ఓటీటీలో అదరగొట్టే సినిమా.. తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ | Twilight Of The Warriors Walled In Movie Streaming Date Confirmed, Check Streaming Platform Inside | Sakshi
Sakshi News home page

ఓటీటీలో అదరగొట్టే సినిమా.. తెలుగులో కూడా స్ట్రీమింగ్‌

Published Tue, Mar 18 2025 9:48 AM | Last Updated on Tue, Mar 18 2025 10:02 AM

Twilight of the Warriors Walled In Movie Streaming Date Locked

సోషల్‌మీడియాలో కొద్దిరోజుల క్రితం చైనాకు సంబంధించిన 'ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్: వాల్డ్ ఇన్' ఈ సినిమా బాగా వైరల్‌ అయింది. గత ఏడాదిలో విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం భారత్‌ మినహా అన్ని దేశాల్లో ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానున్నట్లు అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. మార్షల్ ఆర్ట్స్ సినిమాలతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు  సోయ్ చియాంగ్  ఈ మూవీని తెరకెక్కించారు.  మార్షల్ ఆర్ట్స్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ మూవీ ఎంతమాత్రం నిరాశపరచదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు.

'ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్: వాల్డ్ ఇన్' అమెజాన్‌ ప్రైమ్‌లో మార్చి 27న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్‌, హిందీలో కూడా స్ట్రీమింగ్‌ రానున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 1980ల నాటి హాంకాంగ్ నేపథ్యంలో సాగుతుంది. మాదకద్రవ్యాల సామ్రాజ్యంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న యువకుడు ఎలాంటి పోరాటం చేశాడనేది ఇందులో ఉంటుంది. రూ. 330 కోట్ల బడ్జెట్‌తో (ఇండియన్‌ కరెన్సీ) తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 960 కోట్లు రాబట్టింది.  హాంకాంగ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండవ దేశీయ చిత్రంగా 'ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్: వాల్డ్ ఇన్' నిలిచింది. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ఈ మూవీ సత్తా చాటింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement