ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | PravinKoodu Shappu Movie OTT Telugu Streaming Details | Sakshi
Sakshi News home page

OTT Movie: క్రేజీ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Apr 1 2025 8:22 PM | Updated on Apr 1 2025 8:26 PM

PravinKoodu Shappu Movie OTT Telugu Streaming Details

మలయాళంలో ఎప్పటికప్పుడు క్రేజీ సినిమాలు వస్తూనే ఉంటాయి. అవి ఓటీటీలోకి వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి. అలా ఇప్పుడు మనోళ్లని ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్న మూవీ 'ప్రావింకూడు షప్పు'. ఇప్పుడు దీని స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఆ వార్తల్ని నమ్మొద్దు.. 'కన్నప్ప' మూవీ టీమ్)

రీసెంట్ టైంలో మలయాళంలో వరస హిట్స్ కొడుతున్న  నటుల్లో బాసిల్ జోసెఫ్ ఒకడు. ఇతడు పోలీస్ గా నటించిన లేటెస్ట్ మూవీ 'ప్రావింకూడు షప్పు'. షౌబిన్ సాహిర్, చెంబన్ వినోద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జనవరి 16న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఏప్రిల్ 11 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 

'ప్రావింకూడు షప్పు' విషయానికొస్తే.. ఓ కల్లు దుకాణ యజమానిని ఎవరో చంపేస్తే.. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆ రోజు రాత్రంతా షాపులోనే 11 మంది తాగుతూ పేకాటాడుతూ ఉంటారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అక్కడ ఉన్న ఆ 11 మందిని అతడు ప్రశ్నిస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా ‍స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement