పెళ్ళైతే ఓ కిక్కు, అదే పెళ్ళవ్వాలంటే పెద్ద చిక్కు అన్న భావంతో అల్లుకున్న హాస్యభరిత చిత్రం గురువాయూర్ అంబలనడియాల్. పృధ్విరాజ్, బసిల్ జోసెఫ్, నిఖిల్ విమల్ వంటి భారీ తారాగణంతో నిర్మించిన ఈ చిత్రం హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా మళయాళ మాతృక అయినా తెలుగు డబ్బింగ్ తో హాట్ స్టార్ లో చూడవచ్చు. ఓ సున్నితమైన పాయింట్ తో ఆద్యంతం వినోదభరితం ఈ సినిమా.
కథా పరంగా దుబాయ్ లో ఉంటున్న విను రామచంద్రన్ కు కేరళ లో ఓ సంబంధం కుదురుతుంది. అది కూడా గురువాయుర్ టెంపుల్ లో పెళ్ళి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. ఎక్కడైనా పెళ్ళి కుదిరితే పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు ఇష్టపడి మాట్లాడుకుంటారు. కాని ఈ కథలో పెళ్ళికూతురి అన్నతో పెళ్ళికొడుకు ప్రేమగా ఫోన్ లో మాట్లాడుతుంటాడు. ఇక్కడ పెళ్ళికూతురు అన్న ఆనందన్ పాత్రలో పృధ్విరాజ్ పోషించారు. పెళ్ళి కోసం ఎన్నో ఆశలతో ఇండియాలో అడుగుపెట్టిన విను రామచంద్రన్ పెళ్ళి కూతురి అన్నను చూడడానికి వాళ్ళ ఇంటికి వెళతాడు.
అయితే సదరు అన్న గారి భార్య ఈ పెళ్ళికొడుకు మొదట ప్రేమించిన అమ్మాయని తెలుస్తుంది. ఆ షాక్ తిన్న పెళ్ళికొడుకు కి ఏ విధమైన సమస్యలు ఎదుర్కున్నాడు, ఈ విషయం తెలిసిన పెళ్ళికొడుకు అన్న ఎలా స్పందించాడు, అసలు ఆ పెళ్ళి అయిందా లేదా అన్నది హాట్ స్టార్ ఓటిటి లోనే చూడాలి. వీకెండ్ కి ఓ మంచి కాలక్షేపభరితమైన సినిమా గురువాయూర్ అంబలనడియాల్. గో వాచ్ ఇట్.
-ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment