basil joseph
-
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళంలో ఎప్పటికప్పుడు క్రేజీ సినిమాలు వస్తూనే ఉంటాయి. అవి ఓటీటీలోకి వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి. అలా ఇప్పుడు మనోళ్లని ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్న మూవీ 'ప్రావింకూడు షప్పు'. ఇప్పుడు దీని స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆ వార్తల్ని నమ్మొద్దు.. 'కన్నప్ప' మూవీ టీమ్)రీసెంట్ టైంలో మలయాళంలో వరస హిట్స్ కొడుతున్న నటుల్లో బాసిల్ జోసెఫ్ ఒకడు. ఇతడు పోలీస్ గా నటించిన లేటెస్ట్ మూవీ 'ప్రావింకూడు షప్పు'. షౌబిన్ సాహిర్, చెంబన్ వినోద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జనవరి 16న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఏప్రిల్ 11 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 'ప్రావింకూడు షప్పు' విషయానికొస్తే.. ఓ కల్లు దుకాణ యజమానిని ఎవరో చంపేస్తే.. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆ రోజు రాత్రంతా షాపులోనే 11 మంది తాగుతూ పేకాటాడుతూ ఉంటారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అక్కడ ఉన్న ఆ 11 మందిని అతడు ప్రశ్నిస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)A mystery too twisted, a ride too fun. Get ready for mystery and madness with Pravinkoodu Shappu streaming from April 11 on Sony LIVWatch #PravinkooduShappu On Sony Liv From 11 April#PravinkooduShappuOnSonyLIV pic.twitter.com/3urUrZGcgx— Sony LIV (@SonyLIV) April 1, 2025 -
‘పొన్ మాన్’ మూవీ రివ్యూ : అప్పు ఎప్పుడైనా నిప్పే!
ఈ రోజుల్లో అప్పు చేయని వాళ్ళు చాలా తక్కువ. మరీ మధ్యతరగతి వాళ్ళు అవసరాల కోసం అప్పులకై తిప్పలు పడతారు. ఒకవేళ అప్పు దొరికినా దానిని తీర్చడం మరో ఎత్తు. ఈ కసరత్తు మీదనే పొన్ మాన్(ponman Movie) సినిమా రూపుదిద్దుకుంది. ఇదో మళయాళ సినిమా. జియో హాట్ స్టార్ వేదికగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యమవుతుంది. జ్యోతిష్ శంకర్ దీనికి దర్శకత్వం వహించారు. ప్రముఖ మళయాళ నటుడు బసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఓ ఫ్యామిలీ డ్రామా. కాని జీవితంలో నగదు లేదా డబ్బు రూపేణా అప్పు చేసిన ప్రతివారు చూడవలసిన సినిమా. అలా అని ఇదేదో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు, ఓ ఫ్యామిలీ థ్రిల్లింగ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఇక పొన్ మాన్ కథ విషయానికొస్తే కేరళ రాష్ట్రంలోని తీర ప్రాంతమైన కొల్లాంలో బ్రూనో అనే వ్యక్తి తో ఈ కథ మొదలవుతుంది. చెల్లెలు స్టెఫీ, తల్లితో పాటు ఓ చిన్న కుటుంబం బ్రూనోది. సంపాదన లేకున్నా రాజకీయలపై ఇష్టంతో ఓ పార్టీలో చేరతాడు బ్రూనో. తన నోటి దురుసుతనం వల్ల పార్టీ నుంచి సస్పెండ్ కూడా అవుతాడు. బ్రూనో తల్లి స్టెఫీకి త్వరగా పెళ్ళి చేయాలన్న తాపత్రయంలో పక్క ఊరిలోని మరియానోతో 25 సవర్ల బంగారం కట్నకానుకాలు ఇచ్చే విధంగా సంబంధం కుదురుస్తుంది. దానికి గాను అజేష్ అనే బంగారు బ్రోకర్ ను సంప్రదించి పెళ్ళికి ముందు బంగారం తీసుకుని పెళ్ళిలో వచ్చే చదివింపులతో తిరిగి నగదు రూపేణా అప్పు తీర్చేవిధంగా ఏర్పాటు చేస్తుంది. అజేష్ ఇచ్చిన నగలతో స్టెఫీ, మరియానో పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాని అనుకోకుండా అంత డబ్బులు రావు. దీనితో అజేష్ తానిచ్చిన బంగారం కోసం పెళ్ళి వారితో పాటు స్టెఫీ అత్తగారింటికి వెళతాడు. స్టెఫీ మరియానో కరుడుగట్టిన రౌడీ. స్టెఫీ వేసుకున్న బంగారం అప్పుకు తెచ్చిందన్న విషయం అత్తవారింట్లో ఎవరికీ తెలియదు. ఈ సమయంలో అజేష్ తన బంగారం స్టెఫీ నుండి తీసుకోగలడా లేదా అన్నది మాత్రం పొన్ మాన్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం థ్రిల్లర్ జోనర్ తో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తుంది. అప్పు తీసుకునే ప్రతి వాళ్ళూ తీసుకునేటపుడు బరువుగాను తిరిగి ఇచ్చేటపుడు బాధ్యతగాను ఉంటే ఏ సమస్యా ఉండదు. అలా కాని పక్షంలో ఈ సినిమాలో చూపిన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వర్త్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. -
ఓటీటీకి మిస్టరీ థ్రిల్లర్.. మరో సూక్ష్మదర్శిని కానుందా?
ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది ఓటీటీకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సూక్ష్మదర్శినికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ కీలక పాత్రలో నటించారు. ఈ మలయాళ థ్రిల్లర్ మూవీకి ఓటీటీలో ఊహించని స్పందన వచ్చింది. దీంతో ఓటీటీలో మలయాళ చిత్రాలకు ప్రేక్షకుల విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు.ఈ నేపథ్యంలోనే మరో మిస్టరీ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బసిల్ జోసెఫ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ప్రవీణ్ కూడు షప్పు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీని డార్క్ కామెడీ మర్డర్ మిస్టరీగా శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 11 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ప్రవీణ్ కూడా షప్పు మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ విషయాన్ని సోనీలివ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సీనియర్ నటి రేవతి కీలక పాత్రలో కనిపించారు.Get ready for a dark comedy that unfolds the chaos-#PravinkooduShappu trailer out now! #PravinkooduShappu #PravinkooduShappuOnSonyLIV@basiljoseph25 @IamChandini #SoubinShahir #ChembanVinodJose #ShyjuKhalid #Chandini #SreerajSreenivasan pic.twitter.com/t8fMtcHKbt— Sony LIV (@SonyLIV) March 14, 2025 -
ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళ డార్క్ కామెడీ
మలయాళ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొత్త మూవీ ఓటీటీలో రిలీజ్ కావడం లేటు. మనోళ్లు చూసేస్తుంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఇప్పుడు క్రేజీ డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అధికారికంగా తేదీ కూడా ప్రకటించారు.రీసెంట్ టైంలో మలయాళ ఓటీటీల సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు బాసిల్ జోసెఫ్. స్వతహాగా ఇతడు దర్శకుడే కానీ ఈ మధ్య హీరో తరహా పాత్రలు పోషిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. అలా రీసెంట్ గా 'పొన్ మ్యాన్' అనే మూవీతో వచ్చాడు. (ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))జనవరి 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. డార్క్ కామెడీ కథ కావడం, బాసిల్ నటన దీనికి ప్లస్ అని చెప్పొచ్చు. ఇప్పుడీ చిత్రాన్ని హాట్ స్టార్ లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులోనూ రిలీజయ్యే అవకాశముంది.'పొన్ మ్యాన్' విషయానికొస్తే హీరో పేరు అజేష్ (బాసిల్ జోసెఫ్). పెళ్లిళ్ల కోసం బంగారాన్ని అద్దెకిస్తుంటాడు. తద్వారా చదివింపులుగా వచ్చిన డబ్బుల్ని తీసుకుంటూ ఉంటాడు. అలా ఓసారి ఓ అమ్మాయి కుటుంబానికి 25 సవర్ల బంగారం ఇస్తాడు. కానీ వాళ్లేమో తిరిగి 13 సవర్లు మాత్రమే ఇస్తారు. దీంతో గొడవ జరుగుతుంది. మరి చివరకు ఇది ఎక్కడ ముగిసిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు) -
ఇరుగుపొరుగు చూస్తున్నారు జాగ్రత్త!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం సూక్ష్మదర్శిని ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉందీ అంటే అది రహస్యమే. కానీ మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాల్సిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందనివాళ్లు బయటపెడితే అది పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపోరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే ‘సూక్ష్మదర్శిని’(sookshmadarshini). ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. ‘సూక్ష్మదర్శిని’ ఓ మళయాళ సినిమా.హాట్ స్టార్‌లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే... ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఓ ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా చేరతాడు. తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు మాన్యుల్. తన ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది.మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలు మాత్రం ‘సూక్ష్మదర్శిని’లో చూస్తే తెలిసిపోతుంది. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి. జతిన్. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్(Nazriya Nazim), బాసిల్ జోసెఫ్(Basil Joseph) వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆఖరుగా ఒక్క మాట... ఇరుగు పోరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్‌ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్. – ఇంటూరు హరికృష్ణ -
Vaazha Review : పిల్లలకో పాఠం.. పెద్దలకో గుణపాఠం
ఈ సినిమా తప్పనిసరిగా తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడవలసిన సినిమా. మనిషి జీవితంలో యవ్వన దశకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలకు మాత్రం బళ్ళో, ఊళ్ళో సరదాగా స్నేహితులతో గడిచిపోయే స్థితి అది. కాని తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లల యవ్వన దశ అనేది కత్తి మీద సాములాంటిదే. పిల్లల భవిష్యత్తు పై ఆశతో అతి గారాబంగా తమ పిల్లలను చూసుకునే వారు కొందరైతే, తమ పిల్లలు దేనికీ పనికిరారని మరికొందరు వారి యవ్వన దశను వారిగనుణంగా అనుభవించనీయకుండా చేస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికే ఈ సినిమా వాఝా(Vaazha : Biopic of a Billion Boys). బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ అన్నది దీని టాగ్ లైన్.ఈ టాగ్ లైన్ సినిమాకి సరిగ్గా సరిపోవడమే కాదు, నిజజీవితంలో యవ్వన దశ దాటిన ప్రతి ఒక్కరికీ రిలేట్ అవుతుంది. ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ మీనన్. ప్రముఖ నటుడు బసిల్ జోసెఫ్(Basil Joseph) ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే తమ కెరీర్ పరంగా నలుగురు ఓడిపోయిన స్నేహితుల కథ ఇది. ఈ నలుగురు తమ స్కూల్ నుండి కాలేజ్ వరకు చేసే ప్రయాణం చూసే ప్రతి ప్రేక్షకుడి యవ్వనాన్ని తప్పకుండా గుర్తు చేస్తుంది.ఈ నలుగురు స్కూలు, కాలేజ్ అన్నింటిలోనూ ఫెయిలవుతారు. కాని ఆ ఫెయిలయిన వాళ్ళు తమ తల్లిదండ్రులకు మాత్రం సినిమా ఆఖర్లో చక్కటి సందేశమిస్తూ అదే తల్లిదండ్రుల దృష్టిలో పాస్ అవుతారు. అసలు ఈ పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతారు, పరీక్షలో కాక తల్లిదండ్రుల విషయంలో ఎలా పాస్ అవుతారన్నది మాత్రం మీరు ఈ సినిమాలోనే చూడాలి. తామొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు తమ పిల్లలు వాళ్ళ కెరీర్ ని ఎలా ఎంచుకుంటారు అన్నది వాళ్ళకే వదిలేయాలి కాని తమ ఆలోచనలను వాళ్ళ మీద రుద్ద కూడదన్న అంశం మీద తీసిన ఈ సినిమా నిజంగా అభినందనీయం. సినిమాలో తీసుకున్న పాయింట్ సీరియస్ దే అయినా సినిమా మొత్తాన్ని చక్కటి స్క్రీన్ ప్లే తో మంచి కామెడీని మేళవించి కుటుంబమంతా కలిసి చూసే విధంగా రూపొందించాడు దర్శకుడు. మనం వినోదం కోసం ఎన్నో సినిమాలు చూస్తాం. కాని కొన్ని సినిమాలు మనకు మార్గదర్శకమవుతాయి. అటువంటి సినిమానే ఈ వాఝా... బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది. మస్ట్ వాచ్. -
‘గురువాయూర్ అంబలనడియాల్’ మూవీ రివ్యూ
పెళ్ళైతే ఓ కిక్కు, అదే పెళ్ళవ్వాలంటే పెద్ద చిక్కు అన్న భావంతో అల్లుకున్న హాస్యభరిత చిత్రం గురువాయూర్ అంబలనడియాల్. పృధ్విరాజ్, బసిల్ జోసెఫ్, నిఖిల్ విమల్ వంటి భారీ తారాగణంతో నిర్మించిన ఈ చిత్రం హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా మళయాళ మాతృక అయినా తెలుగు డబ్బింగ్ తో హాట్ స్టార్ లో చూడవచ్చు. ఓ సున్నితమైన పాయింట్ తో ఆద్యంతం వినోదభరితం ఈ సినిమా. కథా పరంగా దుబాయ్ లో ఉంటున్న విను రామచంద్రన్ కు కేరళ లో ఓ సంబంధం కుదురుతుంది. అది కూడా గురువాయుర్ టెంపుల్ లో పెళ్ళి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. ఎక్కడైనా పెళ్ళి కుదిరితే పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు ఇష్టపడి మాట్లాడుకుంటారు. కాని ఈ కథలో పెళ్ళికూతురి అన్నతో పెళ్ళికొడుకు ప్రేమగా ఫోన్ లో మాట్లాడుతుంటాడు. ఇక్కడ పెళ్ళికూతురు అన్న ఆనందన్ పాత్రలో పృధ్విరాజ్ పోషించారు. పెళ్ళి కోసం ఎన్నో ఆశలతో ఇండియాలో అడుగుపెట్టిన విను రామచంద్రన్ పెళ్ళి కూతురి అన్నను చూడడానికి వాళ్ళ ఇంటికి వెళతాడు.అయితే సదరు అన్న గారి భార్య ఈ పెళ్ళికొడుకు మొదట ప్రేమించిన అమ్మాయని తెలుస్తుంది. ఆ షాక్ తిన్న పెళ్ళికొడుకు కి ఏ విధమైన సమస్యలు ఎదుర్కున్నాడు, ఈ విషయం తెలిసిన పెళ్ళికొడుకు అన్న ఎలా స్పందించాడు, అసలు ఆ పెళ్ళి అయిందా లేదా అన్నది హాట్ స్టార్ ఓటిటి లోనే చూడాలి. వీకెండ్ కి ఓ మంచి కాలక్షేపభరితమైన సినిమా గురువాయూర్ అంబలనడియాల్. గో వాచ్ ఇట్.-ఇంటూరు హరికృష్ణ