![Malayalam Hit Movie Mura OTT Streaming Now](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/28/mura.jpg.webp?itok=5MgIgm2t)
మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన 'ముర' చిత్రం తెలుగు వర్షన్ ఓటీటీలో విడుదలైంది. రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'ముర' ఒక వర్గం ప్రేక్షకులను భారీగా మెప్పించింది. యాక్షన్ ఎపిసోడ్స్ మరోస్థాయిలో ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డరు. నవంబర్ 8న విడుదలైన ఈ మూవీ రీసెంట్‌గా 50రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.
ముహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో తెరకెక్కిన 'ముర' చిత్రంలో హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి,కన్నన్ నాయర్ వంటి వారు నటించారు. క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీ నుంచి మలయాళం వర్షన్‌లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం.. తెలుగు,తమిళ్,కన్నడ వంటి భాషలలో డిసెంబర్ 28న అమెజాన్ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది.
కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుంది. నలుగురు యువకులు ఉద్యోగం లేకపోవడంతో ఓ దోపిడీ కోసం ప్రయత్నిస్తారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో దర్శకుడు చాలా ఆసక్తిగా చూపించాడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి 'ముర' ఎంత మాత్రం నిరాశపరచదు.
Comments
Please login to add a commentAdd a comment