ఓటీటీకి మిస్టరీ థ్రిల్లర్‌.. మరో సూక్ష్మదర్శిని కానుందా? | Basil Joseph Malayala Mystery Thriller Streaming On this Ott From This Date | Sakshi
Sakshi News home page

Basil Joseph: ఓటీటీకి మరో మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Published Fri, Mar 14 2025 5:00 PM | Last Updated on Fri, Mar 14 2025 6:17 PM

Basil Joseph Malayala Mystery Thriller Streaming On this Ott From This Date

ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది ఓటీటీకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సూక్ష్మదర్శినికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ కీలక పాత్రలో నటించారు. ఈ మలయాళ థ్రిల్లర్‌ మూవీకి ఓటీటీలో ఊహించని స్పందన వచ్చింది. దీంతో ఓటీటీలో మలయాళ చిత్రాలకు ప్రేక్షకుల విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే మరో మిస్టరీ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బసిల్ జోసెఫ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ప్రవీణ్ కూడు షప్పు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీని డార్క్ కామెడీ మర్డర్‌ మిస్టరీగా  శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కించారు.

తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 11 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ప్రవీణ్ కూడా షప్పు మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ విషయాన్ని సోనీలివ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సీనియర్ నటి రేవతి కీలక పాత్రలో కనిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement