వీకెండ్‌లో సినిమాల జాతర.. ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్! | This Weekend OTT Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

Weekend Ott Release Movies: ఓటీటీకి ఒక్కరోజే 11 చిత్రాలు.. ఆ సంచలన మూవీపైనే అందరి కళ్లు!

Published Wed, Feb 21 2024 9:21 PM | Last Updated on Thu, Feb 22 2024 9:00 AM

This Weekend Ott Release Movies List Goes Viral - Sakshi

మరో వీకెండ్‌ వచ్చేస్తోంది. ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు చిన్న సినిమాలు వచ్చేస్తున్నాయి. సుందరం మాస్టర్‌, ఆర్జీవీ వ్యూహం, మమ్ముట్టి భ్రమయుగం థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు ఓటీటీ ప్రియులను అలరించే చిత్రాలు సిద్ధమయ్యాయి. అయితే గత రెండు వారాల్లో సంక్రాంతి సినిమాలు ఓటీటీల్లో సందడి చేశాయి. 

ఇక ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోవడంతో ఆడియన్స్‌ ఓటీటీ వైపే చూస్తున్నారు. ఈ వీకెండ్‌లోనూ ఓటీటీ ప్రియులను అలరించేందుకు కొత్త చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఇందులో టాలీవుడ్ సినిమాలు లేనప్పటికీ.. డబ్బింగ్ మూవీస్ కాస్తా ఇంట్రెస్టింగ్‌ కలిగిస్తున్నాయి. వాటిలో పోచర్, మలైకోట్టై వాలిబన్, ది బరీడ్ ట్రూత్ లాంటి చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో దేశాన్ని కుదిపేసిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా వస్తోన్న ది బరీడ్ ట్రూత్‌పై అందరి కళ్లు ఉన్నాయి. వీటితో పాటు క్రైమ్ థ్రిల్లర్స్‌, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. మరి ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో మీరు కూడా చూసేయండి. 


ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్‌కు రానున్న చిత్రాలివే.. 

నెట్‌ఫ్లిక్స్‌

  •     అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22
  •     సౌత్‌ పా(ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 22
  •     త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23
  •     మీ కుల్పా(నెట్‌ఫ్లిక్స్ సినిమా)- ఫిబ్రవరి 23
  •     ఫార్ములా- 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్-6(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23
  •     ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23
  •     ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఏట్ వన్స్-  ఫిబ్రవరి 23
  •     మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్ -  ఫిబ్రవరి 24

    
అమెజాన్ ప్రైమ్
  

  •     ది వించెస్టర్స్‌- ఫిబ్రవరి 22 
  •     పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23
  •     అపార్ట్‌మెంట్‌ 404- (థ్రిల్లర్‌ సిరీస్)- ఫిబ్రవరి 23
  •     ది సెకండ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్‌ ది గెలాక్సీ(కార్టూన్ సిరీస్)- ఫిబ్రవరి 23

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  •    మలకోట్టై వాలిబన్‌- (మలయాళ సినిమా)- ఫిబ్రవరి 23

జియో సినిమా

  • సమ్మర్‌ హౌస్‌ సీజన్‌-8 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 23

లయన్స్‌ గేట్ ప్లే

  • సా ఎక్స్‌(అమెరికన్ హారర్‌ ఫిల్మ్)- ఫిబ్రవరి 23

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement