మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన 'ముర' చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువగా మలయాళ సినిమాలు చూస్తుండటంతో అవన్నీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 8న విడుదలైన 'ముర' భారీ విజయాన్ని అందుకుంది. 50రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
ముహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో తెరకెక్కిన 'ముర' చిత్రంలో హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి,కన్నన్ నాయర్ వంటి వారు నటించారు. క్రిస్టమస్ సందర్భంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'అమెజాన్ ప్రైమ్'లో విడుదల కానుంది. డిసెంబర్ 20వ తేదీ నుంచి మలయాళంతో పాటు తెలుగు,తమిళ్,కన్నడలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ డేట్‌కు ఈ చిత్రం ఓటీటీలో రాకుంటే డిసెంబర్ 25న తప్పకుండా విడుదల అవుతుంది.
కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుంది. నలుగురు యువకులు ఉద్యోగం లేకపోవడంతో ఓ దోపిడీ కోసం ప్రయత్నిస్తారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో దర్శకుడు చాలా ఆసక్తిగా చూపించాడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి 'ముర' ఎంత మాత్రం నిరాశపరచదు.
Comments
Please login to add a commentAdd a comment