malayala film
-
'లూసిఫర్2'లో స్టార్ హీరో సోదరి.. ఫస్ట్ సినిమా ఇదే
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లూసిఫర్2: ఎంపురాన్(రాజు కన్నా గొప్పవాడు)'. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సోదరి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. సౌత్ ఇండియాలో ఆమె నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈమేరకు ఆమె తాజాగా ఒక వీడియోతో ఈ సినిమా గురించి పలు విషయాలు తెలిపారు. సుభద్ర బెన్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. 2019లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’ చిత్రానికి ప్రీక్వెల్‌గా పార్ట్2ను మేకర్స్ నిర్మించారు.ఆమీర్ ఖాన్ సోదరి నిఖాత్ ఖాన్ హెగ్డే(Nikhat Khan Hegde) లూసిఫర్2లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అమీర్ ఖాన్ కుటుంబంలో చాలామంది సినీ పరిశ్రమతో టచ్‌లో ఉన్నారు. కానీ, నిఖాత్ ఖాన్ మిషన్ మంగళ్ (2019) చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే, ఆమె ఎక్కువగా వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. యాక్సిస్ బ్యాంక్,రిలయన్స్ జ్యువెల్స్,హల్దిరామ్స్,విప్రో,ఫస్ట్ క్రై వంటి యాడ్స్ ఆమెకు గుర్తింపు తెచ్చాయి. అయతే, తన సోదరడు అమీర్ ఖాన్ నటించిన లగాన్ (2001) సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు.లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో 'ఎల్2: ఎంపురాన్' చిత్రాన్ని సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఇందులో టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రలు చేస్తున్నారు. సినిమా 2025 మార్చి 27న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్(Mohanlal), ఆయనకు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కనిపించనున్నారు. -
రూ.8 కోట్లు పెడితే రూ.75 కోట్లు.. ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్
ఓటీటీ (OTT)లో ఎప్పటికప్పుడు బోలెడన్ని సినిమాలు, సిరీస్‌లు రిలీజవుతూనే ఉన్నాయి. తాజాగా మలయాళ హిట్ మూవీ డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. అసిఫ్ అలీ (Asif Ali), అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన రేఖాచిత్రం మూవీ (Rekhachithram Movie) ఓటీటీలో రిలీజవుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ (SonyLiv) సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'అందరూ మర్చిపోయిన నేరం.. పాతిపెట్టిన నిజాన్ని వెలికితీసే సమయం ఆసన్నమైంది. మార్చి 7న రేఖాచిత్రం సోనీలివ్‌లో చూసేయండి' అని ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. జనవరి 9న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన రేఖాచిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసింది.కథేంటంటే?మలక్కప్పర ప్రాంతంలో జరిగే ఘటనలు.. పోలీస్ ఇన్స్పెక్టర్ వివేక్‌ను కలవరపరిచే ఆత్మహత్య కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే వివేక్ ఆ కేసుని ఎంతకీ ఛేదించలేకపోతాడు. ఎటు వెళ్లినా కేసు ఓ కొలిక్కి రాదు. చివరకు ఈ కేసు.. మరో కేసుకి లీడ్ ఇస్తుంది. సినిమా షూటింగ్, అందులో మిస్ అయిన ఓ వ్యక్తి.. పాతిపెట్టిన శవం దొరకడం వంటి ఘటనలతో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటాయి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేఖాచిత్రం ఓటీటీలో చూడాల్సిందే!రేఖాచిత్రం విషయానికి వస్తే.. అసిఫ్, అనస్వరతో పాటు మనోజ్ కె.జయన్, సిద్దిఖి, జగదీశ్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జాఫిన్ టి.చాకో దర్శకత్వం వహించాడు. ముజీబ్ మజీద్ సంగీతం అందించాడు.చదవండి: నోరు జారిన రష్మిక.. ఫైర్ అవుతున్న కన్నడ ప్రజలు! -
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ ఏడాదిలో విడుదలై తొలి విజయాన్ని అందుకున్న మలయాళ సినిమా 'రేఖా చిత్రం' ఓటీటీలోకి రానుంది. మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేటివ్ చేస్తారు..? అనే కాన్సెప్ట్‌తో ప్రతి సీన్ ఆసక్తిగా ఈ మూవీని తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వచ్చే చిత్రాలు మీకు ఇష్టం అయితే.. 'రేఖా చిత్రం'ను చూసేయండి. మిమ్మల్ని ఎక్కడా కూడా నిరుత్సాహపరచదు. ఆసిఫ్ అలీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి క్యామియో రోల్లో కనిపించడం విశేషం. ఈ మూవీకి జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు.జనవరి 9న మలయాళంలో మాత్రమే విడుదలైన రేఖాచిత్రం. మార్చి 7న ఓటీటీలోకి వచ్చేస్తుంది. సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో ఆసిఫ్ అలీతో పాటు అనస్వర రాజన్, మనోజ్ కే జయన్, సిద్ధిఖీ, జగదీశ్, సాయికుమార్ వంటి వారు నటించారు. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 25 రోజ్లులోనే రూ. 75 కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.బాక్సాఫీస్ వద్ద ఇంకా థియేటరికల్ రన్ మంచిగానే కొనసాగుతుంది. అయినప్పటికీ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానున్నడం విశేషం. ఇదొక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. కథలో భాగంగా ఒక ఆత్మహత్య కేసును సీఐ వివేక్ గోపీనాథ్ (ఆసిఫ్ అలీ) విచారణ చేపడుతాడు. గ్యాంబ్లింగ్ స్కామ్ లో దొరికిపోయి సస్పెండ్ అయిన ఈ కేసు కోసం మళ్లీ ఎంట్రీ ఇస్తాడు. ఈ క్రమంలో 40 ఏళ్ల కిందటి హత్య కేసుతో ఈ ఆత్మహత్యకు లింక్ ఉందని ఆయన గుర్తిస్తాడు. 1985 సమయంలో ఓ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి మిస్ అయిన బాలిక కేసును కూడా వివేక్ దర్యాప్తు చేస్తాడు. ఇలా ఒక సంఘటనతో ఎన్నో ట్విస్ట్‌లు వస్తూనే ఉంటాయి. ఫైనల్‌గా చిక్కుముడి లాంటి ఈ కేసులను ఆయన ఎలా ఛేదిస్తాడనేది కీలకంగా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్‌గా వివేక్ దర్యాప్తు ఎలా ఉంటుందో తెలియాలంటే రేఖాచిత్రం చూడాల్సిందే. -
ది రాజాసాబ్ భామకు క్రేజీ ఆఫర్.. ఆ స్టార్ నటుడితో తొలిసారి!
గతేడాది తంగలాన్‌తో సూపర్ కొట్టిన హీరోయిన్ మాళవిక మోహనన్. కొత్త ఏడాదిలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం రెబల్ స్టార్ సరసన ది రాజాసాబ్‌లో కనిపించనుంది. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ లైన్లో ఉండాగానే మరో క్రీజీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ.మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ చిత్రంలో మాళవిక నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మాలీవుడ్ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ హృదయపూర్వం అనే టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మాళవిక మోహనన్‌ను ఎంచుకున్నట్లు మాలీవుడ్‌లో లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మాళవిక తొలిసారి మోహన్ లాల్‌తో జతకట్టనుంది. ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఫిబ్రవరి 10న కొచ్చిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.మాళవిక విషయానికొస్తే పట్టం పోల్ (2013)సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బియాండ్ ది క్లౌడ్స్, పెట్టా (2019), మాస్టర్ (2021) చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతేడాది విక్రమ్ మూవీతో విభిన్నమైన పాత్రతో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా యుధ్రా సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం రెబల్ స్టార్ పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్‌లో కనిపించనుంది. ఇటీవల మాళవిక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న ఓ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రం 2025 వేసవిలో గ్రాండ్ రిలీజ్ కానుంది. -
నిన్ను ఆదుకునేది ఒకే ఒక్కడు.. మోహన్‌లాల్ 'లూసిఫర్2' టీజర్
మలయాళ టాప్ హీరో మోహన్‌లాల్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ 'లూసిఫర్' (2019). ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ చిన్న రోల్లో నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా 'లూసిఫర్' సినిమాకు సీక్వెల్‌గా 'ఎల్2: ఎంపురాన్'ను( L2E Empuraan) తెరకెక్కించారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. తెలుగు వర్షన్లో మీరు చూడాలంటే.. వీడియో దిగువన రైట్‌సైడ్ ఉండే సెట్టింగ్స్ వద్ద క్లిక్ చేసి ఆడియో ఆప్షన్లో తెలుగు భాషను ఎంచుకోవచ్చు.లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో 'ఎల్2: ఎంపురాన్' (రాజు కన్నా గొప్పవాడు) చిత్రాన్ని సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఇందులో టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రలు చేస్తున్నారు. సినిమా 2025 మార్చి 27న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్(Mohanlal), ఆయనకు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కనిపించనున్నారు. -
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మీకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే అంచే ఇష్టమా..? అయితే, మలయాళ ( Malayalam) ఇండస్ట్రీలో గదేడాదిలో వచ్చిన ఈ చిత్రాన్ని వదులుకోకండి. కేవలం 1:40 గంటల పాటు ఉండే ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం మలయాళ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్‌ను ఉచితంగా చూసే అవకాశం వచ్చింది. అది కూడా యూట్యూబ్‌లో కావడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.మలయాళంతో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'కురుక్కు' (Kurukku) తెలుగులో 'V2 డబుల్ మర్డర్' ( V2 Double Murder) అనే టైటిల్‌తో డబ్ అయ్యింది. తాజాగా ఈ హిట్ మూవీ తెలుగు వెర్షన్‌ను ఉచితంగా యూట్యూబ్‌లో (YouTube) చూడొచ్చు. ఈ మూవీలో పెద్ద స్టార్స్ లేరు. అనిల్ ఆంటో, బాలాజీ శర్మ, మీరా నాయర్, శ్రీజీత్ కీలక పాత్రలు పోషించారు. అభిజీత్ నూరానీ దర్శకత్వం వహించాడు. గతేడాది జూన్‌లో చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజైన కురుక్కు బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది.కురుక్కు ప్రేక్షకులను మెప్పింస్తుంది. ఇందులో ఎలాంటి కామెడీ, సాంగ్స్ అనేవి ఉండవు.. కేవలం యాక్షన్ సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాకుండా సినిమా నిడివి తక్కువ. దీంతో ప్రేక్షకులలో ఎక్కడా కూడా బోర్ ఫీల్ కలగకుండా సినిమా సాగుతుంది. ఒక డబుల్ మర్డర్ కేసును పోలీస్ టీమ్ ఎలా ఛేదించింది అన్నదే 'వీ2 డబుల్ మర్డర్' కథ. పోలీసుల ఇన్విస్టిగేషన్లో కిల్లర్ ఎవరన్నది చివరి వరకు రివీల్ కాదు. వరుస ట్విస్ట్‌లతో దర్శకుడు ఈ మూవీని నడిపించిన తీరును ఎవరైనా ప్రశంసించాల్సిందే.(ఇదీ చదవండి: గేమ్ ఛేంజర్ తర్వాత స్టార్ హీరో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్)ఈ సినిమా కథలో రూబిన్, అతడి వైఫ్ స్నేహ ఇద్దరు అతి దారుణంగా హత్యకు గురువుతారు. ఇద్దరి మృతదేహాలు వేరువేరు చోట్ల ఉంటాయి. అయితే, వారి హత్యను జార్జ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రత్యక్షంగా చూస్తాడు. కానీ, అతను మద్యం మత్తులో ఉండటంతో హంతకుడిని సరిగ్గా గుర్తు పట్టకలేక పోతాడు. సంచలనంగా మారిని ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మారుతాడు. ఈ కేసు ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను సజన్ అనే పోలీస్ ఆఫీసర్ చేస్తుంటాడు. ఈ హత్యలో జార్జ్ నిరపరాధి అని సజన్ నమ్ముతాడు. కానీ, సాక్ష్యాలు మాత్రం అతడే హత్య చేసినట్లుగా కనిపిస్తాయి. చివరికి ఈ హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు అనేది స్టోరీ. మర్డర్ మిస్టరీగా మారిన కురుక్కు తెలుగులో 'V2 డబుల్ మర్డర్' చిత్రాన్ని యూట్యూబ్‌లో ఉచితంగా చూసేయండి. -
డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేశాను : ‘మార్కో’ హీరో
‘‘మా ‘మార్కో’ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలని బలంగా అనుకున్నాను. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తారు. ‘బాహుబలి, ఈగ’... ఇలా రాజమౌళిగారు తీసిన హై టైమ్ ప్రయోగాత్మక సినిమాలను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ‘మార్కో’ తరహా సినిమా తీయడానికి ఇది కూడా ఓ స్ఫూర్తి. మా సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని ఉన్ని ముకుందన్ అన్నారు. ‘జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడి’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్(Unni Mukundan) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఉన్ని ముకుందన్ హీరోగా టైటిల్ రోల్లో నటించిన మలయాళ చిత్రం ‘మార్కో’. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. ఈ చిత్రం మలయాళంలో డిసెంబరు 20న విడుదలైంది. ‘మార్కో’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఈ నెల 1న ‘మార్కో’(Marco Movie) సినిమా అదే టైటిల్‌తో తెలుగులో విడు దలైంది. ఎన్వీఆర్ సినిమా ‘మార్కో’ మూవీని తెలుగులో రిలీజ్ చేసింది. అయితే ‘మార్కో’ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా లభించిందని, తెలుగులో తొలి రోజు హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా ‘మార్కో’ నిలిచిందని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం హీరో ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ– ‘‘మార్కో’ సినిమాకు హిట్ అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నిజానికి ‘మార్కో’ విజయాన్ని నేను ఊహించాను. ఎందుకంటే కాలం మారుతోంది. ప్రేక్షకుల అభిరుచులు మారి΄ోయాయి. నిజానికి ఈ సినిమా కోసం మేము ఎంతగానో కష్టపడ్డాం. ఫైట్ సీక్వెన్స్‌లు ఎప్పుడూ రిస్క్‌తో కూడుకున్నవే. అయినా నేను ఎలాంటి డూప్స్ లేకుండా ఫైట్ సీక్వెన్స్‌లు చేశాను. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేప్పుడు నాకు ఏమైనా గాయాలవుతాయా? అని టీమ్ అందరూ కంగారు పడ్డారు. ఎందుకంటే అలా జరిగితే షూటింగ్ ఆపేయాల్సి వస్తుంది. కానీ అదృష్టవశాత్తు అంతా మంచిగానే జరిగింది. ఇక ఈ మూవీలోని మార్కో క్యారెక్టర్ కోసం నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. క్యారెక్టర్‌కు తగ్గట్లుగా ఫిజికల్‌గా రెడీ కావడం సవాల్‌గా అనిపించింది. మా చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది. కానీ ఆ ‘ఎ’ సర్టిఫికెట్ సినిమాతోనే మేం రూ. వందకోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించగలిగాం. యావత్ దేశం మా సినిమాను ఆదరిస్తుందనే నమ్మకం మాకు ఉంది. మలయాళం నుంచి తెలుగులో భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ‘మార్కో’ నిలిచింది. దర్శకుడు హనీఫ్‌తో గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, కెమెరామేన్ చంద్రు, ఆర్ట్ డైరెక్టర్ సునీల్, ఫైట్‌మాస్టర్, కొరియోగ్రాఫర్స్... ఇలా టెక్నికల్ టీమ్ అంతా కూడా కష్టపడ్డారు. వీరందరకీ ధన్యవాదాలు. చాలా హ్యాపీ. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే వెల్లడిస్తాను’’ అని అన్నారు. -
ఓటీటీలో 'ఇసుక మాఫియా' హిట్ సినిమా స్ట్రీమింగ్
మలయాళ నటుడు హకీమ్ షాజహాన్ నటించిన 'కడకన్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇసుక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన రివెంజ్ డ్రామాగా ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. గతేడాది మార్చిలో విడుదలైన ఈ మూవీ సుమారు 10 నెలల తర్వాత ఓటీటీలోకి సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే ఈ చిత్రం మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూసే ఛాన్స్ ఉంది.మలయాళంలో తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన కడకన్ మంచి విజయాన్ని అందుకుంది. అయితే, సడెన్‌గా సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇసుక మాఫియాలో జరిగే సంఘటనలను తెరపై డైరెక్టర్ సాజిల్ మాంపాడ్ అద్భుతంగా తీశాడు. అతనికి మొదటి సినిమా ఇదే అయినప్పటికీ దర్శకుడిగా ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. మంజుమ్మెల్ బాయ్స్, అన్వేషిప్పిమ్ కండేతుమ్ వంటి భారీ హిట్ సినిమాలను తట్టుకుని కడకన్ మంచి కలెక్షన్స్ రాబట్టింది.ఇసుక మాఫియా వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ప్రతీకార ఘటనలను తెరపై దర్శకుడు చూపించాడు. ఇండియాలోనే నాణ్యమైన ఇసుక కేరళలోని మల్లపురం ఏరియాలో దొరుకుతుంది. అక్కడ ఇసుక మాఫియా వల్ల జరిగిన కొన్న నేరాల నుంచి స్ఫూర్తి పొందుతూ.. స్నేహం, ప్రేమ, యాక్షన్ అంశాలను వాటికి జోడించి కడకన్ చిత్రాన్ని తెరకెక్కించారు. -
‘మార్కో’ మూవీ రివ్యూ: వయొలెన్స్.. వయొలెన్స్.. వైల్డ్ వయొలెన్స్!
టైటిల్: 'మార్కో'నటీనటులు: ఉన్ని ముకుందన్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్నిర్మాణ సంస్థ: క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్నిర్మాత: షరీఫ్ ముహమ్మద్రచన-దర్శకత్వం: హనీఫ్ అదేనిసంగీతం: రవి బస్రూర్సినిమాటోగ్రఫీ: చంద్రు సెల్వరాజ్ఎడిటర్: షమీర్ మహమ్మద్విడుదల తేది: జనవరి 1, 2025‘మార్కో’.. ఈ ఏడాది చివరిలో(డిసెంబర్ 20) వచ్చిన ఈ మలయాళ చిత్రం అక్కడ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.100 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. మోస్ట్ వయలెంట్ చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. న్యూ ఇయర్ సందర్భంగా నేడు(జనవరి 1) ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అయింది. కేరళ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ‘మార్కో’ తెలుగు వాళ్లను మెప్పించాడా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్‌గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్‌ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్‌ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..?ఈ మధ్యకాలంలో యాక్షన్ సినిమాల్లో హింస మితిమీరిపోతుంది. అవసరానికి మించి వయొలెన్స్‌ని చూపిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ‘యానిమల్’, ఇటీవల వచ్చిన ‘కిల్’ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ దారుణంగా ఉన్నాయి. వాటిని యాక్షన్ ప్రియులు ఎంజాయ్ చేసినా.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చూడలేకపోయారు. కానీ యాక్షన్ ప్రియులే భయపడిపోయి.. ‘ఈ హింసను చూడలేకపోతున్నాం.. ఆపండ్రాబాబూ..’ అనుకునే సినిమా ‘మార్కో’. సెన్సార్ బోర్డ్ ఎలా ఓకే చేసిందో తెలియదు కానీ..కొన్ని సన్నివేశాలు తెరపై చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. అవసరానికి మించిన హింస.. జుగుప్సాకరమైన సన్నివేశాలతో ఈ సినిమా కథనం సాగుతుంది.వాస్తవానికి ఇదొక రోటీన్ రివైంజ్ డ్రామా చిత్రం. తన సోదరుడిని చంపినవాళ్లపై హీరో ఎలా పగతీర్చుకున్నాడనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగులోనూ చాలా వచ్చాయి. కానీ రివైంజ్ డ్రామాని ఫుల్ యాక్షన్ డ్రామాగా మలచడమే ‘మార్కో’ స్పెషల్. సినిమా ప్రారంభంలోనే హంతకులు ఎవరనేది ఆడియన్స్‌కు తెలిసిపోతుంది. కానీ హీరో వారిని కనిపెట్టి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది ఆసక్తికరం. ప్రతి యాక్షన్ సీన్లోనూ రక్తం ఏరులైపారుతుంది. ఇంటర్వెల్ సీన్లో వయొలెన్స్ మరీ ఎక్కువైపోతుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ చూస్తే యాక్షన్ ప్రియులే తట్టుకోలేరు. తలలు ఎగిరిపడడం.. కాళ్లు, చేతులు తెగిపడడం.. పొట్టలోని పేగులు బయటకు రావడం.. ఒకెత్తు అయితే.. యాసిడ్‌తో చంపడం.. గర్భిణీ స్త్రీ నోట్ల ఆయుధం దింపడం.. చిన్న పిల్లాడిని గ్యాస్ సిలిండెర్‌తో మోది చంపడం.. గుండెకాయను కోసి బయటకు తీయడం.. మరో ఎత్తు. ఆ సన్నివేశాలను తెరపై చూడాలంటే గుండె రాయి చేసుకోవాల్సిందే. ఒకనొక దశలో ఇంత వయొలెన్స్ అవసరమా? అనిపిస్తుంది. కథ మొత్తం ప్యామిలీ చుట్టే తిరిగినా.. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిన్న పిల్లలు, గుండెజబ్బు ఉన్నవారు ఈ సినిమాకు దూరంగా ఉంటే బెటర్. తెరపై హింసను ఆస్వాదించేవాళ్లు.. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు మాత్రం ‘మార్కో’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఉన్ని ముకుందన్ కేరళ నటుడైనా తెలుగు ఆడియన్స్‌కి సుపరిచితుడే. ‘యశోద’, ‘జనతా గ్యారేజ్’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. మాలీవుడ్‌లో అతనికి మాస్ హీరో అనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌ని పెంచే చిత్రం ‘మార్కో’. టైటిల్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. మార్కో పాత్ర కోసం ఆయన శరీరాకృతిని మార్చుకున్నాడు. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ తగ్గట్లుగా ఉన్ని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సిద్ధిఖీ, కబీర్ దుహాస్ సింగ్‌ల పాత్రకు కూడా బాగా పేలాయి. వారి పాత్రల పరిచయం..యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. దర్శకుడు హనీఫ్ అదేని తన రాసుకున్న పాత్రలకు తగ్గట్లుగా క్యాస్టింగ్‌ను ఎంచుకున్నాడు. ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా అదిరిపోయింది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. తనదైన బీజీఎంతో మూవీ స్థాయిని పెంచేశాడు. హీరోతో పాటు విలన్ పాత్రలకు సంబంధించిన ఎలివేషన్ సీన్లకు ఆయన అందించిన బీజీఎం నెక్ట్స్ లెవన్. పాటలు గుర్తుండవు. యాక్షన్ కొరియోగ్రాఫర్ల పనితీరు అద్భుతం. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
ఓటీటీలో మలయాళ హిట్ సినిమా తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన 'ముర' చిత్రం తెలుగు వర్షన్ ఓటీటీలో విడుదలైంది. రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'ముర' ఒక వర్గం ప్రేక్షకులను భారీగా మెప్పించింది. యాక్షన్ ఎపిసోడ్స్ మరోస్థాయిలో ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డరు. నవంబర్ 8న విడుదలైన ఈ మూవీ రీసెంట్గా 50రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.ముహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో తెరకెక్కిన 'ముర' చిత్రంలో హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి,కన్నన్ నాయర్ వంటి వారు నటించారు. క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీ నుంచి మలయాళం వర్షన్లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం.. తెలుగు,తమిళ్,కన్నడ వంటి భాషలలో డిసెంబర్ 28న అమెజాన్ స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది.కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుంది. నలుగురు యువకులు ఉద్యోగం లేకపోవడంతో ఓ దోపిడీ కోసం ప్రయత్నిస్తారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో దర్శకుడు చాలా ఆసక్తిగా చూపించాడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి 'ముర' ఎంత మాత్రం నిరాశపరచదు. -
OTT: జీవితం అర్థం చెప్పే ప్రేమకథ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘కథా ఇన్నూవరే’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రేమ..ఈ భావం మనిషికి మనసుకి ఓ మధురానుభూతి. మనిషి పుట్టుక నుండి గిట్టే వరకు ఈ ప్రేమ ప్రతి దశలోనూ ఉంటుంది. ఆ మహత్తరమైన ప్రేమను వెండితెరకు తీసుకురావడానికి తరతరాలుగా ఎంతో మంది దర్శకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే దర్శకుడు విష్ణుమోహన్ ఓ చక్కటి ప్రేమ పంధాను ఈ సినిమాకోసం ఎంచుకున్నారు. మళయాళ దర్శకుడైన విష్ణుమోహన్ సినిమాలన్నీ చాలా వరకు సున్నితమైన భావావేశాలతో రూపొందించబడ్డాయి. అటువంటి కోవలోనే ప్రస్తుతం ఈ సినిమా కథా ఇన్నూవరే కూడా తీశారు. ఓ నాలుగు ప్రేమ కథలు ఒకే కథగా కథా ఇన్నూవరే..(ఇప్పటి వరకు కథ) సినిమాలో చూపించడానికి ప్రయత్నించాడు దర్శకుడు విష్ణుమోహన్. 2018 సంవత్సరంలో ప్రముఖ హీరో రాణా నిర్మాతగా తెలుగులో ఓ సినిమా తీశారు. దాని పేరే C/o కంచరపాళెం. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ఆ సంవత్సరం న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అఫీషియల్ గా నామినేట్ అయింది. ఈ సినిమా రీమేకే ఇప్పటి కథా ఇన్నూవరే. ఇక కథ విషయానికొస్తే కొంచెం లేటు వయస్సులో ఉన్న రామచంద్ర తాను ఫ్యూను గా పనిచేస్తున్న ఆఫీసులో ఆఫీసరైన జానకి ప్రేమలో పడతాడు. జానకి కి 20 సంవత్సరాల కూతురు ఉంటుంది. ఇంకో పక్క కాలేజీలో చదువుకునే ఉమ కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం పని చేసే జోసెఫ్ ని ఇష్టపడుతుంది. ఉమ తండ్రికి ఈ విషయం అస్సలు నచ్చదు. మరో పక్క నశీమా అనే వేశ్యను లిక్కర్ షాపులో పని చేసే రామచంద్రన్ ప్రేమిస్తుంటాడు. ఈ మూడు కథలతో పాటు బొమ్మలు తయారు చేసే ఓ శిల్పి కొడుకు స్కూల్ లో మరో అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. ఈ నాలుగు ప్రేమ కథలు ఒకదానికొకటి అస్సలు సంబంధముండదు. అయితే వాటిని లింక్ చేసేది మాత్రం ప్రేమే. అలాగే ఈ సినిమాలో ఆఖర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం సినిమాకే హైలైట్. మామూలుగా అయితే ప్రేమ కథలను చూసి అనుభూతి పొందుతాం. కాని ఈ సినిమాలో ప్రేమ మాత్రం జీవితానికి అర్ధం చెప్తుంది. ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా కథా ఇన్నూవరే స్ట్రీమ్ అవుతోంది. వర్త్ ఫుల్ మూవీ ఫర్ ఎ ఫీల్ గుడ్ వ్యూవర్స్.-ఇంటూరు హరికృష్ణ -
మార్కో యాక్షన్
ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన చిత్రం ‘మార్కో’. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ప్రధాన పాత్రధారులు. షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న మలయాళంలో విడుదలైంది. ఈ చిత్రాన్ని ఎన్వీఆర్ సినిమా తెలుగులో జనవరి 1న రిలీజ్ చేస్తోంది. ‘‘వయొలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘మార్కో’. టైటిల్ రోల్లో ఉన్ని ముకుందన్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా మలయాళంలో సంచలన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్: జుమానా షరీఫ్, కెమెరా: చంద్రు సెల్వరాజ్. -
'బరోజ్ 3డీ’లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు: మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టైటిల్ రోల్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఎపిక్ ఫాంటసీ అడ్వంచర్ 'బరోజ్ 3డీ'. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మోహన్ లాల్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.→బరోజ్ త్రీడీ ఫాంటసీ ఫిల్మ్. ఇప్పటివరకూ మలయాళం నుంచి మూడు త్రీడీ సినిమాలే వచ్చాయి. అయితే బరోజ్ లో ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని చాలా యూనిక్ గా సినిమాని రూపొందించాం. సినిమా అద్భుతంగా వచ్చింది. విజువల్ వండర్ తో పాటు స్టొరీ టెల్లింగ్ ని రీడిస్కవర్ చేసేలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చేలా ఉంటుంది. గత నలభై ఏళ్ళుగా ఇలాంటి సినిమా రాలేదు. దర్శకుడిగా ఇది నాకు కొత్త అనుభూతి. దర్శకుడిగా తొలి సినిమానే త్రీడీలో చేయడం సవాలుగా అనిపించింది. టీం అందరూ చాలా సపోర్ట్ చేశారు.→గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్ నవలను ఆధారంగా చేసుకొని ఒక ఇమాజనరీ అడ్వంచర్ కథని రూపొందించాం. వాస్కో డి గామాలో దాగి ఉన్న రహస్య నిధిని కాపాడుతూ వచ్చే బరోజ్, ఆ సంపదను దాని నిజమైన వారసుడికి అందించడానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా ఉంటాయి. స్టొరీ టెల్లింగ్ చాలా కొత్త ఉంటుంది. ప్రేక్షకులు ఓపెన్ మైండ్ తో వచ్చి ఈ ఇమాజినరీ వరల్డ్ ని ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను.→ త్రీడీ సినిమా చేయడం అంత ఈజీ కాదు. ప్రత్యేకమైన కెమరాలు అవసరం పడతాయి. అన్ని కెమరాల విజన్ పర్ఫెక్ట్ గా సింక్ అవ్వాలి. ప్రేక్షకడికి గొప్ప త్రీడీ అనుభూతి ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.→ ఈ సినిమాకి ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పని చేశారు. హాలీవుడ్ పాపులర్ కంపోజర్ మార్క్ కిల్లియన్ బీజీఎం ఇచ్చారు. ఆడియన్స్ కి చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. 12 ఏళ్ల లిడియన్ నాదస్వరం ఈ సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేయడం మరో విశేషం. → టాప్ లెన్స్ మ్యాన్ సంతోష్ శివన్ కెమరా వర్క్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుంది. విజువల్స్ ప్రేక్షకుడికి చాలా కొత్త అనుభూతిని పంచుతాయి. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీని కోసం యానిమేటెడ్ క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేశాం. చాలా మంది హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేశారు→ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా కేర్ తీసుకొని చేశాం.ఆడియన్స్ థియేటర్స్ లో ఓ న్యూ వరల్డ్ ని ఎక్స్ పీరియన్స్ చేస్తారనే నమ్మకం వుంది. తప్పకుండా సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. -
బంగారాన్ని కాపాడే భూతం 'బరోజ్'.. తెలుగు ట్రైలర్
మోహన్‌లాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బరోజ్’. ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 25న పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ విడుదల కానుంది.బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్‌లాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర కూడా చాలా ఆసక్తిగా ఉంది. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ నటిస్తున్నాడు. వాస్కోడిగామాకి చెందిన అపార సంపద (బంగారం,వజ్రాలు) బరోజ్ అనే ఒక భూతం 400 ఏళ్ళగా కాపాడుతూ వస్తుంది. ఆయనకు సంబంధించిన నిజమైన వారసులకు ఆ సంపదని అప్పగించాలని ఆ భూతం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌తో సినిమా ఉండనుంది.తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మించారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న తెలుగు,హిందీ,తమిల్,కన్నడ,మలయాళంలో బరోజ్ సినిమా విడుదల కానుంది. -
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ
మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన 'ముర' చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువగా మలయాళ సినిమాలు చూస్తుండటంతో అవన్నీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 8న విడుదలైన 'ముర' భారీ విజయాన్ని అందుకుంది. 50రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.ముహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో తెరకెక్కిన 'ముర' చిత్రంలో హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి,కన్నన్ నాయర్ వంటి వారు నటించారు. క్రిస్టమస్ సందర్భంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'అమెజాన్ ప్రైమ్'లో విడుదల కానుంది. డిసెంబర్ 20వ తేదీ నుంచి మలయాళంతో పాటు తెలుగు,తమిళ్,కన్నడలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ డేట్‌కు ఈ చిత్రం ఓటీటీలో రాకుంటే డిసెంబర్ 25న తప్పకుండా విడుదల అవుతుంది.కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుంది. నలుగురు యువకులు ఉద్యోగం లేకపోవడంతో ఓ దోపిడీ కోసం ప్రయత్నిస్తారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో దర్శకుడు చాలా ఆసక్తిగా చూపించాడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి 'ముర' ఎంత మాత్రం నిరాశపరచదు. -
షూటింగ్ పూర్తి కాగానే అక్కడ జరిగేది ఇదే.. లైంగిక వేధింపులపై సుహాసిని
మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ నివేదిక స్పష్టం చేసిన తర్వాత చాలామంది సీనియర్ హీరోయిన్లు నిజమేనంటూ తమ అభిప్రాయం చెప్పారు. అయితే, తాజాగా నటి సుహాసిని ఆ విషయాన్ని మరోసారి ధ్రువీకరించారు. ప్రస్తుతం గోవాలో అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సినిమాలో మహిళలకు రక్షణ అనే అంశంపై చర్చావేదికను నిర్వహించారు. అందులో పలు భాషలకు చెందిన నటీమణులు, దర్శకులు పాల్గొన్నారు. అందులో పాల్గొన్న నటి సుహాసిని మాట్లాడుతూ సినిమా రంగం ఇతర రంగాలకు కాస్త భిన్నమైందని పేర్కొన్నారు. ఇతర రంగాలలో పని చేసే వారు పని పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోతారన్నారు. అయితే సినిమాలో అలా కాదన్నారు. 200 నుంచి 300 మంది షూటింగ్ కోసం ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడే ఒక కుటుంబంలా కలిసుండాలన్నారు. అక్కడ విధి, విధానాలను పాటించకపోతే హద్దులు మీరే అవకాశం ఉంటుందన్నారు. 200 మంది ఓ చిత్ర యూనిట్లో తమ కుటుంబాలకు దూరంగా ఉండే వారిపై కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు సినిమా రంగంలోని వస్తున్న వారికి సరైన అనుభవం ఉండటం లేదన్నారు. దీన్ని కొందరు తప్పుగా వాడుకోవాలను చూస్తారన్నారు. అదేవిధంగా ఇతర చిత్ర పరిశ్రమల మాదిరి మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు రక్షణ తక్కువన్నారు. మలమాళ చిత్రాల షూటింగ్‌లు అధికంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతుంటాయని చెప్పారు. దీంతో నటీమణులు నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. దీంతో వారిపై తప్పుగా ప్రవర్తించే అవకాశం ఎక్కువన్నారు. ఇదే మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతోందని చెప్పారు. తమిళ చిత్ర షూటింగ్ పూర్తి అయితే తాను చైన్నెకి తిరిగి వెళ్లిపోతానని, తెలుగు షూటింగ్ అయితే హైదరాబాద్‌కు, కర్ణాటకలో షూటింగ్ అయితే బెంగళూర్‌కు వెళ్లిపోతానన్నారు. అయితే మలయాళం సినిమాల షూటింగ్ పూర్తి అయితే మీరు ఇంటికి తిరిగి వెళ్లలేరని, కారణం అక్కడ అలాంటి వాతావరణం లేకపోవడమేనని అన్నారు. అంతేకాకుడా మీకు బయటకు కూడా వెళ్లడం కుదరదన్నారు. అందుకే షూటింగ్ ప్రాంతాల్లో హద్దులు మీరుతున్నాయనే అభిప్రాయాన్ని నటి సుహాసిని వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్' ట్రైలర్ విడుదల
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఆయనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు కూడా.. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ ఇందులో కనిపించనున్నాడు. అయితే, ఆ సందను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథ అని తెలుస్తోంది. ఎక్కువ వీఎఫ్ఎక్స్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్ ఉండటం వల్ల విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. -
అత్యాచారం కేసులో నటుడు సిద్ధిఖీకి ఊరట
మలయాళ నటుడు సిద్ధిఖీకి భారీ ఊరట లభించింది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటులతో పాటు దర్శకులు కూడా నటీమణులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని జస్టిస్ హేమ కమిటీ చేసిన రిపోర్ట్‌తో అక్కడి నటీమణులు చాలామంది గతంలో తమకు జరిగిన అన్యాయాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలో కొందరు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు.2016లో నటిపై అత్యాచారంమలయాళ నటి రేవతి సంపత్ చేసిన ఆరోపణలతో సిద్ధిఖీపై కేసు నమోదైంది. 2016లో తిరువనంతపురంలోని మస్కట్ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ముందుగా ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఫేస్బుక్ ద్వారా తనకు సిద్ధిఖీ పరిచయం అయ్యాడని, ఆపై తన కోరికను తీర్చాలని బలవంతం చేసినట్లు పేర్కొంది. అందుకు తాను నిరాకరించడంతో ఒక పథకం ప్రకారం తనను హోటల్‌కు రప్పించి సిద్ధిఖీ అత్యాచారం చేసినట్లు రేవతి తెలిపింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే, చాలారోజులుగా పరారీలో ఉన్న ఆయనకు తాజాగా బెయిల్ లభించింది. సిద్ధిక్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ, నటుడు ఎలాంటి తప్పు చేయలేదని, ఫిర్యాదుదారు అభియోగాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఫిర్యాదుకు ఎనిమిదేళ్లు ఎందుకు: కోర్టుసిద్ధిఖీకి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరును జస్టిస్ బేలా త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తాజాగా తీర్పు వెల్లడించింది. అయితే, ఈ కేసులో సిద్ధిఖీపై ఫిర్యాదు చేయడానికి ఎనిమిదేళ్ల జాప్యం ఎందుకు అయిందని కోర్టు ప్రశ్నించింది. ఈ కారణంతోనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ, అవసరమైతే పోలీసుల విచారణకు సిద్ధిఖీ సహకరించాలని సూచించింది. ఈ క్రమంలో తన పాస్‌పోర్ట్‌ను ట్రయల్ కోర్టులో డిపాజిట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఫిర్యాదు విషయంలో ఆలస్యానికి బాధితురాలి తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ ఇలా మాట్లాడారు. హేమా కమిటీ నివేదికను విడుదల చేయడం ఆపై కేరళ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే అత్యాచార బాధితురాలికి ఫిర్యాదు చేయడానికి ధైర్యం వచ్చిందని వారు అన్నారు. -
దర్శకుడి ప్రేమలో డబ్బింగ్ ఆర్టిస్ట్.. ఫోటో వైరల్
సౌత్ ఇండియన్ యాక్టర్, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి ప్రేమ పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆర్టిస్ట్ తన సోషల్ మీడియా పేజీలో ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం సినిమాలకు ఆమె వాయిస్ ఇచ్చింది. అయితే, మలయాళ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు ఆమె ప్రకటించింది. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు పేర్కొంది. తెలుగులో ఓకే బంగారం, ప్రేమమ్, 2.0, నవాబ్ వంటి సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది.చెన్నైకి చెందిన రవీనా రవి మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాల్లో కూడా నటించింది. జవాన్ సినిమాలో దీపికా పదుకోన్‌కు తెలుగు వాయిస్ అందించింది. లవ్ టుడే, మామన్నన్ వంటి సినిమాల్లో కీలకమైన పాత్రలలో మెరిసింది. నయనతార, త్రిష,నిధి అగర్వాల్.మాళవిక మోహన్,శ్రీనిధి శెట్టి, అమలా పాల్,రాశీ ఖన్నా,కాజల్ అగర్వాల్, సమంత వంటి స్టార్ హీరోయిన్లకు వివిధ భాషలలో డబ్బింగ్ చెప్పింది. అయితే, 'వాలట్టి' అనే మలయాళ సినిమాతో పాపులర్ అయిన దర్శకుడు దేవన్ జయకుమార్తో ఆమె ప్రేమలో ఉంది. త్వరలో పెళ్లి చేసుకున్నట్లు ఒక ఫోటోను కూడా పంచుకుంది. తన అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలో పెళ్లి తేదీని కూడా ఈ జోడీ ప్రకటించనుంది. View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) -
ఓటీటీలో అమలాపాల్ 'లెవల్ క్రాస్' థ్రిల్లర్ సినిమా
అమలాపాల్ తాజాగా నటించిన మలయాళ సినిమా 'లెవల్ క్రాస్'. ఈ మూవీలో ఆసిఫ్ అలీ హీరోగా నటించగా.. షరాఫుద్దీన్ కీలక పాత్రలో నటించాడు. జులై 26న విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అర్భాఫ్ అయూబ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది.'లెవెల్ క్రాస్' చిత్రానికి మలయాళ టాప్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, 12th మ్యాన్, నెరు, వంటి చిత్రాలతో మంచి గుర్తింపు ఉంది. అయితే, జీతూ జోసెఫ్ శిష్యుడిగా దృశ్యంతో పాటు పలు సినిమాలకు అర్ఫాజ్ అయూబ్ దర్శకుడిగా పనిచేశారు. ఇప్పుడు లెవెల్ క్రాస్ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఓటీటీలో ఎప్పుడు..?సుమారు రూ. 10 కోట్లకు పైగానే లెవల్ క్రాస్ సినిమా కోసం ఖర్చు చేశారు. IMDb రేటింగ్ 7.2తో ఒక వర్గం ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పించింది. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్ వర్షన్లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ఆహా ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వార ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ తేదీని వెళ్లడించలేదు. కానీ, అక్టోబర్ 11న దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. -
Vishesham Movie Review: విషయమున్న ‘విశేషం’
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘విశేషం’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే కంటెంట్‌లో గ్లామర్ ఉండాలి అని నమ్మే దర్శకులు నేడు ఎక్కువ. కానీ కంటెంట్‌కు గ్లామర్ కన్నా గ్రామర్ ఎక్కువ అలరిస్తుందని నిరూపించారు మలయాళ దర్శకుడు సూరజ్ టామ్. అదెలాగంటారా? అయితే ఇటీవల ప్రైమ్ వీడియో ఓటీటీ ద్వారా విడుదలైన ‘విశేషం’ సినిమాపై ఓ లుక్కేద్దాం. మామూలుగా సినిమా అంటే చక్కటి కథ, కామెడీతో పాటు చూడచక్కని పాత్రధారులు కూడా ఉండాలి. ‘విశేషం’ సినిమాకి కథ, కామెడీ ఉన్నాయి కానీ డీ గ్లామరైజ్డ్ హీరో, హీరోయిన్లు ఉంటారు. దానితో పాటు ఇదో సందేశాత్మక చిత్రం. ఇంకేముంది... దీంట్లో విశేషం అనుకోకండి. అసలైన విషయమున్న విశేషం ఏంటంటే... శీజు భక్తన్ మొదటి పెళ్లి జరిగిన కొన్ని నిమిషాల్లోనే పెటాకులవడంతో రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎన్నో విపరీత, వినోద ప్రయత్నాల తర్వాత కానిస్టేబుల్ సజితతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. సజితది కూడా రెండో వివాహమే. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఇక్కడ నుండే దర్శకుడి గ్రామర్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యను ఈ సినిమా ద్వారా హృద్యంగా చూపించారు దర్శకుడు. అదే సంతానలేమి సమస్య. మరీ ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో పిల్లలు లేకపోవడం అనేది కొంతమంది దంపతుల్లో విపరీత సమస్య. సంతానం లేని దంపతులు తమ కుటుంబంలో, సమాజంలో తమ సమస్య వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతారో కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు. ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల సమస్య సంతాన లేమి అయితే దానిని పరిష్కరించడంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? అనే కోణాన్ని అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు. ఎంతో సున్నితమైన సమస్యను అంతే సున్నితంగా ఎవ్వరినీ నొప్పించకుండా రూపొందించారు సూరజ్ టామ్. సినిమా చివర్లో శీజు భక్తన్, సజితలకు ఉన్న సమస్య ఎలా పరిష్కారమైంది? ఎలా పరిష్కరించుకున్నారు? అనే విషయం మాత్రం ఈ ‘విశేషం’లోనే చూడాలి. రోజూ మనం ఎన్నో మెసేజ్‌లు, వీడియాలు మన దగ్గరివారికి షేర్ చేసుకుంటాం. ఈ సినిమా గురించి మనం పది మందికి చెబితే అందులో ఎవరైనా ఈ సమస్య బాధితులు ఉంటే వారికి వినోదంతోపాటు కొంత బాసటగా ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే ఇది విషయమున్న విశేషం కాబట్టి. – ఇంటూరు హరికృష్ణ -
హిట్ సినిమాల్లో నటించిన మోహన్‌రాజ్ కన్నుమూత
సౌత్ ఇండియా ప్రముఖ నటుడు మోహన్‌రాజ్ అనారోగ్యంతో కన్నుమూశాడు. ‘కిరిక్కాడాన్ జోస్’గా మలయాళంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 1989లో ‘కిరీదామ్’ సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చింది. తెలుగులో ఎక్కువగా బాలకృష్ణ, మోహన్‌బాబు, వెంకటేష్‌లతో సినిమాలు చేశాడు. ఈ క్రమంలో లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, అసెంబ్లీరౌడీ,నరసింహ నాయుడు,సోగ్గాడి పెళ్ళాం,బొబ్బిలి సింహం,అసెంబ్లీ రౌడీ,శివమణి వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన విలన్‌గా నటించారు. సుమారు 300కు పైగా సినిమాల్లో మోహన్‌రాజ్ మెప్పించారు.గత నాలుగు రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న మోహన్‌రాజ్ తిరువనంతపురంలో చికిత్స తీసుకుంటుండగా వెంటిలేటర్‌పైనే ఆయన మరణించారు. ఈ విషయాన్ని మలయాళ నటుడు, దర్శకుడు, పి.దినేశ్ పనికర్ తెలిపారు. మోహన్‌రాజ్‌కు భార్య ఉషతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 21 మూవీస్.. అవి ఏంటంటే?పార్కిన్సన్స్తో (పక్షవాతం) బాధపడుతున్న మోహన్‌రాజ్‌కు కొద్దిరోజుల క్రితం గుండె పోటు కూడా రావడంతో వెంటనే ఆయన్ను చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను తిరువనంతపురంలోని మరో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా ఆయన మరణించారు. తెలుగులో మోహన్‌బాబు ‘శివశంకర్’ (2004) అనే చిత్రంలో ఆయన చివరిగా కనిపించారు. ఇందులో హీరోగా నటించారు. మోహన్‌రాజ్ మృతిపట్ల మలయాళ సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది. -
మంజుమ్మెల్ బాయ్స్ మరో ఘనత.. ఏకైక భారతీయ చిత్రంగా!
మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా అదరగొట్టింది. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన ఘనత దక్కింది. రష్యాలో ప్రారంభమైన కినోబ్రావో ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీకి మంజుమ్మెల్ బాయ్స్ ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచిన ఏకైక భారతీయ చిత్రంగా ఘనత సాధించింది.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ విడుదల చేయగా.. సూపర్ హిట్‌గా నిలిచింది. యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాలలో ఒకటిగా ఘనత దక్కించుకుంది.(ఇది చదవండి: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ)తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 1న రష్యాలోని సోచిలో ప్రదర్శించనున్నారు. మంజుమ్మెల్ బాయ్స్‌తో పాటు ఎస్ఎస్ రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్, పాయల్ కపాడియా మూవీ ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రాలను వివిధ కేటగిరీలలో ప్రదర్శించనున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ అక్టోబర్ 4, 2024 వరకు కొనసాగనుంది. -
'అ చిత్రాలు చూడాలంటూ.. డైరెక్టర్‌పై నటి సంచలన ఆరోపణలు'!
హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటీమణులు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. ఇండస్ట్రీలో తమను ఇబ్బందులకు గురిచేసిన వారిపేర్లను బహిర్గతం చేశారు. ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ పలువురు స్టార్ డైరెక్టర్స్, నటులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రముఖ నటుడు జయసూర్య సహా ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా మలయాళ డైరెక్టర్‌పై మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది. దర్శకుడు బాలచంద్ర మీనన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ఫేస్బుక్ పోస్ట్‌లో తనకెదురైన కష్టాలను పంచుకుంది. 2007లో డైరెక్టర్ బాలచంద్ర తన గదిలో అశ్లీల చిత్రాలు చూడమని బలవంతం చేశాడని తెలిపింది. కొంతమంది పురుషులు, ముగ్గురు అమ్మాయిలు ఆ గదిలో ఉన్నారని.. తాను మాత్రం బయటికి వచ్చేశానని వెల్లడించింది. బాలచంద్రన్ నన్ను కూర్చొమని అడిగాడని మునీర్ వివరించింది.అయితే గతంలోనూ ఫేస్బుక్ ద్వారా మిను మునీర్ తనకెదురైన ఇబ్బందులను పంచుకుంది. 2013లో ఒక ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నప్పుడు తనను శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని తెలిపింది. దీంతో మలయాళ ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందని పేర్కొంది. చెన్నైకి మకాం మార్చానని వెల్లడించింది. -
ఆ హిట్ డైరెక్టర్‌తో రజనీకాంత్ సినిమా..!
జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ జోరు పెంచారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరుసగా సినిమాలు తీసేందుకు తన షెడ్యూల్స్ ఉంటున్నాయి. అక్టోబర్ 10న వేట్టైయాన్ విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.వెట్టైయాన్‌తో పాటు 'కూలీ' చిత్రాన్ని కూడా ఆయన పట్టాలెక్కించారు.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. దాదాపు చిత్రీకరణ కూడా పూర్తి కావచ్చింది. ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' ప్రాజెక్ట్‌లో రజనీ ఎంట్రీ ఇస్తారు.ఈ సినిమాల తర్వాత కొత్తగా మరో ప్రాజెక్ట్‌కు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతేడాదిలో '2018' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్‌తో రజనీ సినిమా ఓకే అయిందని తెలుస్తోంది. తమిళంలో వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై జూడ్ ఆంథనీ జోసెఫ్ ఓ సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో నటించమని మొదట శింబును సంప్రదించారట. అయితే, ఈ కథకు సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రమే సెట్ అవుతారని మేకర్స్ అభిప్రాయానికి వచ్చారట. దీంతో ఇప్పటికే సినిమా కథను కూడా రజనీకి వినిపించారట. అయితే, త్వరలో చిత్ర యూనిట్ గుడ్‌న్యూస్ చెప్పే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. -
ఓటీటీలో మలయాళ థ్రిల్లింగ్ సినిమా.. తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
మలయాళ హిట్ సినిమా 'అంచక్కల్లకోక్కన్' ఇప్పుడు 'చాప్రా మర్డర్ కేస్' పేరుతో తెలుగులో విడుదల కానుంది. అది కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 15న థియేటర్స్‌లోకి వచ్చింది. ఈ మూవీని చూసిన ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్సే రాబట్టింది.'చాప్రా మర్డర్ కేస్' పేరుతో తెలుగు ఓటీటీ 'ఆహా'లో విడుదల కానుంది. సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అయితే, ఈ సినిమా మలయాళ ఒరిజినల్ వర్షన్ 'అంచక్కల్లకోక్కన్' అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో లుక్మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రలలో మెప్పించారు. ఉల్లాస్ చంబన్ దీనిని అద్భుతంగా తెరకెక్కించారు. చాప్రా మర్డర్ కేస్ కథ 1980ల బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. కేరళ - కర్ణాటక సరిహద్దులో ఉండే ఒక గ్రామంలో ఈ స్టోరీ నడుస్తుంది. తన తండ్రిని చంపిన వారిపై కుమారులు ఎలా రివేంజ్ తీర్చుకున్నారు అనే అంశాన్ని చాలా థ్రిల్లింగ్‌గా దర్శకుడు చెప్పారు. -
OTT: మలయాళ మూవీ ‘నునక్కుజి’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘నూనక్కూళి’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సమస్య అన్నది ఎవ్వరికైనా, ఎప్పుడైనా రావచ్చు. కానీ దానిని ఎలా పరిష్కరించుకుంటామన్నది మాత్రం మన మీదే ఆధారపడి ఉంటుంది. గుండు సూదంత ప్రశ్నకు గుండ్రాయంత సమాధానం అనుకుంటే అంతా గందరగోళమే. ఇదే నేపథ్యంలో వచ్చిన మలయాళ సినిమా ‘నూనక్కూళి’. ఇది తెలుగులో డబ్ అయింది. ప్రముఖ దర్శకులు జీతూ జోసెఫ్ తీసిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా ఆద్యంతం ఆకట్టుకుంటోంది. (చదవండి: ఈ వీకెండ్ ఏకంగా 24 మూవీస్.. అవి ఏంటంటే?)ఇక ఈ చిత్రం కథాంశానికొస్తే... ఓ పెద్ద వ్యాపార సంస్థకు ఎండీ అయిన పూళికున్నేల్ తన భార్యతో ఆంతరంగికంగా కలిసున్న వీడియోను తన లాప్టాప్లో దాచుకుంటాడు. ఇంతలో పూళికున్నేల్ సంస్థ పై ఐటీ రైడ్ జరిగి, ఇతని లాప్‌టాప్‌ను కూడా స్వాధీనపరుచుకుంటారు ఐటీ ప్రతినిధులు. కంపెనీ లావాదేవీల కన్నా ఇప్పుడు పూళికున్నేల్ దృష్టి తన వీడియో ఇతరుల దృష్టిలో పడకుండా చూడాలని ఆ ఐటీ ప్రతినిధి ఇంటికి తన లాప్టాప్ కోసం దొంగతనానికి వెళతాడు. ఆ సమయంలో వేరే ఒకావిడ తాను ఆత్మహత్య కోసం తయారు చేసుకున్న విషాన్ని పూళికున్నేల్ పొరపాటున తాగేస్తాడు. అది కాస్త పోలీస్ కేసు అవుతుంది. చివరాఖరికి పూళికున్నేల్ తన లాప్టాప్ దక్కించుకున్నాడా? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమెకు, ఐటి ప్రతినిధికి, హీరో పూళికున్నేల్కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది మాత్రం ఓటీటీలోనే చూడాలి. పూళికున్నేల్ పాత్రలో బసిల్ జోసెఫ్ అలాగే మరో ప్రధాన పాత్రలో గ్రేస్ ఆంటోని అద్భుతంగా నటించారు. సినిమా ఆద్యంతం కితకితలు పెట్టిస్తూనే ఉంటుంది. సున్నిత సమస్యకు ఆ సరదా పరిష్కారం ఏంటో ‘నూనక్కూళి’ సినిమాలో ఈ వారం చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
జస్టిస్ హేమా కమిటీ నివేదికపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్
మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడులకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సుమారు 20 మందికి పైగానే మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా హేమా కమిటీ రిపోర్ట్‌లోని అంశాలు సంచలనం రేపాయి. దీంతో ఇతలర చిత్రపరిశ్రమలలో కూడా చలనం వచ్చింది. తాజాగా ఈ అంశం గురించి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమలోని నటీమణులు ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారో తెలుసుకునేందు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో కన్నడ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఎన్.ఎం.సురేశ్ పాల్గొన్నారు. ఇండస్ట్రీకి చెందని ప్రముఖులతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ జరిపిన ఈ మీటింగ్ పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది.ఈ సమావేశంలో పాల్గొన్న ఎన్.ఎం సురేశ్ ఇలా చెప్పుకొచ్చారు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కన్నడ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుని, వాటిని సరిచేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో నటీమణులకు ఎలాంటి సమస్యలు రాకుండా వారిని సంరక్షించుకోవడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? అనే టాపిక్ గురించి చర్చించామని ఆయన అన్నారు. మహిళల రక్షణ కోసం తాము ఏం చేయబోతున్నామో త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.హేమా కమిటీ నేపథ్యందాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు.విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. కొద్దిరోజుల క్రితం ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. ఈ నివేదికపై పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాలీవుడ్‌తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
Bhargavi Nilayam Review: ఓ దెయ్యం పరిష్కరించుకున్న కథ!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘నీల వెళిచ్చమ్’(Neelavelicham) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఎక్కడైనా ప్రేమ కథలు చూస్తాం లేదంటే హారర్ కథలు చూస్తాం. కానీ ‘భార్గవి నిలయం’ (1964) హారర్ ప్రేమ కథా చిత్రమని చెప్పవచ్చు. ఎ. విన్సెంట్ దర్శకత్వంలో వచ్చిన ఈ బ్లాక్ అండ్ వైట్ మలయాళ సినిమాని రీమేక్ చేసి ‘నీల వెళిచ్చమ్’గా మన ముందు నిలిపారు దర్శకుడు ఆషిక్ అబు. ఈ చిత్రం కథాంశానికొస్తే... ఓ కథా రచయిత మారుమూల గ్రామంలోని ఓ భవంతిలోకి రావడంతో సినిమా మొదలవుతుంది. అదే భార్గవి నిలయం. ఆ ఊళ్లోని వారందరూ ఆ భవంతిలో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, ఆ అమ్మాయి ఆత్మ ఆ భవంతిలో తిరుగుతుందని భయపడుతూ ఎవరూ అటు వైపు వెళ్లడానికి కూడా సాహసించరు. కానీ ఈ రచయిత ధైర్యంగా ఆ భవంతిలోకి అడుగుపెట్టి ఆ దెయ్యం కథ రాయాలనుకుంటాడు. (చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)భార్గవి నిలయంలో అడుగుపెట్టిన రచయితకు దెయ్యం కనబడిందా? కనబడిన దెయ్యం తన కథ చెప్పిందా? అలాగే ఆ ఆత్మ తన కథలోని సమస్యను ఎలా పరిష్కరించుకోగలిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వింటేజ్ కథ. సినిమా స్క్రీన్‌ప్లే కొంత ల్యాగ్లో నడిచినా చూసే ప్రేక్షకుడిని మాత్రం రీ రికార్డింగ్, అద్భుతమైన సంగీతంతో కొంతవరకు ఆకట్టుకుంటుంది. కొంత ‘చంద్రముఖి’ సినిమా ఛాయలు కనబడినా చివరకు ఓ మంచి సినిమా చూశామన్న అనుభూతి కలుగుతుంది. టొవినో థామస్ హీరోగా నటించారు. ఈ చిత్ర కథానాయకుడు సినిమాలో భార్గవి బంగారం అని దెయ్యాన్ని ప్రేమగా పిలుస్తున్నప్పుడల్లా ప్రేక్షకుడికి ప్రేమానుభూతి కలుగుతుందన్న విషయంలో అతిశయోక్తి లేదు. తెలుగులో ‘భార్గవి నిలయం’గా అనువాదం అయి, ‘ఆహా ఓటీటీ’లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.– ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో 'ఆహా' అనిపించే సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' తెలుగు వర్షన్లో తీసుకొస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా మలయాళ సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా సినిమా 'ఆహా' విడుదల కానుంది. 2021లో రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. సుమారు మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. బిబిన్ పాల్ శామ్యూల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కేరళలో బాగా పాపులర్ అయిన 'టగ్ ఆఫ్ వార్' గేమ్ గురించి ఈ సినిమా తెరకెక్కించారు.'ఆహా' సినిమాలో ఇంద్రజిత్ సుకుమారన్ , మనోజ్ కె. జయన్, అమిత్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. 'టగ్ ఆఫ్ వార్ కి రెడీగా ఉండండి.. ఆట మొదలెట్టాక అటో ఇటో తేలిపోవాల్సిందే' అంటూ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. 1980, 1990ల్లో కేరళలో చాలా పాపులర్ అయిన 'టగ్ ఆఫ్ వార్' గేమ్‌లో పేరుగాంచిన ఆహా నీలూర్ స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ టీమ్‌లోని యువకులు పగటి సమయంలో వేర్వేరు పనులు చేస్తూ జీవనం సాగించే వారు. రాత్రి సమయంలో తమ గ్రామానికి చేరుకుని టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడేవారు. ఫైనల్‌గా ఆ యువకులు ఏం సాధించారనేది ఈ 'ఆహా' సినిమా కథ. సెప్టెంబర్ 12న ఆహా ఓటీటీలో మీరూ చూసేయండి. -
ఓటీటీలో క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
మలయాళం థ్రిల్లర్ సినిమాలకు టాలీవుడ్లో భారీగానే అభిమానులు ఉన్నారు. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తలవాన్ సినిమా ఈ ఏడాది మే 24న విడుదలైంది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న 'తలవాన్' చిత్రానికి జిస్ జాయ్ దర్శకత్వం వహించాడు. ఇందులో బిజు మీనన్, ఆసీఫ్ అలీ ప్రధాన పాత్రలలో నటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ఓటీటీలో రిలీజ్ కానుందని ఇప్పటికే ప్రకటన వచ్చింది. అయితే, సోనీ లివ్ సంస్థ తాజాగా మరో ప్రకటన చేసింది. సెప్టెంబర్ 9న సాయింత్రం నుంచే తలవాన్ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నట్లు సోనీ లివ్ వెళ్లడించింది. అయితే, ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది.తలవాన్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్లుగా బిజు మీనన్, ఆసిఫ్ అలీ అద్భుతమైన నటనతో మెప్పించారు. మియా జార్జ్, అనుశ్రీ హీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమాలో అనేక ట్విస్ట్‌లు ఉన్నాయి. అవన్నీ మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఓ పోలీస్ ఆఫీసర్‌కు నిజ జీవితంలో ఎదురైన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో తలవాన్ సీక్వెల్‌ను కూడా ప్రకటించారు. -
నటీమణులపై లైంగిక దాడులు జరిగితే బాధ్యత వారిదే: రాధిక శరత్‌కుమార్
మలయాళ 'చిత్రపరిశ్రమ'లో మహిళలపై వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నటీమణులకు కేటాయించిన కారవాన్లలో కొందరు సీక్రెట్ కెమెరాలు పెట్టారనే విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈ విషయం పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో తాజాగా ఆమె మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.సిట్ అధికారులు ప్రశ్నించారురాడాన్ సంస్థ నిర్మిస్తున్న 'తాయమ్మ కుటుంబంతార్' సిరీస్ గురించి నటి రాధిక శరత్‌కుమార్, నటీనటులు ఈరోజు చెన్నైలోని సైదాపేటలోని సీఐటీ నగర్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో మీడియాతో ఇలా మాట్లాడారు. 'హేమ కమిటీకి సంబంధించి 4 రోజుల క్రితం నేను చేసిన ఆరోపణలు నిజమా కాదా అని సిట్ నన్ను ఫోన్లో ప్రశ్నించింది. వాటికి సమాధానం కూడా చెప్పాను. కానీ, నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆ సంఘటన ఘతంలో జరిగింది. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువ మంది విద్యావంతులు వచ్చారు. దీంతో సినీ పరిశ్రమలో సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టాయి.కేరళ మాదిరి తమిళ ఇండస్ట్రీలో కూడా హేమ కమిటీ ఉండాలని కోరుతున్నాను. ఇండస్ట్రీలో ఏమైన సమస్యలు ఎదురైనప్పుడు కొందరు హీరోలు మనతో పాటు నిలబడితే.. కొందరు పట్టించుకోరు. సినిమా ఇండస్ట్రీ మహిళల కోసం మేము కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం.' అని రాధిక అన్నారు.కేరళ సంఘటన గురించి ఎందుకు ఫిర్యాదు చేయలేదని రాధికను ప్రశ్నించగా.. 'దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజలతో, మీడియాతో మాట్లాడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే కోర్టును ఆశ్రయించేందుకు కూడా నేను సిద్ధంగా లేను. అక్కడ కూడా న్యాయం జరగాలంటే చాలా రోజులు పడుతుంది. నిర్భయ కేసు 2012లో మొదలైతే.. 2020లో మాత్రమే దోషులకు శిక్ష పడింది. అని రాధిక గుర్తుచేశారు.లైంగిక దాడులు జరిగితే నిర్మాతలదే బాధ్యత సినీ నటీమణులపై లైంగిక దాడులు సమస్యలకు ఎవరు బాధ్యులన్న ప్రశ్నకు రాధికా ఇలా చెప్పుకొచ్చారు. ‘దీనికి నిర్మాతలే బాధ్యత వహించాలి. నటీమణులను సురక్షితంగా కాపాడాల్సిన బాధ్యత వారిదే. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎక్కడైనా పొరపాట్లు జరగొచ్చు. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. కానీ మహిళలకు అండగా ఎవరూ నిలబడటంలేదు. లైంగిక ఆరోపణల విషయంలో పురుషుల తప్పులేదని ఈ సమాజం మాట్లాడుతోంది. కానీ, నిందంతా మహిళలపైనే మోపుతున్నారు. మహిళల పట్ల సోషల్ మీడియాలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. తప్పుడు వ్యాఖ్యలను ప్రచురించే మీడియా సంస్థలను నిషేధించాలని నా విన్నపం. వారు ఎలాంటి విలేకరుల సమావేశానికి హాజరుకాకుండా బాయ్‌కాట్ చేయాలి. నిర్మాతల సంఘం, నటీనటుల సంఘం మధ్య నెలకొన్న సమస్యపై నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్‌తో కూడా ఇదే మాట్లాడాను. అని రాధిక అన్నారు. -
హేమా కమిటీ నివేదికపై హైకోర్టులో పిటిషన్
మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోన్న హేమా కమిటీ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అక్కడి పరిశ్రమలో పనిచేసే మహిళలు లైంగికదాడికి గురౌతున్నారని హేమా కమిటీ పేర్కొంది. కొద్దిరోజుల క్రితం ఆ నివేదికను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కమిటీ అందించింది. దీంతో చాలామంది బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.తాజాగా హేమా కమిటీ నివేదికపై జరిగే విచారణను సీబీఐకి వదిలేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈమేరకు న్యాయవాదులు ఏ జన్నాత్, అమ్యతా ప్రేమ్జిత్లు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తును కూడా సీబీఐకి అప్పగించాలని పిటిషన్లో వారు డిమాండ్ చేశారు. హేమా కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చిన వారికి భద్రత కల్పించాలని పిటిషన్లో కోరారు. సినిమా రంగంలో మహిళల భద్రతకు చట్టం అవసరమని ఈమేరకు కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని పిటిషన్లో డిమాండ్ చేశారు. -
జస్టిస్ హేమ కమిటీపై 'రజనీకాంత్' రియాక్షన్.. నెటిజన్లు ఫైర్
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదికను ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కమిటీ రిపోర్ట్‌పై రజనీకాంత్ చేసిన కామెంట్ విమర్శలకు దారితీస్తుంది. మలయాళ పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్నారని హేమ కమిటీ రిపోర్ట్‌లో తేలింది. దీంతో చాలామంది బాధితులు తమ బాధను తెలిపేందుకు ముందుకొచ్చారు. నిందితులపై కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే, తాజాగా కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ రియాక్ట్ అయ్యారుతాజాగా రజనీకాంత్ మీడియాకు కనిపించడంతో జస్టిస్ హేమా కమిటీపై స్పందించమని వారు కోరారు. ఈ విషయం గురించి తనకు ఎంత మాత్రమూ తెలియదంటూనే సారీ..! అని బదులిచ్చారు. రజనీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం గురించి రజనీ స్పందించకపోవడం ఏంటి..? అంటూ అభిమానులు కూడా మండిపడుతున్నారు. రజనీ లాంటి స్టార్ హీరోలే ఇలాంటి అంశంపై రియాక్ట్ కాకుంటే ఎలా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రజనీ.. మీరు గజినీలా మారకండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.తన తదుపరి చిత్రం 'వేట్టైయాన్' అక్టోబర్ 10న విడుదల కానుందని రజనీ తెలిపారు. ఆపై థాంక్యూ 'సూర్య' అంటూ 'కంగువా' సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరారు. వాస్తవంగా కంగువా కూడా అక్టోబర్ 10న విడుదల కావాల్సి ఉంది. అయితే, రజనీతో పోటీకి దిగడం లేదని సూర్య ప్రకటించడంతో కంగువా దాదాపు వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు రజనీ కంగువా గురించి ప్రస్తావించారని సమాచారం. ’ஹேமா கமிட்டி அறிக்கை பற்றி எனக்கு எதுவும் தெரியாது’ - நடிகர் ரஜினிகாந்த் பேட்டி..!#Chennai | #Rajinikanth | #Kerala | #HemaCommitteeReport | #ActorRajinikanth | #PolimerNews pic.twitter.com/S5i0tcODPu— Polimer News (@polimernews) September 1, 2024 -
హేమ కమిటీపై 'మమ్ముట్టి' ఫస్ట్ రియాక్షన్ ఇదే
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది. అందులో పలు దిగ్భ్రాంతికర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే మహిళలు చాలామంది క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక తెలిపింది. ఇప్పటికే మలయాళ పరిశ్రమలోని ప్రముఖులు చాలామంది పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రముఖ హీరో మమ్ముట్టి తొలిసారి స్పందించారు.మాలీవుడ్‌లో కొంతమంది అగ్ర నటులు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్న సమయంలో మమ్ముట్టి ఇలా స్పందించారు. హేమ కమిటీ నివేదికలో పేర్కొన్న సూచనలు, పరిష్కారాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. సినిమా షూటింగ్ సమయంలో మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా దర్శక నిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. హేమ కమిటీకి నా మద్దతు ఉంటుంది. చిత్రపరిశ్రమపై అద్యయనం చేసిన హేమ కమిటీ పలు సూచనలు ఇచ్చింది. వాటిని అమలు చేసే బాధ్యత అందరి మీద ఉంది. ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదులపై పోలీసుల విచారణ నిజాయితీగానే జరుగుతుంది. జస్టిస్ హేమ కమిటీ అందించిన రిపోర్ట్ కోర్టు వద్ద ఉంది. విచారణ పూర్తి అయిన తర్వాత నిందితులకు తగిన శిక్షను కూడా కోర్టు విధిస్తుంది. ఇండస్ట్రీలో 'పవర్ సెంటర్' అనేది లేదు. కానీ, సినిమా బతకాలి.' అనేది తన అభిప్రాంయ అని మమ్ముట్టి పేర్కొన్నారు. -
మాలీవుడ్‌లో మీ టూ : ‘మాకు ఆ విషయం చెప్పలేదు’
హేమ కమిటీ నివేదిక మాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ రిపోర్ట్ బయటకొచ్చాక పలువురు డైరెక్టర్స్, నటులపై పెద్దఎత్తున లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ తమకెదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(AMMA) సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అమ్మ అధ్యక్ష పదవిలో ఉన్న మోహన్ లాల్ సైతం వైదొలిగారు. పాలక మండలి పదవుల నుంచి మొత్తం 17 మంది సభ్యులు రాజీనామాలు సమర్పించారు. వీరంతా నైతిక బాధ్యత వహిస్తూ పక్కకు తప్పుకున్నారు. దీంతో మలయాళ చిత్రమండలిని రద్దు చేశారు. రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.రాజీనామా చేయని ఇద్దరు?అయితే అమ్మ సభ్యులుగా ఉన్న మరో ఇద్దరు హీరోయిన్స్ మాత్రం రాజీనామాలు సమర్పించలేదు. తాజాగా రద్దయిన కమిటీలో హీరోయిన్స్ సరయు, అనన్య సభ్యులుగా ఉన్నారు. అయితే రాజీనామా నిర్ణయంపై తమ సమాచారం లేదని వీరిద్దరు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమ అభిప్రాయం కూడా తీసుకోలేదని ఆరోపించారు. అయితే మండలి పూర్తిగా రద్దు చేయడంతో వీరి పదవులు కూడా పోయినట్లేనని భావిస్తున్నారు.అసలేంటి హేమ కమిటీ?ఇటీవల జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదికను బహిర్గతం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఆ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే మొదట అమ్మ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు. -
సీనియర్ నటుడిపై నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. అందులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మాలీవుడ్ పరిశ్రమలో ఉండే మహిళలు కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేసింది.మలయాళ సీనియర్ నటుడు సిద్ధిఖీ తనపై అత్యాచారం చేశాడంటూ సెన్సేషనల్ కామెంట్ నటి రేవతి సంపత్ చేసింది. ఆమె వ్యాఖ్యలతో మాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతుంది. అసోషియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ (AMMA) నుంచి ఆయన తప్పుకున్నాడు. జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేసి తాజాగా ఆ లేఖను AMMA ప్రెసిడెంట్ మోహన్ లాల్‌కు అందజేశాడు.నటి రేవతి సంపత్ 2021లోనే తనను చెప్పుకోలేని విధంగా హింసించారంటూ.. ఏకంగా 14 మంది పేర్లు బయటపెట్టి ఆమె సంచలనంగా మారింది. ఆ లిస్ట్‌లో నటుడు సిద్ధిఖీ కూడా ఉన్నారు. సినిమాలపై ఆసక్తి ఉండటంతో నేను ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో సోషల్‌మీడియా ద్వార సిద్ధిఖీ పరిచయం అయ్యాడు. ఆయన నటిస్తున్న సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నాకు ఆశ చూపించాడు. సుమారు ఏడేళ్ల క్రితం వచ్చిన సుఖమయిరిక్కట్టే చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో నటించారు. ఆ సమయంలో ప్రీమియర్ షోకు నన్ను కూడా ఆహ్వానించాడు. సినిమా పూర్తి అయిన తర్వాత తిరువనంతపురంలోని మస్కట్ హోటల్‌కు నన్ను తీసుకెళ్లి అక్కడ నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాపై అత్యాచారం చేశాడు. ఎదురుతిరిగినందుకు నాపై దాడిచేశాడు. హోటల్ గదిలో బిక్కుబిక్కుమంటూ నరకం చూశాను. ఆ భయానక సంఘటన నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేకున్నాను.' అని రేవతి సంపత్ చెప్పింది. సిద్ధిఖీ చాలా నీచమైన వ్యక్తి అంటూ తన స్నేహితులపై కూడా ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ 2019లోనే ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే, అది ఇన్నేళ్ల తర్వాత బయటకు రావడంతో అక్కడి పరిశ్రమలో పెద్ద దుమారం రేగుతుంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ అందరికీ న్యాయం చేస్తానని కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే రేవతి సంపత్ అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. -
OTT: మలయాళ మూవీ ‘గోళం’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘గోళం’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రపంచంలో ఎన్ని కథలు ఉన్నాయని అడిగితే... ప్రపంచ జనాభా ఎంతమంది ఉంటే అన్ని కథలు ఉన్నాయన్నట్టు... ప్రతి వ్యక్తికి సంబంధించిన జీవితం ఓ సినిమా కథే. కాకపోతే ఆ కథలను ఎంచుకోవడంలోనే ఉంటుంది అసలు ఆయువుపట్టు. ఈ విషయంలో మలయాళ దర్శకులు చాలా ముందుంటారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ వేదికగా వస్తున్న పలు చిత్రాలు మలయాళ దర్శకుల ఆలోచనా పటిమకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాటిలో ‘గోళం’ ఒకటి. సమ్జాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రకథ ఆయువు పట్టును చివరి వరకూ ప్రేక్షకులు కనిపెట్టలేరు. అంతగా రక్తి కట్టించే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని కట్టిపడేస్తుందీ సినిమా. ఈ చిత్రకథ విషయానికొస్తే... ఓ ఆఫీసులో బాస్ అనుకోకుండా బాత్రూంలో చనిపోయినపుడు ఆఫీసులో స్టాఫ్ తప్ప ఇంకెవరూ ఉండరు. దీనిని ఇన్వెస్టిగేట్ చేయడానికి సందీప్ కృష్ట తన టీమ్‌తో ఆఫీస్‌కు వస్తాడు. డే టైమ్ ఆఫీసులో బాస్ ఎలా చనిపోయాడు? హంతకుడు ఎవరు? ఇదే ‘గోళం’ సినిమా. ఇన్వెస్టిగేషన్ ఊహకందని ట్విస్టులతో, ఊహించని క్లైమాక్స్‌తో సాగుతుందీ సినిమా. ఆద్యంతం రక్తి కట్టే ఈ సినిమా చూశాక నేటి ఆఫీసుల్లో రిజిష్టర్ పంచ్ వేసేందుకు ఉపయోగించే మెషీన్‌ను చూడడానికి కూడా భయపడవచ్చు. ఎందుకో ఏమిటో ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ‘గోళం’ చూసేయండి. ‘గోళం’... వర్త్ టు వాచ్ ఇట్.– ఇంటూరు హరికృష్ణ -
మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'బరోజ్' విడుదల తేదీ ప్రకటన
ప్రముఖ నటుడు మోహన్ లాల్ తన విలక్షణ నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. అయితే, తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఫాంటసీ చిత్రం ‘బరోజ్’. సుమారు నాలుగేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ను ఆపేశారు. కానీ, ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించే సమయానికి మోహన్ లాల్ అప్పటికే కమిట్ అయిన సినిమాల నుంచి ఒత్తిడి వచ్చింది దీంతో బరోజ్ షూటింగ్ పనులు చాలా నెమ్మదిగా సాగాయి.తాజాగా మోహన్ లాల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా బరోజ్ గురించి అప్డేట్ ఇచ్చారు. 'బరోజ్' తన రహస్యాలను 3 అక్టోబర్ 2024న వెల్లడించడానికి వస్తున్నాడని విడుదల తేదీని ప్రకటించారు. అద్భుత సాహసం కోసం మీ క్యాలెండర్లో ఆ తేదీని నోట్ చేసుకోండి.' అంటూ మోహన్ లాల్ తెలిపారు. తాజాగా విడుదలైన పోస్టర్లో మోహన్ లాల్ గుండు, గుబురు గడ్డంతో ఉన్నారు. అలాగే ఈ సినిమాను త్రీడీ విధానంలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఇండియాలోనే మొదటి త్రీడీ చిత్రం మై డియర్ కుట్టిచాతన్కు దర్శకత్వం వహించిన జిజో పున్నూస్ కథను అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా సంతోష్ శివన్ పనిచేశారు. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ నటిస్తున్నాడు. వాస్కోడిగామాకి చెందిన అపార సంపద (బంగారం,వజ్రాలు) బరోజ్ అనే ఒక భూతం 400 ఏళ్ళగా కాపాడుతూ వస్తుంది. ఆయనకు సంబంధించిన నిజమైన వారసులకు ఆ సంపదని అప్పగించాలని ఆ భూతం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌తో సినిమా ఉండనుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న తెలుగు,హిందీ,తమిల్,కన్నడ,మలయాళంలో బరోజ్ సినిమా విడుదల కానుంది. -
ఓటీటీకి సర్వైవల్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కుంచకో బోబన్, సూరజ్ వెంజరమూడు, శృతిరామచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సర్వైవల్ కామెడీ చిత్రం గర్. ఈ సినిమాను జయ్ కె డైరెక్షన్లో తెరకెక్కించారు. జూన్ 14న థియేటర్లలో కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది. ఈ నెల 20 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓ జూలో సింహాం ఉన్న డెన్లోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఎలా బయటపడ్డారనే కథాంశంతోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాజేశ్ మాధవన్, మంజుపిళ్లై, శోభితిలకన్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బిజు మీనన్, ఆసీఫ్ అలీ నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'తలవన్'. ఈ సినిమాను జిస్ జాయ్ దర్శకత్వంలో తెరకెక్కించరు. ఈ ఏడాది మే నెలలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రేక్షకులను మెప్పించింది. పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మలయాళంలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 12 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడతో సహా మొత్తం ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ పోలీస్ అధికారి ఓ కేసును ఎలా చేధించాడనేది ఈ సినిమాలో చూపించారు. #Thalavan will be streaming from Sept 12 on SONY LIV. pic.twitter.com/5A1GE3jXs6— Christopher Kanagaraj (@Chrissuccess) August 11, 2024 -
ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న మమ్ముట్టి హిట్ సినిమా
ఇతర భాషల్లో హిట్ అందుకున్న సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఓటీటీ వేదికలపైన ఇప్పటికే చాలా సినిమాలు విడుదల అయ్యాయి. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అబ్రహామింతే సంతాతికల్ ఇప్పుడు తెలుగులో వచ్చేస్తుంది. మమ్ముట్టి నటించిన ఈ సినిమా డెరిక్ అబ్రహాం పేరుతో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. 2018లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. సుమారు ఆరేళ్ల తర్వాత తెలుగు ఓటీటీలో విడుదల కానుంది.మమ్ముట్టి నటించిన డెరిక్ అబ్రహాం ఆగష్టు 10వ తేదీన తెలుగు ఆహా ఓటీటీలో విడుదల కానుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి షాజీ పాడూర్ దర్శకత్వం వహించారు. గుడ్‌విల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై టీఎల్ జార్జ్, జాబీ జార్జ్ నిర్మించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురిచేసే కథతో దీనిని తెరకెక్కించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో మమ్ముట్టి మెప్పించారు. సుమారు రూ. 5కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 45 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యల కేసును ఏఎస్పీ డెరిక్ అబ్రహాం (మమ్ముట్టి) ఎలా పూర్తి చేశారనేది ప్రధానాంశంగా ఉంటుంది. ఆగష్టు 10వ తేదీన డెరిక్ అబ్రహాం చిత్రాన్ని ఆహా ఓటీటీలో చూసేయండి. -
ఓటీటీకి వచ్చేస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టర్బో. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ మూవీగా మలయాళంలో తెరకెక్కించారు. మే 23న మలయాళంలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో మెప్పించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఆగస్టు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనిలివ్ ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో అంజనా జయ ప్రకాశ్, రాజ్ బి.శెట్టి, శబరీష్ వర్మ, సునీల్, కబిర్ దుహాన్ సింగ్‌లు కీలక పాత్రలు పోషించారు.Hold on to your seats as Mammootty takes you on a roller coaster ride of thrills and twists. Stream Turbo from August 9th only on Sony LIV.#Turbo #SonyLIV #TurboOnSonyLIV #Action #Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas pic.twitter.com/xhwBhfFxbk— Sony LIV (@SonyLIV) July 27, 2024 -
OTT: ఐదుగురు భార్యలతో 'నాగేంద్రన్స్ హనీమూన్స్' ట్రైలర్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మలయాళం నటుడు సూరజ్ వెంజరమూడు తన కెరీర్లో మొదటిసారి వెబ్‌సిరీస్‌లో నటించారు. నాగేంద్రన్స్ హనీమూన్స్ పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సిరీస్‌లో సూరజ్ వెంజరమూడుతో పాటు శ్వేత మీనన్, గ్రేస్ ఆంటోనీ,నిరంజన అనూప్, కనికుశృతి, ఆల్ఫీ పంజికరన్ నటిస్తున్నారు. తాజాగా ట్రైలర్‌ను హాట్‌స్టార్ విడుదల చేసింది. నితిన్ రెంజీ పనికర్ ఈ సినిమాను నిర్మించడంతో పాటు రచన దర్శకత్వం వ్యవహరించారు. గతంలో ఆయన కేరళ ఫైల్స్ వెబ్ సిరీస్‌ను నిర్మించి గుర్తింపు పొందారు. ఈ సిరీస్‌లో ఐదుగురు భార్యలున్న భర్తగా సూరజ్ వెంజరమూడు కనిపించారు. గల్ఫ్‌కు వెళ్లాలి అనుకున్న నాగేంద్రన్ అనుకోకుండా ఐదు పెళ్లిలు చేసుకుంటాడు. వారందరిని ఆయన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాలతో మంచి ఎంటర్టైనర్గా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఐదుగురు భార్యలు ఉన్న నాగేంద్రన్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోన్నాడు..? అనేది తెలియాలంటే జులై 19 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న 'నాగేంద్రన్స్ హనీమూన్స్' చూడాల్సిందే. తెలుగు, తమిళ్, మలయాళంలో ఈ సిరీస్ విడుదల కానుంది. -
ఓటీటీలో రియల్‌స్టోరీతో సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ ఏడాదిలో తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించిన సినిమాలు మలయాళం నుంచే ఉన్నాయి. 2024 శాండల్‌వుడ్ చిత్రపరిశ్రమకు బాగా కలిసొచ్చిన సంవత్సరం అని కూడా చెప్పవచ్చు. ఈ క్రమంలో వచ్చిన మరొక చిత్రమే 'మలయాళీ ఫ్రమ్ ఇండియా'. మే 1న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్ ఇందులో నటించారు. ఈ సినిమాను డిజో జోస్ ఆంటోనీ డైరెక్ట్ చేశాడు. జనగణమన సినిమా హిట్ తర్వాత 'మలయాళీ ఫ్రమ్ ఇండియా'ను ఆయన తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.మలయాళీ ఫ్రమ్ ఇండియా అనే చిత్రాన్ని యథార్థంగా జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని తెరకెక్కించారు. కథలో బలం ఉండటంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే, ఈ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఆకతాయిగా ఉన్న ఒక యువకుడు ఊహించని ఘటనతో తన ఇల్లు వదిలి దుబాయ్ వెళ్లిపోతాడు. అక్కడికి చేరుకున్న తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది..? గ్రామంలో ఆకతాయిగా ఉన్న ఆ యువకుడి జీవితంలో వచ్చిన మార్పు ఏంటి..? ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ఎలా మెప్పించింది..? వంటి అంశాలు తెలియాలంటే మలయాళీ ఫ్రమ్ ఇండియా చూడాల్సిందే. ఫస్టాఫ్‌లో సినిమా కాస్త బోర్‌గా అనిపిస్తుంది. కొంత సమయం తర్వాతా చాలా ఆసక్తిగా కథ ఉంటుంది. మస్ట్ వాచెబుల్ సినిమా అని చెప్పవచ్చు. యథార్థ సంఘటనల ద్వారా తీసిన ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూసేయ్యండి. చివరి 30 నిమిషాలు సినిమాకి ప్రధాన బలం అని చెప్పవచ్చు. -
Viji Venkatesh: కన్నీటి భాష తెలిసిన నటి ఈమె
కన్నీళ్ల భాష తెలిసిన విజీ వెంకటేష్ కళారంగంలోకి అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్‌పై అవగాహన సదస్సులు నిర్వహించడం నుంచి క్యాన్సర్ బాధితులకు అండగా నిలవడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విజీ వెంకటేష్‌లో నటిగా మరో కోణం పరిచయం అయింది. ఆమెకు నటనలో ఓనమాలు తెలియవు. అయితే ‘తెలియదు’ అనే మాట దగ్గర ఆమె ఎప్పుడూ ఆగిపోలేదు. మలయాళం మాట్లాడడం నేర్చుకుంది. సాధన చేసి నటనలో శభాష్ అనిపించుకుంది. ‘బలమైన సినీ మాధ్యమం ద్వారా ఎన్నో సందేశాలను ప్రజలకు చేరువ చేయవచ్చు’ అంటుంది విజీ వెంకటేష్...71 ఏళ్ల వయసులో మలయాళ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన విజీ వెంకటేష్ మన దేశంలో క్యాన్సర్ పేషెంట్ల కోసం మూడు దశాబ్దాలకు పైగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె స్వచ్ఛంద సంస్థ ‘ది మాక్స్ ఫౌండేషన్’కు ఇండియా, సౌత్ ఏషియా హెడ్‌గా ఉన్నారు.దిల్లీలో పుట్టి పెరిగిన విజీకి సామాజిక స్పృహకు సంబంధించిన విషయాలపై స్కూల్‌రోజుల్లో నుంచే ఆసక్తిగా ఉండేది. ఆ ఆసక్తికి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. వివాహం తరువాత దిల్లీ నుంచి బాంబేకు వచ్చింది. ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించింది. తన ఆసక్తులకు తగిన వాతావరణం ఇక్కడ కనిపించింది. ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.‘ది మాక్స్ ఫౌండేషన్’ ద్వారా ఉద్యోగ, సేవాప్రస్థానాన్ని ప్రారంభించింది. ‘క్యాన్సర్ పేషెంట్ల గురించి పనిచేయాలనుకోవడానికి కారణం ఏమిటి? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. అయితే కాన్సర్పై పోరాటానికి, అవగాహన కలిగించడానికి క్యాన్సర్ పేషెంట్ కానక్కర్లేదు. వారి కష్టాలు మనకు తెలిసుంటే చాలు. ముంబైలో సంస్థలు, వ్యాపారవేత్తల నుంచి క్యాన్సర్ బాధితులకు అవసరమైన నిధుల సేకరణ ్రపారంభిండం ద్వారా నా ప్రస్థానం మొదలైంది’ అంటుంది విజీ.నిధుల సేకరణ మాత్రమే కాదు పేద క్యాన్సర్ పేషెంట్ల ఇంటికి వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. ధైర్యం చెప్పేది. వీరిలో చాలామందికి పొగాకు నమిలే అలవాటు ఉన్నట్లు గ్రహించింది. ఉద్యోగ ప్రయాణం మొదలైన కొత్తలో బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీకి వెళ్లి క్యాన్సర్‌కు సంబంధించిన ఎన్నో పుస్తకాలను చదివి కొత్త విషయాలను తెలుసుకునేది. అంతేకాదు టాటా మెమోరియల్ హాస్పిటల్‌లోని ఆంకాలజీ డిపార్ట్మెంట్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుంది.ఫ్యాక్టరీలకు వెళ్లి పొగాకు నమలడం ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కార్మికుల కోసం అవగాహన సదస్సులు నిర్వహించేది. ఈ సమావేశాలు పొగాకు నమిలే అలవాటు ఉన్న చాలామందిలో మార్పు తీసుకువచ్చి ప్రమాదం బారిన పడకుండా చూశాయి. అవగాహన సదస్సులతో పాటు పేదల కోసం ఎన్నో చోట్ల క్యాన్సర్‌కు సంబంధించి ఎర్లీ డిటెక్షన్ క్యాంపులు నిర్వహించింది. ఈ క్యాంప్‌లు ఎంతోమందిని కాపాడాయి.ఫహద్ ఫాజిల్‌తో విజీ వెంకటేష్అసలు సినిమాల్లో నటించే అవకాశం విజీ వెంకటేష్‌కు ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే... సోషల్ మీడియాలో ఆమె చురుగ్గా ఉంటుంది. మలయాళ డైరెక్టర్ అఖిల్ సత్యన్, అతని టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో విజీ వెంకటేష్ ఫొటోను చూశారు. తమ సినిమా ‘పచ్చుం అబ్బుతావిలక్కుమ్’కు ‘ఉమ్మచ్చి’ క్యారెక్టర్‌కు సరిగ్గా సరిపోయే మహిళ అనుకున్నారు. వెంటనే విజీ వెంకటేష్‌ను సంప్రదించారు.‘నేను ఫుల్–టైమ్ జాబ్ చేస్తున్నాను. నాకు మలయాళం పెద్దగా రాదు’ అని చెప్పింది. ‘ఈ వయసులో నటన ఏమిటి’ అని కూడా అన్నది. అయితే డైరెక్టర్ పట్టువదలని విక్రమార్కుడు అయ్యాడు. ‘రోల్’ గురించి మరింత వివరంగా చర్చించాడు. అతడి ఆసక్తి, వృత్తిపట్ల అంకిత భావం నచ్చడంతో విజీకి ‘ఓకే’ అనక తప్పలేదు. ఇక అప్పటినుంచి మలయాళం స్పీకింగ్ స్కిల్స్‌పై దృష్టి పెట్టింది. నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో విజీ తల్లి పాత్ర పోషించింది. స్వతంత్ర వ్యక్తిత్వం, పోరాడే ధీరత్వం ఉన్న మహిళ పాత్ర అది. నిజానికి ఈ పాత్రకి సంబంధించిన లక్షణాలు ఆమెలో సహజంగా ఉన్నవే.ఈ సినిమా నుంచి మరికొన్ని సినిమాల నుంచి ఆఫర్లు వచ్చాయి. ‘వీర’ లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు జయరాజ్ చిత్రం కోసం సైన్ చేసింది. కాటుక, ముక్కు పుడక... ఇలా విజీ వెంకటేష్‌కు తనదైన సిగ్నేచర్ స్టైల్ ఉంది. తన మొదటి సినిమా కోసం ఆ స్టైల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే కొత్త లుక్‌లో కూడా సహజంగా, అందంగా ఉంది విజీ వెంకటేష్. -
ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ ఏడాదిలో మలయాళ చిత్ర పరిశ్రమ చాలా హిట్ సినిమాలతో కళకళలాడిపోతోంది. ఈ ఏడాదిలో వచ్చిన చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లోనూ చేరాయి. చాలా సినిమాలు అక్కడి ప్రేక్షకులతో పాటు.. ఇతర భాషల సినీ ప్రేమికులనూ అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రేమలు,మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం,ఆవేశం,ఆడుజీవితం ,అన్వేషిప్పిమ్ కండెతుమ్ వంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇవన్నీ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.అయితే తాజాగా మరో హిట్ సినిమా తెలుగులో విడుదల కానుంది. అది కూడా ఓటీటీలోకి రానుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ నటించిన చిత్రం 'వర్షంగల్కు శేషం'. ఏప్రిల్ 11వ తేదీన రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ దక్కించుకుంది. సుమారు రెండేళ్ల క్రితం ప్రణవ్ మోహన్‌లాల్‌కు మొదటి హిట్ అందించిన డైరెక్టర్ వినీత్ శ్రీనివాసన్ ఈ చిత్రం ద్వారా మరో విజయాన్ని అందుకున్నారు. జూన్ 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ వేదికగా 'వర్షంగల్కు శేషం' స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు తెలుగు ట్రైలర్‌ను కూడా సోని లివ్ విడుదల చేసింది.మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో విడుదల అవుతుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 'వర్షంగల్కు శేషం' కథ మొత్తం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రధానంగా ఇద్దరు స్నేహితుల చుట్టూ జరిగే సంఘటనలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. వారిలో ఒకరు డైరెక్టర్ కావాలని ప్రయత్నిస్తే.. మరొకరు సంగీత దర్శకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తారు. ఎక్కువగా ఎమోషనల్ సీన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా ఈ చిత్రం దగ్గరైంది. జూన్ 7 నుంచి సోనీ లివ్‌లో తెలుగులో అందుబాటులోకి రానున్న ఈ చిత్రాన్ని కుటుంబంతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. -
చివరి శ్వాస వరకు సినిమాల్లో ఉంటా.. కానీ నన్ను గుర్తుంచుకోరు: మమ్ముట్టి
మలయాళ స్టార్, మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మమ్ముట్టి. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల యాక్షన్-థ్రిల్లర్ 'టర్బో'చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి, సునీల్, అంజనా జయప్రకాష్, కబీర్ దుహన్ సింగ్, సిద్ధిక్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూకు హాజరైన మమ్ముట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన చివరి శ్వాస వరకు సినిమాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.మమ్ముట్టి మాట్లాడుతూ..'నా చివరి శ్వాస వరకు నటనను విడిచిపెట్టే ఆలోచనే లేదు. నా మరణం తర్వాత ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారని ఆశించడం లేదు. ఎందుకంటే కాలక్రమేణా గొప్ప వ్యక్తులను కూడా ఎవరైనా మరచిపోతారనే విషయాన్ని గట్టిగా నమ్ముతా. అయినా ప్రజలు నన్ను ఎంతకాలం గుర్తుంచుకుంటారు? ఒక సంవత్సరం? పదేళ్లు? అంతకంటే చాలా తక్కువ. చాలా కొద్ది మంది మాత్రమే గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వేలమంది నటీనటుల్లో నేను ఒక్కడిని." అని అన్నారు.వారు నన్ను ఏడాది కంటే ఎక్కువ కాలం ఎలా గుర్తుంచుకోగలరు? మనం ఈ ప్రపంచంలో లేనప్పుడు మన గురించి ఎలా తెలుస్తుంది? ప్రపంచం అంతం అయ్యే వరకు అందరూ గుర్తుంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ జరగదు' అని అన్నారు. కాగా.. తన నటనతో ఇప్పటివరకు మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 1971లో ఇండస్ట్రీలో ప్రవేశించిన మమ్ముట్టి 400కు పైగా చిత్రాలలో నటించారు. 1973లో వచ్చిన ‘కాలచక్రం’లో సినిమాతో గుర్తింపు పొందారు. -
బాక్సాఫీస్ వద్ద క్రేజీ మార్క్‌ను దాటిన 'ఆడుజీవితం' కలెక్షన్స్
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన చిత్రం 'ఆడుజీవితం'. 'సలార్'లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ . ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 28న విడుదలైన విషయం తెలిసిందే. ఆడుజీవితం ది గోట్ లైఫ్ మూవీ తొలి వారంలోనే రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ ఏడాదే రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్ రికార్డును 'ఆడుజీవితం' బ్రేక్ చేసింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. కానీ మలయాళంలో మాత్రం ఫస్ట్ వీక్ పూర్తి అయిన తర్వాత కూడా 200లకుపైగా థియేటర్లలో రన్ అవుతుంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో కేవలం మలయాళ వెర్షన్ రూ. 90 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తెలుగులో కోటి రూపాయలు కూడా దాటలేదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2008లో అత్యధికంగా అమ్ముడైన మలయాళ నవల 'గోట్ డేస్'. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకుని బెన్యామిన్ ఈ నవల రాశారు. ఈ నవలకు మంచి ఆదరణ దక్కిన వెంటనే, సినిమాగా తీయాలని ఎంతోమంది ఆ హక్కుల కోసం ప్రయత్నించారు. బ్లెస్సీ ఆ నవల హక్కుల్ని కొని ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా రన్ టైమ్ విషయంలో కాస్త తగ్గించి ఉంటే బాగుండు అనే విమర్శ ఉంది. -
వెంటిలేటర్‌పైనే హీరోయిన్.. వేడుకుంటున్న అరుంధతి సోదరి
కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతుంది. మార్చి 14న ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గత కొద్దిరోజులుగా అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఎవరైనా సాయం చేస్తే గానీ బతకదని తన సోదరి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇప్పటికే పలుమార్తు వేడుకున్నారు. అందుకోసం బ్యాంకు వివరాలను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం త్రివేండ్రంలోని అనంతపూరి ఆస్పత్రిలో అరుంధతికి చికిత్స జరుగుతుందని ఆమె సోదరి ఆర్తీ చెప్పింది. ఇప్పుడు వెంటిలేటర్ సాయంతో అరుంధతి శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపింది. వైద్యం కోసం రోజూ దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు అవుతోందని, ఇప్పటికే అరుంధతి కోసం రూ. 40 లక్షలు ఆస్పత్రి బిల్లులు చెల్లించామని అర్తీ చెబుతుంది. అరుంధతి తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా మెదడులో రక్తం గడ్డకట్టింది. అందుకు సంబంధించిన బ్రెయిన్ సర్జరీ ప్రస్తుతం పూర్తి అయినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు కూడా కదలలేని స్థితిలో వెంటిలేటర్ మీదే అరుంధతి చికిత్స పొందుతున్నట్లు ఆర్తీ ఆవేధన చెందుతుంది. 90 రోజులు దాటినా తర్వాత కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం క్లారిటీగా చెప్పలేమని వైద్యులు అన్నట్లు ఆర్తీ పేర్కొంది. ప్రస్తుతం అరుంధతికి పక్కటెముకలకి సంబంధించిన శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది కాబట్టి తమకు సాయం చేయాలని ఆమె కోరింది. ఇప్పటికే పలువురు మళయాల నటీమణులు కూడా ఆమెకు సాయం చేయాలని పలు వీడియోల ద్వారా అభ్యర్థిస్తున్నారు. అరుంధతి నాయర్ తమిళ చిత్రం అయిన 'పొంగి ఎజు మనోహర'తో అరుంధతి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన 'సైతాన్' (తెలుగులో భేతాళుడు)లో హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by ❣️A S W A T H Y.R A H U L👸👑❣️ (@__aswathy__sr21__official__) -
The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను
సౌదీలో రెండేళ్ల పాటు 700 గొర్రెలను ఒంటరిగా మేపాడు. మరో మనిషితో మాట్లాడలేదు. మరో మాట వినలేదు. ఇసుకతో స్నానం ఇసుకే దాహం ఇసుక తప్ప మరేం కనిపించని ఒంటరితనం. బానిస బతుకు. కాని బతికి దేశం తిరిగి వచ్చాడు. 1995లో అతని జీవితం నవలగా వెలువడి మలయాళంలో సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం 138వ ప్రచురణకు వచ్చింది. అతని జీవితం ఆధారంగానే ‘గోట్ లైఫ్’ సినిమా తాజాగా విడుదలైంది. కేరళకు చెందిన నజీబ్ సంఘర్షణ ఇది. కేరళలోని అలెప్పి దగ్గరి చిన్న ఊరికి చెందిన నజీబ్ కోరుకుంది ఒక్కటే. సౌదీకి వెళ్లి ఏదో ఒక పని చేసి కుటుంబానికి నాలుగు డబ్బులు పంపాలన్నదే. ఆ రోజుల్లో కేరళ నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు చాలామంది పని కోసం వలస వెళ్లేవారు. నజీబ్ కూడా సౌదీకి వెళ్లాలనుకున్నాడు. ఏజెంట్ అతనికి ఒక మాల్లో సేల్స్‌మ్యాన్‌గా పని ఉంటుందని పంపాడు. అలా నజీబ్ సౌదీలో అడుగు పెట్టాడు. అది 1993వ సంవత్సరం. రెండు రోజుల తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో దిగాక నజీబ్ రెండు రోజుల పాటు ప్రయాణిస్తూనే ఉన్నాడు... అప్పుడు గాని అర్థం కాలేదు తాను మోసపోయానని. ఎడారి లోపల అతణ్ణి అరబ్ షేక్‌కు అప్పజె΄్పారు. ఆ షేక్ అక్కడే ఒక షెడ్డు వేసుకుని ఉండేవాడు. నజీబ్‌కు 700 గొర్రెలను కాచే పని అప్పజె΄్పాడు. వేరే బట్టలు ఇవ్వలేదు. స్నానానికి నీళ్లు ఇవ్వలేదు. బతకడానికి మాత్రం ముతక రొట్టెలు పడేసేవాడు. ఆ రొట్టెల్ని గొర్రెపాలలో తడిపి కొద్దిగా తినేవాడు నజీబ్. యజమాని, అతని తమ్ముడు ఈ ఇద్దరు మాత్రమే నజీబ్‌కు కనిపించేవారు. వారి అరబిక్ భాష తప్ప మరో భాష వినలేదు. మరో మనిషిని చూడలేదు. ‘నేను ఏడ్చినప్పుడల్లా వారు కొట్టేవారు’ అంటాడు నజీబ్. భ్రాంతులు నజీబ్‌కు ఎడారిలో ఉండి భ్రాంతులు మొదలయ్యాయి. అతడు గొర్రెల మధ్య ఉండి ఉండి తాను కూడా ఒక గొర్రెనేమో అనుకునేవాడు. రెండేళ్ల పాటు ఇలాగే జరిగింది. ఒకరోజు ఆ అన్నదమ్ములిద్దరూ పెళ్లి ఉందని వెళ్లారు. ఆ అదను కోసమే చూస్తున్న నజీబ్ ఎడారిలో పరిగెత్తడం మొదలుపెట్టాడు. దారి లేదు.. గమ్యమూ తెలియదు. పరిగెట్టడమే. ఒకటిన్నర రోజు తర్వాత మరో మలయాళి కనిపించి దారి చె΄్పాడు. అతడు కూడా తనలాంటి పరిస్థితిలో ఉన్నవాడే. చివరకు ఒక రోడ్డు కనిపించి రియాద్ చేరాడు. అక్కడి మలయాళీలు నజీబ్‌ను కాపాడారు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోతే తగిన పత్రాలు లేనందున 10 రోజులు జైల్లో పెట్టి ఇండియా పంపారు. నవల సినిమాగా నజీబ్ తిరిగి వచ్చాక కోలుకొని బెహ్రయిన్ వెళ్లాడు ఈసారి పనికి. అక్కడ పని చేస్తున్న రచయిత బెన్యమిన్‌కు నజీబ్‌తో పరిచయమైంది. నజీబ్ జీవితాన్ని బెన్యమిన్ నవలగా ‘ఆడు జీవితం’ (గొర్రె బతుకు) పేరుతో రాసి 2008లో వెలువరించాడు. అది సంచలనంగా మారింది. ఇప్పటికి వందకు పైగా ఎడిషన్స్ వచ్చాయి. 8 భాషల్లో అనువాదమైంది. ఆ నవల ్రపాశస్త్యం సినిమా రంగాన్ని ఆకర్షించింది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ‘ఆడు జీవితం’ పేరుతో నటించి మొన్న మార్చి 28న విడుదల చేశాడు. తెలుగులో గోట్‌లైఫ్ పేరుతో అనువాదమైంది. వాస్తవిక సినిమాగా ఇప్పటికే గోట్‌లైఫ్ ప్రశంసలు పొందుతోంది. -
మలయాళ ఏకైక సినిమాగా 'మంజుమ్మెల్ బాయ్స్' రికార్డ్..!
మలయాళం సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్' చరిత్ర సృష్టించింది. ఈ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు మలయాళ ఇండస్ట్రీలో ఏ సినిమా ఈ మార్క్‌ను అందుకోలేదు. దీంతో ఈ ఫీట్ సాధించిన ఏకైక సినిమాగా 'మంజుమ్మెల్ బాయ్స్' చరిత్రకెక్కింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 29న రిలీజ్ చేయబోతోంది. చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమా సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఫిబ్రవరి 22న రిలీజైన ఈ మూవీ కేవలం 25 రోజుల్లోనే రూ. 200 కోట్లు కలెక్షన్స్ సాధించడం విశేషం. గతంలో ఏ మలయాళ మూవీ ఈ ఘనతను అందుకోలేదు. ఈ చిత్రం తర్వాత '2018' సినిమా తర్వాత స్థానంలో ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా రూ. 180 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఈ సినిమా పేరుతోనే ఉంది. తాజాగా దానిని మంజుమ్మెల్ బాయ్స్ బీట్ చేసింది. తర్వాతి స్థానాల్లో మోహన్‌లాల్ నటించిన 'మన్యం పులి' రూ. 150 కోట్లు కలెక్ట్ చేస్తే.. 'లూసిఫర్' రూ. 130 కోట్లు అందుకుంది. రీసెంట్గా రిలీజ్ అయిన 'ప్రేమలు' ఇప్పటి వరకు రూ. 120 కోట్లు సాధించి ఐదో స్థానంలో ఉంది. మంజుమ్మెల్ బాయ్స్ కథ 2006లో రియల్‌గా జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ ఏడాదిలో కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ గుహలకు విహారయాత్రకు వెళ్లారు. అందులో ఒక యువకుడు పొరపాటున ఓ లోతైన గుహలోకి జారి పడిపోతాడు. ఆ తర్వాత అతన్ని స్నేహితులు ఎలా కాపాడుతారన్నదే 'మంజుమ్మెల్ బాయ్స్' స్టోరీ. -
ఓటీటీలోకి వచ్చేసిన 'పోలీస్ డ్రామా' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
రణం, ఖతర్నాక్ వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు బిజుమీనన్ హీరోగా నటించిన 'తుండు' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రంలో అయ్యప్పన్ నాయర్ పాత్రలో కనిపించిన ఆయన టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ చిత్రం తెలుగులో కూడా భీమ్లా నాయక్‌గా రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో భారీ అంచనాలతో విడుదలైన 'తుండు' సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. రియాస్ షెరీఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి కామెడీతో పాటు ప్రేక్షకులను కట్టిపడేసే పోలీస్ డ్రామా ఉంటుంది. కొన్నిసార్లు గుండె బరువెక్కిన సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. ఉన్నియ ప్రసాద్, షైన్ టామ్ చాకో, బిజు మీనన్‌లతో సహా పలువురు ప్రతిభావంతులైన తారాగణం ఇందులో ఉంది. ఫిబ్రవరి 16, 2024న థియేటర్లలో విడుదలైన 'తుండు' మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది. తాజాగా మార్చి 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు కన్నడతో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది. సినిమా మొత్తం ఒక కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందాలనే కాంక్షతో ఉన్న కానిస్టేబుల్ చాలా నిజాయితీగా పనిచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయనకు ఊహించని సవాళ్లు ఎదరవుతాయి. దీంతో పలు సమస్యలలో చిక్కుకుంటాడు. దీంతో ఆయన జీవితంలో ఊహించని మలుపులు తిరుగుతాయి. కథలో మంచి గ్రిప్పింగ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. కానీ పోలీసు డ్రామా చిత్రాలను ఇష్టపడే వారికి మాత్రం ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ వీకెండ్లో తుండు సినిమా ఖచ్చితంగా కాలక్షేపం ఇస్తుందని చెప్పవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని భాషలలో తుండు చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. -
ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిన మలయాళం సినిమా తెలుగులో ఎప్పుడంటే
మలయాళంలో ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రేమలు చిత్రం రూ. 100 కోట్ల మార్క్‌ను దాటి విజయవంతంగా రన్ అవుతుంది. అదే విధంగా మంజుమ్మెల్ బాయ్స్ మూవీ కూడా రూ. 190 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే 200 కోట్ల మార్కును కూడా దాటేయబోతోందీ చిత్రం. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయబోతోంది మైత్రీ మూవీ మేకర్స్. ఇతర భాషల్లో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న సినిమాలను తెలుగులో విడుదల చేయడం సాధారణం అయ్యింది. ఈ క్రమంలో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ తెలుగులోనూ ఈ సినిమా ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహించి ఆ తర్వాత రిలీజ్ చేయాలని గతంలో వాయిదా వేశారు. మార్చి 29న తెలుగులో రిలీజ్ కానుందని మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే వెల్లడించింది. డైరెక్టర్ చిదంబరం ఈ మూవీని రూ.20 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించారని వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 22న విడుదల అయిన ఈ సినిమాకు భారీ స్పందన లభించింది. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో సౌబిన్ షాహిర్, సీనియర్ నటుడు లాల్, అరుణ్ కురియన్, ఖలిడ్ రెహ్మాన్, శ్రీనాథ్ భసి, బాలు వర్గీస్, గణపతి, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, షెబిన్ బెన్సన్, లాంటి స్టార్స్ కీలక పాత్రలో పోషించారు. 2006లో రియల్‌గా జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ ఏడాదిలో కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ గుహలకు విహారయాత్రకు వెళ్లారు. అందులో ఒక యువకుడు పొరపాటున ఓ లోతైన గుహలోకి జారి పడిపోతాడు. ఆ తర్వాత అతన్ని స్నేహితులు ఎలా కాపాడుతారన్నదే 'మంజుమ్మెల్ బాయ్స్' స్టోరీ. -
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం
గత కొన్ని నెలలుగా మలయాళ ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. వాటిలో ఎక్కువగా థ్రిల్లర్, సస్పెన్స్ చిత్రాలే ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా, మరో మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. మలయాళ చిత్ర పరిశ్రమలో విమర్శకుల ప్రశంసలను పొందిన 'ఆట్టం' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది జనవరి 5న విడుదల అయిన చిత్రం బాక్సాఫీస్ వద్ద దమ్మురేపింది. ఆట్టం సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి ఈ చిత్రం మలయాళం భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉండటంతో చాలామంది ఈ చిత్రాన్ని చూస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులను ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా కథ ఉండటంతో ఓటీటీలో కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.ఆట్టం చిత్రంలో జరీన్ షిహాబ్, కళాభవన్ షరోజాన్, వినయ్ ఫోర్ట్, జాలీ ఆంథోనీ, మదన్ బాబు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఆనంద్ ఏకర్ డైరెక్ట్ చేశారు. బాసిల్ సీజే సంగీతం అందించగా జాయ్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై అజిత్ జాయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అట్టం కథ, కథనంలో సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగా ఉండటంతో పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ఈ చిత్రం ప్రదర్శితమైంది. నాటకాలు ప్రదర్శించే ఒక టీమ్‌లో 12 మంది పురుషులు ఉండగా.. అందులో ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. కానీ ఆ అమ్మాయిపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో వారి గ్రూపులో విభేదాలు వస్తాయి. ఆ నేరం ఎవరు చేశారు అనే విషయంలో పలు నాటకీయత అంశాలు తెరపైకి వస్తాయి. ఫైనల్‌గా ఆ అమ్మాయిపై లైంగిక దాడి చేసింది ఎవరు..? అని కనుగునే క్రమంలో కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. -
ఆరు నెలల తర్వాత ఓటీటీకి హనీ రోజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక సినీ ప్రియులు పంథానే మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు తెగ చూసేస్తున్నారు. ఏ భాషల్లో తెరకెక్కించినా సరే.. డబ్బింగ్ చేసి ఇతర భాషల్లోకి రిలీజ్ చేస్తున్నారు. అలా స్ట్రీమింగ్ అయ్యే వాటిలో మలయాళ చిత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా మరో మలయాళ సూపర్ హిట్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. మలయాళంలో తెరకెక్కించిన రాణి: ది రియల్ స్టోరీ సెప్టెంబర్ 2023లో విడుదలైంది. కేరళలో ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమా మార్చి 7న మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇది కేవలం మలయాళ ప్రేక్షకుల మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాకు శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించారు. రాజకీయ నాయకుడు ధర్మరాజన్ని రహస్యంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పనిమనిషి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది అలాంటి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా.. ఈ చిత్రంలో హనీ రోజ్, గురు సోమసుందరం, ఇంద్రన్స్, అశ్విన్ గోపీనాథ్, అశ్వత్ లాల్, భావన, నియతి కాదంబి, మాలా పార్వతి, అనుమోల్, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. -
ఆ హీరోతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మిస్ శెట్టి!
సినిమా ఇండస్ట్రీలో స్వీటీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అనుష్కనే. ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అలరించారు. ఈ బెంగళూరు భామ మొదట్లో యోగా టీచర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సూపర్ అనే తెలుగు చిత్రంలో నాగార్జునకు జంటగా నటించే అవకాశం వరించింది. అలా తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్ని తన అందాలతో కొల్లగొట్టిన అనుష్క ఆ తర్వాత రెండు అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో మరింతగా గ్లామరస్‌గా నటించి తడితడి అందాలతో తమిళ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టించారు. ఇంకేముంది ఈ రెండు భాషల్లోనూ వరుసగా అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అలాంటి గ్లామరస్ నటిని అరుంధతి చిత్రంతో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఆ చిత్రం తమిళంలోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత భాగమతి చిత్రాలతో తనలోని నట దాహాన్ని తీర్చుకున్న అనుష్క, బాహుబలి చిత్రంతో నటిగా మరో అంతస్తుకు చేరుకుంది. అలా తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన నటించిన ఈ భామ సైజ్ జీరో అనే చిత్రంలో నటించడానికి ఏ హీరోయిన్ చేయని సాహసం చేశారు. అందులోని పాత్ర కోసం బరువును విపరీతంగా పెంచుకున్నారు. అయితే ఆ తర్వాత బరువు తగ్గడానికి ఇప్పటి వరకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. దీంతో అవకాశాలు ఆమెకు దూరమయ్యాయనే అనే చెప్పాలి. ఇటీవలే రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం అనుష్కకు మంచి కమ్ బ్యాక్‌గా నిలిచింది. దీంతో నూతన ఉత్సాహంతో మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారు తాజాగా ఒక మలయాళ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. హోమ్ చిత్రం ఫేమ్ రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జై సూర్యకు జంటగా అనుష్క నటిస్తున్నారు. ఇది చారిత్రక కథ చిత్రంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా రెండు భాగాలుగా రూపొందుతున్నట్లు తెలిసింది. తన పాత్ర కొత్తగా ఉండకపోతే అనుష్క ఇందులో నటించడానికి సమ్మతించి ఉండరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. -
100 మిలియన్ వ్యూస్ వచ్చిన ఈ పాటను చూశారా?
సంగీతానికి భాషతో సంబంధం లేదు. హృదయాన్ని హత్తుకునే పాటలను ఎవరు స్వరపరిచినా అది విశ్వవ్యాప్తం అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎందరో సంగీత దర్శకులు, గాయకులు నిరూపించారు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది) 'ఒల్లుల్లేరు ఒళ్లుల్లేరు మణినంకరే...బీరాజ్పేట దొందుగేయే మణినంకరే...' ఇవి మలయాళీలకు బాగా తెలిసిన పదాలు వీటిని ఒకపాటగా చేర్చి ప్రపంచాన్నే మెప్పించారు. ఈ సంప్రదాయ జానపద పాట విన్నప్పుడల్లా ఆ రిథమ్‌తో వారు కదులుతారు. రీసెంట్గా ఈ జానపద పాటను మళ్లీ 'అజగజాంతరం' అనే ఓ మలయాళీ సినిమాలో విన్నాం. తాజాగా ఈ పాట అరుదైన ఘనతను సాధించింది. యూట్యూబ్‌లో 'ఒల్లుల్లేరు' 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఏడాది క్రితం వచ్చిన ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసిందనే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: కెమెరాల ముందు ముద్దులు, సారీ చెప్పిన సల్మాన్ ఖాన్) ఈ మధ్య కాలంలో ఏ మలయాళ పాటలు సాధించలేని ఘనత దీనికి దక్కింది. జస్టిన్ వర్గీస్ సంగీతం అందించగా ప్రసీత చాలకుడి అనే సింగర్ అద్భుతంగా పాడింది. ఆమె జానపద గీతాల కళాకారిణి కావడంతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే సంగీత ప్రియుల్ని ఈ పాట ఉర్రూతలు ఊగిస్తుంది. అక్కడ ఏ వేడుక జరిగినా ఈ పాట ఉండి తీరాల్సిందే. -
27 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళ సినిమాకు కీరవాణి సంగీతం
‘నాటు.. నాటు...’ అంటూ దేశీ ట్యూన్‌తో దేశీయులతోనే కాదు... విదేశీయులతో కూడా స్టెప్పులేయించారు ఎంఎం కీరవాణి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’లోని ఈ పాట ఆస్కార్ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కీరవాణిని అందరూ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు. నిజానికి ఆయన ఎప్పుడో పాన్ ఇండియా సంగీతదర్శకుడు. (చదవండి: త్వరలో భోళా మానియా) తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా పలు భాషల చిత్రాలకు సంగీతం అందించారు. కాగా 27ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన మలయాళ సినిమా ‘మెజీషియన్’ అంగీకరించారు. గతంలో మలయాళంలో ‘దేవరాగం’ (1996)కి సంగీతదర్శకుడిగా వ్యవహరించారు. ఇక ‘మెజీషియన్’కి కీరవాణి మూడు పాటలకు స్వరాలందిస్తారని తెలిసింది. బేబీ జాన్ వల్యత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
ఎడారి బతుకును తెరపై చూపే చిత్రం.. ట్రైలర్ చూశారా?
జాతీయ అవార్డ్ గ్రహీత బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ఆడు జీవితం'. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించారు. మలయాళంలో ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో గోట్ లైఫ్ అనే పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తే మారుమూల గ్రామం నుంచి అరబ్ దేశానికి వెళ్లి ఇబ్బందులు పడే ఓ యువకుడి కష్టాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బానిస బతుకు అనుభవిస్తున్న వలస కూలీగా పృథ్విరాజ్ జీవించాడు. చిరంజీవి నటించిన ‘సైరా’లో ఓ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ను సంప్రదించగా.. ఈ సినిమా కోసం విదేశాల్లో ఉండటంతో ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయికగా నటిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా కనిపిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. బెన్ని డానియల్ రాసిన నవల ‘ఆడు జీవితం’ ఆధారంగానే బ్లెస్సీ ఈ సినిమాను తీర్చిదిద్దారు. -
మరో మలయాళ సంచలనం..రూ.6 కోట్లతో తీస్తే.. రూ.42 కోట్ల కలెక్షన్స్!
సీనీ ప్రేక్షకులు ఆలోచన మారింది. ఒకప్పుడు స్టార్ హీరోహీరోయిన్ ఉంటే చాలు.. ఎలాంటి సినిమానైనా ఆదరించేవాళ్లు. తమ అభిమాన హీరో అయితే.. సినిమా బాలేకపోయినా థియేటర్స్‌కి వెళ్లి చూసేవాళ్లు. కానీ ఇప్పుడు వారి ఆలోచనలో మార్పు వచ్చింది. మంచి కంటెంట్ ఉంటే చాలు.. హీరో హీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వెళ్తున్నారు. దానికి మంచి ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘కాంతర’ చిత్రమే. ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి పెద్ద స్టార్ హీరో ఏం కాదు. కానీ ఆయన సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆడింది. ఊహించని కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. తాజాగా మలయాళ చిత్రం ‘జయ జయ జయహే’ కూడా అలాంటి విజయాన్నే సొంతం చేసుకుంది. పేరున్న నటీనటులేవరు అందులో లేకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. మలయాళంలో చిన్న సినిమాగా అక్టోబర్ 28న విడుదలైన ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.42 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టిస్తోంది. బేసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా విపిన్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను కేవలం 42 రోజుల్లోనే తీయడం మరో విశేషం. ‘జయ జయ జయహే’ కథేంటంటే.. జయ భారతి(దర్శన రాజేంద్రన్) మధ్య తరగతికి చెందిన తెలివైన అమ్మాయి. స్వతంత్ర భావజాలం కలిగిన అమ్మాయి. ఆమె చదువు పూర్తి కాకముందే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు. పెళ్లి తర్వాత కూడా తాను చదువుకుంటానని, తన నిర్ణయాన్ని అంగీకరించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని చెబుతుంది. జయ నిర్ణయాన్ని అంగీకరించడంతో పౌల్ట్రీ యజమాని రాజేష్(బేసిల్ జోసెఫ్)తో పెళ్లి జరుగుతుంది. పెళ్ళి తర్వాత రాజేష్ జయ చదువు వాయిదా వేస్తూ ఇంట్లో జరిగే ప్రతిదీ తన ఇష్ట ప్రకారమే జరగాలని మొండిగా ఉంటాడు. ఆ తర్వాత జయను శారీరకంగా కూడా హింసిస్తాడు. అది సర్వ సాధారణ వ్యవహారంగా మారటంతో జయ తల్లిదండ్రుల మద్దతు కోరుతుంది. కానీ వారు సర్దుకుపొమ్మని చెబుతారు. తనకు సాయం చేసేందుకు ఎవరూ రారన్న నిజాన్ని గ్రహించి తదనుగుణంగా చర్యలు తీసుకుని తన కష్టాలకు ఎలా ముగింపు పలికింది అనేది మిగతా కథ. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేయాలని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగు హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. -
త్రిష చిత్రంలో నయనతార?.. ఆ పాత్రకు అంగీకరిస్తారా..?
ఒకే చిత్రంలో ఇద్దరు అగ్ర హీరోయిన్లు నటిస్తే ఆ చిత్రానికి వచ్చే క్రేజే వేరే లెవల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి వార్త ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం దక్షిణాదిలోనే అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్న ఈమె తాజాగా బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేశారు. షారూఖ్‌ఖాన్ జవాన్ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. అదే విధంగా తెలుగులో చిరంజీవి కథానాయకుడుగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ఆయనకు సోదరిగా కీలకపాత్రను పోషించారు. ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. కాగా ఈ లేడీ సూపర్‌స్టార్‌ను మరో స్టార్ హీరోయిన్ త్రిషతో కలిసి ఒక చిత్రంలో నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవైగా నటించిన త్రిష మంచి ప్రశంసలను అందుకుంటున్నారు. 40 ఏళ్ల వయసు టచ్ చేస్తున్నా ఇప్పటికీ చెక్కుచెదరని అందాలతో అభిమానులను అలరిస్తున్న ఈమె ఇప్పటికీ కథానాయకిగానే నటిస్తున్నారు. కాగా తమిళ సినిమాలో అగ్ర కథానాయకిలుగా రాణిస్తున్న నయనతార, త్రిష ఇప్పటి వరకు ఒక చిత్రంలో కూడా కలిసి నటించలేదు. ఈ మధ్య అలాంటి సందర్భం వచ్చినా అది సెట్ కాలేదు. నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రంలో నటి త్రిష కూడా నటించాల్సింది. అందుకు గాను త్రిషతో చర్చలు కూడా జరిగాయి. అయితే కొన్ని కారణాల వల్ల త్రిష ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించలేదు. ఆ తరువాత ఆ పాత్రలో సమంత నటించారు. కాగా ప్రస్తుతం త్రిష తమిళం, మలయాళం భాషల్లో రూపొందుతున్న రామ్ అనే చిత్రంలో మోహన్‌లాల్‌కు జంటగా నటిస్తున్నారు. జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెస్తున్నట్లు సమాచారం. కాగా ఇందులో మరో నాయకితో చర్చలు జరుగుతున్నట్లు టాక్. చిత్ర తొలి భాగం క్లైమాక్స్ సన్నివేశాలు నయనతార, త్రిష కలిసే సన్నివేశాలు చోటు చేసుకుంటాయని, రెండవ భాగంలో నయనతార పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని సమాచారం. అయితే ఇందులో నటించడానికి నయనతార అంగీకరిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే. -
Nayanthara: నయనతార 'నిళల్' మూవీ రివ్యూ
చిత్రం: ‘నిళల్’ (మలయాళం) తారాగణం: నయనతార, కుంచాకో బోబన్; సంగీతం: సూరజ్ ఎస్. కురూప్ కెమేరా: దీపక్ డి ఎడిటింగ్: అప్పు ఎన్. భట్టాత్రి, అరుణ్ లాల్ దర్శకత్వం: అప్పు ఎన్. భట్టాత్రి నిడివి: 124 నిమి ఓటీటీ: అమెజాన్ దేశంలోని ఎక్కడెక్కడి వాళ్ళకూ ఇప్పుడు మలయాళం సుపరిచితం. కారణం.... కరోనా దెబ్బతో ఓటీటీలో మలయాళం సినిమాలు పెద్ద హల్చల్. లేటెస్ట్గా అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతున్న మలయాళ చిత్రం – నయనతార ‘నిళల్’ (అంటే ‘నీడ’ అని అర్థం). మిస్టరీ థ్రిల్లర్ కోవకు చెందిన చిత్రమిది. కాకపోతే, ఇప్పటికే మంచి మలయాళ సినిమాలెన్నో చూశాక, ఈ మిస్టరీ వాటితో పోలిస్తే అంతగా ఆనుతుందా? కథేమిటంటే..: ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జాన్ బేబీ (కుంచాకో బోబన్). కారు ప్రమాదంలో గాయపడ్డ అతనికి లేని వర్షం పడుతోందన్న భ్రమ లాంటివి కలుగుతుంటాయి. ఇంతలో, చైల్డ్ సైకాలజిస్ట్ అయిన డాక్టర్ ఫ్రెండ్ షాలిని (దివ్య ప్రభ) ద్వారా ఎనిమిదేళ్ళ చిన్న స్కూలు పిల్లాడు నితిన్ గురించి తెలుస్తుంది. మర్డర్ స్టోరీలు చెప్పే ఆ కుర్రాడి గురించి, అతని తల్లి షర్మిల (నయనతార) గురించి హీరో ఆరా తీస్తాడు. చూడడానికి మామూలుగా ఉండే ఆ కుర్రాడు కథలో చెప్పే ప్రాంతాలకు వెళితే, నిజంగానే అక్కడ అస్తిపంజరం బయటపడుతుంది. పిల్లాడు చెబుతున్న కథలు ఒక్కొక్కటీ వాస్తవ మని తేలడంతో మిస్టరీ పెరుగు తుంది. దాన్నిఛేదించడానికి హీరో, ఆ పిల్లాడి తల్లి ఏం చేశారు? తండ్రి లేని ఆ పిల్లాడిని తల్లి అసలు ఎలా పెంచింది? ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి లాంటివి చివరలో ముడి వీడతాయి. ఎలా చేశారంటే..: సగటు తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ సినిమాలో బాగా తెలిసిన ముఖం నయనతార ఒక్కరే! పిల్లాడి తల్లి పాత్రలో ఆమె చేయడానికి ఈ కథలో పెద్దగా ఏమీ కనపడదు. కథలో తొలిసారి కనిపించే లాంటి కొన్నిచోట్ల మేకప్ కూడా ఎక్కువవడంతో నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక, కథానాయకుడైన మేజిస్ట్రేట్ పాత్రలో కుంచాకో బోబన్ ఫరవాలేదనిపిస్తారు. కేరళలోని తొలి స్టూడియో అయిన ‘ఉదయ’ ఓనర్ల కుటుంబానికి చెందిన అతను ఒకప్పుడు బాల నటుడు. ఇప్పుడు పలు చిత్రాల హీరో, నిర్మాత, వ్యాపారవేత్త. లేటెస్ట్ మలయాళ థ్రిల్లర్ ‘నాయట్టు’ (వేట)లోనూ ఇతనే హీరో. సినిమా చివరలో మలయాళ దర్శక, నటుడు లాల్ కాసేపు కనిపిస్తారు. ఎలా తీశారంటే..: మొదట కాసేపు బాగా నిదానించినా, అరగంట తర్వాత కథలోని మిస్టరీ ఎలిమెంట్ ప్రేక్షకులను కూర్చోబెడుతుంది. కాకపోతే, ఆ ఆసక్తిని కొనసాగించడంలోనే దర్శక, రచయితలు విఫలమయ్యారు. ఎంచుకున్న ఇతివృత్తం బాగున్నా, దాన్ని ఆసక్తిగా చెప్పడంలోనే ఇబ్బంది పడ్డారు దర్శకుడు. ప్రాథమికంగా ఎడిటరైన ఆయనకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. హీరో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ, హీరోయిన్ చిన్నప్పటి కష్టాలు, క్లైమాక్స్‌లో వచ్చే అసలు కథ – ఇలా బోలెడు అంశాలున్నాయి కానీ, అన్నిటినీ కలిపి కథగా చెప్పలేకపోయారు. కథారంభంలో వేసుకున్న ముడులు సంతృప్తి కలిగేలా విప్పలేదనిపిస్తుంది. కేరళలోని అందమైన లొకేషన్లతో పాటు కర్ణాటక హొగెనెకల్ జలపాతం దాకా సినిమా తిరుగుతుంది. అయితే సీన్లకు సీన్లు జరుగుతున్నా కథ ముందుకు నడిచేది తక్కువ. పైగా పాత్రలూ ఎక్కువే. కథ కన్నా కెమేరా వర్క్, ఆర్.ఆర్. మీద ఎక్కువ ఆధారపడ్డారా అని అనుమానం కలుగుతుంది. సినిమాలోని రెండు పాటలూ లేకున్నా ఫరవాలేదు. వర్షం పడడం లాంటి అతని భ్రమలకు కారణం ఏమిటన్నది సినిమా చివరి దాకా చూసినా అర్థం కాదు. నయనతార పాత్ర, ఆ పాత్ర ప్రవర్తన కూడా ఓ పట్టాన అంతుచిక్కదు. పిల్లాడి కథకూ, తన కథకూ ఏదో ముడి ఉందని భావించిన హీరో దానికి ముగింపు చెప్పలేదు. అతీంద్రియ శక్తుల కథ అనే ఫీల్ ఇచ్చి, ఆఖరుకు తుస్సుమనిపించారు. వెరసి, మలయాళ సిన్మా కదా అని... నయనతారపై ఆశలు పెట్టుకొని ఈ ‘నిళల్’ చూస్తే, ఆశాభంగం తప్పదు. అటు నయనతార, ఇటు సినిమా – ఎవరూ మెప్పించరు. ఇంగ్లీష్ సబ్ టైటిల్సున్న ఈ సినిమా... లాక్డౌన్ టైమ్‌లో మరీ... ఖాళీగా ఉంటే చూడవచ్చు. లేదంటే, స్కిప్ చేసినా మీరేమీ మిస్ కారు. బలాలు: సస్పెన్స్ కథాంశం, నయనతార స్టార్ వ్యాల్యూ బలహీనతలు: స్లో నేరేషన్, నీరసింపజేసే క్లైమాక్స్, కథను మించి రీరికార్డింగ్ హంగామా, కథన, దర్శకత్వ లోపాలు కొసమెరుపు: స్టార్లు ఉన్నంత మాత్రాన... సినిమాలు బాగుండవు! – రెంటాల జయదేవ -
నటుడిగా మారిన రెహమాన్
సంగీతదర్శకుడిగా పలు మధురమైన పాటలను వినిపిస్తుంటారు ఏఆర్ రెహమాన్. ఆ పాటల్లో నటీనటులు అద్భుతంగా నటించారు. ఇప్పుడు రెహమాన్ నటుడిగా మారారు. మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న ‘ఆరట్టు’ అనే మలయాళ చిత్రంలో అతిథి పాత్ర చేశారు రెహమాన్. ఈ యాక్షన్ కామెడీ మూవీకి బి. ఉన్నికష్ణన్ డైరెక్టర్. ‘‘మ్యూజిక్ మ్యాస్ట్రో రెహమాన్ తో షూట్లో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అంటూ లొకేషన్ ఫోటోను షేర్ చేశారు మోహన్ లాల్. ఈ చిత్రం ద్వారా శ్రద్ధా శ్రీనాథ్ మలయాళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది నవంబరులో సినిమా విడుదల కానుంది. చదవండి: ఏదో పెద్ద శక్తి ఉంది.. దానిపై నాకు చాలా నమ్మకం View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) -
ఒక సినిమా నూటనలభై మంది స్టార్స్!
కోవిడ్ వల్ల ఇబ్బందిపడ్డ సినీ కార్మికులకు సహాయంగా ఓ మెగా మల్టీస్టారర్ చిత్రం చేయడానికి రెడీ అయింది మలయాళ చిత్రసీమ. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్ లాల్ ప్రకటించారు. ప్రముఖ మలయాళ దర్శకులు ప్రియదర్శన్, టీకే రాజీవ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో మోహన్ లాల్, మమ్ముట్టి ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. వీరిద్దరే కాకుండా మలయాళంలో టాప్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో కనిపించనున్నారు. సుమారు 140 మంది నటీనటులు ఈ చిత్రంలో భాగమవ్వనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మందికి పని కల్పించడంతో పాటు వచ్చే మొత్తాన్ని ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులకు సహాయం చేయడానికి వినియోగించనున్నారు. -
పండగ తర్వాత బిజీ
మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆరంభించడానికి డేట్ ఫిక్స్ చేశారని తెలిసింది. ఈ నెల 20న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు చిరంజీవి. 20 నుంచి ‘ఆచార్య, లూసీఫర్’ ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌తో చిరంజీవి బిజీ బిజీగా ఉంటారని ఊహించవచ్చు. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందే ‘లూసీఫర్’ రీమేక్ పొలిటికల్ డ్రామా. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. -
ప్రముఖ దర్శకుడు కన్నుమూత
తిరువనంతపురం: మలయాళ ప్రముఖ దర్శకుడు, స్ర్కీన్ ప్లే రచయిత సాజీ పాండవత్(63) కన్నుమూశారు. ఆయన ఆదివారం గుండె సంబంధిత వ్యాధి కారణంగా ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందినట్లు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్ తన ఫేస్బుక్లో వెల్లడించింది. గుండె శస్త్ర చికిత్స అనంతరం ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కుప్పకూలి పడిపోవడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ప్రయక్కర పప్పన్, గంగోత్రి, కవచం సహా పలు సినిమాలకు ఆయన స్క్రీన్ ప్లే రాశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘కక్కతురుతు’ విడుదలకు సిద్ధంగా ఉంది. సాజీ పాండవత్ మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. -
జోడీ లేదు
సినిమా అంటే హీరో, హీరోయిన్ పక్కా. అదో లెక్క. కానీ కథను బట్టి ఈ లెక్కల్ని మార్చొచ్చు. కథ అడిగినప్పుడు హీరో లేకుండా లేదా హీరోయిన్ లేకుండా సినిమాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా చిరంజీవి కూడా హీరోయిన్ లేకుండా సినిమా చేయబోతున్నారని తెలిసింది. మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ‘లూసీఫర్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ రీమేక్‌లో హీరోగా చేయనున్నారు చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మించనున్నారు. ఈ రీమేక్‌కు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ‘లూసీఫర్’ సినిమాలో మోహన్లాల్కి జోడీగా హీరోయిన్ పాత్ర ఉండదు. అయితే తెలుగు రీమేక్‌లో పలు మార్పులు చేశారని, హీరోయిన్ పాత్ర ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా హీరోయిన్ లేకుండానే ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఐఏఎస్ ఆఫీసర్‌గా..
‘జెర్సీ’ చిత్రంలో మిడిల్‌క్లాస్ హౌస్‌వైఫ్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శ్రద్ధా శ్రీనాథ్. తాజాగా మలయాళంలో ఓ సినిమా అంగీకరించారు. మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా ఐఏఎస్ ఆఫీసర్‌గా కీలక పాత్ర చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘పులిమురుగన్’ ఫేమ్ బి. ఉన్నికృష్ణన్ దర్శకుడు. శ్రద్ధాకు ఫోన్లో ఈ కథను చెప్పారట దర్శకుడు. మంచి కథ, నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో ఎక్కువ డేట్స్‌ను ఈ సినిమాకు కేటాయించారట శ్రద్ధా. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం విశాల్‌తో ‘చక్ర’, మాధవన్‌తో ‘మారా’ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలతో శ్రద్ధా శ్రీనాథ్ బిజీ బిజీగా ఉన్నారు. -
థ్రిల్ అవుతారు
నిత్యామీనన్ ఏదైనా ప్రాజెక్ట్‌లో భాగమైతే ఆటోమేటిక్‌గా ఆ సినిమా మీద ఆసక్తి పెరగడం ఖాయం. అందుకు కారణం ఆమె ఎంపిక చేసుకునే కథలు, చేసే పాత్రలు వినూత్నంగా ఉండటమే. తాజాగా మలయాళంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశారామె. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందు వీయస్ అనే నూతన దర్శకురాలు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది మొదట్లోనే ఈ సినిమా ప్రారంభం కావాల్సింది. కోవిడ్ వల్ల చిత్రీకరణ ప్రారంభం ఆలస్యం అయింది. తాజాగా కేరళలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. నిత్యామీనన్ మాట్లాడుతూ – ‘‘కథ వినగానే ఈ సినిమా నా టేస్ట్‌కి కరెక్ట్‌గా సరిపోయేది అనిపించింది. నాకు చాలా ఇష్టమైన స్టయిల్లో ఈ సినిమా కథ సాగుతుంది. మా పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఓ సాధారణ అమ్మాయి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలతో ఈ కథ ఉంటుంది. ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు’’ అన్నారు. ముందుగా ఇన్డోర్ సన్నివేశాలు చిత్రీకరించి, తర్వాత అవుట్ డోర్ సన్నివేశాలు తీస్తారని తెలిసింది. -
రేడియో మాధవ్
తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన తొలి మలయాళ చిత్రం ‘మార్కొని మతాయ్’. జయరామ్ మరో హీరోగా నటించిన ఈ సినిమాకి సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ చెన్న కేశవ బ్యానర్‌పై నిర్మాత కృష్ణస్వామి ఈ చిత్రాన్ని ‘రేడియో మాధవ్’ టైటిల్‌తో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి, ‘నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది’ అన్నారు. ‘ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు శ్రీ విష్ణుగారికి కృతజ్ఞతలు. గతంలో దుల్కర్ చేసిన ‘కలి’ చిత్రాన్ని ‘హే పిల్లగాడ’గా విడుదల చేశాం. ఇప్పుడు మంచి కథాంశంతో రూపొందిన ‘రేడియో మాధవ్’ని అందిస్తున్నాం. రేడియో స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే చిత్రమిది’ అన్నారు కృష్ణస్వామి. ‘థియేటర్స్ పరిస్థితిని బట్టి విడుదల తేదీపై ఓ నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు సహనిర్మాత చలం. చిత్ర నిర్వాహకుడు శ్రీనివాస మూర్తి, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడారు. -
హిందీలోకి అంజామ్ పాతిరా
ఈ ఏడాది మలయాళంలో విజయం సాధించిన చిత్రాలలో ‘అంజామ్ పాతిరా’ ఒకటి. కుంచక్కో బోబన్, షరాఫ్ ఉద్దీన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. మిధు మాన్యూల్ థామస్ దర్శకత్వం వహించారు. పోలీస్ ఆఫీసర్లను వరుసగా హత్య చేసే సీరియల్ కిల్లర్‌ను ఎలా ఎదుర్కొన్నారు? ఎలా ఆపారు? అనేది చిత్రకథ. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతోంది రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ. మలయాళ చిత్రాన్ని నిర్మించిన ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్‌తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది రిలయన్స్. ‘‘ప్రేక్షకుడిని ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే కథాంశం ఉన్న చిత్రమిది. ఇలాంటి సినిమాను దేశవ్యాప్తంగా ఆడియన్స్‌కు అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు రిలయన్స్ ప్రతినిధి సిభాషిస్ సర్కార్. ఈ రీమేక్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఎవరు నటిస్తారు? అనే వివరాలను ప్రకటించలేదు. -
వర్చువల్ వరం!
మనకు తెలియని సరికొత్త ప్రపంచంలోకి, ఎప్పుడూ చూడని ప్రదేశంలోకి తీసుకెళ్లి ప్రేక్షకులను నోరెళ్లబెట్టేలా చేయడం సినిమాకు కొత్త కాదు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా తీసే విధానం మారుతూ వస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఒక్క యాక్టరే ఇద్దరుగా కనబడితే సంబరపడిపోయాం. ఆ తర్వాత గ్రాఫిక్స్ మాయాజాలం చూశాం. 3డీ సినిమాలు వచ్చాయి. లైవ్ యాక్షన్ టెక్నాలజీతో సినిమాలు వచ్చాయి. మారుతున్న సాంకేతికత, ప్రేక్షకుడి అభిరుచి – సినిమాను కొత్త విధానాలు అనుసరించేలా చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’తో మన దేశంలో సినిమా రూపొందనుంది. కరోనా వల్ల ఏర్పడ్డ పరిస్థితుల్లో ఈ టెక్నిక్కే భవిష్యత్తు కాబోతోందా? వేచి చూడాలి. ఇండియాలో ఇదే తొలిసారి! మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రాన్ని పూర్తిగా ‘వర్చువల్ ప్రొడక్షన్’ పద్ధతిలో చిత్రీకరించనున్నట్టు ప్రకటించారు. ఈ పద్ధతిలో తెరకెక్కనున్న పూర్తి స్థాయి తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి కాన్సెప్ట్–డైరెక్షన్ గోకుల్ రాజ్ భాస్కర్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పృథ్వీరాజ్ నిర్మాణ సంస్థ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌తో పాటు మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. టైటిల్ ఇంకా ప్రకటించని ఈ చిత్రం 5 భాషల్లో (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) విడుదల కానుంది. ‘‘సినిమాలు తెరకెక్కించడంలో ఇదో కొత్త చాప్టర్. పరిస్థితులు మారుతున్నప్పుడు, కొత్త ఛాలెంజ్‌లు ఎదురవుతున్నప్పుడు మనం కూడా కొత్త పద్ధతులను అనుసరించాలి. ఈ కథ త్వరగా మీ అందరికీ చెప్పాలనుంది’’ అని పేర్కొన్నారు పృథ్వీరాజ్. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఏంటీ వర్చువల్ ప్రొడక్షన్? నిజమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించలేనప్పుడు గ్రీన్ మ్యాట్ (గ్రీన్ స్క్రీన్) ఉపయోగించి చిత్రీకరణ జరుపుతారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా అక్కడే (నిజమైన లొకేషన్లో) చిత్రీకరించినట్టు మారుస్తారు. ప్రస్తుతం సినిమాల్లో కొన్ని సన్నివేశాలను ఇలానే తీస్తున్నారు. దీనితో వచ్చిన చిక్కేంటి? అంటే పోస్ట్ ప్రొడక్షన్ అయ్యే వరకు ఆ సన్నివేశం ఎలా వస్తుందో ఎవ్వరికీ పక్కాగా తెలియదు. సరిగ్గా కుదరకపోతే ప్రేక్షకుడి పెదవి విరుపులు వినాల్సి వస్తుంది. వర్చువల్ ప్రొడక్షన్ విషయానికి వస్తే.. సినిమా మొత్తం స్టూడియోలోనే పూర్తి చేయొచ్చు. ఇది పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది పెద్ద ప్లస్ పాయింట్. లొకేషన్స్ కోసం అటూ ఇటూ తిరిగే పని పూర్తిగా తగ్గిపోతుంది. నటీనటులందరూ గ్రీన్ మ్యాట్ ముందే నటిస్తారు. 3డీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల నిజమైన లొకేషన్లో ఉన్నభావన కలుగుతుంది. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడే సీన్ ఎలా ఉండబోతోందో దర్శకుడు మానిటర్ లో చూసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్‌తో పెద్దగా పని ఉండదు. ఈ టెక్నాలజీ వల్ల వినూత్న కథలకు మరింత ఆస్కారముంటుంది. పండోరా గ్రహం టెక్నిక్ అదే ఆల్రెడీ హాలీవుడ్లో ‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’తో సినిమాలు తెరకెక్కుతున్నాయి కూడా. జేమ్స్ కామెరూన్ ఈ టెక్నాలజీని ఉపయోగించే ‘అవతార్’ని (2019) సృష్టించగలిగారు. ఈ సినిమాను మొత్తం వర్చువల్ ప్రొడక్షన్ ఉపయోగించే పూర్తి చేశారు. ఈ చిత్ర కథాంశం ‘పండోరా’ అనే గ్రహంలో జరుగుతుంది. అదంతా ఊహాజనిత ప్రదేశం. దానికి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్స్ కూడా ఈ టెక్నాలజీతో పాటు మరింత సాంకేతికతతో తెరకెక్కుతున్నాయి. ఇదే టెక్నాలజీతో ‘లయన్ కింగ్, రెడ్ ప్లేయర్ వన్’ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్స్ జరగడమే పూర్తిగా తగ్గిపోయింది. పరిస్థితులు ఎప్పుడు మామూలుగా మారుతాయో తెలియదు. మళ్లీ ఎప్పటిలా సినిమా చిత్రీకరణలు చేయగలమా? లేదా? అనే చిన్న సందేహం చాలామందిలో ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎదురయ్యే ఛాలెంజ్‌లను ఎదుర్కొని సినిమాలు తీయడానికి ఇలాంటి కొత్త పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. ఈ కొత్త పద్ధతులు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వలేకపోతే మాత్రం ప్రయత్నం వృథా అవుతుంది. అందుకే ప్రేక్షకుడిని మెప్పించేలా సినిమా ఉండాలి.. అలాగే నిర్మాతకు నాలుగు డబ్బులు మిగలాలి. అప్పుడే ‘వర్చువల్’లాంటి టెక్నాలజీలు వరం అవుతాయి. -
తండ్రికి అసిస్టెంట్‌గా తనయ
ఇటీవలే మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ మలయాళ ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు. ఫైట్స్, డ్యాన్స్‌లతో అందర్నీ మెప్పించారు. ఇప్పుడు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ కూడా సినిమాల్లోకి రాబోతున్నారని మలయాళ ఇండస్ట్రీ టాక్. అయితే విస్మయ పని చేయబోయేది ఆన్‌స్క్రీన్ కాదు... ఆఫ్‌స్క్రీన్. దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేయబోతున్నారు. ‘బారోజ్’ అనే చిత్రం ద్వారా మోహన్‌లాల్ తొలిసారి దర్శకుడిగా మారబోతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వంలో తండ్రికి చేదోడుగా ఉంటారట విస్మయ. ఫ్యాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్ర పోషించనున్నారు లాల్. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావొచ్చని సమాచారం. -
లూసిఫర్‌కి విలన్?
హీరో నుంచి విలన్ ట్రాక్‌లోకి వచ్చిన తర్వాత జగపతిబాబు కాల్షీట్ డైరీ ఫుల్‌గా ఉంటోంది. ‘లెజెండ్’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో విలన్‌గా జగపతిబాబు నటన అదుర్స్. తాజాగా ఆయన మరో సినిమాలో విలన్‌గా నటించబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. చిరంజీవి హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. మలయాళ హిట్ ‘లూసిఫర్’కు ఇది రీమేక్. ఇందులోని ఓ కీలక పాత్రకు జగపతిబాబును సంప్రదించారట చిత్రబృందం. అది విలన్ రోల్ అని తెలిసింది. ఇదే చిత్రంలో నటి ఖుష్బూ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
మరో రీమేక్
ఈ ఏడాది మార్చిలో విడుదలైన మలయాళ చిత్రం ‘కప్పెల’ మంచి విజయం సాధించింది. ముహమ్మద్ ముస్తఫా దర్శకత్వంలో అన్నా బెన్, శ్రీనాథ్ భసి, రోషన్ మాథ్యూ ముఖ్యతారాగణంగా రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను తెలుగులో రీమేక్ చేయనున్న సితార ఎంటర్టైన్మెంట్ అధినేతలు ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ ‘కప్పెల’ తెలుగు రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకోవడం విశేషం. ఓ ఇద్దరు ప్రముఖ హీరోలు నటించే ఈ చిత్రానికి ఒక యువదర్శకుడు దర్శకత్వం వహిస్తారని తెలిసింది. మరోవైపు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌లో రవితేజ, రానా హీరోలుగా నటించబోతున్నారని టాక్. మలయాళ హిట్ ‘ప్రేమమ్’ను కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో రీమేక్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
డైరెక్టర్ ఎవరు?
మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ మూవీ ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు రీమేక్ హక్కులను నటుడు–నిర్మాత రామ్‌చరణ్ దక్కించుకున్నారు. ఇందులో చిరంజీవి హీరోగా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా సుకుమార్, హరీష్ శంకర్ ఇలా కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా యువ దర్శకుడు సుజిత్ పేరు వినిపిస్తోంది. ‘లూసీఫర్’ తెలుగు స్క్రిప్ట్‌ను రెడీ చేయాల్సిందిగా సుజిత్‌కు చిరంజీవి చెప్పారట. ఇంతకు ముందు శర్వానంద్ ‘రన్ రాజా రన్’, ప్రభాస్ ‘సాహో’ చిత్రాలకు సుజిత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
తిరువనంతపురం: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంకే అర్జునన్(84) సోమవారం కన్నుమూశారు. అర్జునన్ మాస్టర్‌గా పిలవబడే ఆయన కొచ్చిలోని నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు. దాదాపు 700పైగా పాటలకు సంగీతాన్ని అందించిన అర్జునన్ మాస్టర్ మాలయాళ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నారు. 1968లో ‘కరుత పౌర్ణమి’ అనే మలయాళం సినిమాలోని పాటలకు మ్యూజిక్‌ను అందించి సంగీత దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక 2017లో ‘భయంకం’ చిత్రానికి గాను కేరళ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. ‘నీలా నిశిధిని’, ‘కస్తూరి మనక్కున్నేలో’, ‘పాడుతా వీన్యూమ్ పాడుమ్’వంటి ఎన్నో పాటలకు ఆయన సంగీతం అందించారు. -
నిత్యా @ 50
గతంలో హీరోహీరోయిన్లు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసి యాభై, వంద, నూటయాభై మైలురాళ్లు సులువుగా దాటేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 50వ సినిమా మైలురాయిని అందుకున్నారు నిత్యామీనన్. మలయాళంలో నిత్యామీనన్ చేయబోతున్న ‘ఆరామ్ తిరుకల్పన’ తన 50వ సినిమా. ఈ సినిమాలో నిత్యా పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని సమాచారం. సెప్టెంబర్ నెలాఖరున ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 1998లో ‘ది మంకీ హూ న్యూ టూ మచ్’ అనే ఇంగ్లీష్ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన నిత్యామీనన్ కథానాయికగా మారి, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. 2008లో హీరోయిన్గా మలయాళ సినిమా చేశారు. 2010లో ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగుకు పరిచయం అయ్యారు. ‘మిషన్ మంగళ్’తో ఈ ఏడాదే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. -
తొలి పరిచయం
తెలుగు, తమిళం, కన్నడం, హిందీ ఇండస్ట్రీల్లో సినిమాలు చేసి మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు తమన్నా. నార్త్ టు సౌత్ తమన్నా అందరికీ పరిచయం. కానీ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీకి తొలి పరిచయం కాబోతున్నారు. పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న తమన్నా తొలిసారి మలయాళంలో స్ట్రయిట్ మూవీ చేస్తున్నారు. గతంలో డబ్బింగ్ సినిమాల ద్వారా మలయాళంలో కనిపించారామె. ఇప్పుడు తొలి స్ట్రయిట్ సినిమాతోనే ప్రేక్షకులను భయపెడతానంటున్నారు. ‘సెంట్రల్ జైలిలే ప్రేతం’ (సెంట్రల్ జైల్లో దెయ్యం అని తెలుగు అర్థం) అనే హారర్ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు తమన్నా. కథ మొత్తం ఓ సెంట్రల్ జైల్, అందులో ఉండే దెయ్యాల చుట్టూ తిరుగుతుందట. ఇందులో మలయాళ, తమిళ స్టార్స్ యాక్ట్ చేయనున్నారు. సంధ్యా మీనన్ దర్శకురాలు.