయిన్గా ఎంపిక అవ్వడం పట్ల ఈ మాలీవుడ్ బ్యూటీ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘డైరెక్టర్ బ్లెసీ ‘ఆడు జీవితం’ లో సైనూ పాత్రలో కనిపించనున్నాను. ఈ విజువల్ వండర్‌లో ఫృథ్వీరాజ్, లెజెండ్ ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టీ వంటి మాస్టర్స్‌తో కలిసి పని చేస్తున్నందుకు ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ హానర్డ్. కచ్చితంగా ప్రపంచ సినిమా పై ఓ మార్క్ చూపిస్తుంది’’ అని పేర్కొన్నారు అమలా పాల్. ఆమె ఇంతలా ఎగై్జట్ అవ్వడానికి కారణం ఏంటీ అంటే ఈ సినిమాలోని విశేషాలే. ఉద్యోగం కోసం సౌదీ వెళ్లి మిస్ అయిన నజీబ్ మొహమద్ అనే వ్యక్తి లైఫ్ ఇన్సిడెంట్స్తో బైన్యామిన్ రాసిన ఫేమస్ మలయాళీ నవల ‘ఆడు జీవితం’ ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు బ్లెస్సీ. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మాలీవుడ్ సినిమాకు సంగీతం సమకూర్చనున్నారు. 1992లో వచ్చిన మోహన్‌లాల్ ‘యోధ’నే ఏఆర్ రెహమాన్ ఫస్ట్ అండ్ లాస్ట్ మలయాళ సినిమా. ‘ఆడు జీవితంలో’ హీరోగా, నజీబ్ మొహమద్ పాత్రలో నటిస్తున్న ఫృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ 2 ఇయర్స్ డేట్స్ ఇచ్చేశారట. ఈ మెగా బడ్జెట్ సినిమాను 3డీలో రూపొందిస్తున్నారు. -
పృధ్విరాజ్ హీరోగా ‘తేజాభాయ్’ స్టిల్స్